
సాక్షి, విజయవాడ : ఏపీ ఫైబర్ నెట్‌లో రచ్చ తారాస్థాయికి చేరింది. ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న జీవీ రెడ్డి సోమవారం తన పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవీరెడ్డి చంద్రబాబుకు లేఖ రాశారు. కానీ వ్యక్తిగత కారణలతో కాదని సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తిట్టడం వల్లే జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు సమాచారం.
ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్నా సరే వేమూరి హరికృష్ణ మాట వినాలని జీవీరెడ్డికి చంద్రబాబు, నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. వేమూరి హరికృష్ణ పెత్తనం సహించలేక, వేమూరి హరికృష్ణ మాట విననందుకు చంద్రబాబు, లోకేష్ తిట్టడంతో జీవీరెడ్డి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఫైబర్‌నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా అనంతరం ఫైబర్‌నెట్‌లో ఎండీ దినేష్ కుమార్‌పై ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఫైబర్ నెట్‌తో పాటు ఆర్‌టీజీఎస్, ఏపీ గ్యాస్ ఇన్ఫ్రా కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్ బాధ్యతల నుండి తప్పించింది. జీఏడిలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్త్వులు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment