dinesh
-
సీతాకోకచిలుక: పది రోజులు గడిచిపోయాయి! కాబోయే వియ్యంకులు..
అది నీలం రంగు సీతాకోకచిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలోని కొన్ని పశువృక్షకీటకపక్ష్యాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే! కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలి వర్ణద్రవ్యం (పిగ్మెంట్) సహజంగా ఉత్పత్తి అవదు. ఆయా ప్రాణుల ఈకలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండటం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి.మరి అంతటి అరుదైన రంగున్న ఆ సీతాకోకచిలుక అక్కడికెలా వచ్చిందోగానీ, సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతోంది. తన రెండవ కూతురు దుర్గ ఆ సీతాకోకచిలుక కావాలని ఆశగా అడిగిందని ఇంటి వెనుక పెరట్లో అటూ ఇటూ దాని వెనుకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనుక గుమ్మం దగ్గర నిలబడిన దుర్గ ఆత్రుతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరుగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తోంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటోడ్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోకచిలుకని పట్టుకుని తన చిన్న కూతురు చేతికిచ్చాడు.‘అది అడుగుడు సరే.. నువ్వు దానెనక వయసు యాదిమర్శి ఉరుకుడు సరే! సరిపోయిన్రు ఇద్దరూ’ అని తండ్రిని వారించింది లక్ష్మి. ‘పోనీతీ బిడ్డా, చిన్నపిల్ల.. ఆడుకోనీ’ అని అరుగు మీద కూర్చుని నిట్టూర్చాడు సుబ్బయ్య.‘గంతే తీ, అది ఇంజనీరింగ్ సదువుతున్న గూడ నీకు చిన్నపిల్ల లెక్కనే కనవడ్తది.’ ‘ఒసేయ్! ఏందే నీ లొల్లి. నాయిన నాకు సీతాకోకచిలుక పట్టిస్తే నీకేందే నొప్పి?’ ఎగతాళిగా వెక్కిరించింది దుర్గ.‘ఏందే.. ఎక్కువ మాట్లాడుతుండవ్?’ ‘పెండ్లి అయినాక నీ మొగుడు అమెరికాలో సీతాకోకచిలుకలు పట్టిస్తడులే.. ఏడ్వకు.’ సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మికి కోపమొచ్చింది. దుర్గ చేతి మీద ఫట్టుమని ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోకచిలుకను దుర్గ వదిలేసింది. అది కాస్తా సందు చూసుకుని తుర్రుమంది. దుర్గ కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది.దుర్గ ఏడుపు మొహం పెట్టి, ‘నాయినో! అది ఎగిరిపోయిందే’ అని అరిచింది. ‘దాన్ని పట్టుడు ఇంగ నాతోని కాదు బిడ్డా.. ఇడిశెయ్. మళ్ళా కనిపిస్తే పట్టిస్తా’ అని తన జేబులో సిగరెట్ బయటకి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరికొచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వుమని అరిచి తల్లిని పట్టుకుంది. ‘ఏం పుట్టిందే నీకు? దాన్ని అట్లా గిల్లుతవెందే?’ కసిరింది సుజాత.‘నా సీతాకోకచిలుకని ఎల్లగొట్టిందే అది’ అని స్టౌ పక్కనే ఉన్న అరుగు మీద కూర్చుంది. ‘దానికంటే బుద్ధిలేకపాయె తింగరిది. నీకేమొచ్చిందే లక్ష్మీ?’‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం గా సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’ బయట పెరట్లో అరుగు మీదే కూర్చుని సిగరెట్ తాగుతూ వంట గదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య.‘పైసలున్నోళ్ళకే చెల్లుతయె గీ స్వేచ్ఛలు. అయినా గంత మాటంటివేందే.. నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినమే ఈ ఇంట్ల?’ చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత. ‘నాకీ పెండ్లొద్దే హైదరాబాద్ పోయి మాస్టర్స్ సదువుతానంటే నా మాట యింటున్నరా?’‘మన పరిస్థితి తెలిశిగూడ నువ్వు గట్ల మాట్లాడ్తవేందే? అయినా మేం చూసినదేమన్న మామూలు సంబంధమానే? అమెరికా పొరడ్ని చూసినం. ఇంకేం కావాల్నే నీకు?’ ‘నాకేం అమెరికా పోవాలని ఆశల్లేవ్ తీ. నాకీడనే ఉండాలనుంది.’‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారిన్ మ్యాచ్ అంటే ముక్కు, మొహం సూడకుండ పెండ్లి చేసుకుని మొగుడెంట పోతున్నరు. నువ్వేందక్కా గిట్లున్నవ్? ఇదే చా¯Œ ్స నాకొచ్చింటేనా అస్సలు ఆలోచించక పోతుండే.’‘అయితే నువ్వే చేస్కో పో!’ మొహం తిప్పుకుంది లక్ష్మి. ‘హా! బరాబర్ చేస్కుంటా. అమ్మా, నాకు ఓకేనే ఈ పెండ్లి. నాకు చేయుర్రి.’ ‘ఏయ్! నువ్వా సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంప్కరాపో.. నడువ్’ అని దుర్గను కసిరి బయటకి పంపించింది. అలిగి వంటగది తలుపుని ఆనుకుని నిలబడిన కూతురు దగ్గరికొచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకుని తల పైకి లేపి కూతురి కళ్ళలోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి. ‘నీ మనసు నాకు తెల్సు బిడ్డ. కానీ, నీకు పెండ్లి జేశి పంపుడు అమ్మ, అయ్యలుగ మా బాధ్యత.’‘ఎవడు కనిపెట్టిండే ఈ బాధ్యతలు? నేనడిగిన్నా ఇప్పుడు నాకు పెండ్లి చేయమని?’ ‘నువ్వే గదనే రెణ్ణెళ్ళ కిందట సంబంధాలు సూద్దుమా అంటే గొర్రెలెక్క తల ఊపితివి?’‘ఏమో అప్పుడు నాయన నోరు తెరిశి అడిగిండని తలూపిన. నాకేం దెల్సు మీరు అమెరికా సంబంధం సూస్తరని? ఇప్పుడు మీయందరిని ఇడిశిపెట్టి ముక్కు మొహం తెల్వనోనితోని గంత దూరం పోవాల్నా? నాకేమొద్దు.’‘ఆళ్లే ముచ్చటవడి నిన్ను సూడనికొస్తాన్నప్పుడు మనమొద్దంటే మంచిగుంటదా? మధ్యవర్తి ముంగట నాయినకి మర్యాద దక్కుతదానే?’బుస్సుమని అన్నం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టౌ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి, గరిటతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. సుజాత గరిట తిప్పుతూనే, ‘మీ నాయిన ఉన్న మూడెకరాలు సాగు చేసుకుంటనే ఇన్నేండ్లు మీకు నచ్చిన సదువులు సదివించిండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే వెడుతున్నడు. చానా కష్టపడి నీ పెండ్లి కోసం పదిలక్షలు కూడబెట్టిండు. ఇంకింతకన్నా కష్టవెట్టకే నాయనని. మా బుజ్జి కదా, నా మాటిను’ నచ్చజెప్పింది. తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చింది సుజాత.మరుసటిరోజు కాబోయే వియ్యాలవారి రాకతో సుబ్బయ్య ఇల్లు కళకళలాడింది. రాత్రి లక్ష్మి చేతికి దుర్గ పెట్టిన గోరింటాకు పొద్దుటికల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి, ఫొటోలో కన్నా అబ్బాయి చాలా బాగున్నాడని లక్ష్మి చెవిలో గుసగుసలాడింది దుర్గ. పెళ్ళిచూపుల్లో అమ్మాయి, అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని, అబ్బాయిని ఇంటి వెనుక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చున్న పెళ్ళి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు.కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకొచ్చి కూర్చుని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా బాగుంది. ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ, అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు గనుక యాభై లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పనయ్యింది. పెళ్ళి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని, త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకొమ్మని నచ్చజెప్పారు. కానీ, ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బులేదు. వచ్చే నెలలోపల పెళ్ళి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఈ సంబంధం చేయి దాటి పోతుంది.ఆ రోజు సాయంత్రం ఇంటి వెనుక పెరట్లో అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఒక పెట్టె సిగరెట్లు గుప్పుమని ఊదిపడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తనని దేశంకాని దేశానికి పంపించే పెళ్ళి తనకొద్దంటే వద్దని మొండికేసి నానా హంగామా చేసి, అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపును ఆనుకుని కూర్చుని మొబైల్ చూస్తోంది దుర్గ. వంట గదిలో అందరి కోసం టీ కాస్తోంది సుజాత. అంతా నిశ్శబ్దం.ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ పెరట్లోకొచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటబడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుర్లకి టీ ఇచ్చి, అటు నుండి పెరట్లోకి రెండు టీ గ్లాసులు పట్టుకుని వెళ్లింది. భార్య రాకను చూసి, సుబ్బయ్య సిగరెట్ కిందపడేసి కాలితో నలిపి ఒక టీ గ్లాసు అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరూ మౌనంగా టీ తాగసాగారు.కాసేపటికి సుజాత నోరు తెరిచి, ‘పొలం అమ్ముదమా?’ అన్నది నెమ్మదిగా. ఆ మాటకు సుబ్బయ్య కంగుతిని భార్య వంక చూస్తూ ‘ఏం పుట్టిందే నీకు? గంత మాటంటివి?’ కరిచినంత పని చేశాడు.‘మరేం చేస్తమయ్యా? గన్ని పైసలేడికెల్లి దెస్తం?’ ‘అయితే? ఇన్నేండ్లు అన్నంబెట్టిన పొలాన్ని అమ్ముకొమ్మంటవా?’ కోపంగా చూస్తూ అన్నాడు.‘మంచి సంబంధం.. కూతురు సుఖవడ్తది గదా అని..’ ‘ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే? ఇంకా చిన్నదాని సదువైపోలే.. దానికేం బెడతవ్? దిమాగ్ పనిచేస్తున్నదా నీకు?’‘వాయబ్బో! నువ్వు పెద్ద దిమాగ్ వెట్టి పనులు జేస్తున్నవ్ లే. ఈ ఏడు వరి పంట ఎయ్యిరా మొగుడా అంటే, పోయిపోయి ఆ టమాటా పంటేస్తివి. దానికేవేవో కొనుక్కొచ్చి పొలాన్ని ముస్తాబు జేస్తివి. ఎంత దిగువడొస్తదో చూస్త గదా..!’ ‘నోర్ముయసో! అన్నీ తెలుసుకునే పంటేశిన. పోయినేడు వరి పంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేశిన అప్పులకే పాయే..’‘ఓహో! గిప్పుడు టమాటాకు లచ్చలు రాల్తయ్ మరి’ వెటకారంగా అంది సుజాత. ‘యెహే! నా దిమాగ్ తినకు. నా కూతురికెట్ల పెండ్లి జేయాల్నో నాకు తెల్వదా?’ అని కసిరి, టీ గ్లాసు అరుగు మీద పెట్టి.. లేచెళ్ళిపోయాడు సుబ్బయ్య.పది రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు, మధ్యవర్తులు రెండు రోజులకోసారైనా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చేయాలో తోచడంలేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి. కానీ, అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయలేడు. చేయడు కూడా. ఉన్నది మూడెకరాలే అయినా పొలమంటే అతనికి పిచ్చి ప్రేమ. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకి మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఏమైనా చేస్తాడు.గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని, ఈ ఏడు ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి, అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించి వచ్చాడు. తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో టమాటాలు సరిగా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు.భార్యకి చెప్పకుండా కూతురి పెళ్ళికోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి తన మూడెకరాలలో పంటకి ఎండ తగలకుండా నెట్, వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటాలు కోతలకు సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో పది రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్ళి చేద్దాం అనుకున్నాడు. ఆ ధైర్యం, నమ్మకంతోనే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడా పంట అమ్మినా వాళ్ళడిగిన కట్నం ఇచ్చుకోలేడు గనుక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు.మరుసటిరోజు పొలంలో పంట కోతలు జరుగుతుండగా మధ్యవర్తి నుండి ఫోనొచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్ళేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటునట్టు చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం. అలా రెండు మార్లు సిగరెట్ పొగని పీల్చి వదలగా ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ తన కంటపడింది. దాన్ని చూడగానే తన ఇద్దరు కూతుర్లు గుర్తొచ్చారు.సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. భుజం పైన ఉన్న తువాలు తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలుకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తుండగా చిన్నపిల్లాడిలా దాని వెనుక పరుగెత్తాడు. ఒక పదిహేను నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలా దాని వెనుకపడి చివరికి ఎలాగోలా పట్టుకోగలిగాడు. రొప్పుతూ ఒక గట్టు మీద కూలబడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోకచిలుకని తన మొహానికి దగ్గరిగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ళనుండి విడిపించుకోవడానికి ఉక్కిరిబిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ కొట్టుమిట్టాడుతోంది. దాని అవస్థ చూడగానే పెళ్ళిచూపుల ముందు రోజు తాను పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి.. తల్లితో అన్న మాట గుర్తుకొచ్చింది.‘మనకెట్లా స్వేచ్ఛ లేకపాయె, ఇంగ పాపం ఆ సీతాకోకచిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు?’యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోకచిలుకను వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తరువాత సుబ్బయ్య మొహంలో ఒక నవ్వు విరిసింది. రోజుల తరువాత హాయిగా నవ్వినట్టు అనిపించింది అతనికి.తన పొలంలో పండిన టమాటాలను లారీలలో ఎక్కించాక మరుసటిరోజు తెల్లవారుజామునే హైదరాబాద్ బయలుదేరాడు. ఆలస్యమైన రుతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలియదు. మార్కెట్లో అడుగుపెట్టిన ఒక్క రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్నదాని కన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. తన భార్య వెటకారంగా అన్నా ఆరోజు నిజంగానే టమాటాలకు లక్షలు రాలాయి. మొత్తంగా తన మూడెకరాల పంటకి డెబ్బై లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి.మరుసటిరోజు ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఊరు ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యను మెచ్చుకుని అభినందించారు. కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్ళి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ, ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుర్లిద్దరూ అక్కడే కూర్చున్నారు.సుబ్బయ్య టీ తాగుతుంటే సుజాత గొంతు సరిచేసుకుని, ‘ఇప్పుడు మనకాడ పైసలున్నయి. గా అమెరికా సంబంధం కలుపుకుందామయ్యా?’ అన్నది నెమ్మదిగా. సుబ్బయ్య తిరిగి భార్య వంక గుర్రుమని చూశాడు. దుర్గ తన అక్క భుజం తట్టి నవ్వింది. లక్ష్మి నిట్టూర్చి తలని చేత్తో బాదుకుంది. ‘అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగ ఉంటది గదాని..’సుబ్బయ్య వెటకారంగా నవ్వి, ‘మనుషులకు విలువనియ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురెట్ల సుఖంగ ఉంటదే? ఆడేం మంచిగా సూసుకుంటడు నా బిడ్డని?’ అన్నాడు. ‘అయితే పెండ్లి చెయ్యకుండ గిట్లనే ఉంచుతవా ఏందీ?’‘ఎహేపో! నా కూతుర్లు సీతాకోకచిలుకల్లాంటోల్లే. రెక్కలొచ్చినాక గూడ ఎన్ని దినాలని చేతుల ఒడిశి పట్టుకుంటం? ఇడిశిపెట్టాల్నే. అవట్లా స్వేచ్ఛగ ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు గూడ గంతే. ఈ పైసలతో ఆళ్ళకి ఇష్టమొచ్చిన సదువులు సదువుకోనీ, నచ్చిన పనులు చేస్కోనీ. వాళ్ళకి నచ్చినప్పుడే పెండ్లి చేస్త. గంతే!’ – దినేష్ఈ మాట విన్న వెంటనే కూతుర్లు ఇద్దరూ చేతుల్లోని టీ గ్లాసులు పక్కన పెట్టి, ఠక్కున లేచొచ్చి సుబ్బయ్య చెరో పక్కన కూర్చుని, గట్టిగా తండ్రిని వాటేసుకుని ఇరు భుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది. ‘గీ మాటింటే ఊరోల్లందరు మనమీద ఉమ్మేస్తరు. నువ్వేం తండ్రివని దెప్పిపొడుస్తరు. అవసరమా?’ అని తిట్టిందిసుబ్బయ్య గట్టిగా నవ్వి, ‘గీ ఊర్ల సుబ్బయ్యను అనేంత దమ్ములు ఎవనికున్నయే? ఎవడంటడో అననీ.. సూస్కుందం. నా బిడ్డలు నా ఇష్టమే’ అని తన మీసం మేలేశాడు. ‘మా మంచి నాయిన’ అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. ‘సరిపోయిన్రు తీ తండ్రీబిడ్డలు’ మూతి ముడిచింది సుజాత.తండ్రీ, కూతుర్లు గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో అలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోకచిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురి చుట్టూ గిరగిరా తిరిగి మెల్లిగా దుర్గ చేతి మీద వాలింది. – దినేష్ -
Mathura: రూ. ఒక కోటి 9 లక్షలతో పూజారి పరార్
ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆలయంలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి గోవర్ధన్‌లో గల ముకుట్ ముఖారవింద్ ఆలయంలో భారీ చోరీ జరిగింది. పూజారే స్వయంగా ఈ దొంగతనానికి పాల్పడటం ఈ ప్రాంతంలో సంచలనంగా మారింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ముకుట్ ముఖారవింద్ ఆలయ పూజారి దినేష్ చంద్ రూ. ఒక కోటి 9 లక్షల రూపాయలతో పరారయ్యాడు. దినేష్ చంద్ ఈ సొమ్మును బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆ తరువాత ఆలయానికి తిరిగి రాలేదు. పూజారి ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఈ ఉదంతంపై ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న గోవర్ధన్ పోలీసులు నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.ఈ ఘటన గురించి ఆలయ మేనేజర్ చంద్ర వినోద్ కౌశిక్ మాట్లాడుతూ ఆలయ పూజారి దినేష్ చంద్ ఆలయానికి సంబంధించిన సొమ్ములో సుమారు రూ. ఒక కోటి 9 లక్షలను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసేందుకు వెళ్లినట్లు తెలిపారు. కాగా ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు దస్వీసా నివాసి అయిన నిందితుడు, పూజారి దినేష్ చంద్ ఇంటిలో నుంచి పోలీసులు రూ. 71 లక్షల 92 వేలు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. ఆ పూజారి భార్య స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి, ఆలయానికి సంబంధించిన సొమ్మును అప్పగించింది. పరారీలో ఉన్న నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అదృష్టం ఎవరిని వరిస్తోంది.. ఎస్బీఐ ఛైర్మన్ పదవి కోసం పోటీ
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తదుపరి ఛైర్మన్ ఎవరు అనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది. ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖరా ఈ ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అదే రోజు కొత్త ఎస్బీఐ చైర్మన్ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.పలు నివేదికల ప్రకారం.. ఎస్బీఐ ఛైర్మన్ పదవికి పేరును సిఫారసు చేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వంలోని స్వయం ప్రతిపత్త సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో (FSIB) మే 21న పాత్ర కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. అదే రోజు తుది నిర్ణయం ప్రకటిస్తారు.దినేష్ ఖరా రిటైర్మెంట్ తర్వాత ఆయన భర్తీ చేసేందుకు ముగ్గురు ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్లు సీఎస్ శెట్టీ, అశ్విని కుమార్ తివారీ, వినయ్ ఎం టోన్సే పోటీపడుతున్నట్లు సమాచారం. మరి ఈ ముగ్గురిలో ఎవరికి ఎస్బీఐ ఛైర్మన్ పదవి వరిస్తుంది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
రాయ్‌బరేలీలో రాహుల్‌కు దినేష్ పోటీనివ్వగలరా?
ఎట్టకేలకు రాయ్‌బరేలీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలిపోయింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై పోటీకి దిగారు. మరి దినేష్.. రాహుల్‌కు తగిన పోటీని ఇవ్వగలరా? బీజేపీ అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి?ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీని గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణిస్తుంటారు. ఈసారి ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరించారు. దీంతో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీకి దిగారు. ఇదే స్థానం నుంచి బీజేపీ తన అభ్యర్థిగా దినేష్ ప్రతాప్ సింగ్‌ను బరిలో నిలిపింది.2018లో దినేష్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ మరుసటి ఏడాది ఆయనకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీపై దినేష్ ప్రతాప్ సింగ్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ 1,67,178 ఓట్లతో విజయం సాధించారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ దినేష్ ప్రతాప్ సింగ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. రాయ్‌బరేలీ రాజకీయాలలో పంచవటి వర్గం ఆధిపత్యం చెలాయిస్తుంది. దినేష్ పంచవటి వర్గానికి చెందినవారు. ఆయన గుణవర్ కమంగల్పూర్ గ్రామ నివాసి.రాయ్‌బరేలీ రాజకీయాలలో దినేష్ కుటుంబానికి ఆదరణ ఉంది. ఒకప్పుడు ఆయన సోనియా గాంధీకి అత్యంత సన్నిహితునిగా పేరొందారు. 2010లో తొలిసారిగా, 2016లో రెండోసారి కాంగ్రెస్ నుంచి దినేష్ ప్రతాప్ సింగ్ ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరారు. మరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత దినేష్ కాంగ్రెస్‌కు ఎంతవరకూ పోటీనివ్వగలరో వేచిచూడాలి. -
నావికా దళాధిపతిగా దినేశ్ త్రిపాఠీ
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. -
సుప్రీంకోర్టులో సింగిల్ మాల్ట్ ఎపిసోడ్
న్యూఢిల్లీ: సంక్లిష్టమైన కేసులపై సీరియస్‌గా విచారణ జరిగే సుప్రీంకోర్టులో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విస్కీ, దాని రకాలు తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, సీనియర్ న్యాయవాది దినేశ్ ద్వివేది మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణ నవ్వులు పూయించింది. సీజేఐ హాస్య చతురత అందరినీ అలరించింది. పారిశ్రామిక ఆల్కహాల్ ఉత్పత్తి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు సంబంధించిన వివాదంపై సీజేఐ నేతృత్వంలోని 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన విచారణ ఇందుకు వేదికైంది. ఈ కేసులో యూపీ తరఫున వాదిస్తున్న ద్వివేది తెల్ల జుట్టు రంగులమయంగా కని్పంచడంపై జస్టిస్ చంద్రచూడ్ సరదాగా ఆరా తీశారు. హోలీ సంబరాలు కాస్త శ్రుతి మించడమే కారణమంటూ ద్వివేది కూడా అంతే సరదాగా బదులిచ్చారు. ‘‘ఈ విషయంలో దయచేసి నన్ను క్షమించాలి. నా మనవల నిర్వాకం కూడా ఇందుకు కొంతవరకు కారణమే. సంతానం, మనవలు మరీ ఎక్కువగా ఉంటే, అందులోనూ వారంతా మనతో పాటే ఉంటుంటే ఇలాంటి గమ్మత్తైన సమస్యలుంటాయి. తప్పించుకోలేం’’ అన్నారు. సీజేఐ అంతటితో వదల్లేదు. ‘అంతేగానీ, ఆల్కహాల్‌కు ఏ సంబంధమూ లేదంటారు!’ అంటూ చెణుకులు విసిరారు. విస్కీప్రియుడైన ద్వివేది అందుకు చిరునవ్వులు చిందించారు. ‘‘విస్కీ పాత్ర కూడా ఉందని నేను ఒప్పుకుని తీరాలి. హోలీ అంటేనే ఆల్కహాల్ పారీ్టలు. పైగా నేను విస్కీకి వీరాభిమానిని’’ అనడంతో అంతా గొల్లుమన్నారు. సింగిల్ మాల్ట్ విస్కీ విషయంలో ఇంగ్లండ్‌లో తనకెదురైన గమ్మత్తైన అనుభవాన్ని విచారణ సందర్భంగా ద్వివేది ఏకరువు పెట్టారు. ‘‘నేను సింగిల్ మాల్ట్ విస్కీనే ఇష్టపడతా. ఆ విస్కీకి స్వర్గధామంగా చెప్పదగ్గ ఎడింబర్గ్ వెళ్లానోసారి. సింగిల్ మాల్ట్ తెప్పించుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకోబోతుంటే వెయిటర్ అడ్డుకున్నాడు. ‘ఇదేం పని! అది సింగిల్ మాల్ట్ విస్కీ. దాన్నలాగే నేరుగా ఆస్వాదించాలి. అంతేతప్ప ఇలా ఐస్క్యూబులూ సోడాలూ కలపొద్దు! పైగా దానికంటూ ప్రత్యేకమైన గ్లాస్ ఉంటుంది. అందులో మాత్రమే తాగాలి’ అంటూ సుదీర్ఘంగా క్లాస్ తీసుకున్నాడు. సింగిల్ మాల్ట్ తాగేందుకు ఇంత తతంగం ఉంటుందని అప్పుడే నాకు తెలిసొచి్చంది’’ అంటూ వాపోయారు. దాంతో న్యాయమూర్తులతో పాటు కోర్టు హాల్లో ఉన్నవాళ్లంతా పడీపడీ నవ్వారు. ధర్మాసనంలోని మిగతా న్యాయమూర్తులు కూడా తమ చెణుకులతో ఈ సరదా సన్నివేశాన్ని మరింత రక్తి కట్టించారు. పారిశ్రామిక ఆల్కహాల్‌తో పాటు విస్కీ, వోడ్కా వంటివి కూడా రాష్ట్రాల నియంత్రణ పరిధిలోకే వస్తాయంటూ ద్వివేది వాదించడంతో ఒక న్యాయమూర్తి కలి్పంచుకున్నారు. ‘‘ఇంతకీ మీరనేదేమిటి? ఆల్కహాల్ మందుబాబులకు కిక్కిచి్చనా, ఇవ్వకపోయినా రాష్ట్రాల ఖజానాకు మాత్రం కిక్కివ్వాల్సిందేనంటారా?’’ అనడంతో నవ్వులు విరిశాయి. ఇంకో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ, ‘‘కొన్ని రకాల మద్యం రుచి కాలం గడిచేకొద్దీ పెరుగుతుందని, కొన్ని తేలిక రంగులోనూ మరికొన్ని ముదురు రంగులోనూ ఉంటాయని... ఇలా ఆల్కహాల్‌కు సంబంధించిన చాలా అంశాలను మీరు ఎంతో చక్కగా వివరించారు. సాక్ష్యంగా ఆయా రకాల మద్యం బాటిళ్లను ప్రవేశపెడితే ఎలా ఉంటుందంటారు!’’ అనడంతో కోర్టు హాలంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
సన్నీ సీటును ఆక్రమించిన దినేష్ ఎవరు?
2024 లోక్‌సభ ఎన్నికల ప్రకియ ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా బీజేపీ తన ఎనిమిదవ జాబితాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానానికి సన్నీ డియోల్ స్థానంలో దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. అప్పటి నుంచి దినేష్ సింగ్ బబ్బు పేరు వార్తల్లో నిలుస్తోంది. బీజేపీ నేత దినేష్ సింగ్ బబ్బు(62) పంజాబ్‌లోని సుజన్పూర్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2012లో పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కూడా పనిచేశారు. 2007, 2012, 2017లో వరుసగా మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే 2022లో సుజన్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ పూరి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీ ఆయనకు గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానాన్ని అప్పగించింది. దినేష్ సింగ్ బబ్బు అండర్ గ్రాడ్యుయేట్. పఠాన్‌కోట్‌లోని భంగోల్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆయన తన రాజకీయ జీవితాన్ని భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా ప్రారంభించారు. కాగా గురుదాస్‌పూర్ చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జాకర్‌పై బీజేపీ అభ్యర్థి సన్నీడియోల్ 82,459 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే సన్నీ డియోల్ రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేరనే ఆరోపణలు వినిపించాయి. ఈసారి కూడా విజయాన్ని నిలబెట్టుకోవాలని భావించిన బీజేపీ దినేష్ సింగ్ బబ్బుకు టిక్కెట్ ఇచ్చింది. -
ఐర్లాండ్: వాసవి మాత అగ్నిప్రవేశ దినోత్సవ వేడుకలు..
శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ వారి ఆధ్వర్యంలో త్రిశక్తి స్వరూపిణి, సకల వేద స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అగ్నిప్రవేశ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాఘశుద్ధ విదియ రోజు వందమందికి పైగా వాసవి మాత భక్తులు, కమిటీ సభ్యులందరు కలిసి ఉదయాన్నే అనుకున్నట్టుగా కింగ్స్‌వుడ్ ప్రాంతమునందున్న స్థానిక వినాయగర్ ఆలయానికి చేరుకొని అక్కడ మొదటగా అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. మొదటగా పిల్లలు తరువాత మహిళలంతా కలిసి చక్కగా అమ్మవారికి భక్తిశ్రద్దలతో అభిషేక కార్యక్రమాన్ని పూర్తిచేశారు. తరువాత అమ్మవారికి వివిధరకాల పుష్పాలతో అలంకరించిన పిమ్మట లలిత సహస్రనామ పఠనము, మణిదీపవర్ణన, సామూహిక కుంకుమార్చన నిర్వహించగా.. విశాలి రమేష్, శృతి, అనూష చేసిన అమ్మవారి గీతాలాపనలో భక్తులందరూ తన్మయత్వం చెందారు. అటుపిమ్మట అమ్మవారికి మహిళలందరూ వడిబియ్యం సమర్పించి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన అంకిత ఈ కార్యక్రమం మొత్తాన్ని చక్కగా సమన్వయము చేసారు. చిరంజీవి-లక్ష్మి హాసిని వాసవి పురాణం నుండి సేకరించిన ధర్మసూత్రాలను ఆంగ్లంలోకి అనువదించిన వాసవి దివ్యకథను భక్తులందరికీ చదివి వినిపించారు. అమ్మవారి నామస్మరణతో భక్తులందరూ పులకించిపోయారు. సంప్రదాయ వస్త్రధారణలో పిల్లలు పెద్దలు ఆనందంగా వారి ఒకరోజు సమయాన్ని ఇలా అమ్మవారి సేవలో గడపటం చాలాా ఆనందంగా ఉందని కోర్-కమిటీ సభ్యుల్లో ఒకరైన అనీల్ అన్నారు. కార్యక్రమానికి విశిష్ట అతిధిగా విచ్చేసిన ఆలయ సెక్రటరీ, డైరెక్టర్ బాలకృష్ణన్ దంపతులకు కార్యవర్గ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ముత్తుస్వామిని ఘనంగా సత్కరించారు. బాలకృష్ణన్ మాట్లాడుతూ అమ్మవారి కార్యక్రమాలు వినయాగర్ ఆలయం నందు నిర్వహించడం అందులో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొనడం చాలా ఆనందమైన విషయమని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలనీ అభిలాషించారు. సరసమైన ధరలకే భోజన ప్రసాదాలు అందించిన బిర్యానీవాలా రెస్టారెంట్ అధినేత శ్రీనివాస్‌కి, దీనికి సహకరించిన ప్రశాంత్‌కి కమిటీ కార్యవర్గ సభ్యులు శివ కుమార్, నవీన్ సంతోష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. హాజరైన సభ్యులందరు ముక్తకంఠంతో ఐర్లాండ్ నందు ఇలాంటి కార్యక్రమాలు జరగడం ఎంతో శుభపరిణామమని ఆనందించారు. కార్యక్రమానికి ముఖ్య ఉభయదారులుగా దాతలు రేణుక దినేష్, రజిత సంతోష్, నితేశ్ గుప్తాలకు కమిటీ సభ్యులు సత్కరించి కృతఙ్ఞతలు తెలియజేసారు. అమ్మవారి అలంకరణ, పుష్పాలంకరణ సేవకు కృషిచేసిన సభ్యుల్లో మాధవి, దివ్య మంజుల, శృతి, మాధురి, రేణుక, అంకిత, మణి, లావణ్య తదితరులకు కమిటీ సభ్యులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు. తదుపరి కార్యక్రమంలో అధ్యక్షులు నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. అమ్మవారి జీవిత విశేషాలను ప్రస్తుత సమాజం ఎలా స్వీకరించాలో ఉదాహారణలతో వివరించి సభ్యులందరికి అమ్మవారు చెప్పిన ధర్మ సంబంధమైన విషయాలను లోతుగా వివరించి చెప్పారు, హాజరైన సభ్యులకు భక్తులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేసారు. చివరిగా.. అందరూ భోజన ప్రసాదాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమం మొత్తం ముందుకు సాగడంలో కీలకంగా కోర్-కమిటీ సభ్యులతో పాటుగా సేవాదళ్ సభ్యుల్లో ముఖ్యంగా గంగా ప్రసాద్, లావణ్య, సంతోష్ పారేపల్లి, శ్రీనివాస్, సతీష్, మాణిక్, శ్రవణ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ముగించారు. -
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి..
నిజామాబాద్: ప్రజాసేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు. పార్టీ రూరల్ నియోజకవర్గ కార్యాలయంలో బుధశారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అట్టడుగు, బలహీన వర్గాలకు రాజకీయ ఫలాలు అందాలంటే కేవలం బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. రెండు, మూడు మండలాలకు పరిమితమైన తనకు రూరల్ టికెట్ ఇచ్చి బీజేపీ ప్రోత్సహించిందని, ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యకర్తల కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్‌లో బీజేపీకి 50వేల ఓట్లు వచ్చాయన్నారు. తనకు ఎప్పటికీ రాజకీయ గురువు మండవ వెంకటేశ్వర్రావు అన్నారు. నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు జిల్లాలో శక్తి మేరకు కృషి చేస్తానని తెలిపారు. బాధ్యతల స్వీకరణ.. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు దినేశ్ కులాచారి తెలిపారు. కార్యక్రమానికి ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా పదాధికారులు, జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ అభ్యర్థులు, జిల్లా ఇన్చార్జులు, ప్రభారీలు హాజరవుతారని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధానకార్యదర్శి పోతన్కర్ లక్ష్మీనారాయణ, పార్లమెంట్ కన్వీనర్ గద్దె భూమన్న, నాయకులు తిరుపతిరెడ్డి, నక్క రాజేశ్వర్, రాజేశ్వర్‌రెడ్డి, వినోద్‌కుమార్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత -
ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీఐడీ షో ద్వారా పాపులర్ అయిన దినేశ్ ఫడ్నీస్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఇటీవలే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సహనటుడు దయానంద్ శెట్టి వెల్లడించారు. దినేశ్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు బోరివలి తూర్పులోని దౌలత్ నగర్లో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా దినేశ్.. సీఐడీ షోలో ఫ్రెడరిక్స్ అనే పాత్రను పోషించాడు. 20 ఏళ్లపాటు ఈ షోలో భాగమయ్యాడు. 1998లో మొదలైన సీఐడీ షో దాదాపు 20 ఏళ్లు బుల్లితెరపై విజయవంతంగా ప్రసారమైన సంగతి తెలిసిందే! సీఐడీతో పాటు హిట్ సీరియల్ తారక్ మెహతాకా ఉల్టా చష్మా సీరియల్లోనూ అతిథి పాత్రలో నటించాడు దినేశ్. సర్ఫరోష్, సూపర్ 30 సహా పలు హిందీ చిత్రాల్లో యాక్ట్ చేశాడు. -
మంచి సినిమా అంటున్నారు
‘‘అలా నిన్ను చేరి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మరీ ముఖ్యంగా గ్రామీణప్రాంతాల ప్రేక్షకుల నుంచి ఎక్కువగా స్పందన వస్తోంది. వారంతా ఫస్ట్ హాఫ్‌కి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు’’ అని కొమ్మాలపాటి సాయి సుధాకర్ అన్నారు. దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వం వహించారు. కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ మాట్లాడుతూ–‘‘మా సినిమా చూసిన చాలామంది తమ జీవితాన్ని చూసుకున్నట్టుగా ఉందనడం సంతోషం. ‘అలా నిన్ను చేరి’ నిర్మాతగా మొదటి సినిమా అయినా కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టా. సినిమా చూసిన మా నాన్నగారు బాగా తీశారని మెచ్చుకున్నారు. నా తర్వాతి సినిమా కోసం ప్రస్తుతం థ్రిల్లర్ జానర్లో ఓ కథ విన్నాను’’ అన్నారు. -
‘అలా నిన్ను చేరి’ మూవీ రివ్యూ
టైటిల్: అలా నిన్ను చేరి నటీనటులు: దినేష్ తేజ్, హెబా పటేల్, పాయల్ రాధాకృష్ణ, ఝాన్సీ, చమ్మక్ చంద్ర, శత్రు తదితరులు నిర్మాత: కొమ్మాలపాటి సాయి సుధాకర్ దర్శకత్వం: మారేష్ శివన్ సంగీతం: సుభాష్ ఆనంద్ సినిమాటోగ్రఫి: అండ్రూ ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు విడుదల తేది: నవంబర్ 10, 2023 కథేంటంటే.. వైజాగ్‌లోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడు గణేష్(దినేష్ తేజ్)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సమయంలోనే తన గ్రామానికి చెందిన దివ్య(పాయల్ రాధాకృష్ణ)తో ప్రేమలో పడతాడు. ఈ విషయం దివ్య తల్లి కనకం(ఝాన్సీ) దృష్టికి రావడంతో.. కూతుర్ని తన బంధువువైన కాళీ(శత్రు)కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. దివ్య పెళ్లి విషయం తెలిసినా.. గణేశ్ అడ్డుకునే ప్రయత్నం చేయడు. తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. సినిమా తీయాలన్న గణేష్ లక్ష్యం నెరవేరిందా? కాళీతో దివ్య పెళ్లి జరిగిందా? లేదా? ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతున్నా..గణేష్ ఎందుకు ఆపలేకపోయాడు? హైదరాబాద్‌లో గణేష్ పడిన కష్టాలేంటి? అతని జీవితంలోకి అను(హైబ్బా పటేల్)ఎలా వచ్చింది? అను పరిచయంతో గణేశ్ జీవితం ఎలా మారింది? తను ప్రేమించిన అమ్మాయి దివ్య..తనను ఇష్టపడిన అమ్మాయి అను..ఇద్దరిలో ఎవరిని గణేష్ తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అలా నిన్ను చేరి’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. లక్ష్యం కోసం ప్రేమను త్యాగం చేసిన ఓ మిడిల్ క్లాస్ యువకుడి కథే ‘అలా నిన్ను చేరి’. నేటితరం నచ్చే, మెచ్చే అంశాలతో ఫుల్ కమర్షియల్ ఫార్మాట్లో దర్శకుడు మారేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్‌ప్లే కారణంగా స్టోరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ని చక్కగా డీల్ చేసిన దర్శకుడు.. సెకండాఫ్‌లో కాస్త తడబడ్డాడు. కానీ సాహిత్యం విషయంలో, నటీనటులను నుంచి తనకు కావాల్సిన నటనను రాబట్టుకోవడంతో మాత్రం సక్సెస్ అయ్యాడు. దర్శకుడిగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ..కథను తీర్చి దిద్దిన విధానం బాగుంది. కథ ప్రారంభంగా రొటీన్‌గా ఉన్నా.. దివ్య, గణేష్ ప్రేమలో పడిన తర్వాత మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హీరోయిన్ ప్రపోజ్ చేసే విధానం ఆకట్టుకుంటుంది. ఒకవైపు ప్రేమ..మరోవైపు లక్ష్యం రెండింటి మధ్య హీరో పడే సంఘర్షణకు సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు చక్కగా రాసుకున్నాడు. పల్లెటూరి ప్రేమ కథ.. మంచి సాహిత్యంతో ఫస్టాఫ్ ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్‌లో మాత్రం కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అను, గణేశ్‌ల మధ్య వచ్చే కొన్ని సన్నీవేశాలు సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా చాన్స్‌కోసం హీరో చేసే ప్రయత్నాలకు సంబంధించిన సన్నివేశాలు కూడా రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ ఫ్రీ క్లైమాక్స్ నుంచి కథ ఎమోషనల్‌గా సాగుతుంది. సినిమాను ముగించిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. మిడిల్ క్లాస్ యువకుడు గణేష్ పాత్రకు దినేష్ తేజ్ న్యాయం చేశాడు. డ్యాన్స్, యాక్షన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చక్కగా నటించాడు. ఇక దివ్య పాత్రలో పాయల్ రాధాకృష్ణ ఒదిగిపోయింది. ఇది తనకు తొలి చిత్రమే అయినా.. ఆ విషయం తెరపై కనిపించకుండా నటించేసింది. దినేష్, పాయల్ల కెమిస్ట్రీ తెరపై చక్కగా పండింది. ఇక అను పాత్రకు హెబ్బా పటేల్ పూర్తి న్యాయం చేసింది. సెండాఫ్ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. రంగస్థలం మహేశ్, చమ్మక్ చంద్ర, ఝాన్సీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. సుభాష్ ఆనంద్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు ప్లస్ అయింది. కోడి బాయే లచ్చమ్మ పాటతో పాటు మిగతా సాంగ్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అండ్రూ సినిమాటోగ్రఫీ సినిమాను రిచ్‌గా మార్చింది. ఎడిటర్ తన కత్తెర ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కథే హీరో
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించిన లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి..’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో దినేష్ తేజ్ మాట్లాడుతూ– ‘‘జీవితంలోని ఓ దశలో ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అంటూ ప్రతి మధ్యతరగతి అబ్బాయి గురయ్యే సంఘర్షణను ఇందులో చూపించాం. ఈ సినిమాలో నేను కొత్తగా కాస్త కమర్షియల్ రోల్లో నటించాను. ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకి వస్తారని చెప్పగలను. కథ ఉంటేనే ఏమైనా చేయగలం. అందుకే కథే హీరో అని నమ్మే వ్యక్తిని నేను. ప్రేక్షకులు మెచ్చుకునే కథల్లో భాగం కావాలనుకుంటాను’’ అన్నారు. -
ఎస్బీఐ గుడ్‌న్యూస్: భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI ) తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. జీతాలు, పెన్షన్ల పెంపునకు సంబంధించి ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కీలక విషయం వెల్లడించారు. ఇందుకోసం నిధులను సైతం కేటాయించినట్లు చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ పెంపుదల కోసం కేటాయింపులు పెరగడం బ్యాంక్ రెండవ త్రైమాసిక నికర లాభంపై ప్రభావం చూపిందని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా తెలిపారు. ఉద్యోగుల జీతాలు 14 శాతం మేర పెంచాలని భావించిన ఎస్బీఐ అందుకు అనుగుణంగా నిధులను సైతం పక్కనపెట్టి ఉంచింది. 2022 నవంబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్న వేతన సవరణ కోసం ఇప్పటివరకు రూ. 8,900 కోట్లను కేటాయించినట్లు ముంబైలో ఎస్బీఐ రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో దినేష్ ఖారా వెల్లడించారు. "ఈ కేటాయింపుల వల్ల రెండో త్రైమాసికంలో ఎస్బీఐ లాభాలు కొంచెం తగ్గాయి. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి ఊపందుకుని 16 శాతం నుంచి 17 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం. దేశీయ డిమాండ్ బలంగా ఉంది. పండుగ వ్యయాల నేపథ్యంలో ఇది మరింత పెరుగుతుంది" అని ఖారా పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి ఎస్బీఐ నికర లాభం 8 శాతం పెరిగి రూ.14,330 కోట్లకు చేరుకుంది. 16 శాతంతో రిటైల్ రుణాల వృద్ధి.. 7 శాతంగా ఉన్న కార్పొరేట్ రుణ వృద్ధిని అధిగమించింది. అయితే కంపెనీలు నెమ్మదిగా రుణాలను పొందుతున్నాయని, రూ. 4.77 లక్షల కోట్ల రుణాలు వివిధ దశల్లో ఉన్నాయని దినేష్ ఖారా వివరించారు. "బ్యాంకుకు రూ. 3.20 లక్షల కోట్ల అన్సెక్యూర్డ్ రుణాలు ఉన్నాయి. వీటిలో 86 శాతం సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్న కస్టమర్లకే ఇచ్చాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఆయన చెప్పారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇటీవలి ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల అసురక్షిత రుణ వృద్ధి పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. -
లవ్ అండ్ ఎమోషన్
దినేష్ తేజ్ హీరోగా, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్లుగా నటించిన ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ ఫిల్మ్ ‘అలా నిన్ను చేరి’. మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 10న విడుదల కానుంది. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. చంద్రబోస్‌గారి సాహిత్యం, సుభాస్ ఆనంద్ సంగీతం అదనపు ఆకర్షణలు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
‘చెంచు’ చిచ్చరపిడుగు
పది లక్షల మందిలో ప్రథముడు ఊహ తెలియకముందే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు.. నాలుగేళ్లకే మంటలంటుకొని కాళ్లు, చేతులు, శరీరం కాలిపోయింది.. 60 శాతం గాయాలతో ఆస్పత్రికి తీసుకెళితే..బతకడమే కష్టమని డాక్టర్లు అన్నారు.. ఆరేళ్ల ప్రాయంలోనే 3 మేజర్ సర్జరీలు జరిగాయి. ఇంకా పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌లోకి రాలేదు... ఈ పరిచయమంతా ఓ నల్లమల కుర్రాడి గురించి... లోకం పోకడనే తెలియని.. ఇప్పటికీ నాగరికతకు దూరంగా ఉండే చెంచుల నుంచి ఓ చిచ్చర పిడుగు జాతీయస్థాయిలో ప్రతిభ చాటాడు. పదిలక్షల మంది విద్యార్థులు పోటీ పడగా, అందరికంటే ముందువరుసలో నిలిచాడు.. అతడే ’మిలియనీర్ ’దినేశ్. సాక్షి, ప్రత్యేకప్రతినిధి/నాగర్‌కర్నూల్ : వ్యక్తిగత పరిశుభ్రతపై దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలో నల్లమలకు చెందిన విద్యార్థి ప్రతిభ చాటాడు. అపోలో హాస్పిటల్, డెటాల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన టోటల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రతపై పరీక్ష జరగ్గా, ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న దినేష్ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచాడు. దినేష్ బతకడమే కష్టమన్నారు... నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరుకు చెందిన దినేష్ తండ్రి కరమ్‌చంద్ కొన్నాళ్లు కాంట్రాక్ట్ టీచర్‌గా పనిచేశాడు. ఈయన భార్య మహేశ్వరి దినేష్‌కు ఊహ తెలియకముందే కన్నుమూసింది. తల్లి ప్రేమకు దూరమై పెరిగిన దినేష్ నాలుగేళ్ల వయసులో ఇంట్లో స్టవ్ దగ్గర ఆడుకుంటుండగా ప్రమాదం జరిగింది. ముఖం, కాళ్లు, చేతులు 60 శాతం కాలిపోయాయి. చికిత్స చేసే ముందే డాక్టర్లు దినేష్ బతకడమే కష్టమన్నారు. ఐదేళ్లకు ఒక ఆపరేషన్, ఆరేళ్ల వయసులో దినేష్‌కు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయి. తర్వాత కొంతవరకు శరీరం సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పటికీ ముఖం, చేతులు మామూలు స్థితికి చేరుకోలేదు. కాళ్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి మరో శస్త్రచికిత్స చేయాలని డాక్డర్లు చెప్పారు. ఐదో తరగతి నుంచి ‘ట్రైబల్ వేల్ఫేర్’లోకి మన్ననూర్ గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో దినేష్ ఐదోతరగతిలో చేరాడు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. క్లాస్‌లో తనే టాపర్. ఆంగ్లంపై ఉన్న మక్కువ, పట్టు గుర్తించిన టీచర్లు ఉదయ్‌కుమార్, ఆంజనేయులు దినేష్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అతడి పరిజ్ఞానాన్ని పెంచుతున్నారు. ఫలితంగా ట్రైబల్ సొసైటీ సారథ్యంలో జరిగిన పలు డిబేట్లు, ఇగ్నైట్ ఫెస్ల్లో అనేక బహుమతులు పొందాడు. 2500 పాఠశాలలు...పదిలక్షల మంది విద్యార్థులు డెటాల్ సంస్థ అపోలో ఫౌండేషన్‌తో కలిసి బాలబాలికల్లో స్వీయ, పరిసరాల పరిశుభ్రతతో పాటు కాలుష్య నియంత్రణపై అవగాహనకు ప్రతి ఏటా హైజిన్ ఒలింపియాడ్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 4–15 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ఈ పరీక్ష జరిగింది. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి రెండు తరగతులను ఒక కేటగిరిగా చేసి మొత్తంగా ఐదు కేటగరిలో పరీక్ష నిర్వహిస్తారు. 9–10 తరగతుల కేటగిరిలో దేశ వ్యాప్తంగా 2500 పాఠశాలల నుంచి పది లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. 50 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష జరిగింది. దినేష్ పూర్తి మార్కులతో పాటు చేతిరాత, పరీక్ష రాసిన విధానం ఆధారంగా అదనపు మార్కులతో కలిపి 51 మార్కులు సాధించాడు. దీంతో జాతీయస్థాయిలో దినేష్‌కు ప్రథమస్థానం వచ్చినట్లు డెటాల్ సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 2న ముంబైలో జరిగే కార్యక్రమంలో దినేష్ రూ. లక్ష నగదుతోపాటు పురస్కారం అందుకోనున్నాడు. శుక్రవారం కలెక్టరేట్లో విద్యార్థి దినేష్‌ను నాగర్‌కర్నూల్ కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. ఈ కార్యక్రమంలో మన్ననూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు ఆంజనేయులు, చంద్రశేఖర్, గణేష్, విద్యార్థి తండ్రి కరంచంద్ పాల్గొన్నారు. నిక్ వుజిసిక్ నాకు స్ఫూర్తి తన అంగవైకల్యాన్ని అధిగమించి ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్‌గా మారిన నిక్ వుజిసిక్ నాలో స్ఫూర్తి నింపారు. అవకాశాలు అనేవి అందరికీ సమానమే. వాటిని అందిపుచ్చుకోవడమే మనవంతు అని నేర్చుకున్నా. అదే స్ఫూర్తితో ముందుకు వెళుతున్నా. చదువుతోపాటు క్రికెట్ నా హాబీ. బెస్ట్ కీపర్‌గా నా మార్కు చూపిస్తున్నా. సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించాలని అనుకుంటున్నా. – దినేష్ -
కోడిబాయె లచ్చమ్మది
దినేష్ తేజ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘అలా నిన్ను చేరి’. కొమ్మాల పాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకత్వంలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ ‘కోడిబాయె లచ్చమ్మది..’ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘యంగ్ టాలెంట్ తీసే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. ఈ చిత్రాన్ని కూడా ఆదరించాలి. సినిమా పెద్ద హిట్టవ్వాలి’’ అన్నారు. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘కోడిబాయె..’ పాటను మంగ్లీ పాడగా, భాను నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఈ పాటలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్‌ల మాస్ స్టెప్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌గా నిలవనుంది. సినిమాలోని అన్ని పాటలనూ చంద్రబోస్ గారు రాశారు ’’ అని యూనిట్ పేర్కొంది. -
‘కొడిపాయే లచ్చమ్మది’ అంటోన్న హెబ్బా పటేల్.. !
యంగ్ హీరో దినేష్ తేజ్, హీరోయిన్ హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'కొడిపాయే లచ్చమ్మది' అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటను మంగ్లీ పాడగా.. కుర్రకారుని కట్టిపడేసేలా మరో జానపదంగా నిలవబోతోంది. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్‌లో నిలిచిన తెలిసిందే. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ‘యంగ్ టీం అంతా కలిసి ఈ సినిమాను నిర్మించారు. యంగ్ టాలెంట్‌ను ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు. కొత్త సినిమాలను ఆడియెన్స్ ఆదరిస్తారు. యంగ్ టాలెంట్ టీం తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ మూవీపెద్ద విజయం సాధించాలి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. Mass Folk Fest Begins!! Put Your dance shoes to groove 💃 🕺 Honourable Minister Sri @YadavTalasani launched the Folk Number #KodiBhayeLachammadi from #AlaNinnuCheri and wished the team all the luck@iamMangli sensational singing Watch the Lyrical Here:https://t.co/J2LUBtDhpd pic.twitter.com/c1ivLs3kti — Dinesh Tej (@idineshtej) September 27, 2023 -
కేంద్రం కీలక నిర్ణయం.. మేనేజింగ్ డైరెక్టర్ల రీటైర్మెంట్ వయస్సును
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థలు, బ్యాంకుల్లో మేనేజింగ్ డైరక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి రిటైర్మెంట్ వయస్సును పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్ఐసీ, ఎస్బీఐ చైర్మన్ల రీటైర్మెంట్ వయస్సును 65కి పొడిగించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. కేంద్రం సంబంధిత శాఖలతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) చీఫ్‌ల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో పీఎస్‌బీల మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచడంపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దినేష్ ఖారా రీటైర్మెంట్ పొడిగింపు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ ఖరా పదవీ కాలాన్ని కూడా పొడిగించే అవకాశం ఉందని పీటీఐ నివేదించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మేనేజింగ్ డైరెక్టర్ల పదవీ విరమణ వయో పరిమితిని ప్రస్తుత 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని యోచిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2020 నుంచి దినేష్ ఖారా ఎస్బీఐ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత నిబందనల ప్రకారం.. ఖరా వచ్చే ఏడాది ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం అతని వయస్సు 63 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పదవీ విరమణ వయస్సు పెంపుతో ఆయన ఎస్బీఐ చైర్మన్‌గా మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. అలాగే ఇతర సంస్థల్లో డైరెక్టర్లగా పనిచేస్తున్న వారి పదవీ విరమణ వయస్సు పొడిగింపుపై ప్రణాళికలు, చర్చలు మినహా, మిగిలిన అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ అంశంపై తుది నిర్ణయం కేంద్రానిదే. ఎల్ఐసీ చైర్పర్సన్ జూన్ 29, 2024 వరకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చైర్‌పర్సన్‌గా సిద్ధార్థ మొహంతిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత, జూన్ 7, నుంచి 2025 వరకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా తన పదవిలో కొనసాగనున్నారు. ఎల్ఐసీకి ఎం జగన్నాథ్, టేబల్ష్ పాండే, మినీ ఐపీ అనే ముగ్గురు మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. ఎండీల పదవీ విరమణ వయస్సు పొడిగింపు వారి పదవీకాలాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. -
ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఈ ఏడాది భారీగా కొత్త బ్రాంచ్‌లు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 300 కొత్త శాఖలను తెరవనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్బీఐకి దేశవ్యాప్తంగా 22,405 శాఖలు ఉన్నాయి. అలాగే, 235 విదేశీ శాఖలు సైతం పనిచేస్తున్నాయి. ఒకవైపు డిజిటల్‌గా విస్తరిస్తూనే, మరోవైపు అవసరమున్న చోట భౌతికంగా శాఖలను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా తెలిపారు. అలాగే, బిజినెస్ కరస్పాడెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు. ‘‘కస్టమర్లకు ఏమి కావాలన్నది మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకు అనుగుణంగా వాహకాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందించే చర్యలు తీసుకుంటున్నాం. మాకు ఇప్పటికే ఆస్తులు ఉన్నాయి. వాటి నుంచి ఫలితాలను రాబడుతున్నాం’’అని ఖరా ప్రకటించారు. నికర వడ్డీ మార్జిన్ గురించి ప్రస్తావిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3.5 శాతంగా ఉంటుందన్నారు. జూన్ త్రైమాసికంలో ఎస్బీఐ రూ.16,884 కోట్ల లాభాన్ని ప్రటించడం తెలిసిందే. -
తల్లి కొట్టిందని బాలుడి ఆత్మహత్య
కోనరావుపేట (వేములవాడ): ‘‘ఊర్లో బతుకబుద్ధి అవు తలే. వేరేవాళ్లు చెప్పే మాటలకు బాధనిపిస్తోంది. అమ్మా.. నన్ను కొట్టినందుకు బాధలేదు. చెల్లిని మంచిగా చూసుకో. ఈ పేదబతుకు నాకొద్దు. చెల్లెకు మంచిగా పెళ్లి చేయండి. అమ్మా.. అన్నా.. బావా.. డాడీ.. నేను వెళ్తున్నా..’’అని ఓ బాలుడు స్నేహితుడికి సెల్ఫీ వీడియో పంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లంలోని కమ్మరిపేటతండాలో ఈ ఘటన జరిగింది. కమ్మ రిపేటతండా (వట్టిమల్ల)కు చెందిన భూక్యా రాజు, జ్యోతి దంపతులకు దినేశ్, దీప్తి అనే పిల్లలు ఉన్నారు. దినేశ్ (17) గతేడాది వరకు కోనరావుపేట మండలంలోని ధర్మా రం హాస్టల్లో ఉంటూ ఎనిమిదో తరగతి వరకు చదువుకు న్నాడు. ఈ ఏడాది చదువు ఆపేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. రెండు రోజుల క్రితం ఓ దుకాణంలో సిగరెట్ ప్యాకెట్ దొంగిలించాడని దుకాణం యజమా ని దినేశ్ తల్లిదండ్రులకు చెప్పగా.. తల్లి కోపంతో దినేశ్‌ను కొట్టింది. దీంతో గురువారం ఉదయం 10 గంటలకు దినేశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. స్నేహితుల దగ్గరికి వెళ్లాడని భావించిన తల్లిదండ్రులు వరినాట్లు వేసేందుకు పొలానికి వెళ్లారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో.. గురువారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన దినేశ్, తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి స్నేహితునికి పంపాడు. అయితే అతను పాఠశాలకు వెళ్లిపోగా.. సెల్‌ఫోన్‌ను అతని తండ్రి తీసుకెళ్లాడు. రాత్రి పది గంటలకు స్నేహితుడి తండ్రి ఇంటికొచ్చాక వీడియో చూసి వెంటనే దినేశ్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలసి దినేశ్ కోసం అటవీ ప్రాంతంలో గాలించారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు వట్టిమల్ల శివారు అటవీ ప్రాంతంలో దినేశ్ మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కోనరావుపేట ఎస్సై రమాకాంత్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుని మృతికి దుకాణం యజమాని మాలోత్ కాంతి కారణమని మృతుని తండ్రి రాజు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా దినేశ్‌కు బాధ్యతలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను (2023–24) భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ కొత్త ప్రెసిడెంట్‌గా టీవీఎస్ సప్లై చెయిన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్ దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ స్థానంలో ఆయన ఎన్నికయ్యారు. అలాగే, ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఇండియా చైర్మన్ రాజీవ్ మెమాని సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 2023–24కు గాను కొత్త ఆఫీస్–బేరర్లను ఎన్నుకున్నారు. -
ఆయనో జంటిల్మన్ జడ్జి
న్యూఢిల్లీ: జస్టిస్ దినేశ్ మహేశ్వరిని ‘జెంటిల్‌మ్యాన్ జడ్జి’అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అభివర్ణించారు. 2019లో సుప్రీంకోర్టులో నియమితులై నాలుగేళ్ల కు పైగా సేవలందించిన జస్టిస్ మహేశ్వరి ఈ నెల 14న పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటైన జస్టిస్ మహేశ్వరి వీడ్కోలు కార్యక్రమానికి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షత వహించారు. ‘అలహాబాద్ హైకోర్టులో ఉన్నప్పటి నుంచి జస్టిస్ మహేశ్వరితో నాకు పరిచయం ఉంది. ఇద్దరం అలహాబాద్, లక్నో బెంచ్‌ల్లో ఉండేవాళ్లం. లక్నోలో ఆయన నా సీనియర్. జస్టిస్ మహేశ్వరి జెంటిల్‌మ్యాన్ జడ్జి, ఫ్రెండ్లీ జడ్జి’అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.‘విధుల్లో ఉండగా చివరిసారిగా నిగ్రహాన్ని ఎప్పుడు కోల్పోయారనే విషయం ఆయనకు కూడా గుర్తులేదని కచ్చితంగా చెప్పగలను. టెంపర్ అనేది జస్టిస్ మహేశ్వరి డిక్షనరీలోనే లేదు. ఆయన అంతటి సహనం, ప్రశాంతతలతో ఉంటారు’అని కొనియాడారు. అనంతరం జస్టిస్ మహేశ్వరి ప్రసంగించారు. ‘ఇతరుల సహకారం లేకుండా ఏ వ్యక్తి ఈ విధులను నిర్వహించలేడు. మనమంతా కలిసి పనిచేశాం’అంటూ ఉద్విగ్నభరితమయ్యారు. సుప్రీంకోర్టులో మోస్ట్ సీనియర్ జడ్జిల్లో జస్టిస్ మహేశ్వరి ఆరోవారు. ప్రస్తుతం పూర్తి సామర్థ్యంతో నడుస్తున్న సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి రిటైర్మెంట్తో జడ్జీల సంఖ్య 33కు తగ్గనుంది. ‘ఈ–ఫైలింగ్ 2.0’ ప్రారంభం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఈ–ఫైలింగ్ 2.0 సదుపాయాన్ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. దీనిద్వారా న్యాయవాదులు ఏ సమయంలోనైనా కేసులు ఆన్లైన్ ద్వారా ఫైల్ చేయొచ్చన్నారు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ–ఫైలింగ్ సాఫ్ట్వేర్ ద్వారా కేసులు ఫైల్ చేయడంతోపాటు తర్వాత వాటి స్థితిగతులను ఇతర కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల స్టేటస్‌ను సైతం తెలుసుకోవచ్చని వెల్లడించారు. -
బొమ్మల తయారీలోకి రిలయన్స్ రిటైల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ స్థానికంగా బొమ్మల తయారీలోకి ప్రవేశించనుంది. బొమ్మలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా హర్యానా కంపెనీ సర్కిల్ ఈ రిటైల్‌తో భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బొమ్మల బిజినెస్‌లో సమీకృత కార్యకలాపాలను నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ సీఎఫ్‌వో దినేష్ తలుజా పేర్కొన్నారు. కంపెనీ ఇప్పటికే సుప్రసిద్ధ బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లేస్తోపాటు, దేశీ బ్రాండు రోవన్ విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మల బిజినెస్‌లో డిజైన్ నుంచి షెల్ఫ్వరకూ రిలయన్స్ రిటైల్ వ్యూహాత్మకంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వెరసి బొమ్మల డిజైనింగ్, తయారీ, రిటైల్ మార్కెటింగ్ తదితరాలను చేపట్టడం ద్వారా టాయ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. -
దినేశ్‌కు మూడు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్ఎల్4 డబుల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్యు5 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి. -
వంటగదిలో ఉన్న భార్య గొంతుకోసి హత్యచేసి.. మరో గదిలో..
శివమొగ్గ (బెంగళూరు): భార్యను గొంతు కోసి చంపిన భర్త తాను చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన శివమొగ్గ నగరంలోని ప్రియాంక లేఔట్లో జరిగింది. తుంగా నగర పోలీసులు తెలిపిన ప్రకారం. మంజుళ (30), దినేష్ భార్యభర్తలు. మంగళవారం రాత్రి ఇద్దరూ గొడవ పడ్డారు. బుధవారం ఉదయం వంటగదిలోనున్న భార్యను దినేష్ చాకుతో గొంతు కోసి హత్య చేసి, మరో గదిలో తాను చేయి కోసుకున్నాడు. ఇరుగుపొరుగు చూసి అతన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') -
ఎస్బీఐ లాభం @ రూ. 6,068 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 6,068 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 6,504 కోట్లు ఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సైతం నికర లాభం రూ. 55 కోట్లు తగ్గి రూ. 7,325 కోట్లను తాకింది. మార్క్ టు మార్కెట్ నష్టాలు ప్రభావం చూపాయి. అయితే బిజినెస్, లాభదాయకత, ఆస్తుల(రుణాలు) నాణ్యతలో బ్యాంక్ పటిష్ట పనితీరు చూపినట్లు ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో ఎంటూఎం నష్టాలు పెరగడం లాభాలను దెబ్బతీసినట్లు పేర్కొన్నారు. పెట్టుబడులతో పోలిస్తే ఫైనాన్షియల్ ఆస్తుల విలువ క్షీణించినప్పుడు ఎంటూఎం నష్టాలు వాటిల్లే సంగతి తెలిసిందే. మార్జిన్లు ప్లస్: సమీక్షా కాలంలో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం 13% పుంజుకుని రూ. 31,196 కోట్లను తాకింది. దేశీయంగా నికర వడ్డీ మార్జిన్లు 3.15 శాతం నుంచి 3.23 శాతానికి మెరుగుపడ్డాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 5.32 శాతం నుంచి 3.91 శాతానికి దిగివచ్చాయి. నికర ఎన్పీఏలు సైతం 1.77% నుంచి 1 శాతానికి తగ్గాయి. భవిష్యత్‌లోనూ రుణ నాణ్యతలో సవాళ్లు ఎదురుకాకపోవచ్చని ఖారా అంచనా వేశారు. తాజా స్లిప్పేజీలు రూ. 9,740 కోట్లుకాగా.. రికవరీ, అప్గ్రెడేషన్లు రూ. 5,208 కోట్లుగా నమోదయ్యాయి. రుణ నష్టాల కేటాయింపులు 15%పైగా తగ్గి రూ. 4,268 కోట్లకు చేరాయి. -
దినేష్ దశ తిరిగెన్.. మోసపోయిన కంపెనీ నుంచే బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే అతడి చేతిలో ఉన్న ఉద్యోగం, ఇతర అవకాశాలు కోల్పోతాడు. అయితే నగరానికి చెందిన ‘పేమెంట్ గేట్ వే’ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసి భారీ మొత్తం కాజేసిన కేసులో చిక్కిన వన్నం శ్రీరామ్ దినేష్ కుమార్ కథ వేరేలా ఉంది. ఈ హ్యాకర్‌ను తాము ఎథికల్ హ్యాకర్‌గా వినియోగించుకుంటామని బాధిత కంపెనీనే ముందుకు వచ్చింది. నగర పోలీసు అధికారులు సైతం ఇదే కోణంలో ఆలోచిస్తున్నారు. దినేష్‌ను అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అతడికి హ్యాకింగ్‌పై ఉన్న పట్టు, ప్రస్తుత అవసరాలను గమనించి మార్పు వచ్చేలా కౌన్సిలింగ్ చేశారు. ఫలితంగా ఎథికల్ హ్యాకర్‌గా మారడానికి దినేష్ అంగీకరించాడు. పరిస్థితులు వివరిస్తూ దినేష్‌కు కౌన్సిలింగ్... నగరానికి చెందిన పేమెంట్ గేట్ వే సంస్థ పేజీ సర్వర్‌ను గతేడాది నవంబర్ నుంచి రెండుసార్లు హ్యాకర్లు దాడి చేశారు. ఈ ఏడాది మార్చిలో దినేష్ చేసిన తాజా ఎటాక్ రెండోది. దీంతో అప్రమత్తమైన ఆ సంస్థ తమ సైబర్ సెక్యూరిటీ, ఫైర్‌వాల్స్ పటిష్టం చేయడానికి కొన్ని సంస్థల సేవలతో ఒప్పందాలు చేసుకుంది. వీరి సర్వర్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను అధ్యయనం చేసిన ఆయా సంస్థలు కొన్ని మార్పు చేర్పులు చేయడంతో ఇక భవిష్యత్తులో ఇలాంటి హ్యాకింగ్ ఉండవని భావించింది. అయిన్పప్పటికీ వాటిన్ని ఛేదించిన దినేష్ హ్యాకింగ్ చేశాడు. ఇతడిని అరెస్టు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు విద్యార్హతలు లేకున్నా అతడికి హ్యాకింగ్, వల్నరబులిటీ టెస్టుల్లో ప్రావీణ్యాన్ని గుర్తించారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రతిభను సమాజానికి ఉపయోగపడేలా కృషి చేయాలని, తాము పూర్తి సహకారం అందిస్తామని కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అతడిలో వచ్చిన పశ్చాత్తాపం, మార్పులను దర్యాప్తు అధికారులు గుర్తించారు. చదవండి: Hyderabad: గుడ్‌న్యూస్.. సిటీబస్సు @ 24/7 వారికి తెలియని లోపాలు బయటపెట్టడంతో.. ఈ నేపథ్యంలోనే అతడి ద్వారానే బాధిత సంస్థలో ఉన్న సాంకేతిక లోపాలను వారికి తెలియజేయాలని నిర్ణయించారు. దీంతో అతడిని విచారిస్తున్న సందర్భంలో పేజీ సంస్థ సాంకేతిక బృందాన్నీ సైబర్ ఠాణాకు పిలిచారు. వారి సమక్షంలోనే దినేష్ ఇప్పటికీ దాని సర్వర్, సాఫ్ట్‌వేర్‌లో ఉన్న అనేక లోపాలను బయటపెట్టాడు. దీంతో కంగుతిన్న ఆ సంస్థ ఎథికల్ హ్యాకర్‌గా మారి తమ సర్వర్‌ను హ్యాకింగ్ ఫ్రూఫ్‌గా మార్చడానికి సహకరిస్తావా? అంటూ దినేష్‌ను కోరారు. అప్పటికే కౌన్సిలింగ్‌తో మారిన దినేష్ వెంటనే అంగీకరించాడు. మరోపక్క ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో నగర పోలీసులు సైతం ప్రైవేట్ నిపుణులు, ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంటున్నారు. దినేష్ శైలిని గమనించిన ఓ ఉన్నతాధికారి ఇతడు ఆ నిపుణులకు ఏమాత్రం తక్కువ కాదని గుర్తించారు. దీంతో దినేష్ జైలు నుంచి విడుదలైన తర్వాత భారీ సైబర్ నేరాల దర్యాప్తులో అతడి సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. దినేష్ ఈ పనులు ప్రారంభిస్తే మరికొన్ని సంస్థలు ముందుకు వచ్చే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అనునిత్యం అతడి కార్యకలాపాలు, వ్యవహారశైలిపై నిఘా ఉంచనున్నామని తెలిపారు. కుటుంబ నేపథ్యమూ కారణమే... దినేష్‌ను ఎథికల్ హ్యాకర్‌గా మార్చాలని సైబర్ క్రైమ్ పోలీసులు యోచించడానికి అతడి ప్రతిభతో పాటు కుటుంబ నేపథ్యమూ ఓ కారణమే. ఇతడి తండ్రి ఆర్టీసీ కండెక్టర్ కాగా, తల్లిది చిన్న స్థాయి రాజకీయ నేపథ్యం. దినేష్ భార్య ఏపీలోని గ్రామ సచివాలయంలో వ్యవసాయాధికారిణిగా పని చేస్తున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ విద్యార్హతలు లేక ఉద్యోగాలు రాకపోవడం, పెట్టిన ప్రాజెక్టులు నష్టాలు మిగల్చడంతోనే దినేష్ నేరబాటపట్టినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. -
వెడ్డింగ్ రిసెప్షన్ కోసం కాబోయే జంట ప్రయత్నం.. వార్తల్లోకి!
Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్ సాధించబోతున్నాడు. మెటావర్స్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్ సాధించబోతోంది ఈ కాబోయే జంట. తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్ ఎస్పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్ ద్వారా. ఇది గనుక సక్సెస్ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది. ఇన్‌స్టా పరిచయం దినేశ్ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్వేర్ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్.. మెటావర్స్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్ మెటావర్స్ మ్యారేజ్’ తమదేనంటూ దినేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. హ్యారీ పోటర్ యూనివర్స్ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్ జరగనుండగా.. ల్యాప్ ట్యాప్ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్ రిసెప్షన్ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్ వౌచర్ల ట్రాన్స్ఫర్, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది. I feel so proud and blessed that I have seen and taken advantage of many great opportunities in this world before millions of people have seen them, Beginning of something big! India’s first #metaverse marriage in Polygon blockchain collaborated with TardiVerse Metaverse startup. pic.twitter.com/jTivLSwjV4 — Dinesh Kshatriyan 💜 (@kshatriyan2811) January 11, 2022 మెటావర్స్ అంటే వర్చువల్ రియాలిటీ ప్రపంచం. అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్ అవతార్లతో ఇంటెరాక్ట్ కావడం. అగుమెంటెడ్ రియాలిటీ, బ్లాక్‌చెయిన్, వర్చువల్ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్సెల్వరాజ్ టీం ‘తడ్రివర్స్’ అనే స్టార్టప్ ద్వారా ఈ మెటావర్స్ రిసెప్షన్‌ను నిర్వహించనుంది. -
కోవిడ్‌పై సీసీఎంబీ–ఎస్బీఐ పరిశోధన
సాక్షి, హైదరాబాద్: ‘ఎస్బీఐ ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్’ను భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ భాగస్వామ్యంతో పనిచేయనున్న సీఎస్ఐఆర్–సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్‌కుమార్ నందికూరికి రూ.9.94 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ భారత్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ సామర్థ్యాలను మరింత ధృఢం చేసుకునే దిశలో ఎస్బీఐ సెంటర్ ఫర్ ఎక్స్‌లెక్స్ ఫర్ జీనోమిక్స్ గైడెడ్ ప్యాండమిక్ ప్రివెన్షన్ ఏర్పాటుకు సీఎస్ఐఆర్–సీసీఎంబీతో భాగస్వామ్యం కావడం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని చెప్పారు. కోవిడ్‌ను అర్థం చేసుకునేందుకు అవసరమైన అమూల్యమైన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎస్బీఐ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో భాగంగా ఎస్బీఐ ఫౌండేషన్ ఏర్పడిందని దినేష్ ఖారా తెలిపారు. కార్యక్రమంలో ముంబై డీఎండీ, సీడీవో ఓపీ మిశ్రా, హైదరాబాద్ డీఎండీ, ఐఏడీ ఆర్.విశ్వనాథన్, ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ మంజులా కల్యాణసుందరం, ఫౌండేషన్ బృందం సభ్యులు పాల్గొన్నారు. -
పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకు భరోసా!
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల పరిశ్రమలు, ప్రాజెక్టులకు (గ్రీన్ ఫైనాన్స్) బ్యాంకుల రుణాలు మరింత పెరగాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా పిలుపునిచ్చారు.తద్వారా సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించారు. భారత్ ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని అన్నారు. ‘‘గ్రీన్ ఫైనాన్స్ అన్న పదానికి ముందు తగిన నిర్వచనం ఇవ్వాలి. ఈ విభాగానికి సంబంధించి పటిష్ట నియంత్రణను అలాగే ఈ తరహా రంగాలకు మరింత ఫైనాన్స్ రావడానికి ఈ అంశం దోహదపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి’’ అని ఎస్బీఐ చైర్మన్ అన్నారు. ఈఎస్జీ (ఇన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్) ఇండియా లీడర్షిప్ అవార్డుల కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖారా చేసిన ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦గ్రీన్ ఫైనాన్స్ విషయంలో అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలను తొలుత పరిశీలించాలి. అలాగే ఇందుకు సంబంధించి ఆర్థిక కార్యకలాపాల విషయంలో మూలసూత్రాలను అభివృద్ధి చేయాలి. ఆ రంగంలో వ్యక్తుల అభిప్రాయాలను తీసుకోవాలి. తద్వారా ఒక ‘‘గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం’’ ఆవిష్కరణ జరగాలి. ♦బ్యాంకులు గ్రీన్ ప్రాజెక్ట్‌లకు తగిన క్రెడిట్ అందించలేకపోతే అలాగే ఆయా ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియోలో ఇబ్బందులను కనిపెట్టలేకపోతే ఈ విభాగంలో రిటర్న్స్ తీసుకోవాలనుకునే డిపాజిటర్లు, వాటాదారులు ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదముంటుంది. ♦ పర్యావరణం, తత్సంబంధ సామాజిక అంశాలు, నిర్వహణ విషయాల్లో ఎస్బీఐ చొరవను పరిశీలిస్తే, 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంక్ తన వంతు ప్రయత్నం చేయనుంది. ఈ దిశలో పలు లక్ష్యాల సాధనకు కృషి చేయనుంది. ♦ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మాత్రమే బ్యాంక్ పరిమితం కాదు. చెట్ల పెంపకం, సేంద్రీయ వ్యవసాయం, క్యాంపస్‌లో సింగిల్–యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం తదితర చర్యల్లో పురోగతికి బ్యాంక్ తగిన పాత్ర పోషిస్తుంది. – ప్రస్తుతం వ్యాపార రంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక క్రియాశీలత మెరుగుపడుతోంది. ఈ పరిస్థితుల్లో వాతావరణానికి జరిగే నష్టం అవకాశాలనూ బ్యాంక్ గుర్తించే పనిలో ఉంది. ♦ పర్యావరణ పరిరక్షణ సానుకూల ప్రాజెక్టుల విషయంలో రుణాల పెంపునకు బ్యాంక్ తగిన కృషి చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రుణగ్రహీతలకు బ్యాంక్ రుణ సదుపాయాలను సులభతరంగా అందిస్తోంది. రూ.50 కోట్లు దాటిన రుణాల విషయంలో ఈఎస్జీ విషయంలో ఆయా పారిశ్రామికవేత్తల కృషిని బట్టి వారికి ఒక స్కోర్‌ను అందించడం జరుగుతోంది. ♦ పర్యావరణ అనుకూల సాంకేతికతలకు ప్రోత్సహించడానికి, సులభతరం చేయడానికి దోహదపడే ప్రొడక్టులను, సేవలను రూపకల్పన చేయడంలో గత కొన్నేళ్లుగా ఎస్బీఐ తగిన ప్రయత్నం చేస్తోంది. ♦2018–19 నుంచి 800 బిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ బాండ్లు, గ్రీన్ లోన్ బాండ్లను ఎస్బీఐ జారీ చేసింది. తద్వారా సమీకరించిన నిధులను పర్యావరణ సానుకూల ప్రాజెక్టులకే వినియోగిస్తోంది. ♦కాగా, అక్యూట్ గ్రూప్‌నకు చెందిన ఈఎస్జీ రేటింగ్ ఏజెన్సీ– ఈఎస్‌జీరిస్క్.ఏఐ55 ఈ సందర్భంగా పరిశ్రమలోని టాప్–500 టాప్ –500 లిస్టెడ్ కంపెనీల నుండి 21 విజేతలను ప్రకటించింది. -
ప్రముఖ సినీ దర్శకుడు కన్నుమూత
బెంగళూరు : ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు దినేష్ గాంధీ కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బెంగుళూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన దినేష్ శనివారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన దాదాపు పది సంవత్సరాలకు పైగా కన్నడ చిత్ర పరిశ్రమకు తన సేవలు అందించారు. దినేష్ వయస్సు 52 సంవత్సరాలు. ఈ రోజు బెంగుళూరులోని తన నివాసంలోనే కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో దినేష్ అంత్యక్రియలు జరగనున్నాయి. దినేష్ అకాల మరణం కన్న సినీ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. దర్శకుడి మరణం పట్ల అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చదవండి: మీటూ ఉద్యమానికి మహిళలే బాధ్యులు కాగా సుదీప్ కిచ్చా నటించిన ‘వీర మదకారి’ సినిమా దినేష్‌కు మంది పేరు తెచ్చిపెట్టింది. 2009లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2012లో తెలుగులోనూ రౌడీ ఇన్స్పెక్టర్గా విడుదలైంది. అలాగే సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన చత్రపతి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల క్రితం దినేష్ గాంధీ తన కొడుకుతో కలిసి ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. కానీ కోవిడ్ 19 కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఆలస్యం అయింది. ఈ చిత్రాన్ని సింహాద్రి ప్రొడక్షన్స్ పతాకపై రమేష్ కైషాప్ నిర్మించాల్సి ఉంది. చదవండి: ‘అసహ్యం.. అందుకే నామినేట్ చేశాను’ -
ఎస్బీఐ కొత్త చైర్మన్‌గా దినేష్ కుమార్
సాక్షి, ముంబై : దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తదుపరి చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా (56) నియామకం ఖాయమైంది. ఈ మేరకు బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) శుక్రవారం సిఫారసు చేసింది. ఖారా నామినేషన్ ను ఇక ప్రధాని అధ్యక్షతన జరిగే క్యాబినెట్ నియామకాలకమిటీ (ఏసీసీ)ముందు ఉంచనున్నారు. ఈ కమిటీ ఆమోదంతో ఖారా బాధ్యతలను చేపడతారు. ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ 7తో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ బాధ్యతలను స్వీకరించాల్సి ఉంది. నిన్న (శుక్రవారం) విడుదల చేసిన ఒక ప్రకటనలో, బీబీబీ ఎస్బీఐ నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లను ఇంటర్వ్యూ చేసిన ఆ తరువాత ఖారా పేరును తదుపరి ఛైర్మన్ గా సిఫార్సు చేసినట్లు చెప్పారు. మరో ఎండీ చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును రిజర్వ్క్యాండిడేట్గా ప్రతిపాదించింది. దీంతో కరోనా సంక్షోభం నేపథ్యంలోరజనీశ్ పదవీకాలాన్నిపొడిగించవచ్చన్న ఊహాగానాలకు తెరపడింది. కాగా గ్లోబల్ బ్యాంకింగ్ అండ్ సబ్సిడియరీస్ (జిబి అండ్ ఎస్) విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఢిల్లీలోని ఎఫ్ఎమ్ఎస్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేసారు. 1984లో ఎస్బీఐ ప్రొబేషనరీ అధికారిగా చేరారు. ముఖ్యంగా ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకు సహా, ఐదు బ్యాంకుల విలీనంలో ఖారా ప్రధాన పాత్ర పోషించారు. -
అత్తింటి వేధింపులతో అల్లుడు మృతి
మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని మందమర్రి రైల్వేలైన్‌పై ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ సంపత్ తెలిపారు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్ (29)కు మూడేళ్ల క్రితం జైపూర్ మండలం ఇందారానికి చెందిన అమలతో పెళ్లయ్యింది. ఆ సమయంలో సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని అమ్మాయి కుటుంబం చెప్పింది. ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం పెట్టించలేదు. పైగా అత్తగారింట్లో ఎవరూ మర్యాద ఇవ్వకపోవడంతో అమల, దినేష్ మధ్య తగాదాలు మొదలయ్యాయి. దినేష్ సీసీసీలోని షిర్కే క్వార్టర్స్‌లో ఉంటూ జైపూర్ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్ వద్ద స్కిల్డ్‌వెల్డర్‌గా పని చేస్తున్నాడు. వారం క్రితం అమల దినేష్‌తో గొడువ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం దినేష్ రైలుపట్టాలపై మృతి చెంది ఉన్నాడు. దినేష్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, దినేష్ మృతికి ఆయన భార్య, అత్తమామలే కారణమని మృతుడి కుటుంబం ఆరోపిస్తోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. -
ప్రాణం మీదకు తెచ్చిన టిక్‌టాక్
భీమ్‌గల్: టిక్‌టాక్ మోజు ఆ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం గోన్‌గొప్పుల్ గ్రామ శివారులో గల కప్పలవాగు పొంగిపొర్లుతోంది. చెక్‌డ్యాం నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిని చూసేందుకు గ్రామానికి చెందిన ఇంద్రపురం దినేశ్ (22) ఇద్దరు స్నేహితులు గంగాజలం, మనోజ్‌గౌడ్‌తో కలసి శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. ముగ్గురు వరద నీటిలోకి దిగి టిక్‌టాక్ వీడియోలు తీసుకున్నారు. అనంతరం చేపలు పట్టారు.తర్వాత ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో స్నేహితులు నీటిలో కొట్టుకుపోసాగారు. ఒడ్డున ఉన్నవారు గమనించి చీరలను విసరడంతో మనోజ్, గంగాజలంను తీసుకొని బయటకు వచ్చాడు. వరదకు ఎదురీదుతూ వాగు మధ్యలోకి వెళ్లిన దినేశ్ గల్లంతయ్యాడు. అతడి కోసం అధికార యంత్రాంగం 24 గంటల నుంచి గాలిస్తున్నా ఆచూకీ దొరకలేదు. ఇంద్రపురం చిన్న గంగారం, లక్ష్మి దంపతుల ఇద్దరు కుమారుల్లో పెద్దవాడైన దినేశ్ బతుకుదెరువు కోసం దుబాయ్‌కు వెళ్లి 3 నెలల క్రితం తిరిగి వచ్చాడు. నెలరోజుల్లో దుబాయ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘోరం జరిగిపోయింది. -
క్వార్టర్స్‌లో దినేశ్
న్యూఢిల్లీ: గీబీ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్ దినేశ్ డాగర్ శుభారంభం చేశాడు. ఫిన్లాండ్లో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల 69 కేజీల విభాగం తొలి రౌండ్లో దినేశ్ 3–2తో 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఎవాల్డస్ పెట్రాస్కాస్ (లిథువేనియా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 64 కేజీల విభాగంలో అంకిత్ ఖటానా 0–5తో ల్యూక్ మెక్కార్మక్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయాడు. సుమీత్ సాంగ్వాన్ (91 కేజీలు), గోవింద్ సాహ్ని (49 కేజీలు)లకు నేరుగా సెమీఫైనల్లోకి ‘బై’ లభించడంతో కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి.ఈ టోర్నీలో 15 దేశాల నుంచి 100 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు. -
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
-
చిన్నారి కలను నిజం చేసిన సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఒక చిన్నారి చిత్రకారుడిని స్ఫూర్తినిస్తూ ప్రోత్సహించారు. విద్యార్థులకు, ప్రతిభావంతులకు సాయం చేయడంలోనూ, ప్రోత్సహించడంలోనూ నటుడు సూర్య ముందుంటారు. తాజాగా ఒక చిన్నారి చిత్రకారుడి కలను నిజం చేస్తూ అతనిలో మరింత స్ఫూర్తిని నింపారు. వివరాలు చూస్తే.. తేని గ్రామానికి చెందిన దినేశ్ అనే బాలుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. తన సమస్యను జయించి మంచి చిత్రకారుడిగా రాణిస్తున్నాడు. చాలా మందికి స్ఫూర్తిగా నిలిచిన కుర్రాడికి నటుడు సూర్యను కలవాలన్నది చిరకాల కల అట. ఇదే విషయాన్ని దినేశ్ ఒక టీవీ చానల్ భేటీలో పేర్కొన్నాడు. అది సూర్య అభిమానుల దృష్టికి రాగా వారు దినేశ్‌ను తన కుటుంబసభ్యులు సహా బుధవారం చెన్నైలోని సూర్య ఇంటికి ఆయన ఆదేశాల మేరకు తీసుకొచ్చారు. దినేశ్ లక్కేమిటంటే తను నటుడు సూర్యను కలవాలని కలలు కన్నాడు. ఇప్పుడు ఏకంగా సూర్యతో పాటు ఆయన సోదరుడు కార్తీ, వారి తండ్రి సీనియర్ నటుడు శివకుమార్లను ఒకే చోట చూసే అవకాశం కలిగింది. ఈ సందర్భంగా నటుడు సూర్య ఆ కుర్రాడికి కలలు కను. వాటిని సాధిస్తాననే నమ్మకం కలిగుండాలి. ఇప్పుడు నన్ను కలవాలని కలలు కన్నావు. అది నెరవేరిందిగా అంటూ దినేశ్లో స్ఫూర్తిని నింపారు. అంతే కాదు అతనికి పలు కానుకలు అందించారు. -
‘లాభం’ చూపించి లూటీ చేశారు!
సాక్షి, హైదరాబాద్: ఫారిన్ ట్రేడింగ్ పేరుతో ప్రక టనలు గుప్పించాడు. ఆకర్షితులైన వారు పెట్టిన పెట్టుబడులు, ‘లాభాలు’చూపించడానికి ఓ వెబ్సైట్ సృష్టించాడు. ఈ హంగామాతో నగరానికి చెందిన వైద్యుడు కొంత పెట్టుబడి పెట్టి వారంలోనే ‘లాభం’ పొందాడు. రెండోసారి ఏకంగా రూ.1.5 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తం కాజేసి టోకరా వేసిన నిందితుడిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు గురువా రం సూరత్‌లో పట్టుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, నగరానికి చెందిన వైద్యుడు దినేశ్‌ను వాట్సాప్‌లో వచ్చిన ఓ ప్రకటన ఆకర్షించింది. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఉన్న తమ సంస్థ ద్వారా ఫారిన్ ట్రేడింగ్ చేయడానికి ఆసక్తి ఉన్న వారు సంప్రదించాలంటూ ఫోన్ నంబర్ కూడా ఉంది. వారంలోనే రూ.10 లక్షలిచ్చాడు... దీనికి ఆకర్షితుడైన దినేశ్ ఆ ప్రకటనలో ఉన్న నంబర్‌కు సంప్రదించాడు. ముంబైకి చెందిన అలీ షేక్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి మాట్లాడాడు. తమ వద్ద పెట్టుబడి పెడితే అంతర్జాతీయ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతామని, డాలర్, యూరోల విలువతో పాటే ఇది పెరుగుతుందం టూ నమ్మబలికాడు. దినేశ్ తొలుత రూ.50 లక్ష లు పెట్టుబడి పెట్టాడు. ఫారెక్స్ ట్రేడింగ్ పేరుతో ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించిన అలీ షేక్... వైద్యుడి పేరుతో ఖాతా తెరిచాడు. రూ.50 లక్షలు ఫారెన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టినట్లు, దాని విలువ డాలర్, యూరో విలువతో పాటే మారుతున్నట్లు చూపించాడు. అలాగే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ను వైద్యుడికి ఇచ్చి చూసుకునే అవకాశం ఇచ్చాడు. పెట్టుబడి పెట్టిన వారంలోనే 10లక్షలు లాభం వచ్చినట్లు వెబ్‌సైట్‌లోని ఖాతా ద్వారా వైద్యుడికి తెలిసేలా చేశాడు. ఇది చూసిన దినేశ్ ఆ మొత్తం తనకు బదిలీ చేయాలని కోరడంతో అలీ షేక్ మొత్తం రూ.60లక్షలూ దినేశ్‌కు పంపాడు. ఈసారి రూ.కోటిన్నర పెట్టుబడి... వారంలో రూ.10లక్షలు లాభం రావడంతో వైద్యుడు అలీ మాయలో పూర్తిగా పడిపోయాడు. ఇది నిర్ధారించుకున్న అలీ అసలు కథ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ మార్కెట్ లాభాల బాటలో ఉందని, ఈసారి మరింత లాభం వచ్చే అవకాశం ఉందంటూ ఎర వేశాడు. తన వద్ద ఉన్న డబ్బుతో పాటు స్నేహితుల నుంచి తీసుకున్నది కలిపి మొత్తం రూ.1.5కోట్లు దినేశ్ పెట్టుబడిగా పెట్టా డు. డబ్బు కోసం దినేశ్ ఎంతగా ప్రయత్నించినా అలీ నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో మోసపోయానని గుర్తించి సీసీఎస్ పోలీసుల్ని ఆశ్రయించడంతో కేసు నమోదైంది. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు ఈ మోసానికి పాల్పడింది అలీ షేక్‌గా చెప్పుకున్న అమీర్ ఆరిఫ్ అగాడీగా తేల్చారు. అతడు ఉండేది ముంబై కాదని, గుజరాత్‌లోని సూరత్ అని నిర్ధారించారు. దీంతో అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం నిందితుడిని అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారంట్‌పై సిటీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. -
‘అణు ఇంధన అవసరాలు తీర్చేందుకు సిద్ధం’
సాక్షి, హైదరాబాద్ : దేశ అణు విద్యుత్తు ఇంధన అవసరాలను తీర్చే దిశగా న్యూక్లియర్ ఫ్యుయెల్ కాంప్లెక్స్ (ఎన్ఎఫ్సీ) విస్తరణ కార్యకలాపాలు చేపట్టిందని సంస్థ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ దినేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ఇంధన బండిల్ తయారై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్ఎఫ్సీలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2030 నాటికల్లా దేశంలోని అన్ని అణువిద్యుత్తు రియాక్టర్లకు యేటా మూడు వేల టన్నుల ఇంధనం అవసరమవుతుందన్నారు. హైదరాబాద్ కేంద్రంలో గత ఏడాది రికార్డు స్థాయిలో 1,200 టన్నులకు పైగా ఇంధన బండిళ్లను తయారు చేశామని.. రాజస్తాన్‌లోని కోటాలో ఏర్పాటవుతున్న కొత్త కేంద్రం ద్వారా వెయ్యి నుంచి రెండు వేల టన్నుల ఇంధనం ఉత్పత్తి కావచ్చునని వివరించారు. ఎన్ఎఫ్సీ 2017–18 నుండి పూర్తి స్వదేశీ సాంకేతికతతో ముడి ఖనిజాన్ని శుద్ధి చేసి ఇంధన కడ్డీలను తయారు చేస్తోందన్నారు. -
మందు బాబు, పోలీసుల స్ట్రీట్‌ఫైట్
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మోతాదుకు మించి మద్యం సేవించిన ఓ యువకుడు హల్ చల్ చేసాడు. తాగడమే కాకుండా కారు సీజ్ చేసినందుకు అతగాడు ట్రాఫిక్ పోలీసులపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే... వాహనాల తనిఖీల్లో భాగంగా దినేష్ పటేల్ అనే యువకుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 194 ఆల్కహాలు పర్సంటేజ్ రావడంతో కేసు బుక్ చేశారు. అయితే తన వాహనాన్ని సీజ్ చేయడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై దాడి చేశారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఆ మందుబాబుపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ ...యువకుడితో పాటు, కానిస్టేబుల్స్‌ను వారించి ...మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇక నగరంలో మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతూ 40 మంది పోలీసులకు చిక్కారు. 20 కార్లు, 25 బైకులను సీజ్ చేశారు పోలీసులు..పట్టుబడిన వారందరినీ కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
హార్ధిక్ టేపుల్లో ఒకటే మార్ఫింగ్.. మిగతావీ..?
అహ్మదాబాద్: పోలింగ్‌కు ముందు పటేదార్ అనామత్ అందోళన్ సమితి (పీఏఏఎస్)కు రాజీనామ చేసి షాక్ ఇచ్చిన దినేశ్ బంభూనియా మరో బాంబ్ పేల్చారు. హార్ధిక్‌ను పటీదార్లంతా ఓ ఐకాన్‌గా చూస్తున్నారని, అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ అతనిపై సెక్సు టేప్‌లు రావడం కలిచివేసిందన్నారు. తొలుత వచ్చిన సెక్సు టేపు మార్ఫింగ్ అయితే తరువాత వచ్చిన సీడీల మాటేమిటని ప్రశ్నించారు. ఈ విషయమే నన్ను చాలా బాధపెట్టిందని దినేశ్ బంభూనియా పేర్కొన్నారు. ఓ కమ్యూనిటీ లీడర్‌గా ఉన్న వ్యక్తిపై ఇలాంటివి రావడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. హార్ధిక్ కాంగ్రెస్ జెండా మోస్తున్నాడని, అధికారంలోకి వస్తే పటీదార్లకు రిజర్వేషన్ కల్పిస్తానని కాంగ్రెస్ హామి ఇవ్వలేదని, అయినా హార్ధిక్ కాంగ్రెస్‌కు ఎందుకు మద్దతు ఇస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. హార్ధిక్ కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని దినేశ్ ఆరోపించారు. పటీదార్లు ఉద్యమ లక్ష్యం కోసం ఓటేయాలని దినేశ్ పిలుపునిచ్చారు. సరిగ్గా పోలింగ్ ఒక రోజు ముందు హార్ధిక్‌పై అత్యంత సన్నిహితుడైన దినేశ్ ఆరోపణలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
పెళ్లి కాని యువతుల కథ
‘‘జీవితంలో మరచిపోలేని, మధురమైన రోజు పెళ్లిరోజు. పెళ్లికాని ముగ్గురు యువతులు పెళ్లిరోజు కోసం ఎలాంటి కలలు కన్నారు? వాటిని ఎలా సాకారం చేసుకున్నారు? అనే కథతో ఈ సినిమా తీశాం’’ అన్నారు దర్శకుడు నెల్సన్ వెంకటేశన్. దినేశ్, మియా జార్జ్, రిత్విక, నివేథా పెతురాజ్ ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో సురేష్ బల్లా, మృదుల మంగిశెట్టి నిర్మించిన చిత్రం ‘పెళ్లి రోజు’. ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘‘మా చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు కృషి చేసిన ప్రవీణ్ కుమార్‌కి కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: వెన్నెలకంటి, భువనచంద్ర, డా. చల్లా భాగ్యలక్ష్మి, సహనిర్మాత: జె.వినయ్. -
ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్య
-
ముఖానికి కవర్ చుట్టుకుని ఆత్మహత్య
హైదరాబాద్: నగర శివారులో పార్క్ చేసి ఉన్న కారులో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ముఖానికి ప్లాస్టిక్ కవర్ బిగించుకుని.. ఆపై కారులోని గ్యాస్ లీక్ చేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ మలేషియా టౌన్షిప్ సమీపంలో శనివారం వెలుగుచూసింది. పార్క్ చేసి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన దినేష్‌గా గుర్తించిన పోలీసులు అతని వద్ద నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమవడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెడ్ జెయిన్ మూవీస్ ఖాతాలో ఒరు కుప్పై కథై
తమిళసినిమా: ఒరు కుప్పై కథై చిత్రాన్ని రెడ్జెయిన్ మూవీస్ సంస్థ ద్వారా నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ విడుదల చేయనున్నారు. కోలీవుడ్‌లోని ప్రముఖ నృత్యదర్శకుల్లో ఒకరైన దినేశ్ ప్రముఖ కథానాయకులందరి చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆయనిప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఒరుకుప్పై కథై. ఆయనకు జంటగా మనీషాయాదవ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అస్లామ్ ఫిలింమ్ బాక్స్ పతాకంపై నిర్మించారు. తన శిష్యుడు కాళీ రంగస్వామిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం విశేషం. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒరు కుప్పై కథై బడుగు వర్గాల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్ చూసి ఇదో చిత్రమా అనుకునే వారు థియేటర్లో చిత్రం చూస్తున్నప్పుడు రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారన్నారు. చిత్రం రెడీగా ఉంది చూస్తారా అన్న మైనా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలా చేసిన ఉదయనిధిస్టాలిన్ ఈ ఒరుకుప్పై కథై చిత్రాన్ని చూస్తారా? అన్న సందేహంతోనే అడిగామన్నారు. చిత్రం చూపిన ఆయన ఇలాంటి చిత్రాల రాక చాలా అవసరం అని వెంటనే తన సంస్థ ద్వారా విడుదల చేయడానికి అంగీకరించారన్నారు. కథానాయకుడు దినేశ్ నటన బాగుందంటూ ప్రశంసించారని అన్నారు. ఇటీవల తాను నటించిన చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఉదయనిధిస్టాలిన్ తమ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. -
యువీ అవుట్.. దినేశ్ ఇన్
♦ అశ్విన్, భువీకి విశ్రాంతి. ♦ షమీ, జడేజాలకు అవకాశం నార్త్ సౌండ్: భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న నాలుగో వన్డేకు భారత జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గత మ్యాచ్ విజయానంతరం మిగతా ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తామన్న కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యలను నిజం చేస్తూ జట్టులో మార్పులు చేశారు. గత కొద్దీ రోజులుగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న సీనియర్ ఆటగాడు యువరాజ్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించినా చేతి వ్రేలి గాయంతో బాధపడుతున్న యువీని బెంచీకే పరిమితం చేశారు. ఇక యువీ స్థానంలో దినేష్ కార్తీక్ రాగా అశ్విన్ స్థానంలో జడేజాకు అవకాశం కల్పించారు. ఇక 2015 వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ వన్డేలకు దూరమైన మహ్మాద్ షమీకి ఎట్టకేలకు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించింది. పేస్ బౌలర్ భువనేశ్వర్‌కు విశ్రాంతి ఇచ్చి షమీకి స్థానం కల్పించారు. అయితే షమీ గత చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైనా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక యువకెరటం రిషబ్ పంత్‌కు మళ్లీ నిరాశే మిగిలింది. యువీ స్థానంలో పంత్‌ను ఎంపిక చేస్తారని అందరూ భావించినా కోహ్లీ కార్తీక్‌వైపే మొగ్గు చూపాడు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
పెనుకొండ/ హిందూపురం రూరల్ : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒకరు విద్యార్థి కాగా.. మరొకరు కర్ణాటకకు చెందిన యువకుడు ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి. రొద్దం మండలం తురకలాపట్నానికి చెందిన బోయ దినేష్ (17) జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం మహేష్ అనే కెమిస్ట్రీ లెక్చరర్ తనకు ఎంతగానో ఆప్తుడైన విద్యార్థి దినేష్‌తో కలిసి పాతచెక్‌పోస్టు సమీపంలో గల ఓ హోటల్‌కు ద్విచక్రవాహనంలో వెళ్లారు. భోజనం ముగించుకుని కళాశాల వద్దకు బయలు దేరగా రోడ్డుపైకి చేరుకునే సమయంలో అనంతపురం నుంచి పెనుకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో దినేష్ తీవ్రంగా గాయపడగా.. మహేష్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మహేష్‌ను పెనుకొండ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లిదండ్రులు తిమ్మయ్య, శారద, ఇతర బంధువుల రోదనలు ఆస్పత్రి ప్రాంగణం మిన్నంటింది. అధ్యాపకులు, విద్యార్థులు కూడా ఆస్పత్రికి వచ్చి దినేష్‌ను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్ఐ లింగణ్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. హిందూపురం రూరల్ మండలం కిరికెర సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకలోని గౌరిబిదనూరు తాలుకా బసవపురం గ్రామానికి చెందిన మురళి (32) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో శ్రీనివాసులు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని హిందూపురంలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ నారాయణ శుక్రవారం తెలిపారు. -
మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తించాలి
ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ రంపచోడవరం : వ్యవసాయం, అనుబంధ రంగాల సమన్వయంతో పురోగతి సాధించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ తెలిపారు. వ్యవసాయ, అనుబంధ శాఖలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మండలస్థాయిలో అదనపు నీటి లభ్యతను గుర్తిస్తే ఎక్కువ విస్తీర్ణంలో సాగుకు వీలు కలుగుతుందన్నారు. రైతులను భూసార పరీక్షలు చేయించి సూక్ష్మ పోషకాలందించి అధిక దిగుబడిని సాధించేలా చైతన్యం చేయాలన్నారు. ఏజెన్సీలోని చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు చేయించి పూర్తిగా వినియోగంలోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మధ్య తరహా నీటి ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు స్థిరీకరణ అవకాశాలను మెరుగుపర్చాలన్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ రాబర్ట్‌పాల్, శ్రీనివాస్‌రెడ్డి , ఏపీడీ వై శంకర్‌నాయక్, పీహెచ్ఓ బి.శ్రీనివాసులు, ఈఈ వెంకటేశ్వర్లు, మైక్రో ఇరిగేషన్ పీడీ సుబ్బారావు, కేవీకే కో ఆర్డినేటర్ శ్రీనివాసు, పీఏఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. కాగా నోడల్ ఏజెన్సీలో ఉన్న పెండింగ్ సమస్యలను గిరిజన సబ్‌ప్లాన్‌లో పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు ఎన్.స్టాలిన్‌బాబు పీవో దినేష్‌కుమార్‌ను కోరారు. టీఎస్పీ కింద గిరిజనాభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం 2017–24 వరకు గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం టీఎస్పీ కింద రాష్ట్రంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని పీవో దినేష్‌కుమార్ చెప్పారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో టీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి నాబార్డు కన్సల్టెన్సీ ప్రతినిధులు బుధవారం సంప్రదింపులు జరిపినట్లు పీవో తెలిపారు. -
కవలల అనుమానాస్పద మృతి
బీబీపేట: ఏడాదిన్నర వయసున్న కవల పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బీబీపేట మండల కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న దినేష్, జినేష్ అనే కవలపిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. -
కళాశాల భవనం పైనుంచి పడి బీటెక్ విద్యార్థి మృతి
ఘట్కేసర్: ఇంజినీరింగ్ కళాశాలపై నుంచి పడి బీటెక్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన ఘట్కేసర్లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. కళాశాలలో రెండో సంవత్సరం(మెకానికల్) చదువుతున్న దినేష్(19) భవనం పై నుంచి పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ప్రమాదవశాత్తు పడ్డాడా అనే కోణంలో దృష్టి సారించారు. దినేష్ నగరంలోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే..
న్యూఢిల్లీః నియోజకవర్గంలో నీటి సమస్యపై మాట్టాడేందుకు వచ్చిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే దినేష్ మొహానియా ఆరోపణలు ఎదుర్కొటున్నారు. స్థానిక నీటి సమస్యపై ఎమ్మెల్యేకు వివరించేందుకు కొద్ది రోజులుగా ఆయన ఆఫీస్ కు వెడుతున్న ఓ మహిళ... సదరు ఎమ్మెల్యే.. తనతోపాటు వచ్చిన మహిళలను సైతం నెట్టివేసి, అవమానించారని పేర్కొంది. మొహానియాపై కేసు నమోదు చేసి, ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ సంగమ్ విహార్ నియోజకవర్గం ఆప్ ఎమ్మెల్యే దినేష్ మొహానియా మహిళలతో ఆసభ్యంగా ప్రవర్తించారంటూ ఆయనపై కేసు నమోదైంది. తాను నీటి సమస్యపై మాట్లాడేందుకు తరచుగా ఆయన కార్యాలయానికి వెడుతున్నానని, అయినప్పటికీ కనీసం గుర్తు కూడ పట్టనట్లుగా చేసిన మొహానియా తనపై అసభ్యంగా ప్రవర్తించారని, తనతోపాటు వచ్చిన వారిని కూడ అక్కడినుంచీ నెట్టివేశారని ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. నియోజకవర్గ ప్రజలన్న కనీస మర్యాదకూడ లేకుండా మొహానియా మహిళలపై దురుసుగా, అసభ్యంగా ప్రవర్తించడం అన్యాయమని, ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని సదరు మహిళ పోలీసులను డిమాండ్ చేసింది. మొహానియా కార్యాలయానికి వచ్చిన మహిళలందరినీ ఆయన బయటకు గెంటి అవమానించారని, అయితే తాము కూడ అదేతీరులో ప్రవర్తించాల్సి వచ్చిందని, కొడుతుంటే చేతులు కట్టుకొని కూర్చునేవారు ఎవరుంటారంటూ బాధితురాలు ప్రశ్నించింది? మొహానియా ప్రవర్తనపై విచారించి, ఆయన్ను వెంటనే ఆరెస్టు చేయడంతోపాటు, తమ ప్రాంతంలోని నీటి సమస్యపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వాపోయింది. -
సెల్ఫీ మోజులో యువకుడు దుర్మరణం
చెన్నై: వేగంగా వస్తున్న రైలు ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించిన ఓ 16 ఏళ్ల యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన చెన్నై శివారులోని వందలూరు సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై జరిగింది. ఆదివారం సాయంత్రం తన స్నేహితుడితో కలసి వాకింగ్ వెళ్లిన దినేష్ అనే యువకుడు.. వేగంగా వస్తున్న సబర్బన్ ట్రైన్ ముందు పరిగెత్తుతూ సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో రైలు కింద పడి మరణించాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ నిమిత్తం తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఇటీవల ముంబై దగ్గర అరేబియా మహా సముద్రంలో సెల్ఫీ తీసుకునే క్రమంలో నీటిలో పడిపోయిన యువతిని కాపాడే క్రమంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. -
నిర్మాణ రంగంలోనూ హీరో హవా..!
హీరోగానే కాదు నిర్మాణ రంగంలోనూ హవా చూపిస్తున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్. ఇప్పటికే సందేశాత్మకంగా తెరకెక్కిన 'కాకముట్టై' సినిమాతో జాతీయ అవార్డ్ సాదించిన ధనుష్, ప్రస్తుతం కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. తన బ్యానర్ పై రూపొందిన రెండు సినిమాలను భారీ మొత్తానికి అమ్మేసి నిర్మాతగా కూడా తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. ధనుష్ నిర్మాణంలో విజయ్ సేతుపతి హీరోగా 'నానుమ్ రౌడీదాన్' తో పాటు, దినేష్ హీరోగా 'విసారనయ్' సినిమాలు రూపొందుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాలను లైకా గ్రూప్ భారీ మొత్తానికి చేజిక్కించుకుంది. ఈ సంస్థ ద్వారానే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే బిజినెస్ పూర్తి చేసేయటంతో నిర్మాతగా ధనుష్ ఫుల్ సేఫ్. నిర్మాతగానే కాదు హీరోగా కూడా ఇదే స్పీడు చూపిస్తున్నాడు ధనుష్. ఈ తమిళ నటుడి చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. ప్రభు సోలోమాన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ధనుష్, ఆ సినిమా పూర్తవ్వగానే ఆర్. ఎస్ దురై సెంథిల్ కుమార్ సినిమాతో పాటు వెట్రిమారన్ డైరెక్షన్లో వడాచెన్నై సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. -
గొంతునులిమి...గోళ్లతో రక్కి...
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రేమించిన యువతి లైంగికంగా లొంగలేదనే కారణంతోనే అరుణ ను దినేష్ హతమార్చినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చెన్నై తలమై శయలగం కాలనీకి చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిదినేష్ చూలైకి చెందిన తన ప్రేయసి అరుణను సోమవారంరాత్రి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. అరుణ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తిచేసి మంగళవారం సాయంత్రం అప్పగించారు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి శనివారం జల్సాలు చేస్తూ ఇంటికి కూడా రాకుండా స్నేహితులతో గడిపే అలవాటున్న దినేష్ చర్యలను తల్లిదండ్రులు సైతం అనుమానించలేదు, ఏనాడు ప్రశ్నించలేదు. దినేష్ స్నేహితులంతా అరుణ ఇంటి పరిసరాల్లోని ఉండడం, చిన్ననాటి నుంచి కలిసి చదవడం మూలాన వారిద్దరిలో ప్రేమ చిగురించింది. అరుణను ఏకాంతంగా కలుసుకునే అవకాశం కోసం ఎదురుచూస్తున్న దినేష్, తన తండ్రి ఆస్పత్రిలో అడ్మిట్ కావడం, తల్లి, సోదరి ఆయనకు తోడుగా ఉండడంతో, ఇల్లు ఖాళీగా ఉండటాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం ఉదయమే అరుణను ఇంటికి పిలిపించుకున్న దినేష్ ఆమె పట్ల అనుచితంగా వ్యవహరించాడు. దీంతో కోపగించుకున్న అరుణపై ఆగ్రహంతో ఊగిపోయాడు. గొంతు నులిమాడు, పక్కనే పూలతొట్టితో కొట్టాడు. అద్దాలను పగులగొట్టి విచక్షణా రహితంగా పొడిచాడు. దినేష్ నుంచి ప్రాణాలతో బయటపడాలని ప్రయత్నించినట్లుగా ఆమె ముఖంపై అనేక ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. తప్పించుకో జూసిన అరుణను పట్టుకునే ప్రయత్నంలో ఆమె ముఖమంతా దినేష్ గోళ్లతో రక్కినట్లుగా తేలింది. దినేష్ ఆచూకీ కోసం 4 బృందాలు అరుణను హతమార్చి పరారైన నిందితుడు దినేష్‌ను పట్టుకునేందుకు నాలుగు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. హత్యచేయగానే దినేష్ తల్లిదండ్రులను కలుసుకుని తన సెల్‌ఫోన్‌ను వారికి ఇచ్చివెళ్లాడు. పరారీలో తన తెలివితేటలను వినియోగించి సెల్‌ఫోన్ లేకుండా జాగ్రత్తపడటం వల్ల దినేష్ ఆచూకీ కనుగొనడం కష్టంగా మారింది. దినేష్ ఫోన్‌కు పోలీసులు ఫోన్ చేయడం వల్లనే తమ కుమారుని కోసం వెతుకుతున్నారని కన్నవారు తెలుసుకుని కృంగిపోయారు. దినేష్ స్నేహితులు, బంధువులు ఎవ్వరూ తమకు తెలియదని చెప్పడంతో గాలింపును తీవ్రతరం చేశారు. 24 గంటల్లోగా దినేష్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి
రాప్తాడు (అనంతపురం): అనంతపురం జిల్లా రాప్తాడులో జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం తల్లి కొడుకులు మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో తల్లి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. రాప్తాడు మండలంలోని హంపాపురం గ్రామానికి చెందిన లక్ష్మీ నారయణమ్మ(35), తన కుమారుడు దినేశ్(15)తో కలిసి ద్విచక్రవాహనంపై పొలానికి వెళుతుండగా, బెంగుళూరు వైపు వెళ్లే కారు వీరిని ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలైన బాధితులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాలను అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేయసి మృతితో ప్రియుడి ఆత్మహత్య
తిరుపతిక్రైం: ప్రియురాలు మృతి చెందడంతో మనస్తాపానికి గురైన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన సోమవారం తిరుపతి ఇం దిరానగర్లో చోటు చేసుకుంది. వెస్ట్ సీఐ అం జూయాదవ్ కథనం మేరకు.. సరళ సులభ్లో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు. భర్త లేకపోవడంతో ఈమె పిల్లలను అల్లారుముద్దుగా పెంచింది. కొడుకు దినేష్(18) కొంతకాలంగా అక్క కూతురు శ్రీలత ను ప్రేమిస్తున్నాడు. ఏమైందో ఏమో కానీ వీరి మ ద్య నెల నుంచి మాటలు లేవు. ఈ నేపథ్యంలో 5వ తేదీన చెన్నైలో శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. దినేష్ హుటాహుటిన తల్లి, తన చెల్లితో పాటు చెన్నై వెళ్లాడు. అక్కడ శ్రీలత అంత్యక్రియలు పూర్తిచేసుకుని తిరిగి తిరుపతికి ఆదివా రం రాత్రి చేరుకున్నారు. తన చావుకు ఎవరూ కారణం కాదని, శ్రీలత లేని జీవితం వ్యర్థం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. స్కూల్ నుంచి వచ్చిన చెల్లెలు చూసి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. అప్పటికే దినేష్ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని రుయా మెడికల్ కళాశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'ఇక ఆట నాదే' ఆడియో ఆవిష్కరణ
-
రివెంజ్ కూడా రొమాంటిక్‌గా...
రీచాడే, అనూషా, భారతి, దినేష్, జాన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇక ఆట నాదే’. ‘రొమాంటిక్ రివైంజ్’ అనేది ఉపశీర్షిక. సత్తి దర్శకుడు. డి.కిశోర్‌బాబు నిర్మాత. కేకే 7 స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఖయ్యూం ఆడియో సీడీని ఆవిష్కరించి, మనోజ్‌నందం, అంజి శ్రీనుకి అందించారు. యువతను లక్ష్యంగా చేసుకొని రూపొందిన సినిమా ఇదనీ, డిసెంబర్ తొలివారంలో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని దర్శకుడు ఆనందం వెలిబుచ్చారు. ఇందులో ప్రతి పాటా డిఫరెంట్‌గా ఉంటుందని సంగీత దర్శకుడు చెప్పారు. -
చిన్నారి హత్య: మహిళ అరెస్ట్
వేలూరు: వివాహేతర సంబంధం ప్రియుడి భార్యకు తెలిసిపోవడంతో కక్ష తీర్చుకునేందుకు ఆమె కొడుకుని ఓ మహిళ హత్య చేసింది. ఈ సంఘటన వేలూరులో చోటుచేసుకుంది. వేలూరు కొత్త బస్టాండ్ సమీపంలోని ముత్తు మండపం ప్రాంతానికి చెందిన మురళి. ఇతనికి ముగ్గురు పిల్లలున్నారు. రెండవ కుమారుడు దినేష్(3) శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆటలాడుతూ కనిపించకపోవడంతో వేలూరు నార్త్ పోలీసులకు మురళి ఫిర్యాదు చేశాడు. పోలీసులు ముత్తుమండపం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. పోలీసులను చూసిన వెంటనే మురళి ఇంటి ముందు నివశిస్తున్న పెయింటర్ ప్రభు భార్య సుమతి ఇంటికి తాళం వేసి బయట వచ్చి కూర్చుంది. అనుమానించిన పోలీసులు సుమతి వద్ద విచారణ జరపగా పొంతన లేకుండా సమాధానాలు చెప్పింది. అనుమానం వచ్చిన పోలీసులు ఆమె ఇంటి తాళాలు పగులగొట్టి ఇంటిలో గాలించారు. బీరువాను పగలగొట్టి చూడగా అందులో చిన్నారి నోటిలో గుడ్డలు పెట్టి కాళ్లు,చేతులు కట్టి ఉండడాన్ని గుర్తించారు. పోలీసులు సుమతిని అరెస్ట్ చేసి బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. పోలీసుల విచారణలో చిన్నారి తండ్రి మురళీకి, తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. ఈ విషయం మురళి భార్యకు తెలిసి పోవడంతో ఆమె తనతో ఇటీవల ఘర్షణ పడిందని పోలీసులకు చెప్పింది. ఆమె మీద కక్ష తీర్చుకోవడం కోసం వీధిలో ఆటలాడుకుంటున్న దినేష్‌ను ఇంటిలోకి తీసుకెళ్లి నోటిలో గుడ్డ పెట్టి కాళ్లు, చేతులు కట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశానని, ఎవరికీ తెలియకుండా ఉండేందుకు మృతదేహాన్ని బీరువాలో పెట్టినట్లు నేరాన్ని అంగీకరించింది. కేసు దర్యాప్తులో ఉంది. -
మనీషాకు మరో అవకాశం
వళక్కుయన్ 18/9 చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి మనీషా యాదవ్. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వరించాయి. జన్నల్ ఓరం, ఆదరాల్ కాదల్ సెయ్‌వీర్ వంటి విజయవంతమైన చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మనీషా, దర్శకుడు శ్రీనురామస్వామి చిత్రం ఇవళ్ ఇదం పొరుళ్ చిత్రంలో ఎంపికయ్యారు. అయితే ఆ తర్వాత ఆమె నటన సంతృప్తి కలిగించలేదంటూ దర్శకుడు చిత్రం నుంచి తొలగించారు. కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన ఈ సంఘటన మనీషా కెరీర్‌కు కొంచెం నష్టం కలిగించిందనే చెప్పాలి. ఆ తర్వాత అవకాశాలు కూడా ఆమెకు దూరం అయ్యాయి. తాజాగా మనీషాకు మరో అవకాశం వచ్చింది. ప్రముఖ నృత్య దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత దినేష్ హీరోగా అవతారమెత్తనున్నారు. ఆయనతో మనీషా రొమాన్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈ జంట నటించే చిత్రానికి ‘ఒరు కుప్పై కథై’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాళి రంగస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మరో యువ దర్శకుడు అస్లామ్ నిర్మించనుండడం విశేషం. మరో ముఖ్య అంశం ఏమిటంటే కాదల్ చిత్రం ఫేమ్ జాష్వా శ్రీధర్ ఈ చిత్రానికి సంగీత బాణీలు కట్టడం. ఈయన కొంత కాలంగా తమిళ చిత్రాలకు పని చేయడం లేదు. ఒరు కుప్పై కైథైవైవిద్య భరిత కుటుంబ కథ చిత్రంగా ఉంటుందని చిత్ర దర్శకుడు కాళి రంగస్వామి తెలిపారు. దినేష్ చిత్రంలో చెన్నైకు చెందిన ఒక నిస్సహాయకుడైన యువకుడిగా నటిస్తున్నారని, మనీషా పల్లెటూరి పడుచుగా నటిస్తున్నారని చెప్పారు. -
బాపట్ల బీచ్‌లో జిల్లా విద్యార్థి మృతి
మరొకరి గల్లంతు వారి స్వగ్రామం కేసరపల్లి శివారు దుర్గాపురం శోకసంద్రంలో కుటుంబసభ్యులు గన్నవరం/బాపట్ల, న్యూస్‌లైన్ : మండలంలోని కేసరపల్లి శివారు దుర్గాపురం కాలనీకి చెందిన ఇద్దరు విద్యార్థులు గుంటూరు జిల్లా బాపట్లకు సముద్ర స్నానం కోసం వెళ్లి గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభించగా, మరొకరి ఆచూకీ తెలియలేదు. దీంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. వివరాలిలా ఉన్నాయి. దుర్గాపురం కాలనీకి చెందిన అసిలేటి రత్నాకర్ కుమారుడైన దినేష్ (14) స్థానిక వీఎస్ సెయింట్‌జాన్స్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గుంటూరు జిల్లా బాపట్లలో జరగనున్న ఓ శుభకార్యానికి తన బాబాయి రమేష్ కుటుంబసభ్యులతో కలసి బుధవారం వెళ్లాడు. తనతో పాటు తన స్నేహితుడైన అదే ప్రాంతానికి ఇంటర్మీడియెట్ విద్యార్థి వీర్ల నాగరాజును కూడా తీసుకెళ్లాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి దినేష్, నాగరాజు సముద్ర స్నానానికి వెళ్లారు. కేరింతలు కొడుతూ స్నానం చేస్తున్న సమయంలో పెద్ద అల తాకిడికి నాగరాజు, దినేష్ సముద్రంలో గల్లంతయ్యారు. దీంతో వారు పెద్దగా కేకలు వేయడంతో పక్కనే స్నానం చేస్తున్న దినేష్ బాబాయి రమేష్ గమనించి వారిని రక్షించేందుకు యత్నించాడు. రెండు చేతులతో వారిని పట్టుకున్నప్పటికీ ఆలల ఉధృ తికి రమేష్ యత్నం విఫలమైంది. వెంటనే తీర ప్రాంతంలోని మత్స్యకారులకు సమాచారం చెప్పడంతో వారితో పాటు, పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న దినేష్, నాగరాజు కుటుంబ సభ్యులు, బంధువులు హుటాహుటిన బాపట్ల బయలుదేరి వెళ్లారు. ఒక్కగానొక్క కుమారుడు... సముద్రంలో గల్లంతైన దినేష్‌కు ఒక సోదరి ఉంది. ఒక్కడే కుమారుడు కావడంతో తల్లిదండ్రులు రత్నాకర్, రామాబాయ్లు అల్లారుముద్దుగా పెంచుతున్నారు. తొమ్మిదో తరగతి పూర్తవడంతో పదో తరగతిలో చేరాల్సి ఉంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తునప్పటికీ కుమారుడిని బాగా చదివిస్తే తమ ఆశలు నెరవేరతాయనుకున్నానని తండ్రి రత్నాకర్ ఆవేదన వ్యక్తంచేశాడు. వేసవి కారణంగా సముద్ర స్నానానికి వెళ్లి వస్తామని చెబితే పంపించామని.. ఇప్పుడు మీ అమ్మకు నీ గురించి ఏమి చెప్పాలంటూ ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. చెట్టంత కొడుకును సముద్రం పాలు చేశా... కూలీనాలీ చేసుకుని కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులమిద్దరం కష్టపడుతున్నాం... చెట్టంత కొడుకును సముద్రంపాలు చేశానంటూ నాగరాజు తండ్రి తిరుపతయ్య విలపించాడు. తిరుపతయ్య, నాగేశ్వరమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నాగరాజు రెండో కుమారుడు. స్నేహితుడితో సముద్రస్నానానికి వెళుతున్నానంటే పంపానంటూ తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మరంగా గాలింపు చర్యలు.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతుకావడంతో పోలీసులు, మత్స్యకారులు సముద్రంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. అడవిపల్లిపాలెం వద్ద సముద్రంలో మునిగిపోయిన నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా చీరాల వైపు ఒక బృందం, సూర్యలంక వైపు మరో బృందం వెళ్లి గాలింపు చర్యలను చేపట్టింది. గాలింపునకు మేకనైజ్డ్ బోట్లు, వలలు ఉపయోగించారు. గురువారం రాత్రి సమయానికి దినేష్ మృతదేహం లభించినట్లు బాపట్ల పోలీసులు తెలిపారు. నాగరాజు ఆచూకీ కోసం మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. తీరని విషాదం... తన కుమారుడు గల్లంతైన విషయం తెలుసుకున్న నాగరాజు తల్లి నాగేశ్వరమ్మ స్వగ్రామంలో సొమ్మసిల్లిపోయింది. తన ముగ్గురు కుమారులలో అల్లారుముద్దుగా పెంచుకున్న నాగరాజు కనిపించడం లేదంటూ భోరున విలపించింది. -
శాండల్‌వుడ్ నటుడు రఘువీర్ కన్నుమూత...
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్(46) మృతిచెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. ‘శృంగార కావ్య’ సినిమాలో తనతో పాటే నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహమాడారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి వచ్చి కావేరీ తీరదల్లి, నవిలూర నైదిల, మౌన సంగ్రామ వంటి సినిమాలు చేసినా అవి నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయన్ను బీటీఎం లేఅవుట్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినా చికిత్స ఫలించక తనువు చాలించారు. సంపంగి రామనగరలోని రఘువీర్ నివాసంలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచారు. నటీనటులు శోభరాజ్, లీలావతి, వినోద్‌రాజ్, కె.మంజు, జగ్గేష్ తదితరులు రఘువీర్ పార్ధివ శరీరానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో రఘువీర్ అంత్యక్రియలు పూర్తిచేశారు. రఘువీర్ కుటుంబానికి రూ1.75లక్షల ధన సహాయాన్ని అందించనున్నట్లు కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది. -
మౌనిక్ మాయాజాలం
కొలంబోలోనే దినేష్ శవాన్ని మాయం చేసేందుకు కుట్ర వెంకటేశంను బంధువుగా చూపించి శవాన్ని స్వాధీనం చేసుకునే యత్నం మార్చురీ వర్గాలు పాస్‌పోర్టు జిరాక్స్ అడగడంతో పారని పాచిక సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ కిడ్నీ ముఠా ఎంతకైనా తెగిస్తుందని మరోసారి స్పష్టమైంది. కిడ్నీ అమ్మేందుకు శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి గుండెపోటుతో మృతి చెందిన కొత్తగూడెం వాసి దినేష్‌కుమార్ (26) మృతదేహం మాయం చేయడానికి కిడ్నీ ముఠా ప్రయత్నం చేసింది. అయితే, మృతదేహాన్ని అప్పగించే సమయంలో ఆసుపత్రి వర్గా లు పాస్ట్‌పోర్టు జిరాక్స్‌లు ఆడగడంతో ఈ కుట్న భగ్నమైంది. ఆరోజు ఏం జరిగింది... గతనెల 28న సాయంత్రం 4 గంటలకు దినేష్ కొలంబో బీచ్‌లో మద్యం, సిగరేట్లు విపరీతంగా తాగాడు. దీంతో గుండెపోటుకు గురై అక్కడికక్కడే చనిపోయాడు. 15 నిముషాలలో మృతదేహం కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మార్చురీకి చేరింది. కిడ్నీ రాకెట్లో సూత్రధారి అయిన అక్కడి డాక్టర్ మౌనిక్ వెంటనే ఈ విషయాన్ని నల్లగొండ చిట్యాలలో ఉన్న కిడ్నీ రాకెట్ ఏజెంట్ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేశం సెల్‌కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే కొలంబోకు వచ్చి దినేష్ మృతదేహం స్వాధీనం చేసుకోవాలని కోరాడు. ఈ విషయాన్ని వెంకటేశం దినేష్ కుటుంబ సభ్యులకుగానీ, ఇతరులకుగానీ తెలియకుండా గోప్యంగా ఉంచాడు. హుటాహుటిన నల్లగొండ నుంచి బయలుదేరి మరుసటి రోజు (29వ తేదీ) మధ్యాహ్నం 12 గంటలకు కొలంబోలోని ఆసుపత్రికి చేరుకొనిమౌనిక్కు ఫోన్ చేశాడు. తాను దూర ప్రాంతంలో ఉన్నానని... రేపు వచ్చి కలుస్తానని మౌనిక్ చెప్పడంతో వెంకటేశం లాడ్జిలో మకాం వేశాడు. మరుసటి రోజు (30న) ఉదయం ఇద్దరూ కలుసుకున్నారు. మృతుడు దినేష్ బంధువునని మార్చురీలోని డాక్టర్లను నమ్మించి మృతదేహం స్వాధీనం చేసుకోవాలని, తర్వాత ఎక్కడో నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి చేతులు దులుపుకోవాలని పన్నాగం పన్నారు. ఇద్దరూ కలిసి మార్చురీకి వెళ్లారు. తాను దినేష్ బంధువునని వెంకటేశం అక్కడి డాక్టర్లకు పరిచయం చేసుకున్నాడు. అతనికి మృతదేహం అప్పగించేందుకు అంగీకరించిన డాక్టర్లు... వెంకటేశం పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలు ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో కంగారుపడ్డ వెంకటేశం, మౌనిక్లు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. విషయం గమనించిన మార్చురీ సిబ్బంది పోలీసుల సహాయం తీసుకుని దినేష్ పాస్‌పోర్టులో ఉన్న అతని సోదరుడు గణేష్ సెల్‌కు అదే రోజు మధ్యాహ్నం సమాచారం అందించడంతో ఏప్రిల్ 3న దినేష్ మృతదేహం కుటుంబ సభ్యులకు అందింది. శవం మాయం చేయాలనే కుట్ర దాగి ఉన్నందునే వె ంకటేశం తన పాస్‌పోర్టు జిరాక్స్ కాపీని అక్కడి మార్చురీ వర్గాలకు ఇవ్వలేదు, అలాగే ఇక్కడి కుటుంబ సభ్యులకు కనీసం సమాచారం కూడా చేరవేయలేదు. విదేశాల్లో చనిపోతే... ఏదైనా దేశంలో విదేశీయుడు చనిపోతే...అతను ఏ దేశస్తుడో తెలుసుకుని ఆ దేశ రాయభార కార్యాలయానికి అధికారులు సమాచారం చేరవేస్తారు. అక్కడి నుంచి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకుగాని, వారుంటున్న ప్రాంత పోలీసులకు గాని సమాచారం చేరుతుంది. ఇదంతా కేవలం నాలుగైదు గంటల్లోనే పూర్తవుతుంది. అయితే దినేష్ మృతి విషయంలో ఇవేమీ జరగలేదు. -
కిడ్నీ రాకెట్లో ముగ్గురి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: కిడ్నీ రాకెట్ లో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. కిడ్నీ విక్రయించేందుకు కొలంబో వెళ్లి మృత్యువాత పడ్డ దినేష్ కేసు దర్యాప్తులో కిడ్నీ రాకెట్ ఉదంతం వెలుగు చూసిందన్నారు. అదనపు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ కమిషనర్ బి.మల్లారెడ్డి, డీసీపీ పాలరాజుతో కలిసి మంగళవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన దినేష్, పశ్చిమగోదావరి జిల్లా కొత్తపల్లికి చెందిన కిరణ్, కాశ్మీర్‌కు చెందిన అరాంజర్గర్లు కిడ్నీ అమ్మేందుకు ఫేస్బుక్, వెబ్సైట్ ద్వారా ప్రశాంత్సేఠ్ను సంప్రదించారు. తరువాత వీరు నల్లగొండ జిల్లా చిట్యాలకు చెందిన వెంకటేశం(ఇతను కూడా కిడ్నీ ఇచ్చాడు), వనస్థలిపురానికి చెందిన ఎంబీఏ విద్యార్థి పవన్ శ్రీనివాస్ సహాయంతో గత నెల 23న కొలంబో వెళ్లారు. కిరణ్, అరాంజర్గర్కు కిడ్నీ తీసేందుకు డాక్టర్లు మార్చి 29వ తేదీని, దినేష్‌కు ఏప్రిల్ 1వ తేదీని ఖరారు చేశారు. అపరేషన్ తరువాత జల్సా చేయలేమనే ఉద్దేశంతో ఈ ముగ్గురు మార్చి 28న అక్కడి బీచ్‌లో మద్యం తాగగా దినేష్ వాంతులు చేసుకుని మృతి చెందాడు. కొలంబోలో కిడ్నీకి రూ.50 లక్షలు కిడ్నీ రాకెట్ సూత్రధారి ముంబ యికి చెందిన ప్రశాంత్‌సేఠ్ కొలంబోలో ఒక్కో కిడ్నీని రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు విక్రయిస్తాడు. ఇక్కడి ఏజెంట్ల ద్వారా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమైన యువకులకు ఒక్కోక్కరికి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఇస్తాడు. యువలను తీసుకువచ్చిన ఏజెంట్లకు మాత్రం రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షలు వరకు చెల్లిస్తాడు. మిగిలిన సొమ్మును ప్రశాంత్‌సేఠ్, కొలంబోలోని డాక్టర్ మౌనిక్ పంచుకుంటారు. ఎంపికచేసిన యువకులకు ప్రశాంత్‌సేఠ్ ఇక్కడే రక్తపరీక్షలు చేసి ఆ నివేదికను కొలంబోలోని డాక్టర్ మౌనిక్‌కు చేరవేస్తే మౌనిక్ అవసరమైన రోగితో బేరం కుదుర్చుకుంటాడు. ఆ తరువాతే ఇక్కడి నుంచి కిడ్నీ ఇచ్చేవారిని కొలంబోకు తీసుకెళ్తారు. వెంకటేశం ఆరుగురిని, శ్రీనివాస్ 15 మందిని ఇలా పంపించినట్లు తేలింది. ఇంకా ముంబ యి, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, హర్యానా కేంద్రాలుగా కిడ్నీ రాకెట్ నడుస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక కిడ్నీ అమ్మేందుకు వెళ్లే వారిని విజయవాడకు చెందిన సూర్యనారాయణ (ఇతను కూడా కిడ్నీ ఇచ్చినవాడే) బ్లాక్మెయిల్ చేసి అందినకాడికి దండుకునేవాడు. టూరిస్టు విసాపై వెళ్లిన యువకుల నుంచి కిడ్నీ తీసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు త్వరలో ఒక పోలీసు బృందం శ్రీలంకకు పంపుతున్నట్టు కమిషనర్ అనురాగ్‌శర్మ తెలిపారు. -
కిడ్నీ రాకెట్ కేసులో ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వెంకటేషం, షణ్మఖ పవన్, సూర్యనారాయణలను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. ఉద్యోగం ఇప్పిస్తామంటూ తీసుకెళ్లిన ఓ యువకుడి నుంచి కిడ్నీ దొంగిలించి, ఆ తర్వాత ఉద్యోగం కూడా ఇవ్వకుండా వెళ్లగొట్టడంతో మొత్తం విషయం బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ 26 ఏళ్ల డిగ్రీ చదివిన దినేష్ కుమార్ అనే ఆ యువకుడు సూపర్ మార్కెట్ పనిమీద విశాఖ వెళ్తున్నానని గత నెల 22న ఇంట్లో చెప్పి వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత మార్చి 30న దినేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు కొలంబో పోలీసులు దినేష్ అన్న గణేష్‌కు ఫోన్ చెప్పారు. వెంటనే వారు భారత హైకమీషన్ అధికారుల సాయంతో దినేష్ మృతదేహాన్ని తెప్పించుకుని అంత్యక్రియలు జరిపించారు. అయితే విశాఖ వెళ్లిన వాడు కొలంబోకు ఎందుకు వెళ్లాడు అని కుటుంబ సభ్యులకు వచ్చిన అనుమానంతో వ్యవహారం మలుపు తిరిగింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేశాయి. దినేష్ కేసు విచారణలో సీసీఎస్ పోలీసులకు కిడ్నీ రాకెట్‌కు సంబంధించిన కొత్త విషయాలు వెల్లడయ్యాయి. చెన్నైకి చెందిన ప్రధాన సూత్రధారి ఆధ్వర్యంలో గతంలో కిడ్నీలు అమ్ముకున్నవారే ఒక ముఠా గా ఏర్పడి దీన్ని నడిపిస్తున్నట్లు తేల్చారు. -
నలుగురు కాదు వంద
రాష్ట్రంలోని కిడ్నీ ఏజెంట్ల సంఖ్య ఇది దేశవ్యాప్తంగా వెయ్యికిపైగానే ప్రధాన సూత్రధారి ప్రశాంత్‌సేఠ్, ఆలం కోసం వేట సాక్షి, హైదరాబాద్ : దినేష్ మృతితో కిడ్నీ రాకెట్ గుట్టు విప్పిన సీసీఎస్ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో ఉన్న విజయవాడ, పశ్చిమగోదావరి, నల్లగొండ, హైదరాబాద్‌కు చెందిన కిడ్నీ ఏజెంట్లు శ్రీనివాస్, కిరణ్, వెంకటేశ్వర్లు, సురేష్లను విచారించగా పోలీసులకు దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగు చూశాయి. మన రాష్ట్రంలోనే వందకుపైగా కిడ్నీ క్రయవిక్రయాలు జరిపే ఏజెంట్లు ఉన్నారని వెంకటేశ్వర్లు వద్ద లభించిన ల్యాప్‌టాప్‌లో తేలింది. వీరంతా శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లి కిడ్నీ ఇచ్చి వచ్చిన వారే కావడం గమనార్హం. మరింత ఆదాయం గడించేందుకు ఏజెంట్లుగా మారిన వీరు తెలిసిన వారికి గాలం వేసి ప్రధాన సూత్రధారి ద్వారా శ్రీలంకకు పంపిస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో కలిపితే వెయ్యికిపైగా ఏజెంట్లు ఉంటారని తెలిసింది. ప్రధాన సూత్రధారులు మాత్రం ఒడిశా, చెన్నైకి చెందినవారని పోలీసుల విచారణలో తేలింది. దినేష్ మృతిపై విచారణ కోసం తమ దేశం వస్తే పూర్తి సహకారం అందిస్తామని సీసీఎస్ పోలీసులకు శ్రీలంక పోలీసులు తెలిపారు. కిడ్నీ అమ్మేవారిని బ్రోకర్లు వారి పాస్‌పోర్టుపై విజిటింగ్ వీసా కింద స్టాంపింగ్ వేయించి శ్రీలంక తీసుకెళ్తున్నారు. విజిటింగ్ వీసాపై వెళ్లిన వ్యక్తి అనారోగ్యానికి గురైతే అక్కడి డాక్టర్లు ఆకస్మిక వైద్యం అందించవచ్చు. అంతేగాని ఆరోగ్యంగా ఉన్న అతని నుంచి కిడ్నీ తీయడం నేరం. ఈ కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఇలా వెళ్లి కిడ్నీ అమ్ముకున్న వారందరి పాస్‌పోర్టులపై విజిటింగ్ వీసా అని స్టాంపింగ్ వేసి ఉంది. ప్రశాంత్‌సేఠ్ ఆఫర్ లెటర్.... ‘హలో.. నేను ప్రశాంత్ సేఠ్‌ని.. కిడ్నీ అమ్మాలనుకున్నారా.. నేను అన్ని విధాల సహాయపడతా. ఆపరేషన్ మాత్రం ఇరాన్, సింగపూర్, శ్రీలంక దేశాలలో మాత్రమే చేయిస్తా. పాస్‌పోర్టు, ట్రావెల్స్ ఖర్చులు, భోజనం, వసతితో పాటు సకల సౌకర్యాలు నేనే కల్పిస్తా. అడిగినంత డబ్బు కూడా ఇస్తా. నా గురించి నచ్చిన వారు నా మెయిల్ లేదా సెల్ నంబర్‌ను సంప్రదించండి’ అని దినేష్ మెయిల్‌కు ప్రశాంత్‌సేఠ్ మార్చి 9న ఆఫర్ లెటర్ పంపాడు. ప్రశాంత్ కోసం వేట... రాష్ట్రంలో ఉన్న కిడ్నీ ఏజెంట్లకు ప్రశాంత్సేఠ్తో పాటు చెన్నైకి చెందిన ఆలం ప్రధాన సూత్రధారులని తేలింది. దీంతో వారి కోసం సీసీఎస్ పోలీసులు వేట ప్రారంభించారు. ఆలం కాశ్మీర్‌కు పారిపోయాడని నిర్ధారించుకున్న పోలీసులు ప్రశాంత్‌సేఠ్ కోసం ప్రత్యేక పోలీసు బృందంతో గాలిస్తున్నారు. -
హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్
దినేష్ ఘటనతో వెలుగు చూసిన వైనం నిందితుల కోసం ముమ్మర గాలింపు రంగంలోకి ప్రత్యేక బృందాలు దినేష్‌ది సాధారణ మరణమని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడి సాక్షి, సిటీబ్యూరో: శ్రీలంక రాజధాని కొలంబోలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన దినేష్ ఘటనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్ కేంద్రంగానే కిడ్నీ రాకెట్ నడుస్తుందని సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. పక్కా క్లూ లభించడంతో నిందితులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సీసీఎస్ డీసీపీ పాల్రాజు తెలిపారు. కాగా కొలంబోలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు దినేష్ పోస్టుమార్టం నివేదికలో అతనిది సాధారణ మరణ ం (గుండెపోటు) అని వెల్లడించారు. కిడ్నీ మార్పిడి జరుగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి చనిపోయాడా లేక ఆపరేషన్‌కు ముందే గుండెపోటు వచ్చి చనిపోయాడా అనే విషయాలు ఆ నివేదికలో డాక్టర్లు పేర్కొనలేదని పాల్రాజు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగానే.. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌తోనే దినేష్ సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న తన కుటుంబాన్ని గట్టెక్కించేందుకు కిడ్నీని అమ్మాలని నిర్ణయించుకున్న దినేష్.. రెండు నెలల నుంచి వేర్వేరుగా నాలుగు కిడ్నీ రాకెట్ ముఠాలతో సంప్రదింపులు జరిపాడు. ఇందులో ఒక ముఠా బ్రోకర్ ప్రశాంత్ సేట్ తో సంప్రదించినట్లు అతని ఈ-మెయిల్ ద్వారా వెల్లడైంది. కానీ అది సంప్రదింపులకే పరిమితమైంది. దినేష్ కొలంబో వెళ్లడానికి కారణం.. మరో మూడు ముఠాలలో ఒకటైన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న రాకెట్. ఈ ముఠా ఆదేశాల మేరకే దినేష్ కొత్తగూడెం నుంచి గత నెల 22న బయలుదేరి అదే రోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ కిడ్నీ రాకెట్ ముఠాతో సంప్రదింపులు జరిపిన తరువాత అతను మరుసటిరోజు గుంటూరు వెళ్లాడు. అక్కడి నుంచి వెంకటేశ్వర్లు, కిషోర్లతో కలిసి చెన్నై వెళ్లి అక్కడి నుంచి కొలంబో వె ళ్లి మరణించాడు. అయితే హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ నిర్వాహకులు ఎవరు, వీరి మకాం ఎక్కడ అనే విషయాలపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఈ కేసులో అత్యంత విలువైన క్లూ లభించిందని, నిందితులను త్వరలో అరెస్టు చేసి మీడియా ముందు చూపిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన నిందితుడు..? దినేష్ మృతి, కిడ్నీ రాకెట్ ఉదంతంపై పత్రికలు, టీవీల్లో వ చ్చిన కథనాలపై గుంటూరుకు చెందిన కిషోర్ పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. దినేష్‌తో పాటు గో ట్రావెల్ బస్సులో కిషోర్ కూడా వెళ్లాడు. దినేష్ సెల్‌ఫోన్ కాల్‌లిస్టులో తన నెంబర్లు కూడా ఉంటాయని గ్రహించిన కిషోర్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని లొంగిపోయినట్లు తెలిసింది. ఇతనిచ్చిన సమాచారం మేర కే పోలీసులు సూత్రధారి కోసం వేట మొదలు పెట్టినట్లు తెలిసింది. సంతకం పెట్టిన ఉన్నతాధికారి ఎవరు..? దినేష్‌కు పాస్‌పోర్టు కేవలం 15 రోజుల్లోనే సమకూర్చారు. ఇదందా కిడ్నీ రాకెట్ బ్రోకరే చేయించాడు. ఇంత త్వరగా పాస్‌పోర్టు వచ్చే విధంగా చేశాడంటే అది కేవలం తత్కాల్ కింద దరఖాస్తు చేస్తేనే సాధ్యం. కాగా ఇలాంటి దరఖాస్తుపై దినేష్‌కు ఏదైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారి సర్టిఫై చేసి ఉండాలి. ఆ అధికారికి... కిడ్నీ వ్యాపారానికి సంబంధం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ అధికారి దినేష్లాంటి వారికి ఎంతమందికి సంతకాలు పెట్టి ఉంటారోనన్న దిశగానూ విచారణ సాగుతోంది. ఈ రాకెట్లో పాస్‌పోర్టు అధికారుల పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పది స్పాట్‌ను బహిష్కరిస్తాం..
ఉట్నూర్, న్యూస్‌లైన్ : సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను తిరిగి విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ నెల 16 నుం చి ప్రారంభం కానున్నా పదో తరగతి స్పాట్‌ను జిల్లాలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్లు ఐక్యఉపాధ్యాయ సంఘాల(జాక్టో) స్పష్టం చేసింది. ఆదివారం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేషన్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి సస్పెండ్ చేయడం సరైంది కాదన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఈ సమావేశంలో జాక్టో తరుఫున డీటీఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముడుగు శామ్యూల్, మండల కార్యదర్శి బంకట్లాల్, టీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ట లక్ష్మణచారి, మండల శాఖ అధ్యక్షుడు దాసరి రాజన్న, ఎస్టీయూ మండల శాఖ అధ్యక్షుడు రాథోడ్ గణేష్, కార్యదర్శి ఆత్మరాం, పీఆర్టీయూ మండల శాఖ అధ్యక్షప్రధాన కార్యదర్శులు దినేష్, విజయ్‌కుమార్ నాయకులు పాల్గొన్నారు. రెబ్బెనలో.. రెబ్బెన : ఈనెల 16 నుంచి నిర్వహించబోయే ప దో తరగతి స్పాట్ వ్యాల్యుయేషన్‌ను 14 ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరిస్తున్నట్లు పీఆర్ టీ యూ మండల శాఖ ప్రధాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు మాస్ కాపీయింగ్‌కు పాల్పడటంతో ఇన్విజిలేషన్ చేస్తున్న 24 మంది ఉపాధ్యాయులను బాధ్యులను చేస్తూ కలెక్టర సస్పెండ్ చేశారని అన్నారు. దీనికి నిరసనగా ఈనెల 16 నుంచి జరగబోయే స్పాట్ వ్యాల్యుయేషన్‌ను బహిష్కరిస్తున్నామని అన్నా రు. స్పాట్ వ్యాల్యుయేషన్‌కు వెళ్లే ఉపాధ్యాయులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బలవంతంగా రిలీవ్ చేయరాదని అ న్నారు. సస్పెండ్‌కు గురైన ఉపాధ్యాయుల వెం ట 14 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయని అ న్నారు. ఈనెల 15 లోగా ఉపాధ్యాయులపై ఉ న్న సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని లేని పక్ష్యంలో ఆ నిరాహార దీక్ష కైన సిద్ధమని హెచ్చరించారు. -
వివాహితపై ఇద్దరి లైంగిక దాడి
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: రైస్‌మిల్లులోని ఓ కూలీపై తోటి కూలీలు ఇద్దరు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. ఇబ్రహీంపట్నం సీఐ మహ్మద్‌గౌస్ కథనం ప్రకారం వివరాలు.. సాగర్ రహదారిపై మంగల్‌పల్లి గేట్ సమీపంలోని క్వార్టర్స్‌లో బీహార్‌కు చెందిన దినేశ్(27), బజన్లాల్(25) ఉంటున్నారు. వీరు స్థానికంగా ఉన్న ఓ రైస్‌మిల్లులో కూలీలుగా పనిచేస్తున్నారు. అదే రైస్‌మిల్లులో చత్తీస్‌ఘడ్‌కు చెందిన ఓ వివాహిత కూడా పనిచేస్తోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆమె బహిర్భూమికి వెళ్తుండగా దినేశ్, బజన్లాల్ ఆమెను అటకాయించి సమీపంలోని చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. వివాహిత విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలిపింది. శనివారం సాయంత్రం బాధితురాలు తన కుటుంబీకులతో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ మహ్మద్‌గౌస్ తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
యువతరం ప్రేమకథ
వరుణ్, దినేష్, ప్రశాంత్, షిప్రా గౌర్, హేమలత, కల్పన, కావ్య, పృధ్వీ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతోంది. యన్నీ కె. దర్శకత్వంలో సంగీత్, హబీబ్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి వీఎన్ ఆదిత్య కెమెరా స్విచాన్ చేయగా, సూర్యకిరణ్ క్లాప్ ఇచ్చారు. ప్రేమతో పాటు అన్ని రకాల ఎలిమెంట్సూ ఉన్న కథాంశమిదని దర్శకుడు చెప్పారు. ఆర్ఎఫ్సీలో సెట్ వేస్తున్నామని, ఓ పదిరోజుల్లో షూటింగ్ మొదలుపెడతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.కె.సేన, సంగీతం: జె.వర్ధన్, కళ: డేవిడ్.