రెడ్ జెయిన్ మూవీస్ ఖాతాలో ఒరు కుప్పై కథై
తమిళసినిమా: ఒరు కుప్పై కథై చిత్రాన్ని రెడ్‌జెయిన్ మూవీస్ సంస్థ ద్వారా నటుడు, నిర్మాత ఉదయనిధిస్టాలిన్ విడుదల చేయనున్నారు. కోలీవుడ్‌లోని ప్రముఖ నృత్యదర్శకుల్లో ఒకరైన దినేశ్ ప్రముఖ కథానాయకులందరి చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. ఆయనిప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ఒరుకుప్పై కథై.
ఆయనకు జంటగా మనీషాయాదవ్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అస్లామ్ ఫిలింమ్ బాక్స్ పతాకంపై నిర్మించారు. తన శిష్యుడు కాళీ రంగస్వామిని ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేయడం విశేషం. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఒరు కుప్పై కథై బడుగు వర్గాల జీవన విధానాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్ర టైటిల్ చూసి ఇదో చిత్రమా అనుకునే వారు థియేటర్‌లో చిత్రం చూస్తున్నప్పుడు రెండవ భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారన్నారు.
చిత్రం రెడీగా ఉంది చూస్తారా అన్న మైనా చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేలా చేసిన ఉదయనిధిస్టాలిన్ ఈ ఒరుకుప్పై కథై చిత్రాన్ని చూస్తారా? అన్న సందేహంతోనే అడిగామన్నారు. చిత్రం చూపిన ఆయన ఇలాంటి చిత్రాల రాక చాలా అవసరం అని వెంటనే తన సంస్థ ద్వారా విడుదల చేయడానికి అంగీకరించారన్నారు. కథానాయకుడు దినేశ్ నటన బాగుందంటూ ప్రశంసించారని అన్నారు. ఇటీవల తాను నటించిన చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న ఉదయనిధిస్టాలిన్ తమ చిత్రాన్ని విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు.