
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు ఆదివారం భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో దీపక్ పూనియా (92 కేజీలు), ఉదిత్ (61 కేజీలు) రజత పతకాలు నెగ్గగా... దినేశ్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని సాధించాడు.
ఫైనల్స్‌లో దీపక్ పూనియా 0–10 పాయింట్ల తేడాతో అమీర్‌హుస్సేన్ (ఇరాన్) చేతిలో... ఉదిత్ 4–6 పాయింట్ల తేడాతో టకారా సుడా (జపాన్) చేతిలో ఓడిపోయారు. కాంస్య పతక బౌట్‌లో దినేశ్ తుర్క్‌మెనిస్తాన్ రెజ్లర్ సపరోవ్‌ను ఓడించాడు. ఆసియా చాంపియన్‌షిప్ చరిత్రలో 25 ఏళ్ల దీపక్ పూనియాకిది ఐదో పతకం కావడం విశేషం. 2021, 2022లలో రజతాలు నెగ్గిన దీపక్... 2019, 2020లలో కాంస్య పతకాలు సాధించాడు.