![Deepak Punia Settles For Silver In Asian Wrestling Championship - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/punia.jpg.webp?itok=UPM_dBlE)
ఉలాన్‌బాతర్ (మంగోలియా): ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2022లో గతేడాదితో (14) పోలిస్తే భారత్‌కు ఈ సారి 3 పతకాలు అధికంగా వచ్చాయి. ఆఖరి రోజు వచ్చిన రెండు మెడల్స్ కలుపుకుని భారత్ ఖాతాలో మొత్తం 17 పతకాలు (1 స్వర్ణం, 5 రజతాలు, 11 కాంస్యాలు) చేరాయి. 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా మరోసారి రజతంతో సరిపెట్టుకోగా, విక్కీ చాహర్ (92 కేజీలు) కాంస్యం చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగిన దీపక్ కజకిస్థాన్ రెజ్లర్ అజ్మత్ దౌలెత్బెకోవ్ చేతిలో 1-6 తేడాతో ఓడాడు.
నిరుడు ఇదే టోర్నీలో దీపక్ రజతంతోనే సరిపెట్టుకున్నాడు. మరోవైపు విక్కీ చాహర్ రజత పోరులో 5-3తో అజినియాజ్ (ఉజ్బెకిస్థాన్)పై నెగ్గాడు. ఆదివారంతో ముగిసిన ఈ పోటీల్లో జపాన్ అత్యధికంగా 21 పతకాలు (10 స్వర్ణం, 2 రజతాలు, 9 కాంస్యాలు) సాధించగా, ఇరాన్ (15, 10 స్వర్ణం, 2 రజతాలు, 3 కాంస్యాలు), కజకిస్థాన్ (21, 5 స్వర్ణం, 8 రజతాలు, 8 కాంస్యాలు), కిర్కిస్థాన్ (14, 4 స్వర్ణం, 3 రజతాలు, 7 కాంస్యాలు) వరుసగా 2 నుంచి 4 స్థానాల్లో నిలిచాయి. భారత్ 17 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది.
చదవండి: Formula 1: అన్‌స్టాపబుల్ వెర్‌స్టాపెన్.. కెరీర్‌లో 22వ విజయం
Comments
Please login to add a commentAdd a comment