
సచిన్ రాఠి, దీపక్ పూనియా
న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సచిన్ రాఠి, దీపక్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన 74 కేజీల ఫైనల్లో సచిన్ 9–2తో బియంబసురెన్ (మంగోలియా)ను ఓడించగా... 86 కేజీల తుదిపోరులో దీపక్ 10–0తో అజత్ గజ్యెవ్ (తుర్క్‌మెనిస్తాన్)పై గెలిచాడు. 61 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో సూరజ్ రాజ్ కుమార్ 16–8తో యుతో (జపాన్)ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. 92 కేజీల్లో సోమ్‌వీర్ సింగ్ నిరాశపరిచాడు. అతను మూడో రౌండ్లోనే 2–3తో తకుమా ఒత్సు (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 125 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక బౌట్‌లో ఎర్డెనెబాటర్ (మంగోలియా)పై మోహిత్ 10–0తో గెలిచాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్ 173 పాయింట్లతో రెండో స్థానం పొందగా, ఇరాన్ (189)కు అగ్రస్థానం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment