Junior
-
విజేత అర్జున్... రన్నరప్ సరయు
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు ఆదిరెడ్డి అర్జున్, వేల్పుల సరయు అదరగొట్టారు. హరియాణాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ టోరీ్నలో ఓపెన్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్ టైటిల్‌ను నిలబెట్టుకోగా... వరంగల్ జిల్లాకు చెందిన సరయు రన్నరప్‌గా నిలిచింది. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 14 ఏళ్ల అర్జున్ 9.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. అర్జున్ 8 గేముల్లో గెలిచి, 3 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని టోర్నీని అజేయంగా ముగించాడు. సౌరత్ బిశ్వాస్ (పశ్చిమ బెంగాల్; 8.5 పాయింట్లు) రెండో స్థానంలో, జైవీర్ మహేంద్రు (మహారాష్ట్ర; 8.5 పాయింట్లు) మూడో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో సరయు నిర్ణీత 11 రౌండ్ల తర్వాత 9 పాయింట్లతో మృతిక మల్లిక్ (పశ్చిమ బెంగాల్)తో కలిసి సంయుక్తంగా టాప్ ర్యాంక్‌లో నిలిచింది. అయితే చాంపియన్‌ను నిర్ణయించేందుకు మైరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు. మెరుగైన టైబ్రేక్ స్కోరుతో మృతిక టైటిల్ సొంతం చేసుకోగా... సరయుకు రెండో స్థానంతో రన్నరప్ ట్రోఫీ దక్కింది. సరయు తొమ్మిది గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయింది. విజేత అర్జున్, రన్నరప్ సరయులను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
అగ్రిమెంట్ లోని అంశాలను గుర్తు చేస్తోన్న జేపీఎస్ లు
-
హాస్టల్లో ర్యాగింగ్ భూతం.. జూనియర్‌ను కర్రతో చితకబాదిన టెన్త్ క్లాస్ విద్యార్థి
సాక్షి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఓ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూనియర్ విద్యార్థిని ఓ 10వ తరగతి విద్యార్థి చితకబాదాడు. సోమవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల హాస్టల్లో బాధిత బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఓ పదో తరగతి విద్యార్థి తాను చెప్పిందే వినాలని కొంతకాలంగా జూనియర్లను భయపెడుతూ మాటవిననివారిని కొడుతున్నాడు. హోలీ పండగ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న తనతోపాటు మరికొందరు విద్యార్థులను లేపి డాన్స్ చేయమని బెదిరించాడని, చేయకుంటే కొట్టాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే నాలుగింతలు దెబ్బలు తింటారని బెదిరించడంతో ఎవరికీ చెప్పుకోలేదని బాధిత విద్యార్థి వాపోయాడు. శనివారం రాత్రి మరోమారు గదికి వచ్చి కర్రతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడని, దెబ్బలు తాళలేక ఆదివారం ఉదయం జడ్చర్లలోని తన మేనత్త శాంతమ్మ వద్దకు వెళ్లినట్లు చెప్పాడు. అతడి మేనత్త వార్డెన్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం ఉదయం హాస్టల్ వద్ద బాధిత విద్యార్థి, బంధువులు ఆందోళనకు దిగారు. ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి హాస్టల్‌కు వచ్చి విచారణ చేపట్టారు. ఆవేశంలో తప్పు చేశానని, ఇకపై చేయబోనని పదో తరగతి విద్యార్థి లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. త్వరలో పరీక్షలు ఉండటంతో అతడిని మందలించి వదిలేసినట్లు తెలుస్తోంది. -
ఐబీఎస్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం రేపిన ఐబీఎస్ కళాశాల ర్యాగింగ్ కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ మతాన్ని కించపరుస్తూ బాధిత విద్యార్ధి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో ఈ గొడవ మొదలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడు శంకర్పల్లి పోలీస్‌లకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో అయిదుగురిని అరెస్ట్ చేయగా.. మరో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ ఇమాద్, సోహైల్, వర్షిత్, గణేష్, వాసుదేవ్ వర్మ నే విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఇంత జరిగిన నిర్లక్ష్యంగా వ్యవహరించినా కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేయనున్నారు పోలీసులు. ఈ మేరకు కేసు ఎఫ్ఐఆర్లో మార్పులు చేశారు. కాగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి(ఐబీఎస్) కళాశాలలో విద్యార్థి హిమాంక్ బన్సాల్‌పై సీనియర్లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీన జరిగిన ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఒక్క విద్యార్థిని లక్ష్యంగా చేసుకొని దాదాపు 10 మంది సీనియర్లు విచక్షణారహితంగా దాడి చేశారు. హాస్టల్ గధిలో బంధించి బాధితుడిపై కూర్చొని, పిడిగుద్దులు గుద్దుతూ తీవ్రంగా గాయపరిచారు. ఈ దృశ్యాలను వీడియో తీయగా.. బాధిత విద్యార్థి దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కళాశాల యాజమాన్యం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. దాడికి పాల్పడిన 12 మంది విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేసింది. కారణం అదేనా! అయితే ఐసీఎఫ్ఏఐ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. కొంతకాలం లవ్ చేసుకున్నాక వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతిని అవమానిస్తూ పోస్టు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న యువతి తన బంధువైన సీనియర్ విద్యార్థికి చెప్పింది. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. అతడు తన స్నేహితులను వెంటబెట్టుకుని హాస్టల్లో ఉన్న యువకుడిపై దాడి చేశారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని ఆరోపిస్తూ 15 నుంచి 20 మంది సీనియర్లు తన హాస్టల్ గదిలోకి చొరబడి కొట్టారని బన్సల్ ఫిర్యాదులో పేర్కొన్నారు -
‘జూనియర్’గా వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన హీరోగా దర్శకుడు రాధాకృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర పోషించబోతుంది. వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ని ప్రకటించారు మేకర్స్. ఈచిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కిరిటీ బర్త్‌డేని పురస్కరించుకొని శుక్రవారం సినిమా టైటిల్‌తో పాటు గ్లింప్స్‌ని విడుదల చేశారు. ‘చిన్నప్పటి నుంచి మనం ఏదో ఒకటి అయిపోదాం అనుకుంటాం. మనం అవ్వకపోయినా జీవితం ఏదో ఒకటి చేసేస్తుంది..’అంటూ సాగే ఈ వీడియో గ్లింప్స్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
జూనియర్ విద్యార్థినితో పరిచయం.. వాట్సాప్‌లో అశ్లీల దృశ్యాలు
సాక్షి, హుబ్లీ(కర్ణాటక): యువతిని ప్రేమ పేరుతో నమ్మించి అశ్లీల దృశ్యాలను వాట్సాప్‌లో పెట్టి వికృతంగా వ్యవహరించిన యువకుడి ఉదంతం హుబ్లీలో వెలుగు చూసింది. మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన యువకుడు హుబ్లీలో నర్సింగ్ కోర్సు చదువుతున్నాడు. తన జూనియర్ విద్యార్థినితో పరిచయం పెంచుకుని ఫోన్లో మాట్లాడుతూ ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. అనంతరం వాట్సాప్‌ద్వారా వీడియోకాల్ చేసి ఆమె నగ్న దృశ్యాలను రికార్డు చేశాడు. వాటిని ఎడిట్ చేసి ఫొటోలను ఈనెల 11న వాట్సాప్‌లో పెట్టాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
అప్రెంటిస్ నియామకాలకే మొగ్గు.. కంపెనీల కొత్త ఎత్తుగడ!
న్యూఢిల్లీ: ఈ ఏడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) అప్రెంటీస్లను గణనీయంగా తీసుకోవడంపై దేశీయంగా దాదాపు 45 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. జనవరి–జూన్ వ్యవధితో పోలిస్తే ఇది 4 శాతం అధికం. అప్రెంటిస్‌ల నియామకాల ద్వారా నిపుణులు, సిబ్బంది కొరత సమస్యను అధిగమించవచ్చని సంస్థలు భావిస్తున్నాయి. నేషనల్ ఎంప్లాయబిలిటీ థ్రూ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రాం (టీమ్‌లీజ్ స్కిల్స్ యూనివర్సిటీలో భాగం) ఈ ఏడాది ద్వితీయార్థంపై రూపొందించిన అప్రెంటిస్‌షిప్ అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 64 శాతం కంపెనీలు ప్రస్తుతం తాము తీసుకుంటున్న అప్రెంటిస్‌ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తున్నాయి. ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఆరు శాతం అదికం. 14 నగరాల్లో, 18 రంగాలకు చెందిన 833 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. వీటిలో 17 రంగాల్లో అప్రెంటిస్‌ల నియామకాలపై ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. హైరింగ్ విషయంలో తయారీ.. ఇంజినీరింగ్ (68 శాతం), రిటైల్ (58 శాతం), ఆటోమొబైల్.. అనుబంధ రంగాలు (58 శాతం) టాప్‌లో ఉన్నాయి. మెట్రో, మెట్రోయేతర నగరాల్లోనూ అప్రెంటిస్‌ల నియామకాలపై సానుకూల అంచనాలు ఉన్నాయి. మెరుగ్గా లక్నో, అహ్మదాబాద్.. మెట్రో నగరాలతో పోలిస్తే నియామకాల విషయంలో లక్నో (79 శాతం), అహ్మదాబాద్ (69 శాతం) మెరుగ్గా ఉన్నాయి. ఇక మెట్రో నగరాల్లో చెన్నై (65 శాతం), ఢిల్లీ (58 శాతం).. అప్రెంటిస్‌లకు ఆకర్షణీయంగా నిల్చాయి. మహిళలకన్నా (32 శాతం) పురుషులను (36 శాతం) నియమించుకోవడంపై కంపెనీలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నాయి. వ్యవసాయ, తయారీ పరిశ్రమల్లో పురుషుల కన్నా (వరుసగా 29 శాతం, 28 శాతం) మహిళలకు (33 శాతం, 34 శాతం) అధిక ప్రాధాన్యం లభిస్తోంది. చదవండి: ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్.. భారీగా నియామకాలు! -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్‌కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
జూనియర్ల పంచ్‌కు డజను పతకాలు
న్యూఢిల్లీ: సెర్బియాలో జరిగిన నేషన్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళా బాక్సర్లు పతకాల పంట పండించారు. ఈ టోర్నీలో భారత్ 12 పతకాలు సాధించింది. ఇందులో నాలుగేసి చొప్పున స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. దీంతో భారత బాక్సింగ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. తమన్నా (48 కేజీలు), అంబేశొరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియా (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) బంగారు పతకాలు గెలిచారు. ఫైనల్లో తమన్నా 5–0తో అలెనా ట్రెమసొవా (రష్యా)పై ఏకపక్ష విజయం సాధించడంతో ‘ఉత్తమ విదేశీ బాక్సర్’ కేటగిరీలో కూడా అవార్డు పొందింది. మిగతా ఫైనల్ బౌట్లలో అంబేశొరి 3–2తో డ్యునా సిపెల్ (స్వీడన్)పై, ప్రీతి దహియా 3–2తో క్రిస్టినా కర్టత్సెవా (ఉక్రెయిన్)పై నెగ్గారు. ప్రియాంక 5–0తో ఓల్గా పెట్రష్కొ (రష్యా)ను కంగుతినిపించింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్సి దలాల్ (75 కేజీలు), తనిశ్‌బిర్ కౌర్ సంధు (80 కేజీలు) రజతాలు నెగ్గగా, ఆశ్రేయ (63 కేజీలు), నేహా (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. 20 దేశాలకు చెందిన 160 మందికి పైగా బాక్సర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు. ఇందులో 13 మంది సభ్యులతో కూడిన భారత బృందం 12 పతకాలు గెలుపొందడం విశేషం. -
సచిన్ రాఠి, దీపక్‌లకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: జూనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు సచిన్ రాఠి, దీపక్ పూనియా ‘పసిడి’ పట్టు పట్టారు. ఆదివారం ఇక్కడ జరిగిన 74 కేజీల ఫైనల్లో సచిన్ 9–2తో బియంబసురెన్ (మంగోలియా)ను ఓడించగా... 86 కేజీల తుదిపోరులో దీపక్ 10–0తో అజత్ గజ్యెవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలిచాడు. 61 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో సూరజ్ రాజ్ కుమార్ 16–8తో యుతో (జపాన్)ను ఓడించి పతకం గెలుచుకున్నాడు. 92 కేజీల్లో సోమ్‌వీర్ సింగ్ నిరాశపరిచాడు. అతను మూడో రౌండ్లోనే 2–3తో తకుమా ఒత్సు (జపాన్) చేతిలో కంగుతిన్నాడు. 125 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక బౌట్లో ఎర్డెనెబాటర్ (మంగోలియా)పై మోహిత్ 10–0తో గెలిచాడు. ఈ టోర్నీలో ఓవరాల్‌గా భారత్ 173 పాయింట్లతో రెండో స్థానం పొందగా, ఇరాన్ (189)కు అగ్రస్థానం దక్కింది. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
పరిశీలిస్తున్నామన్న మంత్రి ఈటల రాజేందర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో కూడా సన్నబియ్యం పథకాన్ని అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుతం పాఠశాలలు, వసతి గృహాల్లో ఆ పథకం సత్ఫలితాలనిస్తున్న నేపథ్యంలో సభ్యుల సూచన మేరకు విస్తరించే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ మేరకు సంబంధిత శాఖ నుంచి ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైచిలుకు పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం వల్ల 29.8లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందు తున్నారని, వసతిగృహాల్లో మరో 6 లక్షల మంది విద్యార్థులకూ అమలు చేస్తున్నామని వివరించారు. ఈ బియ్యం కోసం కొంటున్న వడ్లకు రూ.1,800 చొప్పున ధర చెల్లిస్తున్నారని, అలాగే మిగతా రకాలకు కూడా అంతే మొత్తం చెల్లించి రైతులకు అండగా నిలవాలని కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచించారు. -
జూనియర్, డిగ్రీ కాలేజీలకూ ‘సన్నబియ్యం’
-
జూనియర్ వైద్యుల ధర్నా
-
జూనియర్ వైద్యుల ధర్నా
గుంటూరు మెడికల్ : జూనియర్ వైద్యుల ధర్నాతో గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల బుధవారం దద్దరిల్లింది. గైనకాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ బాల సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులు ధర్నా చేశారు. డాక్టర్ సంధ్యారాణి చిత్రపటాన్ని పట్టుకుని, నల్లబ్యాడ్జీలు ధరించి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీడియాకు వివరణ ఇచ్చేందుకు డాక్టర్ లక్ష్మి అందుబాటులో ఉన్నారని, అయినా పోలీసులు ఆమెను ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. పోలీసులు తక్షణమే స్పందించి ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల వద్దకు ర్యాలీగా వెళ్లి తమకు న్యాయం చేయాలని అక్కడ ధర్నా చేశారు. అడిషనల్ ఎస్పీ భాస్కరరావు జూడాల వద్దకు వచ్చి డాక్టర్ లక్ష్మిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపామని, ఆమెను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి జీజీహెచ్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు ధర్నా కొనసాగించారు. డాక్టర్ సంధ్యారాణి భర్త కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వార్తలు రావడంతో రాత్రి పది గంటల సమయంలో ఆందోళన చేసుత్న్న జూనియర్ వైద్యులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు, డాక్టర్ లక్ష్మికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విమర్శలకు ఖండన... గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఏవీవీ లక్ష్మి తనపై వచ్చిన వార్తలకు స్పందిస్తూ మీడియాకు వివరణ ఇచ్చిన లేఖలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ సంధ్యారాణిపై చేసిన ఆరోపణలను జూడాల సంఘం తీవ్రంగా ఖండించింది. డాక్టర్ సంధ్యారాణి బాగా సంతోషంగా అందరితో కలిసి ఉంటుందని, ప్రొఫెసర్ తప్పు చేసి, చనిపోయిన వైద్య విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జూనియర్ వైద్యులు చెప్పారు. డాక్టర్ సంధ్యారాణి ఏ తప్పు చేయలేదన్నారు. ఆస్పత్రి అధికారులు ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీపై తమకు నమ్మకం లేదని, అందరూ వైద్యులే కావడం వల్ల తమకు న్యాయం జరగదని పేర్కొన్నారు. డాక్టర్ సంధ్యారాణి మృతిపై జడ్జితో విచారణ చేయించాలని జూడాలు డిమాండ్ చేశారు. ప్రొఫెసర్‌ను సస్పెండ్ చేసి అరెస్ట్ చేసే వరకు తాము ధర్నా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్ సంధ్యారాణి కుటుం బానికి న్యాయం చేయాలని, ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎంఈ, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.నాగేశ్వరరావు తెలిపారు. సూపరింటెండెంట్‌తో చర్చలు ఉదయం నుంచి రాత్రి వరకు ధర్నా చేస్తూ జూడాలు బైఠాయించటంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దేవనబోయిన శౌరిరాజునాయుడు, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మెండా ఫర్నికుమార్ జూనియర్ డాక్టర్లను తమ చాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మిపై చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలపై తాము ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నామని, ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు. డాక్టర్ లక్ష్మి ప్రవర్తన, ఆమెపై వచ్చిన ఆరోపణ గురించి విచారణ చేసేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నల్లూరి మురళీకృష్ణ, జీజీహెచ్ డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పెనుగొండ యశోధర, జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి డాక్టర్ మోహనరావు కలిసి పీజీ వైద్యులు, బోధనా సిబ్బంది, ఆస్పత్రి సిబ్బంది అందరితో మాట్లాడి నివేదిక తయారు చేసే పనిలో ఉన్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. గురువారం ఉదయంలోపు నివేదిక వస్తుందని, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ)కు అందజేసి, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
జిల్లా జూనియర్ ఖోఖో జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి జూనియర్ బాలబాలికల ఖోఖో ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 70 మంది బాలురు, 50 మంది బాలికలు హాజరయ్యారు. బాలబాలికల నుంచి ఐదుగురు చొప్పున ఎంపిక చేశామని జిల్లా ఖోఖో అసోసియేషన్ ఇన్చార్జ్ కార్యదర్శి పి.రామయ్య తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు బుధవారం హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో ఎంపికల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఎంపికల్లో పీఈటీలు పి.నర్సయ్య, ఎ.కృష్ణ, రాజు, చలపతి పాల్గొన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు బాలుర జట్టులో కె.అవినాష్, ఎం.నవీన్, పి.బాబురావు, పి.కార్తీక్, సీహెచ్.కృష్ణసాగర్, బాలికల జట్టులో జి.రేణుక, పి.అనూష, ఎ.ప్రియాంక, కె.ముక్తేశ్వరీ, టి.లక్ష్మిప్రసన్న ఉన్నారు. -
రేపు కాంట్రాక్ట్ లెక్చరర్ల జిల్లా సమావేశం
వర్ని : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై ఆదివారం కామారెడ్డిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చిన్న గంగాధర్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లాలోని సభ్యులందరూ హాజరుకావాల్సిందిగా ఆయన కోరారు. -
డెంటల్ విద్యార్థినిపై జూనియర్ అత్యాచార యత్నం
-
సీక్వెల్‌కు నో!
ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సీక్వెల్ బాటలో పరుగెడుతుంటే... హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజినెగర్ మాత్రం అందుకు నో అంటున్నాడు. 1994లో రిలీజైన అతడి చిత్రం ‘జూనియర్’కు సీక్వెల్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. కారణం ఏంటని ఆరా తీస్తే... అందులో అతడి క్యారెక్టరేనని తేలింది. అప్పట్లో ఈ చిత్రంపై పెద్ద దుమారమే రేగింది కూడా. ‘ఏదైనా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగేలా ఉండాలి. లేదంటే ఆ ప్రయత్నమంతా నిష్ర్పయోజనమే’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్. -
కళాశాల భవనంపైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య