సీక్వెల్‌కు నో!
ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా సీక్వెల్ బాటలో పరుగెడుతుంటే... హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ స్క్వాజినెగర్ మాత్రం అందుకు నో అంటున్నాడు. 1994లో రిలీజైన అతడి చిత్రం ‘జూనియర్’కు సీక్వెల్ చేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. కారణం ఏంటని ఆరా తీస్తే... అందులో అతడి క్యారెక్టరేనని తేలింది. అప్పట్లో ఈ చిత్రంపై పెద్ద దుమారమే రేగింది కూడా. ‘ఏదైనా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. సైంటిఫిక్‌గా ప్రూవ్ చేయగలిగేలా ఉండాలి. లేదంటే ఆ ప్రయత్నమంతా నిష్ర్పయోజనమే’ అంటూ చెప్పుకొచ్చాడు ఆర్నాల్డ్.