
ప్రేమతో... అక్క!
ఫిల్మీ లైఫ్‌లో ఎంత బిజీగా ఉన్నా... అయినవారికి ప్రేమానురాగాలను పంచడంలో లోటు చేయడం లేదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా. ప్రస్తుతం లాస్‌ఏంజిల్స్‌లో ఉన్న ప్రియాంక... తన ప్రియమైన చిట్టి చెల్లి, అందాల తార పరిణీతి చోప్రాకు అద్భుతమైన ఉంగరం, చెవి రింగులు పంపించిందట. అక్క నుంచి ప్రేమ కానుక అందుకున్న పరిణీతి... ఆ ఆనందాన్ని పట్టలేకపోతోంది. వెంటనే వాటిని అలంకరించుకుని... ఓ స్నాప్ తీసుకుని... ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసేసింది.
‘గిఫ్ట్ ఫ్రమ్ మై సిస్టర్. ప్రీషియస్ జ్యువెలరీ అండ్ గిఫ్ట్’ అంటూ కామెంట్ చేసిందీ బబ్లీగాళ్. నిజంగానే ఈ ఆభరణాలు ధరించాక అమ్మడు నిండుగా... మరింత గ్లామరస్‌గా కనిపిస్తోందనేది సినీజనుల టాక్. ఇక ట్విట్టర్‌లో పరిణీతి ఫాలోవర్స్ అయితే అభినందనలతో ముంచెత్తేస్తున్నారు. ఈ ముద్దు గుమ్మ సంతోషాన్ని తమదిగా షేర్ చేసేసుకుంటున్నారు.