ఫీల్ మై ఫిల్మ్ | Feel My Film | Sakshi
Sakshi News home page

ఫీల్ మై ఫిల్మ్

Published Mon, Oct 27 2014 12:16 AM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

ఫీల్ మై ఫిల్మ్ - Sakshi

ఫీల్ మై ఫిల్మ్

ఒక పెద్ద సినిమా రిలీజైన రోజు భారీ కలెక్షన్లు సాధిస్తే సూపర్ హిట్.. మరి అదే చిట్టి సినిమా రిలీజైన 24 గంటల్లోనే 10 వేల వ్యూస్ కొల్లగొడితే బ్లాక్ బస్టరే. ఆ షార్ట్ ఫిల్మే ఆర్య-3. ఈ నెల 21న విడుదలైన ఈ బుల్లి సినిమాను నాలుగు రోజుల్లోనే 18 వేల మంది చూసేశారు.
 
ఈ సినిమాకు రికార్డ్ వ్యూస్ రావడానికి కారణం డిఫరెంట్‌గా ప్రమోట్ చేయడమే కారణం. వైష్ణో మీడియా వారి ఫిల్మీటైం వెబ్ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యటం, నితిన్, చార్మీ సినీనటుల ఫేస్‌బుక్ పేజీలలో ఈ వీడియో చేరటం ఈ చిన్ని సినిమా విజయానికి కారణమే. ఫ్రెండ్స్ సహకారంతో ఈ సినిమా నిర్మించానని చెప్తున్న డెరైక్టర్ ఈశ్వర్, ఈ సినిమా పబ్లిసిటీకి కూడా వారే ఎక్కువ కారణమన్నారు.
 
గుర్తింపు కోసం..
యాక్టర్ అవ్వాలని నగరానికి వచ్చిన ఈశ్వర్, గుర్తింపు తెచ్చుకుంటే తప్ప పరిశ్రమలో అవకాశాలు రావని షార్ట్ ఫిలిం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో పొట్టిపిల్ల-గట్టిపిల్ల, బాయ్స్ ఆల్‌వేస్ ముదుర్స్, ఆమె ఊహాల్లో తదితర చిన్ని చిత్రాలు తీశారు. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమే ల క్ష్యంగా ముందడుగు వేస్తున్నాడీ నటదర్శకుడు. ఇక ఆర్య 3 తర్వాత వచ్చిన గుర్తింపు ఆనందంగా ఉందనీ, గుర్తింపుతో పాటు 6 బుల్లి సినిమాల్లో యాక్టింగ్ అవకాశం కూడా కలిగిందని చెప్పుకొచ్చారు ఈశ్వర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement