Arya -3
-
ఈ సినిమాలకు ముందుంది మూడో భాగం
ఫస్ట్ పార్ట్ హిట్... సెకండ్ పార్ట్ కూడా హిట్.. మరి ఆ హిట్ కంటిన్యూ అవ్వాలి కదా. అవ్వాలంటే కథ ఉండాలి. కొన్ని చిత్రాల కథలకు ఆ స్కోప్ ఉంది. ఎన్ని భాగాలైనా తీసేంత కథ ఉంటుంది. అలా తెలుగులో కొన్ని చిత్రాల కథలు ఉన్నాయి. ఆ కథల తొలి, మలి భాగాలు వచ్చాయి. ఇప్పుడు మూడో భాగానికి కథ రెడీ అవుతోంది. ‘ముందుంది మూడో భాగం’ అంటూ రానున్న సీక్వెల్ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఒకే కాంబినేషన్.. రెండు చిత్రాల సీక్వెల్ సీక్వెల్ చిత్రాలు రావడం ఇప్పుడు కామన్ అయింది. అయితే ఒకే కాంబినేషన్లో రెండు చిత్రాల సీక్వెల్స్ రావడం అరుదు. అల్లు అర్జున్–సుకుమార్‌ల కాంబినేషన్ ఈ కోవలోకే వస్తుంది. ‘ఆర్య’ (2004)తో ఈ ఇద్దరి కాంబినేషన్ మొదలైంది. ఆ చిత్రం హిట్‌తో హిట్ కాంబినేషన్ అనే పేరొచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ‘ఆర్య 2’ (2009) తెరకెక్కించారు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో ‘ఆర్య 3’ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ (2021) పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘పుష్ప 2’ నిర్మాణంలో ఉంది. ‘పుష్ప 3’ కూడా ఉంటుంది. ‘ఆర్య’, ‘పుష్ప’... ఇలా సౌత్‌లో రెండు చిత్రాల సీక్వెల్స్ తెచ్చిన కాంబినే షన్ బన్నీ–సుకుమార్లదే అవు తుంది. ఎఫ్ 4 వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన తొలి మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై నవ్వులు పూయించడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ‘ఎఫ్ 3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ తెరకెక్కించారు అనిల్. ఈ మూవీలోనూ వెంకటేశ్–తమన్నా, వరుణ్ తేజ్–మెహరీన్ హీరో హీరోయిన్లు. 2022 మే 27న విడుదలైన ‘ఎఫ్ 3’ కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ‘ఎఫ్ 4’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చింది చిత్ర యూనిట్. హిట్ 3 ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో ఇప్పటికే రెండు భాగాలు విడుదల కాగా మూడో భాగం కోసం డైరెక్టర్ శైలేష్ కొలను సన్నాహాలు చేస్తున్నారు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’ సినిమా 2020 ఫిబ్రవరి 28న విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘హిట్ 2: ది సెకండ్ కేస్’ తీశారు శైలేష్ కొలను. అయితే ఈ మూవీలో హీరో మారారు.. అడివి శేష్ హీరోగా నటించారు. 2022 డిసెంబరు 2న రిలీజైన ఈ మూవీ ఘన విజయం సాధించింది. హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ స్పష్టం చేశారు. ‘హిట్ 2’ లానే ‘హిట్ 3’లోనూ హీరో మారారు. ‘హిట్ 1’, ‘హిట్ 2’ సినిమాలు నిర్మించిన హీరో నాని ‘హిట్ 3’లో లీడ్ రోల్ చేయనున్నారు. ఇందులో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా నాని కనిపించనున్నారు. ‘హిట్ 2’ క్లయిమాక్స్లోనే నాని కనిపించి, ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. అటు నాని, ఇటు శైలేష్ కొలను తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. మరి ‘హిట్ 3’కి కొబ్బరికాయ కొట్టేదెప్పుడో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 3 కన్నడ చిత్ర పరిశ్రమను, యశ్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టిన చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 2018 డిసెంబరు 21న ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత యశ్‌తోనే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ని తెరకెక్కించారు ప్రశాంత్ నీల్. 2022 ఏప్రిల్ 14న రిలీజైన ఈ సినిమా కూడా హిట్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని హింట్ ఇచ్చారు మేకర్స్. -
షూటింగ్లో పాల్గొనడం సంతోషం
‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్ కోసం జైపూర్‌కు వచ్చాను. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు నటి సుష్మితాసేన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్కు ఓ మేజర్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్లో పాల్గొంటున్నారు. ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లోని మూడో సీజన్ కోసం సుష్మితాసేన్ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్ సిరీస్‌కు రామ్‌మద్వానీ, సందీప్ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్ ‘తాలి’ అనే మరో వెబ్‌సిరీస్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్‌ని గత నెలలో పూర్తి చేశారామె. -
Arya 3 Hero: త్వరలోనే ఆర్య 3.. హీరో బన్నీ కాదట, మరి ఎవరు?
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య, ఆర్య2 చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు రావడానికి కారణం `ఆర్య` సిరీస్ అనడంలో సందేహం లేదు. త్వరలోనే ఆర్య3తో తిరిగి రానున్నట్లు సుకుమార్ ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో అల్లు అర్జున్ మరో క్రేజీ సీక్వెల్ కు డేట్స్ కేటాయించాడని ఫ్యాన్స్ కూడా ఎగిరి గంతేశారు. కాని సుకుమార్ ,బన్ని ప్లానింగ్ వేరే ఉంది. ఆర్య3లో అల్లు అర్జున్ స్థానంలో మరో హీరోని ఎంపిక చేయనున్నారట. ఈసారి ఆర్య పాత్రలో అర్జున్ రెడ్డిని చూపిస్తాడట.అందుకు అల్లు అర్జున్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పటికే ఓ మూవీ లాక్ అయింది. ఆ మూవీనే ఆర్య 3 అని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం లైగర్ షూటింగ్ లో దేవరకొండ, పుష్ప షూట్లో సుకుమార్ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తైన తర్వాత ఆర్య3పై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
ఫీల్ మై ఫిల్మ్
ఒక పెద్ద సినిమా రిలీజైన రోజు భారీ కలెక్షన్లు సాధిస్తే సూపర్ హిట్.. మరి అదే చిట్టి సినిమా రిలీజైన 24 గంటల్లోనే 10 వేల వ్యూస్ కొల్లగొడితే బ్లాక్ బస్టరే. ఆ షార్ట్ ఫిల్మే ఆర్య-3. ఈ నెల 21న విడుదలైన ఈ బుల్లి సినిమాను నాలుగు రోజుల్లోనే 18 వేల మంది చూసేశారు. ఈ సినిమాకు రికార్డ్ వ్యూస్ రావడానికి కారణం డిఫరెంట్‌గా ప్రమోట్ చేయడమే కారణం. వైష్ణో మీడియా వారి ఫిల్మీటైం వెబ్ ద్వారా సినిమా రిలీజ్ చెయ్యటం, నితిన్, చార్మీ సినీనటుల ఫేస్బుక్ పేజీలలో ఈ వీడియో చేరటం ఈ చిన్ని సినిమా విజయానికి కారణమే. ఫ్రెండ్స్ సహకారంతో ఈ సినిమా నిర్మించానని చెప్తున్న డెరైక్టర్ ఈశ్వర్, ఈ సినిమా పబ్లిసిటీకి కూడా వారే ఎక్కువ కారణమన్నారు. గుర్తింపు కోసం.. యాక్టర్ అవ్వాలని నగరానికి వచ్చిన ఈశ్వర్, గుర్తింపు తెచ్చుకుంటే తప్ప పరిశ్రమలో అవకాశాలు రావని షార్ట్ ఫిలిం మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో పొట్టిపిల్ల-గట్టిపిల్ల, బాయ్స్ ఆల్వేస్ ముదుర్స్, ఆమె ఊహాల్లో తదితర చిన్ని చిత్రాలు తీశారు. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమే ల క్ష్యంగా ముందడుగు వేస్తున్నాడీ నటదర్శకుడు. ఇక ఆర్య 3 తర్వాత వచ్చిన గుర్తింపు ఆనందంగా ఉందనీ, గుర్తింపుతో పాటు 6 బుల్లి సినిమాల్లో యాక్టింగ్ అవకాశం కూడా కలిగిందని చెప్పుకొచ్చారు ఈశ్వర్.