Short Film
-
Filmfare Awards 2024: ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ పోటీలో ‘సత్య’
సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన షార్ట్ ఫిలిం ‘సత్య’ ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పోటీ పడుతోంది. పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో "సత్య" షార్ట్ ఫిలిం పోటీలో నిలిచింది. ఈ సందర్భంగా సాయిదుర్గ తేజ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమ మనసుకు దగ్గరైన షార్ట్ ఫిలిం ఇదని, "సత్య" షార్ట్ ఫిలిం చూసి ఓటు వేయాలని ప్రేక్షకుల్ని కోరారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ తో కలిసి తమ విజయదుర్గ ప్రొడక్షన్స్ సంస్థలో చేసిన తొలి ప్రయత్నంగా "సత్య" ఎన్నో మెమొరీస్ ఇచ్చిందని సాయిదుర్గ తేజ్ పేర్కొన్నారు. "సత్య" షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా "సత్య" ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది. ఫిలింఫేర్ వెబ్ సైట్ ద్వారా ప్రేక్షకులు తమ ఓటును వినియోగించుకోవచ్చు.For the first time ever, the world can watch Satya and bless us with your valuable vote 🇮🇳❤This story, so dear to our hearts, is competing for the People’s Choice Award at the Filmfare Short Film Awards 2024. We need your support to win—click the link, watch the film, and… pic.twitter.com/vrG0Ddsivn— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 24, 2024 -
ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమాకి ఉంది: అక్కినేని అమల
‘‘ఓ ఉత్తమమైన ప్రదేశంగా ప్రపంచాన్ని మార్చే శక్తి సినిమా మాధ్యమానికి ఉంది’’ అని అక్కినేని అమల అన్నారు. గోవాలో జరుగుతున్న 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ)లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాకు చెందిన విద్యార్థులు తీసిన షార్ట్ ఫిల్మ్ ‘రోడ్ నెం 52’ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా అమల విలేకరులతో మాట్లాడారు. ‘‘దేశంలోఎందరో ప్రతిభావంతులైన యువత సినీ రంగంలో రాణించేందుకు కృషి చేస్తున్నారని, వారిని తీర్చిదిద్దే పనిలో తాము పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు.కొన్నేళ్లుగా వందలాది మందికి తమ అన్నపూర్ణ సంస్థ శిక్షణ అందించిందని, ఇప్పటికే పలువురు సినిమా రంగంలో పని చేస్తున్నారని వివరించారు. మహారాష్ట్రకు చెందిన యువకులు అచ్చ తెలుగు కథాంశం ఎంచుకుని అద్భుతమైన రీతిలో తెరకెక్కించారని ‘రోడ్ నెం 52’ రూపకర్తల్ని అభినందించారు అమల. ‘రోడ్ నెం 52’ రచయిత– దర్శకుడు సరోజ్, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ అథర్వ మహేష్ గాగ్ తమ అనుభవాలు పంచుకున్నారు. నటీమణుల పాత్రల నిడివి పెరగాలి‘‘నటీమణులకు తెరపై పోషించే పాత్రల నిడివి పెరిగితే తెరవెనుక గౌరవం కూడా పెరుగుతుంది’’ అనే అభిప్రాయం ‘ఇఫీ’లో నిర్వహించిన సదస్సులో వ్యక్తమైంది. సినీ పరిశ్రమలో మహిళా భద్రత అనే అంశంపై జరిగిన చర్చలో నటి–నిర్మాత వాణీ త్రిపాఠి టికూ మోడరేట్ చేసిన ఫ్యానెల్ పాల్గొంది. నటి సుహాసినీ మణిరత్నం మాట్లాడుతూ– ‘‘సినిమాల్లో ఏదో ఇలా వచ్చి అలా పోయేవి కాకుండా మహిళలు తాము నటించే పాత్రలు బలంగా ఉండేలా చూసుకోవాలి’’ అన్నారు.‘‘లొకేషన్లో మహిళలు వేధింపులకు గురి కాకూడదు. వారికి తాము చేసే పని వాతావరణంలో భద్రత, గౌరవం తప్పనిసరిగా ఉండాలి’’ అని దర్శకుడు ఇంతియాజ్ అలీ పేర్కొన్నారు. ‘‘వినోదంపై దృష్టి సారిస్తూనే సమానత్వానికిప్రా ధాన్యం ఇవ్వడంతో పాటు బాధ్యతాయుతమైన చిత్రనిర్మాణం సాగాలి’’ అని ఖుష్బూ అన్నారు. మహిళలు తెరపై గౌరవప్రదంగా, తెరవెనుక సురక్షితంగా ఉండాలని, మహిళల భద్రతకి సినిమా ఉదాహరణగా ఉండాలనే పిలుపుతో ఫ్యానెల్ ముగిసింది. -
అస్కార్ బరిలో ఇండియన్ షార్ట్ ఫిలిం
‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ అనే ఇండియన్ షార్ట్ ఫిలిం 2025 ఆస్కార్‌కు అర్హత సాధించింది. చిదానంద S నాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆస్కార్ రేసుకు అర్హత దక్కించుకుందని తాజాగా చిత్ర నిర్మాత తెలిపారు. పలు హాలీవుడ్ చిత్రాలతో పోటీ పడిన ఈ చిత్రం ఆస్కార్ బరిలో ఎంట్రీ ఇవ్వడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. లైవ్ యాక్షన్ విభాగంలో తమకు అవకాశం దక్కినట్లు నిర్మాత పేర్కొన్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ చిత్రం అవార్డ్ దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు. ఓ వృద్ధురాలి కోడిని కొందరు దొంగలించడంతో కథ ప్రారంభం అవుతుంది. ఎలాగైనా సరే దానిని కనుగొని ఆ కోడిని తిరిగి తెచ్చుకోవడం కోసం ఆమెపడే తపనను ఇందులో దర్శకుడు చూపారు. ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో సత్తా చాటిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’ చిత్రం.. ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకుంటుందని ఆశిస్తున్నారు.మైసూర్‌కు చెందిన నాయక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే MBBS పూర్తి చేసిన ఆయన సినిమా నిర్మాణ రంగం వైపు అడుగులేస్తున్నారు. ఆయన నిర్మించిన సినిమా ఆస్కార్‌కు అర్హత సాధించడంతో తన సొంత ఊరు అయిన శివమొగ్గలో సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే భారత్ నుంచి 'లాపతా లేడీస్' అస్కార్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమిర్‌ఖాన్ మాజీ సతీమణి కిరణ్‌రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. -
Cannes 2024: కన్నడ జానపదానికి కాన్స్ బహుమతి
దక్షిణ భారత జానపద కథ కాన్స్ మొదటి బహుమతి గెలుచుకుంది. కోడి కూయకూడదని ఒక అవ్వ పుంజును దొంగిలిస్తే ఆ ఊళ్లో తెల్లారదు. తర్వాత ఏమవుతుందనేది 15 నిమిషాల షార్ట్ఫిల్మ్గా తీశాడు పూణె ఇన్స్టిట్యూట్ చిదానంద నాయక్. ప్రపంచవ్యాప్తంగా 2263 ఎంట్రీలు వస్తే చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు మొదటి బహుమతి వచ్చింది. ఈ ఘనత సాధించిన చిదానంద పరిచయం.మారుమూల చిన్న పల్లెటూరు. ప్రతి ఉదయం కోడి కూయగానే తెల్లారుతుంది. ఆ రోజు కోడి కూయలేదు. తెల్లారలేదు. చీకటి. ఎక్కడ చూసినా చీకటి. సూర్యుడు ఎందుకు రావడం లేదు? కోడి కూయడం లేదు. కోడెందుకు కూయడం లేదు? ఊళ్లోని అవ్వ దానిని దొంగిలించి దాచేసింది. దేవుడా... పదండి కోడిని వెతకండి. ఊరంతా బయలుదేరింది. లాంతర్లు పట్టుకుని తలోదిక్కు. అంతేనా? దీనికంతటికీ కారణమైన అవ్వ కుటుంబాన్ని వెలేసింది. కోడి దొరక్క΄ోయినా అవ్వ కనపడక΄ోయినా ఆ ఊరిలో సూర్యుడు వచ్చేలా లేడు. తర్వాత ఏమైంది?చిదానంద నాయక్ తీసిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్వన్స్ టు నో’ (΄÷ద్దు తిరుగుడు పూలకే మొదట తెలుస్తుంది) షార్ట్‌ఫిల్మ్ చూడాలి. 15 నిమిషాల ఈ షార్ట్‌ఫిల్మ్‌కు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగంలో ఈ ప్రతిష్టాత్మక బహుమతి దక్కింది.ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థుల కోసం...ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లలో చదివే విద్యార్థులను ్ర΄ోత్సహించేందుకు కాన్స్ ఫెస్టివల్లో ‘లే సినే’ విభాగం ఉంటుంది. దీనికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు గంట నిడివి లోపు ఉన్న షార్ట్‌ఫిల్మ్స్‌ను ఎంట్రీగా పంపవచ్చు. జ్యూరీ వీటిని పరిశీలించి ఫస్ట్, సెకండ్, థర్డ్ బహుమతులు ఇస్తుంది. ఈసారి మొత్తం 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2263 ఎంట్రీలు వస్తే మొదటి ప్రైజ్ చిదానంద తీసిన ‘సన్‌ఫ్లవర్స్’కు దక్కింది. దాదాపు పదమూడున్నర లక్షల ప్రైజ్‌మనీ ఇస్తారు. ఇది సామాన్యవిషయం కాదు. మన దక్షిణాది జానపదానికి దక్కిన గౌరవం కింద లెక్క.దర్శకుడైన డాక్టర్చిదానంద నాయక్ది కర్ణాటక. చిన్నప్పటి నుంచి అకిరా కురసావా సినిమాలు చూస్తూ పెరిగాడు. సినిమా దర్శకుడు కావాలని ఉన్నా మెడిసిన్ చదవాల్సి వచ్చింది. ‘ఒక డాక్టర్‌గా అతి దగ్గరి నుంచి జననాన్ని, మరణాన్ని చూడటం నాకు మానవ జీవనసారాన్ని తెలిపింది. ఒక వైద్యుడిగా జీవించడమంటే క్షణంలో ఆనందం క్షణంలో దుఃఖాన్ని చూడటమే. మనుషుల మకిలి లేని నిజాయితీని ఆ సమయంలోనే చూస్తాం’ అంటాడు చిదానంద. డాక్టరయ్యాక కూడా మనసు సినిమా రంగంలోనే ఉన్నట్టు అర్థమయ్యి పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు.నాలుగు రోజుల్లో షూట్:‘సన్‌ఫ్లవర్స్’ షార్ట్‌ఫిల్మ్‌ను తన సంవత్సరాంత అభ్యాసంగా తీశాడు చిదానంద. ‘మా ఇన్స్టిట్యూట్కు 50 కిలోమీటర్ల దూరం లోపల షార్ట్‌ఫిల్మ్ తీయాలని నియమం. ఆ దూరంలోనే ఒక లోపలి పల్లెలో షూట్ చేశాం. నాలుగు రోజుల్లోనే తీయమని చె΄్పారు. కథంతా రాత్రే కాబట్టి నాలుగు రాత్రులు ఒళ్లు హూనం చేసుకుని పని చేశాం’ అని తెలి΄ాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులే– సూరజ్ (సినిమాటోగ్రఫీ), మనోజ్ (ఎడిటింగ్) సాంకేతిక శాఖలు నిర్వర్తించారు.నీ కోడి కూయక΄ోతే...‘నీ కోడి కూయక΄ోతే తెల్లారదా?’ అనేది లోకోక్తి. అంటే ఎదుటి వారంటే లెక్కలేక΄ోవడం, ఏదైనా లెక్క చేయకుండా ఉండటం ఈ మాటలో ఉంది. కాని ఈ జానపద కథ ప్రతి వ్యక్తి, ప్రతి అనుభవం, ప్రతి మేల్కొలుపు కూడా ముఖ్యమే అని చెబుతుంది. దేనినీ మర్చి΄ోకూడదని, నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తుంది. ‘మా కర్నాటకలో ప్రతి చిన్నపిల్లవాడికి ఈ కథ తెలుసు. దానిని షార్ట్ఫిల్మ్గా తీయడం, ఈ ప్రతిష్టాత్మక బహుమతి రావడం సంతోషంగా ఉంది’ అంటున్నాడు చిదానంద. -
భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి వారిపై ప్రశంసలు కురిపించారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్-2024లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా ఇండియాకు చెందిన చిత్రం ఎంపిక కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' చిత్రబృందాన్ని అభినందించారు. ఈ మేరకు తన ట్విటర్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలిపారు.రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'భారతీయ ప్రతిభ సరిహద్దులను దాటుతోంది. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా లా సినీఫ్ అవార్డును గెలుచుకున్న సందర్భంగా ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ ఒన్స్ టు నో’ రూపొందించిన యువతకు ఇవే నా వందనాలు' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తీసిన చిదానంద నాయక్‌ను ట్యాగ్ చేశారు.కాగా.. చిదానంద తెరకెక్కించిన సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో షార్ట్ ఫిల్మ్ కేన్స్‌లో అరుదైన ఘనత సాధించింది. వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి తొలి స్థానంలో నిలిచింది. 16 నిమిషాలు ఉన్న ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఓ కన్నడ జానపద కథ ఆధారంగా రూపొందించారు. వృద్ధురాలి కోడిని ఎవరో దొంగలించడం.. దానిని కనుగొనడం కోసం ఆమె పడే తపనను ఈ చిత్రంలో చూపించారు. ఇప్పుడీ షార్ట్ ఫిల్మ్ హాలీవుడ్‌తో పోటీ పడి మొదటి బహుమతి గెలుచుకోవడంపై చిత్ర బృందం హర్షం వ్యక్తం చేసింది. Indian talent breaching boundaries… Happy to hear that @Chidanandasnaik’s ‘Sunflowers Were the First Ones to Know’ has won the La Cinef Award for Best Short Film at Cannes 2024!Kudos to the youngsters 👏🏻👏🏻— rajamouli ss (@ssrajamouli) May 24, 2024 -
కేన్స్‌లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్‌కు చెందిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' షార్ట్‌ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes) -
‘ఓటు వేయాలంటూ.. సెలబ్రిటీల ప్రచారం’
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు 7 దశల్లో జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఏప్రిల్ 19 నుంచి 7 దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు జూన్ 04న విడుదలవుతాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లులో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినీ, క్రీడా సెలబ్రిటీలతో ఓ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో..‘తప్పకుండా ఓటు వేయండి.. ఓటు వేయటం మీ కర్తవ్యం’అని సెలబ్రిటీలంతా కోరుతారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించటం గమనార్హం. క్రీడా రంగం నుంచి సచిన్ టెండుల్కర్, సినిమా రంగం నుంచి పలువురు బాలీవుడ్, కోలివుడ్ ప్రముఖలు ఉన్నారు. వారివారి శైలీలో ఓటు వేయాలని కోరారు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోపై ఓ లుక్కేయండి.. -
బలగం నటుడి షార్ట్ ఫిలిం.. ఎలా ఉందంటే?
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనుకునే ఆస్తికులు.. సైన్స్ తప్ప ఈ బ్రహ్మాండాన్ని ఏది నడిపించదు అనుకునే నాస్తికులు.. ఎవరిది నిజం అని చెప్పే ప్రయత్నమే 'బస్‌లో టైం ట్రావెల్' అనే షార్ట్ ఫిలిం. బలగం నటుడు మీమె మధు, ఆకాశవాణి ప్రభు, కనకరెడ్డి, అన్నపూర్ణ, కిట్టు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కుమార్ జాణ దర్శకత్వం వహించగా నరేశ్ సముద్రాల నిర్మించాడు. ఈ షార్ట్ ఫిలిం ఎలా ఉందో చూసేద్దాం.. డబ్బులొచ్చాక కళ్లు నెత్తికి.. కోటేశ్వరరావు.. కటిక పేదవాడు.. అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడయ్యాడు. కానీ డబ్బుతో పాటు అహం, పొగరు, చెడు అలవాట్లు అన్నీ అలవడ్డాయి. కుటుంబాన్ని సైతం లెక్కచేసేవాడు కాదు. అతడి జీవితంలో జరిగిన ఓ విచిత్రమే ఈ షార్ట్ ఫిలిం. అప్పటివరకు కళ్లు నెత్తి మీదున్న కోటేశ్వరరావుకు ఒక్క బస్ జర్నీతో తను చేసిన తప్పులేంటో తెలుసుకుంటాడు. ఒక్క జర్నీతో తప్పు తెలుసుకుని.. పైసా పిచ్చితో కుటుంబాన్ని, జనాలను ఎంత టార్చర్ పెట్టాడో అర్థం చేసుకుంటాడు. ఇంటికి వెళ్లి చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. ఒక్కసారిగా మారిపోతాడు. అవమానించిన వాళ్లను ప్రేమించడమే గొప్ప.., సంపాదించడమే గొప్ప అయితే సాటి మానవుడి ఆకలి తీర్చడం అంతకంటే గొప్ప, కనబడని దేవుడిని వెతకకు.. నీలో ఉన్న దేవుడిని వెతుక్కో.. వంటి డైలాగులు బాగున్నాయి. అప్పుడు మనిషే దేవుడు "ప్రతి జీవి దానికి కనిపించే ప్రపంచాన్ని మాత్రమే చూస్తుంది. మనిషి దృష్టిలో చీమెంతో, దేవుడి దృష్టిలో మనిషి కూడా అంతే! దేవుడు ఉన్నాడా లేదా అని కనీసం మనుషులుగా వాదించుకుంటున్నాం. మిగతా జీవులన్నిటికి అసలు ఈ వాదనలు కూడా లేవు. ఎందుకంటే దేవుడి కాన్సెప్టే వాటికి తెలియదు. అందుకే కనబడని దేవుడు ఏదో చేస్తాడని చూడక, దేవుళ్ల పేరుతో ఖర్చు పెట్టే కోట్ల డబ్బులో కొంత పేదవారికి ఖర్చు పెట్టండి. అప్పుడు మనిషే దేవుడు అవుతాడు. సాటి మనిషికి సాయం చేసిన వాడే దేవుడు అని చెప్పడం.. బతికే ఈ చిన్న జీవితంలో గొడవలు, కొట్లాటలు, కుళ్లు కుతంత్రాలు మాని అందరితో కలిసి మెలిసి బతకాలని చెప్పడమే.. మా ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశ్యం" అని చివర్లో గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ షార్ట్ ఫిలింను కింద మీరూ చూసేయండి.. -
రాడిసన్ డ్రగ్స్ కేసులో నటి పేరు!
హైదరాబాద్, సాక్షి: గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఓ నటి పేరు వినవస్తోంది. ఆమె పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన పోలీసులు.. పిలిచి విచారిస్తామని అంటున్నారు. విశేషం ఏంటంటే.. ఆ నటి పేరు, ఆమె సోదరి పేర్లు గతంలోనూ డ్రగ్స్ వ్యవహారంలో వినవచ్చాయి. యూట్యూబర్‌గా, షార్ట్ ఫిల్మ్స్‌తో లిషి గణేష్పేరును రాడిసన్ డ్రగ్స్‌పార్టీ కేసులో సైబరాబాద్ పోలీసులు చేర్చినట్లు సమాచారం. బీజేపీ నేత తనయుడైన గజ్జల వివేకానంద రాడిసన్ హోటల్లో ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు. అయితే ఆ పార్టీకి లిషి కూడా వెళ్లిందని గుర్తించామని.. ఆమెను కచ్చితంగా పిలిచి విచారిస్తామని కూడా చెబుతున్నారు. జియోమెట్రీ బాక్స్ లాంటి షార్ట్ ఫిల్మ్‌తో నటిగా ఆమె ఓ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్ వీడియోలతోనూ ఆమె యూజర్లను అలరిస్తుంటారు. ఇక.. 2022లో సంచలన చర్చకు దారి తీసిన మింక్ పబ్ డ్రగ్ కేసులోనూ లిషితో పాటు ఆమె సోదరి కుషిత పేరు కూడా వినిపించింది. ఆ సమయంలో కుషిత ఆ ఆరోపణల్ని ఖండిస్తూ చీజ్ బజ్జీలు తినడానికి వెళ్లామంటూ ఓ ఇంటర్వ్యూ లో పేర్కొంది. అంతే.. ఆమెను తెగ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆమె సోదరి లిషి గణేష్ పేరు రాడిసన్ డ్రగ్స్ కేసులో వినిపించడం గమనార్హం. లిషితో పాటు శ్వేత అనే వీఐపీ పేరును ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. Actor Lishi named again in drugs case Gachibowli police of #Cyberabad named Kallapu Lishi Ganesha as accused in the Radisson hotel drugs case in which BJP leader’s son Gajjala Vivekananda was caught. She acted in a short film titled 'Geometry Box' Vivekananda confessed and… pic.twitter.com/QHrEnRQHJp — Sudhakar Udumula (@sudhakarudumula) February 26, 2024 -
అమెరికా డ్రీమ్స్.. ఇదీ రియాల్టీ
అమెరికాలో మాస్టర్స్ చేసే ఓ ఇండియన్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? అతడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటాడు? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ‘మాస్టర్స్’. వంశీకృష్ణ అచ్చుత హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ లఘు చిత్రానికి యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ.. ‘చాలా మంది ఎన్నారైలు నా షార్ట్ ఫిలింపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అమెరికానే కాదు..కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఫోన్ చేసి ఫిలిం బాగుందని మెచ్చుకుంటున్నారు. నేను కూడా మాస్టర్స్ కోసం.. మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు తమని తాము సినిమాలో చూసుకుంటున్నట్లుగా ఉందని చెప్పడం ఆనందంగా ఉంది. నేను కూడా మాస్టర్స్ కోసమే 21 ఏళ్ల వయసులో యూఎస్ వచ్చాను. నాతో పాటు నా స్నేహితుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలతోనే ఈ లఘు చిత్రాన్ని తీర్చిదిద్దాను. గన్ కల్చర్‌ని ఇందులో కవర్ చేశాం. చదువు కోసమో, ఉద్యోగం కోసమో వచ్చిన విదేశీయులను ఎందుకు చంపుతున్నారు? విదేశాల్లో ఒక అమ్మాయి చనిపోతే బాధపడకపోగా, ఇండియాను వదిలి ఎందుకు వెళ్లాలి? డబ్బు కోసం తెల్లోడి బూట్లు నాకాలా? అంటూ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. రిచ్ లైఫ్ కోరుకోవడం తప్పా? ఓ మధ్య తరగతికి చెందిన వాడు రిచ్ లైఫ్‌ని కోరుకోవడం తప్పా? తన పేరెంట్స్‌ని కార్లలో తిప్పాలని కోరుకోవడం తప్పా? ఒక ఇండియన్ స్టూడెంట్ అమెరికాలో చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఇవేమీ ఆలోచించరు, నోటికొచ్చింది మాట్లాడుతారు. ఎంతోమంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో పిట్టల్లా రాలిపోతున్నా ఇప్పటివకు ఒక్కటంటే ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయలేదు. ఇటువంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ జరుగుతున్నాయి? అని ఆరా తీసి వాటిపై అవగాహన కల్పిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడుకోగలుగుతాం' అని ఎమోషనల్ అయ్యాడు వంశీకృష్ణ. -
మాస్టర్స్.. NRI విద్యార్థుల్లో మార్పు కోసం
-
'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' స్పూఫ్ షార్ట్ ఫిల్మ్ వైరల్.. మీరు చూశారా?
ఒకప్పుడేమో ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఎవరికి వాళ్లే తమ టాలెంట్‌ని చూపించుకుంటున్నారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే మాత్రం ఫుల్ వైరల్ అయిపోతున్నారు. అలా '7 ఆర్ట్స్' వీడియోలతో సరయు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు వీళ్ల నుంచి 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' షార్ట్ ఫిల్మ్ రిలీజైంది. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) 2021 డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన 'పుష్ప'.. దేశవ్యాప్తంగా ఓ రేంజ్లో క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్‌తో మూవీ టీమ్ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' పేరుతో ఓ స్ఫూప్ వీడియో చేశారు. 'పుష్ప' మూవీలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉన్నాయి. పుష్పరాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ నటించారు. ఈ కాన్సెప్ట్ రాసుకుని, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేశాడు. 'పుష్ప 2' కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్ని తీసినట్లు తెలుస్తోంది. షెకావత్ తనను బ్రాండ్ అని అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) -
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులు గెల్చుకున్న షార్ట్ ఫిలిం, స్ట్రీమింగ్ అక్కడే!
షష్టి, సరస్ లఘు చిత్రాలు అంతర్జాతీయ అవార్డులను కొల్లగొట్టాయి. షష్టి లఘు చిత్రం 2022లో 35వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో 75 అవార్డులను గెలుచుకుంది. ఇక సరస్ అనే లఘు చిత్రం 2023లో 20వ అంతర్జాతీయ చిత్రోత్సవాల పోటీల్లో పాల్గొని 70కి పైగా అవార్డులను గెలుచుకుందని ఈ లఘు చిత్రాల దర్శకుడు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు. ఈయన ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ కావడం గమనార్హం. గత 30 ఏళ్లుగా ఆ రంగంలో విశేష సేవలు అందించిన ఆయన సినిమా రంగంపై ఆసక్తితో ఆ వృత్తి నుంచి బయటకు వచ్చారు.ఆ తరువాత దర్శకుడిగా అవతారం ఎత్తి తొలి ప్రయత్నంగా షష్టి అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. పలువురి ప్రశంసలను అందుకున్న ఈ లఘు చిత్రం అంతర్జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో 75 అవార్డులను గెలుచుకోవడంతో అదే ఉత్సాహంతో సరస్ అనే మరో లఘు చిత్రాన్ని రూపొందించారు. ఇది కూడా 70 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. సొంత ఆలోచనలను, అనుభవాలను, కళాత్మకంగా, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చిత్రాలను ప్రేక్షకుల అందించాలన్న భావనతో తానీ రంగంలో వచ్చినట్లు జూట్ పీటర్ డెమియన్ పేర్కొన్నారు. కాగా షష్టి ఇప్పుడు యాపిల్ టీవీ అనే ఓటీటీ యాప్‌తో పాటు ఇతర యూట్యూబ్ చానల్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సరస్ లఘు చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. చదవండి: డబ్బు కోసం వ్యాపారిని బెదిరించిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్ -
మా మావయ్య, విశ్వనాధ్ గారు గ్రేట్ ఫ్రెండ్స్
-
ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్ షార్ట్ ఫిలిం
-
ప్రతి రైతు మనుసును కదిలిస్తున్న 'నాగలి' చిత్రం.. యూట్యూబ్‌లో విడుదల
నిజ జీవిత విలువల నేపథ్యంలో వస్తున్న సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రైతు నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ నీరాజనం పలుకుతుంటారు. రైతన్న కష్టసుఖాలను తెరపై ఆవిష్కరించే సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇదే బాటలో ఇప్పుడు 'నాగలి' అనే ఒక లఘు చిత్రాన్ని డాక్టర్ విశ్వామిత్ర రెడ్డి, మానస (USA) సమర్పణలో సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి నిర్మించారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన 'నాగలి' అనే 24 నిమిషాల లఘు చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో బలగం ఫేమ్ అరుసం మధుసుదన్ కీలక పాత్రలో నటించారు. (ఇదీ చదవండి: ఫ్యాన్స్‌కు కోటి విరాళం.. అవసరం ఉన్న వాళ్లు ఇలా ధరఖాస్తు చేసుకోండి: విజయ్) నేషనల్ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) విడుదల చేస్తున్న నివేదికల ప్రకారం ప్రతి ఏడాది భారత్‌లో సుమారు 15 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్యలు దేశానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని సాక్షాత్తు సుప్రీం కోర్టు కూడూ పలు మార్లు వ్యాఖ్యానించింది. రైతుల ఆత్మహత్యలపై ప్రతీ రోజూ పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటాయి.. వారి పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే మన అందరిదీ కూడా రైతు నేపథ్యం కాబట్టి. అలాంటి రైతుల ఘోషను గుర్తించిన సుంకర.నీలిమా- దేవేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తమ వంతుగా ఇలాగైనా రైతుల ఆత్మహత్యలు ఆగాలనే ఆకాంక్షతో 24 నిమిషాల నిడివితో 'నాగలి' అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మొదట తన ప్రేమను ప్రియురాలు కాదని చెప్పడంతో ఒక యువకుడు పొలం గట్టుపైనే పురుగుల మందు తాగే ప్రయత్నం చేస్తాడు. ఈలోపు నటుడు మధు అక్కడ ప్రత్యక్షం అయి అతన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు.. ఈ సీన్ రెగ్యూలర్ సినిమాల్లో మాదిరి కాకుండా కొంచెం ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. నీతో పాటు పురుగుల మందు తాగి చనిపోయేందుకు ఒక పెద్దాయన కూడా ఇక్కడికి వస్తున్నాడని ఆ యువకుడితో చెప్తాడు. అది నీకు ఎలా తెలుసని ఆ యువకుడు ప్రశ్నిస్తాడు. ఈలోపు ఆ పెద్దాయన నిజంగానే వస్తాడు. వారిద్దరూ చనిపోబోతున్నట్లు ముందే అతను ఎలా గ్రహించాడు...? ఒకరైతు ఎందుకు చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు..? ఆ యువకుడిని కాదన్న యువతి ఎవరు..? వారితో పాటు ఉన్న తీరని కష్టాలు ఏంటి..? తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే. ప్రతి గ్రామంలో ఉండే యువకుల్లో కొందరైనా ఇలా ఆలోచిస్తే తమ చుట్టూ ఉన్న రైతులను కాపాడుకోవచ్చని దర్శకుడు జానా రాజ్‌కుమార్ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఎంతో ఆసక్తిగా సాగే ఈ చిత్రాన్ని మీరూ చూసేయండి. -
రక్షాబంధన్ అందరిదీ..అపోలో టైర్స్ యాడ్ అదిరిపోయింది.. వైరల్ వీడియో
Apollo Tyres-Raksha Bandhan 2023: రాఖీ పండుగ లేదా రక్షా బంధన్.. అంటే రక్షణ.. బాధ్యతకు ప్రతీక. సోదరులు, సోదరీమణుల మధ్య బంధాన్ని మాత్రమే కాదు మనిషికి మనిషికీ మధ్య ఉంటే బంధానికి రక్షణ. ఒక నమ్మకం. ఈ రక్షణ స్ఫూర్తికి హద్దులు ఉండవు. ఈ నమ్మకాన్నే పునరుద్ఘాటిస్తూ ప్రముఖ టైర్ల కంపెనీ అపోలో టైర్స్ రక్షా బంధన్‌పై అద్భుతమైన యాడ్‌ను రూపొందించింది. ఈ యాడ్ ఇపుడు నెటిజనులను ఆకట్టుకుంటోంది. అపోలో టైర్స్ రక్షా బంధన్ సారాంశాన్ని షార్ట్ ఫిల్మ్ ద్వారా స్పెషల్‌గా ప్రకటించింది. రక్షా బంధన్ ప్రతి ఒక్కరి కోసం అంటూ ఈ స్టోరీని అందంగా వివరించింది. నిజానికి రాఖీ పండుగ అన్నదమ్ములు, సోదరీ మణుల అనుబంధాన్ని ప్రత్యేక జరుపు కోవడం ప్రతీతి. కానీ రక్షా బంధన్ ప్రతి ఒక్కరికీ, మన జీవితంలో పరిధీయ పాత్రలు పోషిస్తున్న వారందరిదీ అంటూ ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇంతకీ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఏముందంటే.. ఒక యువతి రక్షా బంధన్ రోజున తన ఇంటికి కారులో వెడుతూ ఉంటుంది. అయితే, ఒక ట్రక్కు తనను తాను వెంబడిస్తూ, హారన్మోగిస్తూ ఉంటాడు. దీంతో ఆమె అసౌకర్యానికి గురవుతుంది.. ఏదో అనుమానంతో చూస్తుంది. కానీ అకస్మాత్తుగా కారు ఆగిపోతుంది. హైవేలో ఒంటరిగా మిగిలిపోతుంది. బిక్కుబిక్కుమంటూ చూస్తున్న ఆమె ఇక్కడే ఆశ్చర్యానికి లోనవుతుంది. తనను అప్పటిదాకా వెంబడించిన ట్రక్ డ్రైవరే ఆమె పాలిట ఊహించని రక్షకుడిగా మారతాడు. భయపడొద్దు అంటూ భరోసా ఇచ్చి...ఆమెను గమ్య స్థానానికి చేరుస్తాడు. దీనికి ప్రతిఫలంగా ఆమె డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తూ.. నా సోదరి లాంటిదానికి వద్దు అంటాడు. ఇక తర్వాత మీకు తెలిసిందే.. అతని సహృదయానికి, తన పట్ల బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్‌కి రాఖీ కడుతుందన్న మాట ఆ యువతి. రక్షా బంధన్ అంటే అందరిదీ. అపరిచితులైనా సరే.. ఆపదలో ఉన్న వారి పట్ల బాధ్యతగా ఉండటం, రక్షణగా నిలబడటమే దీని ఔచిత్యం అనే సందేశంతో ఈ షార్ట్ ఫిలిం ముగుస్తుంది. అంతేకాదు అపోలో టైర్స్ ప్రతి ప్రయాణంలో వినియోగదారులకు భద్రత నిస్తుంది. ఈ భద్రతను నిర్ధారించే తన నిబద్ధతను మరోసారి నొక్కి చెబుతుంది ఈయాడ్‌లో.. -
మాదకద్రవ్యాల అనర్థాలను తెలిపే 'ఉరుది'
కలైంజర్ కరుణానిధి శత జయంతి సందర్భంగా తమిళనాడును మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి రఘుపతి అన్నారు. మాదక ద్రవ్యాల వ్యసనం కారణంగా కుటుంబాలు ఎలా బాధింపునకు గురవుతున్నాయన్న ఇతి వృత్తంతో గతంలో ఒళక్కం అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. తాజాగా పల్ సమయ నల్లురవు సంఘం ఆధ్వర్యంలో జె.ముహమద్ రవి 'ఉరుది' అనే లఘు చిత్రాన్ని నిర్మించారు. ఈ రెండింటికీ మంగై అరిరాజన్ దర్శకత్వం వహించారు. (ఇదీ చదవండి: 50 ఏళ్ల వయసులో 'మళ్లీ పెళ్లి'.. సీనియర్ నటి క్లారిటీ) ఉరుది లఘు చిత్ర పరిచయ కార్యక్రమం చైన్నెలో జరిగింది. మంత్రి రఘుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నటుడు రాజేశ్, ఎమ్మెల్యే ఏఎంవీ ప్రభాకర్‌రాజా, కోటై అబ్బాస్ తదితరులు అతిథులుగా పాల్గొని లఘు చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. మంత్రి రఘుపతి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల కారణంగా జరిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించిన జే.ముహమద్ రవి, దర్శకుడు మంగై అరిరాజన్లకు ధన్యవాదాలు తెలిపారు. మాదక ద్రవ్యాలు లేని తమిళనాడుగా మార్చడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. యువత కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఒక వ్యక్తి మద్యానికి బానిసైతే అతనితో పాటు అతని కుటుంబం బాధింపునకు గురవుతుందని మంత్రి తెలిపారు. (ఇదీ చదవండి: సమంత డిజైనర్ చీర.. ధర ఎంతో తెలుసా?) -
హీరోగా చేస్తున్న సమయంలో విలన్‌గా ఆఫర్.. అయినా ఓకే!
నిరోజ్ పుచ్చా హీరోగా ధీన రాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భారతీయన్స్’. శంకర్ ఎన్. అడుసుమిల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ అయింది. శనివారం విలేకరుల సమావేశంలో నిరోజ్ పుచ్చా మాట్లాడుతూ– ‘‘2019లో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్‌తో నా యాక్టింగ్ జర్నీ మొదలైంది. ‘భారతీయన్స్’ చేస్తున్నప్పుడే నాకు విలన్‌గా చాన్స్ వస్తే, ఓకే చెప్పాను. ఎందుకంటే హీరోనా? విలనా అని కాదు.. యాక్టర్‌గా నిరూపించుకోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. -
సినిమాటోగ్రాఫర్ గా మారిన అనుపమ
వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ఒకవైపు హీరోయిన్గా రాణిస్తూనే మరోవైపు తనలో దాగిఉన్న మరో టాలెంట్‌ని అందరికి తెలియజేయాలనుకుంటుంది. సినిమాటోగ్రఫీపై అనుపమకు మంచి అవగాహన ఉంది. ఎప్పటికైనా డీఓపీగా పని చేయాలని అనుపమ కోరిక. తాజాగా ఆమె కోరిక నెరవేరింది. సంకల్ప్ గోరా దర్శకత్వం వహించిన ఐ మిస్ యు అనే షార్ట్ ఫిల్మ్‌తో సినిమాటోగ్రాఫర్‌గా మారింది. ఓ యూట్యూబ్ చానల్ వేదికగా విడుదలైన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో అనుపమ కెమెరా వర్క్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. యూ ఎస్ లో నివసిస్తున్న ఒక యువకుడు.. అతని తల్లిదండ్రులతో అతని సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. వరుస హిట్స్ కూడా ఉన్న ఒక హీరోయిన్ ఇలా ప్రొఫెషనల్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం సౌత్ ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌ఫ్లై తదితర చిత్రాలతో అలరించిన అనుపమ.. ప్రస్తుతం ఓ కోలివుడ్ మూవీతో పాటు మలయాళ ఫిల్మ్‌లోనూ నటిస్తోంది. -
'బ్రహ్మజీ గొప్ప మనసు.. డబ్బులు తీసుకోకుండానే చేశాడు'
టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల చిత్రాల్లో పలు రకాల పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. విభిన్నమైన పాత్రలతో నటించిన ప్రత్యేక పేరు సంపాదించారు. అలాగే ఆయన ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించారు. అదే విహాన్ తెరకెక్కించిన 'హ్యాంగ్ మాన్' లో తలారి పాత్ర పోషించారు. ఉరిశిక్ష పడిన ఖైదీలను ఉరి తీసే వ్యక్తిని తలారి అంటారు. ఇది ఒక చిన్న సినిమా అయినా ఒక తలారి జీవితం ఎలా ఉంటుంది? అతను ఉరి తీసేటప్పుడు మానసికంగా ఎలా సిద్దమవుతాడు? అనే విషయాలను తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రహ్మాజీ తన కుమారునికి కొడుక్కి కూడా తలారి పని ఎలా చేస్తారో కూడా వివరిస్తుంటాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఈమధ్య హైదరాబాద్‌లోని ప్రివ్యూ థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాలో బ్రహ్మజీ నటనకు అందరూ చప్పట్లు కొట్టారు. ఆ తలారి పాత్రను అద్భుతంగా చేసి అందులో ఇమిడిపోయాడు. ఇంకో ఆశ్చర్యకరం ఏంటి అంటే ఈ సినిమా కథ నచ్చి.. ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే నటించాడు. -
ఆస్కార్ స్టేజీపై మనకు అవమానం.. మరీ ఇంత దారుణమా?
బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా నాటు నాటుకు, బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలింగా ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది? అని ప్రేక్షకాభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఇలాంటి సమయంలో అకాడమీ చేసిన చర్యతో సినీప్రియుల ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆస్కార్ అందుకున్న ద ఎలిఫెంట్ విస్పరర్స్ నిర్మాతను అకాడమీ దారుణంగా అవమానించిందంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఆ వివరాలు చూద్దాం.. సాధారణంగా ఆస్కార్ అందుకున్న తర్వాత 45 సెకన్లు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అంతకు మించి ఎక్కువ సమయం తీసుకుంటే వెంటనే ఆ స్పీచ్‌ను కట్ చేస్తారు. ద ఎలిఫెంట్ విస్పరర్స్‌కు అవార్డు ప్రకటించిన అనంతరం డైరెక్టర్ కార్తీకి తనకిచ్చిన గడువులోనే స్పీచ్ ముగించింది. అయితే నిర్మాత గునీత్ మోంగా మాట్లాడటం మొదలుపెట్టకముందే సంగీతం ప్లే చేశారు. దీంతో తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుతిరిగింది. పోనీ అందరి విషయంలోనూ అకాడమీ ఇలానే ప్రవర్తించిందా? అంటే లేదు. వీరి తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ అవార్డులు తీసుకున్న చార్లెస్ మాక్సీ, మాథ్యూ ఫ్రాడ్లు ఇద్దరూ 45 సెకన్ల కన్నా ఎక్కువసేపు ప్రసంగించినా అభ్యంతరం తెలపలేదు. దీనిపై అమెరికన్ మీడియా సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు నెటిజన్లు సైతం అకాడమీ భారత్‌ను అవమానించిందంటూ ట్విటర్లో మండిపడుతున్నారు. దీనిపై నిర్మాత గునీత్ స్పందిస్తూ.. 'ఆస్కార్ వేదికపై నన్ను ప్రసంగించనివ్వలేదు. ఇది నన్ను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే భారత్ నిర్మించిన ఓ షార్ట్ ఫిలింకు ఆస్కార్ రావడం ఇదే తొలిసారి అని సగర్వంగా చాటిచెప్పాలనుకున్నా. కానీ నన్నసలు మాట్లాడనివ్వలేదు. ఇంత దూరం వచ్చి నాకు మాట్లాడే ఛాన్స్ రాలేదని బాధేసింది. దీనిపై జనాలు కూడా ఎంతో విచారం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నట్లు అనిపించింది. ఇండియాకు వచ్చాక నా ఆలోచనలు, సంతోషాన్ని పంచుకుంటున్నాను. నాకు లభిస్తున్న ప్రేమను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది' అని చెప్పుకొచ్చింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) The Elephant Whisperers triumphs at the #AcademyAwards - Kartiki Gonsalves and Guneet Monga win the Oscar for Best Documentary Short Subject - the first ever for an Indian Production at the #Oscars.#Oscars95 | @guneetm pic.twitter.com/BYiciGniF7 — santhoshd (@santhoshd) March 13, 2023 -
ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి
అమెరికాలోని లాస్ ఎంజిల్స్ జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ వేడుకల్లో భారత్‌కు రెండు కేటగరీల్లో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది జరిగిన 95 ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్లో భారత్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీ నాటునాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చింది. అలాగే అందరి దష్టిని ఆకర్షించిన మరో చిత్రం ఒకటుంది. ఆర్ఆర్ఆర్తో పాటు బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్‌ను కైవసం చేసుకుంది 'ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సాధించిన యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. దీంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ షార్ట్ ఫిలింలో ప్రధాన పాత్రలో కనిపించిన బెల్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా.. దిక్కులేని ఏనుగులను ఆదరించి.. వాటిని చూసుకునే ఓ దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కించారు ది ఎలిఫెంట్ విస్పరర్స్. ఆస్కార్ అంటే ఏంటో తెలియదు ఆస్కార్ రావడం పట్ల బెల్లీ మాట్లాడుతూ.. 'ఏనుగులు అంటే మాకు పిల్లలతో సమానం. తల్లిని కోల్పోయిన పిల్లలకు సేవ చేయడాన్ని గొప్పగా భావిస్తాం. అలాంటి చాలా గున్న ఏనుగులను చేరదీశాం. వాటిని మా సొంత పిల్లల్లా చూసుకుంటాం. ఇది మా రక్తంలోనే ఉంది. మా పూర్వీకులు కూడా ఇదే పని చేసేవారు. కానీ నాకు ఆస్కార్ అంటే ఏంటో తెలియదు. అయినా అభినందనలు రావడం చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా ఈ చిత్రంలో నటించిన బెల్లీ భర్త మాత్రం.. తీవ్ర సమస్యతో బాధపడుతున్న ఓ ఏనుగును తీసుకొచ్చేందుకు వెళ్లాడని చెప్పింది. అసలు కథేంటంటే.. తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్‌లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల నిజజీవిత ఆధారంగా తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్ విష్పరర్స్. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు. వాటిని ఆదరించిన ఈ దంపతులనే ప్రధాన పాత్రలుగా కథ రూపొందించారు. నిర్మాత గునీత్ మోగ్న ఆధ్వర్యంలో.. దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2023లో బెస్ట్ షార్ట్ ఫిలిం అవార్డ్ దక్కించుకుంది. -
సింగపూర్ వెండితెరపై తొలి తెలుగు లఘు చిత్రం ‘సిరిజోత’ విడుదల
సింగపూరు: శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన లఘు చిత్రం సిరిజోత గురువారం(జనవరి 12) రాత్రి సింగపూరు ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్ లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కథ మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించారు. సురేష్ రాజ్ దర్శకత్వంలో అభిరాం, విజయ భరత్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం యూ ట్యూబ్ మాధ్యమం ద్వారా లాంచ్ అయింది. తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపొందించిన ఈ చిత్రాన్ని సింగపూరు నందు నివశిస్తున్న తెలుగు ప్రముఖులు అభినందలందించారు. తెలుగు భాషాభిమానులందరూ తప్పక చూడవలసిన చిత్రం అని కొనియాడారు. శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు శ్రీ రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు శ్రీ రాంబాబు పాతూరి, సింగపూరు తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు శ్రీ రంగ రవి, సింగపూరు పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు శ్రీమతి అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు శ్రీమతి సునీత తదితర ప్రముఖులందరూ వచ్చి తమ చిత్రాన్ని చూసి అభినందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అలాగే సింగపూరు వెండి తెర మీద ప్రదర్శించిన తొలి తెలుగు లఘు చిత్రం తమది కావడం.. అందులోనూ తెలుగు భాష మీద నిర్మించిన చిత్రం కావడం మరింత ఆనందదాయకమని నిర్మాత సుబ్బు పాలకుర్తి సంతోషం వ్యక్తం చేశారు. -
చిన్న సినిమాలతో సత్తా చాటుతున్న కరీంనగర్ డైరెక్టర్
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా.. అన్నాడో కవి.. పాటల రచన, గానంపై తనకు ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని, ప్రేమని పాట రూపంలోనే చెప్పాడు. అచ్చం ఇలాగే తనకు సినిమాతోపాటు రచన, నటన, షూటింగ్, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌పై ఉన్న ఇష్టాన్ని షార్ట్ ఫిల్మ్ ల ద్వారా చాటుకుంటున్నాడు కరీంనగర్‌కు చెందిన రామ్ మోగిలోజి. తొమ్మిదేళ్ల లఘుచిత్రాల ప్రయాణంలో ఆయన ఆనేక మైలురాళ్లు అధిగవిుంచారు. వెయ్యికిపైగా షార్ట్ ఫిల్మ్‌లు తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రియేటివిటీకి కేరాఫ్‌గా మారారు. యూట్యూబ్ వీక్షకుల నాడిని పట్టుకున్న ఆయన తొమ్మిదేళ్లలో ఒకటా రెండా ఏకంగా వేయి లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు, 1,500 చిత్రాలకు ఎడిటింగ్ చేశాడు. 2,500 ఆడ్ ఫిల్మ్స్, 150 జానపద పాటలు, 30 డాక్యూమెంటరీలు, వివిధ సామాజిక రుగ్ముత పై ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తూ వందకుపైగా తక్కువ నిడివితో లఘుచిత్రాలు తీయడమే కాకుండా 500 షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం విశేషం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామానికి చెందిన రామ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న వాటిని అధికమించి ఎంఏ పూర్తి చేసి మ ల్టీమీడియా, ఎడిటింగ్, అనీమినేషన్లో కోర్స్ పూర్తి చేశారు. నాలుగేళ్లపాటు మల్టీమీడియా ఫ్యాకల్టీగా పని చేసి ఎంతో మందికి మల్టీమీడియాలో శిక్షణ ఇ చ్చారు. వారిలో చాలా మంది వీడియో మిక్సింగ్ యూనిట్స్, ఫొటో స్టూడియోలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. వైజయంతి మూవీస్ వారి లోకల్ టీవీ చానల్లో వీడియో ఎ డిటర్గా సంవత్సరం పనిచేశారు. సినిమాల మీద మంచి పరిజ్ఞానం ఉండటంతో 2014లో కరీంనగర్లో షార్ట్ఫిల్మీస్ ఎడిటింగ్ స్టూడియో ఏర్పాటు చేసి ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తొలిసారిగా షార్ట్ ఫిల్మీస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ఎస్ నందతో ‘గుట్టల్లో గుసగుస’ మంచి ఆదరణ పొందింది. విరాట్ క్రియేషన్స్.. షార్ట్ ఫిల్మీస్ ఎడిటింగ్‌లో రాణిస్తూనే విరాట్ క్రియేషన్స్ పేరున ఫిల్మీ ఏజెన్సీ ఏర్పాటు చేసి యాడ్ ఫిల్మీస్ రూపొందించడం ప్రారంభించారు. వాటి ద్వారా తన ప్రత్యేకతను చాటుకుని మంచి గుర్తింపు పొందారు. మిత్రులతో కలిసి ఆర్ క్రియేషన్ బ్యానర్‌పై చల్లా బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడానికి కీలకమైన గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్టపై నిర్మించిన డాక్యుమెంటరీ నిర్మించారు. న్యూజిలాండ్ తెలంగాణ తెలుగు భాష అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ భాష మహాసభలో, 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ యువ చిత్రోత్సవంలో ప్రదర్శించగా ప్రముఖల ప్రశంసలు అందుకుంది. విరాట్ క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శక నిర్మాతగా లఘు చిత్రాలు నిర్మిస్తూ, ఇతరులు నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ప్రతినెలా దాదాపు 20 వరకు నిర్మాణం జరుపుకునే వాటిలో కొత్తవారికి అవకాశం ఇస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. అషాఢం అల్లుడు అత్త లొల్లి, ఇరికిల్లు ఇద్దరు పెళ్లాలు, ప్రేమించే పెనివిుటి, వార్డుమెంబర్ శినన్న, పొత్తుల సంసారం తదితర చిత్రాలకు 54 లక్షల వ్యూస్ దాటాయి. తెలంగాణ ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుర్మాచలం అనిల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రామ్ (ఫైల్) అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సత్కారాలు.. హైదరాబాద్‌కు చెందిన విశ్వభారతి సంస్థ నుంచి ఉగాది పురస్కారం అమ్మాయి అంటే భారం కాదు ఆస్తి పేరుతో నిర్మించిన చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా కరీంనగర్ సీపీ కమలాసన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఓ నరుడా చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా ఎమ్మెల్సీ నారదాసు చేతుల మీదుగా అవార్డు జగిత్యాలకు చెందిన కళశ్రీ ఆర్ట్ థియేటర్ వారిచే రెండుసార్లు కీర్తి సేవా పురస్కారం. ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌కు ఉత్తమ పోస్టర్ డిజైనర్‌గా నగదు బహుమతి. సినీవారం సంస్థ, బాబా అసోసియేషన్ వా రితో వేర్వేరుగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు. గొరెంటి వెంకన్న చేతుల మీదుగా గిడుగు రామ్మూర్తి కీర్తి పురస్కారం. కాళోజీ జయంతి సందర్భంగా ఉత్తమ డైరెక్టర్‌గా జెనీ ఇంటర్నేషనల్ అధినేత జైనీ ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డు. ఉత్తమ దర్శకుడిగా ఎంఎస్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమి ద్వారా ఉత్తమ డైరెక్టర్ అవార్డు. ఉమ్మడి రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా దర్శకుడిగా 1000 లఘు చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా తెలంగాణ ఫిల్మీ, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఆర్టీసీ సేవలపై రూపొందించిన లఘు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు. బొమ్మలమ్మగుట్ట ప్రాముఖ్యతపై తీసిన డా క్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు. ఆర్ఎస్ నంద పరిచయంతోనే.. యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్ నంద పరిచయం వల్లనే నా దారి లఘు చిత్రాల వైపు మళ్లింది. పల్లె వాతావరణ, కుటుంబ విషయాలు, రోజువారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా కథలు రాసుకుని ఒకటి రెండు రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేసి యూట్యూబ్‌లో ఆప్‌లోడు చేస్తా. వీక్షకుల నుంచి మంచి స్పందన ఉంటుంది. యూట్యూబ్ వీక్షకులు ఇస్తున్న ప్రోత్సాహంతోనే నెలకు 20 వరకు లఘు చిత్రాలు నిర్మిస్తూ తాను ఉపాధి పొందుతూ మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్న. – రామ్ మోగిలోజి, లఘు చిత్రాల దర్శక నిర్మాత, విరాట్ క్రియేషన్స్ -
నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం, తండ్రి మృతి.. ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
సోషల్ మీడియా స్టార్, నటి నయని పావని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో, సంతోషంగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాల్సిన ఆమె తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. శనివారం(డిసెంబర్ 31) ఆమె తండ్రి కన్నుమూశారు. ఇదే విషయాన్ని నటి పావని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాగా పలు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింలో నటించిన నయని పావని ప్రముఖ డాన్స్ షో ఢీతో మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ ఎంతో క్రేజ్‌ను సంపాదించుకుంది. అలాగే మరో యూట్యూబ్, సోషల్ మీడియా స్టార్ శ్వేతా నాయుడి కలిసి ఎక్కువగా నయని రీల్స్ చేస్తూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తండ్రి మృతిపై ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఆమె పోస్ట్ చేస్తూ.. ‘ఒక్క జన్మలోనే 100 జన్మల ప్రేమందించావు. కానీ, నాకు అది సరిపోలేదు. ఇంకా కావాలి డాడీ. ఈ బాధని నా నుంచి ఎవరూ తీసుకోలేరు. నాకు అయిన పెద్ద గాయమిది. దీన్ని ఎవరూ నయం చేయలేరు. ఇక నిన్ను చూడలేను అనే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నిన్ను ఇంకా చూడలేననే ఆలోచన కూడా కష్టంగా ఉంది డాడీ. ఇకపై పండోడా అని నన్ను ఎవరు పిలుస్తారు? రోజుకి ఐదుసార్లు ఎవరు కాల్ చేస్తారు? ఓర్పుగా నాతో ఎవరు ఉంటారు? నువ్వు ఏమైనా చేయ్.. నీ లైఫ్ నీ ఇష్టం, నేను నిన్ను నమ్ముతున్నాను అని ఎవరు చెప్తారు? నా పెళ్లికి నన్ను ఎత్తుకుని తీసుకెళ్తావు అనుకున్నా.. కానీ అంతలోనే నిన్ను ఇలా ఎత్తుకెళ్తాం అనుకోలేదు. ఇది చాలా అన్ ఫెయిర్. 2022 నాకు ఇంతటి విషాదం ఇస్తుందని అనుకొలేదు, ఇక 2023లోకి అస్సలు ఎంటర్ అవ్వాలని లేదు’ అంటూ పావని భావోద్వేగానికి లోనయ్యింది. ఇక ఆమె పోస్టర్ శ్వేతా నాయుడుతో పాటు పలువుకు సోషల్ మీడియా స్టార్ స్పందిస్తున్నారు. ‘ధైర్యంగా ఉండు.. నీకు మేము ఉన్నాం’ అంటూ ఆమెకు ఓదార్పును ఇస్తున్నారు. కాగా ఆమె సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, నీవెవరో, బబ్లూ vs సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి షార్ట్ ఫిలింస్‌లో నటించింది. View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Gurugubelli Divya sree!😎 (@divyaa__sree) View this post on Instagram A post shared by Swetha Naidu (@swethaa_naidu) -
Mur Ghurar Duronto Goti: అవును.. గుర్రం ఎగిరింది.. కలా? నిజమా!
‘అవును... గుర్రం ఎగరావచ్చు’ అంటారు. ఈ గుర్రం మాత్రం ఎగరడమే కాదు... యంగ్ డైరెక్టర్ మహర్షి కశ్యప్‌ను కూర్చోబెట్టుకొని బెంగళూరు నుంచి జైపుర్ వరకు తిప్పింది. రేపు ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా తీసుకువెళ్లవచ్చు... ఆస్కార్ 2023 బరిలో ‘షార్ట్ ఫిల్మ్ ఫిక్షన్’ విభాగంలో మన దేశం నుంచి అస్సామీ షార్ట్ ఫిల్మ్ మర్ గౌరర్ డురొంటో గోటి (ది హార్స్ ఫ్రమ్ హెవెన్) ఎంపికైంది. 27 సంవత్సరాల మహర్షి తుహిన్ కశ్యప్ దీని దర్శకుడు. కథ విషయానికి వస్తే... ఒక పెద్దాయన ఎప్పుడూ పగటి కల కంటూ ఉంటాడు. నగరంలో జరిగే గుర్రపు పందేలలో తన గుర్రం కూడా ఉండాలి. ఆ గుర్రం ఎలాంటిదంటే, మెరుపు వేగంతో పరుగులు తీస్తుంది. ఎప్పుడు గుర్రపు పందేలు జరిగినా తానే విజేత. ‘మీ గుర్రానికి ఎంత బాగా శిక్షణ ఇచ్చారు’ అంటూ అందరూ తనను వేనోళ్లా పొగుడుతుంటారు. ‘ఇంతకీ నా గుర్రం ఏదీ?’ అని వెదుకుతాడు ఆ పెద్దాయన. కానీ ఆ గుర్రం ఊహాల్లో తప్ప వాస్తవప్రపంచంలో కనిపించదు. అక్కడ కనిపించేది తన గాడిద మాత్రమే! ‘కలా? నిజమా! అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ గురించి వింటూ, చూస్తూ పెరిగాను. ఇప్పుడు నేను ఆస్కార్ బరిలో నిలవడం అనేది గర్వంగా ఉంది’ అంటున్నాడు మహర్షి. కోల్‌కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయిన మహర్షి స్టూడెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ చిత్రాన్ని తీశాడు. సర్రియలిజం, డార్క్ హ్యూమర్లతో కూడిన ఈ కథను చెప్పడానికి సంప్రదాయ కళ ‘ఒజపాలి’ని సమర్థవంతంగా వాడుకున్నాడు దర్శకుడు. ఆరువందల సంవత్సరాల ఘన చరిత్ర ఉన్న అస్సామీ కళారూపం ‘ఒజపాలి’లో కళాకారులు ఆడుతూ, పాడుతూ, నవ్విస్తూ పురాణాలలో నుంచి కథలు చెబుతుంటారు. ‘ది హార్స్ ఫ్రమ్ హెవెన్’ను ఎక్కువ భాగం క్యాంపస్‌లో చిత్రీకరించారు. కొంత భాగం కోల్‌కతా శివారులలో చిత్రీకరించారు. ఈ చిత్రం కోల్‌కతా ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్, జైపుర్ ఫిల్మ్‌ఫెస్టివల్, ది హిమాలయన్ ఫిల్మ్ ఫెస్టివల్, డీప్ ఫోకస్ స్టూడెంట్ ఫిల్మ్‌ఫెస్టివల్...మొదలైన ఎన్నో చిత్రోత్సవాలకు ఎంపికైంది. తాజాగా బెంగళూరు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎస్ఎఫ్ఎఫ్)లో ‘బెస్ట్ ఫిల్మ్’ అవార్డ్ అందుకొని ఆస్కార్ బరిలోకి దిగబోతుంది. ఫీచర్ ఫిల్మ్స్‌లా కాకుండా ఒక షార్ట్‌ఫిల్మ్‌ను ఆస్కార్‌కు పంపాలంటే అది ఆస్కార్ – క్వాలిఫైయింగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డ్ గెలుచుకోవాలి. మన దేశంలో అలాంటి ఏకైక ఫిల్మ్ ఫెస్టివల్ బీఐఎస్ఎఫ్ఎఫ్. ‘చిత్ర రూపకల్పన అనేది ఎంత క్లిషమైన విషయమో అందులో దిగాక కాని తెలియదు. ప్రతిరోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. స్వర్గం నుంచి దిగి వచ్చిన గుర్రం మమ్మల్ని ఎన్నో నగరాలు తిప్పింది. భవిష్యత్‌లో ఎన్ని చోట్లకు తీసుకువెళుతుందో తెలియదు’ అంటున్నాడు మహర్షి. కల్లోల ప్రాంతంలో పుట్టి పెరిగిన మహర్షికి ఎనిమిదవ తరగతిలో డైరెక్టర్ కావాలనే కోరిక పుట్టింది. చాలామందిలో ఆతరువాత కాలంలో ఆ కోరిక ఆవిరైపోతుంది. కానీ మహర్షి విషయంలో మాత్రం అది ఇంకా బలపడింది. (క్లిక్: హీరో శింబుకు ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో అడుగు పెట్టిన రోజు తన కలకు రెక్కలు దొరికినట్లుగా సంతోషపడ్డాడు. మహర్షిలో ఉన్న ప్రశంసనీయమైన ప్రత్యేకత ఏమిటంటే.. నేల విడిచి సాము చేయాలనుకోవడం లేదు. తన నేల మీద నడయాడిన కథలనే చిత్రాల్లోకి తీసుకురావాలకుంటున్నాడు. ఉత్తర, దక్షిణ భారతాలతో పోల్చితే వెండి తెర మీద కనిపించిన ఈశాన్య భారత ప్రాంత కథలు తక్కువ. ఇప్పుడు ఆ లోటు మహర్షి కశ్యప్ రూపంలో తీరబోతుంది. ఆస్కార్ ఎంట్రీ అనేది ఆరంభం మాత్రమే! (క్లిక్: 'ఆర్ఆర్ఆర్' సినిమాకు ఆస్కార్ ఎందుకు? హీరో నిఖిల్ కామెంట్స్ వైరల్) ప్రాంతీయ చిత్రాలు రకరకాల కష్టాలు ఎదుర్కొన్నాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతుంది. అస్సాం అనేది కొత్త కథలకు కేంద్రం కాబోతుంది. – మహర్షి -
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
మనసానమః షార్ట్ ఫిల్మ్ దర్శకుడికి వీసా ఇబ్బందులు
ఒక చిన్న షార్ట్ ఫిల్మ్‌తో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు దీపక్‌రెడ్డి. మనసానమః అనే షార్ట్‌ఫిల్మ్‌తో వందల కొద్దీ అవార్డులను, ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం కూడా దక్కించుకున్నారు. అయితే వీసా ఇబ్బందులతో ఆ స్క్రీనింగ్ కోసం అమెరికాకి దర్శకుడు వెళ్లలేకపోవడం దురదృష్టకరం. దీనికి సంబంధించి అమెరికా వెళ్లేందుకు వీలైన అవకాశాలను సూచించమని డైరెక్టర్ దీపక్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశాడు. దీంతో ఆయనను సపోర్ట్ చేస్తూ కొందరు ట్వీట్స్ చేశారు. -
షార్ట్ ఫిలిమ్‌కు డైరెక్టర్‌గా యంగ్ హీరో..
Aditya Om Pavithra Short Film: 'లాహిరి లాహిరి లాహిరిలో' సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో 'మాసాబ్' అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన ఇప్పుడు 'పవిత్ర' అనే ఓ ప్రయోగాత్మక షార్ట్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. థ్రిల్లింగ్ జానర్‌గా తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలింలో జ్యోతి, గాయత్రి గుప్త, ఐశ్వర్య ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మోడర్న్ సినిమా బ్యానర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. దీనికి వీరల్, లవన్ సంగీతం అందించగా.. మధుసూదన్ కోట సినిమాటోగ్రాఫర్‌గా, ప్రకాష్ ఝా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలిమ్‌ని యూట్యూబ్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి ఆసక్తి పెంచారు. ఆదిత్య ఓం చేతిలో మొబైల్ ఫోన్స్, ఆ వెనకాల జ్యోతి, గాయత్రీ గుప్త లుక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. మిస్ అయిన తన భార్య కోసం ఓ బ్లైండ్ డాక్టర్ వెతికే పాయింట్‌తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఈ షార్ట్ఫిలిమ్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: స్టార్ నటుడి భార్యపై కేసు.. రూ. 31 లక్షలు తిరిగి ఇవ్వట్లేదని ఫిర్యాదు టైటిల్ రోల్ జ్యోతి పోషిస్తుండగా.. గాయత్రి గుప్త మరో స్పెషల్ క్యారెక్టర్ చేస్తోంది. గాయత్రీ రోల్ సినిమాలో కీలకం కానుందట. జాకిర్ హుస్సేన్, ఐశ్వర్య, వెంకట్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పెరుగుతున్న టెక్నాలజీలో షార్ట్ ఫిలిమ్స్ కీలక భూమిక పోషిస్తున్నాయని, ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కెమెరా ముందు సరికొత్త ప్రయోగాలు చేసేందుకు అనువుగా ఉండటమే గాక ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంటాయని ఆదిత్య ఓం అన్నారు. అలాంటి కోవలోనే ఈ 'పవిత్ర' మూవీ ఉంటుందని చెప్పారు. చదవండి: విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల.. నమ్మట్లేదా ? ఆధార్ కార్డు చూపించనా ?: యంగ్ హీరో -
ఒకే ఏడాదిలో ఏడుసార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డులు అతని సొంతం
విజయనగరం టౌన్: చిన్నప్పటి నుంచి చిత్రరంగంలో అడుగుపెట్టాలనే ఆకాంక్షే ఆ యువకుడిని షార్ట్ ఫిలిమ్స్‌లో ఉన్నతశిఖరాలు అధిరోహించేలా చేసింది. ఏ కాంటెస్ట్‌లో పాల్గొన్నా గెలుపొందిన మొదటి మూడు చిత్రాలు ఆయన రచన, సంగీత దర్శకత్వం చేసినవే కావడం విశేషం. ఇప్పటివరకూ షార్ట్ ఫిలి మ్స్‌లో వందలాది అవార్డులు అందుకున్న విజయనగరం యువకుడు పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్రాజా) ఎప్పటికైనా షార్ట్ ఫిలిమ్స్‌లో ఆస్కా ర్ అవార్డ్ తీసుకోవడమే లక్ష్యమని చెబుతున్నాడు. విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన పెనుమత్స వెంకట రామరాజు (పీవీఆర్ రాజా) సత్యవతి, చంద్రశేఖర్ రాజుల తొలిసంతానం. బీఏ వరకూ మహారాజా కళాశాలలో చదివి, సంగీతం పట్ల మక్కువతో మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో గాత్రం, వయోలిన్, భరతనాట్యం, వీణ తదితర అంశాలలో తర్ఫీదు పొందాడు. షాలోమ్స్ మ్యూజిక్ సెంటర్లో గిటార్ తదితర ఇన్నుస్ట్రుమెంట్స్పై సాధన చేశాడు. రచనలు చేయడం అలవాటు. 2012 నుంచి ఇప్పటివరకూ తెలుగు , కన్నడ, హిందీ, తమిళ్, ఆంగ్ల భాషల్లో సుమారు 250కి పైగా లఘుచిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేశాడు. 2017లో ఒకే ఏడాదిలో ఆయన సంగీతం సమకర్చిన లఘుచిత్రాలకు వరుసగా ఏడుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డులు అందుకున్నారు. 2007లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ నిర్వహించిన హూలలల్లా మ్యూజిక్ బ్యాండ్హంట్లో షాలోమ్ తరఫున టాప్ 18లో నిలిచాడు. తానా ఇంటర్నేషనల్ తెలుగు ఫిలిం ఫెస్టివల్–2017 అవార్డు దక్కింది. 2020లో రాంగోపాల్ వర్మ నిర్వహించిన స్పార్క్ ఓటీటీ షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లో తొమ్మిదివేల చిత్రాలలో పీవీఆర్ సంగీత దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు టాప్ 18లో నిలిచాయి. టాప్ 5లో నిలిచిన రెండు చిత్రాలు ఉత్తమ చిత్రాల అవార్డులు సొంతం చేసుకున్నాయి. అదేవిధంగా 2020లో సైమా షార్ట్ ఫిలిం అవార్డ్స్‌లో ఎంఆర్ ప్రొడక్షన్స్ అంతరార్థం చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. షార్ట్ ఫిలిం మాస్ట్రోగా పేరు సంపాదించుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ సొంత నిర్మాణ సంస్ధ వైష్ణో మీడియా నిర్మించిన ఆర్య–3 లఘుచిత్రంతో పీవీఆర్ రాజా సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. పేపర్ బాయ్ చిత్ర దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో విటమిన్ షీ ఓటీటీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించాడు. ప్రముఖ డ్యాన్సర్ యశ్వంత్ మాస్టర్ తొలివీడియో ఆల్బం దిల్ అంత అదిరే చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఎల్బీ శ్రీరామ్ స్వీయ నిర్మాణంలో పదికి పైగా లఘు చిత్రాలకు సంగీతం సమకూర్చారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, సంగీతం పట్ల మక్కువతో షార్ట్ ఫిలిమ్స్ వైపు అడుగులు వేశాను. బేగంపేటలో శంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రద్ధ స్కూల్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ పాఠశాలలో పిల్లలకు సంగీతం నేర్పించడం మరిచిపోలేని అనుభూతి. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోయేలా చిత్రాలను తీస్తాను. సంగీతంలో నేను రచించే పుస్తకం ప్రతి ఇంట్లో ఉండే పెద్ద బాలశిక్షలా ఉండిపోవాలని కోరుకుంటున్నాను. – పెనుమత్స వెంకటరామరాజు (పీవీఆర్ రాజా), సంగీత దర్శకుడు, విజయనగరం -
‘పాపవినాశనం’పై ప్రముఖుల ప్రశంసలు
షార్ట్‌ఫిల్మ్‌ల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకొని స్టార్ట్స్‌గా ఎదిగిన వారు చాలా మందే ఉన్నారు.ఒక చక్కటి సందేశాన్ని షార్ట్ ఫిల్మ్ లో ఇమిడించి అందరిని మెప్పించడం అంటే గొప్ప విషయం. అలాంటి ఒక సందేశాత్మక లఘు చిత్రాన్ని తెరకెక్కించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు దొంగరి మహేందర్ వర్మ. అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమా పాపవినాశనం. శివాని, జోష్ రవి, జబర్దస్త్ అప్పారావు, సమ్మెట గాంధీ, దంచెనాల శ్రీనివాస్, ప్రియ, శివ, సాయి రెడ్డి ప్రముఖ పాత్రల్లో నటించారు. మాస్టర్ లిఖిత్ & అక్షిత్ సమర్పణలో ఇందిర దొంగరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా కి ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో హైదరాబాద్ లో ప్రదర్శించారు. కాగా ఈ షో కి తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు ,కోదాడ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష లక్ష్మీ నారాయణ , కో ఆ సొసైటీ ప్రధాన కార్యదర్శి అంకతి విజయ్ కుమార్,సినీ హీరో ఉత్తేజ్ ,డా. దాచేపల్లి సుధీర్ కుమార్ ,మహేందర్ తదితరులు బంధుమిత్రులతో హాజరయ్యారు. -
Cannes Film Festival 2022: అట్టహాసంగా ముగిసిన కాన్స్ వేడుకలు
ఫ్రాన్స్‌లో మొదలైన 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలు ఆట్టహాసంగా ముగిశాయి. ఈ నెల 17న కాన్స్ చలన చిత్రోత్సవాలు మొదలైన సంగతి తెలిసిందే. ఫీచర్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ విభాగాల్లో దాదాపు 21 అవార్డులు అందజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘పామ్ డీ ఆర్’ అవార్డును స్వీడెన్ ఫిల్మ్‌మేకర్ రూబెన్ ఓస్ట్లండ్ దక్కించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’కు ‘పామ్ డీఆర్’ అవార్డు లభించింది. రూబెన్స్ తెరకెక్కించిన ఫిల్మ్‌కు ఈ అవార్డు రావడం ఇది రెండోసారి. 2017లో ‘ది స్వైర్’ చిత్రానికిగాను కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఈ అవార్డు అందుకున్నారాయన. విలాసవంతమైన విహారయాత్రకు ఆహ్వానించబడ్డ ఇద్దరు ఫ్యాషన్ మోడల్ సెలబ్రిటీల నేపథ్యంలో ‘ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్’ సాగుతుంది. ‘కాన్స్’ చలన చిత్రోత్సవంలో రెండో గొప్ప అవార్డుగా భావించే గ్రాండ్ ప్రైజ్‌ను రెండు సినిమాలు పంచుకున్నాయి. క్లైరే డెనిస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్టార్స్ ఎట్ నైట్’, లుకాస్ థోన్స్ దర్శకత్వంలోని ‘క్లోజ్’ చిత్రాలు గ్రాండ్ ప్రైజ్‌ను పంచుకున్నాయి. జ్యూరీ ప్రైౖజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. ‘ఈవో’(జెర్జిస్కో లిమౌస్కీ దర్శకుడు), ‘ది ఎయిట్ మౌంటెన్స్’ (ఫెలిక్స్ వాన్స్ – చార్లెట్ దర్శకులు) చిత్రాలకు జ్యూరీ అవార్డు దక్కింది. ‘బ్రోకర్’కి సాంగ్– కాంగ్ హూ ఉత్తమ నటుడిగా, ‘హోలీ స్పైడర్ ’ చిత్రానికి ఇరానీ యాక్ట్రస్ జార్ అమిర్ ఇబ్రహీమి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ‘డెసిషన్స్ టు లీవ్’ చిత్రాని పార్క్ చాన్స్ హూక్ ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. ఇండియా డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కి అవార్డు 75వ కాన్స్ చలన చిత్రోత్సవాలకు భారతదేశం తరఫున ఎంపికైన ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీకి ‘ది గోల్డెన్స్ ఐ’ అవార్డు దక్కింది. షౌనక్ సేన్స్ దర్శకత్వం వహించారు. ఢిల్లీకి చెందిన మహ్మద్ సౌద్, నదీమ్ షెహజాద్ అనే ఇద్దరు బ్రదర్స్ గాయపడ్డ పక్షులను ఎలా సంరక్షించేవారు? బ్లాక్కైట్స్ బర్డ్స్ సంరక్షణ కోసం వీరు ఏం చేశారు? అనే అంశాలతో ‘ఆల్ దట్ బ్రీత్స్’ డాక్యుమెంటరీ ఉంటుంది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన ‘సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో కూడా ‘ఆల్ దట్ బ్రీత్స్’కి వరల్డ్ సినిమా గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా కాన్స్ చలన చిత్రోత్సవాల స్పెషల్ జ్యూరీ విభాగంలో ‘మేరిముపోల్ 2’ (మాంటస్ దర్శకుడు) డాక్యుమెంటరీకి అవార్డు లభించింది. రష్యా, ఉక్రెయిన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో డాక్యుమెంటరీ షూటింగ్ నిమిత్తం మేరియుపోల్ వెళ్లారు లిథువేనియన్స్ దర్శకుడు మాంటస్. ఏప్రిల్‌లో రష్యా బలగాల దాడుల్లో ఖైదు కాబడిన మాంటస్ ఆ తర్వాత చనిపోయారనే వార్తలు ఉన్నాయి. పాకిస్తాన్ ఫిల్మ్ ‘జాయ్‌లాండ్’ కి ‘అన్ సర్టెన్ రిగార్డ్ కేటగిరీ’ విభాగంలో జ్యూరీ ప్రైజ్ లభించింది. కాగా 75వ చలన చిత్రోత్సవాల్లో జ్యూరీ మెంబర్ దీపికా పదుకొనెతో పాటు మరికొంతమంది తారల రెడ్ కార్పెట్ వాక్స్ హైలైట్‌గా నిలిచాయి. -
కన్నీటి వ్యధపై లఘుచిత్ర కథ
కాశీబుగ్గ: మారుమూల గెడ్డ.. అందులో నురగలు కక్కుతూ పలువురు మృతిచెందడం.. అటువైపుగా వెళ్లిన వారంతా ఆ దృశ్యాన్ని చూసి ఆందోళన చెందడం.. అయితే ఇదంతా వాస్తవం కాదు. జిల్లా పోలీసు శాఖ నిర్వహిస్తున్న షార్ట్‌ఫిల్మ్ పోటీలకు కొంతమంది ఉపాధ్యాయులు కలిసి నటించిన దృశ్యరూపకం. నాటుసారా వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ ఈ లఘుచిత్రం రూపొందిస్తున్నారు. పలాస మండలం సరియాపల్లి గెడ్డ వద్ద సన్నివేశం చిత్రీకరిస్తుండగా ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
ఆర్టీసీపై షార్ట్‌ఫిల్మ్ చేయండి.. రూ.10 వేలు గెల్చుకోండి
సాక్షి, హైదరాబాద్: ఆరీ్టసీని జనానికి చేరువ చేసేందుకు నానా పాట్లు పడుతున్న అధికా రు లు తాజాగా షార్ట్ ఫిల్మ్‌ల ద్వారా ఆకట్టుకోవా లని నిర్ణయించారు. ఈమేరకు షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మెరుగ్గా ఉన్న వాటి ల్లోంచి ఎంపిక చేసిన మొదటి ఫిల్మ్‌కు రూ.10 వేలు, రెండో ఫిల్మ్‌కు రూ.5 వేలు, మూడో ఫిల్మ్‌కు రూ.రెండున్నర వేలు పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. సురక్షితమైన ప్రయాణం, లీటరు పెట్రోలు ధర కంటే తక్కువ మొత్తంతో రోజంతా నగరంలో సిటీ బస్సుల్లో తిరిగే అవకాశం, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ కార్గో సేవలు, గరుడ, రాజధాని బస్సుల్లో సౌకర్యాలు వంటి తదితర అంశాలు ఇతివృత్తాలుగా షార్ట్‌ఫిల్మ్‌లు రూపొందించాలని అందులో పేర్కొన్నారు. ఉత్సాహం ఉన్న వారు వివరాలతో ఈనెల 21 లోపు tsrtcshortfilm@gmail.com చిరునామాకు ఎంట్రీలు పంపాలని సూచించారు. -
‘లైఫ్: ఏ ట్రూ బ్లెస్సింగ్’ హీరోకు అరుదైన ఘనత
రుత్విక్ రెడ్డి స్త్రీ, పురుష పాత్రల్లో నటించిన షార్ట్ ఫిల్మ్ ‘లైఫ్: ఏ ట్రూ బ్లెస్సింగ్’. విజయ్‌దాస్ దర్శకత్వంలో శ్రీలతా రెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ షార్ట్ ఫిల్మ్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ట్రూ బ్లెస్సింగ్ టైటిల్‌తో రూపొందిన ఈ సినిమా రుత్విక్‌కి బ్లెస్సింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ‘బెస్ట్ యంగ్ యాక్టర్ ఇన్ ఏ షార్ట్ ఫిల్మ్’ కేటగిరీలో రుత్విక్కు ‘కాన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్’లో నామినేషన్ దక్కింది. చిన్న అంశాలకే భయపడి ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు, మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలి, లింగమార్పిడి అనేది ప్రకృతి విరుద్ధం వంటి అంశాల నేపథ్యంలో ‘లైఫ్: ఏ ట్రూ బ్లెస్సింగ్’ రూపొందింది. మే 17 నుంచి 28 వరకూ ఫ్రాన్స్‌లో కాన్స్ చిత్రోత్సవాలు జరగనున్నాయి. -
షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్..!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షార్ట్‌ఫిల్మ్ మేకర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది. దేశంలోని యువతలో దాగున్న ప్రతిభను వెలికితీయడం కోసం నెట్‌ఫ్లిక్స్ ఇండియా 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్ వర్క్ షాప్ & పోటీని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ 'టేక్ టెన్' పోటీలో ఎంపికైన వారికి వర్క్ షాప్‌కు హాజరు అయ్యే అవకాశం కల్పించడమే కాకుండా, ఆ తర్వాత 10,000 డాలర్ల(సుమారు రూ.7.5 లక్షలు)కు సమానమైన గ్రాంట్‌తో షార్ట్‌ఫిల్మ్ తీసే అవకాశాన్ని 10 మందికి కల్పించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వీరు తీసిన ఈ చిత్రాలు నెట్‌ఫ్లిక్స్ ఇండియా యూట్యూబ్ ఛానెల్లో ప్రదర్శించనున్నారు. 'టేక్ టెన్' కోసం దరఖాస్తు చేసుకోవడానికి పోటీదారులు భారతదేశ పౌరుడు కావడంతో పాటు18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. ఈ పోటీ కోసం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 7, 2022 నుంచి ప్రారంభం కానుంది. పోటీదారులు "మై ఇండియా" అనే అంశంపై రెండు నిమిషాల షార్ట్‌ఫిల్మ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే, షార్ట్‌ఫిల్మ్‌ని వారి ఫోన్ సహాయంతో షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోటీలో ఎంపికైన వారికి రైటింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ వంటి విభాగాల గురించి నేర్చుకునే అవకాశాన్ని పొందొచ్చని నెట్‌ఫ్లెక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రతిభ ఉన్నా వెలుగులోకి రాని యువత కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నెట్‌ప్లెక్స్ పేర్కొంది. 'టేక్ టెన్' అనే షార్ట్‌ఫిల్మ్ పోటీకి నెట్‌ఫ్లిక్స్ ఫండ్ ఫర్ క్రియేటివ్ ఈక్విటీ స్పాన్సర్ చేస్తుంది. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న కమ్యూనిటీలకు చెందిన తర్వాతి తరం కథకులకు మద్దతు ఇవ్వడానికి ఐదు సంవత్సరాలకు పైగా సంవత్సరానికి 100 మిలియన్ డాలర్లను నిధులను కేటాయించింది. (చదవండి: ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. లక్ష రూపాయలు మటుమాయం!) -
కళ: త్రీ ఇన్ వన్... నెంబర్‌వన్!
కథలు కంచికి పోతాయో లేదో తెలియదుగానీ...కాసేపు ఆలోచిస్తే మన దగ్గరికే నడిచొస్తాయి అని చిత్ర చరిత్ర చెబుతూనే ఉంది. ఒక చిత్రం మొదలు కావాలంటే డైరెక్టర్ బౌండ్ స్క్రిప్ట్‌తో రంగంలోకి దిగుతాడు. ఈ చిత్రం విషయంలో మాత్రం అలా జరగలేదు. ‘ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను. మీరు మీ అనుభవాలు చెప్పండి చాలు స్క్రిప్ట్ రాసుకుంటాను’ అన్నాడు డైరెక్టర్ దేవాశిష్ మహ్కిజ. అన్నపూర్ణ సోని, భూమిక దూబె, ఈప్సిత చక్రవర్తి... అనే ఈ ముగ్గురు మహిళలు తమ అనుభవాలను చెప్పడమే కాదు రచన సహకారం అందించి, నటించి చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. దేశీయంగానే కాదు, అంతర్జాతీయస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న లఘు చిత్రం చీపటాకదుంప. 24 నిమిషాల నిడివిగల ఈ హిందీ షార్ట్‌ఫిల్మ్ తెగ నవ్విస్తుంది. అయితే ఇదేమీ హాస్యచిత్రం కాదు. నవ్విస్తూనే ఆలోచనలు రేకెత్తించే చిత్రం. ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ చిత్రం ఇటీవల ‘జెండర్ సెన్సిటివిటీ’ అవార్డ్ గెలుచుకుంది. ‘పురుషులు ఇలాంటి దుస్తులు ధరించాలి. స్త్రీలు ఇలాంటి దుస్తులు మాత్రమే ధరించాలి. పురుషుల నడక ఇలా ఉండాలి. స్త్రీల నడక ఇలా మాత్రమే ఉండాలి....’ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాకు అంతు ఉండదు. ‘జెండర్ సెన్సిటివిటీ’ స్పృహతో మన ఆలోచనల్లో రకరకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటిని ప్రతిబింబించే చిత్రం ఇది. ‘చీపటాకదుంప’ అనేది దాగుడుమూతల్లాంటి ఒక ఆట. ఈ చిత్రానికి మూలస్తంభాలుగా నిలిచిన ముగ్గురు మహిళల గురించి... మధ్యప్రదేశ్‌లోని బర్త్ అనే చిన్న టౌన్‌కు చెందిన అన్నపూర్ణ సోని జబల్పూర్లో మ్యూజిక్కోర్సు చేసింది. సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్, మైమ్...ఇలా ఎన్నో విద్యల్లో ప్రతిభ చూపేది. స్థానిక ‘వివేచన రంగ్మండల్’ అనే నాటక సంస్థలో చేరిన కొత్తలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్డీ) గురించి గొప్పగా విన్నది. మొదటి ప్రయత్నంలో విఫలమైంది. రెండో ప్రయత్నంలో సీటు గెలుచుకుంది. ఇక ఆమెకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముంబై యూనివర్శిటీలో మాస్ మీడియాలో పట్టా పుచ్చుకుంది భూమిక దూబె. ఎన్ఎస్డీ స్టూడెంట్. గొప్ప నాటక దర్శకులతో కలిసి పనిచేసింది. ఎన్నో లఘు చిత్రాలలో నటించింది. అవార్డ్లు గెలుచుకుంది. ‘చీపటాకదుంప’ చిత్రానికి దూబె కో–ప్రొడ్యూసర్, కాస్టింగ్ డైరెక్టర్. ‘నా మీద నాకు నమ్మకాన్ని, ఉత్సాహాన్ని పెంచిన చిత్రం ఇది’ అంటున్న భూమిక దూబె మరిన్ని ప్రయోగాత్మక చిత్రాల్లో నటించాలనుకుంటోంది. ఈప్సిత చక్రవర్తి నటిగానే కాదు స్క్రీన్ రైటర్‌గా కూడా పేరు తెచ్చుకుంది. ఎన్ఎస్డీ స్టూడెంట్. కథలు, నవలలను నాటకాలుగా మలచడం అంటే ఇష్టం. విలియమ్ షేక్స్పియర్ ‘ఎ మిడ్నైట్ సమ్మర్ డ్రీమ్’ను ‘కసుమాల్ సప్నో’గా స్థానికీకరించి రాజస్థాన్‌లో ఇచ్చిన ప్రదర్శనకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘ఉజాగర్ డ్రామటిక్ అసోసియేషన్’ (ముంబై) అనే థియేటర్ గ్రూప్ వ్యవస్థాపకురాలు. తాజా విషయం ఈ ముగ్గురు ‘చీపటాకదుంప’ దగ్గర మాత్రమే ఆగిపోవాలనుకోవడం లేదు. మహిళలకు సంబంధించిన విభిన్న కోణాలకు కళారూపం ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఒక్కరి ఆలోచనలు బాగుంటాయి. ఆ ఒక్కరికి మరో ఇద్దరి ఆలోచనలు తోడైతే మరీ బాగుంటాయి అని చెప్పడానికి సంశయం ఎందుకు! -
‘పుష్పక విమానం’ డైరెక్టర్ దామోదర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి. లఘు చిత్రాల నుంచి.. సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గోవర్దనరావు ప్రోత్సాహంతోనే.. ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు. -
అబ్బాయి నుంచి అమ్మాయిగా.. ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’
‘‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చూసి దర్శకుడు నాగ్ అశ్విన్‌గారు ‘చాలా బాగుంది. అమ్మాయి పాత్ర పెద్ద బోనస్’ అన్నారు. అలాగే డైరెక్టర్ మారుతిగారు కూడా ‘మంచి ప్రయత్నం... బాగుంది’ అన్నారు. ఆ ఇద్దరి ప్రశంసలను మరచిపోలేను’’ అని రుత్విక్ రెడ్డి అన్నారు. విజయ్ దాస్ దర్శకత్వంలో రుత్విక్ రెడ్డి స్త్రీ పురుష పాత్రల్లో నటించిన షార్ట్ ఫిలిం ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’. శ్రీలతా రెడ్డి నిర్మించిన ఈ షార్ట్ ఫిలింని డైరెక్టర్ మారుతి విడుదల చేశారు. రుత్విక్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నాకు నటన అంటే ఇష్టం. న్యూయార్క్‌లో రెండేళ్లు నటనలో శిక్షణ తీసుకున్నాను. తొలి ప్రయత్నంగా ‘లైఫ్.. ఎ ట్రూ బ్లెస్సింగ్’ షార్ట్ ఫిలిం చేశా. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులతో పాటు లింగ మార్పిడి అనేది ప్రకృతికి విరుద్ధం అనీ, చిన్న విషయాలకే భయపడి ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే విషయాలను చూపించాం. నా షార్ట్ ఫిలిం బాగుందని ఫోన్లు చేయడంతో పాటు కామెంట్లు పెడుతుండటం హ్యాపీ. ఇటీవల కొన్ని సినిమా కథలు విన్నాను. నా నటనతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం’’ అన్నారు. చదవండి : విజయ్ను కలిసి షణ్ముక ప్రియ, లైగర్ ఓ పాట పాడే అవకాశం ఆ ట్విస్ట్ తెలిసి వావ్ అనుకున్నా! -
ఆలోచనాత్మకం సర్కార్ బడి విద్యార్థుల ‘జాగో’ షార్ట్ ఫిల్మ్
కామారెడ్డి క్రైం: స్వచ్ఛత ఫిల్మోంకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయస్థాయిలో షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల కోసం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఎక్కపల్లి పాఠశాల ఉపాధ్యాయుడు అఖిల్ ఓ లఘుచిత్రాన్ని రూపొందించారు. స్వచ్ఛ భారత్ ప్రాధాన్యం తెలుపుతూ ‘జాగో’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారని జిల్లా పౌరసంబంధాల శాఖాధికారి వెంకటేశ్వర్రావు తెలిపారు. చిన్నారులు నటించిన ‘జాగో’ ఈ లఘు చిత్రాన్ని పోటీలకు పంపించినట్లు చెప్పారు. పరిసరాల అపరిశుభ్రంతో తన స్నేహితుడు పాఠశాలకు రాకపోవడం అనే కథాంశంతో ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తెరకెక్కించారు. డైలాగ్‌లు లేకున్నా ఎంతో అర్థం వచ్చేలా ఈ షార్ట్ ఫిల్మ్ ఉంది. కేఎన్ఆర్ స్టూడియోస్ నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆలోచింపజేస్తోంది. గ్రామస్తుల సహకారంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. మీరు ఈ షార్ట్‌ఫిల్మ్ చూసేందుకు క్లిక్ చేయండి చదవండి: ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం చదవండి: పాలు పోయించుకుని పొమ్మన్నారు: జీతం అడిగితే పోలీస్ కేసు! -
అమ్మఒడిపై లఘు చిత్రం ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకంపై నిర్మాత చుండూరు సుందర రామశర్మ నిర్మించిన లఘు చిత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం జరిగింది. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ లఘు చిత్రంగా ‘జయహో జన నాయకా’
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2020కి ప్రకటించిన ‘నవరత్నాలు’ అభివృద్ధి పథకాలపై తీసిన లఘు చిత్రాల(షార్ట్ ఫిలిం)లో ‘జయహో జన నాయకా’ ఉత్తమ లఘుచిత్రంగా ఎంపికైంది. లఘు చిత్రాల ఫెస్టివల్‌కు మొత్తం 35 ఎంట్రీలొచ్చాయి. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగం అభివృద్ధి సంస్థ చైర్మన్ టీఎస్ విజయచందర్ అధ్యక్షతన బీఎన్వీ రామకృష్ణంరాజు, ఎంవీ రఘులు కమిటీ సభ్యులుగా లఘు చిత్రాలను పరిశీలించారు. ప్రథమ బహుమతికి ఒకటి, ద్వితీయ బహుమతికి రెండు, తృతీయ బహుమతికి మూడు చొప్పున మొత్తం ఆరు లఘు చిత్రాలను ఎంపిక చేశారు. వాటి నిర్మాతలకు త్వరలో నగదు బహుమతులతో పాటు ప్రశంస పత్రాలు ఇవ్వనున్నట్టు విజయచందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ బహుమతి: ‘జయహో జన నాయకా’.. నిర్మాత వజ్రగిరి నాగరాజు(విజయవాడ), బహుమతి రూ.లక్ష ద్వితీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘నవ రత్నాలు మ్యూజికల్ ప్రెజెంటేషన్’, నిర్మాత ఎస్బీఎస్ శ్రీనివాస్ పోలిశెట్టి(తూర్పుగోదావరి పెద్దాపురం), రూ.50 వేలు. రెండో లఘు చిత్రం ‘జగనన్న నవ రత్నాలు’.. నిర్మాత శివశ్రీ మీగడ(విశాఖ), రూ.50 వేలు తృతీయ బహుమతి: ఈ కేటగిరీలో మొదటి లఘుచిత్రం ‘బోర్న్ ఎగైన్’(మళ్లీ పుట్టాను).. నిర్మాత టీఎస్ లక్ష్మీనారాయణమూర్తి(కాకినాడ), రూ.25 వేలు. రెండో లఘుచిత్రం ‘రాజన్న రాజ్యంలో ఓ సీత కథ’.. నిర్మాత టి.వేణుగోపాల్‌కృష్ణ(పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు), రూ.25 వేలు. మూడో లఘు చిత్రం ‘పేదలందరికీ ఇళ్లు’.. నిర్మాత చండూర్ సుందరరామశర్మ(గుంటూరు), రూ.25 వేలు. -
ఈ పోటీలో గెలిస్తే రూ. 2 లక్షలు మీ సొంతం
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు, ముఖ్యంగా యువతకు రూ.2 లక్షలు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది. దీని కోసం మీరు ఒక పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన విజేతలకు నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కలిగించాలని భావిస్తోంది. దీని కోసం స్పెషల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఇందులొ పాల్గొని గెలిస్తే రూ.2 లక్షలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రూ.2 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకోవాలంటే మీరు పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలపై కనీసం 30 సెకన్లు, గరిష్టంగా 60 సెకన్ల గల ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు గల వారు మాత్రమే ఈ పోటీలో పాల్గొనవచ్చు. అయితే, మీరు తీసిన వీడియోను జూన్ 30 లోపు ఘాట్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, వారి బంధువులు ఇందులో పాల్గొనడానికి అనర్హులు. మరిన్ని వివరాల కొరకు https://www.mygov.in/task/short-film-making-contest ఈ లింక్ మీద క్లిక్ చేయండి. Have you shared your entry for the short film Anti-Tobacco spot competition, yet? Hurry up, visit: https://t.co/YXfZarazpv now and stand a chance to win a cash prize of ₹2,00,000. @MoHFW_India @drharshvardhan pic.twitter.com/tdyqXNQqS0 — MyGovIndia (@mygovindia) June 11, 2021 ప్రైజ్ మనీ వివరాలు: 1వ బహుమతి: 2,00,000/- 2వ బహుమతి: 1,50,000/- 3వ బహుమతి: 1,00,000/- అలాగే మరో పది మందికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. చదవండి: చైనాకు భారీ షాక్ ఇచ్చిన శామ్సంగ్ -
SS Rajamouli: కోవిడ్‌పై రాజమౌళి లఘు చిత్రం?
కోవిడ్ సెకండ్ వేవ్ ఎంత వేగంగా వ్యాపిస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ మహమ్మారిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఓ లఘు చిత్రం (షార్ట్ ఫిల్మ్) తెరకెక్కించనున్నారని టాక్. ప్రస్తుత ఈ క్లిష్ట పరిస్థితులపై 19 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించనున్నారట. వీలైనంత త్వరగా ఈ లఘు చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. త్వరలో తిరిగి చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. -
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
మేఘా భాటియా... యానిమేటెడ్ చిత్రాల రూపకర్త. పిల్లల లైంగిక దోపిడీ గురించి అర్థం అయ్యేలా చెప్పాలనే ఆమె ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. తను రూపొందించిన చిత్రాల ద్వారా ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ని పిల్లలు అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. మేఘా మొదట పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ చేసింది. దీనిని హిందీతోపాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేసింది. సినిమా పేరు ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’. మేఘాకు ‘అవర్ వాయిస్’ అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా ఆమె సెమినార్లను నిర్వహించి మరీ విషయాలను రాబడుతుంది. పిల్లల లైంగిక వేధింపులు.. సమాచార సేకరణ ఢిల్లీలో రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న మేఘా భాటియా లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందింది. అక్కడే ఒక పరిశోధన ప్రాజెక్ట్ సమయంలో పిల్లల లైంగిక వేధింపుల గురించిన సమగ్ర సమాచారం ఆమెకు లభించింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. తను ఎంచుకున్న అంశం మీద ఎంతో సమాచార సేకరణ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పిల్లలతో సంబంధం ఉన్న 1,06,958 కేసులలో 36,022 కేసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డవే. వీరిలో సగం మంది పిల్లలు నేరాలకు పాల్పడతారనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో నివేదికలో రాయడం లేదని తెలిసింది. ఇలాంటి పిల్లలకు సాయం చేయడానికి మేఘ యానిమేషన్ చేయడం ప్రారంభించింది. పిల్లలకు తెలియదు.. పెద్దలు అర్థం చేసుకోరు! యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకే, వాటి ద్వారానే పిల్లలకు లైంగిక విద్యను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మేఘ. ‘‘నిజానికి పిల్లలకు సంబంధించిన నేరాలు చాలా మటుకు వారికి తెలియకుండానే జరుగుతాయి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, ‘నా పట్ల ఒకరు అసహ్యంగా ప్రవర్తించారని అమ్మకు చెప్పాను. మరోసారి ఇలాంటి మాటలు చెబితే కొడతాన’ని చెప్పింది’ అని ఆ పాప చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది’ అన్నారు మేఘ. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం అవసరమని మేఘా గ్రహించింది. ఆ ఆలోచనతోనే ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’ పేరుతో పది నిమిషాల నిడివిగల యానిమేటెడ్ సినిమా రూపొందించింది. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో నివసిస్తున్న 100 మందికి పైగా న్యాయవాదులు, ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత మేఘా ఈ చిత్రాన్ని రూపొందించింది. మేఘ చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లల క్షేమం కోసమే. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్లో అవగాహన తీసుకురావాలి. పెద్దలూ అర్థం చేసుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం) -
దీప్తి కోసమే ఆ టాటూ వేసుకున్నా: షణ్ముఖ్
కంటెంట్ ఉంటే చాలు క్రేజ్ దానంతటదే వస్తుందనడానికి "సాఫ్ట్వేర్ డెవలపర్" మంచి ఉదాహరణ. యూట్యూబ్ వేదికగా విడుదలైన ఈ షార్ట్ఫిలిమ్ ఒక్క ఎపిసోడ్ చూస్తే చాలు.. మిగతావి చూడకుండా ఉండలేనంతగా యువతను అట్రాక్ట్ చేస్తోంది. తెలుగు ప్రేక్షకులను ఇంతలా తన బుట్టలో వేసుకుంటోన్న సాఫ్ట్వేర్ డెవలపర్ ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్ సిరీస్‌లోని హీరోహీరోయిన్లు షణ్ముఖ్ జశ్వంత్, వైష్ణవి చైతన్యతో యాంకర్ సత్తి గరంగరం ముచ్చట్లు పెట్టారు. సాఫ్ట్వేర్ డెవలపర్లో ఆ ఎపిసోడ్ నా ఫేవరెట్ ఈ సందర్భంగా షణ్ముఖ్ మాట్లాడుతూ.. దర్శకుడు సుబ్బు, తాను మొదటగా రెండో సీజన్ స్క్రిప్ట్ రాసేసుకున్నామని చెప్పాడు. దాన్ని అమెరికాలో చిత్రీకరించేందుకు ప్లాన్ కూడా చేశామన్నాడు. ఆ సీజన్లో కొత్త టీమ్ ఉండబోతుందని, అయితే వైష్ణవికి పెళ్లైంది కాబట్టి ఆమె ఉండదని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసినదాంట్లో సాఫ్ట్వేర్ డెవలపర్ సిరీసే ఎక్కువ ఇష్టమని, అందులోనూ తొమ్మిదో ఎపిసోడ్ మరింత ఫేవరెట్ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ చూసిన దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ మా సిరీస్ బాగుందని ప్రశంసించాకని, అలాగే మరికొందరు డైరెక్టర్లు ఫోన్ చేసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందన్నాడు. (చదవండి: ఆ వార్తల్లో నిజం లేదు) దీప్తికి ఇష్టమైతే కలిసి నటిస్తాం "వెబ్ సిరీస్‌లో చూపించినట్లు కాకుండా నేను నిజజీవితంలో చాలా సైలెంట్‌గా ఉంటా. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. సినిమాలో అవకాశం వచ్చేవరకు పరిగెడుతూనే ఉంటాను. ఇండస్ట్రీలో సూర్య, అల్లు అర్జున్ నాకు ఫేవరెట్. ఈ మధ్యే సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా' చూసి ఏడ్చేశాను" అని చెప్పాడు. తన చేతికున్న టాటూ గురించి చెప్తూ అది దీప్తి సునయన కోసం వేయించుకున్నానని రహస్యాన్ని బయటపెట్టాడు. ఆమెకు ఇష్టమైతే మళ్లీ కలిసి నటిస్తామని మనసులో మాట బయట పెట్టాడు. (చదవండి: సూపర్ సిరీస్..‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’) అదే నా పెద్ద డ్రీమ్: వైష్ణవి వైష్ణవి మాట్లాడుతూ.. నా జీవితంలో మిస్టర్ షన్నూలాంటి వాళ్లు ఎవరూ లేరు. భవిష్యత్తులో వస్తారేమో చూడాలి. సినిమా హీరోయిన్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ ఇప్పుడే చేయాలనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే నాని టక్ జగదీశ్, నాగశౌర్య సినిమాల్లో కీలక పాత్రల్లో చేస్తున్నా. బిగ్‌బాస్‌లోకి అవకాశం వస్తే వెళ్తాను. అనుష్క నా ఫేవరెట్ హీరోయిన్. నా డ్రీమ్ ఒక్కటే.. వైష్ణవి అంటే ట్రెడిషనల్.. ట్రెడిషనల్ అంటే వైష్ణవి. ఆ పేరు రావాలి" అని చెప్పుకొచ్చింది. -
షార్ట్ ఫిలిం.. లాంగ్ హెయిర్
ఇప్పటివరకూ పెద్ద పెద్ద (నిడివి ఎక్కువ) సినిమాలు చేసిన హీరో సూర్య ఇప్పుడు ఓ చిన్న (షార్ట్) ఫిలిం చేస్తున్నారు. నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో దర్శకుడు మణిరత్నం నిర్మిస్తున్న వెబ్ మూవీలో ఓ కథలో సూర్య హీరోగా కనిపిస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలిం చిత్రీకరణ మంగళవారం ఆరంభమైంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు. ఈ షార్ట్ ఫిలింలో సూర్య లాంగ్ హెయిర్‌తో కనిపిస్తారు. నిజానికి ‘ఆకాశమే నీ హద్దురా’ తర్వాత ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. ఈ సినిమా కోసమే జుట్టు పెంచారు. అదే లుక్ లో ‘నవరస’లో కనబడనున్నారు. ‘వెబ్ ఫిలిం స్టార్ట్ చేశాం. ఈరోజు సెట్స్ లో ఎనర్జీ రెండింతలు. దానికి కారణం సూర్య’ అని పేర్కొన్నారు పీసీ శ్రీరామ్. మిగతా ఎనిమిది కథలను ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తారు. వాటిలోనూ పేరున్న నటీనటులు కనబడతారు. -
మనసుకు హత్తుకున్న ‘మనసానమః’
గుండెను హత్తుకునే ఆ డైలాగులు రెండు నెలలుగా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. కేవలం15 నిమిషాల నిడివితో నిర్మించిన ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును సైతం ఊపేస్తోంది. హిమాయత్‌నగర్:హృదయానికి హత్తుకునే ఈ డైలాగులు రెండు నెలలుగా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ డైలాగులు ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ‘మనసానమః’ షార్ట్ ఫిల్మ్లోవి. కేవలం 15నిమిషాల నిడివిగల ఈ షార్ట్‌ఫిల్మ్ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడును సైతం ఊపేస్తుంది. ‘చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం’ వంటి కాలాల్లో ప్రేమలో సూర్య (సూర్యుడు) ఎదుర్కొనే పరిణామాలను డైరెక్టర్ దీపక్ ఎంతో అందంగా చిత్రీకరించారు. అంతర్జాతీయ స్థాయిలో 70కి పైగా అవార్డులను కైవసం చేసుకుని తెలుగు, తమిళ నటీ నటులను సైతం ఆకర్షించిన ‘మనసానమః’ షార్ట్‌ఫిల్మ్‌పై ప్రత్యేక కథనం. మనసానమః మూవీ మనసుకు చాలా నచ్చింది. చాలా ప్రత్యేకమైన మూవీ కూడా. డైరె క్టర్ దీపక్ చాలా తెలివిగా ఆకట్టుకునేలా తీశారు. చాలా అద్భుతంగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన వారికి కంగ్రాచులేషన్స్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా’.– ఇన్‌స్ట్రాగామ్‌లో అగ్రనటి అనుష్క ‘ఇదొక అందమైన చిత్రం. ఈ చిత్రం చూశాక మనసంతా చాలా ఆనందంగా, పీస్‌ఫుల్‌గా ఉంది. సినిమాలో యాక్ట్ చేసిన వారందరికీ, డైరెక్టర్ దీపక్‌కు బెస్ట్ ఆఫ్ లక్’. – ట్విట్టర్లో రష్మిక మందాన. హైటెక్‌సిటీకి చెందిన దీపక్ యూఎస్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి దీపక్‌కు సినిమాపై ఆసక్తి ఉంది. తొలిసారిగా 2013లో ‘డబ్ల్యూటీఎఫ్’(వాట్ ఈజ్ ది ఫ్యాక్ట్) పేరుతో థ్రిల్లర్ షార్ట్‌ఫిల్మ్ తీశారు. 2015లో ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అనే పేరుతో కామెడీ, 2016లో ‘హైడెన్ సీక్’(హారర్) షార్ట్ ఫిల్మ్‌లను ఆయన నిర్మించారు. ఈ మూడు షార్ట్ఫిల్మ్లకు నెటిజన్ల నుంచే కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా.. 2017లో ‘వీకెండ్ సినిమా’ అనే పేరుతో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌ను ప్రారంభించారు. దీంతో డైరెక్టర్ శేఖర్ కమ్ముల నిర్మించిన బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ ‘ఫిదా’కు యూఎస్ షెడ్యూల్ 40రోజులకు దీపక్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో మరింత మందికి దీపక్ చేరువయ్యారు. మనసుకు హత్తుకున్న ‘మనసానమః’ ‘చైత్రమాసం, వర్షాకాలం, శీతాకాలం’ వంటి కాలాల్లో సూర్యుడు ఏ విధంగా వాతావరణానికి రియాక్ట్ అవుతాడో.. ఆ విధంగా నిజజీవితంలో సూర్య అనే వ్యక్తి ముగ్గురు అమ్మాయిల మధ్య మూడు సీజన్స్లలో రియాక్ట్ అయ్యే విధానాన్ని దీపక్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా చూపించారు. సూర్యగా హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్లుగా దృషిక చందర్(చైత్ర, చైత్రకాలం), శ్రీవల్లి రాఘవేందర్(వర్ష, వర్షాకాలం), పృథ్వీశర్మ (సీత, శీతాకాలం)లు నటించారు. క్లోజ్ సర్కిల్ కథల ఆధారంగా.. నా చుట్టూ ఉన్న క్లోజ్ సర్కిల్ కథల ఆధారంగా ‘మనసానమః’ షార్ట్‌ఫిల్మ్ నిర్మించా. గతంలో నేను చేసిన మూడు షార్ట్‌ఫిల్మ్‌లను బట్టి నాకంటూ ఓ గుర్తింపు వచ్చింది. ఈ ఫిల్మ్ చిన్నా, పెద్దా అందర్నీ ఆకట్టుకుంటుంది. మనదగ్గరే కాదు తమిళనాడు, బాలీవుడ్లో సైతం ఈ సినిమా హైలెట్‌గా నిలవడం ఆనందంగా ఉంది. – దీపక్, మనసానమః డైరెక్టర్. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకున్న షార్ట్ ఫిల్మ్‌గా ‘మనసానమః’ నిలిచింది. ‘ఇంటర్నేషనల్ సౌండ్ అండ్ మ్యూజిక్ ఫిల్మ్ ఫేస్టి వల్’(క్రాషియా)కు ఈ సినిమా ఎంపి కైంది. ప్రపంచ వ్యాప్తంగా 15 షార్ట్ ఫిల్మ్‌లు ఎంపికవ్వగా.. వాటిలోమనసానమః నిలిచింది. ‘టాప్ షార్ట్స్(కాలిఫోర్నియా), ఇండిపెండెంట్ షార్ట్స్ అవార్డ్స్(హాలివుడ్, లాస్ ఏంజెల్స్), ఇండియే షార్ట్ ఫెస్ట్ (హాలివుడ్, లాస్ ఏంజెల్స్) ఇలా 70కి పైగా అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. -
కెమెరా టెక్నిక్స్.. షార్ట్ఫిలిమ్స్ సూపర్‌హిట్..
జూబ్లీహిల్స్: ఓ చిన్న 5డీ కెమెరాతో ఫొటోగ్రఫీ రంగంలో సత్తా చాటుతూ.. ఇప్పటికే వందలాది లఘుచిత్రాలను తన కెమెరాతో చిత్రీకరించి శెభాష్ అనిపించుకుంటున్నాడు యూసుఫ్‌గూడ వెంకట గిరిబస్తీలో నివసించే యువ సినిమాటోగ్రాఫర్ సుధాకర్. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుధాకర్‌కు చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ అంటే మక్కువ. తండ్రి కొనిచ్చిన చిన్ని కెమెరాతో రకరకాల ప్రయోగాలు చేస్తూ ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకున్నాడు. క్రమంగా సెల్ఫోన్లు రంగప్రవేశం చేయడం, వాటిలో అత్యుత్తమ నాణ్యత కలిగిన కెమెరాలు రావడంతో ఫోన్లో కూడా చిత్రీరణ చేసి భళా అనిపించుకున్నాడు. షార్ట్‌ఫిలిమ్స్‌తో సత్తా..నాలుగైదేళ్లుగా షార్ట్ఫిలిమ్స్ విజృంభణతో ఫొటోగ్రఫీని ఉపాధి అవకాశంగా మార్చుకున్నాడు. షార్ట్ఫిలిమ్ మేకింగ్‌లో పట్టుసాధించి ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా షార్ట్ఫిలిమ్స్కు కెమెరామెన్‌గా పనిచేశాడు. అలాగే 10 ఇండిపెండెంట్ చిత్రాలకు, శివ 143, రహస్యం అనే చలనచిత్రాలకు పూర్తిస్థాయి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మరో రెండు సినిమాలకు ఛాయగ్రహకుడిగా అవకాశాలు వచ్చాయి. ఈ రంగంలో పలు ప్రైవేట్ సంస్థల అవార్డులు అందుకున్నాడు. సుధాకర్ ఫొటోగ్రఫీ నిర్వహించిన హెలినా, అనుక్షణం, రాధాకృష్ణ, శ్వాస నువ్వే, రుధిరం తదితర లఘుచిత్రాలకు మంచిపేరు వచ్చింది. యూట్యూబ్‌లో పెద్దహిట్ చిత్రాలుగా నిలిచాయి. షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తున్నా.. ఫొటోగ్రఫి తిలక్ దగ్గర నేర్చుకున్నాను. మా ఊరి వంట కార్యక్రమానికి అసిస్టెంట్‌గా పనిచేశాను. రామ్‌గోపాల్ వర్మ స్ఫూర్తిగా చిట్టీలు వేసి డబ్బులు జమచేసి 5డి కెమెరా కొనుగోలు చేశాను. క్రమంగా షార్ట్ఫిలిమ్స్కు పనిచేస్తూ పేరు సంపాదించాను. నా ఫేస్బుక్ పేజ్‌కు 5వేల మంది, ఇన్‌స్ట్రాగామ్ పేజ్‌కు 5వేల మంది అభిమానులు ఉన్నారు. ఈ రంగంలో కొనసాగుతూ మంచి సినిమాటోగ్రాఫర్‌గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నాను. – సుధాకర్, షార్ట్ఫిలిమ్స్ సినిమాటోగ్రాఫర్ -
‘స్లీప్‌వాకర్స్’ టీజర్!
-
నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!
ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. స్టార్ట్.. కెమెరా... యాక్షన్ అంటూ ‘స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిలిం కోసం దర్శకురాలి అవతారం ఎత్తారు. షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘ఇదిగో మా టీజర్ ట్రైలర్’’అంటూ రాధిక ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారు. గర్భవతి అయిన భార్య, భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ.. రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం.. ఆమెతో కలిసి షహానా బీచ్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక టీజర్ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ‘‘ఐ యామ్ సారీ’’ అంటూ గుల్షన్ ఆమెను చిత్రహింసలకు గురిచేసే విజువల్ ఒకింత భయానకంగా ఉంది. కాగా టీజర్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం’’ అంటూ రాధికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కథ వింటారా?
‘ఓ మంచి కథ ఉంది. వింటారా?’ అని అడుగుతున్నారు విద్యాబాలన్. ఆ కథ ఆమెకు చాలా నచ్చింది. అందుకే అందరికీ కథ చెప్పాలనుకున్నారు... కాదు కాదు... చూపించాలనుకున్నారు. ఆ కథతో తొలిసారి ఓ షార్ట్ఫిల్మ్లోయాక్ట్ చేయడానికి అంగీకరించారామె. ‘నటఖట్’ అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించడమే కాకుండా నిర్మించారు (రోనీ స్క్రూవాలాతో సంయుక్తంగా) కూడా విద్యా. షాన్ వ్యాస్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్‌ఫిల్మ్ షూటింగ్ గత ఏడాదే పూర్తయిందట. త్వరలోనే ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ‘నటఖట్’ ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో పిల్లాడి తల నిమురుతూ ఆలోచనల్లో నిమగ్నమైన గృహిణిగా విద్యా కనిపిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘నేను నిర్మాతని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ కథ వినగానే షార్ట్‌ఫిల్మ్‌ని నేనే నిర్మించాలనుకున్నాను. ఈ కథ నన్నెంత ఆశ్చర్యానికి గురి చేసిందో మిమ్మల్ని కూడా అంతే ఆశ్చర్యానికి గురి చేస్తుందనుకుంటున్నాను’’ అన్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. -
జెస్సీకి కార్తీక్ ఫోన్.. ఆ తర్వాత ఏమైంది?
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా కనిపించిన తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’. దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించారు. ‘విన్నైతాండి వరువాయ’ పేరిట తమిళంలో విడుదలైన ఈ చిత్రంలో త్రిష, శింబులు కార్తీక్, జెస్సీలుగా నటించారు. తాజాగా శింబు- త్రిషలపై ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు గౌతమ్. ఈ షార్ట్ ఫిల్మ్‌లో శింబు, త్రిషకి కాల్ చేయడమే కథాంశం. వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది సన్నివేశాలుగా చూపించారు. ప్రభుత్వ లాక్డౌన్ నిబంధనలను పాటిస్తూ ఎవరి ఇంట్లో వారుంటూ తీసిన షార్ట్ ఫిల్మ్ ఇది. ఇక ఏఆర్ రెహ్మాన్ నేపథ్య సంగీతాన్ని అందించడం మరో విశేషం. ‘కార్తీక్ డయల్ సేతాయన్’ పేరుతో విడుదలైన ఈ షార్ట్‌ఫిలిం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అయితే తెలుగులో చైతూ, సామ్‌లతో ఈ విధంగానే ఓ షార్ట్ ఫిలిం చేస్తే బాగుంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. చదవండి: రానా నిశ్చితార్థం జరిగిపోయిందా? సినిమాలకు సడలింపులు ఇవ్వాలి -
ఓ రైటర్ కథ
లాక్ డౌన్ సమయాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉపయోగించుకుంటున్నారు. వంటకాలతో ప్రయోగాలు, కొత్త భాషపై పట్టు సాధించడం వంటివి చేస్తున్నారు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. ‘ఎ రైటర్’ టైటిల్ తో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను 24 గంటల్లో చిత్రీకరించారట. గృహ హింస కాన్సెప్ట్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఇందులో రచయిత పాత్ర చేశారు పాయల్. ‘‘లాక్ డౌన్ వల్ల కెమెరా ముందుకి వెళ్లడం కుదరడం లేదు. ఈ షార్ట్ ఫిల్మ్ చేయడం ఆ బాధను కొంత తగ్గించింది. నా అభిమానులందరికీ ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు పాయల్. ఈ షార్ట్ ఫిల్మ్ కి పాయల్ మిత్రుడు సురభ్ దిగ్ర దర్శకత్వం వహించారు. 16 నిమిషాలున్న ఈ ఫిల్మ్ ను యు ట్యూబ్ లో చూడొచ్చు. -
సీక్వెల్‌కి టీజర్?
శింబు, త్రిష జంటగా దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కించిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘విన్నైత్తాండి వరువాయా’ (తెలుగులో నాగ చైతన్య, సమంతలతో ‘ఏ మాయ చేసావే’గా గౌతమ్ తీశారు). ఈ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించారు గౌతమ్ మీనన్. తాజాగా జెస్సీ, కార్తీక్ (సినిమాలో త్రిష, శింబు పాత్రల పేర్లు) పాత్రలతో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు మీనన్. ‘కార్తీక్ డయల్ సెయ్ద ఎన్’ టైటిల్‌తో ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కింది. ఈ లఘు చిత్రం ట్రైలర్ కూడా విడుదలయింది. శింబు, త్రిష ఎవరింట్లో వాళ్లు ఉండి ఈ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ షార్ట్ ఫిల్మ్ విడుదల కానుంది. ‘విన్నైత్తాండి వరువాయా’ సీక్వెల్ ఎలా ఉండబోతోందో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ టీజర్లా మీనన్ చూపించబోతున్నారని టాక్. -
చిట్టి చిలుక
లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను వినోదపరచడానికి, చైతన్యపరచడానికి పాటలు, వీడియోలు, షార్ట్ ఫిల్మస్ ఇలా ఏదోటి చేస్తున్నారు స్టార్స్. తాజాగా సీనియర్ నటి సుహాసిని కూడా ఓ షార్ట్ ఫిలిం తీశారు. దీని పేరు ‘చిన్నంజిరు కిళియే’ (చిట్టి చిలుక). 20 నిమిషాల నిడివి ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో మళయాళ నటి ఆహా కష్ణ ముఖ్య పాత్రలో నటించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి ఈ షార్ట్ ఫిలింను పూర్తి చేశారు. ఐ ఫోన్లో షూట్ చేసిన ఈ షార్ట్ ఫిలిం ఈ వారంలో విడుదల కానుంది. ఇది కరోనా వైరస్‌పై అవగహనకు సంబంధించిందా లేకపోతే వేరే కథాంశంతో తెరకెక్కిందా అనే విషయం తెలియాల్సి ఉంది. -
లాక్ డౌన్లో ప్రయోగం
లాక్ డౌన్ సమయంలో ఒక మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అతను ఎలా ప్రవర్తిస్తాడు? అనే నేపథ్యంలో తెరకెక్కిన షార్ట్ ఫిలిం ‘లాక్ డౌన్’. నటి, గాయని ఆండ్రియా ముఖ్య పాత్రలో ఈ షార్ట్ ఫిలిం రూపొందింది. ఆదవ్ కన్నదాసన్ దర్శకత్వం వహించిన ఈ మూడున్నర నిమిషాల లఘు చిత్రాన్ని ఐ ఫోన్ లో చిత్రీకరించారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉండి వీడియో కాల్స్ ద్వారా ఈ షార్ట్ ఫిలిం షూట్ చేశారు. ఒక పూటలో షూటింగ్ పూర్తి చేసేశారని సమాచారం. ‘‘దర్శకుడు ఆదవ్ నాకు ఓ ఏడాదిగా తెలుసు. తను చాలా టాలెంటెడ్. ఆదవ్ రైటింగ్, డైరెక్షన్ సైడ్ వస్తే బాగుంటుదనుకున్నాను. తను చెప్పిన ఈ షార్ట్ ఫిలిం ఐడియా నాకు బాగా నచ్చింది. ఫోన్ లో షూట్ చేసిన ఫిలింలో యాక్ట్ చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉంది... అది ఇప్పటికి కుదిరింది. ఈ షార్ట్ ఫిలిం కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. కొత్తగా ఆలోచించాలనుకునేవాళ్లకి మా షార్ట్ ఫిలిం ఒక ఉదాహరణగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు ఆండ్రియా. ఈ షార్ట్ ఫిలిం నేడు విడుదల కానుంది. -
కరోనాపై పోరాటం: సూపర్ స్టార్ల షార్ట్‌ఫిల్మ్
కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఏకతాటిపై వచ్చారు. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖులు అంతా వీడియోలు చేసి అభిమానలుతో పంచుకోగా.. తాజాగా మరో ముందడుగు వేసి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ‘ది ఫ్యామిలీ’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి మనల్ని అలరించనున్నారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు, తమిళ్, బాలీవుడ్ సూపర్ స్టార్లందరూ నటించారు. ఈ సినిమాను సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం అయ్యింది. (దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్) అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, మమ్ముట్టి, మోహన్ లాల్, సూపర్ స్టార్ రజినీకాంత్, శివరాజ్ కుమార్, దిల్జిత్ దోసంజ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలన్న ఆవశ్యకతను వివరించారు. అలాగే సినీ ఇండస్ట్రీ కార్మికులు లాక్డౌన్ కాలంలో ఏలాంటి ఇబ్బందులు పడుతున్నారో చిత్రీకరించారు. ఈ సినిమా కథ బిగ్‌బీ కళ్లజోడు పొగొట్టుకున్న సన్నివేశం నుంచి ప్రారంభం అవుతుంది. వీటిని వెతికి పట్టుకునేందుకు తోటి తారలంతా ప్రయత్నిస్తారు. అయితే ఈ వీడియోలో సెలబ్రిటీలంతా వారి వారి మాతృభాషలో మాట్లాడటం విశేషం. (నెటిజన్ల ఆగ్రహానికి గురైన కిరణ్ బేడీ) చివర్లో అమితాబ్ మాట్లాడుతూ ... ‘మనమందరం కలిసే ఈ సినిమా చేశాం. కానీ ఇందుకు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంట్లో నుంచే ఈ వీడియో చేశాం. వున మీరు కూడా దయచేసి ఇంట్లోనే ఉండండి. ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోడానికి ఇదోక్కడే మార్గం.. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. అంటూ చెప్పుకొచ్చారు’. అలాగే "మేము ఈ చిత్రాన్ని రూపొందించడానికి మరో కారణం ఉంది. మనమంతా భారతీయ చిత్ర పరిశ్రమలో కుటుంబ సభ్యులం. కానీ మాకు మద్దతు ఇచ్చే, మాతో కలిసి పనిచేసే మరో పెద్ద కుటుంబం ఉంది. వాళ్లే.. సినీ కార్మికులు. రోజువారీ వేతన సిబ్బంది. వీరంతా లాక్డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనమందరం కలిసి వీరి కోసం నిధులు సేకరించడానికి టీవీ ఛానల్, స్పాన్సర్ల ద్వారా ఏకమయ్యాం. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ కార్మికులకు పంపిణీ చేస్తున్నాం. ఈ కఠినమైన సమయాల్లో ఈ డబ్బు వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. (బాయ్‌ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలి... అనుమతివ్వండి) -
రజనీ.. చిరంజీవి.. ఓ ‘ఫ్యామిలీ’!
కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ఇంటి పట్టునే ఉండిపోయిన ‘ఫ్యామిలీ’ల కోసం ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్ నిర్మిస్తున్నారు. ఈ సమయంలో కుటుంబాలను ఉత్సాహపరచడానికి, వారికి అవసరమైన సూచనలు ఇవ్వడానికి ఈ షార్ట్‌ఫిల్మ్ ఉపయోగపడనుంది. అమితాబ్ ప్రోద్బలంతో సోనీ నెట్వర్క్ సహాయంతో ఈ షార్ట్‌ఫిల్మ్ తయారవుతోంది. ప్రసిద్ధ యాడ్ డైరెక్టర్ ప్రసూన్ పాండే వర్చువల్‌గా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షార్ట్‌ఫిల్మ్ కుటుంబాలకు ఐదు విషయాలను చెప్పనుంది. ‘ఇంట్లో ఉండండి’, ‘సురక్షితంగా ఉండండి’, ‘చేతులు కడుక్కోండి’, ‘ఇంటి నుంచి పని చేయండి’, ‘భౌతిక దూరం పాటించండి’... అని సృజనాత్మకంగా చెప్పనుంది. భారతీయులందరినీ ఉత్సాహపరచాలి కనుక ఈ షార్ట్‌ఫిల్మ్‌లో భారీ తారాగణం లిప్తపాటు కనిపిస్తారట. వారిలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ తదితరులు ఉంటారు. ఏప్రిల్ 6న రాత్రి 9 గంటలకు ఈ షార్ట్‌ఫిల్మ్ దేశమంతా ప్రముఖ చానెళ్లలో ప్రసారం కానుంది. ఈ షార్ట్‌ఫిల్మ్ గురించే కాక దేశంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తున్న చిన్న స్థాయి కార్మికులు లక్షమందికి సోనీ నెట్వర్క్, కల్యాణ్ జువెలర్స్‌తో కలిసి అమితాబ్ ఒక నెల వెచ్చాలను అందించనున్నారు. సూపర్మార్కెట్లతో ఏర్పాటు చేసుకున్న కూపన్లు కార్మికులకు అందేలా చేసి వెచ్చాలను అందించనున్నారు. -
బెల్ నొక్కుతున్నారు... తలుపు తీద్దామా?
ఆ గదిలో తొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు. బయట మరొకరు తలుపు కొడుతున్నారు. ఉన్నవారికే చోటు లేదు. మరి బయట ఉన్నవారికి తలుపు తీయాలా వద్దా? టీవీ రావడం లేదు. ఏదో డిస్ట్రబెన్స్. పదహారేళ్ల మూగ అమ్మాయి రిమోట్ పట్టుకొని తిప్పలు పడుతోంది. ఆ గదిలో ఒక సగటు ఇల్లాలిలా కనిపిస్తున్న ఒక స్త్రీ ధూపం వేసి దేవునికి దండం పెట్టుకునే పనిలో ఉంది. ఇద్దరు ముసలి స్త్రీలు పేకాట ఆడుకుంటూ గిల్లికజ్జాలు పడుతున్నారు. వారితో కలిసిన మరో వృద్ధ స్త్రీ కూరగాయలు తరుగుతోంది. టీవీలో ఏదో చానెల్ తగిలింది. రిపోర్టర్ మాట్లాడుతున్నాడు. ‘ఘటన జరిగిన చోటుకు మమ్మల్ని రానివ్వడం లేదు. పరిస్థితి చాలా గంభీరంగా ఉంది. దేశం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన’... అని ఇంకా ఏదో చెబుతూనే ఉన్నాడు. కనెక్షన్ కట్ అయ్యింది. ఎవరో రాబోతున్నట్టు చిత్రమైన శబ్దం మొదలైంది. ఆ వెంటనే బెల్ మోగసాగింది. ముసలాళ్లు చిరాకు పడ్డారు. ‘లోపల ఉన్నవాళ్లకే స్థలం చాలడం లేదు. మళ్లీ మరొకరా?’ అని. అవును.. లోపల ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఒక గ్లామర్ ఫీల్డ్‌లో పని చేసే అమ్మాయి ఉంది. ఒక ముస్లిం స్త్రీ ఉంది. ఒక మెడికో ఉంది. మొత్తం కలిపి తొమ్మిది మంది ఉన్నారు. ఇప్పుడు పదోవ్యక్తి బెల్ కొడుతున్నారు. ‘తీద్దాం’ అంది గృహిణి. ‘ఎవరో ఒకరు బయటకు వెళితేనే మరొకరు లోపలికొచ్చేది’ అన్నారు ఎవరో. ‘అయితే తక్కువ వయసు వారితో అత్యాచారం అయినవాళ్లు లోపల ఉందాం. ఎక్కువ వయసు ఉన్నవారితో అత్యాచారం అయినవారు బయటకు వెళదాం’ అని మెడికో అంది. ‘ఈ వేషాలు నా దగ్గర కాదు. మా ఆయన వయసు 50కి పైనే. ఆయనే నన్ను అత్యాచారం చేశాడు’ అందొక ముసలావిడ. ‘నన్ను ఇద్దరు రేప్ చేశారు. ఇద్దరూ 50 ఏళ్లు పై బడినవారే. అంటే ఇప్పుడు నేను బయటకు వెళ్లాలా?’ అంది గృహిణి. ‘సరే.. మరి మనలో ఎవరు ఎక్కువ క్రూరంగా చంపబడ్డారో వారు లోపల ఉందాం’ అంది మెడికో. ‘నన్ను గొంతు కోసి చంపారు’ అని ఒకరు, ‘నన్ను పీక నులిమి చంపారు’ అని ఒకరు, ‘నా నెత్తిన రాయి పడేశారు’ అని ఒకరు, ‘నన్ను బతికుండగానే తగులబెట్టారు’ అని ఒకరు.. ఆ గదిలో ఉన్నవాళ్లంతా తమను అత్యాచారం చేశాక ఎలా చంపారో చెప్పారు. ఒకామె తనే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పింది. అందరూ ఘోరంగా చంపబడినవారే. ఎవరని బయటకు వెళతారు.?! బయట బెల్లు మోగుతూనే ఉంది. ఏ లోకమో అది. ఒక లోకం. ఆ లోకంలో ఒక గది. ఆ గదిలో అత్యాచారం అయి చనిపోయిన వాళ్లంతా చేరుతున్నారు. ఇప్పుడు కొత్త సభ్యురాలు. తలుపు తీయాలా వద్దా? ‘తీస్తాను’ అంది గృహిణి. తీసింది. వచ్చిన మనిషిని చేయి పట్టుకొని తీసుకు వచ్చింది. లోపల ఉన్న స్త్రీలంతా కదిలిపోయారు. కరిగి నీరైపోయారు. ఆ వొచ్చింది ఏడేళ్ల బాలిక. ఆ బాలిక పరిగెత్తుకొని వెళ్లి ఒక ముసలావిడను అల్లుకుపోయింది. ఆ ముసలావిడ తన మనవరాలిని దగ్గరకు తీసుకున్నట్టు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుంది. పోయిన కనెక్షన్ మళ్లీ వచ్చింది. టీవీలో రిపోర్టర్ చెబుతున్నాడు ‘దేశంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. దాదాపు లక్ష అత్యాచార కేసులు న్యాయస్థానాల్లో మురుగుతున్నాయి. ప్రతి రోజూ దేశంలో 90 రేప్ కేసులు నమోదు అవుతున్నాయి. వందకు ముప్పై మందికే శిక్షలు పడుతున్నాయి. దేశంలో 80 శాతం జనాభా అమ్మవారిని పూజిస్తుంది. కాని ఈ దేశంలోనే ఇన్ని అత్యాచారాలు’ అంటూ ఉండగా షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. రాయల్ స్టాగ్ కోసం ఎలక్ట్రిక్ ఆపిల్స్ సంస్థ తీసిన షార్ట్‌ఫిల్మ్ ఇది. రచయిత ప్రియాంక బెనర్జీ దీనికి దర్శకత్వం వహించారు. గృహిణిగా కాజోల్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా నేహా ధూపియా, గ్లామర్ ఫీల్డ్ అమ్మాయిగా శృతి హాసన్ నటించారు. భారతదేశంలో వయసు తారతమ్యం లేకుండా, వర్గ తారతమ్యం లేకుండా, ఆర్థిక నేపథ్యాల తారతమ్యం లేకుండా ప్రతి దొంతరలోని స్త్రీ అత్యాచారాలకు బలవుతుందని ఈ షార్ట్‌ఫిల్మ్ చెప్పింది. మేరిటల్ రేప్‌ను కూడా చెప్పింది. దుర్గను తొమ్మిది రూపాలలో కొలుస్తాం కనుక తొమ్మిది స్త్రీ పాత్రలు ఉన్నాయి. దుర్గను కొలిచే చేతులు స్త్రీని ఎందుకు గౌరవించడం లేదు అని ఈ షార్ట్ ఫిల్మ్ ప్రశ్నిస్తోంది. యూ ట్యూబ్‌లో ఉంది. చూడండి. -
బన్నీ మెచ్చిన షార్ట్ ఫిల్మ్
రామగిరి: నాగేపల్లికి చెందిన విష్ణుభక్తుల శ్రవణ్‌కుమార్(శ్రవణ్ ఆర్య) సొంత ఆలోచనతో తీసిన షార్ట్ ఫిల్మ్ తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ను ఆకట్టుకుంది. అల్లు అర్జున్‌పై ఉన్నటువంటి అభిమానంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యతో మాస్ క బాప్ క్లాక్ క టాప్ అనే షార్ట్ ఫిల్మ్ తీసినట్లు శ్రవణ్ తెలిపాడు. విష్ణుభక్తుల ప్రొడక్షన్ ద్వారా నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు రైటర్‌గా హరీశ్‌కుమార్, దర్శకుడిగా రఘు జంగిలి, కో–ప్రొడ్యూసర్ డార్లింగ్ మధు, డీవోపీ జనతా బబ్బుల, హీరోగా శ్రవణ్ కుమార్ నటించాడు. షార్ట్ ఫిల్మ్ గురించి తెలుసున్న అల్లు అర్జున్.. శ్రవణ్ కుమార్‌ను పిలుపించుకుని షార్ట్ ఫిల్మ్‌ను అతడి మొబైల్లో చూసి అభినందించాడు.(బుట్టబొమ్మ వీడియో సాంగ్ వచ్చేసింది) శ్రవణ్‌కుమార్ -
తొమ్మిదిమంది మహిళలు ఒకే గదిలో
ఏదైనా సరే, షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాలి.. సాగదీసే వ్యవహారాలు అస్సలు గిట్టవు. ఇదీ ప్రస్తుత జనరేషన్ పరిస్థితి. ఏం చెప్పాలనుకున్నా, ఎంత చెప్పాలనుకున్నా తక్కువ సమయంలో చెప్పేయాలి. అదీ ఆసక్తికరంగా, ఆకట్టుకునేలా! ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని సినీ తారలు కూడా ఫాలో అవుతున్నారు. అందుకే కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తామని గిరిగీసుకోవట్లేదు. అవకాశాలు వస్తే ప్రయోగాలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోహీరోయిన్లుగా ఎదిగిన చాలామంది బుల్లితెరపై హడావుడి చేస్తున్నారు. మరికొందరు ఇంకాస్త ముందుకు వెళ్లి వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లోనూ వారి సత్తా చాటుతున్నారు. (ముగ్గురికి హెల్ప్ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి సాయం చెయ్యమనండి) ఈ క్రమంలో తొమ్మిది మంది సీనియర్ నటీమణులతో హిందీలో ఓ షార్ట్ ఫిల్మ్ రానుంది. కాజోల్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నేహా ధూపియా, నీనా కులకర్ణి, శృతీహాసన్, ముక్తా బావ్రే, రామా జోషీ, శివానీ రఘువంశీ, సంధ్య మాట్రే, రసశ్విని దయమ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని నామకరణం చేశారు. సోమవారం ఈ షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదలైంది. ఇందులో భిన్న నేపథ్యాలకు చెందిన తొమ్మిది మంది మహిళలు ఒకే గదిలో ఉన్నారు. అయితే దానికి గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇక రెండు కొప్పులు ఒక్కచోట ఉండలేవు అన్న చందంగా విభిన్న మనస్తత్వం గల వీళ్లు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగుతున్నారు. దీంతో వారికి సర్దిచెప్తూ మధ్యవర్తిత్వ పాత్రను పోషిస్తోంది కాజోల్. (షార్ట్ ఫిల్మ్‌లో శృతీహాసన్) తొమ్మిది మంది మహిళలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్లను ఎందుకు ఒకే గదిలో నిర్భందించారు? ఎవరు ఈ పని చేసుంటారు? అన్న విషయాలపై క్లారిటీ రావాలంటే మార్చి 2 వరకు ఆగాల్సిందే. ఈపాటికే విడుదలైన ట్రైలర్ అద్భుతంగా ఉందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నటులను ఒకేసారి చూడటం నిజంగా కనుల విందేనని కామెంట్లు చేస్తున్నారు. దుర్గాదేవి తొమ్మిది అవతారాలను స్ఫూర్తిగా తీసుకుని, వాటి తత్వాలను తెలియజెప్పే పాత్రలేమోనంటూ కొందరు దేవీ సినిమా కథపై వారి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ఏదేతైనేం, టైటిల్ పేరే ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటే ఇక స్టోరీ ఇంకెంత శక్తిమంతంగా ఉంటుందో చూడాలి. (హైదరాబాద్ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు) -
హైదరాబాద్ షార్ట్‌ఫిల్మ్‌కు అంతర్జాతీయ అవార్డు
సాక్షి, మణికొండ: చెరువులు తమ ఆవేదనను ఓ మూగ బాలికతో పంచుకునే ఇతివృత్తంతో తీసిన షార్ట్‌ఫిల్‌్మకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అమెరికాలోని న్యూయార్క్‌లో అక్కడి కాలమానం ప్రకారం గురువారం జరిగిన అంతర్జాతీయ లాంపా ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి దక్కించుకుంది. గత డిసెంబర్లో హైదరాబాద్ ఫోయనెక్స్ అరేనాలో జరిగిన జాతీయ షార్ట్‌ఫిల్మ్ విభాగంలోనూ మొదటి స్థానాన్ని దక్కించుకున్న వీడియో శనివారం అంతర్జాతీయ వేదికపైనా అదే స్థానాన్ని దక్కించుకుంది. ఓ చెరువు తన గోడును ఓ మూగ బాలికతో పంచుకోవటం ఇతివృత్తంగా మణికొండ మున్సిపాలిటీ నెక్నాంపూర్ పెద్ద చెరువు వద్ద ఈ వీడియోను చెరువు పరిరక్షణ కమిటీ సభ్యుడు సునీల్ సత్యవోలు నిరి్మంచగా అన్షుల్ దర్శకత్వం వహించారు. రెండున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ప్రస్తుతం పర్యావరణ, చెరువుల పరిరక్షణ, వాతావరణ సమతుల్యత వాస్తవాలను చెరువు ఓ పదేళ్ల మూగ బాలికకు చెప్పుకోవటం, ఆ బాలిక చెరువును ఊరడించటం అనే ఇతివృత్తంతో ‘సైలెంట్ వాయిస్’ అనే పేరుతో తీసినట్టు నిర్మాత తెలిపారు. మనుషులు తమ జీవనానికి ఉపయోగపడే చెరువులు, పర్యావరణం, వాతావరణ సమతుల్యతలను ఎలా దెబ్బ తీస్తున్నారనే అనే అంశం అందరి గుండెలకు హత్తుకునేలా ఉండటంతో అంతర్జాతీయ షార్ట్‌ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వాహకులను కదలించిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ ప్రతి ఏటా ఇలాంటి షార్ట్‌ఫిల్మ్ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇతర షార్ట్ఫిల్్మల కన్నా అధికంగా 17 గోల్స్ సాధించటంతో తమ ఫిల్మ్‌కు ప్రథమ బహుమతి దక్కిందని ఆయన వివరించారు. అవార్డును లంప ఇంటర్నేషనల్ ఫెస్టివల్ చైర్పర్సన్ ఓల్గా జుబ్కొవా, యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ అఫైర్స్ సెక్రటరీ జనరల్ లియూ జెన్మిన్, రష్యా మొదటి డిప్యూటీ శాశ్వత ప్రతినిధి డ్మిట్రై పోల్యానస్కై చేతుల మీదుగా అవార్డును అందుకున్నట్టు సునీల్ వివరించారు. -
షేర్ యువర్ పెయిన్!
సాక్షి, సిటీబ్యూరో:‘నాకు థాంక్స్ చెప్పొద్దు. అవకాశం వచ్చినప్పుడు మీరు ఓ ముగ్గురికి హెల్ప్ చెయ్యండి. వారిలో ఒక్కొక్కరినీ మరో ముగ్గురికి చొప్పున సాయం చెయ్యమని చెప్పండి’– స్టాలిన్ సినిమాలో తన వద్ద సాయం పొందిన వారితో చిరంజీవి చెప్పే డైలాగ్ ఇది. ‘ఇలా బాధపడవద్దు. మరొకరు బాధితులుగా మారకుండా చూడండి.ఈ షార్ట్ఫిల్మ్ల్ని కనీసం మూడు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి వారికి అవగాహన కల్పించండి’– ఫిర్యాదు చేయడానికి వచ్చిన బాధితులకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు చెబుతున్న మాట ఇది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్ అధికారులు శుక్రవారం నుంచి ఓ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. సైబర్ నేరాల బారినపడిన బాధితులతోపాటు వారి వాట్సాప్‌లో ఉన్న గ్రూపుల్లో సభ్యులకూ అవగాహన కలిగేలా షేరింగ్ విధానాన్ని మొదలు పెట్టారు. మొత్తం ఆరు రకాలైన నేరాలపై రూపొందించిన షార్ట్‌ఫిల్మŠస్ను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి బాధితుల్నే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటున్నారు. ఆ ఆరింటిపై లఘు చిత్రాలు... ‘ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్’..అనే నానుడి సైబర్ నేరాల విషయంలో సరిగ్గా సరిపోతుందని అధికారులు చెప్తున్నారు. నేరం బారినపడిన వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి ఆ కేసుల్ని కొలిక్కి తీసుకురావడంతో పాటు అసలు ప్రజల వాటిల్లో బాధితులుగా మారకుండా చూడటానికీ కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు దీనికోసం పోస్టర్లు, కరపత్రాలు ముద్రించి పోలీసుస్టేషన్ల వారీగా పంపిణీ చేశారు. ఈ అవగాహనను మరింత సమర్థవంతంగా చేపట్టాలనే ఉద్దేశంతో లఘు చిత్రాల నిర్మాణం ప్రారంభించారు. గతంలో ఓటీపీ ఫ్రాడ్, ఫేస్బుక్ మోసాలు, మాట్రిమోనియల్ ఫ్రాడ్స్ సహా మొత్తం నాలుగింటిని రూపొందించారు. ఇటీవలే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్‌పై మరో రెండింటికి రూపమిచ్చారు. ఇప్పటి వరకు పరిమితంగా... సెలబ్రెటీలతో సందేశం ఇప్పిస్తేనే ప్రజలకు హత్తుకుంటుందనే ఉద్దేశంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు టాలీవుడ్ తారలతో ఈ ఫిల్మŠస్ రూపొందించారు. ఈ లఘు చిత్రాల్లో రెండింటినీ నగర కొత్వాల్ అంజనీకుమార్ తదితరులు గత నెల్లో జరిగిన హ్యాకథాన్‌లో ఆవిష్కరించారు. గురువారం వరకు ఈ ఆరు లఘు చిత్రాలు నగర పోలీసుల అధికారిక ఫేస్బుక్, వెబ్‌సైట్స్‌తో పాటు యూ ట్యూబ్‌లు, కొన్ని సినిమా హాళ్లల్లో అందుబాటులో ఉంచారు. అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసే చోట వీటిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇవి మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ భావించారు. ఈ చిత్రాలను విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకువెళ్ళడంతోనే నగర వాసులు... ప్రధానంగా యువతకు వీటిని దగ్గర చేయవచ్చని అందుకు వాట్సాప్‌ను వినియోగించుకుంటే ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. బాధితుల ఫోన్లకు షేర్ చేస్తూ.. శుక్రవారం నుంచి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ‘షేరింగ్’ విధానానికి శ్రీకారం చుట్టారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు ప్రతి రోజూ 40 నుంచి 50 మంది బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తుంటారు. ఇలా వచ్చిన వారిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్న వారి వాట్సాప్‌కు ఈ లఘు చిత్రాలను సైబర్ క్రైమ్ పోలీసులు షేర్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బాధితుడు కనీసం తాను ఉన్న మూడు గ్రూపుల్లో ఇవి షేర్ చేసేలా ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా ఏ మోసం బారినపడి ఫిర్యాదు చేయడానికి వస్తారో... దానిపై రూపొందించిన లఘుచిత్రాన్ని అతడికి షేర్ చేయడంతో పాటు అతడితో గ్రూపుల్లోకి చేయిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. బాధితులకు వాట్సాప్ ద్వారా పంపి..వాళ్లు మరో మూడు గ్రూపుల్లోకి పంపేలా ప్రోత్సహిస్తున్నామని, ఇదంతా బాధితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేసుస్తున్నారు. ఎవరైనా తాము ఎవరికీ షేర్ చేయమనో, అసలు తమకే షేర్ చెయ్య వద్దనో కోరితే వీటిని పంపట్లేదని వివరించారు. -
షార్ట్ అండ్ స్ట్రాంగ్!
గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్. ఇప్పుడు మరో మీడియమ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్ తాజాగా ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిల్మ్‌కు ‘దేవి’ అని టైటిల్ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్ అండ్ స్ట్రాంగ్‌గా ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
రంగుల వల.. చెదిరే కల
రంగుల ప్రపంచానికి పరిచయం చేస్తా..బుల్లి తెరపై మిమ్మల్ని చూపిస్తా.. మీ జీవితాన్ని మారుస్తా.. అంటూ షార్ట్ ఫిల్మ్‌ల పేరుతో భారీగా నగదు కాజేస్తూ అందమైన బాలికలు, యువతులను ఆకర్షిస్తాడు. వారికి కెమెరా ముందు ఎలా ఉండాలో నేర్పిస్తున్నట్లు నటిస్తూ ముగ్గులోకి దించుతాడు. అసహజ రీతిలో లైంగిక వాంఛ తీర్చుకునే క్రమంలోనే ఆ ప్రక్రియనంతా రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరిస్తాడు. ఆ తర్వాత వాటిని చూపించి భారీగా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు. డబ్బులు ఇవ్వని వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించుతాడు. వారితోనే వ్యభిచార గృహాలు ఏర్పాటు చేస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. నెల్లూరు(క్రైమ్): షార్ట్ ఫిల్మ్‌లు.. వీటిని వెనుక ఎన్నో చీకటి చిత్రాల రీళ్లు. ఈ రంగుల వలలో పడిన ఎందరో బాలికలు, యువతులు చీకటి జీవితాలు గడుపుతూ తమ జీవిత కలను చిదిమేసుకుంటున్నారు. గురువారం ఈ ముఠాను పట్టుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు సభ్య సమాజం విస్తుపోయే ఎన్నో చీకటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చీకటి ఫిల్మ్‌లపై హోంశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. జిల్లాలోని అల్లూరుకు చెందిన షేక్ జాకీర్‌హుస్సేన్ అలియాస్ మహేష్ కుటుంబం కొన్నేళ్ల కిందట నెల్లూరు నగరానికివచ్చింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతను మరణించడంతో కారుణ్య నియామకం కింద తల్లికి ఉద్యోగం వచ్చింది. మంచి మాటకారి కావడంతో ఎదుటి వారిని ఇట్టే తన మాటలతో ఆకర్షించేవాడు. కొంత కాలం మార్కెటింగ్ రంగంలో పనిచేసిన అతను షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా, ఈవెంట్స్ నిర్వాహకుడిగా అవతారమెత్తాడు. నెల్లూరులో స్టార్ట్గన్ పేరుతో ఇన్స్టిట్యూషన్ను ఏర్పాటు చేశాడు. షార్ట్‌ఫిల్మ్‌లు తీస్తున్నాని, సినిమా, బుల్లితెరలో అవకాశాలు కల్పిస్తానని బాలికలు, యువతులకు ఎరవేశాడు. అతని వలలో పడిన బాలికలు, యువతులకు కెమెరా ముందు ఎలా వ్యవహరించాలో నేర్పిస్తున్నట్లు నటిస్తూ వారిని మెల్లగా తన వైపు ఆకర్షించేవాడు. విలాస జీవనానికి అలవాటు చేసి.. ఖరీదైన కార్లు, విలాస వంతమైన జీవనానికి అలవాటు చేసి పూర్తిగా లోబర్చుకునేవాడు. అసహజ రీతిలో లైంగిక వాంఛ తీర్చుకునే క్రమంలోనే ఆ ప్రక్రియనంత రహస్య కెమెరాల ద్వారా చిత్రీకరించేవాడు. వాటి ద్వారా వారిని బెదిరించి నగదు గుంజేవాడు. నగదు ఇవ్వని వారిని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించేవాడు. వారిని విటుల వద్దకు పంపి వచ్చిన నగదులో అధిక మొత్తం అతను తీసుకుని పదో పరకో వారికి ఇచ్చేవాడు. వారితో వ్యభిచార గృహాలు ఏర్పాటు చేసేవాడు. పెద్ద ముఠాగా అవతరించారు. ఈవెంట్స్ పేరిట.. మీడియా ప్రతినిధి మీడియేషన్ పండగలు, పబ్బాలకు ఈవెంట్స్ నిర్వహణ పేరిట పశ్చిమబెంగాల్, తెలంగాణ, బెంగళూరు, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి యాంకర్స్‌ను తీసుకు వచ్చేవాడు. ఈ వెంట్స్ అనంతరంతో వ్యభిచారం చేయించేవాడు. ఈ క్రమంలోనే అతనికి మీడియా ప్రతినిధి ప్రియాంకతో పరిచయం అయింది. ఆమె అతని నేర సామ్రాజ్యానికి తన వంతు సహకారం అందించింది. మీడియా ముసుగులో బడాబాబులను కలుసుకుని వారితో స్నేహాన్ని ఏర్పరచుకునేది. జాకీర్‌ను సైతం వారికి పరిచయం చేసేది. వారితో సన్నిహితంగా మెలుగుతూ వారికి అందమైన యువతులను పంపి రెండు చేతుల ఆర్జించేవారు. ఎక్కడైనా పోలీసులు అడ్డు తగిలితే మీడియా పేరిట వారిని బెదిరించడంతో పాటు బడాబాబులు ద్వారా ఫోన్లు చేయించేవారు. దీంతో ఎవరూ వారి జోలికి వెళ్లలేదు. సామాజిక మాధ్యమాల్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి సైతం ఈ దందాలో భాగస్వామి. దాదాపు నాలుగేళ్లుగా ఈ వ్యవహారం చాపకింద నీరులా సాగుతోంది. ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు వీరి దాష్టీకానికి బలైపోయారు. వీరి కోరల్లో చిక్కుకున్న కొందరు ఎలా తప్పించుకోవాలో తెలియక ఆత్మహత్యాయత్నాలకు సైతం పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలోనే కాకుండా బెంగళూరు, చెన్నై, పశ్చిమబెంగాల్, తెలంగాణ తదితర ప్రాంతాలకు తమ నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ప్రాంతాల్లో అమ్మాయిలు కావాలంటే క్షణాల్లో సమకూర్చసాగారు. రెండు నెలల కింద పట్టుకుని వదిలేశారు? జాకీర్ హుస్సేన్ వ్యవహారం రెండు నెలల కిందటే బయటపడినట్లు సమాచారం. తన స్నేహితుడి స్నేహితురాలిని జాకీర్ హుస్సేన్ ట్రాప్ చేసి ఆమెతో వ్యభిచార కేంద్రం నిర్వహించే వాడని సమాచారం. ఈ విషయమై బాధితుడు అప్పట్లో నగరంలోని ఓ పోలీసు అధికారికి ఫిర్యాదు చేశారు. సదరు అధి కారి జాకీర్‌హుస్సేన్, మహిళను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వారి వద్ద నుంచి అమ్యామ్యాలు గుంజేసి వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ వ్యవహారం మరుగున పడిపోయింది. దీనిపై బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలో కోవూరుకు చెందిన ఓ బాలిక సైతం ఈ ముఠా వ్యవహారంపై పోలీసు బాస్‌కు ఫిర్యా దు చేసింది. దీంతో టాస్క్ఫోర్సు బృందం రంగంలోకి దిగింది. ప్రధాన నిందితుడితో పాటు వ్యభిచార కేంద్ర నిర్వాహకు లు, విటులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం లేవడంతో హోంశాఖ మంత్రి స్పందించారు. పూర్తిస్థాయిలో విచారించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ రస్తోగి టాస్క్ ఫోర్స్ బృందంతో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. విస్తుగొలిపే అంశాలు నిందితుడి సెల్‌ఫోన్ కాల్ డీటైల్స్‌ను సేకరించిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడికి ఇతర రాష్ట్రాల్లోను సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు వలలో బడాబాబులు ఉన్నట్లు పోలీసులు పసిగట్టారు. పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు ఉన్నాయని తెలియడంతో వాటి నిర్వాహకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..
చిక్కడపల్లి: షార్ట్ ఫిలింలు తీస్తున్నామని పరిచయం చేసుకుని ఓఎల్ఎక్స్లో కెమెరాలు అద్దెకు తీసుకొని వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.5.45లక్షల విలువైన 10 కెమెరాల స్వాధీనం చేసుకున్నారు. చిక్కడపల్లి ఏసీపీ కార్యాలయంలో సీఐ శివశంకర్‌రావు, డీఐ ప్రభాకర్‌తో కలిసి ఏసీపీ చల్లా శ్రీధర్ వివరాలు వెల్లడించారు. గోల్కొండ ప్రాంతానికి చెందిన సైమన్ అనే వ్యక్తి తన కెమెరాలను అద్దెకు ఇస్తానని ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. దీనిని చూసిన గచ్చిబౌలి రాజీవ్‌నగర్‌కు చెందిన టాక్సీ డ్రైవర్ సారిన్ హర్షవర్ధన్, బాలానగర్‌కు చెందిన ఆనంద్‌కుమార్ అనే వ్యక్తులు గత సెప్టెంబర్ 15న సైమన్ను సంప్రదించారు. రూ.700 చొప్పున కిరాయి మాట్లాడుకుని 10 కెమెరాలను తీసుకున్నారు. గుర్తింపుగా ఆధార్ కార్డు స్కాన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 9 వరకు గడువు పొడిగిస్తున్నట్లు సైమన్‌కు మేసేజ్ చేశారు. అనంతరం కెమెరాలను ఇతరులకు విక్రయించారు. అయితే గడువు ముగిసినా కెమెరాలు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన సైమన్ వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాప్ చేసినట్లు వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్, కమిషనర్లరెట్ల పరిధిలోని చిక్కడపల్లి, బహుదూర్‌పూర, బోయినపల్లి, చాంద్రాయణగుట్ట, వనస్థలిపురం, అల్వాల్, సనత్‌నగర్, గోల్కొండ, ఎస్సార్‌నగర్ పీఎస్‌ల పరిధిలో కేసులు ఉన్నట్లు తెలిపారు. వారి నుంచి కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఓ చిన్న ప్రయత్నం
స్టార్ట్... కెమెరా.. యాక్షన్ అని దర్శకుడు చెప్పగానే పాత్రలో లీనమైపోయి హీరోయిన్గా ఇన్ని రోజులు డైలాగ్‌లు చెప్పారు రాధికా ఆప్టే. కానీ తొలిసారి యాక్టర్స్ చేత డైలాగ్స్ చెప్పించారామె. అదేనండీ.. ఆమె ఓ 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసం దర్శకురాలిగా మారారు అని చెబుతున్నాం. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్ వాకర్స్’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించారు రాధికా ఆప్టే. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో చిన్నగా ఏదో ప్రయత్నించాను. ఇది నిర్మాతలు లలిత, హనీ, అభిషేక్‌లకు నచ్చడంతో నిర్మిస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్లీప్ వాక ర్స్’ విడుదలైన తర్వాత వీక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన రాధికా భవిష్యత్‌లో ఏదైనా సినిమాను డైరెక్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. -
కదిలించే కథలు
వంద పదాల సారాన్ని ఒక్క దృశ్యం చూపిస్తుంది. జీవితకాలపు సందేశాన్ని పదిసెకండ్ల ఫిల్మ్ ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు సెల్యులాయిడ్ తరం కాదు.. సెల్యులర్ టైమ్! ఏదైనా అరచేతి ఫోన్లో ప్రత్యక్షం కావాలి. సెకన్లలో తెలిసిపోవాలి. ఇవ్వాళ్టి మార్కెట్ స్ట్రాటజీ కూడా బ్రివిటీనే. ఈ జనరేషన్ కోరుకుంటున్న ఆ డిమాండ్‌ను అనుసరించే ఫేస్బుక్ ఓ కొత్త ప్రయత్నాన్ని పోస్ట్ చేసింది. దాని పేరే థంబ్స్టాపర్స్. పదిసెకన్లలో కమర్షియల్ యాడ్స్‌ను ప్రమోట్ చేసే సిస్టమ్. ‘‘షార్ట్‌స్టోరీస్ మూవ్ హార్ట్స్’’ పేరుతో వాటిని ప్రదర్శించడం మొదలు పెట్టేసింది కూడా. ప్రముఖ దర్శకురాలు కిరణ్‌రావు తీసిన రెండు షార్ట్‌ఫిల్మ్స్‌తో. ధైర్యం చేయడానికి క్షణం చాలు.. గృహహింసకు వ్యతిరేకంగా కిరణ్‌రావు తీసిన షార్ట్‌ఫిల్మ్‌కి క్యాప్షన్ అది. భర్త చేతిలో శారీరక హింసకు గురైన ఓ గృహిణికి ఒక యువతి ఫోన్ ఇస్తుంది .. 100 నంబర్ డయల్ చేసి. ఒక లిప్తపాటు తాత్సారం చేసి ప్రెస్ బటన్ నొక్కుతుంది ఆ గృహిణి. అప్పుడు వస్తుందీ కాప్షన్.. ధైర్యం చేయడానికి క్షణం చాలు అని. ఇంటి నుంచే మొదలవ్వాలి.. ఇది ఆమె తీసిన ఇంకో షార్ట్‌ఫిల్మ్... జెండర్ డిస్క్రిమినేషన్ మీద. ఒక అమ్మ తన కొడుకు, కూతురికి రెండుగ్లాసుల్లో పాలు పోసి ఇస్తుంది. కూతురి గ్లాస్లో కన్నా కొడుకు గ్లాస్లో పాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని గమనించిన ఆ అబ్బాయి తన గ్లాస్‌లోంచి చెల్లి గ్లాస్‌లోకి పాలు వంపి.. రెండు గ్లాసుల్లో పాలను సమం చేస్తాడు. మార్పు మొదలవడానికి రెండు క్షణాలు చాలు అనే వ్యాఖ్యతో ఈ షార్ట్‌ఫిల్మ్ ముగుస్తుంది. గొంతుచించుకోకుండా నిరసన తెలపొచ్చు.. సిటీబస్‌లో.. నిలబడ్డ ఒక అబ్బాయి తన ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి ఛాతీ వంక అదేపనిగా చూస్తూంటాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చున్న ఇంకో అబ్బాయి అది గమనించి తన షర్ట్ కాలర్‌ను ఛాతి కిందకు జారుస్తూ ‘‘ఇప్పుడు చూడు’’అన్నట్టుగా సైగ చేస్తాడు నిలబడ్డ అబ్బాయితో. అంతే అతను గతుక్కుమని చూపు తిప్పుకుంటాడు. ‘‘నాట్ ఆల్ ప్రొటెస్ట్స్ ఆర్ లౌడ్’’ అనే కాప్షన్ వస్తుంది. మాతృత్వానికి జెండర్ లేదు.. రుతుక్రమం గురించి నెట్లో సెర్చ్ చేసి కూతురికి వివరిస్తూంటాడు తండ్రి. ‘‘మదర్‌హుడ్ హాజ్ నో జెండర్’’ అనే మెస్సేజ్‌తో ముగుస్తుంది ఈ షార్ట్‌ఫిల్మ్. సామర్థ్యమే ముఖ్యం జిమ్‌లో.. ఒక స్థూలకాయురాలు.. అలవోకగా శీర్షాసనం వేస్తుంది అందరూ ఆశ్చర్యపోయేలా. అప్పుడు వస్తుంది కాప్షన్ ఎబిలిటీ మ్యాటర్స్ అని. అందమైన లోకం ఒక ట్రాన్స్ ఉమన్ పెట్టుకున్న చెవి జుంకాలు చూసి ‘‘ఎక్కడ కొన్నావ్.. చాలా బావున్నాయ్.. నీ అందాన్ని పెంచేలా’’ అంటూ కితాబిస్తుంది ఓ యువతి. ఆనందంగా ‘థాంక్స్’ చెప్తుంది ఆ ట్రాన్స్ ఉమన్. ‘‘యాన్ ఈక్వల్ వరల్డ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ వరల్డ్’’ అనే వ్యాఖ్యతో ఎండ్ అవుతుంది ఆ షార్ట్‌స్టోరీ. -
తెర పైకి క్రికెటర్ బ్రావో
తక్కువ కాలంలోనే మంచి కాంబినేషన్‌తో సినిమాలు చేసి తమ ఉనికిని గట్టిగా చాటుకొన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఓ షార్ట్ ఫిలింను ఎనౌన్స్ చేశారు. అది కూడా ప్రముఖ వెస్టీండీస్ ఆల్‌రౌండర్ డారెన్ బ్రావోతో కావడం విశేషం. ప్రస్తుతం సమంత ముఖ్యపాత్రలో ‘ఓ బేబి’, వెంకటేశ్, నాగచైతన్య కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ చిత్రాన్ని నిర్మిస్తోందీ సంస్థ. అలాగే అనుష్క, మాధవన్ కాంబినేషన్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘‘డారెన్ బ్రావోతో ఓ షార్ట్ ఫిలింను ప్లాన్ చేశాం’’ అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తెలిపారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా శనివారం బ్రావో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఒప్పందం జరిగింది. కోయంబత్తూర్, తమిళనాడు, వెస్ట్ండీస్లోని ట్రినిడాడ్, టొబాగోలలో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ కార్యక్రమంలో బ్రావోతో పాటు, టి.జి.విశ్వప్రసాద్, నిర్మాత వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నటరాజ్ పిళ్లై పాల్గొన్నారు. -
‘మా నాన్నే.. నా స్నేహితుడు’
కొత్తపేట(తూర్పు గోదావరి) : భార్య మాట విని తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్చకుండా ‘మా నాన్నే నా స్నేహితుడు’ అని అక్కున చేర్చుకున్న కొడుకు ఔన్నత్యంతో రూపొందించిన లఘు చిత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు. ఆదివారం ‘ఫాదర్స్ డే’ను పురస్కరించుకుని కొత్తపేటకు చెందిన పెద్దింటి కృష్ణవంశీ తన స్నేహితులు గొర్రెల సాయిమణికంఠ, కుంచెనపల్లి ఆదిత్య, చోడపనీడి ఏసురత్నం తదితరులతో కలిసి ‘నాన్నే నా స్నేహితుడు’ టైటిల్‌తో లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. తండ్రి తనను చిన్న వయసు నుంచీ ఎంతో అల్లారుముద్దుగా పెంచి, పెద్ద చేసి, విద్యాబుద్ధులు చెప్పించి, ఒక ఉద్యోగంలో చేర్చి, పెళ్లి చేస్తే.. వచ్చిన భార్య ‘నీ తండ్రి ఇంట్లో ఉంటే నేను మా పుట్టింటికి వెళ్లిపోతాన’ని చెప్పి వెళ్లిపోతుంది దానితో తండ్రి కోసం ఆ భార్యకు విడాకులిచ్చేందుకు సిద్ధపడతాడు. ఈ విషయం తెలిసిన ఆ కొడుకు స్నేహితులు ‘తండ్రి కోసం భార్యకు విడాకులు ఇవ్వడం ఏమిటి? మీ నాన్ననే వృద్ధాశ్రమంలో చేర్చవచ్చు కదా!’ అని సలహా ఇస్తారు. ‘ఈ సలహా ఇవ్వడానికా మీరు ఇక్కడికి వచ్చింది? పొండి మీరు నా స్నేహితులే కాదు. 20 ఏళ్ల మీ స్నేహం కన్నా, నా భార్యతో ఉన్న ఏడాది బంధం కన్నా 30 ఏళ్లు పెంచిన మా నాన్నే నాకు ముఖ్యం. ‘మా నాన్నే నా మొదటి స్నేహితుడు’’ అని చెబుతాడు. ఆ కొడుకు – స్నేహితుల సంభాషణ తెలుసుకున్న కోడలుకి జ్ఞానో దయం కలిగి, పశ్చాత్తాప పడి మామ గారిని తండ్రిగా చూసుకుంటానని కాపురానికి వస్తుంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ తండ్రిని అక్కున చేర్చుకున్న కథాంశంగా తీసుకుని ఈ లఘుచిత్రాన్ని తీసినట్టు దర్శకుడు కృష్ణవంశీ తెలిపారు. ఈ మార్పు ప్రతి కొడుకు, కోడలిలో రావాలన్న మా చిరు ప్రయత్నమే ఈ లఘు చిత్రమని ఆయన తెలిపారు. -
‘నేను దేవుడిని’.. నిర్మాతలపై కేసు నమోదు
బంజారాహిల్స్: క్రైస్తవుల మత విశ్వాసాలను కించపరిచేలా నేను దేవుడిని పేరుతో షార్ట్ ఫిలిం రూపొం దించిన సదరు నిర్మాణదారులపై కేసులు నమోదు చేయాల్సిందిగా క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త జెరుసాలెం మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజా రాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నేను దేవుడిని లఘుచిత్ర నిర్మాతలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా చిత్రాన్ని నిర్మించారని, దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు చిత్ర నిర్మాణదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరస్ట్ ఎంట్రీ
అనుకున్నది సక్రమంగా జరగకపోతే బ్యాడ్ డేగా, మరింత మిస్‌ఫైర్ అయితే వరస్ట్ డేగా భావిస్తాం. హీరోయిన్ నీతూచంద్ర మాత్రం వరస్ట్ డేనే నాకు బెస్ట్ అంటున్నారు. కారణం ‘వరస్ట్ డే’ అనే షార్ట్ ఫిల్మ్‌తో హాలీవుడ్ ఇండస్ట్రీకు ఎంట్రీ ఇవ్వడమే. ‘గోదావరి, సత్యమేవజయతే’ వంటి తెలుగుసినిమాల్లో నటించారు నీతూచంద్ర. ఇప్పుడు హాలీవుడ్ సినిమా చేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ – ‘‘2019 నాకు అద్భుతంగా స్టార్ట్ అయింది. ‘వరస్ట్ డే’ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఇందులో నెగటివ్ రోల్ చేస్తున్నాను. ఈ పాత్ర చాలా ఆసక్తికరంగా, భయంకరంగా ఉంటుంది. ఈ పాత్ర వల్ల నటిగా చాలా నేర్చుకునే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. స్టానిస్లివా అనే లాస్ ఏంజెల్స్ దర్శకుడు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఇదేకాక కొరియన్ సినిమాలో కూడా నీతూచంద్ర కనిపించనున్నారని సమాచారం. -
షార్ట్ కట్
-
ఇన్స్పిరేషన్ #తనూటూ..!
‘మీటూ’తో పెద్దపెద్ద హీరోల నిజస్వరూపాలనుబయటపెట్టేందుకు ప్రేరణగా నిలిచిన తనుశ్రీ..అకస్మాత్తుగా కామ్ అయిపోయారెందుకు?ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఇన్స్పిరేషన్గా నిలిచి, ‘ఇన్స్పిరేషన్’ అనే లఘుచిత్రాన్ని కూడా తీసిన తనుశ్రీ దత్తా ఆఖరి నిముషంలో చిత్రంలోని కథను ఎందుకు మార్చేశారు? ‘మీటూ’ పోరాటాన్ని మధ్యలోనే వదిలివెళ్లేలా ఆమెపై ఒత్తిడి తెచ్చినశక్తులే, ఆమె ‘ఇన్స్పిరేషన్’నూ దెబ్బతీశాయా?! తనుశ్రీ దత్తా తీసిన షార్ట్ ఫిల్మ్.. ‘ఇన్స్పిరేషన్’ ఈ నెల 8న మహిళా దినోత్సవానికి విడుదల కావలసి ఉంది. కానీ కాలేదు! మార్చి 19 తనుశ్రీ బర్త్ డే. ఆ రోజు కూడా ‘ఇన్స్పిరేషన్’ విడుదల అవలేదు! విడుదలై ఉంటే ఈసరికి బాలీవుడ్‌లోని పురుష పుంగవులు గగ్గోలు పెడుతూ ఉండేవారు. ‘ఇన్స్పిరేషన్’.. బాలీవుడ్ ‘మీటూ’ చీకటి కథల లఘుచిత్రం. అతుల్ భల్లా డైరెక్ట్ చేశారు. డైలాగ్స్ తనుశ్రీవే. భల్లా మునుపెన్నడూ సినిమాల్ని డైరెక్ట్ చెయ్యలేదు. కానీ స్త్రీపక్షపాతి. జర్నలిస్టు. గత ఏడాది ‘వధాయాన్ జీ వధాయాన్’ (శుభాకాంక్షలండీ శుభాకాంక్షలు) అనే పంజాబీ సినిమాకు మాత్రం డబ్బులు పెట్టాడు. రొమాంటిక్ కామెడీ అది. కామెడీకి డబ్బులు పెట్టిన మనిషిని, ‘సెక్సువల్ హెరాస్మెంట్’ థీమ్‌కి మనసు పెట్టమని అడిగారు తనుశ్రీ. ఓకే అన్నాడు ఆయన. తీశాడు కూడా. కానీ రిలీజ్ కాలేదు!! మాఫియా ఎంటర్ అయిందా?! ‘ఇన్స్పిరేషన్’ని రిలీజ్ చెయ్యొద్దని ఎవరైనా తనుశ్రీని బెదరించారా? బాలీవుడ్ మాఫియా రంగంలోకి దిగిందా? లేకా తనుశ్రీనే ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారా? తలనొప్పి ఎలా ఉంటుందో తనుశ్రీకి బాగా తెలుసు. ఆరు నెలలు ఇండియాలో ఉండి, ఇటీవలే ఆమె తిరిగి యు.ఎస్.వెళ్లిపోయారు. ఉండడం అక్కడి న్యూజెర్సీలో. కొన్నేళ్లుగా అక్కడే ఉంటున్నారు. అప్పుడప్పుడు ఇండియా వచ్చిపోతున్నారు. ఈ ట్రిప్పులో మాత్రం ఊరికే వెళ్లలేదు తనుశ్రీ. ‘మీటూ’కు ఆజ్యం పోసి వెళ్లారు. ఆజ్యం అనే మాట కరెక్ట్ కాదు. ‘మీటూ’ను రాజేసి వెళ్లారు.అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత గత ఏడాది జూలైలో ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం పెద్ద విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్ బనాయా అప్నే’లో ఎమ్రాన్ హష్మీతో నటించి, బాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీని విమానాశ్రయంలో కొద్దిమంది ఫొటోగ్రాఫర్లు మాత్రం గుర్తుపట్టారు. అంతేతప్ప ఆమె కారణంగా ఇండియాలో ‘మీటూ’ ఉద్యమానికి ఊపిరి అందుతుందని ఎవరూ ఊహించలేదు. ఆమె వచ్చేటప్పటికే మన దేశంలో మీటూ గురించి అక్కడో మాట ఇక్కడో మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం.. ఈ మూడు చిత్రపరిశ్రమల నుంచి కొంతమంది నటీమణులు బయటికి వచ్చి.. ‘ఒకవేళ లైంగిక వేధింపులు ఉంటే వాటిని ఖండించవలసిందే’ అన్నంత వరకు మాట్లాడగలిగారు. బాలీవుడ్లో ప్రియాంక చోప్రా, సుస్మితాసేన్, రీమా ఛద్ధా, రాధికా ఆప్టే కూడా.. ‘మీటూ’ అన్నది సపోర్ట్ చేయవలసిన మూవ్మెంట్ అన్నంత వరకే స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారు. ఒక బాధితురాలిగా తొలిసారి బయటికి వచ్చి మీటూ ఫిర్యాదు చేసింది మాత్రం తనుశ్రీ దత్తానే. ఆమె ఇచ్చిన ధైర్యంతో బాలీవుడ్‌లోని అజ్ఞాత బాధిత మహిళలు, దక్షిణాది చలన చిత్ర పరిశ్రమల్లోని మహిళా నటులు తామెలా లైంగిక వేధింపులకు గురైందీ రివీల్ చేశారు. సాజిద్‌ఖాన్, రాజ్‌కుమార్ హిరాణి, అనూ మాలిక్, కైలాష్ ఖేర్, సుభాష్ కపూర్, సుభాష్ ఘాయ్, అలోక్ నాథ్.. ఇలా ఆరోపణలు వచ్చినవాళ్లంతా పరువు కోసం పరుగులు మొదలు పెట్టారు. ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. వారిలో నానా పటేకర్ ముఖ్యుడు. మనసుకు సర్దిచెప్పుకోలేకే..! నానా పటేకర్ జెంటిల్మన్. రైతు జన బాంధవుడు. ముంబై చుట్టుపక్కల ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఒక్కొక్కరికీ లక్ష చొప్పున నగదు చెక్కులను ఇస్తూ కాస్త మంచి పేరును కూడపెట్టుకున్నాడు. తనుశ్రీ వచ్చి ఆ పేరును కూలగొట్టేశారు. పేరును కూలగొట్టడం ఆమె ఉద్దేశం కాదు. ఆత్మాభిమానం దెబ్బతిన్న కారణంగా పదేళ్లుగా ఆమె రగిలిపోతున్నారు. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రంలో ఒక సాంగ్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నప్పుడు నానా పటేకర్ ఆమెను వేధించాడు. అప్పటికి ఆయన స్టార్ యాక్టర్. అప్పటికి ఆమె మిస్ ఇండియా. కొత్తగా సినిమాల్లోకి వచ్చింది. వచ్చీ రాగానే చేదు అనుభవం. ఆ దెబ్బతో ఆమె సినిమాలు వద్దనుకుని వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం ఏకంగా హిమాలయాలకు వెళ్లి కూర్చున్నారు. అప్పటికి ఆమె వయసు ఇరవై ఐదేళ్లు. నానా పటేకర్ వయసు అప్పటికి 58 ఏళ్లు. అప్పుడు ఏమీ చేయలేక వెళ్లిపోయిన తనుశ్రీ, తిరిగొచ్చాక అతడి ముసుగు తొలగించారు. అయితే ఇదంతా కూడా తనుశ్రీ కల్పించినదే తప్ప నిజం కాదని ఆరోపిస్తూ ఆమెపై కేసు వేశారు నానా పటేకర్. కానీ ఆయన కరెక్ట్ మనిషా కదా అనే దానిపై పెద్దగా చర్చ జరగలేదు. తనుశ్రీని మాత్రం ఇండస్త్రీలోని అమ్మాయిలు, సీనియర్ మహిళా ఆర్టిస్టులు నమ్మారు. ఎక్కడో యు.ఎస్.లో ఉన్న మనిషి, ఇండియా వచ్చి, లేనిపోని తలనొప్పిని ఎందుకు తెచ్చుకుంటుంది అనే అనుకున్నారు. ఆ మాట నిజమే. తనుశ్రీకి మంచి లైఫ్ ఉంది. కానీ ఆ లైఫ్‌ని పశ్చాత్తాపం లేకుండా లీడ్ చెయ్యడానికి పాతవి తుడిచేసుకోవాలి కదా. ఇప్పుడు సమయం వచ్చింది. యు.ఎస్.లో మొదలైన మీటూ ఆమెలోని ఆనాటి నిస్సహాయతకు శక్తినిచ్చి, నిద్రాణంగా ఉన్న నిస్సత్తువను పోగొట్టింది. ‘వెళ్లి ఫైట్ చెయ్యి’ అని ప్రేరేపించింది. కథ ఎందుకు మారింది?! ఎందరికో ఇన్స్పిరేషన్ ఇచ్చి.. బాలీవుడ్లో, కోలీవుడ్‌లో, మాలీవుడ్‌లో.. ఎందరో బాధితుల్ని బయటికి రప్పించి, మర్యాదస్తుల అసలు రంగును బట్టబయలు చేసిన తనుశ్రీ తిరిగి తన ప్రశాంత జీవనంలోకి.. న్యూజెర్సీకి వెళ్లిపోయారు. అయితే అది నిజమైన ప్రశాంతతేనా?! కాదు అన్నదే సమాధానం. అందుకే ఆమె అర్థంతరంగా ముగించిన వెళ్లిన పోరాటాన్ని షార్ట్ ఫిల్మ్‌తో కొనసాగించాలనుకున్నారు. గత పదేళ్లలో ఎవరెవరు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైందీ సమాచారం సేకరించారు. స్క్రిప్టు రాసుకున్నారు. డైరెక్టర్నీ పెట్టుకున్నారు. ఫిల్మ్ కంప్లీట్ అయింది. కానీ రిలీజ్ కాలేదు. ఉద్యమంలోంచి వెనక్కు తగ్గినట్లే ఫిల్మ్ లోంచీ వెనక్కు తగ్గారా తనుశ్రీ. బాలీవుడ్ మాఫియా ఆమెను ఏమైనా హెచ్చరించిందా? అందుకే ఫిల్మ్‌ని చెత్తబుట్టలో వేసేశారా? అలాంటిదేమీ లేదంటున్నారు తనుశ్రీ. మొన్న బర్త్‌డే రోజు కూడా ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోందని చెప్పారు. అయితే కథ మాత్రం అది కాదు అన్నారు!! అందులో బాలీవుడ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఎపిసోడ్స్ ఏమీ లేవని చెప్పారు. మరి ఏం ఉంటుంది? ఇన్స్పిరేషనల్ టాక్ ఉంటుందట తనది. అది కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో. ఇంకే ఉండబోతోంది! అదీ చెప్పారు. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలను ఉద్దేశించి ‘డూస్ అండ్ డోంట్స్’ ఉంటాయట. హార్వర్డ్ కి వెళ్లొచ్చాక ‘బోస్టన్లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో అతిథి వక్తగా ప్రసంగించడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చాలా ఎక్సయిటెడ్గా ఉన్నాను’’ అని ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో తనుశ్రీ దత్తా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. పోస్ట్‌కి తగిలించిన తన ఫొటోలో కూడా ఆమె ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించారు. కళ్లద్దాలు పెట్టుకుని చిరునవ్వుతో అచ్చు హార్వర్డ్ స్కూల్ విద్యార్థినిలాగే ఉన్నారు. హార్వర్డ్ స్కూల్లో స్పీచ్ ఇవ్వడం అంటే మామూలు సంగతేం కాదు. ప్రపంచ ఆలోచనా ధోరణిని ప్రభావితం చేయగల భిన్న రంగాలలోని సుప్రసిద్ధులకు మాత్రమే ఆ ఆహ్వానం దక్కుతుంది. స్పీచ్ ఫిబ్రవరి 16న. వెళ్లొచ్చారు. చక్కగా మాట్లాడారు. తక్కిన వక్తల నుంచి, తన ప్రసంగానికి హాజరైన విద్యార్థుల నుంచి ఆమెకు ప్రశంసలు లభించాయి. మీడియా, మూవీస్, హ్యూమన్ ట్రెండ్స్.. ఇలా చాలావాటి గురించి తనుశ్రీ మాట్లాడారు. సమాజంలోని ‘మిసాజిని’ (స్త్రీద్వేషం) పైన ఆమె అభిప్రాయాలకు మాత్రం మంచి అటెన్షన్ లభించింది. ప్యానల్ డిస్కషన్లో కూడా తనుశ్రీ కూర్చున్నారు. ఒకరిద్దరు.. ఇండియాలో మీటూ పయనీర్‌గా ఆమెను గుర్తించారు. తనుశ్రీ నవ్వారు. ‘‘ధైర్యంగా బయటికి వచ్చిన ప్రతి స్త్రీ కూడా పయనీరే’’ అన్నారు. చొరవ, నాయకత్వ గుణం మాత్రమే స్త్రీలను వారు ఎదుర్కొనే ఇబ్బందులనుంచి బయటపడేస్తాయని చెప్పారు. స్త్రీ నుంచి పురుషుడికి లభించే సపోర్ట్ కన్నా, స్త్రీ నుంచి స్త్రీకి లభించే సపోర్టే ఎక్కువగా ఉంటుందనీ, అది మాత్రమే నమ్మకమైనది’’ అని తనుశ్రీ అన్నారు. హార్వర్డ్ స్పీచ్ ఇచ్చి వచ్చాక తనను కలిసిన ఫిల్మ్ క్రిటిక్, జర్నలిస్ట్ సుభాష్ కె. ఝాతో మాట్లాడినప్పుడు ఆమెలో అతడికి మునుపటి తనుశ్రీ కన్నా భిన్నమైన వ్యక్తి సాక్షాత్కరించారు. ముఖ్యంగా ఆమె తీస్తున్న ‘ఇన్స్పిరేషన్’ ఫిల్మ్ గురించే ఆయన తరచి తరచి అడిగారు. 20 నిముషాల నిడివి ఉండే ఆ చిత్రం ఇన్‌సైట్‌తో (లోతైన దృష్టి), క్రిస్ప్‌గా (సంక్షిప్తంగా) డైరెక్టుగా (నీళ్లు నమలకుండా) ఉంటుందని ఆమె చెప్పారు. అంటే.. చిత్రం ఎలా ఉంటుందన్నది మాత్రమే తనుశ్రీ చెప్పారు. ఏం ఉండబోతోందన్న చెప్పలేదు. ఇప్పుడు అదీ క్లియర్ చేసేశారు. అదొక ఆసక్తికరమైన హార్వర్డ్ స్పీచ్‌లా మాత్రమే ఉండబోతోంది. -
సినిమా చాన్స్ ఇప్పిస్తానని..
గచ్చిబౌలి: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని నమ్మించి షార్ట్‌ఫిలింలో సినిమాటోగ్రాఫర్‌గా పని చేసే వ్యక్తి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్ ఏసీపీ శ్యామ్‌సుందర్ రావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్టణం, సీతమ్మధార ప్రాంతానికి చెందిన సిరిగుడి షణ్ముఖ వినయ్ నగరానికి వలస వచ్చి మాదాపూర్‌లోని మస్తాన్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. బీటెక్ చదివిన అతను కొంత కాలంగా షార్ట్ఫిల్Šస్లో సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. అతని స్నేహితుడు మహబూబ్ గత జనవరిలో సైడ్ డ్యాన్స్ చేసేందుకు యువతులు కావాలని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన బోడుప్పల్‌కు చెందిన ఓ యువతి చర్లపల్లిలో మహబూబ్‌ను కలిసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న షణ్ముఖ వినయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల పాటు ఇద్దరు ఫోన్లో మాట్లాడుకున్నారు. సినిమా ఆర్టిస్టులను పరిచయం చేస్తానని నమ్మించి ఆమెను అమీర్‌పేట్‌కు రప్పించాడు. అక్కడి నుంచి బాధితురాలిని బైక్‌పై ఎక్కించుకుని మాదాపూర్ జైహింద్ ఎన్‌క్లేవ్‌లోని గోల్డెన్ గేట్ టవర్స్‌లోని గదికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కొద్ది రోజులు సదరు యువతితో ఫోన్లో మాట్లాడిన షణ్ముఖ వినయ్ ఆమె ఎస్సీ కావడంతో నిన్ను పెళ్లి చేసుకునేందుకు తన ఇంట్లో ఒప్పుకోవడం లేదని తెలిపాడు. దీంతో నాలుగు రోజుల క్రితం మాదాపూర్ వచ్చిన బాధితురాలు అతడిని నిలదీయగా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. దీంతో బాధితురాలు ఈ నెల 11న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాన పోలీసులు గురువారం నిందితుడి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
‘గంగవ్వ’ ఎరుకనే కదా..!
సాక్షి, మల్యాల(పెద్దపల్లి): అచ్చమైన తెలంగాణభాష ఆమె సొంతం. అమాయకమైన చూపులు.. శివాలెత్తే మాటలకు కేరాఫ్‌గా నిలుస్తోంది మై విలేజ్ షో ఫేం గంగవ్వ. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ దినసరి కూలీ. తనకు రాని నటనతోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మై విలేజ్‌షో అనే ఛానల్‌తో యూ ట్యూబ్ ఐకాన్‌గా మారింది. గంగవ్వ కనపడితే చాలు ఒక్క సెల్ఫీ అంటూ యువత పోటీ పడుతున్నారు. నటనతెలియని గంగవ్వకు ఏకంగా పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్లు ఆఫర్ ఇవ్వడం ఆమె ప్రతిభకు నిదర్శనం. వ్యవసాయ కూలీనుంచి.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన మిల్కూరి గంగవ్వ ఉరఫ్ మై విలేజ్ షో గంగవ్వ వ్యవసాయ కూలీ. డిజిటల్ ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ పట్టా పొందిన అదే గ్రామానికి చెందిన శ్రీరాం శ్రీకాంత్ పల్లెటూరి సంస్కృతిని చాటిచెప్పేందుకు మై విలేజ్ షో అనే యూట్యూబ్ఛానల్ను దాదాపు ఐదేళ్లక్రితం ప్రారంభించాడు. తమ ఇంటి సమీపంలో ఉండే గంగవ్వ హుషారుతనం.. చలాకీ మాటలు.. అచ్చ తెలంగాణభాషను గుర్తించాడు. తన ఛానల్లో నటించడానికి అవకాశం ఇచ్చాడు. అలా సాగిన తన ఐదేళ్ల ప్రస్థానంలో ఇప్పుడు గంగవ్వ లేనిదే మై విలేజ్‌షో లేదు అనేంతగా ఫేమస్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. గంగవ్వ మై విలేజ్ షో షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ ఛానల్లో ఇప్పటి వరకు 100కు పైగా షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది. ప్రతీ వీడియోలో తన ప్రత్యేకతను చాటుకుంది. మొన్నటి సంకాంత్రికి భీమవరంలో కోడిపందాలకు పోటీలు, తరువాత వచ్చిన ఎన్నికల్లో తీరును విశ్లేషిస్తూ ‘సెటైరికల్‌గా సర్పంచ్ గంగవ్వ’, నిన్నటి శివరాత్రి మహాత్యం వివరించే శివరాత్రి జాగారణ పేరుతో యూట్యూబ్ వీడియోలు తీస్తూ తన యాస,మాట తీరుతో గుర్తింపు పొందింది. ఓ వార్తాఛానల్లోని ప్రోగ్రాంలో ఏడాదిపాటు నటించింది. మరో వార్తాఛానల్లో రెండు పండుగ ఎపిసోడ్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ రవీంద్రభారతిలో శనివారం నాడు ఏర్పాటుచేసే ‘సినీవారం’లో సత్కారం పొందింది. సినీ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ సమంతను కలిసింది. వాళ్లే గంగవ్వ నటనను యూట్యూబ్‌లో చూసి ఆహ్వానించడం విశేషం. గంగవ్వతో ఒక్క సెల్ఫీ.. ఒక్కసారి నీ తిట్లతో దీవించు అంటూ గంగవ్వను వెతుక్కుంటూ వెళ్లి, గంగవ్వ మాటలు, తిట్లకు సంబరపడిపోతున్నారు యువత. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వరకు గంగవ్వతో సెల్ఫీ దిగేందుకు పోటీ పడుతున్నారు. పల్లెటూరి యాసతోపాటు మాటతో ఆకట్టుకుంటోంది. పల్లెటూరి నుండి పట్నం దాకా ఎక్కడికివెళ్లినా గంగవ్వ ఒక్క సెల్ఫీ అంటూ ఎగబడుతున్నారు. చెప్పింది చేసుడే తెలుసు.. వ్యవసాయ పనికి పోయేదాన్ని. పని లేనప్పుడు బీడీలు చేసేదాన్ని. శ్రీకాంత్ మా వీడియోలో నటిస్తవా అని అడిగిండు. నాకు నటించుడు రాదు..నువ్వు చెప్పింది సేత్త అన్న. శ్రీకాంత్ చెప్పింది చెప్పినట్లు చేస్త గంతే. ఎవుసం పనిచేసుకునేదాన్ని తీసుకువచ్చి ప్రపంచానికి పరిచయం చేసిండు శ్రీకాంత్. సినిమాల్లో నటించు అంటే నా ఊరిని ఇడిసి ఎక్కడికి రాను అని చెప్పిన. మొన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ నన్ను పిలిచి సినిమాల నటించుమంటే నటించుడు రాదు సారు..మీరు చెప్పింది చెప్పినట్లు సేత్తా అంటే కొద్దిసేపు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తీసుకున్నడు. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏ పనిచేసిన మంచిగనే ఉంటాం. – గంగవ్వ -
మీటూపై షార్ట్ ఫిల్మ్
ఇండియాలో ‘మీటూ’ ఉద్యమం ఊపందుకోవడానికి తనుశ్రీ దత్తా ముఖ్య కారణం. నానా పటేకర్ లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేశారామె. తనుశ్రీ దత్తా ధైర్యం మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత చాలామంది నటీమణులు సినిమా పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. తాజాగా లైంగిక వేధింపులపై ఓ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట తనుశ్రీ. మార్చి 8న మహిళా దినోత్సవం. ఆ రోజు ఈ వీడియో రిలీజ్ ప్లాన్ చేశారట. వాస్తవిక సంఘటనలకు కాల్పనికత జోడించి ఈ షార్ట్‌ఫిల్మ్ కథను తయారు చేశారట. ఈ షార్ట్ ఫిల్మ్‌లో నటించడమే కాకుండా రైటింగ్ సైడ్ కూడా పాలుపంచుకున్నారట తనుశ్రీ దత్తా. -
ఆసక్తికరంగా ‘ది క్రైమ్’
టీనేజ్ వయసులో పిల్లలతో తల్లిదండ్రుల అనుబంధం సరిగా లేకపోతే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని చెప్పిన లఘు చిత్రం 'ది క్రైమ్'. సమకాలీన యాంత్రిక జీవనంలో తల్లిదండ్రులు, పిల్లల మధ్య తరిగిపోతున్న రిలేషన్స్, ప్రేమానురాగాల ప్రాముఖ్యతను చాటిచెప్పిందీ ఇండిపెండెట్ ఫిలిం. ప్రముఖ నటుడు, దర్శకుడు, మాటల రచయిత తనికెళ్ల భరణి, సింధు, అంజలి, యుగ్ రామ్ నటించిన ఈ షార్ట్ ఫిలింకు ప్రేక్షకుల నుంచి విశేషంగా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ వల్లూర్ దర్శకత్వం వహించగా, రమేష్ నాయుడు నిర్మించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రీమియర్‌కు చిత్ర యూనిట్‌తో ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్, నటుడు వంశీ చాగంటి ,టీఎన్ఆర్ తదితరులు హాజరయ్యారు. నిర్మాత రమేష్ నాయుడు మాట్లాడుతూ.. ‘ప్రశాంత్ కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు నచ్చింది. ఓ మంచి సందేశాన్ని ప్రజలకు చేరవేయాలనుకొన్నాం. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని తనికెళ్ల భరణి గారితో చెప్పిస్తే బాగుంటుందని అనుకొని సంప్రదించాం. కాన్సెప్ట్ వినగానే ఆయన కూడా ఇంప్రెస్ అయి నటించడానికి ఆసక్తిచూపారు. ప్రతీ ఒక్కరు చూసి ఈ వీడియోను షేర్ చేయాలని కోరుకొంటున్నాం’ అని అన్నారు. దర్శకుడు ప్రశాంత్ వల్లూర్ మాట్లాడుతూ... ‘సమాజంలోని సమస్యను తీసుకొని ది క్రైమ్ మూవీని రూపొందించాం. మీరు ఈ లఘు చిత్రాన్ని చూసి అలా వదిలేయకండి. మీ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకొనేలా జాగ్రత్త తీసుకోండి. మీ చుట్టు ఉన్న వారికి, స్నేహితులు, సన్నిహితులకు ఈ సందేశాన్ని చేరవేయండి. ఇలాంటి సందేశాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలు, తల్లిదండ్రుల బంధాల మధ్య దూరం పెరుగుతున్న పరిస్థితుల్లో ఇలాంటి సందేశం ఉపయోగంగా ఉంటుంది. షార్ట్ ఫిలిం అయినప్పటికీ.. ఓ సినిమా లాంటి ఫీలింగ్ రావడానికి కృష్టి చేసిన యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్’ అని అన్నారు. నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. సమాజంలో ప్రతీ ఇంట్లో ఉండే సమస్యను ఎత్తిచూపుతూ మూవీని రూపొందించడం అభినందనీయం. తల్లిదండ్రులు గానీ, పిల్లలు గానీ, లవర్స్ మధ్య ఉండాల్సిన సున్నితమైన బంధాల గురించి చక్కగా తెరకెక్కించారు. నేను అమితంగా అభిమానించే నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణి నటించడం, యూనిట్‌ను ప్రోత్సహించడం అభినందనీయం. ఈ సినిమా అందరిలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది '' అని అన్నారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ఓ మంచి ఆలోచనకు తెరరూపం కల్పించడానికి కారణమైన ప్రశాంత్ భార్యను అభినందించాలి. తెలుగు సాహిత్యంలో మహా రచయిత గుడిపాటి వెంకటాచలం 'విలువ శిక్షణ' అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ముందుమాట రాస్తూ.. ఇలాంటి పుస్తకం 50 ఏళ్ల క్రితం దొరికి ఉంటే నా పిల్లలను మరింత మంచిగా, విలువలతో పెంచేవాడిని అని చెప్పారు. ద్వందార్థాలతో, బూతు కంటెంట్‌తో షార్ట్ ఫిలింస్ వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి మంచి సందేశంతో సినిమా రావడం గొప్ప విషయం. కష్టపడి, ఇష్టంగా పనిచేసి నటించాం. అంజలి, సింధు చక్కగా నటించారు '' అని అన్నారు. ఈ లఘు చిత్రంలో తనికెళ్ల భరణి, అంజలి, యుగ రాం, సింధు వీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.