కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఏకతాటిపై వచ్చారు. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖులు అంతా వీడియోలు చేసి అభిమానలుతో పంచుకోగా.. తాజాగా మరో ముందడుగు వేసి సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు. ‘ది ఫ్యామిలీ’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి మనల్ని అలరించనున్నారు. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు, తమిళ్, బాలీవుడ్ సూపర్ స్టార్లందరూ నటించారు. ఈ సినిమాను సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం అయ్యింది. (దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్)
అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, మమ్ముట్టి, మోహన్ లాల్, సూపర్ స్టార్ రజినీకాంత్, శివరాజ్ కుమార్, దిల్జిత్ దోసంజ్, రణ్‌బీర్ కపూర్, అలియా భట్, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలన్న ఆవశ్యకతను వివరించారు. అలాగే సినీ ఇండస్ట్రీ కార్మికులు లాక్‌డౌన్ కాలంలో ఏలాంటి ఇబ్బందులు పడుతున్నారో చిత్రీకరించారు. ఈ సినిమా కథ బిగ్‌బీ కళ్లజోడు పొగొట్టుకున్న సన్నివేశం నుంచి ప్రారంభం అవుతుంది. వీటిని వెతికి పట్టుకునేందుకు తోటి తారలంతా ప్రయత్నిస్తారు. అయితే ఈ వీడియోలో సెలబ్రిటీలంతా వారి వారి మాతృభాషలో మాట్లాడటం విశేషం. (నెటిజన్ల ఆగ్రహానికి గురైన కిరణ్ బేడీ)
చివర్లో అమితాబ్ మాట్లాడుతూ ... ‘మనమందరం కలిసే ఈ సినిమా చేశాం. కానీ ఇందుకు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంట్లో నుంచే ఈ వీడియో చేశాం. వున మీరు కూడా దయచేసి ఇంట్లోనే ఉండండి. ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోడానికి ఇదోక్కడే మార్గం.. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. అంటూ చెప్పుకొచ్చారు’. అలాగే "మేము ఈ చిత్రాన్ని రూపొందించడానికి మరో కారణం ఉంది. మనమంతా భారతీయ చిత్ర పరిశ్రమలో కుటుంబ సభ్యులం. కానీ మాకు మద్దతు ఇచ్చే, మాతో కలిసి పనిచేసే మరో పెద్ద కుటుంబం ఉంది. వాళ్లే.. సినీ కార్మికులు. రోజువారీ వేతన సిబ్బంది. వీరంతా లాక్‌డౌన్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనమందరం కలిసి వీరి కోసం నిధులు సేకరించడానికి టీవీ ఛానల్, స్పాన్సర్ల ద్వారా ఏకమయ్యాం. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ కార్మికులకు పంపిణీ చేస్తున్నాం. ఈ కఠినమైన సమయాల్లో ఈ డబ్బు వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. (బాయ్‌ఫ్రెండ్ దగ్గరికి వెళ్లాలి... అనుమతివ్వండి)
Comments
Please login to add a commentAdd a comment