CM KCR Phone Call To Chiranjeevi Over His Health Condition, Deets Inside - Sakshi
Sakshi News home page

CM KCR Phone To Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

Published Thu, Jan 27 2022 12:49 PM | Last Updated on Thu, Jan 27 2022 3:39 PM

Telangana CM KCR Phone to Megastar Chiranjeevi Over His Health - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవిని తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫోన్లో పరామర్శించారు. చిరంజీవికి కరోనా సోకడంతో ఆయన ఆరోగ్య వివరాలను సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ ఆకాంక్షించారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే.. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్టర్ ద్వారా తెలియ‌జేశారు.

‘‘కరోనా బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటీకీ.. వైరస్‌ సోకింది. నిన్న రాత్రి తేలికపాటి లక్షణాలతో కనిపించడంతో.. కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను హోం క్వారంటైన్‌లో ఉన్నాను. ఇటీవ‌ల న‌న్ను క‌లిసిన ప్రతి ఒక్కరు వెంట‌నే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా’అని చిరంజీవి ట్వీట్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement