చిన్నారి చేసిన పని నా హృదయాన్ని తాకింది: చిరంజీవి | Chiranjeevi: I Inspired By This Little Girl | Sakshi
Sakshi News home page

చిన్నారిపై మెగాస్టార్‌ ప్రశంసల జల్లు

Jun 1 2021 9:09 PM | Updated on Jun 1 2021 9:52 PM

Chiranjeevi: I Inspired By This Little Girl - Sakshi

మంచి మనసుకు, తన ప్రేమకు ముగ్ధుడినైపోయాను. అన్షి స్పందించిన తీరు నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్‌స్పైర్‌ చేసింది...

కరోనా రోగులను ఆదుకునేందుకు మెగాస్టార్‌ చిరంజీవి నడుం బిగించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ అందక అల్లాడిపోతున్న రోగుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేసి వారి పాలిట దేవుడిగా మారాడు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇదిలావుంటే ఓచిన్నారి చేసిన పని తనను కదిలించిందంటూ చిరంజీవి ట్విటర్‌ వేదికగా ఓ వీడియో రిలీజ్‌ చేశాడు. 

"శ్రీనివాస్‌-హరిణిల కూతురు అన్షి ప్రభాల. నేడు(జూన్‌ 1) ఆమె బర్త్‌డే. తను దాచుకున్న డబ్బులతోపాటు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆక్సిజన్‌ బ్యాంకుల కోసం చిరంజీవి చారిటబుల్‌ ట్రస్ట్‌కు ఇచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషమని ఆ చిన్నారి అంటోంది. ఆమె ఆలోచనకు, మంచి మనసుకు, తన ప్రేమకు ముగ్ధుడినైపోయాను. అన్షి స్పందించిన తీరు నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్‌స్పైర్‌ చేసింది. తన కలలన్నీ నిజం కావాలని, ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారి చేతుల మీదుగా ఆ భగవంతుడు మా ప్రయత్నానికి చేయూతనిస్తూ ఆశీస్సులను అందిస్తున్నాడని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే, లవ్‌ యూ డార్లింగ్‌" అని చిరంజీవి పేర్కొన్నాడు.

చదవండి: ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా: పావలా శ్యామల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement