Chiranjeevi Charitable Trust
-
చిరంజీవి కోసం వంద సార్లు రక్తదానం చేసిన సీనియర్ నటుడు..(ఫొటోలు)
-
చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్
అక్టోబర్ 2.. గాంధీ జయంతి. స్వాతంత్య్రాన్ని సాధించిపెట్టిన మహానుభావుడు మహాత్మ పుట్టినరోజు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మరో మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మెగాస్టార్.. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్(CCT) స్థాపించి ఎంతోమందికి రక్తదానం చేశారు. ఈ ట్రస్ట్ కార్యకలాపాలు మొదలై నేటికి పాతికేళ్లు పూర్తి కావడంతో చిరంజీవి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనయ్యాడు. 'ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ రోజునే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభమైంది. 25 సంవత్సరాల ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగింది. 10 లక్షలకు పైగా బ్లడ్ యూనిట్స్ సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశాం. 10 వేల మందికి పైగా కంటిచూపు ప్రసాదించాం. కరోనా సమయంలో వేలాది మంది ప్రాణాలు కాపాడాం. తోటి మానవులకు సేవ చేయడం ద్వారా వచ్చే సంతృప్తిని మాటల్లో వెలకట్టలేం. CCT చేపట్టిన మానవతా కార్యక్రమాల్లో భాగమైన లక్షలాది మంది సోదర సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను. మన దేశానికి చేస్తున్న చిరు సాయం ఇది! ఇదే మహాత్ముడికి మనం సమర్పించే అసలైన నివాళి!' అని రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌కు తాను రక్తదానం చేస్తున్న ఫోటోను జత చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. చిరు మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తోటివారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో చిరంజీవి ఈ ట్రస్ట్‌ను 1998 అక్టోబర్ 2న స్థాపించాడు. On this important day for our country, I also fondly reflect on Chiranjeevi Charitable Trust( CCT)’s humble beginnings and its amazing journey of 25 years. Over 10 lakh blood 🩸 units collected and distributed to the needy and eye 👁️ sight restored to over 10 thousand people… pic.twitter.com/UeVzCB58cp — Chiranjeevi Konidela (@KChiruTweets) October 2, 2023 చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ప్రియుడు ఎమోషనల్.. వీడియో వైరల్ -
చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ప్రజల కోసం ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్–స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 9) నగరంలో ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గతంలో చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య పాల్గొన్నారు. చికిత్సలో కూడా రాయితీ అందేలా కృషి: నాగబాబు సినీనటుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇప్పుడు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందుగానే కేన్సర్‌ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన డాక్టర్ గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని నాగబాబు హామీనిచ్చారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు. చదవండి: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే! జవాన్ ప్రివ్యూ.. గూస్బంప్స్ పక్కా -
గవర్నర్ చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులు
చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. ఆదివారం రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి సై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులను అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తూ వారికి ‘చిరు భద్రతా’ కార్డుల పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రక్త దాతలను సన్మానించుకోడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి గారు తన అభిమానులను మోటివెట్ చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు. ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ‘1998లో ప్రమాదంలో గాయపడ్డ వారు సమయానికి రక్తం ఎంతో మంది మరణించారు. ఆ ఘటనలు నన్ను బాధించాయి. అలాంటి ఘటనలు ఇకముందు జరగకూడదనే ఉద్ధేశంతోనే 24 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాను. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్ ఇన్సూరెన్స్ కార్డులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్ గారి ప్రోత్సాహకం ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందని, ఆమె ఎన్నో సార్లు ట్వీట్ల ద్వారా ఎంకరేజ్ చేశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు. -
చిరంజీవి చారిటబుల్ ట్రస్టు వెబ్సైట్ ఆరంభం
హైదరాబాద్: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందించే సేవలను ఎక్కువమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ ఆరంభించామని హీరో, నిర్మాత రామ్‌చరణ్ అన్నారు. www.chiranjeevicharitabletrust.com వెబ్‌సైట్‌తో ఆన్లైన్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి సినిమాలు, జీవిత విశేషాలు పొందుపరచిన www.kchirangeevi.com వెబ్‌సైట్‌ను కూడా సోమవారం హైదరాబాద్‌లో ఆరంభించామని పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి వెబ్సైట్ ప్రారంభించాం. ఆక్సిజన్, రక్తం అవసరమైనవారు ఈ వెబ్సైట్ ద్వారా మాకు రిక్వెస్ట్ పంపవచ్చు. అలాగే రక్తదాతలు వారి వీలును బట్టి ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని రక్తదానం చేయవచ్చు. నేత్రదానం చేయాలనుకున్నవారు రిక్వెస్ట్ పెడితే వెంటనే స్పందిస్తాం’అని పేర్కొన్నారు. -
చిన్నారి చేసిన పని నా హృదయాన్ని తాకింది: చిరంజీవి
కరోనా రోగులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ అందక అల్లాడిపోతున్న రోగుల కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వారి పాలిట దేవుడిగా మారాడు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇదిలావుంటే ఓచిన్నారి చేసిన పని తనను కదిలించిందంటూ చిరంజీవి ట్విటర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. "శ్రీనివాస్-హరిణిల కూతురు అన్షి ప్రభాల. నేడు(జూన్ 1) ఆమె బర్త్‌డే. తను దాచుకున్న డబ్బులతోపాటు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు మొత్తాన్ని కూడా ఆక్సిజన్ బ్యాంకుల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు ఇచ్చింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషమని ఆ చిన్నారి అంటోంది. ఆమె ఆలోచనకు, మంచి మనసుకు, తన ప్రేమకు ముగ్ధుడినైపోయాను. అన్షి స్పందించిన తీరు నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్పైర్ చేసింది. తన కలలన్నీ నిజం కావాలని, ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ చిన్నారి చేతుల మీదుగా ఆ భగవంతుడు మా ప్రయత్నానికి చేయూతనిస్తూ ఆశీస్సులను అందిస్తున్నాడని భావిస్తున్నాను. హ్యాపీ బర్త్‌డే, లవ్ యూ డార్లింగ్" అని చిరంజీవి పేర్కొన్నాడు. చదవండి: ఆ బాధ చూడలేక కూతుర్ని చంపేయాలనుకున్నా: పావలా శ్యామల -
నాగబాబుకు అభినందనలు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను జయించిన మెగా బ్రదర్ నాగబాబు కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు. ప్లాస్మా దానం చేసి కోవిడ్ బాధితులకు ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా తమ్ముడు చేసిన మంచి పనిని అన్నయ్య చిరంజీవి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. "కోవిడ్-19తో పోరాడి గెలవడమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో సీసీటీ(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్)లో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి" అని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు నాగబాబు ఫొటోను జత చేశారు. (చదవండి: నాగబాబుకు కరోనా పాజిటివ్) కాగా గత నెల 15న నాగబాబు కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ మహమ్మారిని జయించి ప్లాస్మాదాతగా మారతానని మాటిచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన మహమ్మారిని జయించారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నాగబాబు తాజాగా ప్లాస్మాదానం చేయగా ఆయన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. (చదవండి: కరోనా: పేదలకు అండగా మెగాస్టార్) covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు @NagaBabuOffl కి అభినందనలు👌👍ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి.🙏 #DonatePlasma pic.twitter.com/L8nUPJPinc — Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2020 -
నేపాల్‌లో చిరంజీవి పూజలు
చిరంజీవి తన జన్మదిన వేడుకలను శుక్రవారం నేపాల్‌లో ఘనంగా జరుపుకున్నారని సమాచారం. ఈ సందర్బంగా ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి స్థానిక పశుపతి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన వేడుకులు నేపాల్ జరుపుకునేందుకు చిరంజీవి ముందుగానే ఆయన కుటుంబ సభ్యులతో కలసి నేపాల్ చేరుకున్నారు. మరోవైపు చిరంజీవి జన్మదిన వేడుకలు అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో ఈ వేడుకలను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరణ్ తేజ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా రక్తదాన శిబిరాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. -
కోటే కుటుంబానికి ‘చిరు’ సాయం
బెంగళూరు: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన జబ్బార్ ట్రావెల్స్ వోల్వో బస్సు ప్రమాద సంఘటనలో సజీవ దహనమైన కోటే వెంకటేశ్ యాదవ్ కుటుంబానికి చిరంజీవి చారిటబుల్ ట్రస్టు రూ.ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేసింది. బెంగళూరులో సోమవారం నిర్వహించిన కోటే పెద్దకర్మలో నటుడు నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కోటే అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా తమపై చూపిన అభిమానాన్ని మరువలేమన్నారు. వెంకటేశ్ కుమార్తెలు ఇద్దరికి రూ. 3 లక్షలు, వెంకటేశ్ భార్య శాంత, కోటే తండ్రి సుందర్‌రాజ్‌లకు రాంచరణ్, అల్లు అర్జున్ అందించిన రూ. లక్ష డీడీలను అందజేశారు.