చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. ఆదివారం రాజ్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి సై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులను అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తూ వారికి ‘చిరు భద్రతా’ కార్డుల పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. రక్త దాతలను సన్మానించుకోడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి గారు తన అభిమానులను మోటివెట్ చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు.
ఇక చిరంజీవి మాట్లాడుతూ.. ‘1998లో ప్రమాదంలో గాయపడ్డ వారు సమయానికి రక్తం ఎంతో మంది మరణించారు. ఆ ఘటనలు నన్ను బాధించాయి. అలాంటి ఘటనలు ఇకముందు జరగకూడదనే ఉద్ధేశంతోనే 24 సంవత్సరాల క్రితం బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించాను. అభిమానులు బ్లడ్ డొనేట్ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్నారు. యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్ ఇన్సూరెన్స్ కార్డులు అందిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది. నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్ గారి ప్రోత్సాహకం ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందని, ఆమె ఎన్నో సార్లు ట్వీట్ల ద్వారా ఎంకరేజ్ చేశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment