
హైదరాబాద్: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందించే సేవలను ఎక్కువమంది ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో వెబ్‌సైట్ ఆరంభించామని హీరో, నిర్మాత రామ్‌చరణ్ అన్నారు. www.chiranjeevicharitabletrust.com వెబ్‌సైట్‌తో ఆన్‌లైన్ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, చిరంజీవి సినిమాలు, జీవిత విశేషాలు పొందుపరచిన www.kchirangeevi.com వెబ్‌సైట్‌ను కూడా సోమవారం హైదరాబాద్‌లో ఆరంభించామని పేర్కొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గర చేయడానికి వెబ్‌సైట్ ప్రారంభించాం. ఆక్సిజన్, రక్తం అవసరమైనవారు ఈ వెబ్‌సైట్ ద్వారా మాకు రిక్వెస్ట్ పంపవచ్చు. అలాగే రక్తదాతలు వారి వీలును బట్టి ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని రక్తదానం చేయవచ్చు. నేత్రదానం చేయాలనుకున్నవారు రిక్వెస్ట్ పెడితే వెంటనే స్పందిస్తాం’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment