సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్‌ను జయించిన మెగా బ్రదర్ నాగబాబు కరోనా బాధితులకు అండగా నిలబడ్డారు. ప్లాస్మా దానం చేసి కోవిడ్ బాధితులకు ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా తమ్ముడు చేసిన మంచి పనిని అన్నయ్య చిరంజీవి మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. "కోవిడ్-19తో పోరాడి గెలవడమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో సీసీటీ(చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్)లో ప్లాస్మా దానం చేసిన తమ్ముడు నాగబాబుకు అభినందనలు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్నవారికి మరోమారు నా విన్నపం. మీరు ప్లాస్మా దానం చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు. దయచేసి ముందుకు రండి" అని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌కు నాగబాబు ఫొటోను జత చేశారు. (చదవండి: నాగబాబుకు కరోనా పాజిటివ్)
కాగా గత నెల 15న నాగబాబు కరోనా బారిన పడినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే ఈ మహమ్మారిని జయించి ప్లాస్మాదాతగా మారతానని మాటిచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన మహమ్మారిని జయించారు. ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నాగబాబు తాజాగా ప్లాస్మాదానం చేయగా ఆయన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. (చదవండి: కరోనా: పేదలకు అండగా మెగాస్టార్)
covid 19 తో పోరాడి గెలవటమే కాదు, ఇంకా కొందరిని కాపాడే ప్రయత్నంలో, CCTలో plasma donate చేసిన తమ్ముడు @NagaBabuOffl కి అభినందనలు👌👍ఈ సందర్భంగా covid నుంచి కోలుకున్నవారికి మరో మారు నా విన్నపం. మీరు plasma donate చేస్తే ఇంకా ఎందరో కోలుకుంటారు.దయచేసి ముందుకు రండి.🙏 #DonatePlasma pic.twitter.com/L8nUPJPinc
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2020
Comments
Please login to add a commentAdd a comment