సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు, ప్రజల కోసం ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్–స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం(జూలై 9) నగరంలో ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 2000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత మూడు నగరాల్లో స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించనున్నట్టు గతంలో చిరంజీవి ప్రకటించగా మొదటి శిబిరం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది.
జూలై 16న విశాఖపట్నం.. జూలై 23న కరీంనగర్ లో ఈ శిబిరాల్ని నిర్వహిస్తారు. ఈ శిబిరాల్లో పాల్గొనే వారికి ఎలాంటి ఖర్చు లేకుండా కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబు, స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్, డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్, వి.ఎన్. ఆదిత్య పాల్గొన్నారు.
చికిత్సలో కూడా రాయితీ అందేలా కృషి: నాగబాబు
సినీనటుడు నాగబాబు మాట్లాడుతూ.. ఇప్పటివరకు రక్తదానం, నేత్రదానం మీద అవగాహన పెంచామని, ఇప్పుడు కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తూ ముందుగానే కేన్సర్‌ను అరికట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన డాక్టర్ గోపీచంద్ కి కృతజ్ఞతలు తెలిపారు. కేన్సర్ చికిత్సలో కూడా మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాయితీ అందేలా కృషి చేస్తామని నాగబాబు హామీనిచ్చారు. స్టార్ హాస్పిటల్ వైద్యులు గోపీచంద్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 20 ప్రాంతాలలో ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని, దానికి మెగాస్టార్ చిరంజీవి అండగా ఉంటామని హామీ ఇచ్చారని చెప్పారు.
చదవండి: ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!
జవాన్ ప్రివ్యూ.. గూస్‌బంప్స్ పక్కా
Comments
Please login to add a commentAdd a comment