Naga Babu
-
నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,అమరావతి : నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం పవన్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..‘భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు. విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు.గతంలో జరిగిన ఎన్నికల్లో నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదు. అందుకే ఇక్కడ అన్నింటిని పక్కన పెట్టి ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నాను.బీసీ, ఎస్సీ,ఎస్టీలు,అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారు. జనసేన బలమైన పార్టీగా ఎదిగేదాకా నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టం. నా సోదరుడు కాబట్టే నాగబాబుకు కేబినెట్లో అవకాశం ఇవ్వడం లేదు. నాతో సమానంగా పనిచేశారు. నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా ఇచ్చే వాళ్లం. కందుల దుర్గేష్ ఏ కులమో నాకు తెలియదు.నాదెండ్ల మనోహర్ స్థానంలో ఎవరైనా ఎస్సీ, బీసీ నేత నాతో కలిసి చేసి ఉంటే వాళ్ళకే కేబినెట్ పదవి ఇచ్చే వాడిని. కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వాళ్ళను వారసత్వంగా చూడలేం. మొదట ఎమ్మెల్సీ అయ్యాకే నాగబాబు కేబినెట్లోకి వస్తారు. వచ్చే ఏడాది మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారు’ అని వ్యాఖ్యానించారు. -
కూటమి చక్రం.. బాబు చేయిజారుతోందా?
తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బలహీనపడుతున్నారా? అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలోనూ బాబు స్థానాన్ని క్రమేపీ కుమారుడు లోకేష్ ఆక్రమిస్తున్నట్లు అర్థమవుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా బాబును ఇరకాటంలో పెడుతున్నాయి.రాజ్యసభకు పార్టీ ఎంపికలు, పవన్ అన్న నాగబాబుకు మంత్రి పదవి వంటి నిర్ణయాలు ఆ ఇబ్బందికి నిదర్శనమంటున్నారు. టీడీపీకి రాజ్యసభలో అసలు బలం లేని నేపథ్యంలో ముగ్గురు వైఎస్సార్సీపీ ఎంపీలను ప్రలోభ పెట్టి రాజీనామా చేయించిన బాబు ఆ స్థానాలకు ఇతర పార్టీల వారికి కట్టబెట్టడం ఆయన పరిస్థితిని సూచిస్తోంది. ఇంకోపక్క పవన్ కళ్యాణ్ తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమంటూనే.. అన్న నాగబాబుకు ముందు టీటీడీ ఛైర్మన్ పదవి ఆ తరువాత రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారని పలు వదంతులు వచ్చాయి. అయితే, లోకేష్ ఒత్తిడితో టీటీడీ ఛైర్మన్ పదవి కాస్తా టీవీ-5 ఛైర్మన్ బీఆర్.నాయుడికి దక్కిందని, రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ లోకేష్ తన మాట నెగ్గించుకున్నారని సమాచారం.ఇక, నాగబాబుకు రాజకీయాలపై ఉన్న ఆసక్తి రహస్యమేమీ కాదు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి నుంచి ఆయన తన ఆసక్తిని పలు రూపాల్లో వ్యక్తం చేశారు కూడా. తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత కూడా నిత్యం ఏదో ఒక రూపంలో ప్రచారంలోనే ఉన్నారు ఆయన. సినిమాల్లో బాగా నష్టపోయినప్పుడు పవన్ కళ్యాణ్ అన్నను ఆదుకున్నట్లు చెబుతారు. కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు నాగబాబు ‘‘తాము పిలిచినా రాకపోతే ఏం చేయాలి’’ అని పవన్‌ను ఉద్దేశించి బహిరంగంగా వ్యాఖ్యానించినా.. తరువాతి కాలంలో ఆయనతోనే రాజకీయ పయనం సాగించడం గమనార్హం. ఇందులో భాగంగా 2019లో నరసాపురం నుంచి లోక్‌సభకు జనసేన తరఫున పోటీ చేసినా వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు చేతిలో ఓడిపోయారు ఆయన. తరువాతి కాలంలో పవన్ టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో నాగబాబు కూడా ఆయన వెంట నడిచారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని టాక్ వచ్చినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని బీజేపికి వదులుకోవాల్సి వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతోనే టీటీడీ ఛైర్మన్ ఆయనకు ఇప్పించేందుకు పవన్ ప్రయత్నించినా లోకేష్ ప్రాభవం ముందు నిలవలేకపోయారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పవన్ తన కుటుంబ సభ్యులకు పదవి అడగలేదని పవన్ చెప్పుకోవాల్సి వచ్చిందన్నమాట. ఆ తరువాత రాజ్యసభ సీటైనా నాగబాబుకు ఇప్పించాలని పవన్ నానా ప్రయత్నాలూ చేశారు. బీజేపీ ఈ స్థానాన్ని ఆశించకపోతే అన్నకు దక్కుతుందన్న అంచనాతో ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ మంతనాల వెనుక బాబు ఉండి ఉండవచ్చు. అయితే, బీజేపీ అనూహ్యంగా ఏపీ నుంచి ఒక సీటు ఆశించడంతో నాగబాబుకు మళ్లీ ఆశాభంగమైంది. మూడు రాజ్యసభ స్థానాల్లో తమ పార్టీ ఒకటే తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంచనాతో నాగబాబును సీటు వదులుకోమని చంద్రబాబే నచ్చజెప్పి ఉండాలి. అదే సమయంలో పవన్ అసంతృప్తికి గురి కాకుండా మంత్రి పదవి ఆఫర్ చేసి ఉండవచ్చు.అయితే, దీనిపై టీడీపీ, జనసేనలో కూడా కొంత అసంతృప్తి ఏర్పడింది. జనసేన కోసం పనిచేస్తున్న పలువురు నేతలను కాదని, సోదరుడి పదవి కోసం పవన్ పట్టు పట్టారన్న విషయం విమర్శలకు దారి తీసింది. జనసేన కూడా కుటుంబ పార్టీయేనని తేలిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అందులోనూ జనసేన నుంచి నలుగురు మంత్రులు ఉంటే ముగ్గురు కాపు, ఒకరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పదవులు వద్దంటూనే పవన్, నాగబాబులు వాటి కోసం పాకులాడారని భావిస్తున్నారు. పవన్‌కు ఆర్థికంగా అండదండలు అందించిన లింగమనేని రమేష్‌కు రాజ్యసభ స్థానం దక్కుతుందని కథనాలు వచ్చినా, పవన్, చంద్రబాబులిద్దరూ ఇప్పటికైతే మొగ్గు చూపలేదు.మరోవైపు.. టీడీపీలో సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గల్లా జయదేవ్ తదితరులు రాజ్యసభ స్థానం ఆశించి భంగపడ్డారు. మంత్రిపదవి కూడా దక్కని నేపథ్యంలో యనమల చిరకాల వాంఛ రాజ్యసభ సభ్యత్వం దక్కుతుందని ఆశించినా ఫలితం లేకపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి గద్దెను ఎక్కడంలో యనమలది కీలక భూమిక అన్నది తెలిసిందే. గతంలో స్పీకర్‌గా ఉండి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం సులువైన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. కంభంపాటి రామ్మోహన్ రావు జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను సమన్వయం చేస్తూ చంద్రబాబుకు ఉపయోగపడుతుంటారు. గతంలో ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉండేవారు. మళ్లీ అదే పదవి అయినా ఇస్తారో, లేదో చూడాలి.2018లో దళిత నేత వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు దాదాపు ఇచ్చినట్లే ఇచ్చి, చివరి నిమిషంలో కనకమేడల రవీంద్రకు కేటాయించారు. ఈసారి రామయ్య పేరును పరిశీలనకు తీసుకోలేదు. గల్లా జయదేవ్ కూడా ఆశించినా అవకాశం ఇవ్వలేదు. మరో నేత అశోక్ గజపతిరాజు ప్రస్తావన వచ్చినా, ఈ పోటీలో ఆయన వెనుకబడిపోయారు. వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బీదా మస్తాన్ రావుకు, లోకేష్‌కు సన్నిహితుడైన సానా సతీష్‌కు చెరో సీటు లభించింది. సానా సతీష్ కాకినాడ నుంచి జనసేన తరఫున లేదంటే టీడీపీ తరపున పోటీ చేయాలని భావించారు. అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఈ పదవి పొందారు. ఈయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ జరపడంలో పేరు గాంచడంతోపాటు ఆర్థికంగా బలవంతుడు అవడం, అన్నిటికి మించి లోకేష్ అండదండలతో పదవి పొందారని అనుకోవాలి. బీదా మస్తాన్ రావు ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేనే. నెల్లూరు జిల్లాలో రొయ్యల సీడ్ ప్లాంట్లు తదితర వ్యాపారాలు ఉన్నాయి.2019 ఎన్నికలలో టీడీపీ పక్షాన లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. తరువాత వైఎస్సార్సీపీలో రాజ్యసభ సీటు సంపాదించారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో రాజ్యసభకు రాజీనామా చేసి మళ్లీ అదే స్థానాన్ని టీడీపీ నుంచి పొందడం విశేషం. ఈయన సోదరుడు రవిచంద్ర కూడా లోకేష్ కు సన్నిహితుడుగా చెబుతారు. టీడీపీలో కాకలు తీరిన నేతలను కాదని, వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన ఈయనకు టిక్కెట్ ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావిచ్చారని చెప్పాలి. మరో సీటును బీజేపీకి కేటాయించారు. ఈ సీటు కూడా మొన్నటి వరకు వైఎస్సార్సీపీ పక్షాన రాజ్యసభ సభ్యుడుగా ఉండి రాజీనామా చేసి వచ్చిన ఆర్.కృష్ణయ్యకు ఇచ్చారు. బీజేపీకి వేరే నేతలు ఎవరూ లేనట్లు తెలంగాణకు చెందిన కృష్ణయ్యకు మళ్లీ ఇదే సీటు ఇవ్వడంపై ఆ పార్టీలోనే అసమ్మతి ఉంది.గతంలో ప్రధాని మోడీని అసలు బీసీ నాయకుడే కాదని, పలు విమర్శలు చేసిన కృష్ణయ్యకు ఈ పదవి ఇవ్వడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. కృష్ణయ్య తనకు సీటు ఇచ్చిన రోజునే బీజేపీలో చేరడం కొసమెరుపుగా ఉంది. తెలంగాణలో రాజకీయంగా వాడుకోవాలని ఇలా చేసి ఉండవచ్చని అంటున్నా, టీబీజేపీ నేతలు ఈయనపట్ల పెద్దగా ఆసక్తిగా లేరు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఈయనకు విశేష ప్రాధాన్యం ఇచ్చి పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇస్తే ఇప్పుడు ఇలా చేశారు. రాజ్యసభ నుంచి బీసీ వర్గానికి చెందిన ఈ ముగ్గురు రాజ్యసభ సభ్యులను టీడీపీ ఆకర్షించింది. వారిలో ఇద్దరు మళ్లీ టికెట్లు పొందితే, మరో నేత మోపిదేవి వెంకట రమణకు దక్కలేదు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో చూడాలి. ఈ ఎంపికలకు సంబంధించి మరో విశేషం చెప్పుకోవాలి.చంద్రబాబుకు తానే ప్రధాన సలహాదారుడనని, టీడీపీ ప్రభుత్వం తనవల్లే నడుస్తోందని భావించే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు లోకేష్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీవీ-5 యజమాని బీఆర్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వడాన్ని రాధాకృష్ణ తీవ్రంగా వ్యతిరేకించారట. అయినా లోకేష్ పట్టుబట్టి ఈ పదవి ఇప్పించడం ద్వారా రాధాకృష్ణకు ఝలక్ ఇచ్చారన్న విశ్లేషణలు వచ్చాయి. ఆ వార్తకు బలం చేకూర్చే విధంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక తీరు కూడా ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో అక్టోబర్‌లోనే సానా సతీష్‌కు వ్యతిరేకంగా రాధాకృష్ణ పెద్ద కథనం రాయించారు. అందులో సతీష్‌పై పలు ఆరోపణలు చేశారు. కాకపోతే సానా అన్న పదం బదులు చానా అని రాసి పరోక్షంగా రాసి హెడ్డింగ్ కూడా చానా ముదురు అని ఇస్తూ బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. లోకేష్ పేరుతో దందాలు చేస్తున్నారని, ఉత్తరాంధ్రలో మైనింగ్ తదితర రంగాలలో అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడుతున్నారని, సీబీఐలో సైతం చిచ్చు పెట్టిన వ్యక్తి, అనేక స్కామ్‌లతో సంబంధం ఉన్నవాడని ఆంధ్రజ్యోతి రాసింది. అయినా లోకేష్ దానిని లెక్క చేయలేదు. తండ్రిపై ఒత్తిడి తెచ్చి సతీష్‌కే రాజ్యసభ పదవి ఇప్పించారు. రాధాకృష్ణను లోకేష్ నమ్ముతుండకపోవచ్చు. లేదా తన తండ్రి మాదిరి రాధాకృష్ణ బ్లాక్ మెయిలింగ్‌కు తాను లొంగనన్న సంకేతం ఇచ్చి ఉండవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అంతేకాక, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తెలుగుదేశం పార్టీని మోయడం తప్ప గత్యంతరం లేదని, అందువల్ల ఆయన మాటకు అంత విలువ ఇవ్వనవసరం లేదని భావించి ఉండవచ్చని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. ప్రతిసారీ రాజ్యసభ సభ్యుల ఎంపికలో డబ్బు, సిఫారసులు వంటి వాటికి ప్రాధాన్యత ఇచ్చినా, నాటకీయత కోసమైనా టీడీపీ కోసం పని చేసేవారు ఒకరిద్దరికైనా ఈ పదవులు దక్కుతుండేవి. కానీ, ఈసారి అసలు పార్టీతో సంబంధం లేని ముగ్గురు ఈ పదవులు దక్కించుకున్నారు. తద్వారా టీడీపీపై కార్యకర్తలలో అపనమ్మకం ఏర్పడడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు చేతిలో నిర్ణయాధికారం పెద్దగా లేదన్న భావన కూడా ఏర్పడుతోంది.ఈ ఎంపికలపై వ్యతిరేకత ఉన్నా ఎల్లో మీడియా కూడా నోరు మూసుకు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించినట్లు కూటమి ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వంగా మారింది. తండ్రి, కొడుకులు చంద్రబాబు, లోకేష్, అలాగే సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబులు మంత్రివర్గంలో ప్రముఖంగా ఉన్నారు. రెండు కుటుంబాల వారు ఇలా మంత్రివర్గంలో ఉండటం ఇదే ప్రథమం కావచ్చు. అటు కొడుకును కాదనలేక, ఇటు పవన్ కళ్యాణ్‌ను వదలుకోలేక, వారిద్దరి మధ్య అంతర్గత పెనుగులాటలో చంద్రబాబు బలహీనపడుతున్నారా?.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సాయంత్రం అయితే కోటార్ వేసేవాడు టీటీడీ మెంబెర్...? శ్రావణ్ కుమార్
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్
ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీసులు అంటే దాదాపు థ్రిల్లర్ కథలే ఉంటాయి. ఇప్పుడు అదే జానర్లో వస్తున్న తెలుగు స్ట్రెయిట్ సిరీస్ 'పరువు'. రీసెంట్గా హీరోయిన్ నివేదా పేతురాజ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగిందని ఓ వీడియో వైరల్ అయింది కదా! అది ఈ సిరీస్ కోసమే. ఇప్పుడు దీని ట్రైలర్ రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు.(ఇదీ చదవండి: బుజ్జి అండ్ భైరవ రివ్యూ.. ‘కల్కి’ ప్రపంచం ఇలా ఉంటుందా?)హీరోయిన్ నివేదా పేతురాజ్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలో నటించిన సిరీస్ 'పరువు'. నాగబాబు కీలక పాత్ర చేశాడు. బిందుమాధవి విలన్‌గా చేసింది. సిద్ధార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించాడు. జూన్ 14 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ట్రైలర్ బట్టి చూస్తే.. పెద్దలకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి జాహ్నవి, విక్రమ్ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ వీళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. వీళ్లని చంపడానికి కొందరు కిల్లర్స్ ప్రయత్నిస్తారు. వీళ్ల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రేమికులు కాస్త హంతకులుగా మారాల్సి వస్తుంది. చివరకు ఏమైంది అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రేక్షకులను అనుమతించని థియేటర్ యాజమాన్యం.. రంగంలోకి పోలీసులు!) -
నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
మెగా ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల గురించి మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ గురించి పరోక్షంగా నాగబాబు చేసిన ట్వీట్ వల్ల రచ్చ రచ్చ అయింది. ఏకంగా తన అకౌంట్‌ని కొన్నిరోజులు డీయాక్టివేట్ చేసిన నాగబాబు మళ్లీ.. ఆ ట్వీట్ డిలీట్ చేసిన తర్వాతే ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. గొడవ ఇక్కడితే అయిపోలేదు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.(ఇదీ చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్.. పేరేంటో తెలుసా?)మెగా ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయనేది సోషల్ మీడియాలో గత కొన్నాళ్ల నుంచి వినిపిస్తోంది. బన్నీ.. మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడని.. అందుకే చరణ్‌తో అంతంత మాత్రంగానే ఉంటున్నాడని నెటిజన్లు అనుకుంటున్నారు. ఇందుకు తగ్గట్లే పుట్టినరోజున వీళ్లిద్దరూ ఎవరూ కూడా ఒకరికి ఒకరు విషెస్ చెప్పకపోవడం లాంటివి ఇవి నిజమే అనే అందరూ అనుకునేలా చేశాయి. ఇందులో నిజానిజాలు పక్కనబెడితే కొన్నిరోజుల ముందు నాగబాబు, పరోక్షంగా బన్నీ గురించి చేసిన ట్వీట్ పెద్ద దూమారమే రేపింది.ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లాడు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు శిల్పా రవిచంద్రా రెడ్డి కోసం అక్కడికి వెళ్లాడు. దీని గురించి నేరుగా చెప్పకుండా.. 'మనవాడు, పరాయివాడు' అని నాగబాబు ట్వీట్ చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్ చేశారు. ఇదంతా బన్నీకి కూడా నచ్చలేదని, దీంతో మెగా ఫ్యామిలీకి ఉన్న వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడని అనుకుంటున్నారు. ఇందులో నిజమేంటనేది క్లారిటీ రావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్‌పుత్) -
మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
మెగా బ్రదర్ నాగబాబుకు తొందర ఎక్కువ. ఏ చిన్న విషయానికైనా ఆవేశంతో ఊగిపోతుంటాడు. కోపం వస్తే ముందు వెనుక ఆలోచించకుండా మాటలు విసిరేస్తూ.. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకోవడం ఆయనకు అలవాటు అని సన్నిహితంగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే దేనికైన ఓ హద్దు ఉంటుంది. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు పొగడ్తలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. ఈ విషయం చిరంజీవికి బాగా తెలుసు. అందుకే అతనిపై వచ్చిన విమర్శలను పెద్దగా పట్టించుకోడు. అలా పట్టించుకునేవాడు అయితే ఆయన ఈ స్థాయికి ఎదిగేవాడే కాదు. కానీ నాగబాబు మాత్రం చిన్న చిన్న విమర్శలను సైతం తీసుకోలేడు. తొందరపడి ఘాటు వ్యాఖ్యలు చేసి..కాంట్రవర్సీని క్రియేట్ చేస్తాడు. ఇప్పటికే అనేకసార్లు ఆవేశంతో ఆయన చేసిన ట్వీట్లు..వివాదానికి దారి తీశాయి. ఇక తాజాగా ఆయన చేసిన పని మెగా కాంపౌండ్‌లో కలకలం రేపింది.మెగా ఫ్యామిలీలో విభేధాలు ఉన్నాయని తానే స్వయంగా బయటపెట్టాడు.పరాయివాడు వాడంటూ బన్నీపై ట్వీట్..అంతలోనే!ఏపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నాగబాబు ఓ ట్వీట్ చేశాడు.‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే’ అని తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చాడు. ఈ ట్వీటే వివాదానికి దారి తీసింది. ఏపీ ఎన్నికల్లో తన మిత్రుడైన వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లిన నేపథ్యంలోనే నాగబాబు ఇలా ట్వీట్ వేయడంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై విపరీతంగా విరుచుకుపడ్డారు. దీంతో తన ఎక్స్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసుకున్నారు నాగబాబు. రెండు రోజుల పాటు ఆయన సోషల్ మీడియాలో కనిపించలేదు. మళ్లీ ఈ రోజు ఎక్స్‌లోకి వచ్చి ‘ఆ ట్వీట్ డిలీట్ చేశాను’అని మరో ట్వీట్ వేశాడు.(చదవండి: బన్నీ ఫ్యాన్స్ దెబ్బకు నాగబాబు పరార్.. మళ్లీ ఇప్పుడు ఇలా)దీంతో తను తప్పు చేశానని స్వయంగా నాగబాబే ఒప్పుకున్నట్లు అయింది. గతంలో నాగబాబు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పడు ఆదుకున్నది బన్నీనే. అంతేకాదు జనసేన పార్టీకి రూ. 2 కోట్ల విరాళం కూడా ఇచ్చాడు. అవన్నీ మరిచిపోయి స్నేహితుడికి మద్దతు తెలిపేందుకు వెళ్లిన బన్నీని పరాయివాడు అంటూ విమర్శించడంతోనే నాగబాబు మనస్తత్వం ఎలాంటితో అర్థమవుతుంది. ఆయనకు తొందరపాటు, దుడుకుతనం లాంటి అవలక్షణాలు ఉన్నాయని చాలా మంది అంటారు. మళ్లీ అది ఇప్పుడు రుజువు అయింది.కాంట్రవర్సీకి కేరాఫ్..వివాదాలను కోరి తెచ్చుకోవడం నాగబాబుకు కొత్తేమి కాదు. గతంలోనూ అనేకసార్లు ఆవేశంతో మాట్లాడి..కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. రెండేళ్ల క్రితం బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన ‘అలయ్ బలయ్’ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయిన సంగతి తెలిసిందే. ‘చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే.. కార్యక్రమం నుంచి వెళ్లిపోతా’ అంటూ గరికపాటి సీరియస్ అయ్యారు. అయితే గరికపాటి వ్యాఖ్యలను మెగాస్టార్ లైట్ తీసుకున్నారు. ‘ఆయన పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు’అంటూ ఆ వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ నాగబాబు మాత్రం ఆ వివాదాన్ని మరింత పెద్దది చేశాడు. ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’అంటూ ట్వీట్ చేసి ట్రోలింగ్కి గురయ్యాడు. అలాగే ప్రముఖ రచయిన యండమూరి విషయంలోనూ నాగబాబు అతిగా మాట్లాడాడు.యండమూరి వీరేంద్రనాథ్-చిరంజీవిల మధ్య కొన్నాళ్ల క్రితం మనస్పర్థలు రావడంతో దూరమయ్యారు. అయితే యండమూరి చేసిన కామెంట్స్‌పై చిరంజీవి ఏనాడు స్పందించలేదు. కానీ నాగబాబు మాత్రం పబ్లిక్‌గానే యండమూరిని విమర్శించారు. కట్ చేస్తే ఇప్పుడు చిరంజీవి తన బయోపిక్‌ని రాసే అవకాశం యండమూరికే ఇచ్చాడు. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై నాగబాబు ఫైర్ అయ్యారు. చిరంజీవి బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి హాజరైన పవన్ ఫ్యాన్స్ అక్కడ పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడంతో నాగబాబు కోపంతో ఊగిపోయాడు. ఎన్నిసార్లు ఈవెంట్లకి పిలిచినా అతడు ఎక్కడికీ రావడం లేదు. దానికి మేమేం చేస్తాం. ఇక్కడికొచ్చి పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అరవడం కాదు.. మీకు దమ్ముంటే ఆయన ఆఫీసుకెళ్లి అక్కడ అరవండి.దేనికయినా ఓపికనేది ఒకటుంటుందని.. దానిని పరీక్షించొద్దు. ప్రతీసారి రావడం పవర్ స్టార్.. పవర్ స్టార్ అరవడం మీకో అలవాటయింది’అని అభిమానులపై నాగబాబు మండిపడ్డాడు. నాగబాబుకి దుడుకుతనం, తొందరపాటు ఉంటుందని చాలా మంది అంటుంటారు. అదినిజమని ఆయన ప్రవర్తతోనే నిరూపించుకుంటున్నాడు. -
మళ్లీ ట్విట్టర్లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్ తొలగింపు
నాగబాబు మళ్లీ ఎక్స్ (ట్విట్టర్)లో ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్య ఈయన పెట్టిన ఓ ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈయన ట్వీట్‌పై కస్సుమన్నారు. ట్రోల్స్, విమర్శలతో రెచ్చిపోయారు. దీంతో ఏం చేయాలో తెలీక తన ట్విట్టర్ ఖాతాని నాగబాబు డీ యాక్టివేట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ యాక్టివేట్ చేయడంతో పాటు గతంలో పెట్టిన పోస్ట్‌ని డిలీట్ చేశాడు.(ఇదీ చదవండి: నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య)రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల నుంచి శిల్పా రవిచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈయనకు అల్లు అర్జున్ స్నేహితుడు. ఈ క్రమంలోనే ప్రచారం కోసం బన్నీ.. నంద్యాల వెళ్లాడు. అయితే తనకు పార్టీతో సంబంధం లేదని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు. కానీ నాగబాబు మాత్రం.. 'మా పక్కనే ఉంటూ మమ్మల్ని బలహీనపరిచేవాడు మాకు శత్రువే. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే' అని ట్వీట్ చేశాడు.అయితే ఇది అల్లు అర్జున్‌ని ఉద్దేశించిందేనని బన్నీ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. ముందు వెనకా ఆలోచించకుండా మాట్లాడిన నాగబాబుకి సోషల్ మీడియాలో ఇచ్చిపడేశారు. దీంతో ఏం చేయాలో తెలీక ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసుకున్నాడు. మరి ఏమైందో ఏమో గానీ ఇప్పుడు యాక్టివ్ చేసుకున్నాడు. కాకపోతే పాత ట్వీట్ డిలీట్ చేశానని చెప్పి, మరో ట్వీట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?) -
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ దూరం కానున్నాడా..? మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్‌లు ఇద్దరూ బన్నీపై గుర్రుగా ఉన్నారా..? అంటే సోషల్ మీడియాలో అవుననే జోరుగా ప్రచారం జరుగుతుంది. కానీ, బన్నీ మాత్రం మెగా బంధాలను తెంపుకునే ఆలోచనలో లేనట్లు తెలుస్తోంది. స్నేహం కోసం ఎంతవరకైనా వెళ్లే గుణం అల్లు అర్జున్‌లో ఉందని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అలాంటి బన్నీపై నాగబాబు ఫైర్ అవుతున్నారని నెట్టింట వైరల్ అయింది. అసలు వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఎక్కడ వచ్చాయి అనేది చూద్దాం. స్నేహితుడి కోసం నిలబడిన అల్లు అర్జున్ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్ కోరుకున్నారు. ఈ క్రమంలో ఆయన నంద్యాలకు వెళ్లి తన మద్ధతును ప్రకటించారు. ఆ సమయంలో భారీగా బన్నీ ఫ్యాన్స్ శిల్పా రవి ఇంటి వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. 2019లో కూడా అల్లు అర్జున్ శిల్పా రవికి మద్ధతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నాగబాబు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఒక ట్వీట్ వేశాడు. అది అల్లు అర్జున్ గురించే అంటూ నెట్టింట వైరల్ అయింది.నాగబాబు ట్వీట్‌తో రగడఅల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను నాగబాబు ట్వీట్ బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లిన సమయం నుంచి ఈ రచ్చ మొదలైంది. ఆపై, పోలింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే నాగబాబు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 'మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన కూడా మావాడే' అంటూ నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో తమ అభిమాన హీరో గురించే అంటున్నారని బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. బన్నీని పరోక్షంగా తమ వాడు కాదు అనడం సరైనది కాదని వారు తప్పుపట్టారు. ఇదే ట్వీట్ ఎన్నికల ముందు వేయాల్సిందని నాగబాబును ట్యాగ్ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. గతంలో జనసేనకు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వలేదా అంటూ వారు గుర్తుచేస్తున్నారు. అంతేకాకుండా నాగబాబు అర్ధిక కష్టాల్లో వున్నపుడు 'నా పేరు సూర్య' సినిమాకు ప్రెజెంటర్‌గా తమరి పేరు వేయించి కొంత సాయం అందేలా బన్నీ చేయలేదా..? అంటూ చెప్పుకొస్తున్నారు. చిరంజీవి కూడా తన స్నేహితుల కోసం ఈ ఎన్నికల్లో మద్ధతుగా నిలబడాలని వీడియోలు చేయలేదా అని నెట్టింట బన్నీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.బన్నీ ఫ్యాన్స్, చిరంజీవి వల్లే నాగబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా..?వాస్తవానికి బన్నీకి కూడా ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. తనకంటూ ఒక సపరేట్ అభిమానగనాన్ని ఆయన సంపాదించుకున్నారు. వారందరూ సోషల్ మీడియా వేదికగా నాగబాబును ఏకిపారేశారు. మరోవైపు చిరంజీవి కూడా నాగబాబు వద్ద బన్నీ విషయాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది. ఇంతటితో ఈ వివాదం ఆపాలని ఆయన కోరినట్లు సమాచారం. ఒకవైపు బన్నీ అభిమానుల కామెంట్ల దాడి.. మరోవైపు అన్నయ్య సూచనలు వస్తుండటంతో తన ఎక్స్ పేజీని నాగబాబు క్లోజ్ చేశారని తెలుస్తోంది.కష్టాన్నే నమ్ముకున్న అల్లు అర్జున్అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి అరవింద్ కుమారుడిగా.. మెగాస్టార్ మేనళ్లుడిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ రెండో సినిమా నుంచే ఆయన తన కష్టాన్నే నమ్ముకున్నారు. ఒకరకంగా తన స్వయం కృషితో బన్నీ ఎదిగాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్‌గా తనను తాను మలుచుకున్నాడు. పుష్ప సినిమా సమయానికి సుకుమార్, బన్నీ ఇద్దరూ టాలీవుడ్‌కే పరిమితం. కానీ, అల్లు అర్జున్ తన నటనతో పాన్ ఇండియాను మెప్పించాడు. అలా బన్నీ వల్ల సుకుమార్ పేరు కూడా దేశవ్యాప్తంగా తెలిసింది. ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత శక్తివంతమైన ఫ్యాన్ బేస్ కలిగిన హీరోల్లో అల్లు అర్జున్ టాప్‌లో ఉంటారు. -
నాగబాబు నీతులు..!
-
విష సర్పాలకన్నా భయానకంగా విపక్షాల వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్న ఘటనపై తెలుగుదేశం, జనసేన పార్టీల వ్యాఖ్యలు చూస్తుంటే, వారి కూతలు వింటుంటే వాళ్లలో రాక్షసత్వం ఎంతగా పేరుకుపోయిందో అర్ధం అవుతోంది. వాళ్లసలు మనుషులే కారన్న కఠోర వాస్తవం బోధ పడుతుంది. వాళ్లు కూడా మిగతా మనుషులతో కలిసి సమాజంలో తిరుగుతోంటే భయమేస్తుంది. ఏ మాత్రం బాధ్యత లేని వారి తెంపరి తనాన్ని చూస్తే అసహ్యం వేస్తోంది. ఈ కీచకులకు వంతపాడే పండుముదుసలి రామోజీ పత్రిక పైత్యం చూసి ఒళ్లు మండుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను తుదముట్టించడమే లక్ష్యంగా కిరాయి హంతకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి జరిగిన వెను వెంటనే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు నీచాతి నీచం. ఘోరాతి ఘోరం. ఈ దాడిని జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని అచ్చెన్న కూస్తే.. లోకేష్ వాగుడు మరీ బాధ్యతారాహిత్యం. ఆ రాళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చాయట. లోకేష్ ఇలా కూయడానికి కారణాలు ఉన్నాయి. తన తాత అని లోకేష్ పదే పదే చెప్పుకునే నందమూరి తారకరామారావుపై తన తండ్రి చంద్రబాబు నాయుడు వైస్రాయ్ హోటట్పై నుంచి చెప్పులు వేయించిన ఘటన లోకేష్ గుండెల్లో పదిలంగా ఉన్నట్లుంది. అందరూ తన నాన్నలాగే కౄరంగానే ఆలోచన చేస్తారని లోకేష్ అనుకుంటూ ఉండచ్చు. లేకపోతే ఇటువంటి పిచ్చి కూతలు రావడం సాధ్యం కాదు. ఇక జనసేన నాయకుడు సినీ నటుడు కొణిదెల నాగబాబు మరో అడుగు ముందుకేసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్..ఎక్కడా స్క్రిప్టెడ్ అనిపంచనే లేదు అంటూ వెకిలి కామెంట్ ను ట్వీట్ చేశారు నాగబాబు. నటుల వంశం కాబట్టి వెండితెరపై అంతగా నటించలేకపోయినా.. రాజకీయ తెరపై నటనలో ఇరగదీసేస్తున్నారు నాగబాబు. తాను పెట్టిన ట్వీట్‌ను చూసిన తన సర్కిల్లోని వారే తిట్టారో.. మరీ అసహ్యంగా ఉందన్నారో తెలీదు కానీ తాను మొదట పెట్టిన ట్వీట్‌ను తీసేసి కొత్తగా మరో ట్వీట్ పెట్టారు. ఈ సారి తెచ్చిపెట్టుకున్న సంస్కారాన్ని నటిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి దాడులు మంచివి కావంటూ సింగిల్ టేక్‌లో డైలాగ్ కట్ చేశారు.నాగబాబు మొదట పెట్టిన ట్వీట్ చూసి రాష్ట్ర వ్యాప్తంగా సంస్కారం ఉన్న వారంతా ఛీఛీ అన్నారు. సినీ రంగంలోని ప్రముఖులు అయితే మరీ ఇంత చీప్‌గా అనడం ఏంటని ఆశ్చర్యపోయారు. నిజానికి నాగబాబు కమెడియన్‌కు ఎక్కువ. తమ్ముడు పవన్‌కు తక్కువ అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఆయ నెంచి సంస్కారాన్ని ఆశించవద్దని వారంటారు. అయినా వాలంటీర్లు మహిళలను కిడ్నాప్ చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఒళ్లు కొవ్వెక్కి దారుణపు కూత కూసిన పవన్ కల్యాణ్‌కు అన్న నాగబాబు.. కాబట్టి ఆయనుంచి సంస్కారాన్ని ఆశించలేం అంటున్నారు పాలక పక్ష నేతలు. చదవండి: ‘దస్తగిరిని అడ్డంపెట్టుకుని సునీత నాటకమాడుతోంది’ సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసిందెవరో తేలాలి. వారి వెనుక ఉన్న శక్తులేంటో తెలియాలి. కచ్చితంగా ఇది హత్యాయత్నమే అనడంలో సందేహం లేదు. హత్యాయత్నం జరిగితే దాడి చేసిన వారు విలన్లు .చేయించిన వారు సూత్రధారులు అవుతారు. కానీ రామోజీ పత్రిక మాత్రం దాడి చేసిన వారిని వదిలేసి భద్రతా వైఫల్యాలు ఉన్నాయంటూ వెర్రి కథనం ఒకటి వండి వార్చింది. మనుషులకు చెట్ల మాదిరిగానే ఏళ్ల వయసు వచ్చి పడుతుంది కానీ..వయసు పెరిగినంత మాత్రాన సంస్కారం, మానవత్వం పెరగవని చాటి చెప్పడానికి రామోజీ, చంద్రబాబులను మించిన సాక్ష్యాలు అవసరం లేదంటారు మేథావులు. హత్యాయత్నానికి కొద్ది గంటల ముందే చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్‌ను రాళ్లతో కొట్టాలని ఓ బహిరంగ సభలో ప్రజల సాక్షిగా పిలుపు నిచ్చారు. విన్నారుగా. చంద్రబాబు ఎందుకిలా అన్నారో తేలిగ్గానే అర్ధం చేసుకోవచ్చు. తాను చేపట్టిన ప్రజాగళం సభకు జనం రారు. సీఎం సభకు ప్రజలకు ఇళ్లల్లో పనేమీ లేనట్లు సునామీలా తరలి వస్తారు.ఆ తేడా చూస్తూ బాధ వేయదాండీ? దాడి చంద్రబాబు నాయుడో టీడీపీ వారో చేయించారని ముందుగానే ఎవరూ అనడం లేదు. కాకపోతే దాడి జరిగిన వెంటనే టీడీపీజనసేన ఎల్లో మీడియాల ఓవర్ యాక్షన్ చూస్తే మాత్రం కచ్చితంగా ఇది వారి పనే అని ఎవ్వరికైనా అనిపించక మానదు. సరే హత్యాయత్నానికి ఎవరు ప్లాన్ చేశారు. ఎవరు కిరాయి హంతకులను పంపారు అన్నవి దర్యాప్తులో తేలతాయి. అవి పక్కన పెడదాం. పాలక పక్ష నాయకుడు ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరిగినపుడు ప్రతిపక్ష నాయకులు ఖండించాలనుకుంటే ఖండించవచ్చు. లేదంటే మౌనంగా ఉండచ్చు. కానీ టడీపీ, జనసేనలు ఎంతగా దిగజారిపోయాయంటే ఈ దాడి జగన్ మోహన్ రెడ్డే చేయించుకున్నారని సిగ్గుమాలిన దిక్కుమాలిన కూతలు కూశాయి. దశాబ్ధాల క్రితం ఎల్లో మీడియా కానీ టీడీపీ కానీ ఇంత బరితెగింపు వ్యాఖ్యలు చేయలేదు. హత్యలు చేయిస్తే చేయించి ఉండచ్చు కానీ వాటిపై జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడేవారు. అదే వంగవీటి రంగా దారుణ హత్య ఇపుడు జరిగి ఉంటే ఇదే టీడీపీనేతలు రంగాయే తనపై దాడి చేయించుకుని ఫేమస్ అయిపోదామనుకున్నారని అని ఉండేవారు. మీడియాలో పైకి ఎదిగిపోవాలన్న దుర్బుద్ధితోనే పింగళి దశరథరామ్ తానే మనుషులను పురమాయించుకుని తనపై హత్యాయత్నానికి ప్రయత్నించారని.. అది వికటించి ఆయన మరణించారని అని ఉండేవారు. రామోజీ పత్రిక అయితే రంగా, దశరథరామ్ హత్యల విషయంలో భద్రతా లోపాలు ఎక్కడున్నాయో భూతద్దం పెట్టి వెతికేది. ఇవన్నీ చూస్తోంటే ఓ అనుమానం కూడా వేయక మనదు. 2003లో చంద్రబాబు నాయుడిపై అలిపిరిలో జరిగిన దాడి బహుశా చంద్రబాబే ప్లాన్ చేయించుకుని ఉంటారు. అందుకే ఆ దాడి జరిగిన వెంటనే ముందస్తు ఎన్నికలకు వాజ్ పేయ్ఒను ప్పించి డిసెంబరులో జరగాల్సిన ఎన్నికలను మే నెలకి తీసుకు వచ్చారు. అని రాజకీయ పరిశీలకులు ఇపుడు అనుమానిస్తున్నారు.పచ్చ కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. పచ్చపార్టీ నేతలకూ అంతే. తాము చేసే ప్రతీ వెధవపనినీ తమ ప్రత్యర్ధులు కూడా చేస్తారని పసుపు పార్టీ నేతల ఎరుపు ఐడియా. సీఎం జగన్‌ను హత్యాయత్నాలతోనూ దాడులతోనూ ఎవరూ బెదిరించలేరు. ఆ విషయం 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి తెగబడిన ఘటనే నిరూపించింది. అపుడు కూడా ఆయన దాడి జరిగింది కదా అని ,నెత్తురు కారింది కదా అని భయపడలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారు. ఈసారి కూడా ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఈసారి టీడీపీకి ఆ 23 స్థానాలు కూడా రానే రావంటున్నారు రాజకీయ పండితులు. సీఎన్ఎస్. యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
అబ్బో.. ఇంతకీ ఇద్దరిలో త్యాగాల త్యాగరాజు ఎవరో?
కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ ఆసక్తికరమైన సంగతి చెప్పారు. తెలుగుదేశం పార్టీ సీట్లను తగ్గించుకుని త్యాగం చేసిందట. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కల్యాణ్ ఆయనతో చెప్పి బాధపడ్డారట. అయినా పొత్తు ధర్మం కోసం, రాష్ట్రం కోసం తమ సీట్లను తగ్గించుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు. నిజంగా పవన్ ఈ మాట చెప్పి ఉంటే రాజకీయాలలో ఇంతకన్నా బానిసత్వం ఇంకొకటి ఉండదు. ఒకవైపు జనసేన కార్యకర్తలు తమకు కనీసం నలభై అసెంబ్లీ సీట్లు అయినా పొత్తులోభాగంగా కేటాయించలేదని బాధ పడుతుంటే, పుండుమీద కారం చల్లినట్లు పవన్ కల్యాణ్ తమకు ఇచ్చినవే ఎక్కువని బాధపడ్డారా?. ఈ విషయం విన్న జనసైనికులకు ఏమనిపిస్తుంది! పేరుకు జనసేన తప్ప, తమది టీడీపీ భజన సేన అని అనుకోరా! తొలుత జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. బీజేపీకి ఇవ్వడం కోసం మరో మూడు తగ్గించుకున్నారు. పోనీ ఆ ఇరవై ఒక్కటి అన్నా జనసేన వారికి ఇచ్చారా అంటే అలా చేయలేదు. టీడీపీ, వైఎస్సార్సీపీ వంటి ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి కొన్ని సీట్లు ఇచ్చేశారు. మూడు ఎంపీ సీట్లు ఇస్తారని అనుకున్నారు. దానిని పవన్ కల్యాణ్ మూడుకు తగ్గించుకున్నారు. పైగా ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తిని అని ఆయన నిస్సిగ్గుగా చెప్పి జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఇక్కడ గమనించవలసిన సంగతులు ఏమిటంటే ఏళ్ల తరబడి జనసేన ముఖ్య నేతలనే పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అందులో స్వయంగా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఉండడం విశేషం. నాగబాబుకు అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసే అవకాశం ఇస్తారని భావించారు. ఏమైందో తెలియదు కాని అనకాపల్లిని బీజేపీకి త్యాగం చేశారు. అందులో కూడా ఎవరు పోటీచేశారో తెలుసు కదా! సీఎం రమేష్ కు. ఆయన ఎవరో కూడా తెలుసు కదా! టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేత. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. బీజేపీలో చేరినా కాంగ్రెస్ కు ముప్పై కోట్ల విరాళం ఇచ్చిన ప్రముఖుడు.ఈ మధ్యనే 400 కోట్ల ఫోర్జరీ కేసు కూడా ఆయనపై నమోదు అయింది. ఇతరత్రా ఉన్న ఆరోపణలు చెబితే చాంతాడు అంత అవుతాయి .సీఎం రమేష్ కోసం తన సోదరుడినే బలి చేశారంటే ఏదో పెద్ద విషయమే ఉండి ఉండాలన్నది పలువురి అబిప్రాయంగా ఉంది. పవన్ ఈ రకంగా అనకాపల్లి సీటును అమ్మేశారని జనసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే మరో సీటును వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన బాలశౌరికి ఇచ్చారు. ఆయనకు వైఎస్సార్సీపీ టిక్కెట్ రాలేదు. దాంతో పవన్ కల్యాణ్ ఆ సీటును ఆయనకు అమ్మి ఉండవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేనకు నేతలే లేరా? అంటే ఉన్నారు. 2019లో జనసేన పక్షాన పోటీచేసి ఓడిపోయిన పార్లమెంటు అభ్యర్ది ఉన్నారు. అలాగే అసెంబ్లీకి పోటీచేసిన అబ్యర్దులు ఉన్నారు. కాని వారెవ్వరిని కాదని బాలశౌరికి ఇవ్వడంలో ఉన్న మతలబు ఏమిటన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అసెంబ్లీ టిక్కెట్ల విషయానికి వస్తే భీమవరంలో టీడీపీ నేతగా ఉన్న పి.రామాంజనేయులును జనసేనలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చారు. అక్కడ జనసేన కోసం పనిచేసిన కొందరు ప్రముఖులు ఉన్నారు. వారినెవ్వరిని కాదని ఈయనకు ఎందుకు ఇచ్చారు! లోగుట్టు పెరుమాళ్ల కెరుక. విజయవాడ పశ్చిమలో పార్టీకోసం పోతిన మహేష్ అనే నేత విశేషంగా కృషి చేశారు. ఆయన కు టిక్కెట్ వస్తుందని అంతా భావించారు. కాని ఆశ్చర్యంగా అక్కడ బలం లేని బీజేపీకి టిక్కెట్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ త్యాగం చేశారు. అది త్యాగమా?లేక మంచి బేరమో తెలియదు కాని బీజేపీ పక్షాన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పోటీకిగాను జనసేన నేతను బలి చేయడానికి పవన్ కల్యాణ్ వెనుకాడలేదు. సుజనా చౌదరి అత్యంత ధనికులలో ఒకరు. బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగవేశారన్న కేసులు ఎదుర్కుంటున్న నేత. తాను నిజాయితీపరుడనని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఆచరణలో ఇలా చేసేసరికి ఆయనలో నిజాయితీ అన్నది నేతిబీరకాయలో నెయ్యి వంటిదని జనసైనికులు భావించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే పోతిన మహేష్ తీవ్ర స్థాయిలో పవన్ పై విరుచుకుపడ్డారు. ఇంతకాలం పార్టీ కోసం పని చేస్తే నమ్మించి గొంతు కోశారని ఆయన బాధపడ్డారు. జనసేన ప్లెక్సీలు, జండాలను ఆయన అనుచరులు దగ్దం చేశారు. మహేష్ మీడియా సమావేశం పెట్టి పవన్ ను ఏకీపారేశారు.ఇది ప్రజారాజ్యం -2 అని , మరో ఏడాది తర్వాత ఈ పార్టీ ఉండదని జోస్యం చెప్పారు. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గత డెబ్బై రెండేళ్ల ఎన్నికల చరిత్రలో ఒక ప్రధాన పార్టీ తరపున కమ్మ సామాజికవర్గం నేత ఎవరూ పోటీ చేయలేదు. అక్కడ నివసించేవారిలో అత్యధికులు ముస్లింలు, నగరాలు,వైశ్యులు తదితర వర్గాల వారు ఉన్నారు. కాని ఈసారి సుజనా చౌదరి పోటీచేస్తున్నారు. బీజేపీ కూడా ఒరిజినల్ పార్టీ నేతలకు కాకుండా సుజనా వంటివారికే ఎక్కువ సీట్లు కట్టబెట్టడం కూడా విమర్శలకు దారి తీసింది.అవినీతిపై బోలెడు సోది కబుర్లు చెప్పే పవన్ కల్యాణ్ ఈ విధంగా సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటివారి కోసం తన పార్టీవారిని బలి చేశారంటేనే ఆయన తత్వం అందరికి తెలిసిపోయింది. ఈ విషయాలన్నిటిని పోతిన మహేష్ ప్రస్తావించి అనేక ప్రశ్నలు సందించారు.పలు కొత్త విషయాలు వెల్లడించారు. 25 ఏళ్ల భవిష్యత్తు ఇస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ కనీసం పాతిక సీట్లు కూడా పోటీ చేయలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం తెలుసుకోవాలని, ఆయన మేడిపండు వంటివారు అని మహేష్ తీవ్రంగా ద్వజమెత్తారు. కన్నతల్లిని దూషించిన బినామీ చానల్ కు యజమాని అయిన వ్యక్తికి బీజేపీ టిక్కెట్ ఇస్తే పవన్ ఎలా మద్దతు ఇచ్చారని అని అడిగారు. మొత్తం 21 జనసేన సీట్లలో ఏడుగురే పార్టీ వారని, మిగిలినవారంతా ఇతర పార్టీల నుంచి వచ్చినవారేనని ఆయన తేల్చి చెప్పారు. కమ్మవారికోసం బిసిలను బలి చేస్తారా అని మహేష్ ప్రశ్నించారు.ఆయన అడిగినవాటికి పవన్ కల్యాణ్ వద్ద జవాబులు లేవనే చెప్పాలి. చివరికి పిఠాపురంలో పవన్ కల్యాణ్ తీసుకున్న ఇంటి గృహ ప్రవేశానికి భార్య అన్నాలెజెవోను తీసుకు రావాలని మహేష్ అనడం సంచలనంగా ఉంది. అందరూ ఆ సక్తిగా ఈ విషయాన్ని గమనిచంచారు. ఏమైందో తెలియదు కాని, పవన్ కల్యాణ్ తన భార్య లేకుండానే గృహ ప్రవేశం చేశారు. దీంతో రకరకాల ఊహాగానాలకు పవన్ కల్యాణ్ అవకాశం ఇచ్చారు. ఏది ఏమైనా జనసేనను టీడీపీకి తాకట్టు పెట్టి పూర్తిగా అప్రతిష్టపాలయ్యారని చెప్పాలి. నిజంగానే మహేష్ అన్నట్లు టీడీపీకి బి బ్యాచ్ గా తయారై వారికోసం పనిచేయడానికి జనసేనను పెట్టడం ప్రజలను మోసం చేయడానికే అన్న భావన వస్తుంది. మరికొన్ని ఉదాహరణలు కూడా చెప్పాలి. అవనిగడ్డ నుంచి టీడీపీ నేత మండలి బుద్ద ప్రసాద్ ను పార్టీలో చేర్చుకుని జనసేన టిక్కెట్ ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో కూడా అదే ప్రకారం నిమ్మక జయకృష్ణను టీడీపీ నుంచి తీసుకుని టిక్కెట్ ఇచ్చారు. తణుకు లో తమ పార్టీ నేత ఒకరికి టిక్కెట్ ప్రకటించి, తదుపరి ఆ సీటును టీడీపీకి వదలివేశారు. అంటే చంద్రబాబు ఏమి చెబితే అది చేశారని అర్ధం అవుతుంది.తణుకు లో కూటమి సభ పెట్టినప్పుడు తణుకు నేత రామచంద్రరావు వర్గీయులు నిరసన కూడా తెలిపారు. ఇంత జరిగినా చంద్రబాబు దృష్టిలో జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించినట్లేనట.ఆ మాటను పవన్ కల్యాణ్ అన్నారని చెబుతున్నారు. ఇంతకన్నా పరువు తక్కువ ఏమన్నా ఉందా! పిఠాపురంలో తన గెలుపుకోసం టీడీపీ నేత వర్మ కాళ్లా,వేళ్లా పడడం చూసి జనసేన కార్యకర్తలను సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంటే ఈ మొత్తం రాజకీయం అంతా చంద్రబాబు కోసం చేస్తున్నారని తేలిపోతుంది. పోనీ తనను ఎంతో కొంత ఆదరించిన కాపు సామాజికవర్గానికి అయినా న్యాయం చేశారా అంటే అదీ లేదు. కేవలం వారి ఓట్లు పొంది చంద్రబాబుకు మేలు చేయడానికే ఈ పొత్తు పెట్టుకున్నారని స్పష్టమవుతోంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమ్మ నాగబాబు.. ఇంత కడుపు మంట?
అధికారమే పరమావధిగా ఏర్పడిన టీడీపీ, జనసేన కూటమిలో లుకలుకలు అప్పుడే స్టార్టయ్యాయి. జనసేన పార్టీకి సీట్ల కేటాయింపుల నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కన్నుసన్నుల్లోనే జరుగుతుండడం జనసైన్యానికి మింగుడు పట్టడం లేదు. కొంతమంది బహిరంగంగా బాబు తీరును విమర్శిస్తుంటే.. మరికొంతమంది అంతర్గతంగా మాట్లాడుకొని తగిని బుద్ది చెప్పాలని డిసైడ్ అవుతున్నారు. (చదవండి: ట్వీటు రాజా? పోటీ లేదా?) పొత్తు పట్ల పవన్ వైఖరి అతని సోదరుడు నాగబాబుకు కూడా నచ్చడం లేదు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపినప్పటికీ.. బాబు కుట్రతో ఆయన పోటీకి దూరమయ్యాడు. అంతేకాదు పలు చోట్ల జనసేన అభ్యర్థులను ఓడించడానికి బాబు కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై నాగబాబు వరకు చేరినట్లు ఉంది. అయితే సోదరుడు పవన్ కల్యాణ్ బాబుని గుడ్డిగా నమ్ముతుండడంతో నేరుగా అతనితో చెప్పలేకపోతున్నాడట. అందుకే ట్విటర్ వేదికగా తన అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. తాజాగా కన్ఫ్యూషియస్ కొటేషన్‌ని ఎక్స్‌లో షేర్ చేస్తూ పరోక్షంగా అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్‌కు చురకలు అంటించాడు. ‘వయసు ఎక్కువ, పెద్దవాడు అని ప్రతి వెధవని గౌరవించక్కర్లేదు, ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్లువుతారు’ అనే కన్ఫ్యూషియస్ కొటేషన్‌ని నాగబాబు ఎక్స్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘వయసులో బాగా పెద్దవారైనా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇలా మాట్లాడటం చాలా తప్పు, పైగా మీ పార్టీ టీడీపీతో పొత్తుతో ఉందన్న సంగతి మర్చిపోవద్దు, పొత్తు ధర్మాన్ని పాటించండి’ ‘ఇది అయితే చంద్రబాబు నే అంటున్నావ్ అని క్లియర్ గా తెలుస్తుంది....లేదంటే మోడీ గారిని’, ‘అయ్యో మీరు ఇలా డైరెక్ట్ గా చంద్రబాబు గారిని అనడం చాలా తప్పు’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ( గమనిక: ఏమి మాట్లాడిన మా గురించే ఏమో అని ఆపాదించుకుంటున్నారు,ఇది ఎన్నికల సమర సమయం నా ఉద్దేశాలు చెప్తున్న తప్ప ఎవరిని ఉద్దిషించి కాదు పైన చెప్పింది జీవిత సత్యం) pic.twitter.com/HhOfVu4igE — Naga Babu Konidela (@NagaBabuOffl) March 21, 2024 -
నాగబాబు గాయబ్.. ఫోన్ స్విచ్ ఆఫ్!
సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్మీట్లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు. వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్‌ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్‌కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది. ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది. ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్‌కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
మామయ్య ఆశీస్సులతో కొత్త ప్రయాణం ప్రారంభించిన 'సాయి దుర్గ తేజ్'
మెగా హీరో సాయి దుర్గ తేజ్ కొత్త జర్నీని ప్రారంభించాడు. ఆయన ముందుగు చెప్పినట్లే నిర్మాతగా తన ప్రయాణాన్ని కొనసాగించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మెగా అభిమానులకు తెలిపాడు. తను ఏర్పాటు చేసిన కొత్త ప్రొడక్షన్ హౌస్‌కు 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. సాయి ధరమ్ తేజ్ తాజాగా తను పేరును కూడా మార్చుకున్న విషయం తెలిసిందే. తన అమ్మగారి పేరు దుర్గను తీసుకుని సాయి దుర్గ తేజ్‌గా ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రొడక్షన్ హౌస్‌కు కూడా తన అమ్మగారి పేరుతోనే 'విజయదుర్గ ప్రొడక్షన్స్' అని ఫిక్స్ చేశాడు. అమ్మపేరు మీద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉందని ఆయన ఇలా తెలిపాడు. 'మా మామయ్యలు చిరంజీవి, నాగబాబు, మా గురువు పవన్‌కల్యాణ్ ఆశీస్సులతో దీన్ని ప్రారంభించాను. నా కెరీర్ ప్రారంభంలో నాకు సహకరించిన నిర్మాత దిల్‌రాజు ఈ ప్రొడక్షన్ హౌస్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. 'సత్య' సినిమా టీమ్‌తో కలిసి ఈ సంస్థను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.' అని ఆయన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకంక్షలు చెబుతున్నారు. A New beginning ☺️ Happy to announce a small gift to my mother on her name, Our Production House @VijayaDurgaProd 🥳 Begun this on an auspicious note with the blessings of My Mavayyas@KChiruTweets mama@NagaBabuOffl mama & my guru garu @PawanKalyan mama My Producer #DilRaju… pic.twitter.com/XZBS1V0zBT — Sai Dharam Tej (@IamSaiDharamTej) March 9, 2024 -
లగేజీ ప్యాక్ చేసుకున్న మెగా బ్రదర్స్.. పరుగులు పెడుతున్న పవన్
ఏపీలో కీలకంగా ఉన్న నేతలు ఎక్కడ పోటీ చేయనున్నారో అందరికీ ఒక క్లారిటీ ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి పోటీ చేస్తారో రాజకీయలపై ఏ మాత్రం అవగాహన లేని వారు కూడా ఇట్టే చెప్పేస్తారు.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా తమ స్థానాలను ప్రకటించుకున్నారు. కానీ సినిమాల్లో పవర్ స్టార్, రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్ అయిన పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పోటీ చేసిన పవన్ రెండూ చోట్ల ఓడిపోయాడు. దీనికి ప్రధాన కారణం ఆయన అహం అని చెప్పవచ్చు. పవన్‌ను ఇప్పటి వరకు విలువైన రాజకీయ నేతగా ఏపీ ప్రజలు గుర్తించనే లేదు.. అయినా కూడా పవన్‌లో మార్పు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ప్రకారమే కమ్యూనిస్టులతో పాటు బీఎస్పీలను కలుపుకుని వెళ్లిన పవన్‌ను రెండు చోట్ల ప్రజలు ఓడగొట్టారు... ఈ ఎన్నికల్లో కూడా బాబు సలహా మేరకే ఆయనతో మళ్లీ జత కట్టాడు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.. అయితే స్టేజీ ఎక్కుతే చాలు ఊగిపోతాడు.. మొదట గాజువాక నుంచి పోటీ చేయాలనుకున్న పవన్ అక్కడ ఓడిపాతారని తను చేపించుకున్న సర్వే ఫలితాలు చెప్పడంతో పక్కకు తప్పుకున్నాడు. ఆ తర్వాత కాకినాడ అనుకున్నాడు అక్కడికి స్వయంగా పవనే వెళ్లి సమీక్షలు కూడా చేశాడు.. అక్కడ కూడా ఎదురు గాలి వీయడం ఖాయం అని రిపోర్టు అందడంతో కాకినాడకు గుడ్‌బై చెప్పాడు. అక్కడి నుంచి పవన్ గాలి భీమవరం వైపు మళ్లింది. అక్కడ కూడా ఆయన సర్వే చేపించుకున్నాడు.. భీమవరంలోని బీసీ,క్షత్రియ,మైనారిటీ వర్గాలన్నీ కూడా జగన్ గారి వైపే ఉన్నాయని తేలడంతో మళ్లీ పవన్ గేరు మార్చి పిఠాపురం బయల్దేరాడు.. అక్కడ కూడా ఆయన సమీక్షలు చేపించుకున్నాడు. అక్కడ వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. అక్కడ కూడా ఆయనకు ఓటమి తప్పదనే సందేహాలు వస్తున్నాయి.. ఇప్పుడు మరో నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకునే పనిలో పవన్ ఉన్నాడని సమాచారం. పవన్ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే అక్కడ కచ్చితంగా బలమైన అభ్యర్ధిని వైసీపీ బరిలోకి దింపుతుంది. ఈ విషయం తెలిసే పవన్ తాను ఎక్కడ నుంచి పోటీ చేసేది చెప్పకుండా గుట్టుగా వుంచుతున్నాడనేది నగ్నసత్యం. మరి ఇంతలా భయపడే పవన్ ఊగిపోతు మాట్లాడటం ఏంటి అంటూ నెట్టంట సెటైర్లు వేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి మాదిరి నాగబాబు, పవన్ కల్యాణ్ చట్ట సభల్లో అడుగుపెట్టాలని ఎంతో కోరికతో ఉన్నారు.. కానీ అది ఈసారి కూడా జరిగేలా లేదు. టీడీపీ-జనసేన కూటమి నుంచి అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని నాగబాబు భావించారు. ఈ క్రమంలో ఆయన ఒక ఇల్లు కూడా అక్కడ అద్దెకు తీసుకుని కార్యకలాపాలు కూడా సాగించారు. అక్కడ నుంచే పోటీ చేయాలని భావించే కొణతాల రామకృష్ణను కూడా అన్నాతమ్ముళ్లు కలిశారు. అంతా ఫిక్స్ త్వరలో నాగబాబు పేరు ప్రకటిస్తారని కూడా వార్తలు వచ్చాయి.. ఈ క్రమంలో వారు అనకాపల్లి నియోజకవర్గంలో సర్వే చేపించుకున్నారు కూడా.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల గ్రామీణ ప్రాంతాల్లో విపరీతమైన ఆధరణ ఉండటం చూసి కాస్త నాగబాబు వెనకడుగు వేశారట.. ఓడిపోయే దానికి మళ్లీ పోటీ చేయడం ఎందుకని అద్దెకు తీసుకున్న ఇంటిని కూడా కాళీ చేశారట. ప్రస్తుతం మెగా బ్రదర్స్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పడ్డారు. పార్టీ అధినేతే ఎక్కడ పోటీ చేసిదే క్లారిటీ లేకుంటే ఎలా అంటూ పవన్‌పై జోకులు కూడా వేసుకుంటున్నారు. -
ఆవేశంతో ఊగిపోవడం ఆపై 'సారీ' చెప్పడం 'మెగా బ్రదర్స్'కు అలవాటే..
మెగా బ్రదర్ నాగబాబు తన మిగిలిన ఇద్దరు సోదరులతో పోల్చుకుంటే సినిమాల్లో రాణించలేకపోయాడు. ఏదో అడపాదడపా ఆయన సినిమాల్లో కనిపించీ కనిపించకుండా ఉంటాడు. తమ్ముడు పవన్ పుణ్యమా అని పార్ట్ టైమ్ పొలిటీషయన్‌గా ఎన్నికల సమయంలో మాత్రమే జనాల్లో కనిపిస్తాడు. ఆ సమయంలో ఆయన ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. తాజాగా తన కుమారుడు వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ పోలీస్ పాత్రల గురించి ఆయన కామెంట్ చేశాడు. సినిమాలలో ఐదు అడుగుల మూడు అంగుళాలు ఉండే వారు పోలీస్ ఆఫీసర్ పాత్రలు వేస్తే అంతగా నమ్మేలా ఉండవని సెటైర్లు వేశాడు నాగబాబు. పోలీస్ క్యారెక్టర్ తన కొడుకు లాంటి వారు మాత్రమే చేయాలి తప్పా మిగత వారు అందుకు పనికి రారు అన్నట్లుగా మాట్లాడారు. అయితే అవి కాస్త సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. పాన్ ఇండియా స్టార్ హీరో అయిన జూ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేస్తూ నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని నెట్టింట్ట వైరల్ అయింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఎంట్రీ ఇవ్వడం ఆపై నాగబాబుపై విమర్శలు చేయడంతో ఫైనల్‌గా సారీ చెప్పాడు. 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది.. 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను, ఆ మాటలు నేను వెనక్కు తీసుకుంటున్నాను, ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే నన్ను క్షమించండి. అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని కావాలని అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.' అంటూ ఒక పోస్ట్ చేశాడు. గతంలో కూడా బాలకృష్ణ అంటే ఎవరో తనకు తెలియదంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం తర్వాత వాటికి గుడ్ బై చెప్పి కాంప్రమైజ్‌కావడం వంటివి జరడం మనం చూసిందే.. తాజాగా తారక్‌ను ఉద్దేశించే నాగబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఎన్నికల సమయంలో ఈ తలనొప్పి ఎందుకులే అనుకున్నాడేమో సింపుల్‌గా ఇలా సారీ చెప్పేశాడు. గతంలో కూడా నాగబాబు ఏబీఎన్ అధినేత రాధాక్రిష్ణపై ఫైర్ అవుతూ ఒక వీడియో విడుదల చేశాడు. చంద్రబాబుపై మీరు చేసిన 'భట్రాజ్' పొగడ్తల్ని నేను ఒక వీడియో ద్వారా చూపించానంటూ రాధాక్రిష్ణపై కామెంట్లు చేశాడు. అయితే అందులో 'భట్రాజ్ పొగడ్తలు' అనే పదం వల్ల ఆయనకు చిక్కులు వచ్చాయి. ఆ కమ్యూనిటీకి చెందిన వారు ఫైర్ కావడంతో నాగబాబు క్షమాపణలు చెప్పాడు. ఇలా ఆవేశంలో నోటికి వచ్చింది మాట్లాడటం తర్వాత సారీ చెప్పడం పవన్- నాగబాబుకు సర్వసాధారణం అయింది. మరో వైపు పవన్ కల్యాణ్ కూడా అంతే.. ఆవేశంలో ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు. కేవలం సినిమా డైలాగుల మాదిరి రాజకీయం చేయాలనుకుంటే అయ్యే పని కాదని ఇప్పటికీ ఆయనకు అర్దం అయినట్లు లేదు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సుమారు 10 ఏళ్లకు పైగానే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసింది ఏమీ లేదు. ఈ పదేళ్లలో పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదగకపోగా అదఃపాతాళానాకి చేరుకున్నాడు. అందుకే ఆయన నోటి నుంచి ప్రస్తుతం ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. కొన్ని నెలల క్రితం తణుకు సభలో విడివాడ రామచంద్రరావుకు తణుకు టిక్కెట్ అంటూ ఆవేశంగా ప్రకటించాడు. గత ఎన్నికల్లో మీలాంటి వ్యక్తి వెనుక నేను నిలబడలేనందుకు మనస్పూర్తిగా చింతిస్తున్నాను. 2019లో టిక్కెట్ ఇవ్వలేకపోయినందుకు ఇలా పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటూ పవన్ అన్నారు. ఆ సమయంలో రామచంద్రరావుకు క్షమాపణలతోనే సభను ప్రారంభించాడు పవన్. కానీ ఈసారి కూడా పవన్ మాట నిలబెట్టుకోలేకపోయాడు. తణుకు అభ్యర్థిగా రాధాకృష్ణకు టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. దీంతో రామచంద్రరావుకు మళ్లీ సింపుల్‌గా సారీతో గుడ్‌బై చెప్తాడని తెలుస్తోంది. చంద్రబాబు కోసం పవన్ రాజకీయం చేస్తున్నాడు అనేది నిజం.. ఆయన ఇచ్చిన 24 సీట్లతో సంబరపడిపోతూ ప్రస్తుత రాజకీయ సభల్లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నాడు. కానీ తన పార్టీకి కనీసం గుర్తింపు కూడా లేదని వాపోయిన జనసేన అధినేత తన జెండా అదఃపాతాళానాకి చేరుకోవాడానికి కారణం ఎవరు..? దీనికి మరెవరినో నిందించాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప, హత్యలుండవంటారు. ఇందుకు పవన్ కల్యాణ్ చేస్తున్న రాజకీయమే నిలువెత్తు నిదర్శనం. పవన్ కల్యాణ్ పైకి ఎన్ని సినిమా డైలాగ్స్ పేల్చినా ఉపయోగం లేదు. జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోడానికి మాత్రమే జనసేన ఆవిర్భవించిందని ఆయన పట్టరాని ఆక్రోశంతో మాట్లాడుతున్నాడు. కానీ టీడీపీ కోసమే జనసేన పుట్టింది అని పవన్ పరోక్షంగా చెప్పినట్లు అయింది. దీంతో తన ఫ్యాన్స్‌తో పాటు తన వర్గం వారు కూడా పవన్‌ను ప్రశ్నిస్తున్నారు.. పలు సలహాలు ఇస్తున్నారు... కానీ ఆయన ఐ డోంట్ కేర్ అంటూ చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకే జై కొడుతున్నాడు. పవన్‌కు ఎంత ప్యాకెజీ ఇస్తే అంతలా స్టేజీ డైలాగ్స్‌తో ప్రస్తుతం రెచ్చిపోతున్నాడు. 2014లో ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చి నాలగు లాజిక్ లేని మాటలను తన ఫ్యాన్స్‌కు చెప్పాడు.. 2019లో మళ్లీ అలాంటి కాకమ్మ కథలే చెప్పి చంద్రబాబు కోసం సొంతంగా బరిలోకి దిగాడు. 2024 వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలంటూ టీడీపీకి జనసేనను తాకట్టు పెట్టేశాడు. ఇలాంటి కొత్త కథలు విని తట్టుకోలేక పవన్ ప్యాన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. పవన్‌ను తిడుదామంటే అభిమానం అడ్డొస్తుంది.. దీంతో వారందరూ చంద్రబాబుపై ఫైర్ అవుతున్నారు. ఎన్ని చేసినా ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కష్టం అని జనసేన అభిమానులో వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అయిపోయాక 2029 ఎన్నికల్లో చంద్రబాబుతో తూచ్ అని ... జనసైనికులకు ఒక సారీ చెప్పి సింగిల్‌గా పోటీకి దిగుతానని ఏదో ఒక సినిమా కథ చెప్పడం ఖాయం. -
జనసేనకు ‘కొత్త’ తలనొప్పి
అలగడమే అలంకారంగా భావించే సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ.. జనసేనలో చేరీ చేరడంతోనే తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేది తానేనని ఫిక్స్ అయిపోయాకనే అయన జనసేనలో చేరారు. వాస్తవానికి అయన ఆలోచనలకూ విరుద్ధంగా జరిగితే వెంటనే అయన అలకపాన్పు ఎక్కుతారు.. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కాంగ్రెసులోను, వైఎస్సార్ కాంగ్రెస్ లోను ఇలా ఎక్కడైనా ఆయనది అదే తీరు. ఇక చాన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న కొణతాల రామకృష్ణ మొన్నీమధ్యనే జనసేనలో చేరారు. చేరుతూనే.. తాను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అని తనకుతానే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. అనకాపల్లి నుంచి తాను పోటీ చేస్తాను అంటూ పవన్ అన్నయ్య నాగబాబు సైతం అనకాపల్లి మీద కన్నేశారు.. తరచూ అక్కడే పర్యటిస్తున్నారు. యలమంచిలి దగ్గర అయన ఉండేందుకు ఒక ఇతనికి, స్టాఫ్ కోసం ఇంకో రెండు ఇళ్లను సైతం తీసుకున్నారు. అనకాపల్లి నుంచి పోటీకి అయన ఏర్పాట్లు చేసుకున్నారు... దీంతో తన అంశాలమీద నీళ్లు పడ్డాయని గుర్తించిన కొణతాల మొన్న నిన్న అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ' తనకు టిక్కెట్ ఇవ్వనప్పుడు ఇంకా పార్టీ సమావేశాలకు వెళ్లడం ఎందుకన్నది ఆయన భావన. ఇదిలా ఉండగా అనకాపల్లిలో ప్రధాన సామాజిక వర్గం అయిన గవర కమ్యూనిటీకి చెందిన కొణతాల అలిగితే ఇక తన గెలుపు సంగతి అటుంచి డిపాజిట్లు కూడా రావని భయపడిన నాగబాబు ఒకవైపు.. పవన్ మరోవైపు కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేనకు అనకాపల్లి,కాకినాడ,మచిలీపట్నం లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక.. కొణతాల సైతం అక్కడే కన్నేయడంతో ఇరువురిమధ్య పీఠముడి పడింది. దీంతో ఆ విభేదాలను పరిష్కరించేందుకు పవన్, నాగబాబు సైతం కొణతాల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒకవేళ అయన మెత్తబడినా ఆయనకు ఇంకోచోట ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే విశాఖలో పెందుర్తి, భీమిలి ఇలా మూడు నాలుగు సీట్లలో జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది.. ఇప్పుడు అవికాకుండా అనకాపల్లి ఎమ్మెల్యే కూడా తీసుకోవడం కష్టమే.! మరి అలాంటప్పుడు కొణతాలను ఎక్కడ ? ఎలా ఎకామిడేట్ చేస్తారో చూడాలి. ఇక్కడ.. వైవీ చక్రవర్తి అనే అయన సైతం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా టిక్కెట్ కోసం చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం టీడీపీ కోసం గట్టిగా ఆశతో ఉన్నారు. దీంతో వీళ్ళు ఎవరికీ టిక్కెట్ లేకుండా నాగబాబుకు ఇచ్చేలా చంద్రబాబును పవన్ ఒప్పిస్తున్నారు అని అంటున్నారు.. దీంతో అనకాపల్లి కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. ✍️సిమ్మాదిరప్పన్న -
గాజువాకలో జనసేన ‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, విశాఖపట్నం : ఇప్పటికే టీడీపీతో పొత్తుపై కత్తులు నూరుతున్న జనసేన శ్రేణులు ఇప్పుడు ఆ పార్టీలో అగ్ర నాయకుల వ్యవహార శైలిపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేస్తున్న తమను కాదని నిన్నగాక మొన్న చేరిన జంప్ జిలానీలకు పెద్దపీట వేస్తున్నారంటూ రగిలిపోతున్నారు. కేవలం డబ్బుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప పార్టీలో సేవలకు గుర్తింపు లేదంటూ ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో కొన్నాళ్ల క్రితం వరకు కొన్ని చోట్ల ఒకింత ఉత్సాహంగా కనిపించిన జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రస్తుత పరిణామాలతో నిర్లిప్తత, నైరాశ్యంతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన సోదరుడు నాగబాబుల వైఖరిపై గుర్రుగా ఉన్నారు. పవన్ సామాజికవర్గానికి చెందిన యలమంచిలి నియోజకవర్గానికి చెందిన సుందరపు విజయకుమార్ గతం నుంచే జనసేనలో ఉన్నారు. అప్పటికే జనసేన సానుభూతిపరుడిగా ఉన్న ఆయన సోదరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, పోర్టు కాంట్రాక్టరు సతీష్ పార్టీలో చేరుతున్నారంటూ ఆకస్మికంగా (డిసెంబర్ 7న) పవన్ కల్యాణ్‌తో విశాఖలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇది జనసేన నేతలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత నుంచి అదే సామాజికవర్గానికి చెందిన ‘సుందరపు’ కుటుంబానికి పవన్, నాగబాబులు అధిక ప్రాధాన్యమిస్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది. సతీష్ తాను నాగబాబుకు అత్యంత సన్నిహితునిగా చెప్పుకోవడం, అందుకు తగ్గట్టే నాగబాబు వ్యవహార శైలి ఉండడం పార్టీలో ఇతర నాయకులకు మింగుడు పడడం లేదు. టీడీపీతో పొత్తులో భాగంగా గాజువాక సీటు తమకు ఖరారైందని, ఆ స్థానం నుంచి సతీష్ పోటీ చేయబోతున్నారంటూ కొద్ది రోజుల నుంచి విస్తృత ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాగబాబు బరిలో ఉంటారన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. క్యాడరును పట్టించుకోని పవన్ అధినేత పవన్ విశాఖ వచ్చినప్పుడు తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ జనసేన క్యాడరు అసంతృప్తితో ఉంది. ఎవరో ఒకరిద్దరికే కలిసే అవకాశం ఇవ్వడం, హోటల్ గదికే పరిమితమవ్వడం తప్ప మిగతా వారిని దరికి చేరనీయడం లేదని మధన పడుతున్నారు. ప్రజారాజ్యంలోనూ నాగబాబు ఇదే తీరును ప్రదర్శించారని, ఇప్పుడూ అదే జరుగుతోందని వీరు గుర్తు చేస్తున్నారు. జీర్ణించుకోలేకపోతున్న సీనియర్లు.. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పని చేస్తున్న వారిని పక్కనబెట్టి పార్టీలు మారి వచ్చిన వారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ జనసేన సీనియర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే సుందరపు కుటుంబానికిస్తున్న ప్రాధాన్యతపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ నాయకులు తాజా పరిణామాలతో మరింతగా అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణలు జనసేనలో చేరారు. వీరిలో పంచకర్లకు పెందుర్తి సీటు ఖాయమన్న ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఆ సీటును ఆశిస్తున్న జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌కు మింగుడు పడడం లేదు. అలాగే మరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య కూడా విశాఖలో సీటు ఆశిస్తున్నారు. టీడీపీతో పొత్తులో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేకపోవడంతో కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే జనసేనలో చేరిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం అక్కడ చాలా ఏళ్లుగా ఇన్చార్జిగా ఉన్న పరచూరి భాస్కరరావుకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. టీడీపీతో పొత్తు వల్ల తమకు పోటీ చేసే అవకాశమే లేకుండా పోతోందన్న ఆవేదన ఒకవైపు, తాము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారన్న బాధ మరో వైపు జనసేన నాయకులను వేధిస్తోంది. నాగబాబు కుమార్తె సినిమాకు సతీష్ పెట్టుబడి నాగబాబు కుమార్తె తీస్తున్న ఓ సినిమాకు సతీష్ భారీగా పెట్టుబడి పెట్టారని, అందుకే సతీష్ సోదరులిద్దరికీ పార్టీలో ప్రాధాన్యతనిస్తున్నారని, సతీష్‌కు గాజువాక సీటు దక్కేలా చూస్తున్నారని జనసేన నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. పోర్టు కాంట్రాక్టరు కూడా అయిన సతీష్ గాజువాక సీటు నుంచి గెలిస్తే గంగవరం పోర్టుపై పట్టు సాధించవచ్చన్నది వారి వ్యూహంగా ఉందని పార్టీలో కొందరు చర్చించుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగితే గాజవాక సీటుపై కోటి ఆశలు పెట్టుకున్న టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
జనసేన నేతల నిలదీత.. తలదించుకున్న నాగబాబు!
సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం. -
జనసేన నాగబాబు, పవన్ కళ్యాణ్ పై కొమ్మినేని సెటైర్లు
-
బెంగుళూరు ఫామ్‌హౌస్‌లో మెగా ఫ్యామిలీ గ్రాండ్ సంక్రాంతి సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఏపీలో దొంగఓట్ల చేరికలో జనసేన భారీ కుట్ర
-
ఒక్కడే.. కానీ రెండు ఓట్లు!
భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఒక్కచోటే ఉండాలనేది ఎన్నికల కమిషన్ నిబంధన. ఇలా లేకపోతే ‘అక్కడ- ఇక్కడ’ పేరుతో ఎన్నో దొంగ ఓట్లు నమోదై గందరగోళ పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. దొంగ ఓట్లు ఏరివేతకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటున్నా సాధారణ పౌరులు నుంచి సెలబ్రెటీల వరకూ ఒక్క చోట కంటే ఎక్కువ చోట్లే ఓటును ఏదొక రకంగా నమోదు చేసుకుంటూనే ఉంటున్నారు. ఇదంతా ఎందుకంటే ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అక్కడ ఓటు హక్కు వినియోగించుకున్న కొందరు ఇప్పుడు పక్క రాష్ట్రమైన ఏపీలో ఓట్లు నమోదు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు ‘రెండో ఓటు’ను నమోదు చేసుకోవడానికి అది కూడా ఏపీలో నమోదుకు దరఖాస్తు చేయడంపై ఒకవైపు విస్మయం.. మరొకవైపు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన నాగబాబు, అతని భార్య, కుమారుడు ఇప్పుడు కొత్త ఓటు కోసం ఏపీలోనూ దరఖాస్తు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్-168లో కొణిదల నాగబాబు(సీరియల్ నెంబర్-323), కొణిదల పద్మజ(సీరియల్‌నెంబర్- 324), సాయి వరుణ్ తేజ్(సీరియల్ నెంబర్-325) ఓటు వేశారు. వీరు తాజాగా ఏపీలోని మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్నారు. నాగేంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో నాగేంద్రరావుగా ఓటు వేయగా, ఇక్కడ నాగేంద్రబాబుగా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాధారణ జనం.. అమ్మ నాగబాబు అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.