
సినీ విమర్శకులపై మెగా బ్రదర్ నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాలు అనేది ఒక వ్యాపారం మాత్రమేనని.. జనాన్ని బాగు చేయడం కోసమే.. లేదా చెడగొట్డడం కోసమో సినిమాలు చేయరంటూ వరుస ట్వీట్స్ చేశారు. ‘సినిమాల్లో చూపించే హింస వల్ల జనాలు చెడిపోతారు అనుకుంటే, మరి సినిమాల్లో చూపించే మంచి వల్ల జనాలు బాగుపడాలి కదా. ఒక ఫిల్మ్ మేకర్‌గా నేను చెప్పేది ఏంటంటే.. ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే సినిమాలు తీస్తారు. అంతేకాని జనాన్ని బాగు చేయ్యటం కోసమో.. చెడగొట్టడం కోసమో తీసేంత గొప్ప వాళ్లు లేరిక్కడ. సినిమా అనేది ఒక వ్యాపారం మాత్రమే .
సినిమా వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇదే నా ఆన్సర్. సినిమాల్లో ఏదన్నా ఓవర్‌గా ఉంటే సెన్సార్ ఉంది. కుహనా మేధావులు ఏడకవండి’ అని నాగబాబు వరుస ట్వీట్స్ చేశారు. నాగబాబు ట్వీట్స్‌పై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది అతనికి మద్దతుగా కామెంట్ చేస్తే.. మరికొంత మంది నెగెటివ్‌టా కామెంట్ చేస్తున్నారు. ఇక సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా నాగబాబు ట్వీట్స్‌పై స్పందించారు. ఇది నిజమే అంటూ నాగబాబు ట్వీట్స్‌ని షేర్ చేశాడు.
Perfectly correct 🙏🙏🙏 https://t.co/2WpwuXGl54
— Ram Gopal Varma (@RGVzoomin) February 7, 2023
Comments
Please login to add a commentAdd a comment