ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్ రిలీజ్ | RGV Saaree Telugu Movie Modhati Sari Video Song Out Now, Watch Video Inside | Sakshi
Sakshi News home page

RGV Saaree Telugu Movie: ఆర్జీవీ శారీ మూవీ.. రొమాంటిక్‌ సాంగ్ రిలీజ్

Published Fri, Mar 7 2025 9:34 PM | Last Updated on Sat, Mar 8 2025 9:56 AM

RGV Saaree Telugu Movie Modhati Sari Video Song out now

టాలీవుడ్‌ సంచలన డైరెక్టర్‌ రాంగోపాల్ వర్మ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం శారీ.  ఆర్‌జీవీ ఆర్వీప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ, రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  గిరి కృష్ణకమల్‌ దర్శకత్వంలో  రూపొందించిన ఈ సినిమాలో సత్య యాదు, ఆరాధ్య దేవీ జంటగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శారీ మూవీ ఓ క్రేజీ ‍సాంగ్ విడుదల చేశారు. మొదటిసారి అంటూ సాంగే రొమాంటిక్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను కీర్తన శేష్,  అర్జున్ విజయ్ ఆలపించగా.. రాజశేఖర్ సుద్మూన్ లిరిక్స్ అందించారు. ఈ చిత్రానికి    కీర్తన శేష్ సంగీతమందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ మార్చి 21న తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సాహిల్ సంభయాల్, అప్పాజీ అంబరీష్, కల్పలత కీలక పాత్రలు పోషించారు.

శారీ కథేంటంటే..

ఉత్తరప్రదేశ్‌లో ఎంతోమంది అమాయకమైన మహిళలను హత్యాచారం చేసిన ఓ శారీ కిల్లర్‌ ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. చీరలో ఉన్న అమ్మాయిని చూసి, ఆమెతో ప్రేమలో పడిన తర్వాత ఓ అబ్బాయి జీవితం ఎలా భయానకంగా మారింది అన్నదే ఈ చిత్రకథాంశమని గతంలోనే చిత్ర యూనిట్‌ పేర్కొంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement