
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2002లో ఆర్జీవీ మూవీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించారు. అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా జంటగా నటించిన కంపెనీ అనే మూవీలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాంగోపాల్ వర్మ మోహన్ లాల్ నటన గురించి వివరించారు. తన సినిమాలో ఎక్కువ రీటేక్‌లు తీసుకున్నాడని అన్నారు.
ఆర్జీవీ మాట్లాడుతూ.. ' నా సినిమా కంపెనీ కోసం మొదటిసారి మోహన్ లాల్‌ను కలిశా. నా సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడా. తన పాత్ర గురించి చాలా క్లిష్టమైన ప్రశ్నలు అడిగుతాడేమోనని నేను ముందుగానే సిద్ధం అయ్యా. కథ మొత్తం చెప్పడం పూర్తయిన తర్వాత అతను నన్ను అడిగిన ఏకైక ప్రశ్న ఇదే. సార్, మీకు ఎన్ని రోజులు కావాలి? అన్నారు. ఇలాంటి క్లైమాక్స్ నేను ఊహించలేదు. నాతో మాత్రమే కాదు.. అందరితోనూ ఆయన ఇలానే చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే అతనికి సినిమాల గురించి పూర్తి అవగాహన ఉంది. డైరెక్టర్ నమ్మకానికి తగినట్లుగా ఏ పాత్రనైనా చేస్తాడని భావించా' అని తెలిపారు.
కంపెనీ షూటింగ్ గురించి ఆర్జీవీ మాట్లాడుతూ.. 'ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు మోహన్ లాల్ ప్రదర్శన పట్ల నేను అసంతృప్తిగా ఉన్నా. అతను సరిగ్గా చేయడం లేదని అనుకున్నా. ఆయన ఓ సీన్‌లో ఎక్కువ టేక్‌లు అడుగుతూనే ఉన్నాడు. దాదాపు ఆరు, ఏడు టేక్‌ల తర్వాత వాటిని చెక్ చేశా. ఆ తర్వాత తెలిసింది. మొదటి టేక్‌లోనే అద్భుతంగా చేశాడనిపించింది. నిజంగా మోహన్ లాల్ సహ నటుడు.' అంటూ కొనియాడారు. కాగా.. 2002లో వచ్చిన కంపెనీ చిత్రంలో మోహన్‌లాల్.. వీర్‌పల్లి శ్రీనివాసన్ అనే ఐపీఎస్ పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment