మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohan Lal) నటించిన చిత్రం 'బరోజ్ 3డీ'(Barroz 3D Movie). ఈ మూవీని తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వీయ దర్శకత్వం వహించారు. ఈ ఎపిక్ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోని పెరుంబవూర్ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ చేశారు. గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం అభిమానులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ మోహన్ లాల్ కెరీర్‌లో మరో డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి(OTT) వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈనెల 22 నుంచే స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. కాగా.. బరోజ్ కథ నచ్చడంతో తొలిసారిగా మోహన్‌లాల్ దర్శకత్వం వహించారు. మైథలాజికల్ థ్రిల్లర్‌గా జీజో పున్నూసే రచించిన నవల ఆధారంగా బరోజ్ చిత్రాన్ని తెరకెక్కించారు. వాస్కోడిగామాలో దాగి ఉన్న నిధిని 400 ఏళ్లుగా కాపాడే జినీగా మోహన్ లాల్ కనిపించారు. ఈ మూవీని తొలిసారిగా 3డీ వర్షన్‌లో తెరకెక్కించారు.
బరోజ్ 3డీ కథేంటంటే..
ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా వాస్కోడిగామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.
Step into the magical world of Barroz: The Guardian of Treasures, streaming from January 22nd on Disney+ Hotstar.@mohanlal @antonypbvr @aashirvadcine @santoshsivan @aaroxstudios#DisneyPlusHotstar #DisneyPlusHotstarMalayalam #Barroz #Mohanlal #TheCompleteActor #Fantasy… pic.twitter.com/azNNowsbSw
— DisneyPlus Hotstar Malayalam (@DisneyplusHSMal) January 20, 2025
Comments
Please login to add a commentAdd a comment