గత 40 ఏళ్లలో ఎవరూ ఇలా ట్రై చేయలేదు: మోహన్‌లాల్ కామెంట్స్ | Malayalam Actor Mohan Lal Comments About His Film Barroz | Sakshi
Sakshi News home page

Mohan Lal: తెలుగు ఆడియన్స్‌కు సినిమా అంటే ప్రాణం: మోహన్ లాల్

Published Tue, Dec 24 2024 6:52 PM | Last Updated on Tue, Dec 24 2024 7:19 PM

Malayalam Actor Mohan Lal Comments About His Film Barroz

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం 'బరోజ్'(Barroz) ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ మూవీని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరుంబవూర్‌ నిర్మించారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమాను తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్‌ లాల్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాత యలమంచిలి రవి పాల్గొన్నారు. అయితే ఈ సినిమాను 3డీ వర్షన్‌లో తెరకెక్కించడం మరో విశేషం. ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మోహన్‌ లాల్ తెలుగు సినీఇండస్ట్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

(ఇది చదవండి: 'బరోజ్ 3డీ’లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు: మోహన్‌ లాల్‌)

మోహన్ లాల్ మాట్లాడుతూ..'తెలుగు ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. పుష్ప లాంటి పెద్ద సినిమాను మనం చూశాం. తెలుగు ఆడియన్స్‌ ప్రతి సినిమాను గౌరవిస్తారు. బరోజ్ రిలీజ్ చేస్తున్నందుకు మైత్రి మూవీ మేకర్స్‌కు ధన్యవాదాలు. గత 40 ఏళ్లలో ఎవరూ ప్రయత్నించని నేటివ్‌ 3డిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. సరికొత్త విధానంలో కథను పరిచయం చేస్తున్నాం. కొత్త ఆలోచనతో బరోజ్‌ను తీశాం. ఈ సినిమా చిన్నపిల్లలకు బాగా నచ్చుతుంది. ఇది మీలోని పసితనాన్ని గుర్తు చేస్తుంది.' అని అన్నారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement