ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.
అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్‌సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు.
#GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2
— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024
Comments
Please login to add a commentAdd a comment