disney
-
డిస్నీని తలపించేలా... సరికొత్త థీమ్ పార్క్
సాక్షి, ముంబై: ముంబై, నవీ ముంబై నగరాల్లోని చిన్నారులకు త్వరలోనే ఒక గొప్ప వినోద అనుభవం లభించనుంది. మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, డోనాల్డ్ డక్, గూఫీ వంటి ప్రసిద్ధ కార్టూన్ పాత్రలను ప్రత్యక్షంగా చూసే అవకాశంతో పాటు, థ్రిల్లింగ్ రైడ్లను ఆస్వాదించే అవకాశం కల్పించేందుకు కొత్త థీమ్ పార్క్ ఏర్పాటు కానుంది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్) గ్రోత్ హబ్’ప్రాజెక్టులో భాగంగా నవీ ముంబైలో 200 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక భారీ థీమ్ పార్క్ నిర్మాణం కోసం ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీఏ) ప్రణాళికలు రూపొందించింది. ఎంఎంఆర్‌లో పర్యాటక వృద్ధి కోసం... పరిశ్రమ, పర్యాటకం, విద్య, మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, ఆరోగ్యం, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఎంఎంఆర్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెమ్మార్డీయే గ్రోత్ హబ్ ప్రాజెక్టుకింద పలు ప్రణాళికలను రూపొందించింది.ఇందులో భాగంగా పర్యాటక కేంద్రంగా అలీబాగ్ అభివృద్ధి, ముంబైలోని చారిత్రక కోటల పరిరక్షణతో పాటు దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు నవీ ముంబైలో డిస్నీల్యాండ్ తరహాలో భారీ థీమ్ పార్క్‌ను నిరి్మంచాలని ప్రతిపాదించింది.ఇదీ చదవండి: వరుడి ముద్దు : రెడ్ లెహెంగాలో సిగ్గుల మొగ్గైన పెళ్లికూతురుమొదటిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో... ప్రస్తుతం ముంబై, నవీ ముంబై, థానేలతో పాటు ఎంఎంఆర్ పరిధిలో అనేక రిసార్టులు, థీమ్ పార్కులు, వాటర్ పార్కులు ఉన్నాయి. అయితే మొట్టమొదటి సారిగా ప్రభుత్వం, ఎమ్మెమ్మార్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రిసార్టులు, యానిమేషన్ స్టూడియోలు, రైడ్ జోన్లు, వాటర్ పార్క్, ఇతర ఆధు నిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ థీమ్ పార్కు రాష్ట్ర పర్యాటక రంగంలో పెద్ద మైలురాయి కాగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. (BirdFlu భయమేల చికెన్‌ను తలదన్నే గింజలు గుప్పెడు చాలు) -
చేతులు మారిన కంపెనీలు.. ఈ ఏడాది బిగ్ డీల్స్ ఇవే..
ఈ కేలండర్ ఏడాది(2024)లో మీడియా, సిమెంట్, ఎయిర్‌లైన్స్ తదితర రంగాలలో భారీ కొనుగోళ్లు, విలీనాలు జరిగాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్– డిస్నీ ఇండియా (Reliance-Disney) డీల్తోపాటు.. ఎయిర్ ఇండియా (Air India Deal), విస్తారా విలీనం, అదార్ పూనావాలా– థర్మ ప్రొడక్షన్స్ డీల్, భారత్ సీరమ్స్‌ను సొంతం చేసుకున్న మ్యాన్‌కైండ్ ఫార్మా, అంబుజా సిమెంట్స్ చేతికి పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ తదితరాలు చేరాయి. వివరాలు ఇలా..భారీ మీడియా సంస్థగా డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన మీడియా సంస్థలు, గ్లోబల్ దిగ్గజం వాల్ట్ డిస్నీకి చెందిన దేశీ విభాగంతో రూ. 70,000 కోట్ల విలువైన విలీనానికి తెరతీశాయి. తద్వారా గ్లోబల్ మీడియా సంస్థ ఆవిర్భావానికి ఊపిరిపోశాయి. వెరసి 2024 నవంబర్ 14కల్లా భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేశాయి. దీనిలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 16.34 శాతం, వయాకామ్18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు లభించాయి.టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్ 2022లో ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను చేజిక్కించుకున్న టాటా గ్రూప్ దిగ్గజం విస్తారాను విలీనం చేసుకుంది. 2024 అక్టోబర్‌లో ఏఐఎక్స్ కనెక్ట్‌తో చౌక టికెట్ ధరల ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను విలీనం చేసిన తదుపరి విస్తారాతో ఎయిర్ ఇండియాను మరింత విస్తరించింది. వెరసి ప్రస్తుతం ఎయిర్ ఇండియా 5,600 వీక్లీ విమానాలతో 90కుపైగా ప్రాంతాలను కలుపుతూ సర్వీసులు అందిస్తోంది. విలీనంలో భాగంగా కొత్త సంస్థలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ 25.1 శాతం వాటాను పొందింది.వ్యాక్సిన్ల సంస్థ మీడియావైపు వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో అదార్ పూనావాలా బాలీవుడ్ డైరెక్టర్ కరణ్ జోహార్‌కు చెందిన థర్మ ప్రొడక్షన్స్ అండ్ థర్మాటిక్ ఎంటర్టైన్మెంట్పై దృష్టి పెట్టారు. వెరసి పూనావాలా 50 శాతం వాటా దక్కించుకోగా.. కరణ్ జోహార్ వాటా 50 శాతంగా కొనసాగుతోంది. కరణ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫార్మా చేతికి వ్యాక్సిన్లు హెల్త్‌కేర్ రంగ లిస్టెడ్ కంపెనీ మ్యాన్‌కైండ్ ఫార్మా వ్యాక్సిన్ల తయారీ దిగ్గజం భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్‌తో డీల్ కుదుర్చుకుంది. భారత్ సీరమ్స్‌ను రూ. 13,768 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా మహిళా ఆరోగ్య పరిరక్షణ, ఫెర్టిలిటీ ఔషధాలలోనూ కార్యకలాపాలు విస్తరించేందుకు మ్యాన్‌కైండ్ ఫార్మాకు తోడ్పాటునిచ్చింది.సిమెంటింగ్ డీల్ డైవర్సిఫైడ్ గ్రూప్ అదానీ సంస్థకు చెందిన అంబుజా సిమెంట్స్ విస్తరణపై కన్నేసింది. దీనిలో భాగంగా పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్‌ను రూ. 10,422 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా 2024 ఆగస్ట్ 16కల్లా పెన్నా సిమెంట్‌ను పూర్తి అనుబంధ కంపెనీగా మార్చుకుంది. మరోవైపు ఓరియంట్ సిమెంట్‌లో దాదాపు 47 శాతం వాటాను 45.1 కోట్ల డాలర్ల(రూ. 3,800 కోట్లు)కు కొనుగోలు చేసే బాటలో సాగుతోంది. విస్తరణలో భాగంగా దక్షిణాది మార్కెట్లో విస్తరించే ప్రణాళికల్లో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్.. ఇండియా సిమెంట్స్‌పై గురి పెట్టింది. తొలుత 23 శాతం వాటాను సొంతం చేసుకున్న అల్ట్రాటెక్ తదుపరి ప్రమోటర్ల నుంచి మరో 32.72 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు దాదాపు రూ. 4,000 కోట్లవరకూ వెచ్చించింది. దీంతో ఇండియా సిమెంట్స్‌లో వాటాను 55 శాతానికి చేర్చుకుంది. ఈ బాటలో తాజాగా ఓరియంట్ సిమెంట్‌లో 8.69 శాతం వాటాను రూ. 851 కోట్లకు చేజిక్కించుకుంది. -
ఓటీటీకి అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పాయల్ కపాడియా తెరకెక్కించిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో టాలీవుడ్ హీరో– నిర్మాత రానా స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేసింది.ముంబయిలోని ఇద్దరు మలయాళీ నర్సుల స్టోరీనే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రిలీజ్‌కు ముందే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులను సాధించింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్- 2024లో గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో ఏకంగా రెండు విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడు (మోషన్ పిక్చర్), బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్ విభాగాల్లో నామినేషన్స్ సాధించింది.తాజాగా ఈ అవార్డ్ విన్నింగ్ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. వచ్చేనెల జనవరి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ స్ట్రీమింగ్ కానుంది. చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Disney+ Hotstar (@disneyplushotstar) -
'హరి కథ: సంభవామి యుగే యుగే' ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు (స్టార్‌కి చెందిన డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా.. -
హాట్‌స్టార్‌లో జియో సినిమా విలీనం!
రిలయన్స్, డిస్నీ విలీనం తర్వాత ఏర్పడిన జాయింట్ వెంచర్ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో జియో సినిమాను విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను 'జియో హాట్‌స్టార్'గా పిలువనున్నట్లు సమాచారం.విలీనం పూర్తయితే.. ఐపీఎల్ 2025తో సహా అన్ని క్రికెట్ మ్యాచ్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్లు జియో సినిమాలో అందుబాటులో ఉండవు. కంపెనీ అన్ని స్పోర్ట్స్ ఈవెంట్లను డిస్నీ+ హాట్‌స్టార్‌కి మార్చాలని యోచిస్తోంది. ఐపీఎల్ సహా భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌ల డిజిటల్ హక్కులను జియో సినిమా కలిగి ఉంది. డిస్నీ +హాట్‌స్టార్ అన్ని ఐసీసీ టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉంది. అయితే ఇకపై అన్ని మ్యాచ్‌లను జియో హాట్‌స్టార్‌లో చూడవచ్చు. దీనికి సంబంధించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం విడుదల చేయలేదు.రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ ఇండియా విలీనం 2024 ఫిబ్రవరిలో జరిగింది. కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్లో 120 టీవీ ఛానెల్‌లు, జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ అనే రెండు స్ట్రీమింగ్ సర్వీస్‌లు ఉన్నాయి.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనిజానికి మొదట హాట్‌స్టార్‌నే.. జియో సినిమాలో విలీనం చేయనున్నట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ వంటి వాటికి వేరు వేరుగా ఓటీటీలు ఉంటే బాగుంటుందని.. జియో సినిమానే డిస్నీ+హాట్‌స్టార్‌లో విలీనం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గూగుల్ ప్లే స్టోర్‌లో జియో సినిమాకు 100 మిలియన్ డౌన్లోడ్స్, డిస్నీ+ హాట్‌స్టార్‌కు 500 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండూ కలిసిపోవడం చేత ఇది అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించనుంది. -
ఓటీటీ స్నాక్స్ ట్రెండింగ్..!
థియేటర్లో నచ్చిన స్నాక్స్ తింటూ ఫేవరెట్ మూవీని ఎంజాయ్ చేయడం కామన్! ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా దొరుకుతుండటంతో వినోదం ఇంట్లోనే మూడు సినిమాలు ఆరు వెబ్ సిరీస్‌లుగా వెలిగిపోతోంది. యువతరానికి ముఖ్యంగా జెన్ జెడ్‌కు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు బాగా కనెక్ట్ కావడంతో ఫుడ్, స్నాక్స్ బ్రాండ్లు దీన్ని ఒక సరికొత్త వ్యాపారావకాశంగా మార్చుకుంటున్నాయి. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ–హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 తదితర ఓటీటీ దిగ్గజాలతో జట్టుకట్టి సరికొత్త కో–బ్రాండెడ్ ప్యాక్‌లతో పాప్‌కార్న్ నుంచి ఐస్‌క్రీమ్ వరకూ అన్నింటినీ ప్రత్యేకంగా చేతికందిస్తున్నాయి.ఓటీటీ స్ట్రీమింగ్ దుమ్మురేపుతుండటంతో స్నాక్స్, పుడ్ బ్రాండ్స్ దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నాయి. తాజాగా ప్రీమియం పాప్‌కార్న్ బ్రాండ్ 4700బీసీ ప్రత్యేకంగా ఓటీటీ యూజర్ల కోసం కో–బ్రాండెడ్ ప్యాక్‌లను ప్రవేశపెట్టేందుకు నెట్‌ఫ్లిక్స్‌తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిని ఈ–కామర్స్, క్విక్ కామర్స్‌తో పాటు రిటైల్ స్టోర్లలోనూ అందుబాటులోకి తెస్తోంది. ‘ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మునిగితేలే జెన్ జెడ్ కుర్రకారును టార్గెట్ చేసేందుకు ఇది సరైన మార్గం’ అని 4700బీసీ ఫౌండర్, సీఈవో చిరాగ్ గుప్తా చెబుతున్నారు. ఇదొక్కటేకాదు కిట్‌క్యాట్, కారి్నటోస్, ప్రింగిల్స్, కోకాకోలా, ఓరియో, థమ్సప్‌తో పాటు సఫోలా మసాలా ఓట్స్ తదితర స్నాక్స్ బ్రాండ్స్ సైతం సేల్స్ పెంచుకోవడం కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో జట్టుకట్టిన వాటిలో ఉన్నాయి.అల్టీమేట్ ‘బ్రేక్’.. వినోదంతో పాటు రుచికరమైన మంచింగ్ కూడా ఉంటే ‘ఆహా’ అదిరిపోతుంది కదూ! అందుకే నెస్లే తన కిట్ క్యాట్ చాక్లెట్లను ఓటీటీ యూజర్ల చెంతకు చేర్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ‘సబ్స్క్రిప్షన్’ తీసుకుంది. ‘అల్టీ మేట్ బ్రేక్’ పేరుతో కో–బ్రాండెడ్ ప్రచారానికి తెరతీసింది. తద్వారా ప్రత్యేక ఓటీటీ కిట్‌క్యాట్ ప్యాక్‌లను విడుదల చేయడంతో పాటు నెట్‌ఫ్లిక్స్ షోలు.. స్క్విడ్ గేమ్, కోటా ఫ్యాక్టరీతో జతకట్టింది. గిఫ్టింగ్ సంస్థ అల్యూరింగ్ బాస్కెట్ అయితే ప్రింగిల్స్, కిట్‌క్యాట్, కోకాకోలాతో కూడిన బండిల్డ్ ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ’నెట్‌ఫ్లిక్స్ – చిల్’, ‘జస్ట్ వన్ మోర్ ఎపిసోడ్’ పేరుతో ఓటీటీ లవర్స్ కోసం వీటిని విక్రయిస్తోంది.ఓటీటీ వినోదంతో పాటు స్నాక్స్‌ను ప్రమోట్ చేసే విధంగా బీన్ ట్రీ ఫుడ్స్ కూడా ప్రత్యేక ప్యాక్‌లను అందిస్తోంది. ఇక మాండెలెజ్ కుకీ బ్రాండ్ ఓరియో నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘స్ట్రేంజర్ థింగ్స్’తో జట్టుకట్టడం ద్వారా ఓరియో రెడ్ వెల్వెట్‌ను ప్రవేశపెట్టేలా ఒప్పందం కుదుర్చుకుంది. కోకాకోలా థమ్సప్.. డిస్నీ–హాట్‌స్టార్‌తో కలిసి ‘థమ్సప్ ఫ్యాన్ పల్స్’ ప్రచారం నిర్వహిస్తుండగా.. మారికో తన సఫోలా మసాలా ఓట్స్ కో–బ్రాండెడ్ ప్యాక్స్ విక్రయానికి జీ5తో డీల్ కుదుర్చుకుంది.’స్నాక్స్ బ్రాండ్ల అమ్మకాల ఆధారంగా లాభాల పంపకం లేదా సంస్థలు ఒకరికొకరు తమ యాడ్లలో ప్రచారం కల్పించుకోవడం, లేదా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేరుగా లింక్‌లను ఇవ్వడం ద్వారా స్నాక్స్ బ్రాండ్లు తమ ఉత్పత్తులను విక్రయించడం వంటి మార్గాల్లో డీల్స్ కుదురుతున్నాయి’ అని ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. ‘కంటెంట్‌ను చూస్తూ, నచి్చన స్నాక్స్ తినే అలవాటు ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. ప్రత్యేకంగా ఓటీటీ యూజర్లను దృష్టిలో పెట్టుకుని 4700బీసీ ఇతర బ్రాండ్లతో జట్టుకట్టాం’ అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా మార్కెటింగ్ పార్ట్నర్షిప్స్ హెడ్ పూరి్ణమ శర్మ చెప్పారు. ఓటీటీ జోరు.. ఫుడ్ ఆర్డర్ల తోడు! దేశంలో కరోనా కాలంలో బంపర్ హిట్ కొట్టిన ఓటీటీ స్ట్రీమింగ్.. ముఖ్యంగా యువత, మహిళలకు బాగా చేరువైంది. కోరుకున్న కంటెంట్ కుప్పలుతెప్పలుగా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ’బాక్సాఫీస్’ కళకళలాడిపోతోంది. గతేడాది 70.7 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఓటీటీ స్ట్రీమింగ్ ద్వారా కంటెంట్‌ను చూసినట్లు ఇంటర్నెట్ ఇన్ ఇండియా–2023 నివేదిక అంచనా వేసింది. మరోపక్క, ఈ వీడియో ఆన్ డిమాండ్ సబ్‌్రస్కిప్షన్ మార్కెట్ 2027 నాటికి 2.77 బిలియన్ డాలర్లకు ఎగబాకనున్నట్లు లెక్కగట్టింది.ఇదిలా ఉంటే, రెడీ–టు–ఈట్ లేదా రెడీ–టు–కుక్ ఆహారోత్పత్తుల వృద్ధికి తోడు డైరెక్ట్ టు కన్జూమర్ బ్రాండ్స్‌తో స్నాక్స్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ విస్తరణ జోరుతో చిన్న పట్టణాల్లోనూ స్నాక్న్ బ్రాండ్స్ రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధిస్తున్నాయి. 2023లో దాదాపు రూ.43,000 కోట్లుగా ఉన్న భారతీయ స్నాక్స్ మార్కెట్ 2032 నాటికి రూ.95,000 కోట్లకు పైగా ఎగబాకుతుందనేది మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐమార్క్ గ్రూప్ అంచనా. – సాక్షి, బిజినెస్ డెస్క్ఫుల్ చిల్!70.7 కోట్లు: గతేడాది ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఉపయోగించుకున్న ఇంటర్నెట్ యూజర్లు2.77 బిలియన్ డాలర్లు: 2027 నాటికి వీడియో ఆన్ డిమాండ్ సబ్ర్స్కిప్షన్ మార్కెట్ వృద్ధి అంచనా.రూ. 95,520 కోట్లు: 2032 నాటికి భారతీయ స్నాక్స్ మార్కెట్ పెరుగుదల అంచనా. -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఈ వారం 21 చిత్రాలు స్ట్రీమింగ్!
ఈ వారం దసరా సందడి మొదలైపోయింది. దేవి నవరాత్రుల ఉత్సవాలతో అంతా బిజీగా ఉన్నారు. ఇక సినీ ప్రియులను అలరించేందుకు చిత్రాలు రెడీగా ఉన్నాయి. ఈ పండుగకు థియేటర్లలో సందడి చేసేందుకు రజినీకాంత్ వెట్టైయాన్, సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో, సుహాస్ జనక అయితే గనక, గోపిచంద్ విశ్వం లాంటి సినిమాలు ఈ దసరాకు సినీ ప్రేక్షకులను అలరించనున్నాయి.ఇక అంతా పండుగ మూడ్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు ఇంట్లోనే చూడాలనుకుంటారు. అలాంటి వారికోసం ఓటీటీల్లోనూ అలరించేందుకు చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు లేకపోయినా.. కాస్తా చూడాలనిపించేవైతే ఉన్నాయి. వాటిలో ఇటీవల హిట్‌గా నిలిచిన శ్రద్ధాకపూర్ స్త్రీ-2, అక్షయ్‌కుమార్ సర్ఫీరా, సుహాస్ గొర్రెపురాణం, అమలాపాల్ లెవెల్ క్రాస్ లాంటి చిత్రాలు కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. మరి ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో చూసేయండి.నెట్‌ఫ్లిక్స్‌ది మెహండెజ్ బ్రదర్స్(క్రైమ్ డాక్యుమెంటరీ)- అక్టోబర్ 07యంగ్ షెల్డన్ (ఇంగ్లీష్) అక్టోబరు 8ఖేల్ ఖేల్ మే(హిందీ సినిమా)- అక్టోబర్ 09స్టార్టింగ్ 5(వెబ్ సిరీస్)- అక్టోబర్ 09గర్ల్ హాంట్స్ బాయ్- అక్టోబర్ 10మాన్స్టర్ హై 2 (ఇంగ్లీష్) అక్టోబరు 10ఔటర్ బ్యాంక్స్ సీజన్-4 పార్ట్-1(వెబ్ సిరీస్)- అక్టోబర్ 10టాంబ్ రైడర్: ది లెజెండ్ ఆఫ్ లారా క్రాఫ్ట్(యానిమేటేడ్ సిరీస్)- అక్టోబర్ 10లోన్‌లి ప్లానెట్- అక్టోబర్ 11అప్ రైజింగ్ (కొరియన్ సిరీస్) -అక్టోబర్ 11ది గ్రేట్ ఇండియన్ కపిల్ (టాక్ షో) -అక్టోబర్ 12 సోనీ లివ్జై మహేంద్రన్ (మలయాళం)-అక్టోబర్ 11రాత్ జవాన్ హై- (హిందీ వెబ్ సిరీస్)- అక్టోబర్ 11 డిస్నీ ప్లస్ హాట్స్టార్సర్ఫీరా(బాలీవుడ్ సినిమా)- అక్టోబర్ 11వారై (తమిళ సినిమా)- అక్టోబర్ 11 అమెజాన్ ప్రైమ్ వీడియోసిటాడెల్: డయానా- అక్టోబర్ 10 జియో సినిమాగుటర్ గూ (హిందీ)- అక్టోబర్ 11టీకప్ (హాలీవుడ్)- అక్టోబర్ 11 యాపిల్ టీవీ ప్లస్డిస్క్లైమర్- అక్టోబర్ 11 ఆహాలెవెల్ క్రాస్- (మలయాళ సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్)గొర్రె పురాణం-(తెలుగు సినిమా)- అక్టోబర్ 11(రూమర్ డేట్) -
సింగపూర్ నుంచి డిస్నీ క్రూయిజ్ లైన్
సింగపూర్‌ను చుట్టే పర్యాటక ప్రేమికులకు ఆసక్తికరమైన వార్త ఇది.. కుటుంబ సమేతంగా వినోదం అందించేందుకు వీలుగా సింగపూర్ నుంచి డిస్నీ క్రూయిజ్ లైన్ నౌకను అందుబాటులోకి తేనున్నట్టు డిస్నీ అడ్వెంచర్ ప్రతినిధులు తెలిపారు. ఈ నౌక ఆసియాలోని పోర్ట్ ల్యాండ్ నుంచి బయలుదేరుతుందని, మూడున్నర రాత్రులు నౌకా ప్రయాణంలో ఉది్వగ్న భరితమైన వినోదం లభిస్తుందన్నారు.. తొలిసారి ఈ డిస్నీ షిప్‌ను ఆసియాలో ప్రవేశపెడుతున్నామన్నారు. -
ఓటీటీకి సలార్ నటుడి బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇటీవల కాలంలో ఓటీటీలే సినీ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వచ్చాక భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు థియేటర్లు మాత్రమే కాదు.. ఓటీటీలోనూ దూసుకెళ్తున్నాయి. మరి ముఖ్యంగా మలయాళ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. అందుకే అక్కడ హిట్ అయిన చిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు.అందుకే మలయాళంలో హిట్ అయిన చిత్రాలు దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తాజాగా మరో బ్లాక్‌బస్టర్ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించిన కామెడీ చిత్రం గురువాయుర్ అంబలనాదయిల్ స్ట్రీమింగ్కు వచ్చేస్తోంది. ఈనెల 27 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓవర్సీస్ అభిమానుల కోసం సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.కాగా.. ఈ ఏడాది మే 16న మలయాళంలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ.90 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 27న మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాను విపిన్ దాస్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో బసిల్ జోసెఫ్, రేఖ, నిఖిలా విమల్, అనస్వర రాజన్, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటించారు. #GuruvayoorAmbalaNadayil Will Be Streaming From June 27 On @DisneyPlusHS @PrithviOfficial @basiljoseph25#PrithvirajSukumaran pic.twitter.com/aJssR3jqG2— Shaham (@SHAHAMMUHAMMED1) June 24, 2024 -
తెలుగు వెబ్‌సిరీస్ తొలగించాలని కోర్టులో పిటిషన్
పాకెట్ఎఫ్ఎం సంస్థ తన ఆడియో సిరీస్ కాపీరైట్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ ఉల్లంఘించిందని ఆరోపిస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వెంటనే స్పందించి సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.పిటిషన్‌లోని వివరాల ప్రకారం..ఆన్లైన్ ఆడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ఎఫ్ఎం తన ఆడియో సిరీస్ 'యక్షిణి'ని పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. దానికి సంబంధించిన పూర్తి కాపీరైట్ హక్కులు సంస్థ కలిగి ఉంది. ఇటీవల వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్ ‘యక్షిణి’ని పోలిఉండే వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది. పాకెట్ఎఫ్ఎం వెంటనే దాన్ని సదరు ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించాలని కోరుతూ జూన్ 11న దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.ఇదిలాఉండగా, జూన్ 14 నుంచి ఈ తెలుగు వెబ్‌సిరీస్ ప్రారంభం కాబోతుందని డిస్నీ+ హాట్‌స్టార్ ప్రకటించింది. దాంతో పాకెట్ఎఫ్ఎం డిస్నీ+ హాట్‌స్టార్ మాతృసంస్థ అయిన నోవీ డిజిటల్ ఎంటర్టైన్మెంట్పై కోర్టులో దావా వేసింది. వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను తొలగించేలా సంస్థను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించింది.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్‌లు పంపాలా..?ఈ వ్యాజ్యం గురువారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై డిస్నీ+ హాట్‌స్టార్ తన ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మే 2021 నుంచి పాకెట్ఎఫ్ఎం ప్లాట్ఫామ్లో ‘యక్షిణి’ ఆడియో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. -
ఓటీటీకి వచ్చేస్తోన్న తమన్నా హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అరణ్మైనై-4. ఈ సినిమాను తెలుగులో బాక్ పేరుతో విడుదల చేశారు. సుందర్ సి స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాను ఖుష్బూ సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. గత నెల మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. తమిళంలో విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ 'అరణ్మనై 4' నుంచి వచ్చిన 4వ చిత్రంగా నిలిచింది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ ఏడాదిలో రూ. 100 కోట్లు కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ సినిమా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, కోవై సరళ కీలక పాత్రలు పోషించారు.Oru semma Family entertainer!Aranmanai 4 Streaming From June 21 On Disney +Hotstar#Aranmanai4 #StreamingFromJune21 #DisneyplusHotstar #Disneyplushotstartamil pic.twitter.com/9rz8wBBqNx— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) June 5, 2024 -
Disney India: రిలయన్స్ చేతికే డిస్నీ..
భారత వ్యాపార ప్రపంచంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయోకామ్ మీడియా- వాల్ట్ డిస్నీల మధ్య విలీన ఒప్పందం జరిగింది. తర్వలోనే రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ వెంచర్లో రిలయన్స్ మీడియా యూనిట్ దాని అనుబంధ సంస్థలు విలీన సంస్థలో కనీసం 61 శాతం వాటాను కలిగి ఉండగా... మిగిలిన వాటా డిస్నీదేనని తెలుస్తోంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా, వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నాయి. ఈ ఒప్పందానికి నియత్రణ సంస్థలు, వాటాదారుల నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. ఈ ఏడాది చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభం నాటికి విలీన ప్రక్రియ ముగియనుంది. విలీనానంతర స్టార్ ఇండియా నుంచి ఎనిమిది భాషల్లో 70 ఛానళ్లు, రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 నుంచి 38 ఛానళ్లు కలిపి మొత్తం 120 టెలివిజన్ ఛానళ్లు ఒకే గొడుకు కిందకు రానున్నాయి. ఇవి కాకుండా డిస్నీ హాట్‌స్టార్, జియోసినిమా పేరుతో రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉండనున్నాయి. -
‘జీ’కి మరో ఎదురు దెబ్బ.. న్యాయ పోరాటం చేయనున్న సోనీ
భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ ప్రసారాల విషయంలో జీ - డిస్నీ హాట్ స్టార్ మధ్య 1.4 బిలియన్ల డాలర్ల సబ్ లైసెన్సింగ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి జీ బయటకు వచ్చింది. దీంతో న్యాయ పోరాటం చేసేందుకు డిస్నీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే డిస్నీ మాతృసంస్థ సోనీ గ్రూప్ సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంలో దావా వేసింది. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించినందుకు సోనీకి తొలి విడతగా జీ గ్రూప్ 200 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లించడంలో జీ విఫలమైంది.ఒప్పందాన్ని కొనసాగించలేమని తెలిపింది. దీంతో జీపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సోనీ గ్రూప్ ఉపక్రమించింది. కాగా, ఈ పరిణామాలపై జీ గ్రూప్, సోనీ గ్రూప్‌లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఇరవై సార్లు పెళ్లి చేసుకున్నా: అవికా గోర్
‘‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్ మొదలుకొని ఇప్పటివరకూ నేను ఆన్ స్క్రీన్‌పై కనీసం ఇరవై సార్లు పెళ్లి చేసుకుని ఉంటా. అయితే ఇది బోర్ కొట్టలేదు. పెళ్లి కూతురిలా ముస్తాబవడం నాకు చాలా ఇష్టం. మరోసారి ‘వధువు’లో పెళ్లి కూతురిగా నటించాను. థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సిరీస్ ఆసక్తిగా సాగుతుంది’’ అని హీరోయిన్ అవికా గోర్ అన్నారు. నందు, అలీ రెజా, అవికా గోర్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘వధువు’. పోలూరు కృష్ణ దర్శకత్వంలో శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించిన ‘వధువు’ ఈ నెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా అవికా గోర్ మాట్లాడుతూ–‘‘బెంగాలీ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇందు’ను తెలుగులోకి ‘వధువు’గా తీసుకొస్తున్నాం. ఇలాంటి స్క్రిప్ట్‌లో నేను ఇప్పటిదాకా నటించలేదు. నాకు టీవీ సీరియల్స్ చేసిన అనుభవం ఉంది. బుల్లితెర ప్రేక్షకులకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో.. అది ‘వధువు’లో ఉంటుంది. ఇక చిన్నప్పుడే నటిగా మారడం వల్ల నా పర్సనల్ లైఫ్‌కు టైమ్ కోల్పోయినా... నటిగా నేను ప్రతి రోజూ ఒక కొత్త పాత్రలో కనిపించగలుగుతున్నాను.. ప్రతి రోజూ ఒక కొత్త లైఫ్ చూస్తున్నాను. నిర్మాతగా ‘పాప్ కార్న్’ సినిమా తీయడం గర్వంగా ఉంది. ఎలాంటి హంగామా లేకుండా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నా పెళ్లి చేసుకోవాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా రూపొందుతున్న ఒక సినిమా చేస్తున్నా. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను’’ అన్నారు. -
ప్రపంచకప్ క్రికెట్‌ను ఎంతమంది చూశారంటే..
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ చాలాఎక్కువ. గల్లీలో క్రికెట్ ఆడే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఇండియా మ్యాచ్ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతారు. అదీ ఫైనల్ మ్యాచ్ అంటే మరీ ఎక్కువ. అందులోనూ వరల్డ్‌కప్ ఫైనల్స్ అంటే చెప్పనక్కర్లేదు. ఇటీవల ఉత్కంఠభరితంగా జరిగిన తుదిపోరులో భారత ఆటగాళ్లు పరాజయం పొందిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు రికార్డుస్థాయిలో ఈసారి వరల్డ్‌కప్ టోర్నమెంట్‌ను వీక్షించినట్లు తెలిసింది. ఏకంగా 51.8 కోట్ల మంది భారతీయులు ఇటీవల జరిగిన ప్రపంచకప్ టోర్నమెంట్‌ను తిలకించినట్లు డిస్నీ సంస్థ తెలిపింది. ఐసీసీ ఆధ్యర్యంలో 48 రోజుల పాటు జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది భారతీయులు వీక్షించారని డిస్నీ చెప్పింది. హాట్‌స్టార్ స్ట్రీమింగ్ యాప్ ద్వారా 5.9 కోట్ల మంది ఫైనల్ మ్యాచ్‌ను చూసి రికార్డు నెలకొల్పినట్లు కంపెనీ వివరించింది. 2024 నుంచి 2027 వరకు భారతదేశంలో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్లను ప్రసారం చేయడానికి దాదాపు రూ.25 వేల కోట్లు చెల్లించి డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను కంపెనీ కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇదీ చదవండి: 15 ఏళ్ల బాలుడు.. రూ.100 కోట్ల కంపెనీ.. ఎలా సాధ్యమైందంటే.. పన్నెండేళ్ల తర్వాత భారత్‌లో ఆడిన ఐసీసీ ఫైనల్ టోర్నమెంట్‌ను 51.8 కోట్ల మంది చూసినట్లు బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రిసెర్చ్ కౌన్సిల్ ఇండియా(బీఏఆర్సీ) నిర్ధారించింది. దాదాపు 42,200 కోట్ల నిమిషాల టీవీ స్క్రీన్ టైం నమోదైందని బీఏఆర్సీ తెలిపింది. కేవలం భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను 13 కోట్ల మంది, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను 8 కోట్ల మంది, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను 7.5 కోట్ల మంది వీక్షించారని వివరించింది. -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
Disney: డిస్నీ కొనుగోలుకు బ్లాక్‌స్టోన్‌తో చర్చలు!
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్.. భారతదేశంలోని వాల్ట్‌డిస్నీ స్ట్రీమింగ్, టెలివిజన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వాల్ట్ డిస్నీ ఇండియాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్అంబానీతోపాటు ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయితే భారత మార్కెట్‌పై ఆసక్తి ఉన్న బ్లాక్‌స్టోన్.. డిస్నీ కొనుగోలుకు సిద్ధం అవుతుదని నివేదిక తెలుపుతుంది. ఒకవేళ బ్లాక్‌స్టోన్‌తో ఈ ఒప్పందం కుదరకపోయినా డిస్నీ భారతదేశంలో తన డిజిటల్, టీవీ వ్యాపారాన్ని విక్రయించడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. ఇంకా బ్లాక్‌స్టోన్, డిస్నీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. డిస్నీ సబ్‌స్క్రైబర్ అట్రిషన్‌ను ప్రభావం చేసేలా ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉచిత క్రికెట్ కంటెంట్‌ను అందించడంతో ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలని యోచిస్తుంది. -
వరల్డ్ కప్ వీక్షకులకు వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్లు!
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ వీక్షకుల కోసం వొడాఫోన్ ఐడియా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ప్రపంచ కప్ సీజన్లో అదనపు డేటా, లాంగ్ వాలిడిటీ రీఛార్జ్‌లపై ఇన్స్టంట్ డిస్కౌంట్లు, మరిన్నింటితో సహా కొత్త ఆఫర్లను ప్రారంభించింది. ఇవి వొడాఫోన్ ఐడియా (Vi) యాప్‌లో అందుబాటులో ఉంటాయి . డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్ రూ. 839 హీరో అన్లిమిటెడ్ ప్యాక్‌తోపాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్కిప్షన్‌ను 3 నెలలపాటు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. డబుల్ డేటా ఆఫర్లలో భాగంగా, వీఐ రూ. 181 డేటా ప్యాక్‌పై డబుల్ డేటా ఆఫర్‌ను అందిస్తోంది. ఇందులో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రోజూ 2 జీబీ (1GB+1GB) డేటా లభిస్తుంది. ఇక రూ. 418 డేటా ప్యాక్‌పై రూ. 30 తగ్గింపును అందిస్తోంది. ఇందులో 56 రోజుల పాటు 100 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. వీఐ యాప్‌లో కూపన్ కోడ్ల ద్వారా, వెబ్ పోర్టల్‌లో ఫ్యాన్కోడ్ల ద్వారా దీర్ఘకాలిక వాలిడిటీ రీఛార్జ్‌లపై రూ. 75 వరకు తక్షణ తగ్గింపుతోపాటు రూ.999 ప్లాన్‌పై 30 శాతం తగ్గింపును కస్టమర్లకు అందిస్తోంది. కాగా ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా క్రికెట్ వరల్డ్ కప్ లక్ష్యంగా తమ కస్టమర్లకు ప్రత్యేక డేటా ప్యాక్‌లు, ప్లాన్లను ప్రారంభించాయి. -
దెబ్బ మీద దెబ్బ : అమ్మకానికి డిస్నీ.. కొనుగోలు రేసులో ఎవరెవరున్నారంటే?
అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా దిగ్గజం ది వాల్ట్ డిస్నీ కంపెనీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో వాల్ట్ డిస్నీకి సంబంధించిన ఆస్తుల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు పలునివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగా బిలియనీర్ గౌతమ్ అదానీ, మీడియా మొఘల్, సన్ నెట్ గ్రూప్ అధినేత కళా నిధి మారన్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత్‌లో నిర్వహించే కార్యకలాపాలలో కొంత భాగాన్ని విక్రయించడం లేదా, స్పోర్ట్స్ రైట్స్, లోకల్ స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో సహా ఇతర ఆస్తుల్ని కలిపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తేలింది. ముఖేష్ అంబానీతో చర్చలు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ సైతం ఆస్తుల అమ్మే అంశంపై చర్చలు ఇప్పటికే జరిగాయని బ్లూమ్‌బెర్గ్ గతంలో నివేదించింది. తద్వారా భారత్‌లో డిస్నీ తన వ్యాపారాన్ని అమ్మేడం లేదంటే జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఐపీఎల్ దెబ్బ.. ఆపై హెచ్‌బీఓ కాంట్రాక్ట్ సైతం జూలైలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ స్ట్రీమింగ్ హక్కులను వయాకామ్ 18 మీడియా దక్కించుకున్న తరువాత ఆస్తుల అమ్మకం తెరపైకి వచ్చింది. దీనికితోడు వార్నర్ బ్రదర్స్‌కు చెందిన హెచ్‌బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు. దీంతో ఆస్తుల్ని అమ్మేందుకు మొగ్గుచూపింది. అదానీ వర్సెస్ మారన్ ఆస్తులు,స్టాక్స్‌ను కొనుగోలు చేసేందుకు కళానిధి మారన్ సుమఖత వ్యక్తం చేస్తుండగా.. అదానీ సైతం తన మీడియా సంస్థ న్యూ ఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్‌ను (ఎన్డీటీవీ)ని విస్తరించడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, క్రయ,విక్రయ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటనలు వెలుగులోకి రాలేదు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. చదవండి👉 అప్పుడు ‘మెగాస్టారే’, ఇప్పుడు కరువైన పలకరింపులు.. జీవితం భారమై.. -
ఇదే జరిగితే 'డిస్నీ ఇండియా' ముఖేష్ అంబానీ చేతికి!
Disney India: అమెరికన్ ఎంటర్టైన్మెంట్ సంస్థ 'డిస్నీ' (Disney) ఇండియన్ మార్కెట్లో తన వ్యాపారానికి సంబంధించిన ఒక సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే జరిగితే భారతదేశంలో డిస్నీ ఒక ప్రముఖ కంపెనీ సొంతమయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ముందు వరుసలో రిలయన్స్.. నివేదికల ప్రకారం.. డిస్నీ ఇండియాను ముఖేష్ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ కొనుగోలు చేయనున్నట్లు.. ఈ వరుసలో ఇదే ముందు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ డిస్నీని సొంతం చేసుకుంటే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశంలో సరైన కొనుగోలుదారు లభిస్తే.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్పోర్ట్స్ వంటి వాటిని ఒకేసారి విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ IPLకి సంబంధించి స్ట్రీమింగ్ రైట్స్ కోల్పోయింది. ఈ హక్కులను రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో భారతదేశంలో ఈ బిజినెస్ మరింత డెవలప్ చేయడానికి కంపెనీ అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇదీ చదవండి: వినాయక చవితి బిజినెస్ ఇన్ని కోట్లా? విగ్రహాల ఖర్చే.. డిస్నీ ఇండియా వ్యాపారానికి సమందించిన చర్చలు ఇప్పటికే జరుపుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. కాగా ఈ చర్చలు డీల్ వరకు వెళ్లే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించకపోవడం గమనార్హం. అంతే కాకుండా ప్రస్తుతం ఐపీఎల్ స్ట్రీమింగ్‌తో జియో టీవీకి సబ్స్క్రైబర్స్ సంఖ్య భారీగా పెరిగింది. ఈ సమయంలో డిస్నీ ఇండియాను రిలయన్స్ సొంతం చేసుకుంటే.. ఈ రంగంలో కూడా అగ్రగామిగా నిలిచే అవకాశం ఉంది. -
నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+ హాట్‌స్టార్ - అదే జరిగితే..
Disney Hotstar Limit Account Sharing: ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారతదేశంలో పాస్వర్డ్ షేరింగ్‌ను ముగించినట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో 'డిస్నీ+ హాట్‌స్టార్' (Disney+ Hotstar) కూడా ఇదే బాటలో పయనించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, డిస్నీ+ హాట్‌స్టార్ దాని ప్రీమియం వినియోగదారులలో పాస్వర్డ్ షేరింగ్‌ను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వినియోగదారులు కేవలం నాలుగు పరికరాల నుంచి మాత్రమే లాగిన్ చేయడానికి అనుమతించే కొత్త విధానాన్ని అమలు చేయాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే అమలులోకి వస్తే స్ట్రీమింగ్ దిగ్గజం పాస్వర్డ్ షేరింగ్ వినియోగదారులకు కష్టతరమవుతుంది. పాస్వర్డ్ షేరింగ్ విధానానికి నెట్‌ఫ్లిక్స్ మంగళం పాడింది. ఇప్పటికే 100 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అమలులో ఉంది. ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం డిస్నీ+ హాట్‌స్టార్ ద్వారా గరిష్టంగా 10 పరికరాలలో లాగిన్లను అనుమతిస్తుంది. కానీ దీనికి త్వరలోనే స్వస్తి చెప్పనుంది. కొత్త రూల్స్ ఈ ఏడాది చివరి నాటికి అమలయ్యే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: ఆలోచన చెప్పగానే అమ్మతో చీవాట్లు.. నేడు నెలకు రూ.4.5 కోట్లు టర్నోవర్!) కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారులు సొంత సభ్యత్వాన్ని పొందాల్సి ఉండవచ్చు. అయితే రానున్న కొత్త మార్పులు చౌకైన ప్లాన్లకు కూడా వర్తిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇప్పటికే అధిక ప్రజాదరణ పొందిన డిస్నీ+ హాట్‌స్టార్ 2022 మార్చి నుంచి 2023 మార్చి వరకు 38 శాతం వీక్షకులను కలిగి ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వినియోగదారుల మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుస్కోవడానికి ఇంకా కొంతకాలం వేచి ఉండాల్సిందే. -
కంటెంట్ సెన్సార్: ఓటీటీలకు కేంద్రం ప్రతిపాదన!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌లో అశ్లీలత, హింస లేకుండా కచ్చితంగా స్వీయ సెన్సార్ చేసుకోవాలని నెట్‌ఫ్లిక్స్, డిస్నీ వంటి స్ట్రీమింగ్ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. రాయిటర్స్ కథనం ప్రకారం.. కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ జూన్ 20న నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ఓటీటీ సంస్థలకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓటీటీ సంస్థలు కూడా తమ అభ్యంతరాలను తెలియజేశారు. ఫలితంగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీటింగ్ రికార్డ్స్, ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటీటీల్లో ప్రసారమవుతున్న అసభ్యకరమైన, అశ్లీల కంటెంట్‌పై ప్రజలు, పౌర సంఘాలు, ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ ఆయా స్ట్రీమింగ్ సంస్థల ముందుంచింది. వీటిలో ప్రసారయ్యే ప్రముఖ సినీ తారలు నటించిన కంటెంట్ కూడా అసభ్యకర, అశ్లీల, హింసను, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సంబంధించి సెన్సార్ పకడ్బంధీగా ఉంటుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డ్ విడుదల సినిమాలను చూసి సర్టిఫికెట్ జారీ చేస్తుంది. కానీ ఓటీటీలలో ప్రసారయ్యే కంటెంట్‌కు అలాంటి వ్యవస్థ లేదు. ఓటీటీ ప్రసారాలను సమీక్షించేందుకు గాను స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకునే విషయాన్ని ఆలోచించాలని మీటింగ్ సందర్భంగా శాఖ ప్రతినిధులు ఇండస్ట్రీ వర్గాలను కోరినట్లు తెలిసింది. కాగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సంస్థలు భారత్‌లో అత్యంత ఆదరణ సంపాదించుకున్నాయి. దేశ స్ట్రీమింగ్ మార్కెట్ 2027 నాటికి 7 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంటుందని అంచనా. ఇదీ చదవండి: సినీ ప్రేక్షకులకు గుడ్‌న్యూస్! సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన మల్టీప్లెక్స్! -
డిస్నీ క్యారెక్టర్లుగా హాలీవుడ్ సెలబ్రిటీస్ వైరల్ ఫొటోస్
-
డిస్నీ ఉద్యోగులకు మరో షాక్, మొత్తంగా 7 వేల మంది ఇంటికే!
సాక్షి, ముంబై: ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ మరోసారి ఉద్యోగులకు చేదువార్త చెప్పింది. మూడో రౌండ్ తొలగింపులను షురూ చేసింది. ఈ నిర్ణయం అంతటా 2,500 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఖర్చులను తగ్గించే చర్యలో భాగంగా, కంపెనీ ఈ వారం తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుండి డజన్ల కొద్దీ టైటిల్స్‌ను తొలగిస్తోంది. నివేదిక ప్రకారం, తీవ్రంగా దెబ్బతిన్న టెలివిజన్ విభాగం, రెండో రౌండ్ ఉద్యోగాల కోతకు నిర్ణయించింది. ఉద్యోగుల తొలగింపులు,ఇతర వ్యయ-తగ్గింపు చర్యల ద్వారా 5.5 బిలియన్ డాలర్లను ఆదా చేయాలనే ప్రణాళికలను ఫిబ్రవరిలో ప్రకటించింది. (వార్నీ.. రేఖలా మారిపోయిన అమితాబ్, అందంగా సల్మాన్ ఖాన్) 🚨 Disney Started 3rd Round of Layoffs, 2500 Employees Expected to Lose their Jobs Reliance’s JioMart also Fired 1000 Employees, More Layoffs In the Next Few Weeks Very Difficult Times for Affected Employees — Ravisutanjani (@Ravisutanjani) May 23, 2023 కాగా డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ మూడు రౌండ్ల తొలగింపులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి రౌండ్ లేఆఫ్స్ మార్చిలోనే షురూ అయ్యాయి. రెండో రౌండ్లో ఏప్రిల్‌లో 4వేల మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7,000 మంది కార్మికులకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబరు 1 నాటికి, డిస్నీకి 220,000 మంది ఉద్యోగులు ఉన్నారు . (ఫేస్బుక్ మెటాకు భారీ షాక్: ఏకంగా 10వేల కోట్ల జరిమానా) మరిన్ని ఇంట్రస్టింగ్ అప్డేట్స్, తాజా వార్తల కోసం చదవండి: సాక్షి,బిజినెస్ -
మరో నాలుగు రోజులే: ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!
సాక్షి,ముంబై: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ సంస్థ వాల్డ్ డిస్నీ 7వేల ఉద్యోగాలను తీసివేయనుంది. డిస్నీ ఎంటర్టైన్మెంట్, పార్క్స్ విభాగాల ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. 'రాబోయే నాలుగు రోజుల్లో' ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఈ మేరకు డిస్నీసీఈవో బాబ్ ఇగర్ మార్చి 27న ఉద్యోగులకు ఇమెయిల్‌లో తెలియజేశారు. 5.5 బిలియన్ డాలర్ల మేర ఖర్చుల ఆదా, స్ట్రీమింగ్ వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చడానికి తమ కంపెనీలోని 7 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సంస్థ సీఈవో బాబ్ ఇగర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవలి డిస్నీసబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అటు గత మూడు నెలల్లో డిస్నీ+కు ఒక శాతం కస్టమర్లు క్షీణించారు. దీనికి తోడు సంస్థ నష్టాలు కూడా పెరిగిపోవడంతో కొత్త నియామకాలను ఆపివేయడంతోపాటు 3.6 శాతం ఉద్యోగాలపై వేటు వేసేందుకు నిర్ణయించింది. JUST IN Disney $DIS CEO Bob Iger sent this email to Disney employees today letting them know the company has begun its round of 7000 layoffs announced in February pic.twitter.com/ZqV7Z3iqXA — StockMKTNewz - Evan (@StockMKTNewz) March 27, 2023 -
మేనేజర్లకు ఆదేశాలు..ఉద్యోగుల్లో క్షణ క్షణం.. భయం.. భయం!
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ దిగ్గజం డిస్నీ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించునుంది. ఇందులో భాగంగా తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను సిద్ధం చేయాలని మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసినట్ల బిజినెస్ ఇన్సైడర్ రిపోర్ట్ తెలిపింది. ఉద్యోగులకు తొలగింపుపై డిస్నీ స్పందించింది. ఏప్రిల్ నెలలో 4 వేల మందిని ఫైర్ చేస్తున్నట్లు తెలిపినట్లు బిజినెస్ ఇన్సైడర్ తన కథనంలో పేర్కొంది. సంస్థ పునర్నిర్మాణం, కంటెంట్‌ను తగ్గించడంతో పాటు ఉద్యోగుల జీతంలోనూ కోత పెట్టేందుకు కంపెనీ యోచిస్తున్నది. ‘ఇది కఠినమైన నిర్ణయమే. ఉద్యోగుల తొలగింపులతో 5.5 బిలియన్ల డాలర్లను ఆదా చేసుకోవడం ద్వారా స్ట్రీమింగ్ బిజినెస్‌ను మరింత లాభదాయకంగా మర్చుకోవచ్చు. పునర్వ్యవస్థీకరణ మరింత ఖర్చుతో కూడుకుంది. మా వ్యాపారాలను మరింత సమర్ధవంతంగా, ఆర్ధిక సవాళ్లతో కూడిన వాతావరణంలో కార్యకాలాపాలు నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నాము. కాబట్టే 5.5 బిలియన్ల ఖర్చును ఆదా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఈవో బాబ్ ఇగర్ చెప్పారు. ఇక లేఆఫ్స్‌పై డిస్నీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ రంగాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా తొలగింపులు తమని ఏ విధంగా ఇబ్బంది పెడతాయోనని క్షణమొక యుగంలా గడుపుతున్నారు. -
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్లకు షాక్: ఏప్రిల్ ఫూల్ కాదు నిజం!
సాక్షి, ముంబై: ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+ హాట్ స్టార్ యూజర్లకు షాక్. డిస్నీ+హాట్‌స్టార్ హెచ్బీవోతో డీల్‌ను ముగించుకుంది. ఫలితంగా హెచ్‌బీవో కంటెంట్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఇకపై అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ట్విటర్ ద్వారా ధృవీకరించింది. డిస్నీ సీఈవో బాబ్ ఇగెర్ కంపెనీలో ఖర్చుల తగ్గింపు పునర్నిర్మాణాన్ని ప్రకటించిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. తాజా నిర్ణయంతో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' ,'ది సక్సెషన్' వంటి షోలను ఏప్రిల్ ఒకటి తరువాత అభిమానులు చూడలేరు. మార్చి 31 తరువాతనుంచి బడిస్నీ+ హాట్‌స్టార్‌లో హెచ్‌బీవో కంటెంట్ అందుబాటులో ఉండదు. కానీ ప్రధాన ప్రపంచ క్రీడా కార్యక్రమాలతోపాటు కంటెంట్ లైబ్రరీలో 100,000 గంటల టీవీ షోలు, సినిమాలను 10 భాషల్లో ఆస్వాదించవచ్చు అని ప్రకటించింది. మరోవైపు ఈ ప్రకటన తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ చందాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సబ్స్క్రిప్షన్ డబ్బును రీఫండ్ చేయమని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ లేదు, ఎఫ్1 లేదు. ఇపుడు హెచ్‌బీవో లేదు. ఇక వార్షిక చందా కోసం ఎందుకు చెల్లించినట్టు అంటూ ఒక యూజర్ మండిపడ్డారు. Hi! Starting 31st March, HBO content will be unavailable on Disney+ Hotstar. You can continue enjoying Disney+ Hotstar’s vast library of content spanning over 100,000 hours of TV Shows and Movies in 10 languages and coverage of major global sporting events. — Disney+HS_helps (@hotstar_helps) March 7, 2023 ఏప్రిల్ 1 నుండి కనిపించని షోల జాబితా బాలర్స్ బ్రదర్స్ బ్యాండ్ క్యాచ్ అండ్ కిల్ కర్బ్ యువర్ ఎంత్ ఆంట్రేజ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ మార్ ఆఫ్ ఈస్ట్‌టౌన్ మైండ్ ఓవర్ మర్డర్ ఒబామా సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ షాక్ సక్సెషన్ ద బేబీ ది నెవర్స్ ది సోప్రానోస్ ది టైమ్ ట్రావెలర్స్ వైఫ్ అండర్ కరెంట్ వాచ్ మెన్ వీ వోన్ దిస్ సిటీ కాగాహెచ్బీవో పలు బ్లాక్‌బస్టర్ షోలను నిర్మించింది. దశాబ్దాల తర్వాత కూడా వాటికి ఆదరణ తగ్గలేదు. 'ది ఫ్లైట్ అటెండెంట్', 'ప్రెట్టీ లిటిల్ లియర్స్: ఒరిజినల్ సిన్'తో సహా అనేక హెచ్‌బీవో మాక్స్ ఒరిజినల్లు ఇప్పటికే అమెజాన్‌లో అందుబాటులో ఉన్న నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియాలో హెచ్‌బీవో కంటెంట్‌ను ప్రసారం చేసే అవకాశం కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 2015లోహెచ్బీవ కంటెంట్ కోసం స్టార్ ఇండియా భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏప్రిల్, 2020లో, వాల్ట్ డిస్నీ కంపెనీ 20 సెంచరీ స్టూడియోస్‌ను కొనుగోలు అనంతరం దానిపేరును డిస్నీ+ హాట్‌స్టార్‌గా మార్చిన సంగతి తెలిసిందే. -
భారత్ - ఆస్ట్రేలియాల మధ్య టెస్ట్ .. ఆగ్రహంలో క్రికెట్ లవర్స్
భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ సమయంలో క్రికెట్ లవర్స్ అసహనానికి గురయ్యారు. అందుకు స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సేవల్లో అంతరాయమే కారణమని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీప్లస్ హాట్ స్టార్ సేవలు డౌన్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా ఇతర ఆన్ లైన్ సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయాలు, వాటికి పరిష్కార మార్గాలు చూపే డౌన్‌డిటెక్టర్ సంస్థ 500 మందికిపై యూజర్లు ఈ అంతరాయంపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. వినియోగదారులు లాగిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తలెత్తిన ఎర్రర్ మెసేజ్ స్క్రీన్షాట్లను ట్విటర్లో షేర్ చేసినట్లు నివేదించింది. డౌన్డిటెక్టర్లోని అవుట్‌టేజ్ మ్యాప్ ప్రకారం..ఢిల్లీ, జైపూర్, లక్నో, కోల్‌కతా, నాగ్‌పూర్, హైదరాబాద్, ముంబై, చండీగఢ్‌ల నుంచి యూజర్లు ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.ఈ సాంకేతిక సమస్యలపై డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాజమాన్యం స్పందించింది. మా యాప్‌లు, వెబ్ సేవల్లో ఊహించని విధంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. సమస్యను పరిష్కరించేలా ఐటీ నిపుణుల బృందం పనిచేస్తుందని, త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. -
Disney layoffs: 7వేల మందిని తొలగించిన డిస్నీ.. కారణం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా అన్ని కంపెనీలను ఆర్థిక మాంద్య భయాలు పడీస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించుకుంటున్నాయి. లేఆఫ్స్ బాట పట్టిన యూఎస్ టెక్ కంపెనీల సరసన ప్రముఖ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ డిస్నీ నిలిచింది. 7 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తాజాగా తెలిపింది. గతేడాది సీఈఓ బాబ్ ఇగర్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఇది. ‘‘ఇది తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు.. ప్రపంచవ్యాప్తంగా అంకిత భావంతో పనిచేస్తున్నప్రతిభావంతులైన మా ఉద్యోగులపై నాకు గౌరవం, అభిమానం ఉన్నాయి’’ అని త్రైమాసిక ఫలితాల వెల్లడి అనంతరం తనతో మాట్లాడిన విశ్లేషకులతో సీఈఓ బాబ్ ఇగర్ ఇలా వ్యాఖ్యానించారు. 2021 వార్షిక నివేదిక ప్రకారం.. ఆ ఏడాది నవంబర్ 2 నాటికి డిస్నీ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 1.90 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది శాశ్వత ఉద్యోగులు. తగ్గిపోయిన సబ్స్క్రైబర్లు డిస్నీ ప్లస్‌కు సబ్స్క్రైబర్ల సంఖ్య ఇటీవల గణనీయంగా తగ్గిపోయింది. అంతకు ముందు త్రైమాసికంతో పోల్చుకుంటే గతేడాది డిసెంబర్ 31 నాటికి చందాదారుల సంఖ్య 1 శాతం తగ్గి 168.1 మిలియన్లకు పడిపోయింది. దీంతో కాస్ట్ కటింగ్‌పై దృష్టి పెట్టిన యాజమాన్యం 7వేల మందిని తొలగించేందుకు సిద్ధమైంది. అయితే గడిచిన త్రైమాసికంలో విశ్లేషకులు ఊహించినదాని కంటే మెరుగ్గా డిస్నీ గ్రూప్ 23.5 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. (ఇదీ చదవండి: మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్) -
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
జానీ డెప్‌కు క్షమాపణ కోరుతూ రూ.2355 కోట్లు ఆఫర్!
'పైరేట్స్ ఆఫ్ కరేబియన్' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు హాలీవుడ్ స్టార్ జానీ డెప్. కెరీర్ సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అతడి భార్య అంబర్ హెరాల్డ్‌తో విబేధాలు రావడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత జుగుప్సాకర రీతిలో ఆరోపణలు చేసుకుంటూ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఈ కేసులో చివరాఖరకు జానీ విజయం సాధించాడు. అయితే అంబర్ ఆరోపణలు చేసిన సమయంలో హాలీవుడ్‌లోని డిస్నీ వంటి బడా నిర్మాణ సంస్థలు జానీతో సినిమా చేసేందుకు నిరాకరించాయి. ఇప్పుడు అతడు కోర్టులో నిర్దోషి అని నిరూపితమవడంతో తిరిగి జానీతో కలిసి పని చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. అయితే దానికంటే ముందు డిస్నీ అతడికి క్షమాపణ కోరుతూ లేఖ పంపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, కరేబియన్ ఫ్రాంచైజీలో నటించాలంటూ రూ.2,355 కోట్లు(301 మిలియన్ డాలర్స్) ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా కరేబియన్ ఆఫ్ పైరేట్స్లోని ఐదు భాగాల్లో జాక్ స్పారోగా జానీనే నటించాడు. మరి జానీ వారిని క్షమిస్తాడా? నెక్స్ట్ పార్ట్‌లో అతడు ఉన్నాడా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే! జానీ- అంబర్ కేసు విషయానికి వస్తే.. 2015లో జానీ డెప్, అంబర్‌హర్డ్‌ల వివాహం జరిగింది. కానీ, ఏడాదికే మనస్పర్థలు రావడంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి మీద తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. 2018లో అంబర్ సెక్సువల్ వయొలెన్స్ ఆర్టికల్ రాయగా.. అది తన పరువుకు భంగం కలిగించేలా ఉందంటూ 2019 ఫిబ్రవరిలో జానీ కోర్టుకెక్కాడు ఇందుకుగానూ 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. ప్రతిగా 2020 ఆగస్టులో తానూ గృహ హింసను ఎదుర్కొన్నానంటూ అంబర్ హెరాల్డ్ 100 మిలియన్ డాలర్లకు కౌంటర్ దావా వేసింది. ఈ దావాల్లో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జానీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. చదవండి: ఒకేసారి రిపీట్ కానున్న 10 జంటలు.. ప్రేమ వివాహానికి రెడీ అవుతున్న హీరో రామ్, త్వరలో ప్రకటన?! -
డబ్బులు ఖర్చుపెట్టి ప్రజలు తెగ వాడేస్తున్న పాపులర్ 10 యాప్స్ ఇవే..!
సోషల్ మీడియా వచ్చేశాక ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా కొత్త కొత్త యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఏదో ఒక సినిమాలో చెప్పినట్లు యాప్‌లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల జీవితాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలామంది వాటిని వినియోగించుకోవడంతో పాటు డబ్బు కూడా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ‘సెన్సార్ టవర్’ నివేదిక ప్రకారం.. డబ్బులు చెల్లించి మరి ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న ప్రపంచంలోనే పాపులర్ యాప్‌ల గురించి ఒక నివేదిక విడుదల చేసింది. ”ఆపిల్ యాప్ స్టోర్‌లోని టాప్ 100 నాన్-గేమ్ సబ్స్క్రిప్షన్ యాప్‌లు.. 2021లో 13.5 బిలియన్(లక్ష కోట్లకు పైగా) డాలర్లు ఆర్జించాయి” అని ఈ నివేదిక పేర్కొంది. వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్‌లోని టాప్ 100 సబ్స్క్రిప్షన్ యాప్‌ల కోసం $4.8 బిలియన్లు ఖర్చు చేశారు. ఈ టాప్ 10 యాప్‌ల జాబితాలో డేటింగ్ యాప్‌లు, ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ యాప్‌లు.. కొన్ని గూగుల్ యాప్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా డబ్బు ఖర్చు చేసి వినియోగించే టాప్ 10 యాప్‌ల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గూగుల్ వన్ టెక్ దిగ్గజం గూగుల్ అపరిమిత క్లౌడ్ స్టోరేజ్ సేవలను అందించేందుకు గూగుల్ వన్(Google One) యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే గూగుల్ ప్లే స్టోర్‌లో 10 కోట్ల డౌన్లోడ్ ను కలిగి ఉన్న ఈ యాప్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ సేవలను పొందాలంటే వినియోగదారుడు కొత్త మొత్తం రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 15 జీబీ స్టోరేజ్ వరకు వినియోగదారుడు ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. కేవలం 15జీబీ స్టోరేజి పరిమితిని మించి ఉంటే మాత్రమే గూగుల్ వన్ సభ్యత్వాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డిస్నీ+ 2021లో చాలా మంది వ్యక్తులు ఎక్కువగా డబ్బులు చెల్లించి వాడిన యాప్‌గా డిస్నీ+ నిలిచింది. వారి టీవి స్క్రీన్లపై వినోదం కోసం దీన్ని ఎక్కువగా చూశారు. డిస్నీ+ వంటి ఓటీటీ యాప్‌ల కోసం ప్రజలు చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. యూట్యూబ్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌లలో యూట్యూబ్ ఒకటిగా నిలిచింది. అయితే, ఇందులో వచ్చే ప్రకటనలు రాకుండా ఉండటానికి యూట్యూబ్ ప్రీమియం కోసం కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. హెచ్‌బీఓ మాక్స్ హెచ్‌బీఓ.. ప్రీమియం ఓటీటీ కంటెంట్ ప్లాట్‌ఫారమ్ యాప్‌ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ఇందులో వచ్చే వీడియోల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. టిండర్ ప్రముఖ డేటింగ్ యాప్ టిండర్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన టాప్ 10 యాప్‌ల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది. పండోరా పాడ్ కాస్ట్ లు, మ్యూజిక్ స్ట్రీమింగ్ వంటి ఇతర ఆడియో కంటెంట్ కోసం ప్రజలు ఎక్కువగా దీనిని వినియోగిస్తారు. యూరప్, అమెరికాలో స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఒక పాపులర్ యాప్. ట్విచ్ గేమర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ ట్విచ్. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్లాట్‌ఫారమ్ చాలా అభివృద్ధి చెందింది. ఈఎస్పీఎన్ అమెరికాలో ఈఎస్పీఎన్ స్పోర్ట్స్ కంటెంట్‌కు ప్రధాన యాప్‌గా ఉంది. క్రీడల పరంగా ఈ యాప్ ఆధిపత్యం చెలాయిస్తోంది. చాలా మంది క్రీడల కోసం ఈ యాప్‌ను చూస్తున్నారు. బంబుల్ టిండర్ తరువాత డేటింగ్ యాప్‌లలో బంబుల్ అత్యంత ప్రజాదరణ పొందింది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన తొమ్మిదవ యాప్‌గా ఇది నిలిచింది. హులు ఈ ప్లాట్‌ఫారమ్‌లలో వినోదాన్ని కోరుకునే వినియోగదారులు బాగా ఇష్టపడే యాప్ హులు. ఓటీటీ జాబితాలో అందరికంటే ఎక్కువగా చూసే యాప్‌గా ఇది ఉంది. (చదవండి: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. కేంద్రానికి లక్ష కోట్ల నష్టం..!) -
Hotstar: డిస్నీ ఫ్లస్కు భారత్‌లో భారీ దెబ్బ
Disney Plus Hotstar lost subscribers: స్ట్రీమింగ్ సర్వీస్ కంపెనీ ‘డిస్నీ ఫ్లస్’ (Disney+) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో ఏకంగా 60 శాతం సబ్ స్క్రయిబింగ్ రేట్‌తో సంచలనం సృష్టించింది. అక్టోబర్ 2నాటికి మొత్తం 118.1 మిలియన్ల సబ్స్క్రయిబర్ల మార్క్‌ను చేరుకున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే.. మూడు నెలల వ్యవధిలో 2.1 మిలియన్ సబ్స్క్రయిబర్లను మాత్రమే చేర్చుకుని స్వల్ఫ తగ్గుదలతోనే 118.1 మిలియన్ ఫీట్ సాధించడం విశేషం. ఇక ఈ వ్యవధిలోనే భారత్‌లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీ దెబ్బ పడింది. ఇండియన్ వెర్షన్ సర్వీస్ ‘డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్’ సబ్ స్క్రయిబర్స్ను భారీగా కోల్పోయింది. ఏకంగా 20 లక్షల మంది సబ్స్క్రయిబర్లు దూరమైనట్లు గణాంకాలు చెప్తున్నాయి. కానీ, అమెరికా, ఇతర ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం డిస్నీ ఫ్లస్కు భారీగా సబ్ స్క్రయిబర్లు పెరగడం విశేషం. కొత్తగా ప్రారంభించిన ‘స్ట్రీమింగ్ వార్స్’కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఇప్పుడు. గత మూడు నెలల వ్యవధిలో యూఎస్, యూరప్‌లలో డిస్నీ ఫ్లస్కు 40 లక్షల కొత్త సబ్ స్క్రయిబర్లు చేరడం గమనార్హం. వివిధ రకాల సర్వీసులతో ‘డిస్నీ ఫ్లస్’ను రెండేళ్ల క్రితం ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి: ప్లాస్టిక్ నుంచి పెట్రోల్..అందుబాటులో ఎప్పుడంటే ? -
క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్!
క్రికెట్ ప్రియులకు రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. త్వరలో ఐపీఎల్ 2021 సెప్టెంబర్ 19 నుంచి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ జియో 5 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిస్నీ+ హాట్ స్టార్ కంటెంట్ లైబ్రరీ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ అందించే కొత్త ఐదు ప్రీపెయిడ్ ప్లాన్లను జియో ప్రారంభించింది. ఇప్పటి వరకు, జియో డిస్నీ+ హాట్ స్టార్ విఐపి సబ్ స్క్రిప్షన్ కింద లైవ్ స్పోర్ట్స్, హాట్ స్టార్ స్పెషల్స్, మూవీలు, టివి షోలకు యాక్సెస్ లభించేది. ఈ కొత్త రిలయన్స్ జియో ప్లాన్ డిస్నీ+ హాట్ స్టార్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు డిస్నీ+ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్ బీఓ, ఎఫ్ఎక్స్, షోటైమ్, ఇతర అంతర్జాతీయ కంటెంట్ కొత్త లైబ్రరీ ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ ధరలు వరుసగా రూ.499(వాలిడిటీ 28 రోజులు), రూ.666(వాలిడిటీ 56 రోజులు), రూ.888 (వాలిడిటీ 84 రోజులు), రూ.2,599(వాలిడిటీ 365 రోజులు)గా ఉన్నాయి. రూ.499 రిచార్జ్ ప్లాన్ కింద జుకు 3జిబి డేటాను అందిస్తుండగా, మిగిలిన మూడు ప్లాన్స్ కింద రోజుకు 2 జీబీ డేటా లభిస్తాయి. (చదవండి: ఐపీఎల్ టీం... ఇప్పుడు మరింత కాస్ట్లీ గురు!) అలాగే, ఇంకా రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా కావాలంటే డేటా యాడ్-ఆన్ ప్లాన్ రూ.549ను రిచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీని కలిగి ఉంటుంది. రూ.549 యాడ్-ఆన్ ప్లాన్ మినహా అన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అపరిమిత వాయిస్, ఎస్ఎమ్ఎస్ బెనిఫిట్స్ లభిస్తాయి. -
350 కోట్ల నష్టం!.. ఆ ప్రొడక్షన్ హౌజ్‌కు నటి గుడ్‌బై?
హాలీవుడ్ నటి స్కార్లెట్ జొహాన్సన్-డిస్నీల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. ‘బ్లాక్ విడో’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. ఓటీటీ(డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్)లో రిలీజ్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో ఒప్పంద ఉల్లంఘన ద్వారా డిస్నీ తనకు భారీ ఆర్థిక నష్టం కలిగించిందంటూ ఆమె కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. సుమారు 50 మిలియన్ల డాలర్లు(సుమారు 350 కోట్ల రూపాయల)నష్టం వాటిల్లిందంటూ లాస్ ఏంజెల్స్ కోర్టులో దావా వేసింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్కార్లెట్ ‘నటాషా రోమనాఫ్’(బ్లాక్ విడో) క్యారెక్టర్ పోషించిన విషయం తెలిసిందే. అవెంజర్స్ ఎండ్గేమ్లో ముగిసిన ఈ పాత్రను.. ‘బ్లాక్ విడో’ సిరీస్ పేరుతో ప్రత్యేకంగా కొనసాగించాలని మార్వెల్ నిర్ణయించుకుంది. అయితే ఈ సిరీస్‌లో మొదటి సినిమా ‘బ్లాక్ విడో’ను ఓటీటీలో రిలీజ్ చేయడాన్ని డిస్నీ సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ కేసు నడుస్తుండగా.. భవిష్యత్తులో మార్వెల్ సినిమాల్లో స్కార్లెట్ నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సూపర్ హీరో చిత్రాల విషయంలో మార్వెల్‌కు, డీసీ(డిటెక్టివ్ కామిక్స్)కు మధ్య ఎప్పటి నుంచో పోటీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కార్లెట్‌ను తమ వైపు లాగాలని డీసీ ప్రయత్నాలు ప్రారంభించింది. సాధారణంగా మార్వెల్ నుంచి బయటకు వచ్చిన నటులకు డీసీ గాలం వేయడం ఎప్పటి నుంచో నడుస్తున్నదే. దర్శకుడు జేమ్స్ గన్ను ఇలాగే దొరకబుచ్చుకుంది డీసీ. ఇక ప్రస్తుతం హాలీవుడ్ ఆగ్రతార అయిన స్కార్లెట్‌తో డీల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది డిటెక్టివ్ కామిక్స్. అయితే ఏ రోల్ కోసం డీసీ సంప్రదించింది? ఏం ఆఫర్ చేసింది? అందుకు స్కార్లెట్ అంగీకరించిందా? లేదా? అనే విషయాలపై స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చు. చదవండి: హీరో నిఖిల్‌కు సజ్జనార్ సన్మానం -
Luca Review: అందమైన అనుభవం
క్వాలిటీ యానిమేటెడ్ చిత్రాలతో ఆడియెన్స్‌ను మెప్పించడం పిక్సర్కు కొత్తేం కాదు. డిస్నీ వాళ్లతో చేతులు కలిపాక.. కథాబలం ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రిలీజ్ అయిన చిత్రమే ‘లూకా’. ఒక వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న సినిమా రీసెంట్గా డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయ్యింది. టైటిల్: లూకా ఓటీటీ: డిస్నీఫ్లస్ హాట్‌స్టార్ డైరెక్టర్ : ఎన్రికో కాసరోసా కాస్టింగ్: జాకోబ్ ట్రెంబ్లె, జాక్ డైలాన్ గ్రేజర్, ఎమ్మా బెర్మన్, మార్కో బెర్రిసిల్లా, సవేరియో రొయిమోండో(వాయిస్ ఓవర్) మ్యూజిక్: డాన్ రోమర్ రన్ టైం: గంటా 35 నిమిషాలు కథ.. లూకా పగురో.. ఒక సీ మాంస్టర్కుర్రాడు. రాను రాను సముద్రం అడుగున జీవనం అతనికి బోర్‌గా అనిపిస్తుంది. భూమ్మీద బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతుహలం ఆ కుర్రాడిలో రోజురోజుకీ పెరిగిపోతుంటుంది. అయితే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు) మాత్రం వద్దని గట్టిగానే హెచ్చరిస్తారు. ఓరోజు చెప్పాపెట్టకుండా భూమ్మీదకు బయలుదేరుతాడు. నీటి నుంచి ఒడ్డుకు వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నప్పుడు మరో సీ మాంస్టర్కుర్రాడు అలబర్టో స్కోఫానో తారసపడతాడు. తాను చాలాసార్లు భూమ్మీదకు వెళ్లానని చెప్పి.. తనతో పాటు రమ్మని తీసుకెళ్తాడు అలబర్టో. ఆ ఇద్దరూ కలిసి తీర ప్రాంతం పోర్టోరోసోపై అడుగుపెడతారు. తమకున్న విచిత్ర గుణంతో ఆ ఇద్దరూ వెంటనే మనుషుల్లా మారిపోతారు. ఆ ఊరిలో ఆ పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? లూకా ఊహకు తగ్గట్లే భూమ్మీద ఉంటుందా? మనుషులకు వాళ్ల నిజస్వరూపాలు తెలుస్తాయా? చివరికి లూకా ఏమవుతాడు? అనేది మిగతా కథ.. విశ్లేషణ లూకా ఒక ఫాంటసీ కథ. ఇటలీ జానపద కథలు, పిల్లల పుస్తకాల్లో కనిపించే సీ మాంస్టర్ కథల ఆధారంగా దర్శకుడు ఎన్రికో కాసరోసా అల్లుకున్న కథ. ఈ సినిమా అన్ని వర్గాలను అలరిస్తుంది..లూకా పడే పాట్లు నవ్వులు పంచుతాయి. ముఖ్యంగా విరుద్ధ మనస్తత్వాలున్న ఆ పిల్లల మధ్య స్నేహం.. భావోద్వేగాల్ని పుట్టిస్తుంది. సున్నితంగా ఉండే లూకా.. సముద్రంలో వెళ్లే బోట్ల నుంచి సామాన్లు దొంగతనం చేసేంత తెగింపు ఉన్న అలబర్టో మధ్య స్నేహం కథకు ప్రధాన బలం. వీళ్ల సాహసాలు, వీళ్ల స్నేహాన్నే నమ్ముకున్న చిన్నారి గియులియా, సీ మాంస్టర్లంటే రగిలిపోయే ఒడ్డున ఉండే మనుషులు, వెస్పా బండి మీద ప్రయాణం కోసం ఉవ్విళ్లూరే లూకా-అల్బర్టోలు.. వాళ్లని తరిమే బామ్మలు, లూకా కోసం పరితపించే తల్లిదండ్రులు(సీ మాంస్టర్లు), ఒంటరి తండ్రి బాగోగుల కోసం తల్లడిల్లే అలబర్టో.. ఇలా పాత్రల తీరుతెన్నులు కథలో లీనమయ్యేలా చేస్తాయి. ఇక సంక్లిష్టమైన కథల్ని కదిలే బొమ్మల ద్వారా అందంగా చూపించడంలో పిక్సర్ మరోసారి సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. టెక్నికల్ కోణంలో.. లూకాకు ప్రధాన బలం విజువల్స్. 50, 60వ దశకాల్లో ఇటలీ సుందర దృశ్యాలు(యానిమేటెడ్) ఆకట్టుకుంటాయి. విజువల్ టీం ఆరు నెలలపాటు గ్రౌండ్‌వర్క్ చేసి పడ్డ కష్టం అలరిస్తుంది.. ఆహ్లాదాన్ని పంచుతుంది. ఇక క్యారెక్టరైజేషన్ డిజైన్లు, వాటికి తగ్గ ఆర్టిస్టుల వాయిస్ ఓవర్.. అన్ని ఎమోషన్స్‌ను పర్ఫెక్ట్గా అందించాయి. డాన్ రోమర్ సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. అయితే గత పిక్చర్ సినిమాలతో పోలిస్తే.. లూకాలో స్టోరీ టెల్లింగ్ కొంత వీక్‌గా అనిపిస్తుంది. ఇక దర్శకుడు కాసారోసాకు ఇది తొలి సినిమా. జెనోవాలో తన చిన్ననాటి స్నేహితుడితో పంచుకున్న అనుభవాల నుంచే ఈ కథను రాసుకున్నాడు. అందుకు తగ్గట్లే ఫ్రెండ్షిఫ్ థీమ్‌ను బలంగా చూపించడంతో ఈ ‘డబుల్ లైఫ్’ లూకా వ్యూయర్స్‌కి అందమైన అనుభవాన్ని అందిస్తూ ఆకట్టుకోగలుగుతోంది. -
ఉత్కంఠ రేపుతున్న ‘లోకీ’ గాడ్ ఆఫ్ మిస్చీఫ్
హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో విడుదల అవుతున్న ‘‘గాడ్ ఆఫ్ మిస్చీఫ్’’ సిరీస్‌లో ‘లోకి’ కంటే ముందుగా అతడి ప్రయాణం గురించి తెలుసుకుందాం. థోర్ సోదరుడు, గాడ్ ఆఫ్ మిస్చీఫ్, ‘ప్రతి-నాయకుడు’- లోకి ఇలా చాలా ఏళ్ల నుంచి వేర్వేరు పేర్లతో పిలిచినా, ఇప్పటివరకు ‘సిరీస్ ఫ్రమ్ మార్వెల్’లో అతని రోలర్ కోస్టర్ ప్రయాణం గురించి చాలామందికి తెలియదు. అతను ఇప్పుడు తన సొంత సిరీస్ లోకి ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇదంతా అస్గార్డ్ను తదుపరి రాజుగా థోర్ ఎంచుకున్నప్పటి నుంచి కథ మొదలవుతుంది. దీనిపై ఇప్పటికే కోపంగా ఉన్న లోకి, తాను ఫ్రాస్ట్ జెయింట్స్ లాఫీ మరియు అస్గార్డ్ రాజులకు అక్రమ సంతానాన్ని అని తెలుసుకోవడంతో మరింత రగిలిపోతూ ఉంటాడు. ఉత్కంఠ రేపే.. క్రాస్-టైమ్‌లైన్, రియాలిటీ-బెండింగ్, యాక్షన్-ప్యాక్డ్ అడ్వెంచర్ కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్‌ను తప్పక వీక్షించండి. లోకీ ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోంది. డిస్నీ+ హాట్‌స్టార్ ప్రీమియం(Disney+ Hotstar Premium)లో ఇంగ్లీషులో లోకి చూడండి. హిందీ, తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు, దీన్ని మీ కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకు వచ్చిన - డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో చూడండి. అతని ప్రయాణంలో ఇప్పటివరకు ఒక మైలురాయి సంఘటనగా ఉన్న వాటిలో థానోస్ కోసం S.H.I.E.L.D నుంచి టెస్రాక్ట్ను దొంగిలించి తరువాత, అతను న్యూయార్క్ నగరంలో ఒక వార్మ్‌హోల్ తెరిచి, చిటౌరిని భూమిపైకి దండయాత్రకు పంపిస్తాడు. ఆ పరిస్థితుల నుంచి ఎవెంజర్స్ కాపాడినప్పటికీ, లోకిని అస్గార్డ్ నేరుగా జైలుకు పంపిస్తాడు. ఇప్పటివరకు ఇతను ఆరు సినిమాలలో కనిపించగా, ఇప్పుడు లోకి తన సోదరుని జట్టులో థోర్: ది డార్క్ వరల్డ్‌లో కనిపిస్తున్నాడు. డార్క్ ఎల్వ్స్‌ను ఓడించేందుకు వారు జట్టుకట్టారని భావించవచ్చు. తన ప్రత్యామ్నాయ పేరును నిజం చేసేలా, గాడ్ ఆఫ్ మిస్చీఫ్ తాను మరణించినట్లు అందరినీ నమ్మించాడు. ఓడిన్లా నటించి, అస్గార్డ్ను రాజుగా పట్టాభిషేకం చేయవచ్చని భావించాడు. థార్: రాగ్నరోక్ వీక్షిస్తే, లోకి తాను ఎవరో తనంతట తానే బయటపెట్టుకోవలసి వచ్చింది. దీనితో అతను తన సోదరి హేలాను ఓడించేందుకు థోర్తో జత కడతాడు. ఎవెంజర్స్: ఇన్ఫినిటీ వార్‌లో థానోస్ చేతిలో లోకి చంపబడినప్పటికీ ఎవెంజర్స్: ఎండ్గేమ్లో థానోస్‌తో పోరాడటానికి అవెంజర్స్ తిరిగి కాలంలో వెనక్కు వెళ్లినప్పుడు, అతను టెస్రాక్ట్ను తిరిగి పొందడంతో పాటు, వారి కస్టడీ నుంచి తప్పించుకుంటాడు. మొండి పట్టుదల మరియు ఊహించసాధ్యం కాని తన ట్రేడ్ మార్క్ లక్షణాలతో, త్వరలో మీకు నచ్చిన భాషలో విడుదల అవుతున్న లోకి కోసం గాడ్ ఆఫ్ మిస్చీఫ్ ఏం చేశాడో తెలుసుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీకు ఇష్టమైన మార్వెల్స్ సూపర్ హీరోస్‌కు చెందిన అన్ని టైటిల్స్‌ను మరియు యాంటీ-హీరో లోకిని హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో లోకి సిరీస్ విడుదల కాకమునుపే డిస్నీ+హాట్‌స్టార్ విఐపి(Disney+ Hotstar VIP)లో మాత్రమే వీక్షించండి. (Advertorial) -
వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా విరాళం
ముంబై: కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరో కంపెనీ ముందుకొచ్చింది. వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా సంస్థ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులతో కోవిడ్ చికిత్సలో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బైప్యాప్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేంత వరకు భారత ప్రజలతో కలిసి సాగుతామని కంపెనీ అధ్యక్షుడు కె.మాధవన్ తెలిపారు. -
ఐపీఎల్ 2021 స్పాన్సర్‌షిప్‌ల జాబితాలో మరో సంస్థ
న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం ఆరు స్పాన్సర్షిప్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తెలిపింది. ఇప్పుడు ఫోన్‌పే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాతో మాత్రమే స్పాన్సర్షిప్ కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అనే నాలుగు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఫోన్‌పే స్పాన్సర్ చేస్తోంది. ఫోన్‌పే ఐపీఎల్‌కు సహ-స్పాన్సర్ చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఫోన్‌పే ఐపీఎల్ ప్రచారం స్మార్ట్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నడుస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 280 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారుల సంఖ్యను డిసెంబర్ 2022 నాటికి 500 మిలియన్లకు విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు & సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.. “వచ్చే నెలలో ఐపీఎల్ 2021తో ప్రారంభమయ్యే జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాము. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆరు వేర్వేరు స్పాన్సర్‌షిప్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టాము. ప్రతి భారతీయుడి చెంతకు డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనేది మా ఆశయం. అందుకే మా మార్కెటింగ్ ప్రయత్నాలు దానికి అనుగుణంగా ఉన్నాయి" అని అన్నారు. ఫోన్‌పే అనేది ఒక డిజిటల్ చెల్లింపుల సంస్థ. దీని ద్వారా వినియోగదారులు డబ్బు పంపించడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయడం, దుకాణాలలో డబ్బులు చెల్లించడం చేయవచ్చు. చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! -
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ అకౌంట్
ఓటీటీ వీక్షకులకు శుభవార్త తెలిపింది నెట్‌ఫ్లిక్స్. ఓటీటీ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను డిసెంబర్ 5న అధికారికంగా ప్రారంభిస్తామని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఈ 48 గంటల ఫెస్ట్‌ను డిసెంబర్ 5న తెల్లవారుజామున 12.01 నుండి డిసెంబర్ 6న రాత్రి 11.59 గంటలకు వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది నెట్‌ఫ్లిక్స్. డిసెంబర్ 5, 6 తేదీల్లో అభిమానులు ఉచితంగా సినిమాలు, వెబ్ సిరీసులు, భారతీయ భాషల్లో కంటెంట్‌ను చూడొచ్చని తెలిపింది. చందాదారులు కానివారు నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షణ అనుభూతిని పొందేందుకే ఈ వేడుక నిర్వహిస్తున్నామని వెల్లడించింది. (చదవండి: డౌన్లోడ్ లో అగ్రస్థానంలో భారత్) భారత ఓటీటీ మార్కెట్లో అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్, జీ5 వంటి వాటికీ పోటీగా ఎదిగేందుకే నెట్‌ఫ్లిక్స్ రెండు రోజులు ఉచితంగా కంటెంట్‌ను వీక్షించే అవకాశాల్ని కల్పిస్తుండటం గమనార్హం. ‘భారతీయ ప్రేక్షకులను రంజింపజేసేందుకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కథలను నెట్‌ఫ్లిక్స్‌లో అందిస్తున్నాం. అందుకే డిసెంబర్ 5 రాత్రి 12.01 గంటల నుంచి డిసెంబర్ 6 రాత్రి 11.59 గంటల వరకు మేం స్ట్రీమింగ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నాం’ అని ఆ సంస్థ భారత ఉపాధ్యక్షురాలు మోనికా షెర్గిల్ తెలిపారు. ఈ స్ట్రీమింగ్ ఫెస్ట్‌లో కంటెంట్‌ను వీక్షించడానికి మీరు మీ ఇమెయిల్ ఐడీ లేదా పేరు లేదా ఫోన్ నంబర్‌తో సైన్ అప్ చేసుకోవాలి. అలాగే, ఈ రాబోయే ఫెస్ట్‌లో క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా చెల్లింపు అవసరం లేదని కంపెనీ ధ్రువీకరించింది. ఒకరి లాగిన్ సమాచారాన్ని మరొకరు ఉపయోగించుకొనేందుకు వీల్లేదని తెలిపారు. లాగిన్ అయిన ఎవరైనా స్టాండర్డ్ డెఫినెషన్‌లో వీడియోలను వీక్షించొచ్చని వెల్లడించారు. -
డిస్నీ +హాట్‌స్టార్ విఐపీ ఫ్రీ: ఎయిర్టెల్ కొత్త ప్యాక్
సాక్షి, ముంబై : లాక్డౌన్ కష్టాల్లో వున్న ప్రజల కోసం మొబైల్ సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ సరికొత్త డేటా ప్యాక్ తీసుకొచ్చింది. రూ .401ల ప్రీపెయిడ్ డేటా ప్యాక్‌ను ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పూర్తి లాక్డౌన్ లో ఉన్న ప్రేక్షకులను లక్ష్యంగా ఎయిర్టెల్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపీ సబ్ స్ర్కిప్షన్ను సంవత్సరం ఉచితంగా అందిస్తోది. దీంతోపాటు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. రోజుకు 3 జీబీ డేటాను 28 రోజులు అందిస్తుంది. అయితే, ఇందులో కాలింగ్, ఎస్ఎంఎస్ లాంటి సదుపాయాలువుండవు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే...డిస్నీ + హాట్‌స్టార్ విఐపీ సంవత్సర చందా.రూ .399. అదే ఎయిర్టెల్ చందాదారులైతే, కొత్త రూ .401 ప్లాన్‌లో ప్లాన్ ద్వారా రోజుకు 3జీబీ వరకు డేటా ప్రయోజనాలను అదనంగా పొందవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్ ముగిసి తర్వాత కూడా ఈ చందా 365 రోజులు చెల్లుబాటులో వుంటుంది. రూ .401 ప్రీపెయిడ్ ప్లాన్ పైన ఉన్న ఏ ఇతర ప్లాన్‌తోనైనా వినియోగదారులు తమ నంబర్లను రీఛార్జ్ చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఈ ప్లాన్‌ను పొందగలరని పేర్కొంది. (5 సెకన్లలో కరోనా వైరస్‌ను గుర్తించవచ్చు!) అలాగే ఎయిర్‌టెల్‌లో రూ .398 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది, ఇది అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఇందులో రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ , ఎస్ఎంఎస్ ప్రయోజనాలు అందిస్తుంది. అమెజాన్ ప్రైమ్ చందాకు రూ .999 ఖర్చవుతుంది. అంటే ఈ ప్లాన్‌లో వినియోగదారులు అదనపు ప్రయోజనాలతో పాటు రూ .398 లకే అమెజాన్ ప్రైమ్ చందాను పొందవచ్చు. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ 5, ఆల్ట్ బాలాజీ వంటి స్థానిక స్ట్రీమింగ్ యాప్‌లకు పోటీగా డిస్నీ+ హాట్ స్టార్ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. హిందీ, తమిళం, తెలుగు టైటిళ్లను డిస్నీ+ హాట్‌స్టార్ విఐపిలో, ఇంగ్లీషు టైటిళ్లను డిస్నీ+హాట్‌స్టార్ ప్రీమియం ద్వారా వినియోగదారులకు ముఖ్యంగా పిల్లలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. (కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్ ఔషధం!) -
మేఘన్ మార్కెల్ కొత్త అవతారం
లండన్ : ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటామని ప్రకటించిన బ్రటిన్ రాజకుమారుడు 'డ్యూక్ ఆఫ్ ససెక్స్' ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య 'డచెస్ ఆఫ్ ససెక్స్' మేఘన్ మార్కెల్ అప్పుడే ఆ పనిలో పడినట్టు కనిపిస్తోంది. పెళ్లికి ముందు వదిలేసిన వృత్తిని మేఘన్ తిరిగి చేపట్టారు. ఇందుకోసం డిస్నీ లండన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీనియర్ రాయల్స్ పదవి నుంచి వైదొలగాలనే నిర్ణయాన్ని వెల్లడించిన మేఘన్ డిస్నీ లండన్‌తో వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆరు వారాల విరామం కోసం కెనడాకు బయలుదేరే ముందే నవంబర్‌లో ఆమె వాయిస్ఓవర్ను రికార్డ్ చేశారట. 2017లో హ్యారీతో నిశ్చితార్థం తరువాత నటనకు గుడ్ బై చెప్పిన మాజీ నటి మేఘన్ తాజాగా డిస్నీతో ఒప్పందం చేసుకున్నారు. ఎనుగుల పరిరక్షణకు, వేటగాళ్ల బారి నుంచి రక్షించేందుకు ఉద్దేశించిన పరిరక్షణా బృందం ‘ఎలిఫెంట్ వితౌట్ బోర్డర్స్’ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చేందుకు బదులుగా స్టూడియోతో కలిసి పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టైమ్స్ పేర్కొంది. కాగా బ్రిటన్ రాజకుటుంబ 'సీనియర్ సభ్యుల' బాధ్యతల నుంచి వైదొలగుతామని, బ్రిటన్, ఉత్తర అమెరికా రెండింటిలో ఉండే విధంగా సమతూకంతో సమయం కేటాయించుకొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అదే సమయంలో రాణికి (ఎలిజిబెత్-2)సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. అలాగే రాజకుటుంబ సంప్రదాయాల పట్ల తమ కుమారుడు ఆర్చీ హారిసన్‌కు అవగాహన కల్పించడంతోపాటు, కొత్తగా సేవాసంస్థ ఏర్పాటు సహా జీవితంలోని తదుపరి అధ్యాయంపై దృష్టి కేంద్రీకరించే వీలవుతుందని చెప్పారు. మరోవైపు హ్యారీ-మేఘన్ ప్రకటన రాజకుటుంబానికి అసంతృప్తి కలిగించిందని రాజప్రాసాదం బకింగ్‌హాం ప్యాలస్ అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
‘బేబీ యోధ’ క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ముంబై : మన దేశంలో ఓ వస్తువు మార్కెట్లోకి విడుదలవకముందే దాన్ని పోలిన డూప్లికేట్ వచ్చేస్తుంది. బ్లాక్ మార్కెట్ పుణ్యమాని అసలు ఉత్పత్తిదారుడు ఢీలా పడిపోతాడు. కానీ, పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. అసలైన వస్తువుకే ప్రజలు పట్టం కడతారు. కోరుకున్న ఆ వస్తువు కోసం ఎన్ని నెలలైనా వేచి చూస్తారు. ‘బేబీ యోధ’ బొమ్మల విషయంలో ఇది మరోసారి వెల్లడైంది. డిస్నీ వారి విజయవంతమైన కార్యక్రమం ‘ద మండలోరిన్’ లోనిదే ఈ బేబీ యోధ క్యారెక్టర్. ‘ద మండలోరియన్’లోని యాబై ఏళ్ల వింతైన బేబీ యోధ బొమ్మలను గాక్మన్ క్రియేచర్స్( ఎట్సీ) అనే సంస్థ తయారు చేస్తోంది. టినీ మాస్టర్‌గా పిలుస్తున్న ఈ బొమ్మను నక్క బొచ్చు, పాలిమర్ మట్టి, పాస్టెల్స్తో తయారు చేస్తారు. ఐదు అంగుళాల పొడవు, గాజు అద్దాలున్న బేబీ యోధ వార్తల్లో నిలవడానికి కారణం దానికున్న విపరీతమైన క్రేజే. ఈ బొమ్మ ఖరీదు అక్షరాల రూ.21 వేలు కావడం ఒక విశేషమైతే. షిప్పింగ్ చార్జీల కోసం మరో 2500 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక ధర మాట అటుంచితే.. ఈ బొమ్మ మన చేతికి రావాలంటే 14 నుంచి 17 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు బుక్ చేసుకుంటే బేబీ యోధ మన చేతికి రావడానికి యేడాదిన్నర పడుతుంది. ఇక బేబీ యోధకు సంబంధించిన ఎమోజీని అందుబాటులోకి తేవాలని యూజర్లు యాపిల్ సంస్థకు విన్నవించడం మరో విశేషం. -
చెల్లెలి కోసం...
డిస్నీ సంస్థ నుంచి వస్తున్న తాజా హాలీవుడ్ యానిమేషన్ చిత్రం ‘ఫ్రోజెన్ 2’. భారతదేశంలోని ప్రాంతీయ భాషల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రాంతీయ భాషల్లో ఆయా ప్రాంతానికి చెందిన స్టార్స్‌తో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చెప్పించి సినిమాను ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. అన్నా, ఎల్సా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల చుట్టూ ‘ఫ్రోజెన్ 2’ కథ తిరుగుతుంది. అన్నా, ఎల్సా పాత్రలకు హిందీలో ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా డబ్బింగ్ చెప్పారు. తెలుగులో చెల్లెలి పాత్ర ఎల్సాకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. నిత్యా మాట్లాడుతూ – ‘‘ఈ పాత్రకు డబ్బింగ్ చెప్పడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. అమ్మాయిలకు సంబంధించి ఈ సినిమాలో మంచి సందేశం ఉంది. డిస్నీ సంస్థతో పని చేయడం కల నెరవేరినట్టుంది’’ అన్నారు. ‘ఫ్రోజన్ 2’ ఈ నెల 22న విడుదల కానుంది. కేరళలో పుట్టి పెరిగిన నిత్యా మీనన్ తెలుగు మాట్లాడగలరు. ‘అలా మొదలైంది, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, 24’ సినిమాల్లో పాటలు కూడా పాడారామె. అలాగే తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారు. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకి అయితే తన పాత్రతో పాటు మరో హీరోయిన్ ఇషా తల్వార్ పాత్రకు కూడా నిత్యా మీననే డబ్బింగ్ చెప్పడం విశేషం. -
చోప్రా సిస్టర్స్ మాట సాయం
ఇటీవల హాలీవుడ్ సినిమాలను మన ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రాంత సూపర్ స్టార్స్‌తోనూ ప్రమోట్ చేయిస్తున్నాయి ఆ చిత్ర నిర్మాణ సంస్థలు. తాజాగా తమ కొత్త యానిమేషన్ చిత్రం ‘ఫ్రాజెన్ 2’ను కూడా అదే స్టయిల్లో ప్రమోట్ చేస్తోంది డిస్నీ సంస్థ. ఎల్సా, అన్నా అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ల కథే ‘ఫ్రాజెన్’ ముఖ్యాంశం. హిందీ వెర్షన్లో ఈ పాత్రలకు చోప్రా సిస్టర్స్ (ప్రియాంకా చోప్రా, పరిణీతీ చోప్రా) వాయిస్ ఓవర్ అందించనున్నారు. ‘‘మిమి, తిషా (ప్రియాంక, పరిణితీ ముద్దు పేర్లు) ఇప్పుడు ఎల్సా, అన్నా కాబోతున్నారు. ఇలాంటి అద్భుతమైన, ధైర్యవంతమైన పాత్రలకు మా వాయిస్‌ను అందించడం ఆనం దంగా ఉంది’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఈ చిత్రం నవంబర్ 22న రిలీజ్ కానుంది. -
నా పేరు సింబా
డిస్నీ సినిమాలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకూ అందరూ ఎంజాయ్ చేస్తారు. డిస్నీ సినిమాల్లో స్పెషల్‌గా నిలిచే చిత్రం ‘లయన్ కింగ్’. తండ్రి సింహం (ముఫాసా) చనిపోవడంతో తన రాజ్యాన్ని లయన్ కింగ్ (సింబా) ఎలా చూసుకుంది? అనే కథ ఆధారంగా ఈ యానిమేషన్ మూవీ 1994లో తెరకెక్కింది. తాజాగా ఈ చిత్రానికి కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది డిస్నీ సంస్థ. ఈ సినిమాను ఇండియాలో పలు ప్రాంతీయ భాషల్లో డబ్ చేస్తున్నారు. తెలుగులో ముఫాసా పాత్రకు జగపతిబాబు, టిమోన్ అండ్ పుంబా పాత్రలకు అలీ, బ్రహ్మానందం డబ్బింగ్ చెప్పారు. తాజాగా సింబా పాత్రకు నాని డబ్బింగ్ చెప్పడం విశేషం. ‘‘ఈ ఏడాది నన్ను తండ్రి పాత్రలో (‘జెర్సీ’ సినిమా) చూశారు. ఇప్పుడు కొడుకు పాత్రలో వినిపించబోతున్నాను. ఈ జూలై నాకో కొత్త పేరు రాబోతోంది. అదే సింబా’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు నాని. -
డిస్నీ చేతికి ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ వ్యాపారం
లాస్ఏంజెల్స్: ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఫాక్స్ కంపెనీ ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని డిస్నీ కంపెనీ చేజిక్కించుకుంది. ఈ డీల్ విలువ 7,100 కోట్ల డాలర్లు మేర ఉంటుంది. ఒప్పందంలో భాగంగా ఫాక్స్ సంస్థకు చెందిన ఫిల్మ్, టీవీ స్టూడియో, ఎఫ్ఎక్స్, నేషనల్ జాగ్రఫిక్, హులు స్ట్రీమింగ్ సర్వీస్‌లో ఫాక్స్‌కు ఉన్న 30 శాతం వాటా, స్టార్ ఇండియాలపై హక్కులు డిస్నీకి లభిస్తాయి. ఈ కంపెనీ చేజిక్కిన ఫలితంగా డీస్నీ సంస్థ, డిస్నీ ప్లస్ పేరుతో అందించనున్న స్ట్రీమింగ్ సర్వీస్ ఈ ఏడాదే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి టెక్నాలజీ కంపెనీలకు గట్టిపోటీనివ్వడానికి ఈ డీల్ డిస్నీకి దోహదం చేయనున్నదని అంచనా. ఇది అసాధారణమైన, చారిత్రాత్మక డీల్ ఇది ఒక అసాధారణమైన, చారిత్రాత్మక ఘటన అని వాల్ట్ డిస్నీ కంపెనీ చైర్మన్, సీఈఓ రాబర్ట ఐగర్ వ్యాఖ్యానించారు. కాగా డిస్నీ, ఫాక్స్ రెండు కంపెనీలు సినిమాలు తీసే రంగంలోనే ఉండటంతో ఇరు సంస్థల్లో 4,000 ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ డీల్‌తో వార్నర్ బ్రదర్స్, యూనివర్శల్, సోనీ పిక్చర్స్, పారమౌంట్ పిక్చర్స్, డిస్నీ... ఈ 5 పెద్ద స్టూడియోలే హాలీవుడ్లో మిగులుతాయి. -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి,న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో) తన యూజర్లకు మరో మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. జియో యాప్ ద్వారా డిస్నీ కంటెంట్‌ను వీక్షించే సదవకాశాన్ని కలిగించింది. ఈ మేరకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని జియో డిస్నీ ఇండియాతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం జియో యూజర్లు డిస్నీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన సిండ్రిల్లా , స్లీపింగ్ బ్యూటీ, జంగిల్‌బుక్, ది లయన్ కింగ్ లాంటి క్లాసిక్‌లను ఇకపై జియో సినిమా యాప్ ద్వారా చూడొచ్చు. వీటితోపాటు మార్వెల్, పిక్సర్ ,స్టార్‌వార్స్ యానిమేషన్, సినిమాలు, ఇతర అంతర్జాతీయ, స్థానిక కంటెంట్‌ను కూడా ఎంజాయ్ చేయవచ్చు. ది మాజికల్ వరల్డ్ ఆఫ్ డిస్న ఇక జియో సినిమాలో అంటూ యూజర్లకు శుభవార్త అందించింది జియో. తమ జియో సినిమా యాప్‌లో ఒక స్పెషల్ సెక్షన్ద్వారా డిస్నీ సినిమాలు, యానిమేషన్ సిరీస్‌లను నిరంతరాయంగా వీక్షించవచ్చని జియో ఒక ప్రకటనలో తెలిపింది. డిస్నీ కోసం ఒక ప్రత్యేక విభాగాన్ని కేటాయించామనీ, ముఖ్యంగా జియో సినిమా యాప్ హోం పేజీలోనే డిస్నీని యాడ్ చేశామని వెల్లడించింది. -
జాక్ స్పారోకు గుడ్ బై..!
హాలీవుడ్లో ఘనవిజయం సాదించిన సూపర్ హిట్ సిరీస్‌లలో ది పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ ఒకటి. ఇప్పటికే ఐదు భాగాలుగా రిలీజ్ అయినా ఈ సిరీస్‌లో ఆరోభాగం త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ భాగంలో ప్రధాన పాత్ర అయిన జాక్‌స్పారో పాత్రదారి మారనున్నాడట. గత ఐదు భాగాల్లో జాక్ స్పార్ పాత్రను పోషించిన హాలీవుడ్ సూపర్ స్టార్ జానీ డెప్ ఇక మీదట ఆ పాత్రలో కనిపించడని తెలుస్తోంది. కారణాలను అధికారికంగా ప్రకటించకపోయినా జానీ డెప్‌ను పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌ను తొలగించిన విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. గత పద్నాల్లుగే సినీ ప్రేక్షకులను కెప్టెన్ జాక్ స్పారోగా అలరిస్తున్నాడు డెప్. త్వరలో ప్రారంభంకానున్న సిరీస్ లో ఆ పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై చర్చ జరుగుతోంది. -
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్‌కు పైరేట్స్ దెబ్బ!
'డిస్నీ' హాలీవుడ్ భారీ నిర్మాణ సంస్ధ. ఇప్పుడు వాన్నా క్రై హ్యాకర్ల దెబ్బకు విలవిల్లాడుతోంది. డిస్నీ సంస్ధకు చెందిన సర్వర్లను వాన్నా క్రై హ్యాక్ చేసింది. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సంస్ధ సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ హ్యాకర్ల చేతికి వెళ్లాయి. వాటిలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉన్న పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్‌లో తర్వాతి భాగమైన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ ఉంది. తాము కోరిన మొత్తాన్ని బిట్కాయిన్ల రూపంలో చెల్లించకపోతే డెడ్ మెన్ టెల్ నో టేల్స్ అనే సినిమాతో పాటు మరొకొన్ని సినిమాలను కూడా ఆన్లైన్లో రిలీజ్ చేస్తామని వాన్నా క్రై హెచ్చరించినట్లు తెలిసింది. వాన్నా క్రై డిమాండ్‌పై స్పందించిన డిస్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగర్ డబ్బును చెల్లించేందుకు నిరాకరించినట్లు ఓ అంతర్జాతీయ పత్రిక పేర్కొంది. ఐగర్ నిర్ణయంపై స్పందించిన వాన్నా క్రై హ్యాకర్లు బిట్కాయిన్ల రూపంలో డాలర్లను చెల్లించకపోతే.. 20 నిమిషాల వ్యవధిలో సినిమాలన్నింటినీ ఆన్లైన్లో విడుదల చేస్తామని ప్రకటించింది. కాగా, ఈ నెల 26వ తేదీన డెడ్ మెన్ టెల్ నో టేల్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పైరేట్స్ ఆప్ ది కరేబియన్‌కు భారత్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. హ్యాకర్ల హెచ్చరికలపై డిస్నీ ఎఫ్బీఐను డిస్నీ సంప్రదిస్తున్నట్లు తెలిసింది. వాన్నా క్రై కంప్యూటర్లను హ్యాక్ చేయడానికి ఉపయోగిస్తున్న లూప్‌హోల్‌ను తొలగిస్తూ మైక్రోసాఫ్ట్ కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
ట్విట్టర్ కొనుగోలు రేసులో మరో దిగ్గజం
న్యూయార్క్ : ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను చేజిక్కించుకోవడానికి గూగుల్, సేల్స్‌ఫోర్స్ రేసులోకి మరో మీడియా దిగ్గజం వచ్చి చేరింది. ట్విట్టర్ కొనుగోలుకు టెక్ దిగ్గజంతో పోటీ పడటానికి వాల్ట్‌డిస్నీ కంపెనీ ముందుకొచ్చింది. ట్విట్టర్‌ను డిస్నీ కంపెనీ సొంతం చేసుకుంటే ఆ కంపెనీకి ఇదే అతిపెద్ద టెక్నాలజీ డీల్‌గా వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు వెల్లడించింది. ట్విట్టర్ ఇటీవలే స్ట్రీమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్లను ఆన్లైన్లో అందించడానికి పెట్టుబడులు పెట్టింది. ట్విట్టర్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ ప్రయత్నాలను ఓ శక్తివంతమైన ప్రత్యర్థిగా ఈ మీడియా దిగ్గజం భావించింది. విజయవంతంగా ట్విట్టర్‌ను డిస్నీ సొంతం చేసుకుంటే, ఈఎస్పీఎన్ చానల్ సేవలను మరింత విస్తరించడానికి డిస్నీకి ఈ టెక్నాలజీ సంస్థ ఓ సాధనంగా ఉపయోగపడుతుందని వాల్‌స్ట్రీట్ రిపోర్టు పేర్కొంది. ఈఎస్పీఎన్ అమెరికాకు చెందిన గ్లోబల్ కేబుల్,శాటిలైట్ టెలివిజన్ చానల్. దీని యాజమాన్య హక్కులను 1996లో డిస్నీ సొంతం చేసుకుంది. గత నెలరోజులుగా ట్విట్టర్ అమ్మక వార్త మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ట్విట్టర్ విక్రయానికి ఆ సంస్థ దిగ్గజ కంపెనీలతో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. ట్విట్టర్ అమ్మక వార్త ఊపందుకోవడంతో ఆ కంపెనీ షేర్లు గతవారంతో 20 శాతానికి పైగా ఎగిశాయి. నెలకు 313 మిలియన్ యాక్టివ్ యూజర్లున్న ఆ సంస్థకు ప్రస్తుతం యూజర్ల వృద్ధి మందగించి, ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఆ కంపెనీ మార్కెట్ విలువ దాదాపు 16 బిలియన్ డాలర్లు. -
జంగిల్ బుక్ కు సీక్వెల్
లాస్ ఏంజిల్స్: ఇటీవల విడుదలై రికార్డుస్థాయిలో కలెక్షన్లు రాబడుతున్న సాహన ఫాంటసీ చిత్రం జంగిల్ బుక్ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నట్టు డిస్నీ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాను క్రుయెల్లా, 101 డాల్మేషన్స్ స్టూడియోల్లో తీయాలని నిర్ధారించుకున్నారు. ఏంజలీనా జోలీతో మేల్ ఫిసెంట్ సినిమా తీసిన లిండా వూల్వెర్టాన్ కి ఈ సీక్వెల్ స్రిప్ట్ పని అప్పగించినట్టు సమాచారం. సీక్వెల్ కోసం జంగిల్ బుక్ డైరెక్టర్, కథా రచయిత ప్రపంచ టూర్ కు వెళ్లనున్నారు. సీక్వెల్ ను 2019 లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎప్పుడో 1894లో ఒక నవలగా విడుదలైన జంగిల్ బుక్ కథ సారాంశం ఆధారంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానం జోడించి జంగిల్ బుక్ ను కన్నులకు కట్టినట్లుగా తీర్చిదిద్దారు. అడవిలో ఓ నల్లపిల్లికి దొరికిన పిల్లాడిని తిరిగి మనుషులతో జత చేసే క్రమంలో భాగంగా చోటుచేసుకున్న పరిణామాలే ఈ జంగిల్ బుక్. ఇందులో మోగ్లీ అనే పిల్లాడి పాత్రలో భారతీయ సంతతికి చెందిన పిల్లాడు నీల్ సేథి నటించాడు. -
వాస్తవ ప్రపంచంలోకి....
స్పృహ డిస్నీ వారి పాత్రలన్నీ కాల్పనిక ప్రపంచంలో సంచరిస్తుంటాయి. వినోదాన్ని పంచుతుంటాయి. బాగానే ఉందిగానీ, ఇలా ఎంతకాలం అనుకున్నాడు జెఫ్ హాంగ్ అనే అమెరికన్ యానిమేషన్ ఆర్టిస్ట్. డిస్నీ కంపెనీ ప్రపంచ ప్రఖ్యాత పాత్రలను ఎంచుకొని వాటిని వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన గీసిన ఒక చిత్రంలో, సముద్ర కాలుష్యాన్ని తట్టుకోలేక మత్స్యకన్య బయటికి పరిగెడుతుంటుంది. పిల్లలకు ఈ బొమ్మను చూడడంతోనే ఎన్నో సందేహాలు వస్తాయి. ‘‘ఆమె ఎవరు? ఎందుకలా పరుగెడుతోంది?’’ ‘‘మత్స్యకన్య గురించి మీరు బోలెడుసార్లు చదువుకొని ఉంటారు. ఇక మీరు తెలుసుకోవాల్సిన విషయం... ఆమె అలా ఎందుకు పరుగెడుతోందో’’ అంటూ సముద్ర కాలుష్యానికి గల కారణాలను వివరంగా పిల్లలకు చెప్పవచ్చు. పచ్చటి అడవి నుంచి మొక్కలు లేని ఎడారి ప్రాంతంలోకి వచ్చిపడుతుంది ‘ఫూ’ అనే పాత్ర. అడవులు నరకడాన్ని గురించి ఈ చిత్రం చెబుతుంది. పర్యావరణ సంబంధమైన సమస్యలను మాత్రమే కాకుండా జంతుదయ, సేవాధర్మం... మొదలైన విషయాలను కూడా డిస్నీ పాత్రల ద్వారా చెప్పిస్తున్నాడు హాంగ్. ‘‘మేడల్లో మాత్రమే నివసించే డీస్నీ రాణి... ఒకవేళ పర్యావరణ కాలుష్యం ఉట్టిపడే ప్రాంతంలో ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది?’’ అనే ఆలోచన నుంచి ‘అన్హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్’ సిరీస్ రూపుదిద్దుకుంది. ‘‘ఈ సిరీస్ చేస్తున్న క్రమంలో.... మనకు ఇన్ని సామాజిక సమస్యలు ఉన్నాయా?’’ అనిపించింది అని ఆశ్చర్యపోతున్నాడు హాంగ్. ‘‘మంచి విషయాలను పెద్దలు చెప్పడం కంటే, కార్టూన్ క్యారెక్టర్లు చెప్పడం ద్వారానే పిల్లలు త్వరగా గ్రహిస్తారు’’ అని ముచ్చటపడుతున్నారు సరికొత్త డిస్నీ బొమ్మలను చూసి తల్లిదండ్రులు. -
గేమ్స్, యాప్స్ కోసం
న్యూఢిల్లీ: మొబైల్ సేవలందించే వొడాఫోన్ కంపెనీ, యానిమేషన్ దిగ్గజం డిస్నీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గేమ్స్, యాప్స్ అందించడం కోసం ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ మాధుర్ బుధవారం తెలిపారు. వినియోగదారులు ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ఫోన్ల ద్వారా ఈ గేమ్స్‌ను, యాప్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చని వివరించారు. వేరీజ్ మై వాటర్? వేరీజ్ మై మిక్కీ? వేరీజ్ మై పెర్రీ?, టాయ్ స్టోరీ తదితర గేమ్స్‌ను, యాప్స్‌ను వినియోగదారులు పొందవచ్చని పేర్కొన్నారు. ఇటీవలనే వొడాఫోన్ మ్యూజిక్, వొడాఫోన్ స్పోర్ట్స్ వంటి సర్వీసులను అందజేశామని తెలిపారు. గేమింగ్ బిజినెస్ వృద్ధికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు. -
‘డిస్నీ’ థీమ్‌తో ప్రెస్జీజ్ సరికొత్త వెంచర్
సాక్షి, బెంగళూరు : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రెస్టీజ్ గ్రూప్ తన సరికొత్త వెంచర్‌ను ఆదివారం ప్రకటించింది. ప్రెస్టీజ్ లేక్‌సైడ్ హాబిటట్ పేరిట నిర్మించనున్న ఈ గృహసముదాయం ‘డిస్నీ’ థీమ్‌తో ఉంటుందని ఆ సంస్థ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ వెల్లడించారు. వైట్‌ఫీల్డ్‌లోని వర్తూరులో ఈ గృహసముదాయాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఆదివారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఈ గృహసముదాయంలోని ప్రతి గృహంలోని చిన్నారుల గదిని డిస్నీ పాత్రలతో కూడిన పెయింటింగ్స్‌తో రూపొందించనున్నట్లు తెలిపారు. ఇందుకు గాను డిస్నీ యూటీవీతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. కేవలం గోడలపైనే కాకుండా చిన్నారుల కోసం తయారు చేసిన ఫర్నీచర్, టేబుల్‌వేర్, దుప్పట్లపై కూడా డిస్నీ పాత్రలను, కథలను పొందుపరచనున్నట్లు వెల్లడించారు. త ద్వారా తమ వెంచర్లోకి ప్రవేశించే ప్రతి చిన్నా రి తన బాల్యాన్ని ఎంతో అద్భుతంగా ఆస్వాదించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మొత్తం 102 ఎకరాల్లో నిర్మితమవుతున్న ఈ వెంచర్లో 271 విల్లాలు, 3,428 అపార్ట్మెంట్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.