
ముంబై: కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరో కంపెనీ ముందుకొచ్చింది. వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా సంస్థ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులతో కోవిడ్ చికిత్సలో వాడే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, బైప్యాప్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేంత వరకు భారత ప్రజలతో కలిసి సాగుతామని కంపెనీ అధ్యక్షుడు కె.మాధవన్ తెలిపారు.