star india
-
ఆర్బీఐపై వెబ్ సిరీస్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంపై స్టార్ ఇండియా వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ కీలక పాత్ర గురించి ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. 1935లో ప్రారంభమైన ఆర్బీఐ.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 90 వసంతాలు పూర్తి చేసుకుంది. వెస్ సిరీస్ రూపొందించేందుకు ఆర్బీఐ 2024 జూలైలో టెండర్లను పిలిచింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా పోటీపడ్డాయి. స్టార్ ఇండియా రూ.6.5 కోట్ల విలువైన ఈ టెండర్‌ను దక్కించుకుంది. 25–30 నిముషాల నిడివిగల అయిదు ఎపిసోడ్స్ నిర్మిస్తారు. జాతీయ టీవీ చానెళ్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ ఎపిసోడ్స్ ప్రసారం చేస్తారు. -
Reliance-Disney: త్వరలో రిలయన్స్–డిస్నీ స్టార్ ఇండియా విలీనం
న్యూఢిల్లీ: దేశీయంగా మీడియా రంగంలో కన్సాలిడేషన్‌కు తెరతీస్తూ డిస్నీ–స్టార్ ఇండియాను విలీనం చేసుకునే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెగా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన నాన్–బైండింగ్ టర్మ్ షీటుపై సంతకాల కోసం లండన్‌లో జరిగిన భేటీలో డిస్నీ ప్రతినిధి కెవిన్ మేయర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన మనోజ్ మోదీ తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం కుదరడంతో వ్యాపార విలువ మదింపు తదితర ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం 45–60 రోజుల గడువు విధించుకున్నారు. అవసరమైతే దీన్ని పొడిగించే అవకాశం ఉంది. జనవరి ఆఖరు నాటికి ఈ డీల్‌ను పూర్తి చేయాలని రిలయన్స్ ఆసక్తిగా ఉన్నప్పటికీ ఫిబ్రవరి ఆఖరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ పూర్తిగా స్టాక్, నగదు రూపంలో ఉండగలదని వివరించాయి. ఇరు సంస్థలు టర్మ్ షీటుపై చాలాకాలంగా కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రతిపాదన ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వయాకామ్18, స్టార్ ఇండియా కార్యకలాపాలను విలీనం చేస్తారు. విలీన సంస్థలో రిలయన్స్‌కు 51 శాతం, డిస్నీకి 49 శాతం వాటాలు ఉండనున్నాయి. ఇందులో స్టార్ ఇండియాకు చెందిన 77 చానల్స్, వయాకామ్18కి చెందిన 38 చానల్స్ కలిపి మొత్తం 115 చానల్స్ ఉంటాయి. వీటితో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా అనే రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా భాగమవుతాయి. జీ ఎంటర్టైన్మెంట్, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ (గతంలో సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా) విలీన ప్రక్రియ జరుగుతుండగా కొత్తగా రిలయన్స్, డిస్నీ–స్టార్ డీల్ కూడా కుదిరితే దేశీయంగా మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఐపీఎల్ 2022 ప్రారంభ తేదీలో మార్పు.. ధనాధన్ లీగ్ ఎప్పటి నుంచి అంటే..?
ఈ ఏడాది క్రికెట్ పండుగ ఐపీఎల్ 2022 బీసీసీఐ ముందుగా నిర్ణయించిన తేదీ కంటే ఓ రోజు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. తొలుత ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్‌ను మార్చి 27న మొదలుపెట్టాలని బీసీసీఐ భావించినప్పటికీ.. లీగ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోరిక మేరకు ఒక రోజు ముందుగానే (మార్చి 26) లీగ్‌ను ప్రారంభించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మార్చి 26వ తేదీ (శనివారం) లీగ్‌ను ప్రారంభిస్తే తర్వాతి రోజయిన ఆదివారం డబుల్ హెడర్(రెండు మ్యాచ్‌లు) జరిపే వీలుంటుందని స్టార్ ఇండియా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మరో రెండు, మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సదరు అధికారి పేర్కొన్నారు. అదే రోజు లీగ్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, లీగ్‌ను కొత్త ప్రతిపాదిత తేదీలో ప్రారంభిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు మరి కొన్ని మ్యాచ్‌లు మిస్ అవ్వాల్సి ఉంటుంది. పాక్ పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా.. ద్వైపాక్షిక సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లకు చెందిన ఆటగాళ్లు లీగ్‌లో ఓ వారం ఆలస్యంగా జాయిన్ అవుతారు. కొత్త ప్రారంభ తేదీ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6 నుంచి క్యాష్ రిచ్ లీగ్‌కు అందుబాటులోకి రానున్నారు. చదవండి: ఐపీఎల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ఎప్పటి నుంచి అంటే! -
భారత్–పాక్ మ్యాచ్ బ్లాక్‌బస్టర్ వ్యూస్.. టీ20 హిస్టరీలోనే అత్యధికం..
దుబాయ్: టి20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ టీవీ ప్రేక్షకుల వీక్షణపరంగా రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను టెలివిజన్ ద్వారా 16 కోట్ల 70 లక్షల మంది చూశారని అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) ప్రకటించింది. టి20 క్రికెట్ చరిత్రలో ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించిందని... 2016 టి20 ప్రపంచకప్‌లో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ముంబైలో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ ప్రేక్షకుల సంఖ్యను ఇది దాటిందని ఐసీసీ పేర్కొంది. చదవండి: IPL 2022 Auction: ఆర్సీబీ రిటైన్ లిస్ట్.. కోహ్లి, మ్యాక్స్‌వెల్ -
ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?
ఈరోజుతో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ముగియనున్న సంగతి మనకు తేలిసిందే. నేటి(నవంబర్ 14) ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో క్వాలిఫైయింగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి భారతదేశం నిష్క్రమించిన సంగతి తేలిసిందే. అయితే, ఇండియన్ క్రికెట్ టీమ్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటి బాట పట్టడంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్వర్క్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో సుమారు 200 కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణుల తెలిపారు. యుఏఈలో నెల రోజులగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మ్యాచ్‌లు జరిగే సమయంలో టీవీలో ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ రూ.900 కోట్లు-రూ.1,200 కోట్లు వసూలు చేయలని అంచనా వేసింది. అలాగే, స్టార్ నెట్వర్క్ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా సుమారు 250 కోట్ల రూపాయలు సంపాదించాలని చూసినట్లు ఆ సంస్థకు చెందిన కొందరు తెలిపారు. మీడియా అనుభవజ్ఞుడు మదన్ మోహపాత్ర అంచనా ప్రకారం.. భారతదేశం నిష్క్రమించడం వల్ల నెట్వర్క్ తన క్రీడా ఛానెళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15-20% కోల్పోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే వెనుకకు తీరగడంతో ఆ తర్వాత చూసే వీక్షకుల సంఖ్య తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య పెరిగిన అది అంతగా ఉండకపోవచ్చు అని అతని అభిప్రాయం. (చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?) సాధారణంగా, బ్రాడ్ కాస్టర్లు ముందుగానే క్రికెట్ టోర్నమెంట్ కోసం ప్రకటన స్లాట్లలో 80-85% బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత టీవీ ఛానెల్ మిగిలిన స్లాట్లను తెరిచి ఉంచుతుంది. తద్వారా టోర్నమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో రేట్లను పెంచేవారు. కానీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ఇప్పుడు స్పాట్ రేట్లను పెంచే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నమెంట్ ప్రారంభ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రకటన దారులు 10 సెకన్ల యాడ్ కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడి ఉంటే బ్రాడ్ కాస్టర్ 10 సెకన్ల ప్రకటనల కోసం కనీసం రూ.35 లక్షలు బ్రాడ్ కాస్టర్ సంపాదించేదని నిపుణుల అభిప్రాయం. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటికి చేరడంతో భారీగా బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోల్పోయినట్లు తెలుపుతున్నారు. -
పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్
India Vs Pakistan Match In T20 WC 2021 Recorded As Most Viewed T20I: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ వీక్షకుల పరంగా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య సాగిన ఈ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 167 మిలియన్ల (16.70 కోట్లు) మంది వీక్షించారు. దీంతో ఈ మ్యాచ్ పొట్టి క్రికెట్ చరిత్రలో అత్యధికంగా మంది వీక్షించిన అంతర్జాతీయ మ్యాచ్‌గా రికార్డు పుటల్లోకెక్కింది. ఈ విషయాన్ని టీ20 ప్రపంచకప్ అధికారిక ప్రసారకర్త స్టార్ ఇండియా మంగళవారం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. అంతకుముందు, టీ20 ప్రపంచకప్-2016లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ అత్యధిక మంది వీక్షించిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను 136 మిలియన్ల మంది వీక్షించారు. ప్రపంచకప్-2021లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను(క్వాలిఫయర్లు, సూపర్-12 దశ మ్యాచ్‌లు) మొత్తం 238 మిలియన్ల మంది వీక్షించారని స్టార్ ఇండియా పేర్కొంది. ఇదిలా ఉంటే, రసవత్తరంగా సాగుతుందని ఊరించి, ఉసూరుమనిపించిన దాయాదుల పోరులో టీమిండియాపై పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయం ద్వారా ప్రపంచకప్ టోర్నీల్లో పాక్ భారత్‌పై తొలి విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఈ ప్రపంచకప్‌లో దారుణంగా నిరాశపరచిన టీమిండియా పాకిస్థాన్‌తో పాటు, న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలై సెమీస్ దశకు కూడా చేరకుండానే నిష్క్రమించింది. చదవండి: Virat And Rohit: అపురూప కానుకలతో రవిశాస్త్రికి ఘనంగా వీడ్కోలు -
వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా విరాళం
ముంబై: కరోనా వైరస్‌పై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా మరో కంపెనీ ముందుకొచ్చింది. వాల్ డిస్నీ అండ్ స్టార్ ఇండియా సంస్థ తన వంతు సాయంగా రూ.50 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ఈ నిధులతో కోవిడ్ చికిత్సలో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, బైప్యాప్, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాలతో పాటు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి బయటపడేంత వరకు భారత ప్రజలతో కలిసి సాగుతామని కంపెనీ అధ్యక్షుడు కె.మాధవన్ తెలిపారు. -
ఐపీఎల్ 2021 స్పాన్సర్‌షిప్‌ల జాబితాలో మరో సంస్థ
న్యూ ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 కోసం ఆరు స్పాన్సర్షిప్ ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే తెలిపింది. ఇప్పుడు ఫోన్‌పే అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియాతో మాత్రమే స్పాన్సర్షిప్ కాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో అసోసియేట్ స్పాన్సర్‌గా ఉంది. అలాగే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ అనే నాలుగు ఐపిఎల్ ఫ్రాంచైజీలకు కూడా ఫోన్‌పే స్పాన్సర్ చేస్తోంది. ఫోన్‌పే ఐపీఎల్‌కు సహ-స్పాన్సర్ చేయడం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఫోన్‌పే ఐపీఎల్ ప్రచారం స్మార్ట్ టీవీ, డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నడుస్తుందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న 280 మిలియన్ల ఫోన్‌పే వినియోగదారుల సంఖ్యను డిసెంబర్ 2022 నాటికి 500 మిలియన్లకు విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌పే వ్యవస్థాపకుడు & సీఈఓ సమీర్ నిగమ్ మాట్లాడుతూ.. “వచ్చే నెలలో ఐపీఎల్ 2021తో ప్రారంభమయ్యే జాతీయ మార్కెటింగ్ ప్రచారాన్ని అత్యంత వేగంగా తీసుకెళ్తున్నాము. ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆరు వేర్వేరు స్పాన్సర్‌షిప్‌లపై భారీగా పెట్టుబడులు పెట్టాము. ప్రతి భారతీయుడి చెంతకు డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలనేది మా ఆశయం. అందుకే మా మార్కెటింగ్ ప్రయత్నాలు దానికి అనుగుణంగా ఉన్నాయి" అని అన్నారు. ఫోన్‌పే అనేది ఒక డిజిటల్ చెల్లింపుల సంస్థ. దీని ద్వారా వినియోగదారులు డబ్బు పంపించడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జ్ చేయడం, దుకాణాలలో డబ్బులు చెల్లించడం చేయవచ్చు. చదవండి: వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త! -
ఇంట్లోనే ఉండండి.. ఆన్లైన్లో బిల్లు కట్టండి: స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభ సమయంలో దేశమంతా ఏకతాటిపైకి వచ్చిన వేళ, కోట్లాది(నెలకు 700 మిలియన్ల) మందికి పైగా వీక్షకులను చేరుకునే స్టార్ ఇండియా నెట్వర్క్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తమ వినియోగదారుల భద్రతను లక్ష్యంగా చేసుకుని.. 'ఇంట్లోనే ఉండండి, ఆన్లైన్లో బిల్లు కట్టండి' పేరిట ప్రచారాన్ని ప్రారంభించింది. తద్వారా తమ వీక్షకులకు నిరంతర వినోదానికి భరోసా కల్పిస్తుంది. ఈ ప్రచారంతో భద్రత పట్ల అవగాహన మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది. అదే సమయంలో కుటుంబాలకు వినోదాన్నీ అందిస్తూ... టీవీ బిల్లు చెల్లింపులకు సైతం బయటకు వెళ్లకుండా.. సమస్యలను ఇంటి బయటే వదిలేయమని కోరుతోంది. ఇందుకోసం వినూత్నమైన.. సృజనాత్మకతతో కూడిన ఆన్లైన్ సదుపాయాలను వినియోగించుకోవాల్సిందిగా వీక్షకులను అభ్యర్థిస్తోంది. ఈ విషయం గురించి స్టార్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ హెడ్- డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ గుర్జీవ్ సింగ్ కపూర్ మాట్లాడుతూ.. "మా ప్రచారం ద్వారా వినియోగదారులను ఇంటివద్దనే ఉండండి. సురక్షితంగా ఉండండి అని ప్రోత్సహించడాన్ని లక్ష్యంగా చేసుకున్నాం. అదే సమయంలో వారు తమకు కావాల్సిన వినోదాన్ని పొందుతూనే ఆన్లైన్లో టీవీ ఎంటర్టైన్మెంట్ బిల్లులను చెల్లించాల్సిందిగానూ చెబుతున్నాం. బహుళభాషలలో మా ప్రాచుర్యం పొందిన జీఈసీ, కిడ్స్, మూవీస్, స్పోర్ట్స్ ఛానెల్స్ యొక్క చేరికపై ఆధారపడి ఈ సంక్షోభ సమయంలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేస్తున్నాం'' అని అన్నారు. " ఈ ఆపద సమయంలో కూడా ఆన్‌గ్రౌండ్ పనిచేస్తున్న మా కేబుల్, డీటీహెచ్ భాగస్వాములకు చెందిన సాహసోపేత బృందాలను ప్రశంసిస్తున్నాము. అదే విధంగా వీక్షకుల కోసం సేవల పరంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు భరోసా కల్పించేందుకు చేస్తున్న వారి ప్రయత్నాలను అభినందిస్తున్నాము'' అని కొనియాడారు. ఇక స్టార్ మా నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్.. మాట్లాడుతూ... "బ్లాక్ బస్టర్ చిత్రాలతో పాటుగా సెలబ్రిటీ హోమ్ వీడియోలను అద్భుతంగా మిళితం చేసి మన తెలుగు వీక్షకులకు సంపూర్ణ వినోదాన్ని అందించడానికి స్టార్ మా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంది. మా వినియోగదారుల భద్రత, ఆరోగ్యం తొలి ప్రాధాన్యమై ఈ కీలక సమయంలో, మేము ప్రతి ఒక్కరినీ తమ కేబుల్/డీటీహెచ్ బిల్లులు లేదా మరేదైనా యుటిలిటీ బిల్లును ఆన్లైన్ విధానంలో చెల్లించమని కోరుతున్నాం. అదే సమయంలో ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా మరికొంత కాలం ఇళ్లలోనే ఉండాల్సిందిగానూ అభ్యర్థిస్తున్నాం. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి అంటూ చెప్పేందుకు మనకోసం మా ప్రయత్నం'' అని అన్నారు. కాగా స్టార్ ఇండియా తమ నెట్వర్క్ ఛానెల్స్ ప్రేక్షకులకు అనంతమైన వినోదాన్ని పంచుతున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ షోస్ అయినటువంటి మహాభారత్ మొదలు ఎన్నో ఆసక్తికరమైన షోలను తీసుకువచ్చాయి. ఇక స్టార్ మా టీవీ వీక్షకులు ఇప్పుడు తమ అభిమాన సీరియల్స్ కార్తీక దీపం, వదినమ్మ, గృహలక్ష్మి ఇలా మరెన్నో నాన్- ఫిక్షన్ సీరియళ్లతో పాటుగా నూతన, ఉత్సాహభరితంగా సాగే ప్రీమియర్స్‌ను వీక్షించవచ్చు. ఈ ఛానెల్ ఇప్పుడు చిన్నారుల కోసం ప్రత్యేకంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటలకు సినిమాలను ప్రసారం చేస్తుండటంతో పాటుగా ప్రతి శుక్రవారం ఫ్యామిలీ మూవీస్‌ను ప్రసారం చేస్తుంది. చిన్నారుల కోసం ఇక ఈ లాక్డౌన్ వేళ తమ వీక్షకులతో అనుసంధానించబడటానికి కొన్ని నాన్- ఫిక్షన్ ఫార్మాట్లను సైతం ఛానెల్ తీసుకువచ్చింది. వీకెండ్ బ్లాక్‌బస్టర్ షోకు కొనసాగింపుగా ఇస్మార్ట్ జర్నీ మరియు పూర్తి సరికొత్త రూపులో బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్ వంటివి సైతం వీటిలో ఉన్నాయి. ఈ బిగ్‌లాక్‌డౌన్ ఛాలెంజ్‌లో స్టార్ మా సెలబ్రిటీలు ఇంటి పనులతో ఒకరినొకరు సవాల్ విసురుకుంటుంటారు. స్టార్ మా మూవీస్, స్టార్ మా గోల్డ్ సైతం కొన్ని ఆసక్తికరమైన సినీ పండుగలను సృష్టించాయి. సినీ వినోదసాగరంలో తేలియాడుతూ ఇళ్లలోనే కుటుంబాలు ఉంటాయన్న భరోసానూ ఇవి అందిస్తాయి. స్టార్ మూవీస్ ఇప్పుడు చిన్నారులకు ఇష్టమైన చిత్రాలైనటువంటి మేరీ పాపిన్స్ రిటర్న్స్, డుంబో మరియు నట్‌క్రాకర్ మరియు ఫోర్ రియల్మ్స్ ఆన్ ప్లేడేట్ ప్రదర్శిస్తుంది. వీటితో పాటుగా అత్యంత ప్రాచుర్యం పొందిన మార్వెల్ మూవీ సెలక్షన్, అత్యుత్తమ యాక్షన్ బ్లాక్‌బస్టర్స్ ను యాక్షన్ ఎట్ 9తో వీక్షించవచ్చు. అదే విధంగా వీక్షకులు అత్యుత్తమ ఇంగ్లీష్ వినోదానికై అమెరికన్ ఐడల్, కాఫీ విత్ కరణ్, మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా అత్యుత్తమ ఎపిసోడ్స్ చూడవచ్చు. కిడ్స్ నెట్‌వర్క్‌పై 100 గంటలకు పైగా తాజా కంటెంట్‌ను జోడించారు. డిస్నీ ఛానెల్ మరియు హంగామా టీవీ లపై సమ్మర్ బొనాంజాను వీరు వీక్షించవచ్చు. వీటిలో దేశీయంగా తీర్చిదిద్దిన బాపు - తెలివైన నాయకుని యొక్క స్వచ్ఛమైన మరియు సానుకూల కథ.. దీనితో పాటుగా సంతోషకరమైన సర్కస్ ట్రూప్‌లోని స్నేహితులతో కూడిన జంతువుల కథ -గుడ్డు మరియు సృజనాత్మక గాడ్జెట్స్‌తో కూడిన సాఫ్ట్ టాయ్ - గాడ్జెట్ గురు విత్ గణేశాఆ వంటివి వీక్షించవచ్చు. చిన్నారులు వీటితో పాటుగా హగేమారు షోను సైతం వీక్షించవచ్చు. దీనిలో అల్లరి హగేమారు యొక్క కథను తెలుపుతారు.అంతేగాక వీటితో పాటుగా సెల్ఫీ విత్ భజరంగ్, డోరెమాన్, చాచా చౌదరి, మిరాక్యులస్లో నూతన ఎపిసోడ్స్‌ను సైతం వీక్షించవచ్చు. క్రీడాభిమానుల కోసం క్రీడాభిమానులు ఇప్పడు క్రికెట్ కనెక్టడ్ను ఆస్వాదించవచ్చు. దీనిలో క్రికెట్ లెజండ్స్ తమ అభిమానులతో వీడియో కాల్స్ ద్వారా ప్రతి వారమూ మాట్లాడవచ్చు. అలాగే ఐపీఎల్లో అత్యుత్తమ మ్యాచ్‌లు సైతం స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌పై చూడవచ్చు. ఇంటరాక్టివ్ గేమ్స్‌తో తమ మెదడుకు వ్యాయామాన్ని అందించడంతో పాటుగా నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్‌పై వచ్చే బ్రెయిన్ బూస్టర్స్‌తో ప్రయోగాలూ చేయవచ్చు. అలాగే నూతన షో లాక్డౌన్ ఇండియాస్ ఫైట్ ఎగైనెస్ట్ కరోనా వైరస్ ద్వారా అత్యంత భయంకరమైన వైరస్‌పై భారతదేశపు పోరాటాన్ని చూడవచ్చు. ఓ నెట్‌వర్క్‌గా స్టార్ టీవీ, భావోద్వేగ పరంగా కోట్లాది మంది భారతీయులకు 25 సంవత్సరాలుగా కనెక్ట్ అయింది. ఈ కష్టకాలంలో తమ పూర్తి మద్దతును అందించడాన్ని కొనసాగిస్తుంది. ఇంట్లోనే ఉండండి, ఆన్లైన్లో బిల్లు కట్టండి క్యాంపెయిన్ వీడియో కోసం.. -
గుబాళించిన మానవత్వం
కలెక్టరేట్: కేరళ రాష్ట్రంలో ప్రకృతి విలయతాండవం చేయడంతో అక్కడి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నచందంగా సర్వం కోల్పోయి విలవిలలాడుతున్నారు. బాధితులను ఆదుకునేందుకు తామున్నామంటూ దయార్ద్ర హృదయులు ముందుకొస్తున్నారు. తమ వంతు సాయంచేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన హీరా గ్రూప్ సంస్థ కేరళ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ చైర్ పర్సన్ నవ్‌హీరా షేక్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం గన్‌ఫౌండ్రీలోని మీడియా ప్లస్ ఆడిటోరియంలో హీరా గ్రూప్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ ఇన్చార్జి ఫాజిల్ హుస్సేన్ మాట్లాడుతూ.. హీరా గ్రూప్ దేశ వ్యాప్తంగా పలు స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుందన్నారు. ఇప్పటి వరకు తమ సంస్థ ప్రకృతి వైపరీత్యాలతో అల్లాడుతున్న ప్రజలకు చేయూతనందించిందని పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని ప్రజలు వరదలకు గురైనప్పుడు సంస్థ ద్వారా బాధితులకు సహాయం అందించామన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తమ సంస్థ తరఫున కోటి రూపాయల చెక్కును అందజేశామన్నారు. స్టార్ ఇండియా ఉద్యోగుల విరాళం రూ.5 కోట్లు వరద బాధితుల సహాయార్థం స్టార్ ఇండియా ఉద్యోగుల రూ.5 కోట్ల విరాళాన్ని సౌతిండియా ఎండీ కె.మాధవన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు అందజేస్తున్న దృశ్యం. -
కళ్లు చెదిరే రేటు.. బీసీసీఐకి కాసుల పంట
టీమిండియా మ్యాచ్‌ల ప్రసార హక్కుల వేలం విషయంలో ఉత్కంఠ వీడింది. కళ్లు చెదిరే రేటును బీసీసీఐకి చెల్లిస్తూ స్టార్ ఇండియా నెట్వర్క్ సంస్థ ప్రసార హక్కులను దక్కించుకుంది. అధికారిక సమాచారం ప్రకారం రూ. 6,138.10 కోట్లకు హక్కులు అమ్ముడు పోయినట్లు సమాచారం. 2018-2023 ఐదేళ్ల కాలానికి మీడియా హక్కులను కైవసం చేసుకుంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం టీమిండియా 2018-19కిగానూ 18 మ్యాచ్‌లు, 2019-20కి గానూ 26, 2020-21కిగానూ 14, 2021-22కిగానూ 23, 2022-23కిగానూ 21 మ్యాచ్‌లు ఆడనుంది. ఆలెక్కన 102 మ్యాచ్‌లకు సగటున ఒక్కోమ్యాచ్‌కు రూ.60.1 కోట్లను స్టార్ సంస్థ చెల్లించినట్లు తెలుస్తోంది. దేశివాళీ మ్యాచ్‌లతోపాటు మహిళా క్రికెట్ మ్యాచ్‌లను కూడా స్టార్ నెట్వర్క్ ప్రసారం చేస్తుంది. వీటితోపాటు 2018-2022ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను కూడా స్టార్ ఇండియానే కైవసం చేసుకుంది. గతంలో 2012-18 మధ్య హక్కులను రూ.3851 కోట్లకు స్టార్ ఇండియానే కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఇదేం న్యాయం?
న్యూఢిల్లీ: భారత్‌లో నిర్వహించే మ్యాచ్‌ల ప్రసార హక్కుల విషయంలో బిడ్లు దాఖలు చేసిన రెండు కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మ్యాచ్‌లకు సంబంధించిన చెల్లింపులపై చివరి నిమిషంలో బీసీసీఐ మార్పులు చేయడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఏప్రిల్ 3న బిడ్ దాఖలు చేయాల్సి ఉండగా... పోటీపడ్డ స్టార్ ఇండియా, ఎస్పీఎన్ (సోనీ కార్పోరేషన్)లు ఈ అంశంపై బీసీసీఐకి లేఖ రాశాయి. ప్రసార హక్కులు పొందిన సంస్థ... సొంత గడ్డపై నిర్వహించే అన్ని మ్యాచ్‌లకు ఒకే మొత్తంలో చెల్లించడం ఎలా సాధ్యమని అందులో పేర్కొన్నాయి. టి20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ముక్కోణపు టోర్నీల వంటి సిరీస్‌లలో భారత్ పాల్గొనే మ్యాచ్‌కు, పాల్గొనని మ్యాచ్‌కు ఒకే మొత్తం చెల్లించాల్సి రావడం ఇబ్బందికరం అని స్పష్టం చేశాయి. భారత్ బరిలో ఉంటే చూసే ప్రేక్షకుల సంఖ్యకు, లేకుంటే చూసేవారికి వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఇది సబబు కాదని... తక్షణమే దాన్ని సవరించాలని కోరాయి. -
ఐపీఎల్ సాంగ్ - ‘బెస్ట్ వర్సెస్ బెస్ట్’
న్యూఢిల్లీ : ఐపీఎల్ 2018 ఆరంభానికి ముందే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీసీసీఐ, స్టార్ ఇండియా సంయుక్తంగా ‘బెస్ట్ వర్సెస్ బెస్ట్’ పేరుతో ఐపీఎల్ ప్రచార గీతాన్ని నిన్న(సోమవారం సాయంత్రం) విడుదల చేశాయి. దక్షిణాఫ్రికా ఫిల్మ్ డైరెక్టర్ డాన్ మాస్ , సంగీత దర్శకుడు రాజీవ్ వీ బల్లా, సింగర్ సిదార్థ్ బస్రూర్ ఈ గీతానికి పని చేశారు. హిందీతో పాటు, తెలుగు, తమిళ్, బెంగాలీ, కన్నడ భాషల్లో ఈ గీతాన్ని రూపొందించారు. సాంగ్ విడుదలైన కొద్దిసేపటికే మహేంద్రసింగ్ ధోని ట్వీటర్ ద్వారా స్పందించారు. ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, దానికి జోష్ తెచ్చేలా ప్రచారం ఉందన్నారు. ఏప్రిల్ 7న ప్రారంభం కానున్న ఐపీఎల్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. -
‘బెస్ట్ వర్సెస్ బెస్ట్’ ఐపీఎల్ ప్రచార గీతం విడుదల
-
‘స్టార్ ఇండియా’కు ఐపీఎల్, దేశవాళీ మ్యాచ్‌ల ప్రొడక్షన్ హక్కులు
ముంబై: స్టార్ ఇండియా 2018–19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్ ఆడియో, వీడియో ప్రొడక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులు కలిగి ఉంది. ‘మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఐపీఎల్ 2018, 2018–19 సీజన్ ప్రొడక్షన్ హక్కులు స్టార్ ఇండియాకు దక్కాయి’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరీ వెల్లడించారు. ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్ తెలిపారు. అయితే... ఒప్పందం మొత్తం ఎంతనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఐపీఎల్ ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్ ప్రసార హక్కులను గతేడాది స్టార్ ఇండియా రూ.16 వేల 347 కోట్లకు దక్కించుకుంది. -
వేల కోట్ల కాంట్రాక్ట్: ఉద్యోగులకేమో పింక్‌స్లిప్‌లు
ముంబై : వేల కోట్ల విలువైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల ప్రసార హక్కులను సొంతం చేసుకున్న స్టార్ ఇండియా, ఉద్యోగులకు మాత్రం రాం రాం అంటోంది. హక్కులను దక్కించుకోవడంలో రికార్డు విజయం సాధించిన అనంతరం, స్టార్ ఇండియా కొంత మంది ఉద్యోగులను తొలగించనుందని ఎకానమిక్ టైమ్స్ రిపోర్టు చేసింది. స్టార్ ఇండియా తొలగిస్తున్న ఉద్యోగుల్లో ఎక్కువగా బ్రాడ్‌కాస్టర్‌కు చెందిన డిస్ట్రిబ్యూషన్, ఇతర ఫంక్షన్లలో పని చేసే వారున్నారని పేర్కొంది. డిస్ట్రిబ్యూషన్ టీమ్‌లో 60 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందాయని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఇతర ఫంక్షన్ల ఉద్యోగులతో కలిపితే మొత్తంగా నెలలో 100 మంది వరకు ఉద్యోగులు స్టార్ ఇండియా నుంచి వీడినట్టు తెలిసింది. ఐపీఎల్ హక్కులకు కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించిన అనంతరం రెవెన్యూలను పెంచుకునే ఒత్తిడి పెరగడంతో, ఇక ఉద్యోగులపై వేటు వేస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. స్టార్ స్పోర్ట్స్ సేల్స్, రెవెన్యూ స్ట్రాటజీ యూనిట్లకు చెందిన కొంత మంది టాప్-లెవల్ ఎగ్జిక్యూటివ్‌లూ సంస్థను వీడాలని ఆదేశాలు జారీ అయినట్టు వెల్లడైంది. తొలగిస్తున్న ఉద్యోగులకు స్టార్ ఇండియా 12 నెలల సెవరెన్స్ ప్యాకేజీ కూడా ఇస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఐటీ, ఇతర ఫంక్షన్లకు చెందిన కొంతమంది సీనియర్ ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందాయని, స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన సీనియర్ యాడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లు తమ రాజీనామా పత్రాలు సమర్పించినట్టు తెలిసింది. రెవెన్యూలను పెంచుకోవడానికి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఈ విషయం తెలిసిన మరో వ్యక్తి చెప్పారు. అయితే ఈ విషయంపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ గుప్తాను సంప్రదించగా.. స్టార్ ఇండియా కొంత రిడండెన్సీని తగ్గిస్తుందని చెప్పిన ఆయన, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుందో స్పష్టత ఇవ్వలేదు. స్టార్ స్పోర్ట్స్‌లో సీనియర్ లెవల్ ఉద్యోగుల రాజీనామాలపై స్పందించిన గుప్తా, అక్కడ ఎలాంటి అట్రిక్షన్ లేదన్నారు. స్పోర్ట్స్ వ్యాపారాలతో తాము చాలా సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులు సంస్థను వీడటంపై ఎలాంటి నిజాలు లేవన్నారు. హాట్‌స్టార్, డేటా సైన్స్, కన్జ్యూమర్ ఇన్సైట్స్లో ఉద్యోగులను చేర్చుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల మొదట్లో స్టార్ఇండియా ఐదేళ్ల కాలానికి గాను, ఐపీఎల్ 'గ్లోబల్ మీడియా రైట్స్'ను రూ.16,347.50 కోట్లకు సొంతం చేసుకుంది. -
‘చుక్క’ల పల్లకిలో...
►ఐపీఎల్ ప్రసార హక్కుల విజేత స్టార్ ఇండియా ►రూ. 16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం ►గతంతో పోలిస్తే 158 రెట్లు పెరిగిన హక్కుల విలువ ►2018 నుంచి 2022 వరకు ఒప్పందం ధనాధన్ క్రికెట్ చూపించిన ధమాకా ఇది... పొట్టి ఆట ప్రదర్శించిన విశ్వరూపం ఇది... 20–20తో ప్రపంచ క్రికెట్ దశ, దిశను మార్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రతిష్ట చుక్కలనంటిన విలువ ఇది... ప్రతిభావంతులకు తగిన గుర్తింపునిచ్చే వేదికగా 2008లో ముందుకు వచ్చిన ఈ లీగ్ ఇన్నేళ్లలో ఆదరణలో, ఆదాయంలో తారా పథానికి చేరింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోనే అతి పెద్ద ఒప్పందంతో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోని ఇతర ప్రఖ్యాత లీగ్‌లతో పోటీ పడేలా మన ఐపీఎల్ సగర్వంగా నిలిచింది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 54.49 కోట్లు... ఏడాదికి రూ. 3269.50 కోట్లు... ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు బీసీసీఐకి స్టార్ ఇండియా చెల్లించనున్న మొత్తం ఇది! భారత జట్టు ఆడుతున్న ఒక్కో మ్యాచ్‌తో పోలిస్తే కూడా ఇది చాలా ఎక్కువ. సొంతగడ్డపై టీమిండియా మ్యాచ్‌లు, ఐసీసీ టోర్నీలు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్‌లు... ఇలా సింహభాగం క్రికెట్ కవరేజీని ఇప్పటి వరకు తమ గుప్పిట్లో ఉంచుకున్న స్టార్‌కు ఐపీఎల్ మాత్రమే లోటుగా ఉండిపోయింది. ఇప్పుడు దానిని కూడా సొంతం చేసుకొని వన్ ఛానల్ షోగా మార్చేసింది. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పంట పండింది. వచ్చే ఐదేళ్ల కాలానికి అనూహ్య మొత్తానికి టెలివిజన్, డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయాయి. రూ. 16 వేల 347.50 కోట్ల (2.55 బిలియన్ డాలర్లు) భారీ మొత్తానికి స్టార్ ఇండియా సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. సోమవారం నిర్వహించిన వేలంలో నిబంధనల ప్రకారం సీల్డ్ కవర్లో అత్యధిక బిడ్ వేసిన గ్రూప్‌నకు బీసీసీఐ హక్కులను కేటాయించింది. ఉపఖండంలో టెలివిజన్ హక్కుల కోసం స్టార్‌తో పోటీ పడిన సోనీ సంస్థ ఈసారి అవకాశం కోల్పోయింది. కొత్త ఒప్పందం ప్రకారం 2018 నుంచి 2022 వరకు స్టార్‌కు ఈ హక్కులు చెందుతాయి. 2008లో తొలి ఐపీఎల్ సమయంలో పదేళ్ల కాలానికి హక్కులను వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ 918 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 8,200 కోట్లు) సొంతం చేసుకొని... మరుసటి ఏడాది తొమ్మిదేళ్ల కోసం సోనీ గ్రూప్‌నకు 1.63 బిలియన్ డాలర్లకు అమ్మేసింది. 2015లో మూడేళ్ల కాలానికి డిజిటల్ హక్కులు 302.2 కోట్లకు అమ్ముడుపోయాయి. టెలివిజన్ ప్రేక్షకులతో పాటు ఇంటర్నెట్, మొబైల్‌లలో కూడా వీక్షకుల ఆదరణ పెరగడంతో ఈసారి రెండింటిలో బీసీసీఐ భారీ మొత్తాన్ని ఆశించింది. దానికి తగినట్లుగా ఈ రెండూ కలిపి చూస్తే తాజాగా దక్కిన మొత్తం ఏకంగా 158 రెట్లు ఎక్కువ కావడం విశేషం! మైదానం బయటి వ్యవహారాలు, వివాదాలు, కోర్టు గొడవలులాంటివి ఐపీఎల్‌కు ఉన్న ఆదరణపై ఎలాంటి ప్రభావం చూపించలేదనేది ఈ దెబ్బతో మళ్లీ రుజువైంది. సోనీ చేజారిందిలా... మొత్తం ఏడు కేటగిరీల్లో ఐపీఎల్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. భారత ఉపఖండంలో టెలివిజన్, భారత ఉపఖండంలో డిజిటల్ హక్కులతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన మరో ఐదు కేటగిరీల (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రెస్టాఫ్ వరల్డ్, మధ్యప్రాచ్యం, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, అమెరికా) కోసం కూడా వేర్వేరుగా హక్కులను అందుబాటులో ఉంచారు. భారత్‌లో టీవీ హక్కుల కోసం స్టార్ రూ. 6,196.94 కోట్లతో బిడ్ వేసింది. దీనికంటే చాలా ఎక్కువగా సోనీ రూ. 11,050 కోట్లతో బిడ్ చేసి ముందంజలో నిలిచింది. అయితే డిజిటల్ హక్కుల కోసం రూ. 1,443 కోట్లతో పాటు మిగతా ఐదు కేటగిరీలకు కూడా స్టార్ బిడ్ వేయగా... సోనీ మాత్రం మరే ఇతర కేటగిరీలోకి అడుగే పెట్టలేదు. నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలకు కలిపి వేసే ‘గ్లోబల్ బిడ్’ మొత్తం, విడివిడిగా వేసే ఏ కేటగిరీ బిడ్కంటే ఎక్కువగా ఉన్నా... ఓవరాల్‌గా గ్లోబల్ బిడ్‌కే హక్కులు కేటాయించాల్సి ఉంది. ఈ విషయంలో దూసుకు వచ్చిన స్టార్ తమ పంతం నెగ్గించుకుంది. మొత్తం 24 కంపెనీలు బిడ్ డాక్యుమెంట్‌ను కొనుగోలు చేసినా... చివరకు 14 కంపెనీలే వేలంలో పాల్గొన్నాయి. రూ. 12 కోట్లు ఎక్కువ... 2017 ఐపీఎల్లో 60 మ్యాచ్‌లు జరిగాయి. వచ్చే ఐదేళ్లలో కూడా జట్ల సంఖ్య, మ్యాచ్‌లలో మార్పులు లేకుండా ఇదే కొనసాగితే తాజా హక్కుల ప్రకారం ఒక్కో మ్యాచ్‌కు స్టార్ సంస్థ రూ. 54.49 కోట్లు చెల్లించనుంది. భారత్ ఆడే ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్‌కు సంబంధించి ప్రస్తుతం స్టార్ రూ. 43 కోట్లు (2012లో ఈ ఒప్పందం జరిగింది) చెల్లిస్తోంది. దీంతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌కు రూ. 12 కోట్లు అదనంగా వస్తున్నట్లు లెక్క. 2008లో ఐపీఎల్ కొత్తగా రావడంతో హక్కులను పదేళ్ల కాలానికి ఇచ్చారు. ఇప్పుడు దానికి సొంత గుర్తింపు ఉండటంతో పాటు ఒకే సారి పదేళ్ల కాలానికి ఇచ్చేస్తే తమకు నష్టదాయకమని బీసీసీఐ భావించింది. అందుకే ఈ సారి హక్కులను ఐదేళ్లకే పరిమితం చేశారు. ఐపీఎల్ చాలా విలువైన ఆస్తి. 2008లో లీగ్ ప్రారంభమైన నాటినుంచి భారత్‌లో క్రికెట్ స్వరూపమే మారిపోయింది. ఈ బిడ్ దాని విలువను చూపిస్తోంది. బీసీసీఐకి సంబంధించి ఎలాంటి వివాదాలు ఉన్నా... ఇప్పటికీ భారత్‌లో క్రికెట్ చూడటం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఏదో ఒకటి కాకుండా గెలిస్తే అన్ని హక్కులు మేమే గెలవాలి లేదంటే లేదు అని పట్టుదలతో బరిలోకి దిగాము. మేం చెల్లిస్తోంది మరీ భారీ మొత్తం కాదు. క్రికెట్ అభిమానులపై నమ్మకంతోనే మేం దీనికి సిద్ధమయ్యాం. మార్కెట్ విలువను బట్టి చూస్తే ఇది సరైన నిర్ణయమే. ఐపీఎల్ ద్వారా ఇప్పుడు అభిమానులకు మేం మరింత చేరువవుతాం. – ఉదయ్‌శంకర్, స్టార్ సీఈఓ బీసీసీఐ కోశాధికారి అనిరుద్ చౌదరీ, అధ్యక్షుడు సీకే ఖన్నా, పరిపాలకుల కమిటీ సభ్యురాలు డయానాఎడుల్జీ, స్టార్ సీఈఓ ఉదయ్ శంకర్, బీసీసీఐ సెక్రటరీ అమితాబ్ చౌదరీ, సీఈఓ జోహ్రి -
స్టార్ ఇండియాతో పోటీ పడిన సోనీ
-
రియో ఒలంపిక్స్ కు స్టార్ ఇండియా సిద్ధం!
ప్రపంచ క్రీడా సంరంభానికి స్టార్ ఇండియా సర్వం సిద్ధం చేసింది. క్రీడాభిమానులను ఆకట్టుకునేందుకు వీలుగా 24x7 ప్రసారాలతో సమాయత్తమవుతోంది. మొత్తం 34 చానెల్స్.. వాటిలో 8 చానెల్స్ పూర్తిగా క్రీడా ప్రేమికులకోసమే. అవును...ఎప్పటినుంచి అనుకుంటున్నారా.. ఇంకా 49 రోజుల తర్వాత.. అంటే ఆగస్టు 5 నుంచి బ్రెజిల్ లో జరగబోయే రియో ఒలంపిక్స్ ప్రారంభతేదీ నుంచి ఈ ఒలంపిక్స్ ను 24x7 లు క్రీడాభిమానులు వీక్షించేలా ఈ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఎనిమిది చానెల్స్ ను పూర్తిగా రియో ఒలంపిక్స్ ప్రసారాలకు కేటాయిస్తున్నామని స్టార్ ఇండియా గురువారం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లో రియో ఒలంపిక్స్ ప్రసారం చేయనున్నట్టు పేర్కొంది. అదేవిధంగా స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ రెండూ కలిసి ఒలంపిక్స్ ను 3000 పైగా గంటలపాటు లైవ్ కంటెట్ ప్రసారం చేసేలా నిర్ణయం తీసుకున్నాయి. 'ఒలంపిక్స్ అనేది బహుళ క్రీడా వేడుక. ఈ వేడుకల్లో భారత్ క్రీడాకారులు చాలా మంది పాల్గొంటుంటారు. భారత క్రీడాభిమానులకు ఈ వేడుకలో జరగబోయే క్రీడలను గురించి సమగ్ర సమాచారం అందించడానికి తోడ్పడతాం.. 24x7 బేసిస్ తో ఎనిమిది చానెల్స్ ను ఈ అపూర్వమైన ప్రదర్శన ఇవ్వడానికే కేటాయించాం.. మొదటిసారి రెండు భాషల్లో ఈ వేడుకను ప్రసారం చేయబోతున్నాం.. ' అని స్టార్ స్పోర్ట్స్ సీఈవో నితిన్ కుక్రేజా తెలిపారు. యాడ్ సపోర్టుతో హాట్ స్టార్ లో ఒలంపిక్స్ కంటెట్ లను ఉచితంగా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఎక్స్ క్లూజివ్ గా ఎలైట్ ప్యానెల్ తో పాటు, భారత స్పోర్ట్స్ నిపుణులను ఏర్పాటుచేసి, ఒలంపిక్స్ గురించి విశ్లేషణ, కామెంటరీ, అభిప్రాయాలను క్రీడాభిమానులతో షేర్ చేసుకునేలా లైవ్ ప్రోగ్రామ్ లు చేపడతామన్నారు. -
రూ. 3 లక్షల కోట్ల పెట్టుబడులకు రెడీ: యూఎస్ఐబీసీ
మోదీ ప్రపంచానికే అదర్శం: జాన్ చాంబర్స్ భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు అత్యంత ఉత్సాహంతో ఉన్నాయని యూఎస్ఐబీసీ చైర్మన్ జాన్ చాంబర్స్ పేర్కొన్నారు. గడిచిన రెండేళ్లలోపే తమ సభ్య కంపెనీలు దాదాపు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని.. వచ్చే 2-3 ఏళ్లలో అదనంగా మరో 45 బిలియన్ డాలర్లకుపైగా (దాదాపు రూ.3 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చాంబర్స్ ప్రకటించారు. ‘డిజిటల్ ఇండియాతో పాటు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమల్లో ప్రధాని మోదీ చూపిస్తున్న చొరవ ప్రశంసనీయం. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే.. అమెరికా పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశం ఉంది. రెట్టింపు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోదీ దార్శనికతతో భారత్ ఇప్పుడు సరికొత్త వృద్ధి పథంవైపు అడుగులేస్తోంది. ప్రపంచంలో చాలా మంది దేశాధినేతలను కలిసే అవకాశం నాకు లభించింది. అయితే, మోదీ కార్యదక్షతను చూస్తుంటే వచ్చే ఐదేళ్లపాటు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ కొనసాగుతుందని భావిస్తున్నా. సమ్మిళిత ఆర్థికాభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టితో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా మోదీ సమర్థంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఒక్క వర్ధమాన దేశాలకు మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారు’ అని చాంబర్స్ కొనియాడారు. మరో 3 బిలియన్ డాలర్లు వెచ్చిస్తాం: అమెజాన్ భారత్‌లో మరో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పేర్కొంది. 2014లో ప్రకటించిన 2 బిలియన్ డాలర్లను కలుపుకుంటే.. తమ మొత్తం పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లను చేరుతున్నాయని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ చెప్పారు. యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును అందుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్‌లో ఇప్పటికే మేం 45,000 ఉద్యోగాలను కల్పించాం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి జోరు కొనసాగనుంది. మా అమెజాన్ ఇండియా బృందం అనేక ప్రతిష్టాత్మక మైలురాళ్లను అధిగమించింది కూడా’ అని బెజోస్ చెప్పారు. మూడేళ్లలో 5 బిలియన్ డాలర్లు: స్టార్ ఇండియా ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్ అనుబంధ సంస్థ స్టార్ ఇండియా కూడా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించింది. వచ్చే మూడేళ్లలో అదనంగా 5 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నామని స్టార్ ఇండియా చైర్మన్, సీఈఓ ఉదయ్ శంకర్ చెప్పారు. ‘భారత్ మార్కెట్లో అపారమైన అవకాశాలున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న బడా విదేశీ ఇన్వెస్టర్లలో మేం కూడా ఉన్నాం. మీడియా-ఎంటర్టైన్మెంట్ రంగంలో అతిపెద్ద ఇన్వెస్టర్‌గా నిలుస్తున్నాం’ అని శంకర్ చెప్పారు. -
స్టార్ ఇండియాలో మా టీవీ విలీనం పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మా టెలివిజన్ నెట్వర్క్ విలీన ప్రక్రియ పూర్తయినట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన మా టీవీ, మా గోల్డ్, మా మ్యూజిక్, మా సినిమా చానల్స్‌ను కొనుగోలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా దిగ్గజం రూపక్ మర్డోక్‌కు చెందిన ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్‌కు చెందిన స్టార్ ఇండియా గ్రూపు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విలీనం అధికారికంగా పూర్తయ్యిందని స్టార్ ఇండియా ప్రకటించింది. దీంతో తెలుగు టెలివిజన్ విభాగంలో కొత్త కార్యక్రమాలు ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుందని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ తెలిపారు. ప్రస్తుతం స్టార్ ఇండియా ఎనిమిది భాషల్లో 40 టెలివిజన్ చానల్స్‌ను కలిగి ఉంది. మా టీవీలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు సినీ నటులు నాగార్జున, చిరంజీవి కుటుంబాలకు వాటా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం విలువ రూ. 2,500 కోట్లు ఉండొచ్చన్నది మార్కెట్ వర్గాల అంచనా. -
న్యూస్ కార్ప్ చేతికి స్క్రీన్, వీసీ సర్కిల్
వీసీ సర్కిల్ డీల్ విలువ రూ.100 కోట్లు? న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ భారత్‌లో తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. తాజాగా ఆయన సారథ్యంలోని న్యూస్ కార్ప్ ఒకే రోజున మరో రెండు కొనుగోళ్లు జరిపింది. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్‌కి చెందిన సినీ పత్రిక ‘స్క్రీన్’ను, ఆర్థికాంశాల సమాచారాన్నందించే వీసీసర్కిల్ను కొనుగోలు చేసినట్లు సోమవారం వెల్లడించింది. తాజా డీల్‌తో న్యూస్ కార్ప్ భారత విభాగం స్టార్ ఇండియాకు.. స్క్రీన్ బ్రాండ్ ఫ్రాంచైజీ హక్కులు లభిస్తాయి. కీలకమైన ఉద్యోగులు స్టార్ ఇండియాకు బదిలీ అవుతారు. మరోవైపు, మొజాయిక్ మీడియా వెంచర్స్‌తో ఒప్పందం ప్రకారం వీసీసర్కిల్ నెట్వర్క్ కూడా న్యూస్ కార్ప్ చేతికి వస్తుంది. వీసీసర్కిల్డాట్కామ్, టెక్సర్కిల్డాట్ఇన్, వీసీసీఎడ్జ్, వీసీసర్కిల్ ట్రెయినింగ్ మొదలైనవి వీసీసర్కిల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. భారత్‌లో కార్యకలాపాలను మరింతగా విస్తరించాలన్న తమ లక్ష్యానికి అనుగుణంగా ఈ పెట్టుబడులు ఉన్నాయని న్యూస్ కార్ప్ సీఈవో రాబర్ట్ థామ్సన్ చెప్పారు. న్యూస్ కార్ప్ ఇటీవలే ప్రాప్‌టైగర్, బిగ్డెసిషన్స్డాట్కామ్ వంటివి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగంలో మరింత పట్టు సాధించేందుకు స్క్రీన్ కొనుగోలు ఉపయోగపడగలదని స్టార్ ఇండియా సీఈవో ఉదయ్ శంకర్ తెలిపారు. ఆన్లైన్లో కంటెంట్‌పరంగా ఇది తమ డిజిటల్ ప్లాట్‌ఫాం ‘హాట్‌స్టార్’కి కూడా మరింతగా తోడ్పడగలదని ఆయన వివరించారు. స్క్రీన్ బ్రాండ్‌ను స్టార్ ఇండియా మరింత మెరుగ్గా తీర్చిదిద్దగలదని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ సీఎండీ వివేక్ గోయెంకా ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, స్క్రీన్ ప్రింట్ ఎడిషన్ ముద్రణను స్టార్ ఇండియా ఇకపై కొనసాగించకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 1951లో ప్రారంభమైన స్క్రీన్.. సినిమా, ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించిన పత్రికను ముద్రిస్తోంది.అలాగే స్క్రీన్ పేరిట అవార్డుల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మరోవైపు, స్టార్ ఇండియాకు 7 భాషల్లో దాదాపు 40 ఛానళ్లు నిర్వహిస్తోంది. వీటికి సుమారు 70 కోట్ల వీక్షకులు ఉన్నారని అంచనా. వీసీ సర్కిల్ డీల్..: వీసీ సర్కిల్ నెట్వర్క్ కొనుగోలు కోసం న్యూస్‌కార్ప్ రూ. 100 కోట్ల మేర వెచ్చిస్తున్నట్లు సమాచారం. నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న వీసీసర్కిల్ నెట్‌వర్క్‌లో దాదాపు 100 మంది ఉద్యోగులు ఉన్నారు. -
స్టార్ ఇండియా ఉదయ్‌కు ఇంపాక్ట్ పర్సన్ అవార్డ్
హైదరాబాద్: స్టార్ ఇండియా సీఈఓ ఉదయ్ శంకర్‌కు ‘ద ఇంపాక్ట్ పర్సన్ ఆఫ్ ద డికేడ్-2014 అవార్డ్’ లభించింది. ఇటీవల ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఈ అవార్డును ఉదయ్ శంకర్‌కు ప్రదానం చేశారని స్టార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. మీడియా, మార్కెటింగ్, ప్రకటనల పరిశ్రమకు దశాబ్దకాలంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా అవార్డు లభించిందని పేర్కొంది. -
మ్యాచ్‌కు రూ. 1.92 కోట్లు
చెన్నై: దాదాపు పదేళ్లపాటు భారత క్రికెట్ జట్టుతో మమేకమైన సహారా గ్రూప్ లోగో ఇకపై ఆటగాళ్ల జెర్సీలపై కనిపించదు. సహారా స్థానంలో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జట్టు నూతన స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. మూడేళ్లపాటు బీసీసీఐతో ఈ ఒప్పందం కొనసాగుతుంది. అయితే సహారా.. స్టార్ ఇండియా కన్నా ఎక్కువ మొత్తంతో వేలంలో పాల్గొన్నప్పటికీ గత విభేదాల దృష్ట్యా బోర్డు సహారా బిడ్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. ‘బీసీసీఐ, ఐసీసీ, ఏసీసీ ఈవెంట్స్‌లో ఆడే భారత జట్టు స్పాన్సర్షిప్ హక్కులను స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. ఇవి జనవరి 1, 2014 నుంచి మార్చి 31, 2017 వరకు అమల్లో ఉంటాయి. ఈ హక్కుల కోసం పోటీలో ఉన్న ఏడు బిడ్లను పరిశీలించాం. ఈ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్స్‌ను ఆహ్వానించాం. చివరికి పోటీలో స్టార్, సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ నిలిచాయి. దీంట్లో సహారా బిడ్ ఆమోదయోగ్యం కాదని గుర్తించాం. అలాగే స్టార్ గ్రూప్ 2018 వరకు భారత క్రికెట్ ప్రసార, ఇంటర్నెట్, మొబైల్ హక్కులను కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే మార్చి 31 వరకు బీసీసీఐ అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లకు స్టార్ గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా ఇప్పటికే వ్యవహరిస్తోంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. అధికారిక టీమ్ స్పాన్సర్ హోదాలో స్టార్ గ్రూప్ తమ లోగోను పురుషుల జాతీయ జట్టు, అండర్-19 పురుషుల జట్టు, ‘ఎ’ జట్టు, మహిళల జట్టు ఆటగాళ్ల జెర్సీలపై కలిగి ఉంటుంది. అయితే స్టార్‌తో ఏర్పరుచుకున్న ఒప్పందం ద్వారా తమకు ఎంత మొత్తం సమకూరేదీ బీసీసీఐ వెల్లడించలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ ఆడే ఒక్కో మ్యాచ్‌కు రూ.కోటీ 92 లక్షలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్ టోర్నీలలో భారత్ ఆడే మ్యాచ్‌లకు మాత్రం రూ. 61 లక్షల చొప్పున చెల్లిస్తారు. మ్యాచ్‌కు కనీస ధర తగ్గించిన బోర్డు మూడేళ్ల క్రితం బీసీసీఐ తమ ఒక్కో మ్యాచ్‌కు కనీస ధరను రూ.2.5 కోట్లుగా నిర్ణయించింది. అప్పట్లో పోటీకి వచ్చిన ఎయిర్టెల్ (రూ.2.89 కోట్లు)ను అధిగమించి సహారా ఒక్కో మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో రూ.3.34 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆర్థిక ప్రపంచంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా ఈసారి బీసీసీఐ తమ కనీస ధరను తగ్గించుకుని రూ. కోటీ 50 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు బోర్డు గతంతో పోలిస్తే రూ.కోటీ 42 లక్షల ఆదాయం కోల్పోనుంది. ముందే ఎందుకు వద్దనలేదు: సహారా జట్టు స్పాన్సర్షిప్ వ్యవహారమంతా లోపభూయిష్టంగా ఉందని సహారా గ్రూప్ ధ్వజమెత్తింది. తమతో విభేదాల దృష్ట్యానే బిడ్ నుంచి పక్కకు తప్పించారని ఆరోపించింది. ‘మాతో గొడవ ఉందనుకుంటే ప్రారంభంలోనే మాపై ఎందుకు అనర్హత వేటు వేయలేదు. ఇదంతా ముందే అనుకున్న వ్యవహారంగా స్పష్టంగా తేలిపోయింది. బీసీసీఐ ప్రతీ మ్యాచ్‌కు మేం రూ.2.35 కోట్లు, ఐసీసీ మ్యాచ్‌కు రూ.91 లక్షలు ఇస్తామని బిడ్ వేశాం. ఓవరాల్‌గా మా మొత్తం బిడ్ రూ.252 కోట్లుగా ఉంది. స్టార్ మాత్రం రూ.203 కోట్లు మాత్రమే ఇస్తామంది’ అని సహారా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ అభిజిత్ ఆరోపించారు. ఐపీఎల్ నుంచి పుణే వారియర్స్ జట్టును బీసీసీఐ తొలగించినప్పటి నుంచి సహారాకు, బోర్డుకు పడటం లేదు. -
రూ. 100 కోట్ల 'మహా' సీరియల్!
బాలీవుడ్ సినిమాలకు రూ. 100 కోట్లు ఖర్చు చేయడం సాధారణ విషయం. అలాగే హిందీ సినిమాలు రూ. 100 కోట్లు వసూలు సాధిస్తుండడం కూడా మామూలు విషయంగా మారిపోయింది. బుల్లితెర కూడా భారీతనాన్ని ఆపాదించుకుంటోంది. టీవీ సీరియళ్లకు ఆదరణ పెరుగుతుండడంతో భారీ వ్యయంతో వీటిని నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు వస్తున్నారు. భారతదేశ టెలివిజన్ చరిత్రలో అత్యంత భారీ వ్యయంతో రూపొందిన మెగా సీరియల్ నేటి (సెప్టెంబర్ 16) రాత్రి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. భారతీయులు ఇతిహాసం మహాభారతం ఇప్పుడు ఆధునికత హంగులతో మరోసారి చిన్నితెరపై ప్రేక్షకులను అలరించనుంది. దూరదర్శన్‌లో రెండు దశాబ్దాల పాటు ప్రసారమయి, వీక్షకుల మన్నలందుకున్న మహాభారత్ సీరియల్ ఇప్పుడు స్టార్ ప్లస్‌లో సరికొత్తగా రానుంది. స్టార్ ఇండియా రూ. 100 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించింది. స్వస్తిక్ పతాకంపై సిద్ధార్థ కుమార్ తివారి దీన్ని నిర్మించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 8.30 గంటల నుంచి అరగంటపాటు ఈ సీరియల్ ప్రసారమవుతుంది. 128 ఎపిసోడ్లు ప్రసారం చేయనున్నారు. మనదేశంలో అత్యంత భారీ వ్యయంతో రూపొందించిన సీరియల్‌గా 'మహాభారత్' నిలిచింది. దీని నిర్మాణానికి రూ. వంద కోట్లు ఖర్చు చేయగా, మార్కెటింగ్ కోసం మరో రూ. 20 కోట్లు కేటాయించారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సీరియల్ నిర్మించామని స్టార్ ఇండియా మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ మదహుక్ వెల్లడించారు. యువ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాలన్న ఉద్దేశంతో గ్రాఫిక్స్ అధిక వ్యయం చేసినట్టు వివరించారు. నేటి యువత అభిరుచికి అనుగుణంగా పాత్రలను మలిచామని చెప్పారు. ప్రస్తుత సమాజంలో మానవ ప్రవర్తనకు సంబంధించిన వాస్తవాలను దీని ద్వారా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పారు. భారీ వ్యయంతో తెరకెక్కిన మహాభారత్ సీరియల్‌ను ప్రమోట్ చేసేందుకు స్టార్ ఇండియా వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా 8 నగరాల్లోని షాపింగ్స్ మాల్స్‌లో మహాభారత్ సీరియల్ మ్యూజియంలు పెట్టింది. సీరియల్లో వివిధ పాత్రధారులు వినియోగించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇందులో ప్రదర్శనకు ఉంచారు. అలాగే చిన్న పట్టణాలకు సంచార మ్యూజియంల ద్వారా ఈ సీరియల్ విశేషాలు చేరవేయనున్నారు. మహాభారత్ సీరియల్ పాత్రధారులు దేశవ్యాప్తంగా కాలేజీ క్యాంపస్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. మరోవైపు సీరియల్ మధ్యలో ప్రసారం చేసే వాణిజ్య ప్రకటనలకు 10 సెకండ్లకు రూ. 2 లక్షల ధర నిర్ణయించారు. సీరియల్ ప్రారంభమైన తర్వాత ప్రకటనల రేట్లు మరింత పెరిగే అవకాశముందంటున్నారు. ఢిల్లీకి పూజా శర్మ ద్రౌపదిగా పాత్రతో బుల్లి తెరకు పరిచయమవుతోంది. కృష్ణుడిగా సౌరభ్ జైన్, అర్జునుడుగా షహీర్ షేక్ నటించారు. అత్యంత భారీ వ్యయంతో రూపొందిన ఆధునిక మహాభారత్ మెగా సీరియల్ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.