ఈరోజుతో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ముగియనున్న సంగతి మనకు తేలిసిందే. నేటి(నవంబర్ 14) ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో క్వాలిఫైయింగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి భారతదేశం నిష్క్రమించిన సంగతి తేలిసిందే. అయితే, ఇండియన్ క్రికెట్ టీమ్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటి బాట పట్టడంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్‌వర్క్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో సుమారు 200 కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణుల తెలిపారు.
యుఏఈలో నెల రోజులగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మ్యాచ్‌లు జరిగే సమయంలో టీవీలో ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ రూ.900 కోట్లు-రూ.1,200 కోట్లు వసూలు చేయలని అంచనా వేసింది. అలాగే, స్టార్ నెట్‌వర్క్ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా సుమారు 250 కోట్ల రూపాయలు సంపాదించాలని చూసినట్లు ఆ సంస్థకు చెందిన కొందరు తెలిపారు. మీడియా అనుభవజ్ఞుడు మదన్ మోహపాత్ర అంచనా ప్రకారం.. భారతదేశం నిష్క్రమించడం వల్ల నెట్‌వర్క్ తన క్రీడా ఛానెళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15-20% కోల్పోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే వెనుకకు తీరగడంతో ఆ తర్వాత చూసే వీక్షకుల సంఖ్య తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య పెరిగిన అది అంతగా ఉండకపోవచ్చు అని అతని అభిప్రాయం.
(చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?)
సాధారణంగా, బ్రాడ్ కాస్టర్లు ముందుగానే క్రికెట్ టోర్నమెంట్ కోసం ప్రకటన స్లాట్లలో 80-85% బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత టీవీ ఛానెల్ మిగిలిన స్లాట్లను తెరిచి ఉంచుతుంది. తద్వారా టోర్నమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో రేట్లను పెంచేవారు. కానీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ఇప్పుడు స్పాట్ రేట్లను పెంచే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నమెంట్ ప్రారంభ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రకటన దారులు 10 సెకన్ల యాడ్ కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడి ఉంటే బ్రాడ్ కాస్టర్ 10 సెకన్ల ప్రకటనల కోసం కనీసం రూ.35 లక్షలు బ్రాడ్ కాస్టర్ సంపాదించేదని నిపుణుల అభిప్రాయం. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటికి చేరడంతో భారీగా బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోల్పోయినట్లు తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment