ICC T20 World Cup 2021
-
ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్
క్యాచ్‌రిచ్ లీగ్‌గా ముద్రపడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయింది. యుగోవ్స్ 2022 స్పోర్ట్స్ బజ్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ అగ్రస్థానంలో నిలించింది. రెండో స్థానంలో టోక్యో ఒలింపిక్స్(సమ్మర్ ఒలింపిక్స్) నిలవగా.. మూడోస్థానంలో ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ మూడో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు యుగోవ్స్ తెలిపింది. ఇక ఐపీఎల్ 14వ సీజన్ తొలి అంచె పోటీలు మనదగ్గరే జరగ్గా.. కరోనా విజృంభణతో రెండో అంచె పోటీలు యూఏఈ వేదికగా జరిగింది. అయినప్పటికి భారత అభిమానులను అలరించిన ఐపీఎల్ 50.8 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచింది. కాగా యుగోవ్స్ స్పోర్ట్స్ ర్యాంకింగ్స్‌లో ఐపీఎల్ తొలిస్థానంలో నిలవడం వరుసగా రెండోసారి. గతేడాది ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ ఐపీఎల్‌దే తొలిస్థానం. ►ఇక ఐపీఎల్ తర్వాత ఇండియాలో అత్యంత ఎక్కువ జనాధరణ పొందింది టోక్యో ఒలింపిక్స్. 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా మరుసటి ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో గతేడాది ఆగస్టులో నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్‌లో ఎన్నడూ లేనంతగా మనకు ఏడు పతకాలు రావడం విశేషం. ఇందులో నీరజ్ చోప్రా స్వర్ణం గెలవడం చరిత్రలో నిలిచిపోయింది. 49.2 పాయింట్లతో .. కేవలం 1.6 పాయింట్ల తేడాతో తొలిస్థానం కోల్పోయినప్పటికి.. రెండోస్థానంలో నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. ►సాధారణంగా ఐసీసీ టోర్నీలు జరిగితే ఇండియాలో ఎక్కువమంది చూస్తుంటారు. కానీ గతేడాది జరిగిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నిరాశపరిచింది. సూపర్-12 దశలోనే ఇంటిబాట పట్టినప్పటికి.. ఐసీసీ టోర్నీని ఇండియా అభిమానులు ఆదరించారని సర్వేలో తేలింది. 45.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచిన ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్.. అంతకముందు ఇచ్చిన స్కోరు కంటే 0.4 మాత్రమే తక్కువగా ఉండడం విశేషం. ►ఈ మూడింటి తర్వాత ఫుట్‌బాల్ వరల్డ్‌కప్(28.3 పాయింట్లు), ఇండియన్ సూపర్ లీగ్(20.4 పాయింట్లు), వింబుల్డన్ చాంపియన్‌షిప్(టెన్నిస్, 18 పాయింట్లు) వరుసగా 4,5,6 స్థానాల్లో నిలవగా.. ప్రొ కబడ్డీ లీగ్ 17.9 పాయింట్లతో ఏడోస్థానం.. ఏసియన్ గేమ్స్ 15.3 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ) 13.3.. ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ 13 పాయింట్లతో తొమ్మిది, 10 స్థానాల్లో ఉన్నాయి. ఇక యుగోవ్స్ తమ ర్యాంకింగ్స్‌ను స్పోర్ట్స్ ఇండెక్స్ రోజువారీగా బ్రాండ్ల పట్ల ప్రజల అవగాహనను కొలమానంలోకి తీసుకొని నిర్థారణ చేస్తుంది. -
ఇండియా క్రికెట్ టీమ్ ఎఫెక్ట్.. స్టార్ ఇండియాకు ఇన్ని కోట్లు నష్టమా?
ఈరోజుతో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ముగియనున్న సంగతి మనకు తేలిసిందే. నేటి(నవంబర్ 14) ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో క్వాలిఫైయింగ్ దశలోనే టోర్నమెంట్ నుంచి భారతదేశం నిష్క్రమించిన సంగతి తేలిసిందే. అయితే, ఇండియన్ క్రికెట్ టీమ్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటి బాట పట్టడంతో బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా నెట్వర్క్ ప్రకటనల రూపంలో వచ్చే ఆదాయంలో సుమారు 200 కోట్ల రూపాయలు కోల్పోయే అవకాశం ఉంది అని మార్కెట్ నిపుణుల తెలిపారు. యుఏఈలో నెల రోజులగా జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మ్యాచ్‌లు జరిగే సమయంలో టీవీలో ప్రకటనలను ప్రసారం చేయడం ద్వారా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ రూ.900 కోట్లు-రూ.1,200 కోట్లు వసూలు చేయలని అంచనా వేసింది. అలాగే, స్టార్ నెట్వర్క్ ఓటిటీ ప్లాట్ ఫామ్ డిస్నీ+ హాట్ స్టార్ ద్వారా సుమారు 250 కోట్ల రూపాయలు సంపాదించాలని చూసినట్లు ఆ సంస్థకు చెందిన కొందరు తెలిపారు. మీడియా అనుభవజ్ఞుడు మదన్ మోహపాత్ర అంచనా ప్రకారం.. భారతదేశం నిష్క్రమించడం వల్ల నెట్వర్క్ తన క్రీడా ఛానెళ్ల ద్వారా వచ్చే ఆదాయంలో 15-20% కోల్పోయే అవకాశం ఉంటుందని అంచనా వేశారు. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే వెనుకకు తీరగడంతో ఆ తర్వాత చూసే వీక్షకుల సంఖ్య తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.ఒక సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్ సమయంలో వీక్షకుల సంఖ్య పెరిగిన అది అంతగా ఉండకపోవచ్చు అని అతని అభిప్రాయం. (చదవండి: మామూలు చాయ్‌వాలా కాదు.. 'ఎంఎ ఇంగ్లీష్ చాయ్‌వాలి', ఎక్కడంటే?) సాధారణంగా, బ్రాడ్ కాస్టర్లు ముందుగానే క్రికెట్ టోర్నమెంట్ కోసం ప్రకటన స్లాట్లలో 80-85% బుక్ చేసుకుంటారు. ఆ తర్వాత టీవీ ఛానెల్ మిగిలిన స్లాట్లను తెరిచి ఉంచుతుంది. తద్వారా టోర్నమెంట్ ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లలో రేట్లను పెంచేవారు. కానీ, బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా ఇప్పుడు స్పాట్ రేట్లను పెంచే అవకాశాన్ని కోల్పోయింది. టోర్నమెంట్ ప్రారంభ దశలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం ప్రకటన దారులు 10 సెకన్ల యాడ్ కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్తాన్ తలపడి ఉంటే బ్రాడ్ కాస్టర్ 10 సెకన్ల ప్రకటనల కోసం కనీసం రూ.35 లక్షలు బ్రాడ్ కాస్టర్ సంపాదించేదని నిపుణుల అభిప్రాయం. భారత్ క్వాలిఫైయింగ్ దశలోనే ఇంటికి చేరడంతో భారీగా బ్రాడ్ కాస్టర్ స్టార్ ఇండియా కోల్పోయినట్లు తెలుపుతున్నారు. -
నేటి నుండి టీ ట్వంటీ వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్
-
క్రికెట్ ప్రియులకు ఇక పండగే.. మల్టీప్లెక్స్‌ల్లో టీ-20 ప్రపంచకప్ లైవ్ మ్యాచ్‌లు
న్యూఢిల్లీ: సినిమా థియేటర్లలో క్రికెట్ లైవ్ మ్యాచ్ చూస్తే ఎలా ఉంటుదో ఒకసారి ఊహించుకోండి! బొమ్మ అదుర్స్ కదూ. అలా వింటుంటే ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అనిపిస్తుందా?. అయితే, కొంచెం ఓపిక పట్టండి మీ కల కొద్ది రోజుల్లో నిజం కాబోతుంది. ఐసీసీ పురుషుల టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని తమ థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మల్టీప్లెక్స్ చైన్ ఇనాక్స్ లీజర్ లిమిటెడ్ తెలిపింది. యూఏఈ, ఒమన్లలో బీసీసీఐ ఆతిథ్యమిచ్చిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 7వ ఎడిషన్ అక్టోబర్ 17న ప్రారంభం కాబోతోంది. ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో ఈ ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ నవంబరు 14న జరగనుంది. మార్క్యూ లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శించనున్నట్లు ఇనాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అన్ని ప్రధాన నగరాల్లోని ఇనాక్స్ మల్టీప్లెక్స్‌ల్లో మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. పెద్ద థియేటర్ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా.. క్రికెట్ మైదానంలోనే మ్యాచ్‌ను వీక్షిస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు కలగజేయాలన్నదే దీని వెనక ఉద్దేశమని కంపెనీ పేర్కొంది. (చదవండి: AICF: చెస్‌కు ‘ఎంపీఎల్’ అండ.. కోటితో మొదలుపెట్టి..) క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణకు టికెట్టు ధర నగరాన్ని బట్టి రూ.200 నుంచి రూ.500 వరకు ఉంటుందని తెలిపింది. ఐనాక్స్కు 70 నగరాల్లో 56 మల్టీప్లెక్స్‌లు, 658 థియేటర్లు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకున్న వారికి మాత్రమే టికెట్ విక్రయించనునట్లు సంస్థ తెలిపింది. ఈ సంస్థ ఇటీవల లక్నోలోని పలాసియో మాల్లో, ముంబైలోని మలాడ్ లోని ఇనార్బిట్ మాల్లో భారీ మెగాప్లెక్స్ ప్రారంభించింది. పీవీఆర్ సినిమాస్ ఇండియాలో ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2021ను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నట్లు పీవీఆర్ సినిమాస్ కూడా ప్రకటించింది. పీవీఆర్ సినిమాస్ మల్టీప్లెక్స్‌ల్లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌తో పాటు టీమ్ ఇండియా ఆడనున్న అన్ని లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా ప్రదర్శించనుంది. దేశంలోని 35కి పైగా నగరాల్లో 75కు పైగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ మ్యాచ్‌లు ప్రసారం చేయనున్నారు. ఇందులో న్యూఢిల్లీ, ముంబై, పూణే, అహ్మదాబాద్ వంటి టైర్-1, టైర్-2 నగరాలు ఉన్నాయి.(చదవండి: బైక్ కొనేవారికి రివోల్ట్ మోటార్స్ శుభవార్త!) -
ఆసీస్ జట్టు ఇదే; వరల్డ్‌కప్ ద్వారా అరంగేట్రం చేయనున్న ఆటగాడు
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటంచాల్సిందిగా ఐసీసీ సూచించింది. తాజాగా గురువారం ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌కు ఆరోన్ పించ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఇటీవలే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన జోష్ ఇంగ్లీష్‌కి తొలిసారి ఆసీస్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్ర క్రికెటర్‌గా జోష్ ఇంగ్లీష్ నిలవనున్నాడు. డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండనున్నారు. ఇక సూపర్ 12లో గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 30న ఇంగ్లాండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. వీటితో పాటు క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. ఇక వ్యక్తిగత కారణాలతో స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ Our Australian men's squad for the ICC Men’s #T20WorldCup! 🇦🇺 More from Chair of Selectors, George Bailey: https://t.co/CAQZ4BoSH5 pic.twitter.com/aqGDXZu0t9 — Cricket Australia (@CricketAus) August 19, 2021