Australia Announce Squad For T20 World Cup; Josh Inglis Receives Maiden Call-Up - Sakshi
Sakshi News home page

ICC T20 World Cup 2021: ఆస్ట్రేలియా జట్టు ఇదే..

Published Thu, Aug 19 2021 11:15 AM | Last Updated on Thu, Aug 19 2021 4:16 PM

Australia Announce T20 Sqaud World Cup Josh Inglis Receives Maiden Call - Sakshi

సిడ్నీ: టీ20 ప్రపంచకప్‌ 2021కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటంచాల్సిందిగా ఐసీసీ సూచించింది. తాజాగా గురువారం ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌కు  ఆరోన్‌ పించ్‌ సారధ్యం వహించనున్నాడు. ఇక ఇటీవలే బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, పాట్‌ కమిన్స్‌ తిరిగి జట్టులోకి వచ్చారు.

స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌  జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన జోష్ ఇంగ్లీష్‌కి తొలిసారి ఆసీస్‌ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్ర క్రికెటర్‌గా జోష్‌ ఇంగ్లీష్‌ నిలవనున్నాడు. డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్‌ రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉండనున్నారు.

ఇక సూపర్‌ 12లో గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 30న ఇంగ్లాండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. వీటితో పాటు క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. 

ఇక వ్యక్తిగత కారణాలతో స్టీవ్‌ స్మిత్‌ టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్‌ రిచర్డ్‌సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా

రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement