squad
-
TG: వీవీఐపీలకు గద్దలతో భద్రత..త్వరలో రంగంలోకి ‘గరుడ దళం’
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పి స్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనం. అయినా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో.. గగనతలం నుంచీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం తెలంగాణ పోలీసులు త్వరలో ‘గరుడ దళం (ఈగిల్ స్క్వాడ్)’ను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 4 గద్దలకు మొయినా బాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదు ఇచ్చారు. ఇటీవలే ఈ ‘గరుడ దళం’ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద డెమోను సైతం ఇచ్చింది. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు పోలీస్ ఉన్నతాధి కారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)లో భాగంగా ఉంటూ తెలంగాణలో వీవీఐపీ రక్షణను పర్యవేక్షించనుంది.గగనతలం నుంచి నిఘా నేత్రాలుగా..దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో గరుడ దళాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. చిన్న పక్షి పిల్లలను తెచ్చి,వాటిని పోషిస్తూ, తర్ఫీదు ఇస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారితోపాటు కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌తో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానాస్పద వ్యక్తులను గమ నించడం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో వీటికి అమర్చిన ప్రత్యేక నిఘా కెమెరాల సాయంతో భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతారు.అనుమానం రాకుండా...సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టవచ్చు. కానీ డ్రోన్ల నుంచి వెలువడే శబ్దం, వాటి కదలికలను కింద ఉన్నవారు సులువుగా గుర్తించవచ్చు. దీనితో నేరస్తులు అప్రమత్తమై తప్పించుకోవడం, లేదా తాము చేసేది గమనించ లేకుండా చేయడం వంటివాటికి పాల్పడే చాన్స్ ఉంటుంది. అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే వీఐ పీల భద్రతతోపాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలిక లను పసిగట్టేందుకు కూడా ఈ గరుడ స్క్వాడ్‌ను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. అంతేగాక డ్రోన్లను ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశముండదు. వాటి వేగమూతక్కువ. అదే ‘గరుడ స్క్వాడ్’తో ఈ సమస్యలు ఉండవని అంటున్నారు.ఇదీ చదవండి: నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో -
రంజీ ‘జట్టు’లో విరాట్ కోహ్లి.. ప్రకటించిన డీడీసీఏ
టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లి దేశవాళీ క్రికెట్ ఆడనున్నాడా? సొంత జట్టు ఢిల్లీ తరఫున తాజా రంజీ సీజన్ బరిలో దిగనున్నాడా? అంటే.. ఇందుకు అవకాశం ఉందంటోంది ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ). రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో పాల్గొనబోయే ఢిల్లీ ప్రాబబుల్ టీమ్‌లో విరాట్ కోహ్లి పేరును చేర్చింది.ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌తో పాటు.. మరో టీమిండియా స్టార్ రిషభ్ పంత్‌కు కూడా ఈ జాబితాలో చోటిచ్చింది. అదే విధంగా.. జాతీయ జట్టుకు దూరమైన పేసర్ నవదీప్ సైనీకి స్థానం కల్పించిన డీడీసీఏ.. వెటరన్ పేస్ బౌలర్, గత సీజన్లో ఢిల్లీకి ఆడిన ఇషాంత్ శర్మను మాత్రం పక్కనపెట్టింది.చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫునకాగా కోహ్లి చివరగా 2012-13 ఎడిషన్‌లో ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్ ఆడాడు. ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఆ తర్వాత మళ్లీ 2019లో ప్రాబబుల్ జట్టులో కోహ్లి పేరున్నా... టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా అతడు ఢిల్లీకి ఆడలేకపోయాడు. అయితే, జాతీయ జట్టు విధుల్లో లేనపుడు ఫిట్‌గా ఉన్న ఆటగాళ్లంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి నిబంధన విధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇటీవలి దులిప్ ట్రోఫీ-2024లో కోహ్లి భాగమవుతాడని అభిమానులు ఆశించినా.. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు రిస్క్ ఎందుకని బోర్డు అతడికి విశ్రాంతినిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాతో సిరీస్‌తో కోహ్లి బిజీగా ఉన్నప్పటికీ.. తాజాగా డీడీసీఏ ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం విశేషం.84 మంది సభ్యులతో ప్రాబబుల్ జట్టుకాగా రంజీ 2024-25 ఎడిషన్ అక్టోబరు 11 నుంచి ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌లో ఛండీఘర్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో 84 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్ జట్టును డీడీసీఏ ప్రకటించింది. అదే విధంగా.. సెప్టెంబరు 26 నుంచి వీరికి ఫిట్నెస్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపింది. అయితే టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌లకు మినహాయింపు ఉంటుందని పేర్కొంది.కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదుకాగా కోహ్లి, పంత్ రంజీ తొలి దఫా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో అక్టోబరు 16 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కావడమే ఇందుకు కారణం. ఆ తర్వాత టీమిండియా బోర్డర్-గావస్కర్ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. కాబట్టి రంజీ సీజన్ మొత్తానికి కోహ్లి అందుబాటులో ఉండే అవకాశమే లేదు. కానీ ఫామ్‌లేమితో సతమతమైతే.. దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశిస్తే మాత్రం ఢిల్లీ తరఫున అతడు బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లి, పంత్ టీమిండియాతో కలిసి ఇప్పటికే కాన్పూర్ చేరుకున్నారు. చదవండి: IND Vs BAN 2nd Test: గంభీర్ మరో మాస్టర్ ప్లాన్.. ఇక బంగ్లాకు చుక్కలే? DDCA announced their Ranji Trophy Probables Today. The U23 teams will be selected from the below mentioned players only. Indian Test team members Virat Kohli and Rishabh Pant have been included in the list of players as well, first time since 2019. pic.twitter.com/oiQ0ZGYCf3— CricDomestic (@CricDomestic_) September 24, 2024 -
అంబటి రాయుడికి ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ అనిల్ కుంబ్లే షాకింగ్ రియాక్షన్..!
-
టెస్టులకు సూర్య.. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో శ్రీకర్ భరత్
ముంబై: ఆ్రస్టేలియాతో సొంతగడ్డపై జరిగే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లోని తొలి రెండు టెస్టుల కోసం 17 మంది సభ్యులతో భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. టి20లో తన విధ్వంసక ఆటతో చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అవకాశం రాకపోయినా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోనూ సూర్యకు మంచి రికార్డే ఉంది. 79 మ్యాచ్‌లలో అతను 44.75 సగటుతో 5549 పరుగులు చేయగా, ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. మరోవైపు కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశారు. ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ ఇప్పటికే టెస్టు టీమ్‌తో ఉండగా (ఇంకా మ్యాచ్ ఆడలేదు), కిషన్‌కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. బుమ్రాను ఎంపిక చేయకపోవడంతో అతను పూర్తిగా కోలుకోలేదని తేలింది. గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజానూ జట్టులోకి తీసుకున్నా... ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఆడతాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఫిబ్రవరి 9నుంచి నాగపూర్‌లో తొలి టెస్టు జరుగుతుంది. టి20లకు పృథ్వీ షా, వన్డేల్లో భరత్ ఏడాదిన్నర క్రితం అంతర్జాతీయ టి20ల్లో తాను ఆడిన ఏకైక టి20లో తొలి బంతికే అవుటైన పృథ్వీ షా భారత జట్టులోకి పునరాగమనం చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం సెలక్టర్లు అతడికి అవకాశం కల్పించారు. ఇది మినహా చెప్పుకోదగ్గ మార్పులేమీ లేకుండా ఇటీవల శ్రీలంకతో టి20 సిరీస్ గెలిచిన జట్టునే ఎంపిక చేశారు. కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగనున్నాడు. ఈ సిరీస్‌లో కూడా రోహిత్, కోహ్లిలను ఎంపిక చేయకపోవడంతో అది ‘విశ్రాంతి’నా లేక టి20 భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా వారిని పక్కన పెట్టేశారా అనేదానిపై స్పష్టత లేదు. జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. వన్డే జట్టులో ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్‌కు తొలిసారి అవకాశం లభించింది. శార్దుల్ ఠాకూర్ పునరాగమనం చేయగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ షహబాజ్ అహ్మద్‌కు కూడా చోటు కలి్పంచారు. వన్డేల్లో మాత్రం రోహిత్, కోహ్లి అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్, అక్షర్‌లను రెండు జట్లలోనూ ఎంపిక చేయలేదని సెలక్టర్లు వెల్లడించారు. ఈ నెల 18, 21, 24 తేదీల్లో వన్డేలు జరుగుతాయి. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ గైక్వాడ్, శుభమాన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, వై చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ , శివం మావి, పృథ్వీ షా, ముఖేష్ కుమార్ ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ ((వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, సి పుజారా, వి కోహ్లి, ఎస్ అయ్యర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్. షమీ, మొహమ్మద్. సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్ India’s squad for NZ ODIs: Rohit Sharma (C), Shubman Gill, Ishan Kishan, Virat Kohli, Shreyas Iyer, Suryakumar Yadav, KS Bharat (wk), Hardik Pandya (vc), Washington Sundar, Shahbaz Ahmed, Shardul Thakur, Yuzvendra Chahal, Kuldeep Yadav, Mohd. Shami, Mohd. Siraj, Umran Malik — BCCI (@BCCI) January 13, 2023 India’s squad for NZ T20Is: Hardik Pandya (C), Suryakumar Yadav (vc), Ishan Kishan (wk), R Gaikwad, Shubman Gill, Deepak Hooda, Rahul Tripathi, Jitesh Sharma (wk), Washington Sundar, Kuldeep Yadav, Y Chahal, Arshdeep Singh, Umran Malik, Shivam Mavi, Prithvi Shaw, Mukesh Kumar — BCCI (@BCCI) January 13, 2023 India’s squad for first 2 Tests vs Australia: Rohit Sharma (C), KL Rahul (vc), Shubman Gill, C Pujara, V Kohli, S Iyer, KS Bharat (wk), Ishan Kishan (wk), R Ashwin, Axar Patel, Kuldeep Yadav, Ravindra Jadeja, Mohd. Shami, Mohd. Siraj, Umesh Yadav, Jaydev Unadkat, Suryakumar Yadav — BCCI (@BCCI) January 13, 2023 -
భార్య దూరమైందనే బాధలో కోపంతో....
సైదాబాద్: తన భార్య దూరమైందనే బాధ... ఆమెను తన వద్దకు చేర్చట్లేదని పోలీసులపై కోపం...ఈ పరిస్థితులే ఓ వ్యక్తి బాంబు బెదిరింపు కాల్ చేసేలా చేశాయి. అతగాడు మంగళవారం రాత్రి చేసిన ఆ కాల్ పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌ను ఉరుకులు, పరుగులు పెట్టింది. బుధవారం అతడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 18 రోజుల జైలు శిక్ష విధించింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ సుబ్బిరామిరెడి కథనం ప్రకారం... సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన ఎండీ అక్బర్‌ఖాన్ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. వివాహమైనప్పటికీ అనివార్య కారణాల నేపథ్యంలో కొన్నాళ్లుగా భార్య దూరంగా ఉంటోంది. దీనికి సంబం«ధించి అతడి గతంలో పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశాడు. అయితే అక్బర్ ప్రవర్తనతో విసిగిపోయానని, తాను అతడితో కలిసి ఉండలేనంటూ ఆమె పోలీసులకు స్పష్టం చేసింది. ఓపక్క తన భార్య దూరమైందనే బాధ, మరోపక్క పోలీసులు ఆమెను తీసుకువచ్చి తనకు అప్పగించట్లేదనే ఆవేదన అతడిలో ఎక్కువ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రి 9.15 గంటల ప్రాంతంలో అతగాడు తన ఫోన్ నుంచే నేరుగా సైదాబాద్ ఠాణాకు ఫోన్ కాల్ చేశాడు. ఐఎస్‌సదన్‌లోని మసీద్ మందిర్ చౌరస్తాలో కొందరు బాంబు పెట్టనున్నారంటూ చెప్పాడు. ఈ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు బాంబ్, డాగ్ స్క్వాడ్లను పిలిపించారు. ఐఎస్ సదన్ ప్రాంతంలో అణువణువూ గాలించారు. చివరు అది బెదిరింపు కాల్‌గా తేల్చారు. ఈ ఉదంతంపై సైదాబాద్ ఠాణాలో కేసు నమోదైంది. ఫోన్ నెంబర్ ఆధారంగా ముందుకు వెళ్లిన అధికారులు బుధవారం ఉదయం అక్బన్ ఖాన్‌ను పట్టుకున్నారు. ఈ నిందితుడిపై ఐపీసీలోని 182, 186తో పాటు సిటీ పోలీసు యాక్ట్‌లోని 70 (బీ) సెక్షన్ కింద ఆరోపణలు చేస్తూ కోర్టులో హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయస్థానం అక్బర్ ఖాన్‌కు 18 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో సైదాబాద్ పోలీసులు అతనినిన చంచల్‌గూడ జైలుకు తరలించారు. (చదవండి: చెల్లెలిని ప్రేమించాడన్న కోపంతో ఓ అన్న..) -
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
Asia Cup 2022: మెగా ఈవెంట్లో పాల్గొనబోయే టీమ్‌లు.. అన్ని జట్ల ఆటగాళ్ల వివరాలు
Asia Cup 2022- All Squads: క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఆసియా కప్ ఫీవర్ నడుస్తోంది. మొత్తం ఆరు జట్లు తలపడనున్న ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్త కెప్టెన్.. యువ ఆటగాళ్ల రాక నేపథ్యంలో రెట్టించిన ఉత్సాహంతో.. టోర్నీలో అడుగుపెట్టనుంది భారత్. మరోవైపు దాయాది జట్టు పాకిస్తాన్ సైతం గట్టిపోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా ఎన్ని జట్లు ఉన్నా కళ్లన్నీ భారత్, పాకిస్తాన్‌పైనే ఉన్నాయి. ఈ ఐదు దేశాలతో పాటు క్వాలిఫైయర్స్‌లో కువైట్, సింగపూర్, యూఏఈలతో తలపడి టాపర్‌గా నిలిచిన హాంకాంగ్ జట్టు ఈవెంట్లో పాల్గొనబోతోంది. ఇక ఆగష్టు 27న ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా, పాకిస్తాన్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ తమ జట్లను ప్రకటించాయి. ఆ వివరాలు.. PC: BCCI గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. క్వాలిఫైయర్స్‌లో గెలిచిన జట్టు ఈ గ్రూపులో ప్రవేశిస్తుంది. భారత్ రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ PC: PCB పాకిస్తాన్ బాబర్ ఆజం(కెప్టెన్), షాబాద్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం జూనియర్, నసీం షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్, మహ్మద్ హస్నైన్. PC: ACB గ్రూప్- బి ఆఫ్గనిస్తాన్: మహ్మద్ నబీ(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్, హష్మతుల్లా షాహిది, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, సమీముల్లా శిన్వారి, రషీద్ ఖాన్, ఫజల్ హక్ ఫారుకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘని. రిజర్వు ప్లేయర్లు: కైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్, నిజత్ మసూద్. PC: Bangaldesh Cricket బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అనముల్ హక్, ముష్ఫికర్ రహీం, ఆఫిఫ్ హొసేన్, మొసద్దెక్ హొసేన్, మహ్మదుల్లా, మెహెది హసన్, మహ్మద్ సైఫుద్దీన్, ముస్తాఫిజుర్ రెహమాన్, నసూమ్ అహ్మద్, సబీర్ రెహమాన్, మెహెది హసన్ మీరజ్, టస్కిన్ అహ్మద్, ఎబాదత్ హొసేన్, పర్వేజ్ హొసేన్ ఎమాన్, మహ్మద్ నయీం. PC: SLC శ్రీలంక దసున్ షనక(కెప్టెన్), ధనుష్క గుణతిలక, పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్, చరిత్ అసలంక, భనుక రాజపక్స, అషేన్ బండారా, ధనుంజయ డి సిల్వా, వనిందు హసరంగ, మహీశ్ తీక్షణ, జెఫ్రీ వాండర్సే, ప్రవీణ్ జయవిక్రమ, చమిక కరుణరత్నె, దిల్షాన్ మదుషంక, మథీష పతిరాణా, నువనిడు ఫెర్నాండో, నువాన్ తుషార, దినేశ్ చండిమాల్. PC: Hongkong హాంకాంగ్ నిజాకత్ ఖాన్(కెప్టెన్), కించిత్ షా, జీషన్ అలీ, హరూన్ అర్షద్, బాబర్ హయత్, అఫ్తాబ్ హొసేన్, అతీక్ ఇక్బాల్, ఎయిజాజ్ ఖాన్, ఎహ్సాన్ ఖాన్, స్కాట్ మెఖినీ, ఘజ్నాఫర్ మహ్మద్, యాసిమ్ మోర్తజా, ధనుంజయ రావు, వాజిద్ షా, అయుశ్ శుక్లా, అహాన్ త్రివేది, మహ్మద్ వహీద్. PC: Kuwait కువైట్ మహ్మద్ అస్లాం(కెప్టెన్), నవాఫ్ అహ్మద్, మహ్మద్ ఆమిన్, మీట్ భావ్సర్(వికెట కీపర్), అద్నన్ ఇద్రీస్, ముహ్మద్ కాషిఫ్, శిరాజ్ ఖాన్, సయీద్ మోనిబ్, ఉస్మాన్ పటేల్, యాసిన్ పటేల్, షారూఖ్ కుద్దూస్, రవిజా సాందారువన్, మొహ్మద్ షఫీక్, హరూన్ షాహిద్, ఎడ్సన్ సిల్వా, బిలాల్ తాహిర్, అలీ జహీర్. PC: Singapore సింగపూర్ అంజద్ మెహబూబ్(కెప్టెన్), రీజా గజ్నావి, జన్ ప్రకాశ్, మన్‌ప్రీత్ సింగ్, వినోత్ భాస్కరన్, ఆర్యమన్ ఉచిల్, సురేంద్రన్ చంద్రమోహన్, రోహన్ రంగరాజన్, అక్షయ్ రూపర్ పురి, అమన్ దేశాయి, జీవన్ సంతానం, విహాన్ మహేశ్వరి, ఆర్యవీర్ చౌదరి, అరిత్ర దత్తా. యూఏఈ చుండంగపోయిల్ రిజ్వాన్(కెప్టెన్), సుల్తాన్ అహ్మద్, సబీర్ అలీ, వ్రిత్య అరవింత్, కషిఫ్ దావూద్, జవార్ ఫరీద్, బాసిల్ హమీద్, జహూర్ ఖాన్, ఆర్యన్ లక్రా, కార్తిక్ మెయప్పన్, రోహన్ ముస్తఫా, ఫాహద్ నవాజ్, అహ్మద్ రజా, అలీషాన్ షరాఫు, జునైద్ సిద్దిఖీ, చిరాగ్ సూరి, ముహ్మద్ వసీం. చదవండి: Asia Cup 2022 Ind Vs Pak: మొదటి విజేత మన జట్టే! అప్పుడు పాక్ మరీ ఘోరంగా! ICC ODI Rankings: అదరగొట్టిన శుబ్‌మన్ గిల్.. ఏకంగా 93 స్థానాలు ఎగబాకి..! -
టీ20 వరల్డ్‌కప్-2022కు సంబంధించి కీలక ప్రకటన
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. మెగా టోర్నీలో పాల్గొనే జట్లు తమ పూర్తి వివరాలను సెప్టెంబర్ 15లోపు ప్రకటించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆయా జట్లకు డెడ్‌లైన్ విధించింది. నిర్ధేశిత గడువులోగా జట్లన్నీ ప్రపంచకప్ బరిలోకి దిగబోయే 15 మంది సభ్యుల వివరాలను సమర్పించాలని సంబంధిత క్రికెట్ బోర్డులను ఐసీసీ ఆదేశించింది. ఐసీసీ నుంచి వెలువడిన ఈ ప్రకటనతో మెగా టోర్నీలో పాల్గొనబోయే జట్లన్నీ అలర్టయ్యాయి. ఆటగాళ్ల ఎంపిక విషయంలో కసరత్తును వేగవంతం చేశాయి. కాగా, అక్టోబర్ 16న జరిగే క్వాలిఫయర్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజ్‌లో నమీబియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, యూఏఈ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. అనంతరం రెండు గ్రూపుల్లో టాప్ 2లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో సూపర్ 12 రౌండ్లో అమీతుమీ తేల్చుకుంటాయి. సూపర్ 12 రౌండ్ గ్రూప్ 1లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు పోటీపడనుండగా.. గ్రూప్ 2 నుంచి బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడతాయి. ఈ టోర్నీలో టీమిండియా దాయాది పాక్‌తో అక్టోబర్ 23న తలపడనుంది. చదవండి: T20 WC 2022: పంత్ వైఫల్యం.. డీకే జోరు.. ద్రవిడ్ ఏమన్నాడంటే! -
ఐదో టెస్టుకు జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. బట్లర్, లీచ్ రీ ఎంట్రీ
లండన్: టీమిండియాతో ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్న చివరి టెస్ట్ కోసం 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మంగళవారం ప్రకటించింది. వ్యక్తిగత కారణాల చేత ఓవల్ టెస్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఆఫ్ స్పిన్నర్ జాక్ లీచ్ తిరిగి జట్టులోకి రాగా, సామ్ బిల్లింగ్స్‌పై వేటు పడింది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగనున్న చివరి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టులో రెండు మార్పులు జరిగే ఆస్కారం ఉంది. జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ స్థానాల్లో జోస్ బట్లర్, జాక్ లీచ్ ఫైనల్ ఎలెవెన్‌లో ఆడే అవకాశం ఉంది. మరోవైపు టీమిండియా సైతం ఓ మార్పు చేసేలా కనిపిస్తుంది. వరుసగా విఫలమవుతున్న జడేజా స్థానంలో అశ్విన్‌ను ఆడించాలని కోహ్లి భావిస్తునట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ఇంగ్లండ్ 157 పరుగుల తేడాతో టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో కోహ్లీ సేన 2-1 ఆధిక్యంలోని దూసుకెళ్లింది. ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్) మెయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, జానీ బెయిర్‌స్టో, రోరీ బర్న్స్, జోస్ బట్లర్, సామ్ కరన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, జాక్ లీచ్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్ చదవండి: టీమిండియా టెస్ట్‌ల్లో గొప్పే కావచ్చు.. వైట్ బాల్ క్రికెట్లో కాదు -
ఆసీస్ జట్టు ఇదే; వరల్డ్‌కప్ ద్వారా అరంగేట్రం చేయనున్న ఆటగాడు
సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గర పడుతుండడంతో టోర్నీలో పాల్గొననున్న దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటంచాల్సిందిగా ఐసీసీ సూచించింది. తాజాగా గురువారం ఆస్ట్రేలియా జట్టు టీ20 ప్రపంచకప్ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌కు ఆరోన్ పించ్ సారధ్యం వహించనున్నాడు. ఇక ఇటీవలే బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన టీ20 సిరీస్‌లకు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పాట్ కమిన్స్ తిరిగి జట్టులోకి వచ్చారు. స్టార్ బౌలర్ పాట్ కమ్మిన్స్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన జోష్ ఇంగ్లీష్‌కి తొలిసారి ఆసీస్ జట్టు నుంచి పిలుపు వచ్చింది. ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్న అరంగేట్ర క్రికెటర్‌గా జోష్ ఇంగ్లీష్ నిలవనున్నాడు. డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండనున్నారు. ఇక సూపర్ 12లో గ్రూప్-1లో వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉండగా.. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ ఉన్నాయి. ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ తర్వాత 30న ఇంగ్లాండ్, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. వీటితో పాటు క్వాలిఫయర్స్ నుంచి సూపర్-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. ఇక వ్యక్తిగత కారణాలతో స్టీవ్ స్మిత్ టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉండాలని భావించాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో 1-4 తేడాతో దారుణ పరాజయం చవిచూసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) స్మిత్‌ను టీ20 ప్రపంచకప్‌లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ హజల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, ఆస్టన్ అగర్, జోష్ ఇంగ్లీష్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్, స్వీప్సన్, ఆడమ్ జంపా రిజర్వు ప్లేయర్లు: డానియల్ క్రిస్టియన్, నాథన్ ఎల్లిస్, డానియల్ సామ్స్ Our Australian men's squad for the ICC Men’s #T20WorldCup! 🇦🇺 More from Chair of Selectors, George Bailey: https://t.co/CAQZ4BoSH5 pic.twitter.com/aqGDXZu0t9 — Cricket Australia (@CricketAus) August 19, 2021 -
కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ
ముంబై: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తొలిసారి భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టీమిండియా రెండో జట్టు జూలైలో శ్రీలంకలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పర్యటనకు వెళ్లే జట్టును గురువారం బీసీసీఐ ప్రకటించింది. ధావన్ కెప్టెన్‌గా.. భువనేశ్వర్ కుమార్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే కెప్టెన్సీ ఎవరికి ఇవ్వాలనే దానిపై కొన్నిరోజులగా చర్చ నడుస్తుంది. రెండు రోజల క్రితం గబ్బర్ పేరు ఖరారైనట్లు వార్తలు రావడం.. తాజాగా అతనికే పగ్గాలు అప్పజెప్పడంతో చర్చకు బ్రేక్ పడింది. ఇక జట్టు విషయానికి వస్తే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. ముందుగా ఊహించనట్టుగానే పృథ్వీ షా, పడిక్కల్, నితీష్ రాణా, సామ్సన్, రుతురాజ్, దీపక్ చహర్, చేతన్ సకారియాలు జట్టులో చోటు సంపాదించారు. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్‌లు తన స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇక నెట్ బౌలర్లుగా ఇషాన్ పొరేల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్ సింగ్ ఉండనున్నారు.జూలైలో శ్రీలంకతో మూడు వన్డేలు.. మూడు టీ20లు ఆడనుంది. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్యా, నితీశ్ రాణా, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్, యజువేంద్ర చహల్, రాహుల్ చహర్, కె.గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవదీప్ సైనీ, చేతన్ సకారియా. నెట్ బౌలర్లు: ఇషాన్ పొరేల్, సందీప్ వారియర్, అర్షదీప్ సింగ్, సాయి కిషోర్, సిమర్జిత్ సింగ్ చదవండి: టీమిండియా ప్రాక్టీస్ అదుర్స్.. ఈ పర్యటనలో ఇదే తొలిసారి -
అమెరికా ఎన్నికలు: మళ్లీ గెలిచిన ‘స్క్వాడ్’..
వాషింగ్టన్: అమెరికాలో నల్ల జాతీయులు, మైనారిటీల హక్కుల కోసం గళమెత్తుతూ అందరి దృష్టిని ఆకర్షించిన నలుగురు మహిళా పార్లమెంట్ సభ్యులు తాజా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. ‘ద స్క్వాడ్’పేరిట వీరు అమెరికాలో ప్రసిద్ధిపొందారు. మిన్నెసొటా నుంచి ఇల్హానా ఒమర్, న్యూయార్క్ నుంచి అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్, మిషిగాన్‌లో రషీదా తలెయిబ్, మసాచుసెట్స్‌లో అయన్నా ప్రిస్లీ మళ్లీ గెలిచారు. వీరంతా మైనారిటీ, నల్లజాతి మహిళలే కావడం గమనార్హం. స్క్వాడ్ పోరాటం పలుమార్లు వివాదాలకు దారితీసింది. అంతేకాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాన్ని కూడా వారు చవి చూడాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో స్క్వాడ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదే వారి విజయానికి కారణమని భావిస్తున్నారు. (చదవండి: సరిగ్గా వందేళ్ల క్రితం నవంబర్ 2న రాత్రి..) Our sisterhood is resilient. pic.twitter.com/IfLtsvLEdx — Ilhan Omar (@IlhanMN) November 4, 2020 -
ఐసీసీ వరల్డ్‌కప్ జట్టులో పూనమ్
దుబాయ్: టి20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన జట్టులో భారత లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు చోటు దక్కింది. టీమ్ ఫైనల్‌కు చేరినా... పూనమ్ మినహా మరెవరికీ ఈ టీమ్‌లో చోటు లేదు. టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ 12వ ప్లేయర్‌గా ఎంపికైంది. మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, లిసా స్తాలేకర్, అంజుమ్ చోప్రా తదితరులతో కూడిన ప్యానెల్ ఈ టీమ్‌ను ఎంపిక చేసింది. చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు, ఇంగ్లండ్ నుంచి నలుగురు ఐసీసీ జట్టులో ఉన్నారు. ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ టి20 ప్లేయింగ్ ఎలెవన్: మెగ్ లానింగ్ (కెప్టెన్), అలీసా హీలీ, బెత్ మూనీ, జెస్ జొనాసెన్, మెగాన్ షూట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, హెథర్ నైట్, సోఫీ ఎకెల్‌స్టోన్, అన్య ష్రబ్సోల్ (ఇంగ్లండ్), లారా వోల్వార్ట్ (దక్షిణాఫ్రికా), పూనమ్ యాదవ్ (భారత్); 12వ ప్లేయర్ షఫాలీ వర్మ (భారత్). -
తిలక్ వర్మకు చోటు
ముంబై: గత కొంత కాలంగా భారత యూత్ జట్టు సభ్యుడిగా నిలకడగా రాణిస్తున్న హైదరాబాద్ బ్యాట్స్‌మన్ నంబూరి ఠాకూర్ తిలక్ వర్మకు మరో అరుదైన అవకాశం లభించింది. వచ్చే నెలలో జరిగే అండర్–19 ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత జట్టులోకి అతను ఎంపికయ్యాడు. 2018–19 సీజన్ కూచ్‌బెహర్ ట్రోఫీలో తిలక్ 6 మ్యాచ్‌లలో 86.56 సగటుతో 779 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో 4 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వన్డే టోర్నీ వినూ మన్కడ్ ట్రోఫీలో కూడా 84.50 సగటుతో 8 మ్యాచ్‌లలో 507 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనే అతను భారత అండర్–19 టీమ్‌లో రెగ్యులర్‌గా మారేందుకు కారణమైంది. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండు వన్డేల్లోనూ తిలక్ ఆడాడు. దక్షిణాఫ్రికాలో జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఇందు కోసం భారత జూనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రియమ్ గార్గ్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపిక కాగా... యూపీకే చెందిన ధ్రువ్ జురేల్ వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. యూపీ సీనియర్ జట్టులో ఇప్పటికే రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న ప్రియమ్ 2018–19 రంజీ సీజన్లో 814 పరుగులతో సత్తా చాటాడు. విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సహా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగుతున్న ముంబై ఆటగాడు యశస్వి జైస్వాల్ కూడా ప్రపంచ కప్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అండర్–19 ప్రపంచ కప్‌లో 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత సాధిస్తాయి. నాలుగు సార్లు (2000, 2008, 2012, 2018) అండర్–19 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత్ ఈ సారి గ్రూప్ ‘ఎ’లో న్యూజిలాండ్, శ్రీలంక, జపాన్‌లతో కలిసి బరిలోకి దిగుతోంది. రక్షణ్‌కు చోటు... ప్రపంచ కప్‌కు ముందే భారత అండర్–19 జట్టు దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభమవుతుంది. ముందుగా సఫారీలతో భారత్ మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత ఈ రెండు జట్లతో పాటు న్యూజిలాండ్, జింబాబ్వే భాగంగా నాలుగు దేశాల వన్డే టోర్నీ కూడా జరుగుతుంది. ఈ సిరీస్‌ల కోసం సెలక్టర్లు అదనంగా మరో ఆటగాడిని ఎంపిక చేశారు. 16వ ఆటగాడిగా హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ సీటీఎల్ రక్షణ్‌కు ఆ అవకాశం లభించింది. రక్షణ్ ఇటీవల అఫ్గానిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడాడు. ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత అండర్–19 జట్టు ప్రియమ్ గార్గ్ (కెప్టెన్), ధ్రువ్ చంద్ జురేల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ (హైదరాబాద్), యశస్వి జైస్వాల్, అథర్వ అంకోలేకర్, దివ్యాంశ్ సక్సేనా, కార్తీక్ త్యాగి (ముంబై), శుభాంగ్ హెగ్డే, విద్యాధర్ పాటిల్ (కర్ణాటక), కుమార్ కుశాగ్ర, సుశాంత్ మిశ్రా (జార్ఖండ్), రవి బిష్ణోయ్, ఆకాశ్ సింగ్ (రాజస్తాన్), శాశ్వత్ రావత్ (బరోడా), దివ్యాంశ్ జోషి (మిజోరం). -
స్లిప్పులతో అడ్డంగా దొరికిన ఉపాధ్యాయులు
భీమవరం టౌన్ : పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో వేర్వేరు చోట్ల ముగ్గురు ఉపాధ్యాయులు శనివారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వారిని విధుల నుంచి తొలగించిన అధికారులు సమాచారాన్ని డీఈఓ ఆర్ఎస్ గంగా భవానికి అందించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కె.నాగేశ్వరరావు, ఎస్కే సలీం తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరంలోని కాకతీయ మెరిట్ స్కూల్ పరీక్ష కేంద్రం (నం.2659)లో రూం నెం.7లో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఉపాధ్యాయుడు కె.విజయ్‌బాబు రెండు కార్పొరేట్ స్కూల్స్‌కు చెందిన ఇద్దరు విద్యార్థుల జవాబు పత్రాలను మారుస్తుండగా స్క్వాడ్ పట్టుకుంది. వెంటనే అతడిని ఇన్విజిలేటర్ విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కాళ్ల మండలం కలవపూడి జెడ్పీ హైస్కూ ల్ పరీక్ష కేంద్రం (నం.2705)లో తనిఖీలు చేయగా రూం నం.3లో ఇన్విజిలేటర్‌గా ఉన్న ఉపాధ్యాయు డు వై.శ్రీనివాస్, రూం నం.5లో ఎం ఎన్‌సీహెచ్‌ఎస్ వర్మ జేబుల్లో స్లిప్పులు ఉండటాన్ని స్క్వాడ్ గుర్తించిం ది. వీరిని కూడా విధుల నుంచి తొలగించామని అధికారులు చెప్పారు. -
క్రికెటర్ కల్పనకు ACA సన్మానం
-
పరీక్షలపై నిఘాకు డ్రోన్ ఇన్విజిలేటర్లు!
పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లు, స్క్వాడ్లు ఉంటారు. అయినా.. విద్యార్థులు లేటెస్ట్ టెక్నాలజీ సాయంతో వారిని బురిడీ కొట్టిస్తుంటారు. అందుకే.. చైనాలో విద్యాశాఖ అధికారులు ఏకంగా మానవ రహిత గగనతల వాహనాల(డ్రోన్స్)నే రంగంలోకి దించారు. ‘ఇన్విజిలేటర్ డ్రోన్స్’గా పిలుస్తున్న వీటిని ఆదివారం నుంచి ల్యూయాంగ్ సిటీలో రెండు రోజుల పాటు జరిగే ‘గవోకవో’ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షలకు ఉపయోగించనున్నారు. కాపీ కొడుతూ దొరికిపోతే మూడేళ్ల పాటు పరీక్షలు రాయకుండా సస్పెండ్ చేస్తారు. అయినా విద్యార్థులు టెక్నాలజీతో మాయ చేస్తుండటంతో ఈ డ్రోన్స్‌ను ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. ఈ డ్రోన్స్ ఏం చేస్తాయంటే.. పరీక్ష హాలు మీదుగా, చుట్టూ నిరంతరం చక్కర్లు కొడతాయి. 360 డిగ్రీల కోణంలో ప్రత్యేక పరికరాలతో స్కాన్ చేస్తాయి. సెల్ఫోన్లు, రహస్య స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను విద్యార్థులు ఉపయోగిస్తే వాటి నుంచి వెలువడే రేడియో సిగ్నళ్లను పసిగడతాయి. ఒక్కో డ్రోన్ ఒక్కో విడతలో 30 నిమిషాల పాటు గాలిలో ఎగురుతూ సిబ్బందికి సమాచారం అందజేస్తూ ఉంటుంది. పరీక్షలపై నిఘాకు ఇంత కసరత్తా? అంటే ఆ పరీక్షలే అలాంటివి మరి! మనకు ఎంసెట్, ఐఐటీ ప్రవేశపరీక్షలు ఎలానో.. చైనీయులకు కూడా గవోకవో పరీక్షలు అలాంటివే. ఉన్నత విద్యలో ప్రవేశం కోసం జరిగే ఈ పోటీ పరీక్షలకు ఏటా 90 లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతారట!