- త్వరలో తెలంగాణ పోలీస్‌లో చేరనున్న ‘ఈగిల్ స్క్వాడ్’
- డ్రోన్ల గుర్తింపు, గగనతలం నుంచి నిఘాపై 4 గద్దలకు శిక్షణ
- ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటివద్ద ప్రయోగాత్మక పరిశీలన
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు భద్రతా బలగాలు పటిష్ట భద్రతను కల్పి స్తాయి. మఫ్టీలో ఉండే బలగాలు అదనం. అయినా కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాల నేపథ్యంలో.. గగనతలం నుంచీ భద్రత కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇందుకోసం తెలంగాణ పోలీసులు త్వరలో ‘గరుడ దళం (ఈగిల్ స్క్వాడ్)’ను రంగంలోకి దింపనున్నారు. ఇప్పటికే 4 గద్దలకు మొయినా బాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై తర్ఫీదు ఇచ్చారు.
ఇటీవలే ఈ ‘గరుడ దళం’ సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద డెమోను సైతం ఇచ్చింది. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని పూర్తిస్థాయిలో వినియోగించేందుకు పోలీస్ ఉన్నతాధి కారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది అంతర్గత భద్రత విభాగం (ఐఎస్‌డబ్ల్యూ)లో భాగంగా ఉంటూ తెలంగాణలో వీవీఐపీ రక్షణను పర్యవేక్షించనుంది.
గగనతలం నుంచి నిఘా నేత్రాలుగా..
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీస్ శాఖలో గరుడ దళాన్ని ప్రవేశపెడుతున్నారు. ఈ ప్రత్యేక శిక్షణకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. చిన్న పక్షి పిల్లలను తెచ్చి,వాటిని పోషిస్తూ, తర్ఫీదు ఇస్తూ వచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
వారితోపాటు కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక ఇన్‌స్ట్రక్టర్‌తో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానాస్పద వ్యక్తులను గమ నించడం తదితర అంశాల్లో శిక్షణ ఇప్పించారు. అదే సమయంలో వీటికి అమర్చిన ప్రత్యేక నిఘా కెమెరాల సాయంతో భద్రతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతారు.
అనుమానం రాకుండా...
సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్లతో నిఘా పెట్టవచ్చు. కానీ డ్రోన్ల నుంచి వెలువడే శబ్దం, వాటి కదలికలను కింద ఉన్నవారు సులువుగా గుర్తించవచ్చు. దీనితో నేరస్తులు అప్రమత్తమై తప్పించుకోవడం, లేదా తాము చేసేది గమనించ లేకుండా చేయడం వంటివాటికి పాల్పడే చాన్స్ ఉంటుంది.
అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే వీఐ పీల భద్రతతోపాటు మావోయిస్టు ఆపరేషన్లకు, వారి కదలిక లను పసిగట్టేందుకు కూడా ఈ గరుడ స్క్వాడ్‌ను వాడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబు తున్నాయి. అంతేగాక డ్రోన్లను ఎక్కువసేపు వినియోగించుకునే అవకాశముండదు. వాటి వేగమూతక్కువ. అదే ‘గరుడ స్క్వాడ్’తో ఈ సమస్యలు ఉండవని అంటున్నారు.
ఇదీ చదవండి: నెక్లెస్ రోడ్డులో ఎయిర్ షో
Comments
Please login to add a commentAdd a comment