
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు.
ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్‌లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్‌ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
(చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు)
Comments
Please login to add a commentAdd a comment