Jamshedpur
-
మోహన్ బగాన్ గెలుపు
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ జట్టు 3–0తో జంషెడ్పూర్ ఎఫ్‌సీపై ఘనవిజయం సాధించింది. టామ్ అల్డ్రెడ్ (15వ ని.), లిస్టన్ కొలాకొ (45+2వ ని.), జేమి మెక్లారెన్ (75వ ని.) తలా ఒక గోల్ చేశారు. తాజా విజయంతో మోహన్ బగాన్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. 8 మ్యాచ్‌లాడిన ఈ జట్టు ఐదింట గెలుపొంది ఒక మ్యాచ్‌లో ఓడింది. 2 మ్యాచ్‌ల్ని డ్రా చేసుకుంది. మరో మ్యాచ్‌లో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు 2–1తో పంజాబ్ ఎఫ్‌సీపై గెలుపొందింది. నార్త్ ఈస్ట్ జట్టులో గులెర్మో ఫెర్నాండెజ్ (15వ ని.), నెస్టర్ అల్బియక్ (18వ ని.) చెరో గోల్ చేశారు. పంజాబ్ తరఫున ఇవాన్ నొవొసెలెక్ (88వ ని.) గోల్ సాధించాడు. -
జంషెడ్‌పూర్‌కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్‌బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్‌పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్‌బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్‌పూర్‌కు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్‌లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్‌పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్‌తో చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్ ఆడనుంది. -
ఇండియన్ సూపర్ లీగ్.. జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్‌సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జంషెడ్పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్‌సీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.కోల్‌కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్‌సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్‌లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ తలపడుతుంది. -
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
జెంషెడ్పూర్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం(మే19) జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ’యువరాజు రాహుల్‌గాంధీ పరిశ్రమలు, పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నాడు. దీంతో పెట్టుబడిదారులు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపకక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు రాకపోతే అక్కడి యువత పరిస్థితి ఏంటి. చాలా మంది వ్యాపారవేత్తలు వచ్చి నాతో ఇలా చెబుతున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితులు బాగోలేవంటున్నారు. వారి సిద్ధాంతాలు తమకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు. యువరాజు ఆలోచన విధానం, వారి మిత్రపకక్షాల ఆలోచనా విధానం ఒకేలా ఉంది’అని ప్రధాని అన్నారు. -
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
హెయిర్ కంటింగ్ అనేది అటు పురుషులకు, ఇటు అందంగా కనిపించాలనుకునే మగువలకు తప్పనిసరి. కొందరు ఫ్యాషన్‌తో కూడిన హెయిర్ కటింగ్ కోసం పలు సెలూన్లను ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి హెయిర్ కంటింగ్ ఎక్కడైనా రూ. 10కే చేస్తున్నారని తెలిస్తే జనం క్యూ కట్టకుండా ఉండలేరు. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ది హెయిర్ స్టోరీ పేరుతో ఓ నూతన సెలూన్ ప్రారంభమయ్యింది. ఇక్కడ మే నెల అంతటా పురుషులు, మహిళలు అనే బేధం లేకుండా అందరికీ అడ్వాన్స్ హెయిర్ కటింగ్ కేవలం రూ. 10కే చేస్తున్నారు.ఈ సందర్భంగా ది హెయిర్ స్టోరీ డైరెక్టర్ సన్నీ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇది కొత్త సెలూన్ అయినందున ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని, ప్రకటనలు, మార్కెటింగ్ కోసం లక్షలు ఖర్చు చేయడం కంటే ఆఫర్లను అందించడం ఉత్తమమని ఆయన తెలిపారు.పురుషులకు రూ. 200, స్త్రీలకు 350 విలువైన హెయిర్ కంటింగ్ సర్వీస్‌ను రూ. 10కే అందిస్తున్నామని తెలిపారు. తాము అందిస్తున్న ఆఫర్ చూసి, ప్రతీరోజూ వందమందికిపైగా జనం వస్తున్నారని, మా సెలూన్లో హెయిర్ డ్రెస్సర్లుగా నలుగురు యువకులు, ఆరుగురు యువతులు పనిచేస్తున్నారని సన్నీ తెలిపారు. ఇక్కడికి వచ్చే జనం తమ హెయిర్ కటింగ్ కోసం నాలుగు గంటలకుపైగా సమయం వెచ్చించాల్సి వస్తున్నదన్నారు. -
Rajiv Kumar Sharma: ప్రతికూలతకు... పచ్చటి జవాబు
పాత వస్తువులను చూస్తూ కొత్తగా ఆలోచిస్తే ఏమొస్తుంది? కొత్త ఆవిష్కరణకు బీజం పడుతుంది. సమాజానికి మేలు జరుగుతుంది. రసాయనాలతో కూడిన ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా అనారోగ్యానికి గురైన రాజీవ్ శర్మ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాడు. ‘జీరో ప్లాస్టిక్, జీరో ట్యాక్సిన్స్’ నినాదంతో ఎకో–ఫ్రెండ్లీ ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను డిజైన్ చేశాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్స్’ స్టార్టప్‌తో సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు జంషెడ్‌పూర్‌కు చెందిన రాజీవ్ కుమార్ శర్మ.... కోవిడ్ సమయంలో రాజీవ్‌శర్మ కుటుంబం శానిటైజర్లతో పాటు ఎయిర్ ఫ్రెష్నర్లను ఉపయోగించేది. ఒకరోజు వాంతులు, తలనొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు రాజీవ్. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగివచ్చిన తరువాత ‘ఎందుకు ఇలా జరిగింది?’ అంటూ ఆలోచించాడు. ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఎయిర్ ఫ్రెష్నర్ వల్లే తాను అనారోగ్యానికి గురైనట్లు తెలుసుకున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కలప, పూలవ్యర్థాలతో సహజమైన ఎయిర్ ఫ్రెష్నర్ తయారుచేశాడు. ఈ ఎయిర్ ఫ్రెష్నర్ ద్వారా ఇనోవేటర్ కాస్తా ఎంటర్ప్రెన్యూర్ అయ్యాడు. ‘ఆల్వే–గ్రీన్ సోల్యూషన్స్’ పేరుతో స్టార్టప్ ప్రారంభించి విజయం సాధించాడు. ‘ఎయిర్ ఫ్రెష్‌నర్‌లలో ఇబ్బంది కలిగించే రసాయనాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఏదైనా ఎయిర్ ఫ్రెష్నర్ తయారీలో ఉపయోగించిన ఇన్‌గ్రేడియెంట్స్ గురించి తెలుసుకోవడం. పిల్లలు, జంతువులకు ఇవి సురక్షితం కాదు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించని, మనుషులకు, జంతువులకు సురక్షితమైన ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను తయారుచేయాలనుకున్నాను’ అంటాడు రాజీవ్‌శర్మ. ఈ ప్రాజెక్ట్‌పై తల్లితో కలిసి ఎనిమిది నెలలకు పైగా శ్రమించాడు. ఎన్నో ట్రయల్స్ తరువాత ఫైనల్ ప్రాజెక్ట్ ఓకే అయింది. ‘మా ఫ్రొఫెసర్లు ఆశ్చర్యపోయారు. ఇది మరింత ఎక్కువమందికి చేరువ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. కాలేజీలోని యంత్రాలతో ఎయిర్ ఫ్రెష్నర్ పర్ఫెక్ట్గా రావడానికి సహాయం చేశారు’ అంటాడు రాజీవ్. జంషెడ్పూర్(ఝార్ఖండ్)లోని ఆలయాల నుంచి రాజీవ్ ప్రతిరోజూ కనీసం మూడు కిలోల పూలవ్యర్థాలను సేకరిస్తాడు. ప్రస్తుతం ఇంటి నుంచే కంపెనీని నడుతున్న రాజీవ్ దాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడు. ‘ఆల్వే–గ్రీన్ సొల్యూషన్’ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–బెంగళూరుతో కలిసి పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచి రాజీవ్ కొత్త కొత్త వస్తువులు తయారుచేసేవాడు. కోవిడ్ సమయంలో సౌకర్యవంతమైన పీపీఇ కిట్లను రూపొందించాడు. ‘ఝార్ఖండ్ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ’ సభ్యుడిగా గాయపడిన శునకాల కోసం ప్రత్యేకమైన వీల్చైర్లను తయారుచేశాడు. ‘మనకు ఉపయోగపడే వస్తువులు మాత్రమే కాదు పర్యావరణానికి హాని కలిగించని పరికరాలను తయారు చేయడం నా లక్ష్యం’ అంటున్నాడు రాజీవ్ కుమార్ శర్మ. -
వందే సృజన!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చిన తరువాత చాలా ప్రాంతాల మధ్య దూరం తగ్గిపోయింది. కానీ టికెట్ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో కొంతమంది దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. ఇలా వందేభారత్‌కు దూరంగా ఉన్న గ్రామానికి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చి అబ్బుర పరుస్తోంది పూర్ణిమా ముర్ము. అవును మీరు కరెక్ట్‌గానే చదివారు. మారుమూల గ్రామానికి వందే భారత్‌ను తీసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది పూర్ణిమ. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు పక్కనే ఉన్న ఓ గ్రామం పేరు జొండరాగోడ. ఈ గ్రామానికి చెందిన విద్యార్థే పూర్ణిమా ముర్ము. గిరిజనులు ఎక్కువ ఉండే ఈప్రాంతంలో దీపావళి సమయంలోనే సోహ్రాయ్ పండుగను ఎంతో వేడుకగా జరుపుకుంటారు. దీపావళి రెండో రోజున జరుపుకునే ఈ పండక్కి గిరిజనులంతా... తమ మట్టి ఇళ్లను శుభ్రం చేసి, రకరకాల సాంప్రదాయ డిజైన్లతో పెయింట్ వేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పూర్ణిమ తన ఇంటిని వందే భారత్ చిత్రంతో నింపేసింది. మట్టింటికి ముచ్చటగా.. గ్రామంలో ఎంతో సంతోషంగా ఆర్భాటంగా జరుపుకునే పండగను మరింత బాగా జరుపుకోవాలన్న ఉద్ధేశ్యంతో హైస్పీడ్ ట్రైన్‌తో ఇంటిని అలంకరించాలనుకుంది పూర్ణిమ. గ్రామవాసులు సహజసిద్ధ పదార్థాలతో తయారు చేసే రంగుల నుంచి.. తెలుపు, నీలం, నల్లరంగులు తీసుకుని ఇంటి గోడపైన వందేభారత్ రైలు బొమ్మను చక్కగా చిత్రించింది. రైలు బొమ్మ ఆకర్షణీయంగా ఉండడంతో గ్రామస్థులు పూర్ణిమ ఇంటిని చూసేందుకు ఎగబడుతున్నారు. ‘‘గ్రామంలోని చాలామందికి ‘వందేభారత్ రైలు’ ఎలా ఉంటుందో తెలియదు. దీని గురించి వినడమేగాని చూసింది లేదు. అందుకే అందరికీ వందేభారత్‌ను పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో రైలు బొమ్మను చిత్రించాను. నిజానికి నేను కూడా ఇప్పటిదాకా వందేభారత్ చూసింది లేదు. ఫోన్లో వందేభారత్ బొమ్మను చూసి గీశాను. అచ్చం వందేభారత్‌ను పోలి ఉండడంతో నా పెయింటింగ్ గురించి తెలిసిన వారంతా చూడడానికి వస్తున్నారు. రైలు పెయింటింగ్ వేసిన తరువాత ఇంట్లో ఉన్నట్టుగా గాక, ట్రైన్లో ఉన్నట్టు ఉంది’’ అని సంతోషంగా చెబుతోంది పూర్ణిమ. వేడుకల్లో వందేభారత్ రైలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ పెయింటింగ్‌ను చూసిన గ్రామస్థులంతా.. ‘‘మేమయితే ఇంతవరకు ఈ రైలు ఎక్కలేదు. కనీసం ఇలాగైనా చూడగలుగుతున్నాం. వందే భారత్‌ను పూర్ణిమ చక్కగా వేసింది’’ అని మెచ్చుకుంటున్నారు. పిల్లలైతే కొత్త రైలు తమ ఊరు వచ్చిందని తెగ సంబరపడిపోతున్నారు. -
రెండు వర్గాల మధ్య ఘర్షణ..జంషెడ్‌పూర్‌లో ఉద్రిక్తత..
జార్ఘండ్‌లోని జంషెడ్‌పూర్‌లో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో అల్లర్లు చెలరేగాయి. శనివారం శ్రీరామ నవమి జెండాను అపవిత్రం చేశారన్న ఆరోపణలతో ఇరు గ్రూప్‌లు ఘర్షణకు దిగాయి. నిందితులను పట్టుకోవాని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టడంతోనే అల్లర్లు చెలరేగినట్లు అదికారులు తెలిపారు. దీంతో ఆప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ అల్లర్లను నియంత్రించేందుకు పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు శాస్త్రి నగర్లో ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుని రెండు దుకాణాలు, ఆటో రిక్షాకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు పోలీసులు. గుమిగూడి ఉన్నవారిని అక్కడ నుంచి పంపించి.. ఆ ప్రాంతం మొత్తం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది మోహరించారు. ఈ మేరకు సింగ్భూమ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ.. అల్లర్లుకు సంబంధించిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పరిస్థితిని అంచనా వేస్తున్నామని, సాధారణ స్థితికి తీసుకురావడానికి శాంతి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కొందరూ సంఘ వ్యతిరేకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని, పౌరులు అప్రమత్తమై సహకరించాలని విజయ్ అన్నారు. అలాగే శాంతి భ్రదతల రక్షణ కోసం తగినంత పోలీసు బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీం, ఒక మేజిస్ట్రేట్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు సిబ్బందిని నియమించామని ఆమె ఒక ప్రకటనలో చెప్పారు. పుకార్లను నమ్మవద్దదని ఎమ్మెల్యే జాదవ్ ప్రజలను కోరారు. పుకార్లు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేదా సందేశాలు వస్తే పోలీసులకు తక్షణమే ఫిర్యాదు చేయాలని సూచించారు. #WATCH | Security forces conduct flag march in Jamshedpur's Kadma police station area following an incident of stone pelting and arson, in Jharkhand Section 144 CrPc is enforced in the area and mobile internet is temporarily banned. pic.twitter.com/NhPnWtkQhR — ANI (@ANI) April 10, 2023 (చదవండి: కోవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. అప్రమత్తంగా ఉండాల్సిందే!) -
Indian Super League: హైదరాబాద్ ఎఫ్‌సీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టుకు అనూహ్య ఓటమి ఎదురైంది. జంషెడ్పూర్ ఎఫ్‌సీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. జంషెడ్పూర్ తరఫున రిత్విక్ దాస్ (22వ ని.లో), జే ఇమ్మాన్యుయెల్ థామస్ (27వ ని.లో), డానియల్ చుక్వు (29వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... హైదరాబాద్ తరఫున ఒగ్బెచె (12వ, 79వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
ISL 2022: హైదరాబాద్‌ను గెలిపించిన యాసిర్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) వరుసగా ఐదో విజయం నమోదు చేసింది. జంషెడ్‌పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ 1–0 గోల్‌తో జంషెడ్పూర్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. ఆట 48వ నిమిషంలో మొహమ్మద్ యాసిర్ సాధించిన గోల్‌తో హైదరాబాద్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. -
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
Indian Super League: ముంబై సిటీ నాలుగో విజయం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ ఎఫ్‌సీ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 4–2 గోల్స్ తేడాతో జంషెడ్పూర్ ఎఫ్‌సీపై నెగ్గింది. ముంబై తరఫున క్యాసినో (3వ నిమిషంలో), బిపిన్ సింగ్(17వ నిమిషంలో), ఇగోర్ (24వ నిమిషంలో), వైగోర్ (70వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. జంషెడ్పూర్ ఆటగాళ్లు కోమల్ (48వ నిమిషంలో), ఎలి సబియా (55వ నిమిషంలో) చెరో గోల్ వేశారు. -
Indian Super League: హైదరాబాద్, జంషెడ్పూర్ మ్యాచ్ ‘డ్రా’
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గురువారం హైదరాబాద్, జంషెడ్పూర్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. జంషెడ్పూర్ తరఫున స్టీవర్ట్ (41వ నిమిషంలో) గోల్ చేసి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అయితే ఆట 56వ నిమిషంలో జావో విక్టర్ ఇచ్చిన పాస్‌ను ఎటువంటి పొరపాటు చేయకుండా గోల్ పోస్ట్‌లోకి పంపిన హైదరాబాద్ స్ట్రయికర్ ఒగ్బెచె స్కోరును 1–1తో సమం చేశాడు. ఆ తర్వాత గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇప్పటి వరకు హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు ఆడగా ఒక మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడగా...ఇప్పుడు ‘డ్రా’ చేసుకుంది. -
భారత మహిళల ఫుట్‌బాల్ శిబిరానికి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎఫ్సీ) ఆసియా కప్ టోర్నమెంట్ సన్నాహాల కోసం భారత సీనియర్ మహిళలకు ఈనెల 16 నుంచి జంషెడ్‌పూర్‌లో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది జనవరి 20 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగే ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా ఈవెంట్ కోసం భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ థామస్ డెనర్‌బై 30 మందితో ప్రాబబుల్స్‌ను ప్రకటించాడు. ఈ ప్రాబబుల్స్‌లో తెలంగాణకు చెందిన 20 ఏళ్ల సౌమ్య గుగులోత్‌కు చోటు లభించింది. గతంలో భారత అండర్–17, అండర్–19 జట్లకు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌమ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత సీనియర్ జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసింది. -
డజను మామిడి పండ్లు.. ఒక్కోటి రూ. 10వేలు
రాంచీ: కరోనా కారణంగా స్కూళ్ళన్నీ మూసివేయండంతో, విద్యార్ధులు అంతా ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో పాఠశాల యాజమాన్యాలు ఆన్ లైన్ తరగతుల్ని ప్రారంభించారు. కరోనా కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న తల్లిదండ్రులకు ఆన్లైన్ క్లాస్‌లు పెద్ద సమస్యగా మారింది. మూడుపూటల తినడానికే లేని వారికి స్మార్ట్ ఫోన్, కంప్యూటర్లు అంటే కష్టం. దాంతో చాలా మంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ క్రమంలో జంషెడ్‌పూర్‌కు చెందిన తులసి కుమారి అనే పదకొండేళ్ల బాలిక ఆన్లైన్లో చదువుకునేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈమెపై స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఇవి చూసి చలించిపోయిన ముంబైకి చెందిన అమెయా హేతే ఆమెకు ఏ విధంగానైనా సాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆన్లైన్ క్లాస్‌లు వినేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలనే ఆ చిన్నారి కోరిక నేరవేర్చేందుకు ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆమె అమ్ముతున్న మామిడి పండ్లను ఒక్కక్కొటి రూ. 10వేలు చొప్పున .. 12మామిడి పండ్లను లక్షా 20వేలకు అమెయా హేతే కొనుగోలు చేశాడు. డజను మామిడి పళ్లు ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడంతో తులసి ఆనందానికి హద్దుల్లేవు. తన కుమార్తె చదవుకునేందుకు సాయం చేసిన అమెయా హేతే కు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: ఒక్క రోజులో 86 లక్షలకు పైగా టీకాలు వేసి చరిత్ర సృష్టించాం: మోదీ -
కరోనా పేషెంట్ ఇంట్లో మటన్ వండుకుని..
జంషెడ్పూర్: కన్నం పెట్టిన ఇంట్లో దొంగలు అన్నం వండుకుని తిన్న అరుదైన ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి జూలై 8న కరోనా సోకినట్లు తేలింది. దీంతో అతను టాటా మెయిన్ ఆస్పత్రి(టీఎమ్‌హెచ్)లో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు అతని ఇంటికి కన్నం వేయాలని నిర్ణయించుకున్నారు. పైగా ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించడం వారికి మరింత కలిసొచ్చింది. (మటన్ కొంటే హెల్మెట్ ఉచితం!) ఇంకేముందీ.. చడీచప్పుడు కాకుండా దొంగలు గురువారం రాత్రి ఆ ఇంట్లో దూరారు. ముందుగా కడుపు నింపుకుందామని కిచెన్‌లోకి ప్రవేశించి అన్నం, మటన్ కూర వండుకుని తృప్తిగా ఆరగించారు. అనంతరం దర్జాగా 50 వేల రూపాయలను, మరో 50 వేలు విలువ చేసే నగలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. (సెల్ చార్జర్ కోసం దారుణ హత్య) -
తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు
రాంచీ: జంషేడ్‌పూర్ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పాత నేరస్తుడు రింకూగా గుర్తించారు పోలీసులు. గత రాత్రి రైల్వే స్టేషన్ నుంచి అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి.. బుధవారం ఉదయం మృతదేహంగా ప్రత్యక్షమయ్యింది. నిందితుడు చిన్నారి తలను, మొండాన్ని వేరు చేసి.. పొదల్లో పడేశాడు. అంతేకాక చిన్నారిపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టు తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గత రాత్రి తల్లితో కలిసి చిన్నారి రైల్వే స్టేషన్లో నిద్రించింది. ఆ సమయంలో స్టేషన్‌కు వచ్చిన రింకు పాపను తీసుకుని.. కామ్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేసి.. అతి పాశవికంగా చంపడమే కాక.. తలను, మొండాన్ని వేరు చేసి పొదల్లో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు రింకూను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రింకుకు ఇలాంటి నేరాలు కొత్త కాదని.. గతంలో ఓ ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి, హత్య చేశాడని.. ఆ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఓ వారం రోజుల క్రితమే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అంతేకాక రింకు తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనార్హం. -
భార్యను కాల్చబోతే...తల్లి మృతి
రాంచీ : ఓ పోలీస్ అధికారి భార్యపై కాల్పులు జరిపిన ఘటన జంషట్‌పూర్‌లోని సొనారి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పోలీస్ ఇన్స్పెక్టర్ మనోజ్ గుప్తా, ఆయన భార్య పూనం గుప్త మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య శుక్రవారం ఉదయం తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అదికాస్త తీవ్రస్థాయికి చేరడంతో మనోజ్ గుప్త తల్లి, పక్కింటి మహిళ...భార్యభర్తలకు సర్థి చెప్పేందుకు యత్నించారు. అయితే భార్యపై ఆగ్రహంతో ఉన్న మనోజ్ గుప్త ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో అతడి తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, భార్య, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో మనోజ్ గుప్తాపై అతడి భార్య ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. -
మావోయిస్టుల ఘాతుకం.. ఐదుగురి మృతి
రాంచీ: మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఝార్ఖండ్‌లోని జంషెడ్పూర్ సమీపంలో పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఝార్ఖండ్- పశ్చిమబెంగాల్ సరిహద్దు ప్రాంతం సరైకెలా జిల్లాలోని ఓ మార్కెట్లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా సాయుధులైన ఇద్దరు మావోయిస్టులు పోలీసుల పైకి బుల్లెట్ల వర్షం కురిపించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అంతేకాకుండా పోలీసు వాహనంలో ఉన్న ఆయుధాలను కూడా ఎత్తుకు పోయారు. అంతకు ముందు ఇదే ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో 11 భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నకిలీ ఏసీబీ అధికారిని చితక్కొట్టిన మహిళ
జంషెడ్పూర్ : నకిలీ అధికారికి ఓ మహిళ చుక్కలు చూపించింది. ఫేక్ ఐడీతో రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో చెప్పుతో చితక్కొట్టింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని మ్యాంగోలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారినంటూ చెప్పి, ఫేక్ ఐడీతో మ్యాంగోలో నివసించే ఓ మహిళను రూ.50 వేలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు జంషెడ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అరుణ్ మెహతా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
నకిలీ ఏసీబీని చెప్పుతో చితక్కొట్టింది
-
దారుణం.. బాలికపై పోలీసులే..
రాంచీ : జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే దారుణానికి ఒడిగట్టారు. ఓ మైనర్ బాలిక తనపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని, వారిలో ఇద్దరు పోలీసులున్నారి జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్‌కు ఫిర్యాదు చేసింది. మంగళవారం సీఎం సిద్దిబాత్ కార్యక్రమానికి వచ్చిన బాలిక సీఎంతో తన గోడు వెల్లబోసుకుంది. వెంటనే స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. జంషెడ్‌పూర్‌కు చెందిన ఆ బాలిక ఎంజీఎం పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీ, డీఎస్పీ ర్యాంకు అధికారితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం జరిపారని.. అంతేకాకుండా వీడియో తీసి బెదిరింపులకు గురిచేస్తున్నారని సీఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు చర్యలు చేపట్టిన జంషెడ్పూర్ ఎస్పీ అనూప్ బర్తార్యా స్పందిస్తూ.. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. -
మృత్యు ఘోష.. 52 మంది చిన్నారుల మృతి
జంషెడ్పూర్: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే మరో ఘోర కలి వెలుగు చూసింది. జార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. జంషెడ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52 మంది పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్ప్రతి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
3800 కోట్లు: భారీ షాకిచ్చిన కరెంట్ బిల్!
జెంషెడ్పూర్: అక్షరాల రూ. 3800 కోట్లు.. ఇది ఒక సామాన్యుడికి వచ్చిన కరెంటు బిల్లు. మూడు గదులు, మూడు ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న తనకు కలలో సైతం ఊహించనిరీతిలో కరెంటు బిల్లు రావడం షాక్ అవ్వడం అతని వంతైంది. జెషెండ్పూర్లో నివసించే బీఆర్ గుహాకు ఆదివారం జార్ఖండ్ విద్యుత్ బోర్డు ఈ కరెంటు బిల్లు పంపింది. ఆ వెంటనే బిల్లు చెల్లించడం లేదంటూ ఇంటికి పవర్ కట్ చేసింది. దీంతో బిత్తరపోయిన బీఆర్ గుహా తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నాడు. 'కరెంటు బిల్లు చూసి నేను విస్తుపోయాను. ఇంతమొత్తం వస్తుందని మేం ఊహించలేదు. మాకు మూడు గదుల ఇల్లు ఉంది. ఇంట్లో మూడు ఫ్యాన్లు, మూడు ట్యూబ్‌లైట్లు, ఒక టీవీ ఉన్నాయి. ఈ మాత్రం దానికి ఇంతమొత్తం బిల్లు ఎలా వస్తుంది?' అని బిహార్ గుహా ప్రశ్నించారు. గుహా కూతురు రత్న బిశ్వా మాట్లాడుతూ 'మా అమ్మకు షూగర్ ఉంది. నాన్నకు రక్తపోటు (బీపీ) ఉంది. ఇరుగుపొరుగువారి సాయంతో ఇంటిని నెట్టుకొస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ బిల్లు మాకు షాక్ ఇచ్చింది' అని తెలిపారు. ఈ విషయమై జార్ఖండ్ విద్యుత్ బోర్డుకు ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తామని బోర్డు హామీ ఇచ్చింది. -
ఆధారాల్లేవు.. హత్యకేసులో మాజీ ఎంపీకి విముక్తి!
యూత్ కాంగ్రెస్ నేత హత్య కేసులో వివాదాస్పద మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహహ్మద్ షాబుద్దీన్‌కు విముక్తి లభించింది. తగినన్ని ఆధారాలు లేవంటూ ఆయనను జెంషెడ్పూర్ కోర్టు నిర్దోషిగా విడిచిపెట్టింది. జెంషెడ్పూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ మిశ్రాతోపాటు మరో ఇద్దరిని హత్య చేసినట్టు షాబుద్దీన్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఈ అభియోగాలను రుజువు చేసేందుకు తగినంతగా ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని పేర్కొంటూ.. జెంషెడ్పూర్ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అజిత్‌కుమార్ సింగ్ ఆయనను నిర్దోషిగా ప్రకటించారు. బిహార్‌లో పలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటున్నారు. ఆయన వీడియో కాన్ఫరేన్స్ ద్వారా సోమవారం కోర్టు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నలుగురు నిందితులపై 2006లో కోర్టు అభియోగాలను కొట్టివేసింది. మరో ముగ్గురు విచారణలోనే చనిపోయారు. 1989 ఫిబ్రవరి 2న దుండగులు కాంగ్రెస్ నేత ప్రదీప్ మిశ్రా కారును ఆపి.. ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనతోపాటు ఆయన స్నేహితులు జనార్దన్ చౌబే, ఆనంద్‌రావు ప్రాణాలు కోల్పోయారు.