తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు | In Jamshedpur 3 Year Old Kidnapped Beheaded By Repeat Offender | Sakshi
Sakshi News home page

మూడేళ్ల చిన్నారిని అత్యంత పాశవికంగా..

Published Wed, Jul 31 2019 4:20 PM | Last Updated on Wed, Jul 31 2019 4:38 PM

In Jamshedpur 3 Year Old Kidnapped Beheaded By Repeat Offender - Sakshi

రాంచీ: జంషేడ్‌పూర్‌ వ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిన మూడేళ్ల చిన్నారి కిడ్నాప్‌, హత్య కేసులో.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని పాత నేరస్తుడు రింకూగా గుర్తించారు పోలీసులు. గత రాత్రి రైల్వే స్టేషన్‌ నుంచి అపహరణకు గురైన మూడేళ్ల చిన్నారి.. బుధవారం ఉదయం మృతదేహంగా ప్రత్యక్షమయ్యింది. నిందితుడు చిన్నారి తలను, మొండాన్ని వేరు చేసి.. పొదల్లో పడేశాడు. అంతేకాక చిన్నారిపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్టు తెలిపింది.

పోలీసులు తెలిపిన వివరాలు.. గత రాత్రి తల్లితో కలిసి చిన్నారి రైల్వే స్టేషన్‌లో నిద్రించింది. ఆ సమయంలో స్టేషన్‌కు వచ్చిన రింకు పాపను తీసుకుని.. కామ్‌గా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. అనంతరం చిన్నారిపై అత్యాచారం చేసి.. అతి పాశవికంగా చంపడమే కాక.. తలను, మొండాన్ని వేరు చేసి పొదల్లో పడేశాడు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడు రింకూను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే రింకుకు ఇలాంటి నేరాలు కొత్త కాదని.. గతంలో ఓ ఏడేళ్ల చిన్నారిని కిడ్నాప్‌ చేసి, హత్య చేశాడని.. ఆ కేసులో రెండేళ్లు జైలు శిక్ష అనుభవించి.. ఓ వారం రోజుల క్రితమే విడుదలయ్యాడని పోలీసులు తెలిపారు. అంతేకాక రింకు తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌ కావడం గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement