భార్యను కాల్చబోతే...తల్లి మృతి | Police Officer Shoots At Wife And 2 Others in Jamshedpur | Sakshi
Sakshi News home page

భార్యపై పోలీస్‌ అధికారి కాల్పులు

Published Fri, Jul 26 2019 2:39 PM | Last Updated on Fri, Jul 26 2019 2:39 PM

Police Officer Shoots At Wife And 2 Others in Jamshedpur - Sakshi

రాంచీ : ఓ పోలీస్‌ అధికారి భార్యపై కాల్పులు జరిపిన ఘటన జంషట్‌పూర్‌లోని సొనారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక‍్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ గుప్తా, ఆయన భార్య పూనం గుప్త మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భార‍్యాభర్తల మధ్య శుక్రవారం ఉదయం తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అదికాస్త తీవ్రస్థాయికి చేరడంతో మనోజ్‌ గుప్త తల్లి, పక్కింటి మహిళ...భార్యభర్తలకు సర్థి చెప్పేందుకు యత్నించారు. అయితే భార్యపై ఆగ్రహంతో ఉన్న మనోజ్‌ గుప్త ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో అతడి తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, భార్య, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో మనోజ్‌ గుప్తాపై అతడి భార్య ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, పోలీస్‌ శాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement