
ప్రతీకాత్మక చిత్రం
రాంచీ : మహిళను దారుణంగా హత్య చేసి, వాటర్ కూలర్ దొంగిలించిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. 2019 సెప్టెంబర్‌లో జరిగిన ఈ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారినుంచి పలు కీలకమైన విషయాలను రాబట్టారు. వివరాల్లోకి వెళితే.. 2019 సెప్టెంబర్‌లో బీహార్‌కు చెందిన రాజేంద్ర శర్మ, అతడి కుమారుడు అమిర్ శర్మలు మరో ఆరుగురు వ్యక్తులతో కలిసి దొంగతనానికి వెళ్లారు. అర్థరాత్రి సమయంలో రామ్‌ఘర్‌లోని కమలేశ్ కౌర్ అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. నిద్రలో ఉన్న ఆమెను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత పక్కగదులో నిద్రిస్తున్న కమలేశ్ కౌర్ కోడలి మీద కూడా దాడి చేయటానికి ప్రయత్నించారు.
పక్కనే ఉన్న కమలేశ్ కౌర్ కుమారుడు వెంటనే మేల్కొవటంతో దుండగులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. పారిపోతున్న సమయంలో ఇంట్లోని వాటర్ కూలర్‌ను ఎత్తుకెళ్లారు. కానీ, దాన్ని మోయలేక ఇంటికి 100మీటర్ల దూరంలో వదిలేసి వెళ్లిపోయారు. కౌర్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్ది నెలల గాలింపు అనంతరం ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment