Poonam
-
రోడ్డుపై కనికట్టు..బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా! వీడియోలతో
పశ్చిమ బెంగాల్‌లోని భద్రేశ్వర్ అనే ఊళ్లో రోడ్ల మీద హఠాత్తుగా డాల్ఫిన్ దుముకుతుంటుంది. గోడ నిలబడుతుంది. గుంత ఉందనే భ్రాంతి కలుగుతుంది. పూనమ్ అనే గృహిణి ఇలా 3డి ఆర్ట్‌తో కనికట్టు చేస్తోంది. ఆమె వీడియోలు యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నాయి. కోల్‌కతా నుంచి భద్రేశ్వర్ గంటన్నర దూరం. ఒకప్పుడు అది వేరే ఊరుగాని ఇప్పుడు దాదాపుగా సిటీలో కలిసిపోయింది. ఆ ఊరు ఒకప్పుడు జూట్ మిల్లుకు ప్రసిద్ది. ఇప్పుడు పూనమ్ వేస్తున్న త్రీడీ బొమ్మలకే ప్రసిద్ధి చెందుతోంది. భద్రేశ్వర్‌లోని ఇరుకు వీధుల్లో పూనమ్ హటాత్తుగా ప్రత్యక్షమై బొగ్గు, చాక్‌పీస్‌లతో ఒక కాలువను సృష్టించినా, బావిని తవ్వినా త్రీ డైమన్షనల్ ఇల్యూజన్ వల్ల నిజంగా అనిపిస్తాయి. థ్రిల్ పుట్టిస్తాయి. వీటిని పూనమ్ రీల్స్‌గా, షార్ట్ వీడియోస్‌గా విడుదల చేయడం వల్ల వైరల్‌గా మారుతున్నాయి. బోలెడంత మంది అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ‘సాక్షి’ పలకరింపు 3 లక్షల సబ్స్క్రయిబర్లతో ‘పూనమ్ ఆర్ట్ అకాడెమీ’ యూ ట్యూబ్ చానల్ పూనమ్ వేస్తున్న త్రీడీ బొమ్మల వీడియోలతో ట్రెడింగ్లో ఉంటోంది. ఇప్పటికి ఆమె వీడియోలకు దాదాపు 14 కోట్ల వ్యూస్ వచ్చాయంటే ఎంత మంది ఎక్కడెక్కడ చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఫేస్బుక్ పేజీలో ఫోన్ నంబర్ ఆధారంగా ‘సాక్షి’ పలకరించితే పూనమ్ ఉత్సాహంగా తన విశేషాలు చెప్పింది. కేవలం చూడటం ద్వారానే ఈ కళను నేర్చుకున్నానని చెప్పింది. ఎంఏ బిఇడి చదివి పూనమ్ భద్రేశ్వర్లోనే పుట్టి పెరిగింది. ఎం.ఏ, బీఈడి చేసింది. అదే ఊళ్లో కమర్షియల్ ఆర్టిస్ట్‌గా, త్రీడీ ఆర్టిస్ట్‌గా ఉన్న చందన్‌ను వివాహం చేసుకుంది. చందన్ కూడా తన బొమ్మలతో సోషల్ మీడియాలో ఫేమస్. కాని పెళ్లయ్యాక 2002 నుంచి పూనమ్ కూడా వీడియోలు రిలీజ్ చేయడం మొదలుపెట్టి గుర్తింపు పొందింది. ‘చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే ఆసక్తి. మా స్కూలు మాస్టారు ఒకాయన నాలో బొమ్మల గురించి ఆసక్తి పెంచారు. నా భర్త చందన్ కూడా ఆర్టిస్ట్ కావడంతో పెళ్లయ్యాక నేను బొమ్మలు ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టాను. అయితే నా భర్త త్రీడీ బొమ్మలు వేయడంలో ఎక్స్పర్ట్. నేను అతన్ని నేర్పించమని అడగలేదు. కేవలం చూస్తూ నాకు నేనుగా నేర్చుకున్నాను. త్రీడి బొమ్మ గీయాలంటే కొలతల్లోనే ఉంది అంతా. అలాగే షేడ్ ఎక్కడ ఇవ్వాలో తెలియాలి. అది నేను నేర్చుకున్నాను. ముఖ్యంగా నేనూ నా భర్తా, పిల్లలూ సులభంగా బొమ్మలు గీసేలా టెక్నిక్స్ కనిపెట్టాం. అవి వీడియోల ద్వారా చెబుతున్నాం... అలాగే నేరుగా కూడా క్లాసులు చెప్పి నేర్పిస్తున్నాం. మా కృషి ఆదరణ పొందడం ఆనందంగా ఉంది’ అని తెలిపింది పూనమ్. ప్రత్యేక ఆహార్యం పూనమ్ తన అన్ని వీడియోల్లో చీరకట్టుతో, తల మీద కొంగు కప్పుకుని కనిపిస్తుంది. పూర్తిగా గృహిణి ఆహార్యంలో ఉండటం వల్ల, అలాంటి ఆహార్యంలో త్రీడీ బొమ్మలు వేసే స్త్రీలు ఎవరూ లేరు కనుక ఆమె వీడియోలు కుతూహలం రేపుతున్నాయి. ‘మా వాడలోని పిల్లలంతా నా వీడియోలకు సహకరిస్తుంటారు. బావి గీసి దానిలో దూకమంటే దూకుతున్నట్టుగా యాక్ట్ చేస్తారు. లేని మెట్ల మీద నుంచి గెంతుతారు. వారు లేకపోతే నా వీడియోలు లేవు’ అంది పూనమ్. ఆమె ప్రతి ఆల్ఫాబెట్‌తో బొమ్మలు ఎలా గీయాలో వీడియోలు చేసింది. అలాగే అంకెలతో కూడా. ప్రతి గీతను బొమ్మగా మార్చే ఆమె ప్రతిభ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఉదాహరణకు ఒక ఇంటి ముందు మెట్లు లేకపోయినా మెట్లు గీయడంతో ఆ ఇంటి గడప లుక్కే మారి ఆశ్చర్యం కలుగుతుంది. పూనమ్ వీడియోలు ఆమెకు ఆదాయం తెచ్చి పెడుతున్నాయి. ప్రతిభ ఉంటే ఉన్న చోట నుంచే ఉనికి పొందవచ్చంటోంది పూనమ్. చదవండి: బాదం పంట దిగుబడులకు ఇవే ఆధారం! తేనెటీగలు లేకుంటే.. View this post on Instagram A post shared by PUNAM ART ACADEMY (@punamartacademy) View this post on Instagram A post shared by PUNAM ART ACADEMY (@punamartacademy) -
Poonam Dhanwatey: పులికి ఫ్రెండు
ఆసియాలో ఒకప్పుడు లక్ష పులులు ఉండేవట. ఇప్పుడు నాలుగు వేలు మాత్రమే ఉన్నాయి. అందులో 2000 పులులు మన దేశంలో ఉన్నాయి. వేట, గ్రామీణుల ప్రతీకారం, కరెంటు కంచెలు... ఇవన్నీ పులిని చంపుతున్నాయి. మరి బతికిస్తున్నది? పూనమ్ ధన్వతే వంటి వన్యప్రాణి ప్రేమికులు. ప్రభుత్వంతో కలిసి పని చేసే ఇలాంటి వాళ్ల వల్లే పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ సామాజిక రంగాల్లో పని చేసే మహిళలకు పారిస్‌లో ప్రతిష్ఠాత్మకంగా ఇచ్చే ‘ఈవ్ రోచర్ ఫౌండేషన్’ గ్లోబల్ అవార్డ్ 2022 సంవత్సరానికి పూనమ్ ధన్వతేకు దక్కింది. ఇటీవల ఆమె పారిస్‌లో ఆ అవార్డును అందుకున్నారు. పులులను కాపాడటానికి ఆమె చేసిన సేవకు ఇది ఒక గొప్ప గుర్తింపు. 2001 లో అడవిలో కెమెరాలు బిగించడం ద్వారా పులుల సంఖ్యను తెలుసుకునే విధానాన్ని మొదటగా ప్రవేశపెట్టిన వ్యక్తి పూనమ్. ఇప్పుడు ఆ విధానం చాలా చోట్ల అటవీ శాఖ ఉపయోగిస్తున్నది. 500 పులుల కాపలాదారు ఒకప్పుడు ఇంటీరియర్‌గా పని చేసిన పూనమ్ ధన్వతే వన్యప్రాణులు ముఖ్యంగా పులుల పట్ల తనకు ఉన్న ప్రేమ వల్ల ఆ రంగాన్ని వదిలిపెట్టి 2001లో ‘టైగర్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ టైగర్స్’ (ట్రాక్ట్) అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ కింద వన్యప్రాణుల కోసం ‘బోర్న్ ఫ్రీ’ అనే పర్యావరణ ఉద్యమాన్ని ఆమె నడుపుతోంది. స్వేచ్ఛగా ఉండాల్సిన వన్యప్రాణులతో మనుషులు కలిసి మెలిసి ఉండేలా చూడటమే ఈ ఉద్యమం లక్ష్యం. మన దేశంలో ఉన్న దాదాపు 2000 పులులలో 500 పులులు మధ్య భారతంలో (మహరాష్ట్ర– మధ్యప్రదేశ్ సరిహద్దులు) ఉన్న పంచ్, తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లలో ఉన్నాయి. ఈ టైగర్ రిజర్వ్‌లను కాపాడే ప్రభుత్వ అటవీ శాఖతో పాటు కలిసి పని చేస్తూ ప్రజలకు అటవీ శాఖకు మధ్య వారధిగా ఉంటూ పులులకు మనుషులకు మధ్య సయోధ్య కుదిర్చే జటిలమైన పనిని గత రెండు దశాబ్దాలుగా తన భర్త హర్షవర్థన్‌తో కలిసి చేస్తోంది. తాడోబా టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని అక్కడే ఉండిపోయిన పూనమ్ పులులకే తన జీవితం అంకితం అంటుంది. పులుల మీద పుట్ర ‘అడవి పచ్చగా ఉంటే ఎరలు తిరుగాడుతాయి. పులి నోటికి ఎర చిక్కితే దానికి ఎటువంటి ప్రమాదం ఉండదు. ఎర దొరక్కపోతేనే అది ఆకలితో ఊళ్ల సమీపానికి వస్తుంది. గ్రామస్తులు దానిని కొట్టి చంపుతారు’ అంటుంది పూనమ్ ధన్వతే. అడవుల్లో కుంటలు నీటితో ఉండేలా, గ్రామస్తులు వంట చెరుకు కోసం చెట్లు కొట్టకుండా, వేట జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పూనమ్ పని మొదలయ్యింది. టైగర్ రిజర్వ్‌లలో పులి ఉంటే పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, దానివల్ల ఆదాయం వచ్చి ఆ ప్రాంతానికి మేలు జరుగుతుందని ఆమె గ్రామస్తులకు నేరుగా చూపించింది. స్థానికులను భాగస్తులను చేసి కెన్యాలో అభయారణ్యాలు స్థానికుల భాగస్వామ్యం వల్ల సురక్షితంగా ఉన్నాయని నిపుణులు అంటారు. అదే మోడల్‌ను పూనమ్ ధన్వతే తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లలో ప్రవేశపెట్టింది. అటవీ శాఖ కింద పని చేస్తున్న 500 మంది సిబ్బందితో పాటు రిజర్వ్ అంచున ఉన్న పల్లెల్లో స్త్రీ, పురుషులను ‘టైగర్ అంబాసిడర్లు’గా ఎంపిక చేసి వారిలో చైతన్యం కలిగించింది. 1300 మంది యువత 195 గ్రామాల నుంచి ధన్వతే కింద పులుల కోసం పని చేస్తున్నారు. ‘వీరంతా ప్రతి రోజూ అడవిలోకి వెళతారు. నేల మీద పులి, చిరుతపులి, ఎలుగుబంటి, అడవి కుక్కల పాద ముద్రలను గుర్తిస్తారు. అవి పల్లెలవైపు వచ్చేలా ఉంటే గ్రామస్తులను అలెర్ట్ చేస్తారు. పులి వల్ల గ్రామస్తులకు నష్టం... గ్రామస్తుల వల్ల పులికి నష్టం రాకుండా చూస్తారు’ అంటుంది పూనమ్. అందుతున్న ఫలాలు తాడోబా, సాత్పురా టైగర్ రిజర్వ్‌లు టూరిస్ట్ అట్రాక్షన్లుగా మారాయి. దాని వల్ల ఆ రిజర్వ్‌లకు ఆదాయం పెరిగింది. ఆ ఆదాయం పల్లెలకే దక్కేటట్టుగా ప్రభుత్వంతో కలిసి సోలార్ దీపాలు, టాయిలెట్లు కట్టించింది. ప్రతి ఇంటికి సబ్సిడీలో గ్యాస్ కనెక్షన్లు ఇప్పించింది. దాంతో గ్రామస్తులు చాలా మటుకు సంతోషంగా ఉన్నారు. వారికి పులి ఉంటేనే జీవనం అని అర్థమైంది. అయితే పులులు మనుషుల్ని చంపడం జరుగుతూనే ఉంటుంది. పులి మనిషిని చంపిన చోట పులి విగ్రహం పెట్టి ఆ చనిపోయిన మనిషి కోసం నివాళి అర్పించడం గ్రామస్తులు నేర్చుకున్నారు. ఎంతో ప్రమాదం వస్తే తప్ప పులి జోలికి వెళ్లరు. టైగర్ రిజర్వ్ చుట్టూ కంచె వేయడం ద్వారా పులులను కాపాడాలని ప్రభుత్వం భావిస్తుంది. ‘కాని మనుషులే కంచెగా మారి పులులను కాపాడాలి. అప్పుడే పులి బతగ్గలుగుతుంది’ అంటుంది పూనమ్. -
ముగ్గురు తల్లుల ముచ్చట
కాలేజీ రోజుల నుంచి కన్న కల వారికి పిల్లలు పుట్టిన తర్వాత నెరవేరింది. వియని, పూనమ్, రైనా ముగ్గురూ చిన్ననాటి స్నేహితులు. ఉండేది ముంబయ్‌లో. ఈ ముగ్గురూ కలిసి ఏదైనా మంచి గుర్తింపు వచ్చే వ్యాపారం చేయాలని కలలు కన్నారు. ముగ్గురూ కాలేజీ చదువులు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరారు. రోజులో ఎక్కువ సమయం ఉద్యోగానికే కేటాయించేవారు. పెళ్లిళ్లు అయ్యాయి. పిల్లలు పుట్టిన తర్వాత ఓ వైపు ఉద్యోగం, మరోవైపు పిల్లల పనులతో తీరికలేకుండా ఉండేవారు. ఆ సమయంలోనే పిల్లల దుస్తుల బ్రాండ్ ప్రారంభించాలనుకున్నారు. ముగ్గురూ ఒక్కొక్కరూ రూ.30 వేలతో రెండేళ్ల క్రితం ‘ఓయి ఓయి’ అనే పేరుతో కిడ్స్ బ్రాండ్‌ని ప్రారంభించారు. దానర్ధం ఫ్రెంచ్‌లో ‘ఎస్ ఎస్’. ‘నేను తల్లినయ్యాక ఇంటి నుండి ఆఫీసు పని చేసేదాన్ని. ఒక రోజు నా పై అధికారి వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు, ఉద్యోగం వదులుకోమని చెప్పారు’ కొన్ని కంపెనీలు ఇప్పటికీ పని చేసే తల్లుల స్థితిని పట్టించుకోకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ పరిస్థితిని చెబుతూ ‘మేం ముగ్గురం చిన్నప్పటి నుంచీ స్నేహితులం. మాకు ఒకరి స్వభావాలు మరొకరికి బాగా తెలుసు. మా ముగ్గురికీ చిన్నపిల్లలు ఉన్నారు. మేం ఈ వ్యాపారం ప్రారంభించాక ఒక్కొక్కరం ఒక్కోసారి వీలును బట్టి వర్క్ చేసుకునే అవకాశం లభించింది’ అని తెలిపారు వియని. రెండేళ్ల క్రితం ప్రారంభం ‘2018లో ముందు తెలిసిన వారి ద్వారా, ఇన్‌స్ట్రాగామ్ ఆర్డర్ల ద్వారా మా వ్యాపారాన్ని కొనసాగించాలనుకున్నాం. ఇందుకు మా బ్రాండ్ దుస్తులను మా పిల్లలకే వేసి ఫొటో షూట్ చేయించాం. వాటిని ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పోస్ట్ చేశాం. దీంతో మా ఫ్రెండ్స్, ఇతర కుటుంబ సభ్యులు, తెలిసినవారు మా నుండి బట్టలు కొన్నారు. వినియోగదారుల నుండి మంచి స్పందన వచ్చినప్పుడు మా ఇన్సా ్టగ్రామ్ ఖాతాలో వాటిని పోస్ట్ చేస్తూ ఆర్డర్లను పెంచడంపై దృష్టి పెట్టాం’ అని రైనా చెప్పారు. ‘మొదట్లో పెద్దగా డబ్బు సంపాదించకపోయినా ఆర్డర్ రాగానే మెటీరియల్ తేవడం, డిజైనింగ్ చేయడం.. త్వరగా వినియోగదారునికి అందించడం చేసేవాళ్లం. ఎంతోమంది చిన్నారులను మా దుస్తులతో అందంగా ఉంచుతున్నాం అనే ఆలోచన మాలో హుషారుని ఇచ్చింది’ అని వియని చెప్పారు. సెలబ్రిటీల నుంచి... ఇన్స్టాగ్రామ్ ద్వారా త్వరలోనే ప్రముఖుల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ఇనాయా ఖేము, తైమూర్ అలీ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మెహర్ బేడి ధుపియా వంటి పిల్లలంతా ప్రముఖ సెలబ్రిటీల పిల్లలు. ఇప్పుడు ఆ పిల్లలే మా ‘బుల్లి క్లయింట్లు’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ ముగ్గురు తల్లులు. శోభా డే మనవరాళ్ళు, లిసా రే కుమార్తెలు వీరి ప్రచారంలో ఇప్పుడు భాగమయ్యారు. ‘ఓయి ఓయి’ కి మిగతా ఆన్లైన్ షాపింగ్ సైట్స్ వేదికగా నిలిచాయి. ట్రిక్స్ అండ్ టిప్స్ సరసమైన ధరలకు స్మార్ట్ క్యాజువల్ బ్రాండ్‌ని అందిస్తూ వచ్చారు. తల్లిదండ్రులకు పెప్పీ ప్రింట్ల నుండి పలాజో సెట్ల వరకు ఒకే చోట దొరికే సదుపాయం కల్పించారు. దీంతో వ్యాపారాన్ని షాపుల ద్వారానూ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో హాప్స్కాచ్తో ‘ఓయి ఓయి’ని విజయవంతంగా ప్రారంభించారు. లిటిల్ మఫెట్, ఫస్ట్క్రీ, మింత్రాతో కలిసి పనిచేయడం ఈ బ్రాండ్‌కు మరింత సహాయపడింది. ఆర్డర్లు .. అవార్డులు రెండుసార్లు కిడ్స్స్ట్రాపెస్, ఇండియా కిడ్స్ బ్రాండ్ అవార్డు, స్మార్ట్ దుస్తులు పిల్లల విభాగంలో అత్యంత గుర్తింపు పొందిన బ్రాండ్లలో ఒకటిగా పేరు సంపాదించింది ఓయి ఓయి. 2021 నాటికి నెలకు 10,000 ఆర్డర్లు పొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ 3 మామ్స్. కోవిడ్–19 ప్రభావం ఈ బ్రాండ్ కార్యకలాపాలపైనా చూపింది. అయితే లాక్డౌన్ ముగిసిన నాటి నుంచి అత్యధిక అమ్మకాలూ జరిగాయని ఈ ముగ్గురు తల్లులూ సగర్వంగా చెబుతున్నారు. -
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ఘనవిజయం
-
భార్యను కాల్చబోతే...తల్లి మృతి
రాంచీ : ఓ పోలీస్ అధికారి భార్యపై కాల్పులు జరిపిన ఘటన జంషట్‌పూర్‌లోని సొనారి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పోలీస్ ఇన్స్పెక్టర్ మనోజ్ గుప్తా, ఆయన భార్య పూనం గుప్త మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య శుక్రవారం ఉదయం తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అదికాస్త తీవ్రస్థాయికి చేరడంతో మనోజ్ గుప్త తల్లి, పక్కింటి మహిళ...భార్యభర్తలకు సర్థి చెప్పేందుకు యత్నించారు. అయితే భార్యపై ఆగ్రహంతో ఉన్న మనోజ్ గుప్త ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో అతడి తల్లి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, భార్య, మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా గతంలో మనోజ్ గుప్తాపై అతడి భార్య ఫిర్యాదు చేయడంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా, పోలీస్ శాఖ సస్పెన్షన్ వేటు వేసింది. -
‘అర్జున’కు బుమ్రా, షమీ, జడేజా, పూనమ్
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహిళా స్పిన్నర్ పూనమ్ యాదవ్ పేర్లను ‘అర్జున అవార్డు’కు బీసీసీఐ ప్రతిపాదించింది. శనివారం ఇక్కడ జరిగిన సమావేశంలో సుప్రీం కోర్టు నియమిత క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బుమ్రా, షమీ భారత పురుషుల జట్టు పేస్ దళంలో కీలకమైనవారు. జడేజా... స్పిన్ ఆల్ రౌండర్. అద్భుతమైన ఫీల్డర్. ఈ ముగ్గురికీ త్వరలో జరుగనున్న ప్రపంచ కప్‌నకు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కింది. గత ఏడాది ఓపెనర్ శిఖర్ ధావన్ పేరును అవార్డుల కమిటీకి పంపించినా తిరస్కరణకు గురైంది. ఈసారి మాత్రం ధావన్ పేరును ‘అర్జున’కు ప్రతిపాదించలేదు. ఇక 27 ఏళ్ల పూనమ్ యాదవ్ మహిళల జట్టులో రెగ్యులర్ సభ్యురాలు. ఈమె 41 వన్డేల్లో 63 వికెట్లు, 54 టి20ల్లో 74 వికెట్లు పడగొట్టింది. ఫుట్‌బాల్ నుంచి గుర్ప్రీత్, జెజె... సీనియర్ ఫుట్‌బాల్ జట్టు గోల్ కీపర్ గుర్ప్రీత్ సంధూ, స్ట్రయికర్ జెజె లాల్పెఖులా పేర్లను వరుసగా మూడో ఏడాది అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అర్జున అవార్డుకు నామినేట్ చేసింది. జాతీయ జట్టుకు చాలా కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరికీ గత రెండేళ్లుగా అవార్డు దక్కలేదు. -
పూనం నామినేషన్ కార్యక్రమంలో శత్రుఘ్న సిన్హా
లక్నో : బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన శత్రుఘ్న సిన్హా రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి ఎస్పీ తరపున లక్నో నుంచి పోటీ చేస్తున్న తన భార్య పూనం నామినేషన్ కార్యక్రమానికి హాజరై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. శత్రుఘ్న సిన్హా బిహార్‌లోని పట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబ అనుబంధాలూ తనకు ముఖ్యమేనని, కుటుంబ యజమానిగా, భర్తగా తన కుటుంబానికి మద్దతు ఇవ్వడం తన బాధ్యతని శత్రుఘ్న సిన్హా తన చర్యను సమర్ధించుకున్నారు. కాగా 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన సిన్హా ప్రస్తుత ఎన్నికల్లో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో తలపడుతున్నారు. ఇక లక్నోలో సిన్హా భార్య పూనం ఎస్పీ తరపున పోటీ చేస్తూ ప్రత్యర్ధిగా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే లక్నోలో తన భార్య పూనం నామినేషన్‌కు శత్రుఘ్న సిన్హా హాజరవడం కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేస్తుందని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ నేత, దిగ్గజ నటుడైన సిన్హా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
యుద్ధకళలతోనే మహిళలకు రక్షణ
అనంతపురం సప్తగిరి సర్కిల్ : దేశవ్యాప్తంగా మహిళల ఆత్మరక్షణకు పాఠశాలల స్థాయిలోనే యుద్ధ కళలు నేర్పాలని అర్జున అవార్డు గ్రహీత పూనమ్ చోప్రా అభిప్రాయపడ్డారు. అనంతలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూడో పోటీలకు ముఖ్య అతిథిగా ఆమె విచ్చేశారు. అనంతరం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన పూనమ్ 1984 నుంచి ఇప్పటి వరకు జూడో క్రీడలో ఉంటూ 35 సార్లు ఇండియాకు ప్రాతినిధ్యం వహించారు. వివిధ కేటగిరీలకు చెందిన 22 మెడల్స్‌ను అందుకున్నారు. సాక్షి: జూడో క్రీడ గురించి మీ మాటల్లో .. పూనమ్: మార్షల్ ఆర్ట్స్‌లో మొదటి స్థానంలో జూడో క్రీడ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్రీడ అత్యంత ప్రాచుర్యం పొందింది. కాలి వేలి నుంచి తల జుట్టు వరకూ ఈ క్రీడ ఉపయోగపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా జూడో క్రీడ 2వ స్థానంలో ఉంది. ఈ క్రీడను 1984 నుంచి ఆడుతున్నా. ఇప్పటి వరకు ఈ క్రీడకు ప్రాతినిధ్యం వహించా. సాక్షి: ఒలింపిక్స్‌లో ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించారా? పూనమ్: ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున 1996లో ప్రాతినిధ్యం వహించా. ఏషియన్ గేమ్స్‌లో 29 ఏళ్ల తరువాత 1993లో చైనాలోని మకావూలో నిర్వహించిన జూడో క్రీడలో సిల్వర్ మెడల్ సాధించా. 1994లో జపాన్‌లోని హిరోషిమాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన ఏకైక మహిళగా కీర్తిని సాధించా. సాక్షి: మహిళల ఆత్మరక్షణకు జూడో క్రీడ ఏవిధంగా ఉపయోగపడుతుంది? పూనమ్: జూడో క్రీడ అంటేనే సెల్ఫ్ డిఫెన్స్ అని అర్థం. ఇందులో బ్లాక్ బెల్ట్ సాధించిన వారు నాతోపాటు నలుగురి నుంచి ఐదుగురిని రక్షించగలదు. ప్రత్యర్థి వద్ద తుపాకి, నాన్చాక్, చాకు వంటి ఆయుధాలను సైతం ఎదుర్కునేందుకు వీలుంటుంది. ఈ క్రీడను రెజ్లింగ్‌లో అంతర్భాగంగా చెప్పొచ్చు. కానీ జపాన్‌కు సంబంధించిన క్రీడా పరిభాష దీనిలో మిళితమై ఉంటుంది. దీంతో పూర్తి ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది. సాక్షి: ఏఏ దేశాల్లో ఈ క్రీడ ప్రాచుర్యం పొందింది. పూనమ్: ఈ క్రీడ ప్రధానంగా రష్యా, ఫ్రాన్స్, క్యూబా, కొరియా, జపాన్ దేశాల్లో అత్యధిక సంఖ్యలో దీన్ని ఆడతారు. తరువాత స్థానంలో భారత్ ఉంది. సాక్షి: క్రీడలకు దేశంలో ఎలాంటి ఆదరణ లభిస్తుంది? పూనమ్:ప్రభుత్వాలు చేయూతనందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయస్థాయికి ఎదిగిన తరువాత, పతకం సాధించిన తరువాత వారికి సహాయం చేస్తున్నారు. క్రీడాకారుడికి ముందునుంచే చేయూతనందిస్తే మరింత మెరుగైన ప్రతిభ సాధించొచ్చు. సాక్షి: భారత్ ఒలింపిక్స్‌లో పతకం సాధించేందుకు చేయాల్సిన విధి ఏమిటి? పూనమ్: ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుతోపాటు అకాడమీలను, క్లబ్‌లను అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేసి, క్రీడాకారులకు ఉన్నత శ్రేణి శిక్షణ అందించాలి. వారికి ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాలి. సాక్షి: స్పోర్ట్స్ పాలసీపై మీ అభిప్రాయం? పూనమ్:హర్యానా ముఖ్యమంత్రి భూపేందర్హుడా దీన్ని ప్రవేశ పెట్టారు. వారిని అనుసరించి గతంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్ దీన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. క్రీడాకారులకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సాక్షి: ఇండియాలో ఏఏ రాష్ట్రాలు జూడో క్రీడలో రాణిస్తున్నాయి? పూనమ్: దేశ వ్యాప్తంగా క్రీడ బాగా అభివృద్ధి సాధించింది. ముంబయ్, పూణే, హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లో అధిక సంఖ్యలో ఆడుతున్నారు. సాక్షి: మీకు భారత ప్రభుత్వం అర్జున అవార్డును ఎప్పుడు అందించింది? పూనమ్:భారత ప్రభుత్వం 1996లో అర్జున అవార్డు అందించింది. అదే ఏడాదిలో జూడలో అవార్డు సాధించిన ఏకైక మహిళగా కీర్తింపబడ్డా. సాక్షి: ఆర్డీటీ గురించి మీ మాటల్లో... పూనమ్:విదేశాల నుంచి వచ్చి ఇక్కడ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆర్డీటీ వల్ల నేడు ఈ ప్రాంతానికి వచ్చేందుకు వీలైంది. ఇక్కడ 5 క్రీడల్లో శిక్షణ అందించడం ద్వారా ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దేశవ్యాప్తంగా క్రీడాభివృద్ధికి ఇలాంటి సంస్థలు సహకరించాలి. -
దొంగను పట్టేశారు
జీన్స్, టీ షర్ట్, స్కూటీ, మెడలో ఓ స్లిమ్ బ్యాగ్ లేదా హెవీగా బ్యాక్‌ప్యాక్... ఇదీ ఈ తరం కాలేజీ అమ్మాయిల డ్రెసింగ్. ఇలాంటి అమ్మాయిలే పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్లు. వీళ్లను చూసిన ఓ జేబుదొంగకు ‘వీళ్లేంటి ఆఫ్ట్రాల్ అమ్మాయిలే కదా’ అనుకున్నాడు. ‘మేము అమ్మాయిలమే కానీ, ఆఫ్ట్రాల్ అమ్మాయిలం కాదు’ అని నిరూపించారీ ఇద్దరమ్మాయిలు. వీళ్ల ధైర్యం, తెగువ, సమయస్ఫూర్తికి అల్వార్ జిల్లా ఎస్పీ కూడా ముచ్చటపడ్డాడు. వాళ్లను పోలీస్ స్టేషన్‌కి పిలిపించి ఇద్దరికీ పూలబొకేలు ఇచ్చి మరీ అభినందించారు. చెరో వెయ్యి రూపాయలిస్తూ... ‘ఆడపిల్లలు ఇలా ఉంటే సమాజంలో సమస్యలు అన్నీ వాటికవే సర్దుకుంటాయి. ఆకతాయిలు, చిల్లర దొంగలకు మీరొక పాఠం కావాలి. దొంగతనం చేయాలని చాచిన చేతులు మిమ్మల్ని చూసి జంకుతో వెనక్కి వెళ్లిపోవాలి’ అంటూ అమ్మాయిలను ప్రశంసల్లో ముంచెత్తారు. వాళ్లు చేసిందేమిటి? అది రాజస్తాన్‌లోని ఆల్వార్ నగరం. పూనమ్ శరణ్, జ్యోతి చౌహాన్ గడచిన శనివారం సాయంత్రం కోచింగ్ సెంటర్ నుంచి స్కూటీ మీద ఇంటికి వెళ్తున్నారు. పూనమ్ బండి నడుపుతోంది, జ్యోతి వెనుక ఉంది. ఒక ఆకతాయి బైక్ మీద వీళ్లను వెంబడించాడు. స్కూటీకి దగ్గరగా వచ్చి జ్యోతి చేతిలోని స్మార్ట్ ఫోన్ లాక్కుని తన బైక్ వేగం పెంచి ముందుకు వెళ్లిపోయాడు. క్షణకాలంలోనే తేరుకున్నారీ అమ్మాయిలు. దొంగతనం జరినట్లు చుట్టు పక్కల వాళ్ల దృష్టిలో పడేటట్లు పెద్దగా అరుస్తూనే అతడి బైక్‌ను అనుసరించారు. బైక్ మీదున్న వ్యక్తిని రెండు కిలోమీటర్ల దూరం వెంబడించారు. జిడి గర్ల్స్ కాలేజ్ రోడ్డులోకి వెళ్లింది బైక్. కాలేజ్ దగ్గర ఆ రోడ్డు ఎండ్ అవుతుంది. డెడ్‌ఎండ్ కారణంగా బైక్ ముందుకు వెళ్లడానికి దారి లేదు, వెనక్కు తిరగడానికి వీల్లేకుండా స్థానిక ఇళ్లలోని వాళ్లంతా గుమిగూడిపోయారు. వాళ్లలో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేటప్పటికే ఆ అమ్మాయిలు స్థానికుల సహాయంతో బైక్ మీదున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పౌరులే పోలీసులు ఇదంతా తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ ప్రకాశ్... ఫోన్ అపహరణకు పాల్పడిన ఇక్బాల్‌ను అదుపులోకి తీసుకుని... పూనమ్, జ్యోతిల ధైర్యసాహసాలకు గాను వారిని స్టేషన్‌కి పిలిపించి ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి చొరవ తీసుకోవాలని చెప్పారు రాహుల్ ప్రకాశ్. ప్రతి ఒక్కరిలో పోలీస్ ఉంటాడు. తమలోని పోలీసింగ్ నైపుణ్యాన్ని నిద్రపుచ్చకుండా చైతన్యంగా ఉంచుకోవాలి. నిజానికి పౌరులే మంచి పోలీసులు. ఈ అమ్మాయిలు చూపించిన ధైర్యం, చొరవ ప్రతి ఒక్కరికీ ఆదర్శం కావాలి’ అని సందేశమిచ్చారు. – మంజీర -
పూనమ్ యాదవ్‌పై సస్పెన్షన్ వేటు
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్‌ను భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) జాతీయ క్యాంప్ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడల కోసం పాటియాలాలో ఏర్పాటు చేసిన జాతీయ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న పూనమ్ అక్కడి అధికారుల అనుమతి లేకుండా క్యాంప్ నుంచి పలుమార్లు బయటకు వెళ్లింది. దీంతో ఐడబ్ల్యూఎఫ్ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ‘ప్రస్తుతం జరుగుతోన్న జాతీయ క్యాంప్‌లో పూనమ్ ఐడబ్ల్యూఎఫ్ నిబంధనలను బేఖాతరు చేసింది. ఆమె పలుమార్లు నిబంధనలను అతిక్రమించింది. 15 రోజుల వ్యవధిలో అనుమతి లేకుండా రెండు సార్లు క్యాంప్ నుంచి బయటకు వెళ్లింది. ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోం’ అని ఐడబ్ల్యూఎఫ్ ఆమెకు ఓ లేఖ ద్వారా తెలిపింది. ఆమెపై నిషేధం విధించడానికి ముందే షోకాజ్ నోటీసులు పంపినా లాభం లేకపోయిందని పేర్కొంది. ఈ అంశంపై ఐడబ్ల్యూఎఫ్ కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పందిస్తూ... ‘రాబోయే ఆసియా క్రీడల్లో పూనమ్ స్థానం భర్తీ చేయలేనిది. గత కొన్నేళ్లుగా పూనమ్ చాలా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. కానీ ఈ విధంగా క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడుతూ క్యాంప్‌నకు గైర్హాజరు అయితే తిరిగి పుంజుకోవడం కష్టం’ అని తెలిపారు. ఆమె తిరిగి క్యాంప్‌లో చేరాలంటే... ‘నాడా’ ఆధ్వర్యంలో డోపింగ్ టెస్ట్ పాసవ్వాల్సి ఉంటుంది. -
శభాష్ పూనమ్.. భారత్ ఖాతాలో మరో స్వర్ణం
గోల్డ్‌కోస్ట్ : కామెన్ వెల్త్ క్రీడల్లో భారత వెయిలిఫ్టర్ల హవా కొనసాగుతోంది. తాజాగా 69 కేజీల విభాగంలో పూనమ్ యాదవ్ బంగారు పతకం కైవసం చేసుకున్నారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం వేకువ ఝామున జరిగిన పోటీల్లో ఆమె 222 కేజీల బరువును ఎత్తి పసిడి పతకం సాధించారు. దీంతో భారత పతకాల సంఖ్య ఏడుకు చేరగా.. అందులో ఐదు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక పూనమ్ యాదవ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, 2014 గ్లాస్గోవ్ కామెన్వెల్త్ క్రీడల్లో ఆమె కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. GOLD to Punam Yadav in 69 Kg weightlifting...big congratulations to her..super performance by our weightlifters continues at #GC2018 #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 8 April 2018 -
భారత్‌ను గెలిపించిన పూనమ్, ఏక్తా
నాగ్‌పూర్: గత ఏడాది ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఓటమికి భారత మహిళల జట్టు బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. పూనమ్ యాదవ్, ఏక్తా బిష్త్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పూనమ్ (4/30), ఏక్తా (3/49) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. అనంతరం భారత్ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (86; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. 190/9తో ఓటమి అంచుల్లో ఉన్న భారత్‌ను ఏక్తా బిష్త్ (12 నాటౌట్), పూనమ్ యాదవ్ (7 నాటౌట్) గట్టెక్కించారు. మిథాలీ రికార్డు: ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన చార్లోటి ఎడ్వర్ట్స్ (191) పేరిట ఉంది. -
సెంచరీ 'మంధ' హాసం
♦ విండీస్‌పై 7 వికెట్లతో భారత్ జయభేరి ♦ రాణించిన పూనమ్, హర్మన్‌ప్రీత్ భారత అమ్మాయిల ఆల్‌రౌండ్ జోరు కొనసాగుతోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను దెబ్బతీయగా... తర్వాత లక్ష్యఛేదనలో ఓపెనర్ స్మృతి మంధన శతక్కొట్టింది. కెప్టెన్ మిథాలీ రాజ్ రాణించడంతో ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాంటన్: భారత ఓపెనర్ స్మృతి మంధన బ్యాటింగ్‌లో మళ్లీ గర్జించింది. గత మ్యాచ్‌లో సెంచరీకి 10 పరుగుల దూరంలో నిలిచిన ఆమె ఈసారి ఛేదనలో శతక్కొట్టింది. ఈ మ్యాచ్‌లో భారత్ గత ప్రపంచకప్ రన్నరప్, టి20 చాంపియన్ వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ను ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దెబ్బతీసింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 183 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (57 బంతుల్లో 43; 7 ఫోర్లు) రాణించగా, భారత బౌలర్లలో పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ స్మృతి మంధన (108 బంతుల్లో 106 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (88 బంతుల్లో 46; 3 ఫోర్లు) రాణించింది. స్మృతికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. దెబ్బ మీద దెబ్బ టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. విండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హేలీ మాథ్యూస్, ఫెలిసియా వాల్టర్స్ శుభారంభం అందించలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఫెలిసియా (9) నిష్క్రమించింది. ఏక్తా బిష్త్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో సుష్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. తర్వాత హెలీకి కెప్టెన్ స్టెఫానీ టేలర్ జతయ్యింది. ఇద్దరు నింపాదిగా ఆడుతున్న దశలో హేలీ, దీప్తిశర్మకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ఇక్కడి నుంచి వెస్టిండీస్ కష్టాలు మొదలయ్యాయి. భారత స్పిన్నర్లు పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ నుంచి సహకారం లభించడంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశారు. దీంతో ఆ తర్వాత 15 ఓవర్లలో కేవలం 21 పరుగులే జతచేసిన వెస్టిండీస్ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న టేలర్ (16) రనౌట్ కాగా... డియాండ్రా డాటిన్ (7), మెరిస్సా అగులిరా (6) పూనమ్ బౌలింగ్‌లో నిష్క్రమించారు. కైషోనా (5), చెడియాన్ నషన్ (12)లు హర్మన్‌ప్రీత్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 91 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన విండీస్‌ను టెయిలెండర్లు షానిల్ డాలీ (37 బంతుల్లో 33; 5 ఫోర్లు), అఫి ఫ్లెచర్ (23 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు) ఆదుకున్నారు. దీంతో ప్రత్యర్థి ముందు విండీస్ 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. చెలరేగిన స్మృతి... సునాయాస లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన భారత మహిళలకు ఆదిలోనే పూనమ్ రౌత్ (0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఐదో బంతికే ఆమె కానెల్ బౌలింగ్ డకౌటైంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ దీప్తి శర్మ (6) స్టెఫానీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయింది. 33 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్‌ను ఓపెనర్ స్మృతి మంధన, కెప్టెన్ మిథాలీ నడిపించారు. ఇద్దరు కుదురుగా ఆడుతూ తొలుత క్రీజ్‌లో పాతుకుపోయారు. ఆ తర్వాత తమదైన శైలిలో స్వేచ్ఛగా ఆడారు. వెస్టిండీస్ ఏకంగా ఎనిమిది మంది బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా లాభం లేకపోయింది. స్మృతి 57 బంతుల్లో అర్ధసెంచరీ చేసింది. మిథాలీతో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. జట్టు స్కోరు 141 పరుగుల వద్ద మిథాలీ... హేలీ మాథ్యూస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. దీంతో మూడో వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత స్మృతి, మోనా మేష్రమ్(18 నాటౌట్) సహకారంతో 105 బంతుల్లో సెంచరీని పూర్తిచేయడంతో పాటు జట్టును గెలిపించింది. స్కోరు వివరాలు వెస్టిండీస్ ఇన్నింగ్స్: హేలీ మాథ్యూస్ (సి) అండ్ (బి) దీప్తి శర్మ 43; ఫెలిసియా (సి) సుష్మ (బి) ఏక్తాబిష్త్ 9; స్టెఫానీ టేలర్ రనౌట్ 16; డాటిన్ (సి) పూనమ్ రౌత్ (బి) పూనమ్ యాదవ్ 7; మెరిస్సా (స్టంప్డ్) సుష్మ (బి) పూనమ్ యాదవ్ 6; కైషోనా నైట్ (సి) స్మృతి (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 5; చెడియాన్ (స్టంప్డ్) సుష్మ (బి) హర్మన్‌ప్రీత్ కౌర్ 12; షానిల్ డాలీ (స్టంప్డ్) సుష్మ (బి) దీప్తి శర్మ 33; అఫి ఫ్లెచర్ నాటౌట్ 36; అనిసా మొహమ్మద్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 183. వికెట్ల పతనం: 1–29, 2–69, 3–70, 4–80, 5–91, 6–91, 7–121, 8–146. బౌలింగ్: జులన్ గోస్వామి 6–0–37–0, శిఖాపాండే 3–0–13–0, ఏక్తాబిష్త్ 10–2–23–1, దీప్తిశర్మ 10–1–27–2, మోనా మేశ్రమ్ 4–0–20–0, పూనమ్ యాదవ్ 10–2–19–2, హర్మన్‌ప్రీత్ కౌర్ 7–0–42–2. భారత్ ఇన్నింగ్స్: పూనమ్ రౌత్ (సి) మెరిస్సా (బి) కానెల్ 0; స్మృతి మంధన నాటౌట్ 106; దీప్తిశర్మ (బి) స్టెఫానీ 6; మిథాలీ (సి) అఫి ఫ్లెచర్ (బి) హేలీ మాథ్యూస్ 46; మోనా మేశ్రమ్ నాటౌట్ 18; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (42.3 ఓవర్లలో 3 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–0, 2–33, 3–141 బౌలింగ్: కానెల్ 4–0–23–1, డాటిన్ 4–0–25–0, స్టెఫానీ 10–1–24–1, డాలీ 5–0–24–0, అనిసా 6–0–25–0, అఫి ఫ్లెచర్ 4–0–18–0, చెడియాన్ 1–0–9–0, హేలీ మాథ్యూస్ 8.3–0–35–1. -
రూ.18లక్షల ఖర్చుతో ‘ఆవు’కు పెళ్లి
గాంధీనగర్: గుజరాత్‌లోని భావ్‌నగర్ విచిత్ర పెళ్లికి వేదికైంది. పూనమ్ అనే ఆవుకు, అర్జున్ అనే ఎద్దుకు వాటి యజమానులు రెండు రోజుల క్రితం ఊరందరిని పిలిచి వైభవంగా పెళ్లి చేశారు. ఓ అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఖర్చుకు వెనకాడుతారేమోగానీ ఆవు పెళ్లికి మాత్రం ఏలోటు రానీయలేదు. 18 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. పెళ్లి ముహూర్తం నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు అన్నీ హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం విశేషం. పెళ్లి కూతురులాగే పూనమ్ అనే ఆవును కూడా అలంకరించారు. ముఖాన బంగారు నగలను తొడిగారు. మూపురాన్ని పూలతో అలంకరించారు. వీపున కొత్త దుస్తులను అలంకరించారు. భారీ వ్యాన్‌లో ఏర్పాటు చేసిన పల్లెకిలో పూనమ్‌ను ఊరేగించారు. ఆర్జున్ అనే ఎద్దును కూడా పెళ్లి కొడుకులా అలంకరించి పెళ్లి వేదికకు తీసుకొచ్చారు. పూజారులు దగ్గరుండి మంత్రోచ్ఛారణలతో పూనమ్‌కు, అర్జున్‌కు పెళ్లి చేశారు. పెళ్లింటి విడిది, ఎదుర్కోళ్లు లాంటి సంప్రదాయాలను కూడా పాటించారు. ఆవులను పవిత్రంగా చూడాలని, వాటిని కబేళాలకు తరలించే చర్యలకు స్వస్తి చెప్పాలనే సదుద్దేశంతోనే తాను ఇంత డబ్బు ఖర్చుపెట్టి తన పూనమ్‌కు పెళ్లిచేశానని దాని యజమాని విజయ్‌భాయ్ తెలిపారు. తాను గత 30 ఏళ్లుగా ఆవులతో సహవాసం చేస్తున్నానని, అవి ఎంత ప్రేమగలవో, అవి ఎన్ని విధాలుగా మానవజాతికి సేవలు అందిస్తున్నాయో తనకు తెలుసునని అన్నారు. పెళ్లి తంతు ముగిశాక పెళ్లికి హాజరైన 300 మంది అతిథులకు రుచికరమైన గుజరాతి వంటకాలతో విందు భోజనాన్ని వడ్డించారు. కుర్రకారు పెళ్లితంతును సెల్ ఫోన్లతో వీడియోలు తీసి షేర్ చేసుకున్నారు. -
'నాన్న జీవితకథ చదివేందుకు భయపడ్డా'
తన తండ్రి శత్రుఘ్న సిన్హా జీవితకథను చదివేందుకు తాను చాలా భయపడ్డానని బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలిపింది. బీజేపీ ఎంపీ, అలనాటి కథనాయకుడు అయిన శత్రుఘ్న జీవితకథను 'ఎనిథింగ్ బట్ ఖమోష్: ద శత్రుఘ్న సిన్హా బయోగ్రఫీ' పేరిట భారతీ ఎస్ ప్రధాన్ రచించిన సంగతి తెలిసిందే. ఈ పుస్తకాన్ని శుక్రవారం లాంఛనంగా ముంబైలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ 'నేను ఈ పుస్తకం చదివేందుకు చాలా భయపడ్డాను. తల్లిదండ్రుల జీవితాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. అవి ఎప్పుడూ పిల్లలకు తెలియకపోవడమే మంచిది' అని ఆమె అన్నారు. నిజజీవితంలో రీనా రాయ్‌తో శత్రుఘ్న సాగించిన ప్రేమాయణం, పూనంను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొన్నాళ్లు ఆమెతో సంబంధం కొనసాగించిన అంశం గురించి ఈ పుస్తకంలోని ఓ అధ్యాయంలో చర్చించినట్టు తెలుస్తోంది. నటుడు కాకముందు వరకు శత్రుఘ్న జీవితకథను తాను ఆసాంతం చదివానని, ఆ తర్వాత ముందుకు వెళ్లలేకపోయానని తెలిపింది. బాల్యం, యవ్వన ప్రారంభం రోజులు, కాలేజీ రోజుల వరకు ఆయన జీవితకథను చదివానని, నటుడైన తర్వాతి అధ్యాయాలను మాత్రం చూడలేదని చెప్పింది. -
ఫేస్బుక్లో కవలల డ్యాన్స్ సంచలనం..!
ఇద్దరు కవలపిల్లల వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. భారత్ కు చెందిన ఆ ట్విన్స్.. చికాగోలోని ఇలినాయిస్ లో ఉంటున్నా సంప్రదాయ భరతనాట్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు గానూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొరియోగ్రాఫర్లు పూనమ్, ప్రియాంకా సహజంగా భరతనాట్య కళాకారిణులు. ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా సంప్రదాయ భరతనాట్యాన్ని రోజువారీ వ్యాయామాలతో మేళవించి స్వయంగా ప్రదర్శించారు. అదే వీడియోను సరదాగా ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. వాళ్ల ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. అందుకే వారు పోస్ట్ చేసిన వీడియో రెండు మూడు రోజుల్లోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది. వేలకొద్దీ షేర్లు, కామెంట్లతో ఫేస్బుక్లో హల్ చల్ చేస్తోంది. తమ ప్రయోగానికి ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదని ఆ అక్కాచెల్లెళ్లు ఆశ్చర్యపోతున్నారు. తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. -
'ఇప్పడు ఆమె మాట నేను వింటున్నా'
ముంబై: పెళ్లైన కొత్తలో తన భార్య పూనమ్ తన మాట వినేదని, ఇప్పుడు ఆమె మాట తాను వింటున్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా చమత్కరించారు. తమ వివాహ బంధానికి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఓ మేగజీన్ కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 'అంతకుముందు పూనమ్ నా బాటలో నడిచేది. అప్పుడు మా కుటుంబ నౌకకు నేనే కెప్టెన్ గా ఉండి ముందుండి నడిపేవాడిని. కానీ ఇప్పుడు ఆమె వెనుక నేను నడుస్తున్నాను. ఆమె ఆదేశాలు శిరసావహిస్తున్నాను. ఈ 35 ఏళ్లలో ఆమె ప్రాధాన్యాలు మారిపోయాయి. పూనమ్ ప్రాధాన్యాల్లో నా నంబర్ 4. మొదటి మూడు స్థానాలు మా పిల్లలు లవ్, కుశ్, సోనాక్షివి' అని శత్రుఘ్నసిన్హా పేర్కొన్నారు. అయితే మరొకరి పేరు మర్చిపోయారని, ఆమె తమ కుశ్ భార్య తరుణా సిన్హా అని ఆయనకు పూనమ్ గుర్తు చేశారు. అయితే ఇప్పుడు తన నంబర్ 5 అని శత్రుఘ్నసిన్హా నవ్వుతూ అన్నారు. 'సబక్' సినిమాలో కలిసి నటించిన శత్రుఘ్నసిన్హా, పూనమ్ 1980, జూలై 9న వివాహం చేసుకున్నారు. తమ తల్లిదండ్రుల పెళ్లిరోజును పురస్కరించుకుని సొనాక్షి సిన్హా తన ట్విటర్ పేజీలో శత్రుఘ్నసిన్హా, పూనమ్ ఫోటో పోస్ట్ చేసింది.