ఎవరీ పూనమ్‌ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి..! | CRPF Officer Poonam Gupta First Person Ever To Marry At Rashtrapati Bhavan | Sakshi
Sakshi News home page

ఎవరీ పూనమ్‌ గుప్తా..? ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో పెళ్లి..!

Published Tue, Feb 4 2025 4:20 PM | Last Updated on Tue, Feb 4 2025 4:51 PM

CRPF Officer Poonam Gupta First Person Ever To Marry At Rashtrapati Bhavan

వివాహం మనకు నచ్చిన చోటు లేదా విదేశాల్లో చేసుకుంటారు. ఇంకాస్త బడా బాబులైతే లగ్జరీయస్‌ హోటల్స్‌ లేదా ప్యాలెస్‌లలో చేసుకుంటారు. కానీ ఇలా ఏకంగా రాష్ట్రపతిలో భవన్‌లో వివాహంలో జరగడం గురించి విన్నారా..!. ఔను సీఆర్‌పీఎఫ్‌ అధికారిణి పూనమ్‌ గుప్తా ఆ లక్కీఛాన్స్‌ కొట్టేసింది. ఇలా భారతదేశ రాష్ట్రపతి భవన్‌లో జరుగనున్న తొలి పెళ్లి ఇదే కావడం విశేషం. అసలు ఆ అధికారిణికి ఇలాంటి అవకాశం ఎలా దక్కింది? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎలా అనుమతించారు తదితరాల గురించి ఈ కథనంలో తెలుసుకుందామా..!.

భారతదేశ అత్యున్నత శక్తికి కేంద్రబిందువు రాష్ట్రపతి భవనం(Rashtrapati Bhavan). అలాంటి అత్యున్నత గౌరవనీయ ప్రదేశంలో సీఆర్‌‍పీఎఫ్‌ అధికారిణి వివాహం ఫిబ్రవరి 12, 2025న రాష్ట్రపతి భవన్‌లో జరగనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. భారతదేశ రాష్ట్రపతి భవన్‌ ప్రపంచంలోనే రెండొవ అదిపెద్ద నివాసం. దీన్ని సర్ ఎడ్విన్ లుటియెన్స్ రూపొందించారు. 

దీన్ని దాదాపు 300 ఎకరాల ఎస్టేట్‌లో నిర్మించారు. రాష్ట్రపతి భవన్‌లో మొత్తం నాలుగు అంతస్తులు, 340 గదులు ఉంటాయి. దీనితోపాటు అమృత్ ఉద్యాన్, మ్యూజియం, గణతంత్ర మండపం, అశోక మండపం, రాగి ముఖం గల గోపురం కూడా ఉన్నాయి. అంతేగాదు 1948 స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్‌ జనరల్‌ సీ రాజగోపాలాచారి ఈ రాష్ట్రపతి భవన్‌లో నివశించిన తొలి భారతీయుడు. 

అలా ఎందరో రాష్ట్రపతులు ఈ భవన్‌లో నివశించారు. అలాగే ఎందరో ఉన్నతస్థాయి ప్రముఖులు ఇందులో ఆతిథ్యం పొందారు. అలాంటి ఘన చరిత్ర గలిగిన ప్రతిష్టాత్మక రాష్ట్రపతి భవన్‌లో సీఆర్‌పీఎఫ్‌ అధికారిణి పూనమ్‌ గుప్తా(Poonam Gupta) వివాహం జరగనుండటానికి గల కారణం ఏంటంటే..

అనుమతి ఎలా లభించిందంటే..
సీఆర్‌పీఎఫ్‌ అధికారిణి పూనమ్‌ గుప్తా రాష్ట్రపతి భవన్‌లో పీఎస్‌ఓగా నియమితులయ్యారు. ఆమె 74వ గణతంత్ర దినోత్సవం పరేడ్‌(74th Republic Day Parade)లో పూర్తిగా మహిళా బృందానికి నాయకత్వం వహించింది. అలాగే పూనమ్‌ వృత్తిపరంగా నిబద్ధతగా, అంకితభావంతో పనిచేసే ప్రవర్త నియమావళే ఆ అదృష్టాన్ని పొందేలా చేసింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అనుమతిచ్చారు. దీంతో పూనమ్‌ ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకున్న తొలిగా వ్యక్తి చరిత్ర సృష్టించనుంది. 

పూనమ్‌ గుప్తా ఎవరంటే..
సీఆర్‌పీఎఫ్‌ అసిస్టెంట్ కమాండెంట్(CRPF Assistant Commandant) పూనమ్ గుప్తా మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)కు చెందిన మహిళ. ఆమె 2018 యూపీఎస్సీ, సీఆర్‌పీఎఫ్‌ పరీక్షలో ఉత్తీర్ణురాలై 81వ ర్యాంకుని సాధించింది. ఆ తర్వాత ఆమె సీఆర్‌పీఎఫ్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అలా బీహార్‌లోని నక్సల్స్‌ ప్రభావిత జోన్‌లో కూడా పనిచేశారు. అక్కడ ఆమె కనబర్చిన ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. 

ఇక ఆమె కాబోయే భర్త అవినాష్‌ కుమార్‌ కూడా సీఆర్‌ఎఫ్‌ కమాండెంట్‌. ప్రస్తుతం అతడు జమ్ము కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల(ఫిబ్రవరి 12, 20205న) రాష్ట్రపతి భవన్‌లోని ఆ జంట వివాహం మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్‌లో జరగనుంది. ఈ వివాహానికి ఇరువురి దగ్గరి కుటుంబ సభ్యలు మాత్రమే హాజరవుతారు. ఇలా రాష్ట్రపతి భవన్‌లో వివాహం చేసుకునే అదృష్టం దక్కిన ఆ అధికారిణికి శుభాకాంక్షలు చెబుదామా..!.

(చదవండి: బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..)

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement