assistant
-
ఐసీయూలో రోగిపై అత్యాచారం
జైపూర్: ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగి ఆలనాపాలనా చూడాల్సిన నర్సింగ్ అసిస్టెంట్ అఘాయిత్యానికి పాల్పడిన అమానవీయ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. అఘాయిత్యం వేళ ప్రతిఘటించిన ఆమెకు నిందితుడు మత్తుమందు ఇంజెక్షన్ ఇవ్వడం దారుణం. అల్వార్ జిల్లాలోని శివాజీ పార్క్ స్టేషన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 24 ఏళ్ల వివాహిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో తీవ్ర అస్వస్థతకు గురై జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఐసీయూ గదిలో చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో అక్కడే పనిచేసే చిరాగ్ యాదవ్ అనే నర్సింగ్ అసిస్టెంట్ ఆమెను రేప్‌చేయబోయాడు. వెంటనే ప్రతిఘటించిన ఆమెకు ఒక మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి ఘోరానికి పాల్పడ్డాడు. తర్వాత కొంతసమయానికి భర్త ఫోన్ చేయగా ఆమె జరిగిన దారుణాన్ని చెప్పి బోరుమంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘హే గూగుల్’.. ఏంటిది? వందలాది ఉద్యోగులను తీసేస్తున్న టెక్ దిగ్గజం
ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని టెక్ దిగ్గజం గూగుల్ వందల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. తమ డిజిటల్ అసిస్టెంట్, హార్డ్‌వేర్, ఇంజినీరింగ్ టీమ్‌లలో పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందిని ఇంటికి సాగనంపుతోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చర్యలు కొంకా కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. బాధితుల్లో వాయిస్ అసిస్టెంట్ టీమ్ గూగుల్ చేపట్టిన ప్రస్తుత లేఆఫ్‌లతో ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్, ఆగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్‌వేర్ టీమ్‌లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కంపెనీ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్‌లోని వర్కర్లపైనా లేఆఫ్‌ల ప్రభావం ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఉత్పత్తుల ప్రాధాన్యతలకు అనుగుణంగా 2023 ద్వితీయార్థంలో తమ అనేక బృందాలు మరింత సమర్థవంతంగా, మెరుగ్గా పని చేయడానికి సిబ్బందిలో మార్పులు చేశాయని గూగుల్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థాగత మార్పులలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గూగుల్ అసిస్టెంట్ టీమ్‌లో తొలగింపులు జరుగుతున్నట్లు సెమాఫోర్ అనే న్యూస్ వెబ్సైట్ మొదట నివేదించింది. 9to5Google అనే గూగుల్ సంబంధిత సమాచార వెబ్సైట్ హార్డ్‌వేర్ టీమ్‌లో పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నట్లు పేర్కొంది. ప్రభావిత సిబ్బందికి తొలగింపు సమాచారాన్ని కంపెనీ పంపుతోంది. గూగుల్‌లో ఇతర విభాగాల్లో ఉన్న ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం వీరికి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఉద్యోగుల యూనియన్ మండిపాటు గూగుల్ తొలగింపులపై ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్)లో పోస్ట్ చేసింది. ‘కంపెనీ కోసం ఉద్యోగులు నిరంతరం కష్టపడుతన్నాం.. దీంతో కంపెనీ ప్రతి త్రైమాసికంలో బిలియన్ల కొద్దీ ఆర్జిస్తోంది. కానీ ఉద్యోగులను తొలగించడం మాత్రం ఆపడం లేదు’ అని వాపోయింది. అయితే తొలగింపులకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేసింది. Tonight, Google began another round of needless layoffs. Our members and teammates work hard every day to build great products for our users, and the company cannot continue to fire our coworkers while making billions every quarter. We won’t stop fighting until our jobs are safe! — Alphabet Workers Union (AWU-CWA) (@AlphabetWorkers) January 11, 2024 -
పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీపై పిటిషన్ కొట్టివేత
సాక్షి, అమరావతి: రైతుభరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గతనెలలో జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పలువురు వెటర్నరీ మెడికల్ ప్రాక్టీషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. నోటిఫికేషన్ విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన 37 మంది వెటర్నరీ వైద్యులకు రూ.5 వేల చొప్పున ఖర్చులు విధించింది. ఈ మొత్తాన్ని రెడ్‌క్రాస్‌కు చెల్లించాలని ఆ వైద్యులను ఆదేశించింది. గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. విచారణలో పిటిషనర్ల న్యాయవాదులు జడా శ్రవణ్‌కుమార్, ఆర్.వెంకటేష్ వాదనలు వినిపిస్తూ.. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారాలు, వెటర్నరీ సర్జన్లకు ఉన్న అధికారాలు కల్పిస్తున్నారని, ఇది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులు నేరుగా వెటర్నరీ సర్జన్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందని జాబ్‌చార్ట్ చెబుతున్నప్పటికీ, వాస్తవరూపంలో సహాయకులకు విస్తృత అధికారాలు కల్పించారని వివరించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది జి.వి.ఎస్.కిషోర్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌కు, వెటర్నరీ చట్ట కౌన్సిల్ నిబంధనలకు సంబంధం లేదన్నారు. సర్వీసు సంబంధిత క్రమశిక్షణ చర్యలకే వెటర్నరీ కౌన్సిల్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పారు. పశుసంవర్ధక సహాయకులకు విస్తృతాధికారులు ఇవ్వడం లేదన్నారు. రైతులకు సహాయ సహకారాలు అందించడమే వారి ప్రధాన బాధ్యతని తెలిపారు. పోస్టుల భర్తీని అడ్డుకోవడమే లక్ష్యంగా పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారని చెప్పారు. ఈ పోస్టుల భర్తీలో కేవలం ఈడబ్ల్యూఎస్ వర్గానికి మాత్రమేగాక, అన్ని వర్గాలకు స్థానం కల్పించామని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం వెటర్నరీ వైద్యుల పిటిషన్‌ను కొట్టేసింది. -
అసిస్టెంట్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ పెళ్లిలో సందడి చేశారు. తన అసిస్టెంట్ ఆనంద్ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన ధనుశ్ నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుతం పెళ్లిలో ధనుశ్ దిగిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇవీ చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ధనుశ్‌తో పాటు అసురన్ సహనటుడు కెన్ కరుణాస్ కూడా ఉన్నారు. అక్కడే ధనుష్ రాధిక, శరత్‌కుమార్‌లను కలిశారు. కాగా.. ఇటీవల నేషనల్ క్రష్ రష్మిక మందన్నా అసిస్టెంట్ పెళ్లికి హాజరైన సందడి చేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: స్టార్ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సూపర్ హిట్ డైరెక్టర్‌తోనే!) కాగా.. ప్రస్తుతం ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. గతంలో రాకీ, సాని కాయిదం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అరుణ్ మాథేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్, శివ రాజ్‌కుమార్, నివేదిత సతీష్, సందీప్ కిషన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత ఆనంద్ ఎల్ రాయ్‌తో తేరే ఇష్క్ మే అనే చిత్ చేయనున్నారు. వీరిద్దరూ గతంలో రాంఝనా, అత్రంగి రే చిత్రాల్లో కలిసి పనిచేశారు. (ఇది చదవండి: అలా అయితేనే ఇండస్ట్రీలో కొనసాగుతాం: హీరోయిన్ కామెంట్స్ వైరల్!) தனது உதவியாளர் ஆனந்த் திருமண வரவேற்ப்பு நிகழ்ச்சியில் திடீரென வந்து வாழ்த்திய தலைவர் @dhanushkraja sir ❣️🔥🙏 #CaptainMiller #Dhanush pic.twitter.com/Lep0bzGyNR — Dhanush Trends ™ (@Dhanush_Trends) September 16, 2023 -
అసిస్టెంట్ పెళ్లిలో శ్రీవల్లి సందడి.. వైరలవుతున్న ఫోటో!
పుష్ప సినిమాతో ఏకంగా నేషనల్ క్రష్‌గా గుర్తింపు దక్కించుకున్న భామ రష్మిక. ప్రస్తుతం పుష్ప-2తో పాటు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. సందీప్ వంగా డైరెక్షన్లో రణ్‌బీర్ కపూర్ సరసన యానిమల్ చిత్రంలో నటిస్తోంది. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ రెయిన్బోలోనూ కనిపించనుంది. అయితే తాజాగా ఆమె తన అసిస్టెంట్ సాయి పెళ్లికి హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లికి ఎల్లో శారీ ధరించి సంప్రదాయ లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంత బిజీ షెడ్యూల్లోనూ రష్మిక వివాహానికి హాజరైన నూతన వధువరులను ఆశీర్వదించారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్! ) అయితే ఈ పెళ్లిలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేడుకలో పాల్గొన్న పుష్ప భామ నూతన దంపతులను ఆశీర్వదించింది. ఈ క్రమంలోనే రష్మిక కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు నూతన వధువరులు. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది ముద్దుగమ్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రష్మిక బిజీ షెడ్యూల్లోనూ అసిస్టెంట్ పెళ్లికి హాజరు కావడంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో రష్మిక తన పెళ్లిపై గురించి స్పందించింది. తన పెళ్లికి ఇంకా చాలా సమయముందని వెల్లడించింది. కొన్నేళ్లపాటు కెరీర్‌పైనే దృష్టిపెట్టనున్నట్లు తెలిపింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప-2 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) (ఇది చదవండి: గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!) Our rashu at Sai Babu wedding ♥️@iamRashmika #Rashmika #RashmikaMandanna pic.twitter.com/IGtAVL0l9g — RoshSam💌 (@RoshSamLover) September 3, 2023 -
అమృత్ సహాయకుడి అరెస్ట్
చండీగఢ్: ఖలిస్తానీ అనుకూల బోధకుడు అమృత్‌పాల్ సింగ్ ముఖ్య సహాయకుడు మరొకరు పోలీసులకు చిక్కాడు. లూధియానాకు చెందిన జోగిసింగ్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో డేరా నిర్వహిస్తున్నాడు. మార్చి 18 నుంచి పరారీలో ఉన్న అమృత్‌పాల్‌కు పిలిభిత్‌లో ఆశ్రయం ఇవ్వడంతోపాటు పంజాబ్ తిరిగి వచ్చేందుకు వాహనాలను సమకూర్చినట్లు పోలీసులు చెప్పారు. అతడిని సిర్హింద్‌లో అరెస్ట్ చేసినట్లు శనివారం పోలీసులు చెప్పారు. ఇతడితోపాటు అమృత్‌పాల్‌కు సహకరించిన హోషియార్పూర్ వాసి రాజ్‌దీప్‌సింగ్, జలంధర్‌కు చెందిన సరబ్జీత్ సింగ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. -
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
గోపీచంద్ గొప్ప మనసు.. అసిస్టెంట్ పిలిచిన వెంటనే..!
టాలీవుడ్లో గోపించంద్ పరిచయం అక్కర్లేని పేరు. హీరోలలో ఆయన అంతా సింపుల్‌గా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘తొలివలపు’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన హీరో గోపీచంద్. ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాల్లో నటించి, మళ్లీ హీరోగా రాణిస్తున్నాడు. తాజాగా మరోసారి గోపీచంద్ తన మంచి మనసును చాటుకున్నారు. ఆయన చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోనే కాదు నిజ జీవితంలో రియల్ హీరో అనిపించుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే? గోపీచంద్ దగ్గర అసిస్టెంట్‌గా శ్రీను అనే వ్యక్తి పని చేస్తున్నారు. ఇటీవలే ఆయన సొంతిల్లు నిర్మించి గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి హీరో గోపిచంద్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వారితో కలిసి సరదాగా గడిపారు. గోపీచంద్ రాకతో అసిస్టెంట్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. దీంతో గోపీచంద్ సింప్లిసిటీని చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. కాగా.. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో రామ బాణం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కనిపించనుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
హైదరాబాద్‌లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్‌పేట్ గోకుల్ ఫ్లాట్స్‌లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్‌ను సీజ్ చేశారు. -
భద్రత.. నిబద్ధత
-
బైడెన్ టీంలోకి మరో ఇండో అమెరికన్
వాషింగ్టన్: అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తన టీంలో భారత సంతతి వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే కమలా హారిస్, నీరా టాండన్ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించిన బైడెన్ తాజాగా భారత సంతతికి చెందిన వేదాంత్ పటేల్‌ని అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా నియమించారు. పటేల్ ప్రస్తుతం బైడెన్ ఇనాగ్యురల్ కమిటీ సీనియర్ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వైట్‌హౌస్ వ్యక్తిగత వెబ్సైట్ ప్రకారం పటేల్ బైడెన్ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌లో కీలక పాత్ర పోషించారు. అంతేకాక రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇవేకాక బైడెన్ ప్రాధమిక ప్రచారంలో నెవడా, వెస్ట్రన్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక గతంలో, పటేల్ డెమోక్రటిక్ నేషనల్ కమిటీలో వెస్ట్రన్ రీజినల్ ప్రెస్ సెక్రటరీ, ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్‌కు, కాంగ్రెస్ సభ్యుడు మైక్ హోండాకు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. (చదవండి: నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం) ఇక నివేదిక ప్రకారం, పటేల్ భారతదేశంలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగారు. కాలిఫోర్నియా-రివర్సైడ్ విశ్వవిద్యాలయం, ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం పటేల్ తన కుటుంబంతో కలిసి వాషింగ్టన్ డీసీలో నివాసం ఉంటున్నారు. ఇక బైడెన్ శుక్రవాంర వైట్ హౌస్ కమ్యూనికేషన్, ప్రెస్ స్టాఫ్‌కు సంబంధించి 16 మంది పేర్లు ప్రకటించగా.. వారిలో వేదాంత్ పటేల్ కూడా ఉన్నారు. ఇక వైట్‌హౌస్ ప్రెస్ కమ్యునికేషన్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వారిలో వేదాంత్ పటేల్ మూడవ వ్యక్తి. గతంలో ప్రియా సింగ్, రాజ్ షా వైట్ హౌస్ ప్రెస్ వింగ్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. -
బోనీ కపూర్ ఇంటి సహాయకుడికి కరోనా
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఇంట్లో ఒకరికి కరోనా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. బోనీ ఇంటి సహాయకుడు 23 ఏళ్ల చరణ్ సాహుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వైద్య పరీక్షలు చేయించగా కరోనా అని నిర్ధారణ అయిందట. దాంతో అతణ్ణి క్వారంటైన్‌కి తరలించారు. ఈ సందర్భంగా బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం మా ఇంట్లో మాకెవరికీ (కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్) కరోనా లక్షణాలు కనిపించలేవు. లాక్ డౌన్ ప్రారంభించినప్పటి నుంచి మేం ఎవరం ఇంటి నుంచి బయటకు వెళ్లలేదు. అలాగే మా ఇంట్లో పని చేస్తున్న ఇతర సిబ్బందికి కూడా కరోనా లక్షణాలు లేవు. చరణ్ కోలుకుని మళ్లీ మా ఇంటి పనులకు హాజరవ్వాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు, -
'అతన్ని చాలా మిస్ అవుతాము'
ముంబై : బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్‌కు సుదీర్ఘకాలం అసిస్టెంట్‌గా పనిచేసిన అమోస్ మంగళవారం కన్నుమూశారు. 60 ఏళ్ల అమోస్‌కు ఉదయం గుండెపోటు రావడంతో ఆమిర్, అతని భార్య కిరణ్ రావు అతన్ని హోలి ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమోస్ అదే రోజు తుదిశ్వాస విడిచారు. కాగా గత 25 ఏళ్లుగా అమోస్ ఆమిర్‌తో కలిసి పనిచేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. (విరాటపర్వం: సాయిపల్లవి నక్సలైట్ కాదు! ) అమోస్ సూపర్‌స్టార్ ఆమిర్‌తో కలిసి చాలాకాలం పనిచేశారని, ఆయన ఎంతో వినయంగా ఉండేవారని ఆమిర్ స్నేహితుడు, లాగాన్ సహనటుడు కరీం హాజీ తెలిపారు. 'అతను ఒక అద్భుతమైన వ్యక్తి. అందరితో సన్నిహితంగా ఉండేవాడు. కష్టపడి పనిచేసేవాడు'. అని పేర్కొన్నారు. అయితే అమోస్ ఆరోగ్యం పెద్దగా చెడిపోలేదని ఆయన అన్నారు. 'ఈ సమయంలో ఆయన మరణించడం ఆశ్చర్యంగా ఉంది. అమోస్ మరణంతో ఆమిర్, కిరణ్ ఇద్దరూ దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం తీరని లోటు. మేము అతనిని కోల్పోయాము. అమోల్‌ను చాలా మిస్ అవుతాము' అని విచారం వ్యక్తం చేశారు. (ఫైట్స్ బ్యాలెన్స్ గురూ) -
అసిస్టెంట్ ఇలా చేస్తాడని తెలీదు: రకుల్
హైదరాబాద్: ఇండస్ట్రీ వర్గాలకు తప్ప స్టార్ హీరోయిన్, హీరోల వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తుల వివరాలు బయటివాళ్లకు పెద్దగా తెలియదు. ‘ఫలానా సమయంలో నా అసిస్టెంట్ ఇచ్చిన సలహా బాగా పనికొచ్చింద’ని సెలబ్రిటీలు చెప్పుకోవడం కూడా అరుదుగా వింటాం. వీటన్నింటికీ విరుద్ధంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ చేసిన పని ప్రస్తుతం వైరల్ అయింది. ‘‘నా అసిస్టెంట్ కుమార్ ఇంత బాగా డాన్స్ చేయగలడని అస్సలు తెలీదు సుమీ! బహుశా లాంగ్ షూటింగ్ అవర్స్‌లో అతని స్టెప్స్‌ని రహస్యంగా షూట్‌చేసి ఉంటారు’’ అంటూ రకుల్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అదికాస్తా నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది. వేరొక మహిళతో సంభాషిస్తూ కుమార్ డాన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. కార్తీ హీరోగా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో రకుల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. -
లంచం తీసుకున్న ఇద్దరికి కఠిన శిక్ష
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పట్టా భూమి పేరు మార్పునకు లంచం డిమాండ్ చేసిన వీఆర్వోకు ఏడాది, ఆయన అసిస్టెంట్‌కు ఆర్నెళ్లపాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం ఏసీబీ కోర్టు కరీంనగర్ ప్రత్యేక న్యాయమూర్తి భాస్కర్‌రావు తీర్పు చెప్పారు. బీర్కూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన వెన్నం వెంకట్రామయ్య 1970లో మిర్జాపూర్ శివారులో 5.20 గుంటల భూమిని సబ్బిడి భూమయ్య, సబ్బిడి విఠల్ల నుంచి కొన్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. ఈయన మరణాంతరం 5.20 గుంటల వ్యవసాయ భూమిని అన్నలిద్దరు తమతమ పేర్లమీదకు మార్చుకోగా చిన్నవాడైన వెన్నం రామకృష్ణ తన భాగం భూమిని తన పేరుమీదకు మార్చేందుకు 28 జనవరి 2009న మిర్జాపూర్ వీఆర్వో కొమ్ము మురళికి దరఖాస్తు చేశాడు. అందుకు వీఆర్వో తనకు రూ.2100లు లంచం ఇస్తేనే విచారించి తహసీల్దార్‌కు నివేదిక ఇచ్చి పట్టాదార్ పాస్‌బుక్, టైటిల్ డీడ్ ఇప్పిస్తానని, లేదంటే కుదరదని చెప్పాడు. అనంతరం వీఆర్వో కొద్దిరోజుల తర్వాత పాస్‌బుక్ టైటిల్ డీడ్లు సిద్ధంగా ఉన్నాయని, 26 ఫిబ్రవరి 2009న లంచం డబ్బులు తనను ఇంట్లో కలిసి ఇచ్చి వాటిని తీసుకెళ్లాలని చెప్పాడు. దాంతో రామకృష్ణ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక అదే రోజు ఏసీబీ అధికారులను కలిసి వీఆర్వోపై ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితుడు రామకృష్ణ వీఆర్వోకు లంచం డబ్బులు ఇవ్వగా ఆయన ఆ డబ్బులను తన అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఇచ్చి దగ్గర పెట్టుకోవాలని చెప్పాడు. శ్రీనివాస్ డబ్బులు లెక్క పెడుతుండగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు వారిని రెడ్హాండ్గా పట్టుకున్నారు. ఈ కేసులో బుధవారం ఏసీబీ తరపున ప్రత్యేక పీపీ లక్ష్మీప్రసాద్ వాదనలు వినిపించారు. ఇరువార్గల వాదనలు విన్న న్యాయమూర్తి భాస్కర్‌రావు వీఆర్వో మురళీకి ఏడాది, రూ.5వేలు, అతడి అసిస్టెంట్ శ్రీనివాస్‌కు ఆర్నెళ్ల శిక్ష, రూ. 2500లు జరిమానాలు విధిస్తూ తీర్పు చెప్పారు. -
ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే
రూ.3లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీనియర్ అసిస్టెంట్ లంచంతో పాటు అదనంగా 10 శాతం కమీషన్ రాజమహేంద్రవరం క్రైం : పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించేందుకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. భూములు , ఇళ్లు కోల్పోయి బాధలో ఉన్న రైతుల నుంచి రెవెన్యూ అధికారులు అందిన కాడికి దోచుకుంటున్నారు. అమాయక గిరిజనులు చేసేది లేక బాధను దిగమింగుకొని లంచాలు ఇస్తున్నారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో స్పెషల్ డిఫ్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న డి.పుష్పమణి బ్రోకర్ల ద్వారా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు లంచం డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు మంగళవారం జీలుగు మిల్లి మండలం జిల్లెల గూడెం గ్రామానికి చెందిన గుజ్జు వీరమ్మకు చెందిన 8.18 ఎకరాలకు, రెండున్నర ఎకరాలకు భూమికి భూమి ఇస్తు, మిగిలిన 5.18 ఏకరాల భూమికి నష్టపరిహారం చెల్లించేందుకు రూ.11 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ లంచాన్ని మంగళవారం బ్రోకర్ ద్వారా డి.పుష్పమణి వద్ద డిఫ్యూటేషన్‌పై చేసిన ఒక అధికారి ప్రస్తుతం రాజమహేంద్రవరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మణికొండ వెంకటరమణప్రసాద్ ద్వారా రూ 3 లక్షలు తీసుకుంటుండగా ఏలూరు రేంజ్ ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ, రాజమహేంద్రవరం రేంజ్ డీఎస్పీ ఎం.సుధాకర్, ఇన్స్పెక్టర్ విల్సన్, ఎస్సై నరేష్‌లు ఆకస్మిక దాడులు చేసి రెడ్ హేండెడ్‌గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న అనంతరం ఫోన్లో సంభాషణ మంగళవారం మధ్యహానం లంచం తీసుకున్న మణికొండ వెంకట రమణ ప్రసాద్ రూ 3 లక్షలు లంచం తీసుకొని తన పై అధికారి అయిన డిఫ్యూటీ కలెక్టర్ గి. పుష్పమణికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఏసీబీ అధికారులు రమణ ప్రసాద్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎంత మందికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సమగ్రమంగా దర్యాప్తు చేసి దోషుల పై కేసులు నమోదు చేస్తాని ఏలూరు రేంజ్ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపారు. లంచంతో పాటు పరిహారంలో 10 శాతం కమీషన్ పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. నష్టపరిహారం మంజూరు అయి మూడేళ్లు కావస్తున్నా గిరిజన రైతులను కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటూ లంచాలు గుంజుతున్నారు. ట్రైబుల్ వెల్ఫేర్ డిఫ్యూటీ కలెక్టర్‌గా కేఆర్ పురంలో పనిచేస్తున్న డి.పుష్పమణి, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ1కు ఇన్చార్జి కలెక్టర్ గాను, తాడిపూడి ఎత్తిపోతల పథకం (నల్లజర్ల)ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తున్నారు. 16 నెలలుగా విధులు నిర్వహిస్తున్న డి.పుష్పమణి, బ్రోకర్లు ద్వారా లంచాల దందా నిర్వస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకూరి పేట, లోతుపాలెం శరభవరం, తదితర ప్రాంతాలలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ముందుగా లంచం ఎంత ఇవ్వాలి అనేది బేరం కుదుర్చుకుంటారు. ఇన్స్టాల్ మెంట్లో లంచం చెల్లించే వారి పేరున చెక్కులు ఇస్తుంటారు. నష్టపరిహారం చెల్లించకుండానే రైతుల నుంచి ఖాళీ చెక్కులు తీసుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవీపట్నం మండలంలో ఎకరానికి రూ 7.50 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తున్నారు. నష్టపరిహారం అందాలంటే ముందుగా లంచం సొమ్ము ముట్టాల్సిందే. అనంతరం నష్టపరిహారంలో భూములకు 10 శాతం, ఇళ్ళకు 5 శాతం చొప్పున సొమ్ము గుంజుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అవినీతి పరులపై లోతుగా దర్యాప్తు చేసి గిరిజనుల సొమ్మును దోచుకుంటున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ప్రైవేటు దందా!
- అసిస్టెంట్లదే హవా -ప్రతి ఉద్యోగికీ అనధికార సిబ్బంది - చక్రం తిప్పుతున్న ప్రైవేటు వ్యక్తులు నెల్లూరు (దర్గామిట్ట): రవాణశాఖ కార్యాలయంలో ఎలాంటి పని కావాలన్నా వాహనదారులకు తడిసిమోపెడు ఖర్చు అవుతోంది. ప్రతి సీటు వద్ద ఓ ప్రైవేటు వ్యక్తి చక్రం తిప్పుతున్నాడు. వాహనదారులు కార్యాలయంలో పని కావాలంటే ఆ ఉద్యోగి వ్యవహారాలు చక్కపెడుతున్న ప్రైవేటు వ్యక్తిని క లిసి ప్రసన్నం చేసుకుంటే తప్ప కరుణాకటాక్షాలు వాహనదారులకు లభించని పరిస్థితి నెలకొంది. ఆయా సేవలకు సంబంధించి ధరలు నిర్ణయించి వసూలు చేసే బాధ్యతను కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు తమ అసిస్టెంట్లకు అప్పజెప్పారు. దీంతో కొంత మొత్తాన్నిముందుగానే ప్రైవేటు వ్యక్తులకు చెల్లిస్తే తప్ప పనులు కావడంలేని వాహనదారులు వాపోతున్నారు. సెక్షన్లకు సంబంధించిన ఉద్యోగుల వద్ద తిష్ట వేసుకున్న అసిస్టెంట్లు రోజుకు రూ. లక్షకు పైగానే అనధికార మొత్తాన్ని వసూలు చేస్తున్నారని కార్యాలయ ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. సోమవారం ఓ ఉద్యోగి అసిస్టెంట్ దర్జాగా సీట్లో కూర్చుని ఎంచక్కా కంప్యూటర్లో సేవలు అందించడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు వస్తుంటారు. లెసైన్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్, వాహనబదిలీ, పన్నులు చెల్లింపు, పర్మిట్లు జారీ తదితర సేవలను రవాణా కార్యాలయంలో నిత్యం జరుగుతుంటాయి. కార్యాలయంలో ఉప రవాణా కమిషన్‌తో పాటు ఆర్టీఓ, మోటారు వాహనాల అధికారులు ఉంటారు. వారితో పాటు కార్యాలయంలో వాహనదారులకు సేవలు అందించేందుకు వివిధ సెక్షన్లలో ఉద్యోగులు ఉంటారు. మ్యాక్సీక్యాబ్‌లు, టెంపోలు, టూరిస్టు పర్మిట్లు, బస్సుల సీసీల తదితర పనులు చక్కబెట్టేందుకు ఓ ఉద్యోగిని నియమించారు. ఈ ఉద్యోగి తన వ్యక్తి గత అసిస్టెంట్‌గా ప్రైవేటు వ్యక్తిని నియమించుకుని అనధికారికంగా అధిక మొత్తాన్ని వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బైకులు, కార్లు, నాన్ ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్, సెకండ్ హ్యాండ్ వాహనాల బదిలీలను ఓ ఉద్యోగి చూస్తుంటారు. ఆయన ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని ఆ సెక్షన్‌కు సంబంధించి పనులతో పాటు అనధికార మొత్తాన్ని కూడా వసూలు చేస్తున్నారు. కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు వాహనాల రిజిస్ట్రేషన్లు, అధికలోడు వాహనాల రిలీజ్ ఆర్డర్లు, బదిలీలు తదితర పనులు చూస్తుం టారు. ఈయన కూడా ఓ అసిస్టెంట్‌ను నియమించుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అకౌంట్స్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి కూడా ఓ ప్రైవేటు వ్యక్తి ద్వారా లావాదేవీలు జరుపుతుంటారు. ఆయన రవాణ శాఖ ఉన్నతాధికారితో సత్సంబంధాలు పెట్టుకుని అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి రోజుకు పనులు బట్టి రూ.8 వేల నుంచి 12 వేల దాక వస్తాయని వారి అసిస్టెంట్లు చెబుతుండటం గమనార్హం. కాని తమకు మాత్రం రూ. 500 నుంచి వెయ్యి రూపాయిలు మాత్రమే ఇస్తారని చెబుతున్నారు. అసిస్టెంట్లదే హవా.. కార్యాలయంలోకి అసిస్టెంట్లు వచ్చి ఉద్యోగుల సీట్లలో కూర్చుని కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నారని తెలిసినా సంబంధిత ఉన్నతాధికారులు మిన్నకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో కార్యాలయ పనివేళల్లోనే దర్జాగా వచ్చి ఉద్యోగులు సీట్లలో కూర్చుంటున్నారు. ఉపరవాణా కమిషనర్ రాష్ట్ర విభజన కమిటీలో సభ్యులుగా ఉండటం, ఆర్టీఓకు గూడూరు బాధ్యతలు అప్పజెప్పడంతో వీరు కార్యాలయంలో అంతంత మాత్రమే ఉంటున్నారు. దీంతో ప్రైవేటు వ్యక్తులు ఎప్పుడూ కార్యాలయంలోనే ఉంటూ తమ హవా కొనసాగిస్తున్నారు. లావాదేవీలన్నీ సాయంత్రమే ... కార్యాలయంలోకి ఏజెంట్లు నిషేధం ఉన్నా అన్ని వ్యవహారాలు వారి ద్వారానే జరుగుతుంటాయి. వాహనాదారుల దరఖాస్తులు వచ్చినప్పుడు వారి చేతిరాత ఆధారంగా ఏజెంట్‌ను గుర్తించి సంబంధిత పత్రాలను అసిస్టెంట్లు అందజేస్తారు. చలానాలకు సంబంధించి అప్పుడే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి సాయంత్రం మాత్రం ఆపనికి సంబంధించి నిర్ణయించిన మొత్తాన్ని ఆ ఉద్యోగుల అసిస్టెంట్లకు ఇస్తారు. -
'చివరకు మిగిలేది’ నవలను సినిమాగా చేయాలని ఉంది
‘‘ఓ కారు డ్రైవర్ స్నేహం నా కెరీర్‌ని మలుపు తిప్పింది. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న నా కలకు మార్గం ఆ డ్రైవర్ చూపించాడు. రహీమ్ అనే ఆ డ్రైవర్ నన్ను రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్‌గా చేర్చాడు’’ అని రచయిత వేమారెడ్డి చెప్పారు. పోసాని దగ్గర రైటింగ్ అసిస్టెంట్‌గా, తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన వేమారెడ్డి ‘తడాఖా’, ‘రేసుగుర్రం’ తదితర చిత్రాలకు సంభాషణలు రాశారు. ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తన కెరీర్ గురించి వేమారెడ్డి వివరిస్తూ -‘‘నాకు మొదట్నుంచీ దర్శకత్వం మీద మక్కువ ఉంది. రచయితగా సంపాదించిన అనుభవంతో డైరక్షన్ చేస్తున్నాను. ఎమ్మెస్ రాజుగారు, సుమంత్ అశ్విన్ కథ వినగానే అంగీకరించారు. నా స్నేహితులే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సహజీవనం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది. ఇప్పటికి 50 శాతం సినిమా పూర్తయ్యింది’’ అని చెప్పారు. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం బాగా అలవాటని, ఎక్కడైనా బుక్ ఫెస్టివల్ జరిగితే అక్కడికి వెళ్లిపోతుంటానని అన్నారు. తాను చదివిన నవలల్లో ‘చివరికి మిగిలేది’ బాగా ఆకట్టుకుందని, దాన్ని కొంచెం సినిమాటిక్‌గా మార్చి, సినిమా చేయాలని ఉందని అన్నారు. -
అటవీశాఖలో పోస్టుల భర్తీకి...
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: అటవీశాఖ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు ఆదివారం నుంచి జరగనున్నాయి. జిల్లా అటవీశాఖలో రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న మొత్తం 254 పోస్టుల (బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్) భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖమ్మం కేంద్రంగా ఈ పరీక్షలు జరగనున్నాయి. 141 అసిస్టెంట్ బీటాఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం ఖమ్మంలోని 17 కేంద్రాల్లో రాత పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 13,261 మంది అభ్యర్దులు హాజరుకానున్నారు. ఈ పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జన రల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమెటిక్స్ పేపర్; మధ్యాహ్నం 1:00 నుంచి 2:30 గంటల వరకు జనరల్ ఎస్సే పరీక్ష ఉంటాయి. ఈ నెల 18న 17 సెంటర్లలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(మొత్తం ఖాళీలు 92) పరీక్ష ఉంటుంది. దీనికి మొత్తం 9,146 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్, 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్ పేపర్; మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:30 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పరీక్ష ఉంటుంది. ఈ నెల 25న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (మొత్తం ఖాళీలు 16) పరీక్ష నాలుగు కేంద్రాలలో జరుగుతుంది. మొత్తం 1733 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు పార్ట్-2 జనరల్ నాలెడ్జ్ పేపర్; 11:00 నుంచి 12:30 గంటల వరకు పార్ట్-3 జనరల్ మేథమేటిక్స్; మధ్యాహ్నం ఒంటి గంటనుంచి 2:00 గంటల వరకు పార్ట్-1 జనరల్ ఎస్సే పేపర్ పరీక్ష ఉంటుంది. తానేధార్, బంగ్లా వాచర్, టెక్నికల్ అసిస్టెంట్ (డీఎం గ్రేడ్-3) పోస్టులకు వరంగల్‌లో పరీక్ష ఉంటుంది. -
కేంద్ర సాయుధ దళాల్లో కొలువుల మేళా
దేశ రక్షణ వ్యవస్థలో గ్రూప్-ఏ కేడర్ పోలీస్ అధికారిగా ప్రస్థానం ప్రారంభించాలనుకునే వారికి చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ మేరకు కేంద్ర సాయుధ పోలీసు దళం (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్)లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. హోదాతో పాటు ఆకర్షణీయమైన వేతనం, అద్భుతమైన కెరీర్‌కు బాసటగా నిలిచే.. అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్ విధానం, ప్రిపరేషన్, తదితర వివరాలు.. కేంద్ర సాయుధ దళాల్లో గ్రూప్-ఎ హోదాతో సరితూగే అసిస్టెంట్ కమాండెంట్ కొలువుల నియామకానికి యూపీఎస్సీ సిద్ధమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమాబల్... ఇలా అన్ని విభాగాల్లోనూ అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లోని.. మూడు దళా ల్లో మొత్తం 136 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. దళాల వారీగా ఖాళీల వివరాలు.. దళం ఖాళీలు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) 68 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) 28 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) 40 మొత్తం ఖాళీలు 136 పై పోస్టులకు పురుషులతోపాటు మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి.. 1. రాత పరీక్ష 2. దేహ దారుఢ్య-వైద్య పరీక్ష 3. ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య-వైద్య పరీక్ష (ఫిజికల్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు చివరగా ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాలి. ఈ మూడు అంశాల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1: జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్-250 మార్కులు పేపర్ 2: జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్- 200 మార్కులు పేపర్-1: ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లం, హిందీ మాధ్యమంలో ప్రశ్నలను అడుగుతారు. పేపర్-2: వ్యాసరూప ప్రశ్నల విభాగాన్ని మాత్రం ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమంలో రాసుకోవచ్చు. కానీ ఇతర భాగాలైన కాంప్రహెన్షన్, ప్రెసీస్రైటింగ్, కమ్యూనికే షన్ స్కిల్స్ అంశాలను ఇంగ్లిష్‌లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. రెండు పేపర్లకూ ఒకే రోజు ఉదయం, మధ్యా హ్నం పరీక్షలు నిర్వహిస్తారు. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రతీ పేపర్లో నిర్దేశించిన విధంగా అర్హత మార్కులు సాధించాలి. పేపర్-1లో అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్-2ను మూల్యాంకనం చేస్తారు. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు 1/3 మార్కుల కోత విధిస్తారు. పరీక్షకు సన్నద్ధమిలా పేపర్-1: ఇందులో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియా-వరల్డ్ జాగ్రఫీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్: అభ్యర్థిలోని విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఉద్దేశించిన విభాగమిది. ఇందులో లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యుమరికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అంశాల నుంచి ప్రశ్నలొస్తాయి. సిరీస్, క్లాసిఫికేషన్స్, డెరైక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్, దూరం-కాలం, లాభ-నష్టాలు, పై చార్ట్‌లు, గ్రాఫ్‌లు, టేబుల్స్ తదితర అంశాలపై పట్టు సాధించాలి. ఈ విభాగంలో రాణించేందుకు ఇంగ్లిష్ అక్షర క్రమంలోని అక్షరాల స్థానాలను ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు పుక్కిట పట్టాలి, ఎక్కాలు, వర్గాలు, ఘనాల విలువలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు వంటి ప్రక్రియలపై పట్టు సాధించాలి. జనరల్ సైన్స్: ఇందులో దైనందిన జీవితంలో ఎదురవుతున్న వివిధ సైన్స్ అంశాల్లో అభ్యర్థికున్న జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలుంటాయి. శాస్త్రసాంకేతిక రంగాల్లో ఇటీవల జరుగుతున్న తాజా పరిణామాలు ముఖ్యంగా పర్యావరణం, జీవ సాంకేతికశాస్త్రం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైన్స్ అనువర్తనాలు, తదితర అంశాలకు సంబంధించి ప్రాథమిక స్థాయి భావనల ప్రశ్నలను అడుగుతారు. కరెంట్ ఈవెంట్స్: ఇందుకోసం గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనించాలి. కళలు, సంగీతం, సాహిత్యం, క్రీడల్లో అవార్డులు పొందిన వారి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. వివిధ దేశాల మధ్య జరిగిన ముఖ్య ఒప్పందాలు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విదేశాలతో భారత్ ఏర్పర్చుకున్న వ్యాపార, సాంఘిక, వ్యూహాత్మక ఒప్పందాల గురించి తెలుసుకోవాలి. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ: దేశ రాజకీయ, ఆర్థిక విధానంపై అభ్యర్థికున్న పరిజ్ఞానాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు వస్తాయి. భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగం, దాని నిర్మాణం, అందులోని ప్రకరణలు, సవరణలు, పార్లమెంట్, హైకోర్టు, సుప్రీంకోర్టు, పరిపాలన వ్యవస్థ, రాష్ర్టపతి, గవర్నర్ల అధికారాలు, భద్రతాంశాలు, పోలీస్ చట్టాలు, మానవ హక్కులు, ఆర్థికంగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, రిజర్వ్ బ్యాంక్ పాత్ర, దాని విధాన నిర్ణయాలు, విదేశీ పెట్టుబడులు, ఆర్థిక వేత్తలు - సిద్ధాంతాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. భారత చరిత్ర: సింధు నాగరికత, భారత్‌ను పాలించిన రాజ వంశాలు, చక్రవర్తులు, ఆనాటి రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, భారత స్వాతంత్య్ర పోరాటం, బ్రిటిష్ పాలన, తదితర అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇండియా-వరల్డ్ జాగ్రఫి: ఇందులో భారత్, ప్రపంచ భౌగోళిక పరిస్థితులపై అవగాహనను పరీక్షించే ప్రశ్నలను అడుగుతారు. ఈ క్రమంలో నదులు, సముద్రాలు, వివిధ శీతోష్ణస్థితులు, అడవులు, ఖనిజాలు, పర్వతాలు, శిఖరాలు, విశ్వం, తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్-2: ఈ పేపర్.. పార్ట్-ఏ, బీ అనే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ: ఇందులో నిర్దేశించిన అంశంపై ఒక వ్యాసం రాయాలి. దీనికి 80మార్కులు. భారత స్వాతంత్య్ర పోరా టం, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలు, వ్యవస్థలు, మానవ హక్కులు వంటి అంశాలకు సంబంధించి వ్యాసం అడిగే అవకాశం ఉంది. ఈ విభాగంలో రాణించడానికి రోజుకో అంశాన్ని ఎంచుకొని వ్యాసం రాయడాన్ని బాగా సాధన చేయాలి. ప్రశ్నలో దేని గురించి అడిగారో గమనించి ఆ అంశంలో తెలిసినదంతా కాకుండా అడిగిన మేరకే రాయాలి. వాటికి సంబంధించి నిపుణుల నిర్వచనాలు, గణాంకాలను పేర్కొంటే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆ అంశంలో తాజా పరిణామాలు ఏమైనా ఉంటే వాటి గురించి ప్రస్తావిస్తే ఎస్సే సంపూర్ణమవుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు ఎస్సే కోసం ప్రిపరేషన్లో అదనపు సమయం వెచ్చించాలి. ఇంగ్లిష్ పదజాలంపై, వాక్య నిర్మాణ శైలిపై పట్టు సాధించాలి. ఈ విభాగాన్ని ఇంగ్లిష్ లేదా హిందీ భాషల్లో రాయొచ్చు. పార్ట్-బీ: ఈ పేపర్‌కు 120 మార్కులు కేటాయించారు. ఇందులో కాంప్రహెన్షన్, ప్రెసీస్ రైటింగ్, గ్రామర్.. ఇలా ఇంగ్లిష్ ప్రావీణ్యానికి సంబంధించి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగం కోసం ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకం చదివితే మంచిది. రోజూ ప్రెసీస్ రైటింగ్, కాంప్రహెన్షన్ సాధన చేస్తూ గ్రామర్ (సినానిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్స్, టెన్సెస్, తదితరాలు) గురించి చదువుకోవాలి. ఈ విభాగంలో మాత్రం ఇంగ్లిష్‌లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్ ఇలా: రాత పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఇందులో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో.. అభ్యర్థులకు నిర్దేశించిన శారీరక ప్రమాణాలను పరీక్షిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని మాత్రమే తర్వాతి దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఇందులో వివిధ రకాల ఫిజికల్ ఈవెంట్లు ఉంటాయి. అవి.. ఈవెంట్ పురుషులు మహిళలు 100 మీ. పరుగు 16 సెకన్లు 18 సెకన్లు 800 మీ. పరుగు 3 ని. 45 సె. 4 ని. 45 సె. లాంగ్ జంప్ 3.5 మీ. 3 మీ. (మూడు ప్రయత్నాలు) షాట్ పుట్(7.26 కిలోలు) 4.5 మీ. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణులకు మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. మెడికల్‌లోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్స్‌కు ఇలా పరీక్ష తర్వాత ప్రాక్టీస్ చేయొచ్చనే ధోరణిలో ఎక్కువ మంది ఉంటారు. కానీ పరీక్షతోపాటు ఫిజికల్ టెస్ట్‌కు ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇదివరకు ఎలాంటి అనుభవం లేని వాళ్లు పరీక్ష నాటికి మూడు నెలల ముందు నుంచి సాధన చేయడం ఉత్తమం. ప్రస్తుత వేసవి తరుణంలో ఉదయం 5 గం. నుంచి 7 గం., అలాగే సాయంత్రం 5.30 తర్వాత ప్రాక్టీస్ చేయడం శ్రేయస్కరం. నెల రోజుల తర్వాత ఎంత సమయంలో పరుగెత్తుతున్నారో చూసుకోవాలి. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలనే ఎంచుకోవాలి. లేదంటే యాంకిల్, మోకాలిపై ఒత్తిడి పడుతుంది. కొత్తగా సాధన చేస్తున్నవాళ్లు మొదటి రోజు నుంచే నిర్దేశిత సమయంలో పరుగెత్తాలనుకోవడం పొరపాటు. దీనివల్ల అలసటకు గురవుతారు. శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. నీళ్లు బాగా తాగాలి. షాట్‌పుట్, లాంగ్ జంప్‌కు మాత్రం వారం రోజుల పాటు శిక్షకుల సలహాలను తీసుకుంటే మంచిది. లాంగ్‌జంప్ కోసం చదునైన ఇసుక నేలను ఎంచుకోవాలి. లాంగ్ జంప్ చేసేటపుడు రెండు పాదాలు ఒకే చోట పడేలా చూసుకోవాలి. లేదంటే యాంకిల్ ట్విస్ట్ వస్తుంది. షూస్ తప్పనిసరిగా ధరించాలి. ఇవన్నీ సులువైన లక్ష్యాలే అయినప్పటికీ స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ సాధన చేసే సమయంలో ఎలాంటి చిన్న నొప్పులు వచ్చినా అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్యుణ్ని సంప్రదించాలి. డాక్టర్ సుధీర్, ఆర్థోపెడిక్ యం.ఎస్., అసిస్టెంట్ ప్రొఫెసర్, రిమ్స్, శ్రీకాకుళం. ఇవి చదివితే మేలు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల గణితం, సైన్స్, సాంఘికశాస్త్రాల పుస్తకాలు ఎన్సీఈఆర్టీ 11, 12 తరగతుల చరిత్ర, అర్థశాస్త్రం, భూగోళశాస్త్రం -ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్, రీజనింగ్ బుక్స్ (చాంద్ పబ్లికేషన్స్) మనోరమ ఇయర్ బుక్ రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ (నార్మన్ లూయీస్) జనరల్ అవేర్నెస్-ప్రతియోగితా దర్పణ్ నోటిఫికేషన్ సమాచారం విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ శారీరక ప్రమాణాలు: ఎత్తు: పురుషులు. మహిళలు 165 సెం.మీ, 157 సెం.మీ. బరువు: పురుషులు మహిళలు 50 కిలోలు, 46 కిలోలు (నిర్దేశించిన విధంగా ఎత్తుకు తగ్గ బరువు). ఛాతీ: 81సెం.మీ.(గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి, పురుషులకు మాత్రమే). స్పష్టమైన కంటి చూపు తప్పనిసరి. వయోపరిమితి: ఆగస్ట్ 1, 2014 నాటికి 20-25 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయో సడలింపు) రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం దరఖాస్తు ఫీజు: రూ. 200 (ఎస్సీ/ఎస్టీ/మహిళలకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు) దరఖాస్తు విధానం: www.upsconline.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మే 12, 2014. పరీక్ష తేదీ: జూలై 13, 2014 వెబ్సైట్: www.upsc.gov.in -
రజనీకాంత్‌ని హీరోగా అందరూ వద్దన్నారు!
చెన్నైలోని మైలాపూర్ ప్రాంతం. ఓ ఇరుకు సందులో... ఓ పాతకాలం డాబాలో... రెండు గదుల పోర్షన్. బయట నిలబడ్డ ఓ పెద్దాయన ‘‘నేనే ఈరంకి శర్మని. మీరేగా నా కోసం వచ్చింది’’ అని మమ్మల్ని లోపలకు తీసుకువెళ్లారు. ఆయనకు 92 ఏళ్లంటే అస్సలు నమ్మ బుద్ధేయదు. స్ప్రింగ్‌లా అటూ ఇటూ తిరుగుతూ, నాన్‌స్టాప్‌గా కబుర్లు చెబుతూనే ఉన్నారాయన. ‘‘చాలా చిత్రంగా ఉందే. మీరు నా ఇంటర్వ్యూ తీసుకోవడం! నాలాంటి దర్శకుణ్ణి ఇంకా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారంటారా? చిత్ర పరిశ్రమ వాళ్లకే నేను బతికున్నానో లేదో తెలీదు’’ అన్నారాయన. ఆ మాటల్లో నిర్వేదం ఎక్కడా లేదు. సమాజం వాస్తవ పరిస్థితి ఆయనకు బాగా తెలుసు. డబ్బుతోటీ విజయాలతోటీ ఇక్కడ మనుషుల్ని కొలుస్తారని ఆయనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిక్ట్సీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆయనది. రజనీకాంత్‌ని ‘చిలకమ్మ చెప్పింది’తో తెలుగు తెరకు పరిచయం చేసింది ఆయనే. జయప్రద ‘అంతులేని కథ’ చేయడానికి ముఖ్య కారకుడు ఆయనే. చిరంజీవితో ‘కుక్క కాటుకు చెప్పు దెబ్బ’, ‘సీతాదేవి’ లాంటి సినిమాలు చేసింది ఆయనే. చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ, అన్నీ గుర్తుండిపోయేవే. ఇప్పటికీ విశ్రాంతి అనేది లేకుండా పని చేస్తున్న 92 ఏళ్ల యువకుడు ఈరంకి పురుషోత్తమశర్మ జీవన ప్రవాహంలోని కొన్ని కెరటాలు ఆయన మాటల్లోనే..! ఆఫీస్ అసిస్టెంట్ నుంచి డెరైక్షన్ వైపు! మాది మచిలీపట్నం. మా నాన్నగారు వెంకటశాస్త్రి చిత్రకళలో ఉద్దండులు. ప్రముఖ సినీ కళాదర్శకులు టీవీయస్ శర్మ, ఎస్వీయస్ రామారావు, గోఖలే, వాలి, తోట తదితరులంతా మా నాన్నగారి శిష్యులే. మా అన్నయ్య ఈరంకి గోపాలకృష్ణమూర్తి పేరొందిన పబ్లిసిటీ ఆర్టిస్ట్. 1952లో నేనూ సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. ఎస్వీయస్ రామారావు దర్శకత్వంలో ‘చిన్నమ్మ కథ’ అనే సినిమా రూపొందుతుంటే ఆఫీస్ అసిస్టెంట్‌గా చేరా. తర్వాత ఎడిటింగ్ సైడ్ జాయినయ్యా. మరో పక్క దర్శకత్వశాఖలోనూ పనిచేశా. బాగా అనుభవం వచ్చాక స్వతంత్రంగా ఎడిటర్‌గా 40 సినిమాలకు పైగా పని చేశాను. కానీ నా మనసు మాత్రం డెరైక్షన్ మీదే ఉండేది. జెమినీ సంస్థ వాళ్లు తెలుగులో కె.బాలచందర్ దర్శకత్వంలో తీసిన ‘భలే కోడళ్లు’కు నేను కో-డెరైక్టర్ని. అప్పటినుంచీ బాలచందర్ దగ్గర చాలా సినిమాలకు పని చేశాను. ఆ అమ్మాయిని నేనే బాలచందర్‌కి పరిచయం చేశా! ఓ రోజు నటి నిర్మలమ్మ ఫోన్ చేసి ‘‘రాజమండ్రి నుంచి ఓ అమ్మాయి వచ్చింది. మంచి వేషం ఉంటే చూడండి’’ అని చెప్పారు. అప్పుడే తెలుగులో ‘అంతులేని కథ’ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చెల్లెలు వేషానికి బావుంటుందని నేనే తీసుకెళ్లి బాలచందర్‌కి పరిచయం చేశాను. అంతా ఓకే. తమిళ వెర్షన్లో చేసిన సుజాత తెలుగులోనూ హీరోయిన్గా చేయాలి. కానీ తను చాలా బిజీ. చెల్లెలి వేషానికి తీసుకున్న అమ్మాయినే మెయిన్ హీరోయిన్గా తీసుకుందామన్నారు బాలచందర్. నేను ఓకే అన్నాను. ఆ అమ్మాయి ఎవరో కాదు. జయప్రద. ‘అంతులేని కథ’ సినిమాతో ఆమె ఎంత స్టార్ అయిందో తెలిసిందే. రజనీకాంత్ పారితోషికం అయిదు వేలు! ‘విజయా’ నాగిరెడ్డి గారు ఓ మలయాళ సినిమా ఆధారంగా తెలుగు, తమిళ భాషల్లో కె. బాలచందర్ దర్శకత్వంలో సినిమా చేయాలనుకున్నారు. చాలా యాంటీ సబ్జెక్ట్ అది. బాలచందర్ బిజీగా ఉండి చేయలేని పరిస్థితి. నాకేమో అలాంటి కథతో డెరైక్షన్ చేయాలని ఆశ. నిర్మాత హరిరామజోగయ్య నాతో సినిమా చేయడానికి రెడీ. తమిళం హక్కులు వేరే వాళ్లతో కొనిపించి, తెలుగులో మేం సినిమా మొదలుపెట్టాం. హీరో వేషానికి కొత్త మొహం కావాలి. నేను ఒక తమిళ హీరో పేరు సూచించాను. అందరూ రిజెక్ట్ చేశారు. నేను మాత్రం అతనే కావాలని పట్టుబట్టాను. ఫైనల్‌గా అతనితో సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్టు. ఆ హీరో యాక్షన్‌కి ఒకటే క్లాప్స్. ఆ సినిమా పేరు ‘చిలకమ్మ చెప్పింది’ (1977). ఆ హీరో రజనీకాంత్. తెలుగులో అతనికి అదే తొలి సినిమా. పారితోషికం మూడు వేల రూపాయలు అని మాట్లాడాం కానీ, చివరకు అయిదు వేలు ఇచ్చాం. ఈ సినిమాతో రజనీకాంత్‌కి తెలుగు మార్కెట్ కూడా వచ్చింది. చిరంజీవితో చేయొద్దన్నారు! నేను తీసిన ‘నాలాగా ఎందరో’ చిత్రానికి ఎనిమిది నందులు వచ్చాయి. ఆ తర్వాత చిరంజీవి, మాధవితో ‘కుక్క కాటుకి చెప్పు దెబ్బ’ చేశా. హీరోగా చిరంజీవి వద్దని కొంతమంది చెప్పారు. మళ్లీ చిరంజీవితో ‘సీతాదేవి’ చేశాను. ‘అగ్ని పుష్పం’తో సీతను పరిచయం చేశాను. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల డెరైక్షన్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్ డెరైక్ట్ చేశాను. ఇప్పుడు సినిమా డెరైక్ట్ చేసే అవకాశం వస్తే చేయడానికి రెడీ. ఇప్పటికీ అద్దె ఇల్లే! ఇన్నేళ్ల కెరీర్లో నేను సంపాదించిందేమీ లేదు. ఇప్పటికీ అద్దె ఇల్లే. హైదరాబాద్‌లో స్థలం తీసుకోమన్నా, ఆ కొండల్లో ఎందుకని వదిలేశా. ఇప్పుడు దాని విలువ కోట్లు. విజయ్ టీవీలో మా అబ్బాయి ఎడిటర్. వాడి జీతమే మాకు ఆధారం. ఇప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాను. నవతరం దర్శకులకి మెళకువలు చెబుతున్నాను. నా ఆత్మకథ రాసుకున్నాను. అయితే అది నాకు మాత్రమే సొంతం. ప్రచురణ చేయాలనుకోవడం లేదు. అప్పటి సంఘటనలు చదువుకుంటుంటే అదో తీయని అనుభూతి. అదే ఈ వయసులో నాకు ఎనర్జీ. - పులగం చిన్నారాయణ -
పదోన్నతులపంచాయతీ
పంచాయతీ కార్యదర్శుల మధ్య పోస్టింగ్‌ల వివాదం తారా స్థాయికి చేరింది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న కొందరు జూనియర్ అసిస్టెంట్లు, ఇప్పటికే గ్రేడ్-3 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 22 మందికి ఇటీవల గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో కొంత మంది ప్రస్తుతం ఖాళీగా వున్న గ్రేడ్-1 పంచాయతీల్లో నియమించాలని కోరడంతో పంచాయతీ అధికారులు ఆ మేరకు నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు గ్రేడ్-1 గ్రామ పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరం వ్యక్తం వ్యక్తం చేయడంతో వర్గాలుగా విడిపోయారు. రూ.5 లక్షల పైబడి ఆదాయం ఉన్న 61 గ్రామ పంచాయతీలను గుర్తించి గ్రేడ్-1 క్లస్టర్లుగా, రూ.2 నుంచి 3 లక్షల లోపు ఆదాయం ఉన్న 39 పంచాయతీలను గ్రేడ్-2 క్లస్టర్లుగా, రూ.లక్ష నుంచి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న 231 పంచాయతీలను గ్రేడ్-3 క్లస్టర్లుగా, లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న 661 గ్రామ పంచాయతీలను గ్రేడ్-4 క్లస్టర్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి పొందిన వారిలో 17 మందిని గ్రేడ్-1 క్లస్టర్‌గా గుర్తించిన గ్రామాలకు కార్యదర్శులుగా నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రేడ్-2 కార్యదర్శులను గ్రేడ్-1 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో నియమిస్తే భవిష్యత్తులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో పునరాలోచించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అక్రమ నియామకాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది గ్రేడ్-1 కార్యదర్శులు జిల్లా పరిషత్ సీఈఓ విజయేందిరని కలిసి విన్నవించినట్లు తెలిసింది. -
సంపీడన, విరళీకరణాలు ఉండే తరంగాలు?
ద్వని 1. ధ్వని ఏ పదార్థాల్లో ప్రసరించదు? ఎ) ఘన బి) ద్రవ సి) వాయు డి) శూన్యం 2. గాలిలో ధ్వని వేగం (మీ/సె॥ ఎ) 300 బి) 330 సి) 350 డి) 375 3. నీటిలో ధ్వని వేగం సెకనుకు ఎన్ని మీటర్లు? ఎ) 1435 బి) 1835 సి) 835 డి) 335 4. శృంగాలు, ద్రోణులు ఉండే తరంగాలు? ఎ) అనుదైర్ఘ్య బి) యాంత్రిక సి) తిర్యక్ డి) గోళాకార 5. సూపర్ సోనిక్ విమానాలు సృష్టించే శబ్ద కాలుష్యం? ఎ) తక్కువ బి) చాలా తక్కువ సి) చాలా ఎక్కువ డి) శబ్దం ఉండదు 6. సున్నా డెసిబెల్స్ ఉన్న శబ్ద పరిమాణ ధ్వని పీడనం చ॥ఎన్ని డైన్లు? ఎ) 0.02 బి) 0.002 సి) 0.20 డి) 0.0002 7. సంపీడన, విరళీకరణాలు ఉండే తరం గాలు? ఎ) అనుదైర్ఘ్య బి) తల సి) తిర్యక్ డి) గోళాకార 8. పచ్చిక బయలులో గాలి తాకిడికి కదిలే పచ్చిగడ్డి ఏర్పరిచే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్? ఎ) 0 బి) 2 సి) 5 డి) 15 9. ఎన్ని డెసిబెల్స్ శబ్దం మనకు కర్ణ కఠోరంగా ఉంటుంది? ఎ) 50 బి) 60 సి) 90 డి) 125 10. సామాన్యంగా మనుషులు మాట్లాడేటప్పుడు శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్..? ఎ) 20-30 బి) 10-20 సి) 50-60 డి) 80-90 11. యానకంలో యాంత్రిక తరంగాలు ప్రస రించడానికి కావాల్సినవి? ఎ) జడత్వం బి) స్థితి స్థాపకత సి) జడత్వం, స్థితిస్థాపకత డి) పైవేవీ కావు 12. తిర్యక్ తరంగం కానిది? ఎ) ధ్వని తరంగాలు బి) తీగలోని తరంగాలు సి) నీటి తరంగాలు డి) కాంతి తరంగాలు 13. నీటి తరంగాల్లో మిట్ట భాగం..? ఎ) ద్రోణి బి) శృంగం సి) సంపీడనం డి) విరళీకరణం 14. {స్పింగ్లో ఏర్పడే తరంగాలు --- తరం గాలకు ఉదాహరణ? ఎ) తిర్యక్ బి) తల సి) అనుదైర్ఘ్య డి) గోళాకార 15. స్థిర తరంగాల్లో గరిష్ట స్థానభ్రంశం కలవి? ఎ) అస్పందన బి) ద్రోణులు సి) ప్రస్పందన డి) శృంగం 16. ఒక సెకను కాలంలో చేసే కంపనాల సంఖ్య ను ఏమంటారు? ఎ) తరంగ దైర్ఘ్యం బి) పౌనఃపున్యం సి) స్థానభ్రంశం డి) వేగం 17. పౌనఃపున్యానికి ప్రమాణం? ఎ) ల్యూమెన్ బి) స్టెరేడియన్ సి) హెర్ట్జ్ డి) పైవన్నీ 19. 20 ఏ్డ కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు? ఎ) పరశ్రావ్య ధ్వనులు బి) అతిధ్వనులు సి) కఠోర ధ్వనులు డి) సంగీత ధ్వనులు 20. ఒకే పౌనఃపున్యం గల ధ్వనిని ఉత్పత్తి చేసేందుకు దేన్ని ఉపయోగిస్తారు? ఎ) తబల బి) గిటార్ సి) పిల్లనగ్రోవి డి) శృతిదండం 21. గాజులో ధ్వని వేగం సెకనుకు? ఎ) 330 బి) 1435 సి) 5500 డి) 260 22. గోల్ గుంబజ్ గల ప్రదేశం? ఎ) గుల్బర్గా బి) బీజాపూర్ సి) బరౌనీ డి) మైసూర్ 23. రెండు ధ్వనులు మనిషి చెవిని ఎన్ని సెకన్ల కాల వ్యవధిలో చేరితే ఆ రెండు ధ్వనులను మనిషి విడివిడిగా వినగలుగుతాడు? ఎ) 1/12 బి) 1/20 సి) 1/15 డి) 1/25 24. అసలు ధ్వని, పరావర్తన ధ్వనిని మనం వినాలంటే పరావర్తన తలం నుంచి కనీసం ఎన్ని మీటర్లు ఉండాలి? ఎ) 24 మీటర్లు బి) 11 మీటర్లు సి) 30 మీటర్లు డి) 21 మీటర్లు 25. హెచ్చు పౌనఃపున్యంలో ధ్వనులను ఉత్పత్తి చేసి వాటి పరావర్తన ధ్వని అవరోధాల నుంచి వచ్చే ప్రతిధ్వనులను గుర్తించ గలి గేవి? ఎ) పాలపిట్ట బి) రామచిలుక సి) గబ్బిలాలు డి) కోతులు 26. ధ్వనికి ప్రమాణం? ఎ) ఆంగ్‌స్ట్రామ్ బి) ల్యూమెన్ సి) కాండెలా డి) డెసిబెల్స్ 27. చెవిటివారి కోసం విశేషంగా కృషిచేసిన శాస్త్రవేత్త? ఎ) రూథర్‌ఫర్‌డ బి) అలెగ్జాండర్ గ్రహంబెల్ సి) నీల్స్ బోర్ డి) గెలీలియో 28. గోడ గడియారం చేసే టిక్ టిక్ మనే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్? ఎ) 20 బి) 40 సి) 30 డి) 60 29. టెలిఫోన్ గంట ఏర్పరిచే శబ్ద పరిమాణం ఎన్ని డెసిబెల్స్? ఎ) 85 బి) 40 సి) 30 డి) 60 30. కింది వాటిలో తీగ వాయిద్యం కానిది? ఎ) సితార్ బి) పిల్లనగ్రోవి సి) బుల్-బుల్ డి) వీణ 31. కింది వాటిలో వాయు వాయిద్యం? ఎ) తబల బి) వీణ సి) హార్మోనియం డి) సితార్ 32 గాలిలో ధ్వని వేగం సైద్ధాంతిక విలువ? ఎ) 331 మీ/సె బి) 270 మీ/సె సి) 280 మీ/సె డి) 320 మీ/సె 33 కాలంతో తరిగిపోయే కంపన పరిమితు లున్న ఆవర్తన చలనాల్ని ఏమంటారు? ఎ) స్వేచ్ఛా కంపనాలు బి) బలాత్కృత కంపనాలు సి) అవరుద్ధ్ద కంపనాలు డి) పైవన్నీ 35 రెండు వరుస ప్రస్పందన లేదా అస్పంద నాల మధ్య దూరం? ఎ) బి) /2 సి) /4 డి) /8 36. ఒక ప్రస్పందన, దాని పక్కనే ఉన్న అస్పందన స్థానాల మధ్య దూరం? ఎ) బి) /2 సి) /3 డి) /4 37 ఒక వస్తువు బాహ్య ఆవర్తనబల కంపనాల ప్రభావంతో కంపిస్తే దాన్ని ఏమంటారు? ఎ) స్వేచ్ఛా కంపనాలు బి) అవరుద్ధ్ద కంపనాలు సి) బలాత్కృత కంపనాలు డి) డోలాయమాన కంపనాలు 38 అవరోధాల నుంచి పరావర్తనం చెందిన తరంగాల ప్రావస్థ..? ఎ) 120ని బి) 180ని సి) 240ని డి) 60ని 39 తెరచి ఉంచిన గొట్టాల్లో ఏర్పడే అను స్వరాల నిష్పత్తి? ఎ) 1: 3: 5 బి) 1: 2: 3 : 4 సి) 1: 3: 4: 6 డి) పైవేవీ కావు 40 ఆడిటోరియంలో వెలువడే ధ్వని తరంగాల గురించి వివరించిన శాస్త్రవేత్త? ఎ) డబ్ల్యూ.సి. బెనర్జీ బి) న్యూటన్ సి) లాప్లాస్ డి) డబ్ల్యూ.సి. సెబైన్ 41 మూసి ఉంచిన గొట్టాల్లో అనుస్వరాల నిష్పత్తి? ఎ) 1:2:3 బి) 1:4:6 సి) 1:3:5 డి) 1:1:1 42. {శవ్య హద్దుకంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు? ఎ) పరశ్రావ్యాలు బి) అతిధ్వనులు సి) యాంత్రిక తరంగాలు డి) పైవన్నీ 43 బెల్లో పదో వంతు? ఎ) డెకా బెల్ బి) హెక్సా బెల్ సి) డెసిబెల్ డి) నానో బెల్ 44 అనేది ఏ భాషకు చెందింది? ఎ) లాటిన్ బి) గ్రీక్ సి) ఇంగ్లిష్ డి) పర్షియన్ 45. నీటి తరంగాల్లో పల్లపు భాగాన్ని ఏమం టారు..? ఎ) శృంగం బి) ద్రోణి సి) సంపీడనం డి) విరళీకరణం 46. తరంగాల వ్యాపన దిశకు లంబంగా యాన కంలోని కణాలు కంపిస్తే ఆ తరంగాలు? ఎ) అనుదైర్ఘ్య బి) తిర్యక్ సి) స్థిర డి) అన్నీ .47 ఒక ప్రావస్థలో ఉన్న రెండు అనుక్రమ కణాల మధ్య దూరం? ఎ) పౌనఃపున్యం బి) తరంగ దైర్ఘ్యం సి) తరంగ వేగం డి) ఏదీకాదు 48. చిక్కుడు విత్తనంలో రెండు బీజ దళాలు ఉంటాయి. ఇది ఒక..? ఎ) భావన బి) సిద్ధాంతం సి) సత్యం డి) సాధారణీకరణ 49 హెన్రీ పాయింకర్, ఆర్.సి. శర్మల ప్రకారం విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని దేనితో పోల్చారు? ఎ) వంతెన బి) పుస్తకం సి) భవనం డి) వాహనం 50 ప్రయోగం తర్వాత రీడింగులను నిజాయితీగా నమోదు చేసిన విద్యార్థుల్లో పెంపొందే విలువ? ఎ) క్రమశిక్షణ బి) నైతిక సి) బౌద్ధిక డి) ఔపయోగిక 51. సరైన ఆధారం లభించనంత వరకు తీర్పు ను నిలిపివేయటం అనే లక్షణం ఏ వ్యక్తిలో ఉంటుంది? ఎ) దూరదృష్టి కల్గిన వ్యక్తి బి) పరావర్తిత ఆలోచన గల వ్యక్తి సి) శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి డి) కారాణాన్వేషణ, తీర్పునివ్వగల సామర్థ్యం కల్గిన వ్యక్తి 52 విమలలో సరళ స్వభావత అనే లక్షణం? ఎ) ప్రయోగాత్మక విలువ బి) నైతిక విలువ సి) సాంస్కృతిక విలువ డి) క్రమశిక్షణ విలువ 53. విజ్ఞానశాస్త్రం కేవలం సాపేక్ష సత్యాన్ని కలిగి ఉంటుంది తప్ప పరమ సత్యాన్ని కాదు.. అనేది? ఎ) శాస్త్రీయ సత్యాలు ఎప్పుడూ తాత్కాలికం బి) శాస్త్రీయ సత్యాలు పూర్తిగా నిజం కావు సి) విజ్ఞానశాస్త్రం.. తత్వశాస్త్ర భావాలను అంగీకరించదు డి) విజ్ఞానశాస్త్రం సంభావ్యతను వ్యక్తీకరిస్తుంది కానీ తద్యాలను కాదు సమాధానాలు 1) డి 2) బి 3) ఎ 4) సి 5) సి 6) డి 7) ఎ 8) ఎ 9) డి 10) సి 11) సి 12) ఎ 13) బి 14) సి 15) సి 16) బి 17) సి 18) బి 19) ఎ 20) డి 21) సి 22) బి 23) సి 24) బి 25) సి 26) డి 27) బి 28) సి 29) డి 30) బి 31) సి 32) ఎ 33) బి 34) సి 35) సి 36) బి 37) డి 38) బి 39) సి 40) సి 41) బి 42) బి 43) డి 44) సి 45) బి 46) సి 47) బి 48) బి 49) బి 50) బి 51) 3 52) 3 53) 2 54) 3 55) 2 56) 1 నిమ్స్‌లో డీఎం/ఎంసీహెచ్ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(నిమ్స్).. డీఎం/ఎంసీహెచ్ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. ప్రవేశాలు కోర్సుల వివరాలు.. డీఎం(క్లినికల్ ఫార్మకాలజీ) ఎంసీహెచ్ విభాగాలు: ప్లాస్టిక్ సర్జరీ కార్డియోథోరాసిస్ సర్జరీ కాలపరిమితి: మూడేళ్లు అర్హతలు: జనరల్ సర్జరీ/ఫార్మకాలజీలో ఎండీ/డీఎన్బీ/ఎంఎస్ డిగ్రీ ఉండాలి. ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తి చేసి పంపాలి. చివరి తేది: ఆగస్టు 31 ప్రవేశ పరీక్ష: సెప్టెంబర్ 14 వెబ్సైట్: www.nims.edu.in అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌లు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్).. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌లు పోస్టుల సంఖ్య: 3 అర్హతలు: సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లొమా/ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్-ఎక్స్ డిప్లొమా ఉండాలి. వైమానిక విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. వయోపరిమితి: 28 ఏళ్లకు మించకూడదు ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి. చివరి తేది: సెప్టెంబర్ 18 వెబ్సైట్: www.bsf.nic.in