
హైదరాబాద్‌లొ మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టిస్తుంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దిరోజులుగా తరుచుగా గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. హఫీజ్‌పేట్ గోకుల్ ఫ్లాట్స్‌లో నిందితుడు గోపీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుంచి 10గ్రాముల డ్రగ్స్, రూ55వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరబిక్ ట్యూటర్ అష్రఫ్ బేగ్‌ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 13 గ్రాముల కొకైన్, రూ 65 వేల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల ఫోన్స్‌ను సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment