టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.
అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది.
(ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)
ఝాన్సీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment