Jhansi
-
‘తల్లి’ మరణంపై కూతురు బొమ్మ.. కేసులో బిగ్ ట్విస్ట్
ఝాన్సీ: ‘పాపా కిల్డ్ మమ్మీ, హ్యాంగ్డ్ బాడీ’ అంటూ నాలుగేళ్ల బాలిక వేసిన బొమ్మతో ఆమె తల్లి మరణోదంతం కొత్త మలుపు తిరిగింది. తల్లిని చంపేస్తానని తండ్రి గతంలోనూ బెదిరించాడని బాలిక చెప్పింది. అంతేగాక తననూ చంపేస్తానన్నాడని చెప్పుకొచ్చింది. దాంతో అత్తింటివారి ‘ఆత్మహత్య’ కథనాన్ని పోలీసులు అనుమానించారు.ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని తికంగఢ్ జిల్లాకు చెందిన సోనాలికి ఝాన్సీలోని కొత్వాలీకి చెందిన సందీప్ బుధోలియాతో 2019లో వివాహమైంది. రూ.20 లక్షల కట్నమిచ్చారు. కారు అడగ్గా తమ శక్తికి మించినదని తల్లిదండ్రులు చెప్పారు. అప్పట్నుంచీ సోనాలిపై వేధింపులు మొదలయ్యాయి."🚨 Jhansi: A 4-year-old girl's drawing exposed the murder of her mother, Sonali Budholia. She alleged her father, Sandeep Budholia, killed her after years of dowry harassment & abuse. 💔 Police are investigating. #JusticeForSonali #StopDowry #UttarPradesh" pic.twitter.com/ayZG51DKxO— HK Chronicle (@HK_Chronicle_) February 18, 2025నాలుగేళ్లకు పాప పుట్టడంతో.. భర్త, అత్తామామలు సోనాలిని ఆసుపత్రిలో ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు. సోనాలి తండ్రే ఆస్పత్రి బిల్లు చెల్లించి కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. కొంతకాలానికి అత్తింటివారు వచ్చి తల్లీకూతుళ్లను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం, సోనాలి ఆరోగ్యం బాగాలేదంటూ భర్త ఇటీవల ఆమె తల్లిదండ్రలకు ఫోన్ చేశాడు. కాదు, ఉరేసుకుందంటూ ఆ వెంటనే సమాచారమిచ్చాడు. వెళ్లి చూసేసరికి సోనాలి చనిపోయి ఉంది. దాంతో కూతురిని అత్తింటివారే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు.అయితే తండ్రే తన తల్లిని చంపాడని వారి నాలుగేళ్ల దర్శిత చెప్పింది. ‘మమ్మీపై డాడీ దాడి చేసి చంపేశాడు. తర్వాత ‘కావాలంటే నువ్వు చచ్చిపో అని నన్ను అన్నాడు. అమ్మకు ఉరేసి రాయితో తలపై కొట్టాడు. తర్వాత కిందకు దించి సంచిలో పడేశాడు’ అంటూ బొమ్మగీసి మరి చూపించింది. ‘నువ్వు మా అమ్మను తాకితే నీ చెయ్యి విరగ్గొడతానని గతంలో నాన్నను తిట్టా. దాంతో ‘మీ అమ్మను చంపేస్తా, నిన్నూ చంపేస్తా’ అని అన్నాడు’ అని కన్నీరు పెట్టుకుంది. కూతురి వాంగ్మూలం, మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణల నేపథ్యంలో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
'మహిళల భద్రతకు ఈ తీర్పే నిదర్శనం'.. జానీ మాస్టర్ కేసుపై ఝాన్సీ పోస్ట్
టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ మహిళ కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఇటీవల వేధింపులకు గురైన లేడీ కొరియోగ్రాఫర్ ఓ టీవీ ఇంటర్వ్యూకు హాజరైంది. జానీ మాస్టర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది.అయితే ఈ కేసుపై టాలీవుడ్ నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. జానీ భాష విషయంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయం సాధించిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. పని ప్రదేశంలో ఎక్కడైనా సరే మహిళలపై వేధింపులను సహించేది లేదని ఈ తీర్పు చూస్తే అర్థమవుతోందని.. దీనిపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య పోరాటం చేసినందుకు ఝాన్సీ ధన్యవాదాలు తెలిపింది. (ఇది చదవండి: జానీ మాస్టర్ కేసు: తొలిసారి నోరు విప్పిన శ్రేష్టి, సిగ్గుండాలంటూ ఫైర్!)ఝాన్సీ తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసును గెలుచుకుంది. కొరియోగ్రాఫర్ జానీ బాషా జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేశారు. ఈ రోజు కోర్టు ఆయన మధ్యంతర పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఇది చాలా ముఖ్యమైన తీర్పు. పని ప్రదేశంలో మహిళల భద్రత ముఖ్యమని ఈ తీర్పు చెబుతోంది. ఈ విషయంలో సీరియస్‌గా తీసుకుని పోరాటం చేసినందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్యకు నా ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
‘పురుషసూక్తం': పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళలే..
‘పురుషసూక్తం’.. ‘టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ ఎ బ్రీఫ్’.. రెండు నాటకాలు. ఇవి పురుష భావజాలంపై నటి ఝాన్సీ రూపొందించిన సంవాదాలు. ఆలోచనావీచికలు... మార్పుకై నివేదనలు. ఝాన్సీ తన టీమ్‌తో రవీంద్రభారతిలో జనవరి 12న ప్రదర్శించనున్న సందర్భంగా...‘తెలంగాణ థియేటర్ రీసెర్చ్ కౌన్సెల్ వాళ్లు 2019లో విమెన్స్ డేకి ‘విమెన్ డైరెక్టర్స్ ఫెస్టివల్’ను కండక్ట్ చేస్తూ నన్ను కూడా అడిగారు ఒక నాటకం ఇస్తాం.. డైరెక్ట్ చేయమని. వాళ్లిచ్చిన నాటకం కంటే నేను నా ఐడియాలజీని నాటకంగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. దాన్నొక చాలెంజ్‌గా తీసుకున్నాను. నేను చదివిన, చూసిన, నేర్చుకున్న, ఏర్పర్చుకున్న దృక్పథాన్ని పేపర్ మీద పెట్టాను. అదే నా ఫస్ట్ ప్లే.. ‘పురుషసూక్తం.’ జెండర్ కళ్లద్దాలతో మాస్క్యులినిటీని మనమెలా చూస్తున్నాం, దాన్నెలా పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల పురుషుడు తాను మనిషినన్న విషయాన్ని మరచిపోయి, అనవసరపు బరువు బాధ్యతలను ఎలా మోస్తున్నాడు, ఆ పురుషాధిపత్యాన్ని కాపాడటానికి మహిళ ఎలా కోటగోడగా మారిందనే అంశాల మీద సీరియస్ చర్చే ఆ నాటకం’ అన్నారు ఝాన్సీ.రవీంద్రభారతిలో తన రెండు నాటకాలను ప్రదర్శించడానికి ఒకవైపు రిహార్సల్స్ చేస్తూ మరోవైపు సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. ‘పురుషసూక్తం నాటకానికి 18 రోజు ల్లోనే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాను. డైరెక్ట్ చేయడమే కాక నటించాను కూడా. అంత సీరియస్ నాటకాన్ని రెండు పాత్రలతో ఎంతవరకు మెప్పించగలను అనుకున్నా! కానీ ఆశ్చర్యం.. కె. విశ్వనాథ్ లాంటి వారి మహామహుల ప్రశంసలు అందాయి. అది నాటక రచయితగా, దర్శకురాలిగా నా ప్రయాణాన్ని ఖరారు చేసుకునేలా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. థియేటరే నా మీడియమనీ అర్థమైంది’ అన్నారామె.టిట్ ఫర్ టాట్.. కన్వర్జేషన్స్ బిట్వీన్ ఎ బ్రా అండ్ బ్రీఫ్ ‘కిందటేడు (2024) అక్టోబర్ 4న వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ డే సందర్భంగా స్త్రీల ఆరోగ్యం, పురుషుల బాధ్యత లాంటి విషయాలెన్నో చర్చకు వచ్చి.. అసలిలాంటి వాటి మీద మనమెందుకు అవసరమైనంతగా మాట్లాడట్లేదు, ఏదో ఒకటి చేయాలి అనిపించి ‘టిట్ ఫర్ టాట్.. ’ మొదలుపెట్టాను’ అన్నారు ఝాన్సీ. ఇది ‘పురుషసూక్తం’ తర్వాత ఆమె రాసి నటించి దర్శకత్వం వహించనున్న రెండోనాటకం.‘రెండు రోజులకే ఏం రాయాలో తెలిసింది గాని మొదట సగం స్క్రిప్టే రాయగలిగాను. దానికే ఇంకొన్ని ఆలోచనలు జోడించి ఇంట్లో పిల్లలనే చేర్చి, క్లోజ్ సర్కిల్ ముందు వేసి చూపించాను. అలా వర్క్ చేసుకుంటూ నాటకం రాసుకుంటూ వచ్చాను. పార్ట్స్ పార్ట్స్‌గా రాస్తూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రదర్శించి ఫ్రెండ్స్‌కు చూపించాను. అందరికీ నచ్చింది. మెయిన్ షో ఎప్పుడని అడగడం మొదలుపెట్టారు. ‘టిట్ ఫర్ టాట్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ బ్రా అండ్ బ్రీఫ్’కి కూడా మూలం పురుషాధిపత్య విషతుల్య భావజాలమే. కాకపోతే అప్రోచ్ వేరు. ఇదొక సోషల్ సెటైర్. దీనికి టార్గెట్ ఆడియన్స్ 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వాళ్లు. వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. అందుకే హ్యూమర్‌ని, వ్యంగ్యాన్ని ఎంచుకున్నాను. సీరియస్‌ను పండించడం తేలికే. వ్యంగ్యం చాలా కష్టం. భాష కూడా జెన్ జీ జార్గాన్స్‌తో ఉంటుంది. వాళ్ల తాలూకు మీమ్స్ ఉంటాయి. పురుషసూక్తం.. మగవాడు మీదేసుకున్న బాధ్యతల బరువు మీద ఫోకస్ చేసింది. ఇదేమో ఆ బాధ్యతలను ఇంకా వేసుకోని వాళ్లకు వేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతుంది’ అన్నారామె.డిబేట్.. ‘రవీంద్రభారతి ప్రదర్శనలో ఈ రెండూ నాటకాలు మరింత మార్పు చేర్పులతో వస్తున్నాయి. పురుషసూక్తంలో కోరస్ యాడ్ అవుతోంది. ‘టిట్ ఫర్ టాట్.. ’ లో ట్రాన్స్ ఉమన్, ట్రాన్స్ మన్ ఇలా అన్ని వర్గాల వాళ్లు నటిస్తున్నారు. ప్రతివాళ్లు వాళ్ల వాళ్ల శరీర ధర్మాలను రిప్రెజెంట్ చేస్తూ తమ సహజమైన పాత్రలనే పోషిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఇంత వైవిధ్యం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. వాళ్ల వల్నరబులిటీని అర్థం చేసుకోవాలని తెలిపే ప్రయత్నం చేస్తున్నాం.. ప్రేక్షకులకే కాదు.. అందులో నటించిన నటీనటులకు కూడా! ఇందులో మా అమ్మాయి ధన్య పరిచయం అవుతోంది. నాటకాల ప్రదర్శన తర్వాత ఓపెన్ డిబేట్ ఉంటుంది’ అన్నారామె.రంగయాత్ర.. సామాజిక చైతన్యాన్ని తీసుకురావడంలో నాటకానిదే ప్రధాన పాత్ర మొదటి నుంచీ! ఆ బాధ్యతను కొనసాగించాలనుకుంటున్నాం.. ‘రంగయాత్ర.. థియేటర్ ఫర్ సోషల్ డిబేట్’ పేరుతో! అందులో భాగంగానే రవీంద్రభారతిలో ప్రదర్శన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని కాలేజెస్‌కి వెళ్లి అక్కడ ఈ నాటకాలను ప్రదర్శించబోతున్నాం స్ట్రీట్ ప్లే తరహాలో. ప్రదర్శన తర్వాత విద్యార్థులతో డిబేట్ పెడతాం. జెండర్ మీద అవగాహన కల్పించే ప్రయత్నమే ఇదంతా!’ అంటూ ముగించారామె.– సరస్వతి రమకొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది ‘పురుషసూక్తం నన్ను థియేటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈ నాటకాన్ని మగవాడిని అర్థంచేసుకునే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఆ దిశగా .. పురుషాధిపత్య భావజాలంతో కండిషనింగ్ అయి ఉన్న మొత్తం సమాజాన్నే ఆత్మవిమర్శకు గురిచేస్తుంది ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది! రిహార్సల్స్‌లో ఎన్నిసార్లు నన్ను నేను తరచి చూసుకున్నానో! ఇది నాకొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్!’– వంశీ చాగంటి, హ్యాపీడేస్ ఫేమ్ -
Year Ender 2024: ఎన్నటికీ మరువలేని రెండు దుర్ఘటనలు
మరికొద్ది గంటల్లో 2024 ముగియబోతోంది. 2025ను స్వాగతించేందుకు ప్రపంచమంతా సిద్ధమయ్యింది. 2024లో దేశంలో పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వాటిలో కొన్ని తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. యూపీలో జరిగిన రెండు ఘటనలైతే ఎన్నటికీ మరువలేని విషాదాన్ని మిగిల్చాయి. వాటిని తలచుకుంటే ఎవరికైనా కళ్లు చెమరుస్తాయి.హత్రాస్ తొక్కిసలాట2024, జులై 2న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోరాన్ని ఎవరూ మరచిపోలేరు. ఆ రోజు మంగళవారం.. హత్రాస్(Hathras) పరిధిలోని పుల్రాయి గ్రామంలో నారాయణ్ సకర్ హరి అలియాస్ భోలే బాబా సత్సంగం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్షలాదిమంది తరలివచ్చారు. సత్సంగం ముగిసిన అనంతరం భోలే బాబా పాదాలను తాకేందుకు ఆయన దగ్గరకు ఒక్క ఉదుటున జనం పరుగులు తీశారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ దుర్ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. లెక్కలేనంతమందికి గాయాలయ్యాయి.ఈ ఘటన దరిమిలా భోలే బాబా పరారయ్యాడు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగంలో కలకలం రేపింది. యూపీ పోలీసులు భోలే బాబా కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సత్సంగ్ నిర్వాహకులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై నాడు సీఎం యోగి స్పందిస్తూ, ఈ ఘటనకు కారకులైనవారినెవరినీ, వదిలిపెట్టబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 91 రోజుల పాటు పోలీసులు కేసు దర్యాప్తు చేసి, మొత్తం 11 మందిని నిందితులుగా తేల్చారు. అయితే ఈ చార్జిషీటులో నారాయణ్ సకర్ హరి అలియాస్ సూరజ్‌పాల్ బాబా(Surajpal Baba) పేరు లేకపోవడం విశేషం. ఈ కేసులో పోలీసులు 3,200 పేజీల చార్జిషీటును దాఖలు చేశారు.ఝాన్సీ అగ్ని ప్రమాదం2024, నవంబర్ 15న యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న దుర్ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ(Maharani Lakshmibai Medical College)లో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చైల్డ్ వార్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఎన్ఐసీయూ వార్డులో 54 మంది చిన్నారులు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన ఆస్పత్రి సిబ్బంది, చిన్నారుల బంధువులు చైల్డ్ వార్డు కిటికీ పగులగొట్టి, పలువురు చిన్నారులను రక్షించారు. ఈ ఘటనలో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. యావత్‌దేశం ఈ ఉదంతంపై కంటతడి పెట్టుకుంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఐదు ఘటనలు.. రాజధానిలో సంచలనం -
Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీలోగల మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం దరిమిలా ఆస్పత్రి పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన కృపాల్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ‘అనారోగ్యంతో బాధ పడుతున్న నా మనుమడిని ఆస్పత్రిలో చేర్పించాను. పిల్లాడు ఉంటున్న వార్డులో శుక్రవారం రాత్రి 10 గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఆ గదిలోనికి వెళ్లాను. ఆ వార్డులోని 18 పడకలపై 50 మందికిపైగా పిల్లలున్నారు. ఒక బెడ్‌పై ఆరుగురు శిశువులు ఉన్నారు. చుట్టూ మంటలు వ్యాపించాయి. అతికష్టం మీద 25 మంది పిల్లలను బయటకు తీసుకు వచ్చాను. నేను చూస్తుండానే 10 మంది శిశువులు కాలి బూడిదయ్యారు. నా కుమారుడు క్షేమంగానే ఉన్నాడు’ అని తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న 25 మంది చిన్నారులను ప్రాణాలతో కాపాడిన కృపాల్ సింగ్‌ను ఆసుపత్రి సిబ్బంది, ఇతరులు అభినందనలతో ముంచెత్తారు. కాగా వైద్య కళాశాలలో కేవలం 18 పడకలపై 54 మంది చిన్నారులకు చికిత్స అందించడాన్ని చూస్తుంటే ఇక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేవని తెలుస్తోంది. అలాగే అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఇంతటి దారుణ పరిస్థితి తలెత్తింది. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిజేష్ పాఠక్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
UP Fire Accident: ఆ నర్సు వల్లే ఈ ఘోరం?
లక్నో: ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ వైద్య కళాశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. పది మంది పసికందుల్ని బలిగొనడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణం ఏంటన్నది తేల్చే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం సాయంత్రంకల్లా నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఆక్సిజన్ సిలిండర్ పైప్‌ను కనెక్ట్ చేస్తున్న సమయంలో ఓ నర్సు నిర్లక్ష్యంగా అగ్గిపుల్ల వెలిగించినట్లు తెలిపిన ఓ ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం దర్యాప్తు తర్వాతే కారణంపై ప్రకటన చేస్తామని అంటున్నారు. ఆపద్భాందవుడిలా భగవాన్ దాస్!హమీర్‌పూర్‌కు చెందిన భగవాన్ దాస్ తన కొడుకును ఇదే ఆస్పత్రిలో చేర్చాడు. ప్రమాదం నుంచి తన కొడుకుతో పాటు మరికొందరు చిన్నారులను దాస్ రక్షించాడని పక్కన ఉన్నవాళ్లు చెబుతున్నారు. ‘‘ఆ నర్సు అగ్గిపుల్ల వెలగించగానే.. ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. అక్కడంతా మంటలు అంటుకున్నాయి’’ అని దాస్ చెబుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే దాస్ ఓ గుడ్డలో నలుగురు పసికందుల్ని చుట్టి.. తన వీపుకి కట్టుకుని బయటకు తీసుకొచ్చాడని అక్కడే ఉన్న ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. అగ్ని కీలలు ఎగసి పడ్డాక.. ఆస్పత్రిలోని సేఫ్టీ అలారంలు మోగకపోవడంతో చిన్నారుల తరలిపు ఆలస్యం అయ్యిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.అయితే.. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, ఆరోగ్యశాఖ మంత్రి బ్రజేష్ పాథక్.. బాధితులకు న్యాయం జరిగి తీరుతుందని చెబుతున్నారు. సిలిండర్ కాన్సెంట్రేటర్లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారని, ఒకవేళ మానవ తప్పిదం జరిగి ఉంటే ఎవరినీ వదలబోమని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారాయన. ఘటనపై మూడంచెల దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు.నెట్టింట దయనీయమైన దృశ్యాలుశుక్రవారం రాత్రి 10.30గం.-10.45గం. మధ్య ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి చిన్నపిల్లల వార్డులో (neonatal intensive care unit..NICU) అగ్నిప్రమాదం సంభవించింది. ఆ వెంటనే అక్కడ బీతావహ వాతావరణం నెలకొంది. పసికందుల్ని రక్షించేందుకు ఆస్పత్రి సిబ్బందితో పాటు తల్లిదండ్రులు పరుగులు తీసిన దృశ్యాలు, ఆ పసికందుల మృతదేహాల వద్ద రోదిస్తున్న దృశ్యాలు.. ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో నవజాత శిశువులు 10 మంది సజీవ దహనం కాగా, మరో 16 మంది ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో 54 మంది ఆ వార్డులో చికిత్స పొందుతుండగా.. అందులో 44 మంది నవజాత శిశువులే కావడం గమనార్హం.ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం, గాయపడ్డవాళ్లకు రూ.50 వేల పరిహారం ప్రకటించారు. ఘటనపై నివేదికను 12 గంటల్లో సమర్పించాలని డీజీపీ ఆదేశించారాయన. మరోవైపు.. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. -
నెలాఖర్లో ఉక్కు సత్యాగ్రహం
సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. గద్దర్, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యా రెడ్డి మాట్లాడుతూ– ‘‘మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాట్‌ను మద్రాస్‌లో పెట్టాలని ఇందిరా గాంధీగారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశాలతో గద్దర్‌గారు ఈ సినిమా కథను రాశారు. అలాగే నాలుగు పాటలు రాసి, కొన్ని కీలక సన్నివేశాల్లోనూ నటించారు. ఆయన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంగా సెన్సార్ ఇబ్బందులు రావడం, గద్దర్‌గారి మరణం వంటి కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ పూర్తయింది. 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీ కోటి. -
పవర్ఫుల్ ఝాన్సీ
లక్ష్మీ రాయ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్’. గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. తమిళ, కన్నడ భాషల్లో ఆల్రెడీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కిందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ‘‘ప్రేమ, యాక్షన్ అంశాలతో రూపొందిన సినిమా ఇది.మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో లక్ష్మీ రాయ్ అద్భుతంగా నటించారు. డ్రగ్స్ సప్లై చేస్తూ కాలేజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఓ ముఠా ఆటను అడ్డుకునే పవర్ఫుల్ ఝాన్సీ పాత్రలో లక్ష్మీ రాయ్ నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ లక్మీ రాయ్ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, సినిమాను నవంబరులో రిలీజ్ చేస్తాం’’ అని ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. -
ఇవి.. సహజసిద్ధ'మండి'!
బంజారాహిల్స్: రసాయనాలు లేకుండా సహజ సిద్ధంగా లభించే వనరులతో చేతితో తయారు చేసిన దుస్తులు, కళాకృతుల ప్రదర్శన ‘మండి’ పేరుతో బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ భవన్లో గురువారం ప్రారంభమైంది. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనను సినీ నటి, యాంకర్ ఝాన్సీ ప్రారంభించారు.దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన ప్రఖ్యాత హస్తకళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా చేతితో తయారు చేసిన ఈ ఆకృతులు నగర మహిళలను ఆకట్టుకున్నాయి. ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా ప్రకృతి సిద్ధంగా వినియోగించిన సామాగ్రితోనే అల్లిన బుట్టలు, నేసిన దుస్తులు, తయారుచేసిన పర్ఫ్యూమ్లో ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగర నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఈ ఉత్పత్తులను కొనుగోలు చేశారు.ముఖ్యంగా ఎకోఫ్రెండ్లీ బ్యాగులు, దుస్తులు, ఇతర వస్తువులు ఇక్కడ ఆకట్టుకుంటున్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ మరో ఆకర్షణగా నిలిచింది. సెరామిక్ జ్యువెలరీ, జూట్ బ్యాగులు, కేరళ మురల్ ఆర్ట్, హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్, రస్టిక్ సెరమిక్ పీసెస్, పామ్ లీఫ్ ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శించారు. పర్యావరాణానికి పెద్దపీట వేస్తూ హస్తకళాకారులు తీర్చిదిద్దిన ఈ ఆకృతులను సదరు కళాకారులు ఒక వైపు ఆన్లైన్లో విక్రయిస్తూనే మరోవైపు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతున్నారు.ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తులకు హైదరాబాద్ బ్రాండ్‌గా మారిందని ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తెలిపారు. ప్రదర్శనలో సీసీటీ చైర్పర్సన్ అనురాధ బిష్ణోయ్ కూడా పాల్గొన్నారు.ఇవి చదవండి: ఇన్ఫ్లుయెన్సర్స్.. @రూ. 5 వేల కోట్లు! -
జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?
లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి జానీపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే జానీ వివాదంపై తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో తమ్మారెడ్డి భరద్వాజ, ఝూన్సీ, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు.జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేగింది. దీంతో ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయింది. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్‌ను ఇప్పటికే ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు.చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి యాంకర్,నటి ఝాన్సీ రియాక్ట్ అయ్యారు. 'మన ఇండస్ట్రీలో మహిళా రక్షణ కోసం సరైన గెడ్ లైన్స్ లేవు. నటి శ్రీ రెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది. జానీ మాస్టర్ ఇష్యూ తెరపైకి వచ్చిన వెంటనే ఆ కమిటీ వారు పరిశీలిస్తున్నారు. ఈ వివాదంలో బాధితురాలు తొలుత తన వర్క్ పరంగా ఇబ్బంది అని ముందుకు వచ్చింది. కానీ, ఆ తర్వాత లైంగిక వేధింపులు కూడా ఉన్నాయని పేర్కొంది. ఆ అమ్మాయి స్టేట్మెంట్తో పాటు జానీ మాటలను కూడా కూడా రికార్డు చేశాం. అయితే, లైంగిక వేధింపులు అనేది వర్క్ ప్లేస్‌లో జరగలేదు. ఆ అమ్మాయి ఇప్పటకే లీగల్‌గా ముందుకు వెళ్తుంది. అయితే, మీడియా వారు బాధితురాలి ఫోటోలను రివీల్ చేయవద్దని కోరుతున్నా. విచారణ సాగుతుంది. 90రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వస్తుంది.' అని ఝాన్సీ తెలిపారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. 'మొదట మీడియా వారి నుంచే జానీ మాస్టర్ వివాదం మా వద్దకు వచ్చింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు పడే వారి కోసం 2013లో ఆసరా అని పెట్టి.. 2018లో సరికొత్తగా ప్యానల్ పేరుతో మార్చాం. ఇలా పేర్లు అయితే మార్చాం కానీ, ఒక మహిళకు దైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలోని ప్రతి అమ్మాయికి ఆపద వస్తే తమకు సపోర్ట్ ఉందనే బరోసా కల్పించాలి. అందుకు తగ్గ కమిటీ నిర్ణయాలు ఉండాలి. కచ్చితంగా 90 రోజుల్లోనే జానీ మాస్టర్ కేసు పూర్తి అవుతుంది.కానీ, సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్‌కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని ఈ సందర్భంగా సూచించనున్నాం. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు.' అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. -
అవ్వాతాతల ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
-
రోడ్డుపై చెత్తని సేకరిస్తున్న తెలుగు నటి.. ఎందుకో తెలుసా?
తెలుగు యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ.. రోడ్డుపై చెత్త సేకరిస్తూ కనిపించింది. మీరు విన్నది నిజమే. అయితే ఇది ఏ సినిమా కోసమే చేసిన సీన్ అయితే కాదులేండి. నిజంగానే తన పనివాడితో కలిసి రోడ్డుపై ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకుల్ని మొత్తం తన కారులో ఎక్కించుకుంది. ఇంతకీ ఇలా ఎందుకు చేసిందో తెలుసా? (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత నటీనటులు అందరూ గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేసి.. నెటిజన్స్‌కి అందుబాటులో ఉంటారు. కొందరు మాత్రం రొటీన్‌కి భిన్నంగా ఉండే వీడియోస్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. గత కొన్నాళ్ల నుంచి యాంకర్ కమ్ నటి ఝాన్సీ కూడా వ్యర్థాలు వాటితో ఉపయోగాల్లాంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రోడ్డుపై పడి ఉన్న ఎండుగడ్డి, ఎండిపోయిన అరటి ఆకుల్ని సేకరించి.. కారులో తన ఇంటికి పట్టుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని పోస్ట్ చేసి వాటిని ఎందుకు సేకరించాల్సి వచ్చిందో క్లారిటీగా చెప్పుకొచ్చారు. 'ఎండు గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. అవి ప్రకృతి సమతౌల్య సూత్రం' అని ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియని విషయాన్ని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరి పేరు భైరవకోన' సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే?) View this post on Instagram A post shared by @anchor_jhansi -
పోలీసుల తీరు అమానుషం
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ టౌన్/ ఏజీ వర్సిటీ: హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ యూని వర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టుకుని మహిళా కానిస్టేబుళ్లు ఈడ్చుకెళ్ళిన ఘట నను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. విద్యార్థినిపై పోలీసుల చర్య అమానుషమని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనపై తక్ష ణమే సమగ్ర విచారణ జరిపి కమిషన్‌కు నివేదిక సమర్పించాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంది: బీజేపీ ఆగ్రహం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు రాణీ రుద్రమ, బండారు విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వారికి ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నట్టు స్పష్టం అవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ విధానాన్ని విడనాడి, ఈ ఘటనపై వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా నాయకురాలి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్ళిన పోలీసులపై ఇప్పటిదాకా సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ధర్నా చౌక్‌ను మూసేసి, ప్రశ్నించే గొంతుకలను నొక్కేసిన దొర పాలనను అంతం చేసి ఒక ప్రత్యా మ్నాయాన్ని కోరుకున్న తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లి రేవంత్‌రెడ్డి మరో కొత్త దొరలా తయారయ్యారని వారు ఆరోపించారు. మహిళా కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుతో సభ్యసమా జం తలదించుకుంటోందన్నారు. దాడికి పాల్పడిన మహిళా పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకో వాలని వారు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఇది అత్యంత అమానుషం: సబిత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా వచ్చిన మహిళా నేత పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు అత్యంత అమానుష చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థినిపై జులుం ప్రదర్శించిన కానిస్టేబుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానికి అత్యంత సమీపంలోనే ఈ ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోందన్నారు. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే: బండి ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసులు వ్యవహరించిన తీరును సభ్యసమాజం అస హ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కోసం నిజాయితీగా, శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలిని జుట్టు పట్టుకుని స్కూటీపై ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకన్నా హేయమైన చర్య ఉంటుందా అని మండిపడ్డారు. తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని బండి డిమాండ్ చేశారు. -
పాలకుర్తిని వీడాలని ఝాన్సీరెడ్డికి నోటీసులు
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వరబాబు తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఝాన్సీరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. తన కోడలు యశస్వినిరెడ్డిని బరిలో నిలిపానని, తాను నియోజకవర్గంలోని చెర్లపాలాన్ని దత్తత తీసుకున్నానని, ఇక్కడ పన్నులు కడుతున్నానని, తనను నియోజకవర్గం వీడాలనడం సరికాదన్నారు. కుట్ర పూరితంగా తనకు నోటీసులు జారీ చేశారన్నారు. దీనికి మంత్రి దయాకర్‌రావు బాధ్యత వహించాలన్నారు. కనీసం ఆడవాళ్లు అని చూడకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. -
టార్గెట్ ఎర్రబెల్లి.. ఝాన్సీరెడ్డి బదులు యశస్వినీ!
సాక్షి, హన్మకొండ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం గడుస్తున్న కొద్దీ కొన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మరోసారి హైలైట్ అయ్యింది. పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో పాలకుర్తి విషయమై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో స్క్రీనింగ్ కమిటీ ఈ విషయంపై ఫోకస్ పెట్టింది. ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి పౌరసత్వం విషయంలో సమస్య కారణంగా ఆమెకు బదులుగా ఝాన్సీ కోడలు యశస్వినీ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు స్క్రీనింగ్ కమిటీ యశస్వినీ పేరును ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓటమి ఎరుగని నేతగా పేరుతెచ్చుకున్న ఎర్రబెల్లికి ఈసారి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ భారీ కసరత్తే చేస్తోంది. ఆయనను ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ఆర్ఐ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులను బరిలోకి దింపనున్నారు. ఝాన్సీరెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశీస్సులతోపాటు మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి సహకారం కూడా ఉంది. మంత్రి ఎర్రబెల్లికి సైతం జనం నుంచి వ్యతిరేక ఉండడంతో నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్.. మీరా నీతులు చెప్పేదంటూ.. -
ముక్కంటిని మనువాడిన 27 ఏళ్ల యువతి.. ఎందుకంటే..?
లక్నో: పచ్చని పందిళ్లు, మేలతాళాలు, వేదమంత్రాలు, బంధువుల చిరునవ్వులు, ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకునే కుటుంబ సభ్యుల హడావిడి మధ్య పెళ్లిమండపానికి సిగ్గు పడుతూ వస్తోంది వధువు. ఇదంతా చెబుతుంటే ఎవరిదో వివాహం అని అర్థమవుతోంది కదా..! కానీ ఇది మీరు పురాణాల్లో తప్పా మరెక్కడా చూడని పెళ్లి. భక్తితో పరమ శివున్నే వివాహం చేసుకున్నది ఓ యువతి.. ఏంటో ఈ కథ తెలుసుకుందాం పదండి.. మంచి వరుడు కావాలని ప్రతి యువతి కలలు కంటుంది. ఏ దుర్గునాలు లేని వాడితో జీవితాన్ని పంచుకోవాలని ఆశపడతారు. అయితే.. మనుషుల్లో అలాంటివారు ఉండరనుకుందో ఏమో? కానీ ఓ యువతి ఏకంగా ముక్కంటినే వివాహం చేసుకుంది. పరమేశ్వరుని మీద భక్తితో శివలింగాన్నే వరునిగా భావించి మనువాడింది. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివుని సేవలోనే.. ఝాన్సీలో అన్నపూర్ణ కాలనీకి చెందిన యువతి తన తల్లిదండ్రులతో జీవిస్తోంది. వారి కుటుంబమంతా చాలా ఏళ్లుగా బ్రహ్మకుమారి సంస్థతో అనుసంధానమై ఉన్నారు. అనునిత్యం శివుడి సేవలో ఉన్న యువతి.. అపారమైన భక్తి విశ్వాసాలను పెంచుకుంది. దీంతో శివుడినే వివాహమాడుతానని తల్లిదండ్రులకు తెలిపింది. వారు కూడా అందుకు అంగీకరించడంతో యువతి అభీష్టం నెరవేరింది. నెలరోజుల ముందే.. పెళ్లికి నెలరోజుల ముందే వారి కుటుంబమంతా అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లిమండపాలు వెయించడం, బంధువులకు పత్రికలు పంచడం, పెళ్లి బట్టలు ఖరీదు చేయడం ఇలా అన్నీ పనులు మనుషుల పెళ్లికి చేసినట్లు చేశారు. మేలతాళాల చప్పుళ్లతో బంధువుల మధ్య అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. ఈ విభిన్నమైన వివాహాన్ని చూడటానికి చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు ఆసక్తికనబరిచారు. ఇదీ చదవండి: మత్స్యకారుల చేతికి డాల్ఫిన్.. ఇంటికెళ్లి కూర వండేసుకున్నాక.. -
ఆ అక్రమాలన్నీ బాబు హయాంలోనే ‘కన్నా’..
సాక్షి, అమరావతి: అవినీతి, అక్రమాలకు ఆస్కారంలేని రీతిలో సహకార రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ స్పష్టంచేశారు. సహకార రంగంలో రూ.5వేల కోట్ల దోపిడీ జరిగిందంటూ ఇటీవలే టీడీపీ పంచన చేరిన మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించడంలో వాస్తవంలేదన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఆదివారం ఆమె ఒక ప్రకటనలో సవాల్ చేశారు. అందులో ఝాన్సీ ఏం పేర్కొన్నారంటే... ♦ చంద్రబాబు ప్రాపకం కోసం రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదు. కాకినాడ డీసీసీబీ పరిధిలోని గండేపల్లి సొసైటీలో రైతుల పేరిటే రూ.22 కోట్ల బినామీ రుణాలు తీసుకుని దారిమళ్లించారు. ఇదంతా 2017–18, 2018–19లలో అప్పటి సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి చేశారు. ఈ అక్రమాలు వెలికితీసింది మా ప్రభుత్వ హయాంలోనే. సొసైటీలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణతో పాటు బాధ్యులైన బ్యాంకు సిబ్బందిపై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడమేకాక అప్పటి గండేపల్లి మేనేజర్ ఎ.గణపతి, ఆర్.శ్యామలను సస్పెండ్ చేశాం. ♦ కృష్ణా డీసీసీబీ పరిధిలోని పెడన సొసైటీలో ఒక మహిళ 1.80 ఎకరాల వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాల భూమిగా చూపి 2018–19లో రుణం తీసుకోగా, వడ్డీతో సహా రుణ మొత్తాన్ని రాబట్టేందుకు లీగల్‌గా అన్ని చర్యలు తీసుకున్నాం. ♦ విశాఖపట్నం డీసీసీబీకి చెందిన రూ.4 కోట్లు సిక్కిం బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఆ బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేశారు. ఇందులో ఇప్పటికే రూ.3 కోట్లు రాబట్టాం. మిగిలిన మొత్తం కోసం బ్యాంకు హైకోర్టులో రిట్ ఫైల్ చేసింది. ♦ ఇక గుంటూరు డీసీసీబీలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందంటూ మాజీమంత్రి ‘కన్నా’ చేసిన ఆరోపణలో పసలేదు. ఈ బ్యాంకులో డ్వాక్రా సంఘాలకు ఇచి్చన రూ.600 కోట్ల రుణాలలో రూ.470 కోట్లు ఔట్‌స్టాండింగ్‌గా ఉన్నాయి. అలాంటప్పుడు రూ.500 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలి. ♦ వినుకొండ బ్రాంచిలో డ్వాక్రా రుణాలు రూ.1.40 కోట్లు దుర్వినియోగం కాగా.. యానిమేటర్‌గా ఉన్న తన తల్లి, మేనమామతో కలిసి బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఈ అవినీతికి పాల్పడినట్లుగా గుర్తించాం. పక్కదారి పట్టిన రూ.1.40 కోట్లు తిరిగి బ్యాంకుకి కట్టించడమే కాక విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న మేనేజర్ని సస్పెండ్ చేశాం. ♦ ఏలూరు డీసీసీబీ పరిధిలో టీ.నరసాపురం, చింతలపూడి, కామవరపుకోట, రంగాపురం, సరిపల్లి సొసైటీల్లో నిధులు మళ్లినట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించాం. ఇప్పటికే చింతలపూడి సొసైటీ సెక్రటరీతో పాటు సొసైటీ పాలకవర్గాన్ని సస్పెండ్ చేశాం. ♦ వైఎస్సార్ జిల్లా డీసీసీబీలో ఎలాంటిæ అవినీతి జరగలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.20 కోట్ల వరకు పేరుకుపోయిన నష్టాలు (ఎక్యుమలేటెడ్ లాసెస్) ఉన్న బ్యాంకును రూ.20 కోట్ల లాభాలను ఆర్జించే స్థాయికి తీసుకొచ్చాం. ఇలా.. ఈ నాలుగేళ్లలో అక్రమాలకు పాల్పడిన వారిని అణిచివేస్తూ పారదర్శకంగా రైతులకు సేవలందిస్తున్నాం. సహకార రంగానికి జవసత్వాలు కలి్పంచేందుకు సీఎం వైఎస్ జగన్ రూ.298 కోట్లు కేటాయించారు. -
కాంగ్రెస్ కసరత్తు.. ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు?
పాలకుర్తిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోందా? రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించే ప్రయత్నం జరుగుతోందా? కర్నాటక ఫలితాలతో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. గులాబీ గూటిలో గుబులు పుట్టించేలా పాలకుర్తిలో పావులు కదుపుతున్న నేతలు ఎవరు? మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులు ఎక్కడున్నారు? ఓటమి ఎరగని నేతకు చుక్కలు చూపించేందకు రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించేవారు. ప్రజాభిమానం ఉన్నందునే ఎర్రబెల్లిని పార్టీలోకి ఆహ్వానించి కేబినెట్లో చోటు కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసిఆర్ మాదిరిగానే ఓటమి ఎరగని నేతగా పేరున్న మంత్రి ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందని టాక్ నడుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయడానికి ఢోకా లేని మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి బలమైన అభ్యర్థి కోసం వేట మొదలు పెట్టారు. అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలానికి చెందిన హనుమాండ్ల ఝాన్సీరాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తుండగా, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఝాన్సీరెడ్డి కొనసాగుతున్నారు. గత 30ఏళ్ళుగా స్వగ్రామంతోపాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామపంచాయితీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతోపాటు స్వంత భూమి ఎకరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కెటాయించారు. చదవండి: జీవో 111 రద్దు.. 80 శాతం భూములు కేసీఆర్ బినామీ చేతుల్లోనే: రేవంత్‌రెడ్డి ఝాన్సీ రెడ్డి దంపతులను కలిసిన రేవంత్‌రెడ్డి తొర్రూరులో పాతికేళ్ళ క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పుట్టిన గడ్డ మీద పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యారు. ఇటీవల అమెరికా వెళ్ళిన టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపారట. వారి ఇంట్లోనే షెల్టర్ తీసుకున్న రేవంత్ రెడ్డి పార్టీలోకి అహ్వానించగా అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ఇండియాకు రానున్న ఝాన్సీరాజేందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతారని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. రాహుల్‌తో భేటీ? ఈనెల 30న అమెరికాకు వెళ్ళనున్న రాహుల్ గాంధీతో సైతం ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు భేటి కానున్నారని సమాచారం. ఓటమి ఎరగని నేతగా రికార్డు సృష్టించిన మంత్రి ఎర్రబెల్లిని ఢీ కొట్టి కాంగ్రెస సత్తా చాటడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. ఝాన్సీరాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత, సేవా కార్యక్రమాలు వర్క్ అవుట్ అవుతాయని భావిస్తున్నారు. ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అవుతున్నప్పటికి ఆయన స్వగ్రామం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. దీంతో పాలకుర్తికి స్థానికేతరుడనే భావన కలుగుతుంది. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే ఎర్రబెల్లికి కష్టాలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఝాన్సీరెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో ఈ మధ్యన ఎర్రబెల్లి మరింత చురుగ్గా పార్టీ కార్యక్రమాలతో గడుపుతున్నారు. ఝాన్సీరెడ్డి వచ్చినా మరెవ్వరు వచ్చినా ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఎవ్వరికి లేదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లికి దీటైన వ్యక్తిని బరిలో దింపి రికార్డును తిరగరాస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రశ్నిస్తే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా?
చైతన్యపురి: విద్యార్ధుల సమస్యలపై పోరాటం చేస్తున్న ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించటం సిగ్గు చేటని, ఆడకూతురుపై దాడి చేసిన ఘటనలో ఏసీపీ సహా బాధ్యులైన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంగళవారం గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్‌మహేశ్వర్‌రెడ్డితో కలిసి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏబీవీపీ విభాగ్ కార్యాలయానికి వచ్చిన ఆయన ఝన్సీని పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలతో ఆటలాడుతోందని, చివరకు విద్యార్ధుల భవిష్యత్తు నాశనం అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ప్రయివేటు వర్సిటీ హోదా రాకుండానే కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలు అడ్మిషన్ల దందా చేస్తున్నాయని ఆరోపించారు. ఉన్నత విద్యామండలి వద్ద ధర్నాకు పిలుపునిస్తే ధర్నా కన్నా ముందే ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించటం అన్యాయమన్నారు. విద్యార్ధుల పక్షాన యుద్ధం చేస్తున్న వారికి అండగా ఉండాల్సింది పోయి దాడులు చేసి పోలీసుల ప్రతిష్టను దెబ్బతీసుకుంటారా.? అని బండి ప్రశ్నించారు. ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌కు చేస్తామన్నారు. పేపర్ లీకేజీతో లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారని, వీటికి కారణమైన మంత్రి కేటీఆర్ లండన్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని, లీకేజి నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చి జల్సాలు చేస్తున్నారని బండి విమర్శించారు. బీఆర్ఎస్ది ఫాల్త్, మూర్ఖ, రాక్షస ప్రభు త్వం అని ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ తమ పార్టీ నాయకుడని, జాతీయ నాయకత్వాన్ని కల వటానికి ఢిల్లీ వెళితే తప్పేంటని ప్రశ్నించారు. నెలరోజుల పాటు బీజేపీ ‘అభియాన్’ కార్యక్రమాలు సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నెల పాటు వివిధ కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో మహాజన సంపర్క్ అభియాన్ రాష్ట్ర కమిటీని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాటు చేశారు. కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్, సభ్యులుగా పార్టీ నాయకులు యెండల లక్ష్మీనారాయణ, ఎన్విసుభాష్, కట్టా సుధాకర్, పి.పాపారావు, గుండగోని భరత్‌గౌడ్, వీరెల్లి చంద్రశేఖర్, ఎం.వెంకటరమణ నియమితులయ్యారు. మహాజన సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 30 నుంచి జూన్ 30 దాకా అన్ని జిల్లాలు, మండలాలు, శక్తికేంద్రాలు, పోలింగ్‌బూత్‌లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణను రూపొందించారు. -
పోలీసుల రైడ్‌లో దొరికిపోయానంటూ వార్తలు సృష్టించారు: ఝాన్సీ
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించి పలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. అందులో నిజం ఎంతున్నది పక్కన పెడితే ఎప్పుడూ ఏదో ఒక రకంగా హెడ్‌లైన్స్‌లో ఉంటారు. ప్రేమలు,బ్రేకప్‌లు ఇలా.. సినిమాల కంటే పర్సనల్ విషయాలతో మరింత హైలైట్ అవుతుంటారు. యాంకర్ ఝాన్సీ విషయంలోనూ ఇలానే జరిగింది. గతంలో ఆమె వ్యక్తిగత జీవితంపై ఓ వార్త తెగ హల్చల్ చేసింది. దీనిపై స్వయంగా వివరణ ఇచ్చింది ఝాన్సీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ఈ విషయంపై స్పందిస్తూ.. ''నేను ఓ ప్రముఖ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నానని, పోలీసుల రైడ్‌లో దొరికిపోయానని ఓ వెబ్సైట్ వాళ్లు పిచ్చిరాతలు వార్తలు సృష్టించారు. అలా ఎవరు రాయించారో, ఎందుకు రాయించారో నాకు తెలుసు. దానికి తప్పకుండా వాళ్లు అనుభవిస్తారు. కానీ నిజనిజాలు తెలియకుండా అలాంటి అబాండాలు వేస్తే మానసకింగా ఎంత క్షోభకు గురయ్యానో వాళ్లకు తెలియదు. అంతేకాకుండా ఈ వార్త వళ్ల నేను ఓ పదవి కూడా కోల్పోయాను. చాలా కాలంగా యూనిసెఫ్ తరపున పని చేయడంతో నన్ను కర్ణాటక అండ్ సౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని వాళ్లు అనుకున్నారు. కానీ సరిగ్గా అలాంటి సమయంలో ఈలాంటి రూమర్స్ రావడంతో నాకు దక్కాల్సిన పదవి కూడా రాకుండా పోయింది'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. -
నన్ను చాలామంది మోసం చేశారు : యాంకర్ ఝాన్సీ
యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సుమ తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయిలో పేరు సంపాదించుకుంది ఝాన్సీ. ఒకప్పుడు స్టార్ యాంకర్‌గా బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ కార్యక్రమాలు హోస్ట్ చేసిన ఆమె సినిమాల్లోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. ఈమధ్య బుల్లితెరపై ఈమె హడావిడి కాస్త తగ్గినా వెండితెరపై మాత్రం జోరు కొనసాగిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కెరీర్లో తనకు ఎదురైన చేదు సంఘటనల గురించి పంచుకుంది. ''నా గురించి కొత్తలో చాలామంది ఈమె ఫైర్ బ్రాండ్, పొగరు ఇలా.. అనుకునేవారు. కానీ నాతో కలిసి పనిచేసిన వారికి తెలుసు నేను ఏంటన్నది. నన్ను అర్ధం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్లు 13 ఎపిసోడ్స్‌తోనే ఫుల్స్టాప్ పెట్టేశారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఓ డ్యాన్స్ షోకి 99కి ఎపిసోడ్స్ నేను యాంకర్‌గా చేస్తే 100వ ఎపిసోడ్‌కి నా స్థానంలో వేరేవాళ్లతో యాంకరింగ్ చేయించారు. దానికి కారణం ఏంటన్నది నాకు చెప్పరు. నేను అడగలేదు. నాకు రావలసిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. నన్ను ఎంతోమంది మోసం చేశారు. కానీ వాళ్లందరిని గుర్తు పెట్టుకొని కక్ష సాధించే పని నేను ఎప్పుడూ చేయలేదు. అది మంచితనమో, పిచ్చతనమో తెలియదు'' అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ. -
కొలతలు తీసుకుంటూ టైలర్ తప్పుగా ప్రవర్తించాడు: పల్సర్ బైక్ ఝాన్సీ
కండక్టర్ ఝాన్సీ అంటే గుర్తుపడతారో లేదో కానీ పల్సర్ బైక్ ఝాన్సీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తను ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నప్పటికీ బుల్లితెరపై ప్రసారమైన పల్సర్ బైక్ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయింది. గాజువాక డిపోలో బస్ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఎన్నో పాటలకు స్టేజ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చింది. కానీ పల్సర్ బైక్ పాట మాత్రం ఆమె కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ పాటతో స్టేజీ దద్దరిల్లేలా డ్యాన్స్ చేసిన ఆమె తర్వాత పలు టీవీ షోలలో డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఓ షోకు హాజరైన ఝాన్సీ తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనలైంది. 'జనాలు నేను ఓవర్‌నైట్ స్టార్ అయ్యానంటారు. కానీ దాని వెనక పద్దెనిమిదేళ్ల కష్టం ఉంది. టైలర్ షాపుకు వెళ్తే అతడు తప్పుగా ప్రవర్తిస్తూ కొలతలు తీసుకున్నాడు. ఈ విషయం మా నాన్నకు చెప్పి కొట్టిద్దామనుకున్నాను. కానీ ఆయన నేను నీ తండ్రిని కాదు అని చెప్పమన్నాడు' అంటూ కన్నీటిపర్యంతమైంది. కాగా ఝాన్సీ ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది. -
పెళ్లికి సిద్ధమైన అంజలి.. ఈ సారైనా..!
నటి అంజలి పరిచయం అక్కర్లేని పేరు. అటు టాలీవుడ్.. ఇటు కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల ఆమె సినిమాలు చేయకపోయినా.. వెబ్ సిరీస్ ఝాన్సీతో ప్రేక్షకులను అలరించింది. ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా మరోసారి అంజలి పెళ్లి రూమర్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాాగా.. గతంలో ఆమె ఓ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వాటిని కొట్టిపారేసింది అంజలి. కానీ తాజాగా మరోసారి వార్తలు గుప్పుమనడంతో అతను ఎవరా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. టాలీవుడ్లో మహేష్ బాబు-వెంకటేష్ నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలో వెబ్ సిరీస్‌ల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా అరెంజ్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లాడబోతోందని సమాచారం. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అంజలి తల్లిదండ్రులు యుఎస్‌లో ఉన్నారు. గతంలో పలుసార్లు పెళ్లి వార్తలొచ్చినప్పటికీ మరోసారి పెళ్లి చేసుకోబోతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ ఆర్సీ15లో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అంజలి పెళ్లి చేసుకోనుందని సమాచారం. -
అంజలి సూపర్ హిట్ వెబ్‌సిరీస్ 'ఝాన్సీ'కి సీక్వెల్
తమిళ సినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ఝాన్సీ. ట్రైబల్ హార్స్ ఎంటర్టైన్మెంట్పై నటుడు కృష్ణ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కు తిరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొదటి భాగం డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యి విశేష ఆదరణను పొందింది. తాజాగా ఝాన్సీ రెండో భాగం గణతంత్ర దినోత్సవం సందర్భంగా అదే ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ నిర్మిస్తున్న కృష్ణ మాట్లాడుతూ.. నిజానికి ఈ వెబ్ సిరీస్‌ను తెలుగులో రూపొందిస్తున్నామని.. తమిళం, హిందీ భాషల్లో అనువాదంగా స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ వెబ్‌సిరీస్ తొలి భాగం కంటే రెండో భాగానికి మరింత ఆదరణ లభిస్తోందని అన్నారు. ఝాన్సీ వెబ్ సిరీస్ మూడో భాగాన్ని రూపొందిస్తామని చెప్పారు. నిర్మాతగా కొనసాగుతున్న తాను కథానాయకుడిగా నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని తెలిపారు. త్వరలోనే తాను నటించే నూతన చిత్రం వివరాలను వెల్లడిస్తానని కృష్ణ చెప్పారు. దర్శకుడు తిరు మాట్లాడుతూ.. దీన్ని తెలుగులో రపొందించినా తమిళ ప్రేక్షకులకు నచ్చే విధంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇప్పుడు హిందీలోన మంచి ఆదరణ లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఎంతగానో శ్రమించిన నటి అంజలి, చాందిని, యూనిట్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. -
Pravasi Bharatiya Divas: విదేశాల్లో ఉన్నా స్వదేశంలో సేవ
జీవితంలో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లినవారు తమను తాము నిరూపించుకునే దిశగా సాగుతారు. కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమించడంతో పాటు తమ చుట్టూ ఉన్నవారికి చేయూతనివ్వాలనుకుంటారు. తమ మూలాలను గుర్తుపెట్టుకొని సొంత గడ్డ అభ్యున్నతికి పాటుపడాలని తపిస్తుంటారు. వారి ఆలోచనలతో మరికొందరి అడుగులకు స్ఫూర్తిగా నిలుస్తారు. విదేశాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో కృషి చేస్తూనే సేవా కార్యక్రమాల ద్వారా స్వదేశంలో ఉన్నవారికి చేయూతనందిస్తున్నారు విజయవాడ వాసి అయేషా, ఖమ్మం జిల్లా వాసి ఝాన్సీ. పిల్లలకు కష్టం విలువ తెలియాలని.. విజయవాడ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు ఆయేషా. ఉద్యోగం, కుటుంబం బాధ్యతలతో బిజీగా ఉన్న ఆమె సేవాకార్యక్రమాలవైపు మళ్లిన ఆలోచనావిధానం గురించి తెలిపారు. ‘మా కుటుంబంతో కాలిపోర్నియాలో స్థిరపడ్డాను. నేను చేస్తున్న సేవాకార్యక్రమాలకు ఇటీవల నాన్‌ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ కూడా అందుకున్నాను. ఉద్యోగినిగా ఉన్న నేను మొదట ఒక తల్లిగా మా పిల్లలకు సేవా ప్రపంచాన్ని పరిచయం చేయాలనుకున్నాను. అదే సమయంలో మా చుట్టుప్రక్కల ఉండే పిల్లల పరిస్థితి గమనించాను. పిల్లల్లో మానవతా విలువలు పెంచాలని కమ్యూనిటీ సర్వీస్ చేయాలనే సదుద్దేశంతో ఏడేళ్ల క్రితం ఎంపవర్ అండ్ ఎక్సెల్ సంస్థని ప్రారంభించాను. ఇప్పుడు వందలాది మందికి పైగా వలెంటీర్లు మా ఆర్గనైజేషన్‌లో సేవలందిస్తున్నారు. మా అమ్మనాన్నలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. వారిని చూడటం కోసం మొదట మా పిల్లలను తీసుకొని ఇండియాకు వచ్చేదాన్ని. మారుమూల గ్రామాల్లోని పాఠశాల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, ఆ స్కూళ్లలో లైబ్రరీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. స్వచ్ఛందంగా పనిచేసే మిత్రులు కొందరు పరిచయమయ్యారు. వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంటూ అమెరికాలో మేమున్న ప్రాంతంలో సేకరించిన పుస్తకాలను ఆంధ్రాలోని గ్రామాల స్కూళ్లకు అందజేసేవాళ్లం. ఈ కార్యక్రమం ప్రతియేటా నిర్వహించేవాళ్లం. నాతోపాటు ప్రతి యేటా వలెంటీర్లుగా వర్క్ చేసే పిల్లలు కనీసం పదిమందినైనా ఇండియాకు తీసుకువచ్చేదాన్ని. వారితో ఇక్కడి స్కూల్ పిల్లలకు వర్క్‌షాప్స్ కండక్ట్ చేసేదాన్ని. ఆ తర్వాత సమస్యలు తెలుస్తున్న కొద్దీ వాటి మీద దృష్టి పెడుతూ వచ్చాను. అందరం ఉపాధి కోసం విదేశాలకు వచ్చినవాళ్లమే. కాని మా మూలాలను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ పరిస్థితులలోనే స్వదేశంలోని పిల్లలకు సర్వీస్ చేయాలనుకున్నాను. ట్రైబల్ ఏరియాలోని పిల్లలకు మా సేవలు అందేలా కృషి చేస్తుంటాను. స్వచ్ఛంద సంస్థల ద్వారా మా సేవకార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. నిరుపేదలకు ఏదైనా సాయం కావాలని మా దృష్టికి వస్తే ఇక్కడ ఫండ్ రైజింగ్ కి వెబ్సైట్ లో ప్రకటిస్తాం. ఇప్పటి వరకు మనవాళ్లు ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు’’ అని తెలిపారు ఆయేషా. మహిళల శ్రేయస్సు కోసం.. ఖమ్మం జిల్లా వాసి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. అమెరికాలో రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ముద్ర వేశారు. మహిళలు, బాలికల సంక్షేమం కోసం అక్కడే ‘వెటా’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి, వివిధ కార్యక్రమాల ద్వారా సేవలందిస్తున్నారు. అలాగే, పుట్టి పెరిగిన గడ్డకు మేలు చేయాలనే ఆలోచనతో స్వదేశంలోనూ సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ‘‘లక్ష్యం పెద్దదిగా ఉండాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని సాధించే దిశగానే మన అడుగులు ఉండాలి. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ అమెరికా వెళ్లి, అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను. పిల్లలు పుట్టాక వారిని చూసుకునే క్రమంలో ఉద్యోగాన్ని మానేసి, రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాను. ఒక మహిళ ఏం చేస్తుంది ఈ రంగంలో అనుకునేవారికి నా విజయం ద్వారానే సమాధానం చెప్పాను. అమెరికాలోని మన భారతీయ మహిళల సమస్యల గురించి అర్థం చేసుకున్నాను. సొంతంగా ఎదగాలనుకునేవారు, ఉద్యోగాలు చేయాలనుకునేవారు, గృహహింస వంటి బాధలు పడేవారు .. అన్ని రకాలుగా జీవితంతో పోరాటం చేసేవారున్నారు. అలాంటివారి శ్రేయస్సు కోసం పనిచేయాలని ‘వెటా’ను స్థాపించాను. మన విజయాలను మన అనుకున్న నలుగురికి కూడా పంచాలి. మా సొంత ఊళ్లకు వచ్చినప్పుడు అక్కడి పరిస్థితులను గమనించి అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ వచ్చాం. మా ఊరు బనిగండ్లపాడు గ్రామంలోనే కాదు, మా వారు పుట్టి పెరిగిన వరంగల్ జిల్లా తొర్రూరులోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గ్రంథాలయాలను ఏర్పాటు చేశాం. స్కూల్ భవనాలను కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాం. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాం. గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాం. మా చుట్టుçపక్కల మరో ఆరుగ్రామాల వరకు మా సేవలు అందిస్తుంటాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది మా ఆలోచన. అందుకే, పేద విద్యార్థులకు ప్రతియేటా ఆర్థిక సాయం చేస్తుంటాం. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మాకు చేతనైంత సాయం అందించాలన్నదే మా సిద్ధాంతం. ముందుగా మనకు మనంగా ఎదగాలి. అందుకోసం ఎంతటి కష్టమైనా పడాలి. అలాగే, నలుగురి మేలు కోసం పాటుపడినప్పుడే మన జీవితానికి సంతృప్తి లభిస్తుంది’’ అని వివరించారు ఝాన్సీరెడ్డి. -
సావిత్రి గురించి షాకింగ్ విషయం చెప్పిన సీనియర్ నటి ఝాన్సీ
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు ఓ అద్దే ఇంట్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతోంది. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె చెన్నైలో లగ్జరీ ఇంట్లో రాజసంగా బ్రతికారు. కానీ ఒక్క మూవీ ఫ్లాప్‌తో ఆస్తులన్నీ అమ్మేసిన పరిస్థితి ఎదురైంది. దీంతో హైదరాబాద్‌లోని ఓ చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఆమె. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ పుట గడవడం కూడా ఇబ్బందిగా మారిందట ఆమె జీవితం. చదవండి: అందుకే అప్పుడు సమంతను.. ఇప్పుడు దీపికాను ట్రోల్ చేస్తున్నారు: నటి రమ్య స్క్రీన్ హీరోయిన్గా, నటిగా ఆకట్టుకున్న ఆమె కళ్లతోనే హావభావాలను పలికించేవారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ చాలా ఏళ్ల తర్వాత తెరముందుకు వచ్చారు. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌తో ఆమె ముచ్చటిస్తూ తన వ్యక్తిగత జీవితం గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అలాగే మహానటి సావిత్రి గురించిన ఓ షాకింగ్ విషయం రివీల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎక్కువగా ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. సావిత్రి, కేఆర్ విజయలతో మాట్లాడేదాని. అంతేకాదు తరచూ సావిత్రి ఇంటికి కూడా వెళ్లేదాన్ని. నాకంటే ముందే సావిత్రిగారు సినిమాల్లోకి వచ్చారు. తననే స్ఫూర్తిగా తీసుకుని నటించేవాళ్లం. తెరపై ఆమె అందంగా, హావభావాలను పలికించేవారు. సావిత్రిలా నటించాలని నటనలో తనని అనుసరించేవారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పుకొచ్చారు. అయితే సావిత్రి చివరి రోజుల్లో వెళ్లి చూశారా? అని ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో సావిత్రిని చూడలేకపోయానని బాధపడ్డారు. అసలు ఆవిడని చూడలేకపోయేవాళ్లమంట. అంత మనిషి చిన్న పిల్లలా అయిపోయారట. అందుకే తనని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేనని నేను వెళ్లలేదు. చదవండి: విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి అయితే ఎంతో రాజసంగా బతికిన సావిత్రి గురించిన ఓ వార్త నన్ను చాలా బాధించింది. అనారోగ్యం కారణంగా ఆమె కొన్ని నెలలు కొమాలో ఉన్నారు. ఆ సమయంలోవైద్యం చేయించేందుకు డబ్బుల ఆమె భర్త జెమిని గణేశన్ ఓ ప్రకటన ఇచ్చారు. సావిత్రి చికిత్స కోసం డబ్బు కావాలని, దాతలు ఈ అడ్రస్ డబ్బు పంపించగలరు అంటూ ఆయన పత్రిక ప్రకటన ఇచ్చారు. అది చూసి నేను చాలా బాధపడ్డాను. ఎంతో ధనవంతురాలు, మహానటి అయిన ఆమె జీవితం చివరికి ఇలా అయ్యిందేంటని అనిపించింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరిగా.. జాగ్రత్తపడకపోవడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే సావిత్రి జీవితం ఇలా అయ్యిందేమో అని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఒక్క సినిమా ఫ్లాప్ కావడంతో ఆస్తులన్నీ అమ్మేసుకున్నాం : సీనియర్ నటి
సీనియర్ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఒకప్పుడు చెన్నైలో లగ్జరీ ఇంట్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ ప్రతినెలా గడవడం కూడా ఇబ్బందిగా మారిందట. చాలా కాలం తర్వాత స్క్రీన్ ముందు కనిపించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వివరించింది. ''ఇంతకు ముందు చెన్నైలో ఉండేవాళ్లం. కానీ ఇండస్ట్రీ హైదరాబాదుకు రావడంతో మేం కూడా వచ్చేశాం. అయితే ఇక్కడికి వచ్చాక నాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడే సొంత బ్యానర్‌ను ఏర్పాటు చేసి సినిమాలు నిర్మించాం. సుమన్‌తో 'ఖైదీ ఇన్ స్పెక్టర్' అనే సినిమాను తీశాం. ఆ మూవీ బాగానే ఆడినా డబ్బులు మా వరకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నిర్మించి బాగా నష్టపోయాం. దీంతో చెన్నై, హైదరాబాద్‌లోని ఇళ్లన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాం. ఇక నా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాను. అయితే పెళ్లి అయ్యాక వాళ్ల భార్యలతో కలిసి నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా జీవిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. -
విషాదం.. యుద్ధ ట్యాంకర్ పేలి ఇద్దరు సైనికులు మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఝాన్సీలో విషాదం జరిగింది. సైనికులు ఏటా నిర్వహించే ఫీల్డ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ సమీపంలోని బబినా కంటోన్మెంట్ ప్రాంతంలో విన్యాసాలు నిర్వహించే సమయంలో టీ-90 యుద్ధ ట్యాంకర్ బ్యారెల్ పేలింది. మూడో తరానికి చెందిన ఈ ట్యాంకర్‌ను రష్యా తయారు చేసింది ఈ దర్ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తీవ్ర గాయాలైనప్పటికీ అతనికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. . పేలుడు జరిగిన సమయంలో ట్యాంకర్లో ముగ్గురు సైనికులు ఉన్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. కమాండర్, గన్నర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడని పేర్కొన్నాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు సైనికాధికారులు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో తవాంగ్‌లో సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆ మరునాడే ఝాన్సీలో మరో ప్రమాదం జరిగి ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
Jhansi Reddy: మనలోని సమర్థతకు మనమే కేరాఫ్ అడ్రస్..
సమస్యతో పాటు పరిష్కారం కూడా మన వెన్నంటే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకొని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందడుగు వేసేవారే ఎప్పుడూ విజేతలుగా నిలుస్తారు. అందుకు సరైన ఉదాహరణ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి. తెలంగాణలోని ఖమ్మం జిల్లావాసి ఝాన్సీరెడ్డి విద్య, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. పురుషాధిక్య ప్రపంచమైన రియల్ ఎస్టేట్ రంగంలో తన సత్తా చాటడంతో పాటు, అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల ఉన్నతికి పాటుపడుతూ, పుట్టిన గడ్డకు సాయమందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఝాన్సీరెడ్డిని పలకరిస్తే ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచారు. ‘‘నా శక్తి ఏంటో నాకు తెలుసు. అందుకే, ఏ పనిని ఎంచుకున్నా అందులో సంపూర్ణ విజయాన్ని సాధించేదాకా వదలను. నేను పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లా మధిర దగ్గర బనిగళ్లపాడు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే. నా చిన్నతనంలోనే మా నాన్న చనిపోవడంతో పెద్దనాన్నతో పాటు అమెరికా వెళ్లిపోయాను. అక్కడే టెన్త్ పూర్తయ్యాక సెలవుల్లో ఇండియాకు వచ్చాను. పదహారు సంవత్సరాల వయసులో పెళ్లి అయింది. సాధారణంగా భర్త వెంట భార్య అమెరికా వెళ్లడం చూస్తుంటాం. కానీ, నా విషయంలో ఇది రివర్స్ అయ్యింది. మా వారు కార్డియాలజిస్ట్ కావడం, మేం న్యూజెర్సీలో సెటిల్ అవడం... ఏడాదిలోనే జరిగిపోయాయి. పెళ్లయ్యింది కాబట్టి ఇక ఇంట్లోనే కూర్చోవచ్చు కదా అనుకోలేదు. చదువుకుంటూనే ఉద్యోగం చేసేదాన్ని. ఏ దేశం లో ఉన్నా భార్యాభర్త ఇద్దరూ పనిచేస్తేనే వారి కుటుంబంతో పాటు వారి జీవితాలు కూడా వృద్ధిలోకి వస్తాయని నమ్ముతాను. అలా ప్లస్ టూ పూర్తవగానే బ్యాంకింగ్ రంగంలోకి వెళ్లాను. కానీ, పై చదువులు చదవాలన్న ఆసక్తి ఎక్కువ. అదే సమయంలో బ్యాంకు కూడా ఫైనాన్సింగ్ క్లాసెస్ ఆఫర్ చేసింది. దీంతో సాయంత్రాలు చదువుకుంటూ, పగటి వేళ ఉద్యోగం చేశాను. ప్రమోషన్లు వచ్చాయి. పిల్లలు పుట్టడంతో వారి బాగోగులు చూసుకునే క్రమంలో ఉద్యోగానికి ఫుల్స్టాప్ పడింది. ఈ సమయంలోనూ ఖాళీగా లేకుండా మా వారి హాస్పిటల్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకున్నాను. అమెరికా.. రియల్ ఎస్టేట్ డాక్టర్‌గా మా వారి సంపాదన బాగానే ఉంది. దీంతో ఓ చిన్న స్థిరాస్తి కొనుగోలు చేశాం. అప్పుడే ఓ ఆలోచన వచ్చింది. ‘ఈ స్థిరాస్తిని కేవలం పెట్టుబడిగానే ఎందుకు చూడాలి, ఇదే వ్యాపారం చేస్తే బాగుంటుంది’ అనుకున్నాను. కానీ, ఈ రంగంలో మహిళలు ఉన్నట్టు ఎవరూ కనిపించలేదు. ఇండియా–అమెరికా ఏ దేశమైనా ఈ రంగంలో మహిళల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టచ్చు. అంతటా పురుషాధిపత్యమే. చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని తెలుసు. అయినా, పాతికేళ్ల క్రితం ‘రాజ్ ప్రాపర్టీస్’ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ప్రారంభించాను. ఎందుకొచ్చిన రిస్క్ అన్నవారూ ఉన్నారు. విమర్శలనే కాంప్లిమెంట్‌గా తీసుకున్నాను. కొద్దికాలంలోనే ఈ రంగంలో మంచి పేరు సాధించాను. తెలుగు మహిళల కోసం.. అమెరికాలో చిన్నప్పటి నుంచి ఉన్నాను కనుక తెలుగువారి సమస్యలు బాగా తెలుసు. అందులోనూ తెలుగు అసోసియేషన్స్‌కు వచ్చిన మహిళలతో మాట్లాడుతున్నప్పుడు వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. దేశం మారుతున్నా మగవారి మనస్తత్వాలు, భావాలు మారడం లేదు. దీంతో తెలుగు కుటుంబాల్లో గృహహింస, గొడవలు, రకరకాల చికాకులతో మహిళలు అనేక మానసిక సమస్యలతో బాధపడుతున్న వారున్నారు. ఆర్థిక స్థిరత్వం లేదు. ఇలాంటి వాటన్నింటికి పరిష్కారంగా ఒక సంస్థ ఉండాలనుకున్నాను. అంతర్జాతీయంగా ఉన్న తెలుగు మహిళల కోసం ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ తెలుగు అసోసియేషన్ (వెటా) సంస్థను నాలుగేళ్ల్ల క్రితం ఏర్పాటు చేశాను. ఇందులో నిష్ణాతులైన మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థ ద్వారా తెలుగు మహిళలకు కావల్సిన ప్రేరణ, ప్రోత్సాహం, ఆసక్తి గల మహిళలందరికీ అందించాలన్నదే లక్ష్యం. మనలోని సమర్థత ఏంటో మనకే బాగా తెలుసు. ఏ రంగంలో మనం సమర్థవంతంగా రాణించగలమో గ్రహించి, ధైర్యంగా ముందడుగు వేయాలి. అప్పుడు అవకాశాలు కూడా వాటంతటవే వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటూ వెళ్లడంలోనే మన విజయం దాగుంటుంది. దీంతో మనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో పాటు మన చుట్టూ ఉన్న కొందరికైనా సాయం అందించగలం’’ అని వివరించారు ఈ ప్రవాస భారతీయురాలు. (చదవండి: నాట్య దీపిక.. దీపికారెడ్డి) పుట్టిన గడ్డకు సాయం అనుకున్న విజయాలను సాధించాను. పుట్టినగడ్డకు కొంతైనా సేవ చేయాలని.. ఖమ్మం జిల్లాలోని మా ఊరితోపాటు చుట్టుపక్కల ఊళ్లలో స్కూల్ భవనాలు కట్టించి, ప్రభుత్వానికి అప్పజెప్పాను. తొర్రూరులో హాస్పిటల్ కట్టించాను. వీటితోపాటు లైబ్రరీ, గ్రామపంచాయితీ ఆఫీసు వంటివి ఏర్పాటు చేశాను. పేద విద్యార్థులకు ఆర్థికసాయం అందించాను. – నిర్మలారెడ్డి ఫొటోలు: గడిగె బాలస్వామి -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
-
ఏపీ వెళ్లే రైలు కాదని దూకేశారు.. ఒకరు మృతి
లక్నో: ఒక రైలు ఎక్కబోయి మరో రైలు ఎక్కామన్న కంగారులో ఐదుగురు ప్రయాణికులు కదులుతున్న రైలు నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం రాత్రి యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని గోరఖ్‌పూర్‌లోని దేవ్‌కాళి ప్రాంతానికి చెందిన అజయ్ కుమార్ (35)గా రైల్వే పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అజయ్ తన అంకుల్ జగ్మోహన్, సోదరుడు విజయ్, తన స్నేహితులు సందీప్, సంజయ్‌లతో కలిసి ఆంధ్ర ప్రదేశ్ వెళ్లేందుకు బుధవారం రాత్రి ఝాన్సీ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. రాత్రి 12:30 గంటల సమయంలో ఏపీ రైలు అనుకుని వీరంతా ఢిల్లీ వైపు వెళ్తున్న ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కారు. రైలు కదిలిన కాసేపటికి ఢిల్లీ వెళ్తుందని తెలియడంతో కంగారు పడి ఏం ఆలోచించకుండా కదులుతున్న రైలు నుంచి దూకేశారు. అజయ్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. చదవండి: కోట్లు విలువ చేసే పదార్థం అమ్మే ప్రయత్నం.. ఇద్దరు అరెస్ట్ -
ఊరి దాహం తీర్చిన రియల్ హీరో సోనూసూద్
లక్నో: కరోనా కాలం నుంచి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియల్ హీరోగా నిలుస్తున్న సోనూసూద్ మరో మంచి కార్యక్రమం చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఏళ్లుగా నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామానికి మేలు చేశారు. వందలాది మంది ప్రజల దాహార్తి తీర్చారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యను సోనూసూద్ పరిష్కరించడంతో ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్తున్నామని.. తమ గ్రామానికి సహాయం చేయాలని ఆ గ్రామస్తులు సోనూసూద్‌కు ట్విట్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగినా స్పందన లేకపోవడంతో మిమ్మల్ని సంప్రదిస్తున్నామని ఆ గ్రామస్తులు చెప్పడంతో సోనూ స్పందించాడు. సూద్ ఫౌండేషన్ ప్రతినిధులు ఝాన్సీ గ్రామంలో బోర్ తవ్వించి నీటి వసతి కల్పించారు. చేతి పంపులను ఏర్పాటు చేయించాడు. దీంతో ఝాన్సీ గ్రామస్తులందరూ సోనూసూద్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. బోర్ తవ్వించిన వీడియోను సోనూ ట్విటర్లో షేర్ చేశారు. బోర్తు వేస్తుంటే ఆసక్తిగా గ్రామస్తులు గమనించడాన్ని తన మనసుకు హత్తుకుందని సోనూ పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు ఆ గ్రామంలో ఆ నీళ్లు తాగేందుకు వెళ్తానని ప్రకటించాడు. ప్రస్తుతం సోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్డౌన్ అనంతరం తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాలో సోనూ కనిపించాడు. ఇప్పుడు చిరంజీవి సినిమా ఆచార్యలో సోనూసూద్ నటిస్తున్నాడు. पानी की कमी अब से खत्म। आपके गांव में कुछ हैंडपंप लगवा रहा हूं । कभी आया तो पानी ज़रूर पिला देना। 🇮🇳@SoodFoundation https://t.co/bFqVjjcSO9 pic.twitter.com/6aRLnObPZ7 — sonu sood (@SonuSood) February 25, 2021 -
సైకో ఫ్రెండ్.. ఇద్దరిని కాల్చిపడేసిన పీజీ విద్యార్థి
లక్నో: పట్టపగలు తరగతి గదిలో ఓ పీజీ విద్యార్థి అతని సహచర విద్యార్థిపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని బుందేల్‌ఖండ్ కాలేజీలో చోటు చేసుకుంది. ఆ యువకుడు అంతటితో ఆగకుండా మరో యువతిపై కూడా కాల్పులు జరిపాడు. వివరాల్లోకి వెళ్లితే.. మంథన్ సింగ్ సెంగెర్ అనే పీజీ సైకాలజీ చదివే విద్యార్థి కాలేజీకి వెళ్లి తరగతిలో తుపాకితో తన స్నేహితుడు హుకుమేంద్ర సింగ్ గుర్జార్(22)ను కాల్చాడు. అనంతరం వింతగా ప్రవర్తిస్తూ.. తరగతి గదిలోని బోర్డు మీద ‘మంథన్ ఫినిష్డ్’ అని రాశాడు. తర్వాత సిప్రీ బజార్ ప్రాంతానికి వెళ్లి కృతికా త్రివేది అనే యువతిపై కాల్పులు జరిపాడు. గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా కృతికా త్రివేది మరణించింది. హుకుమేంద్ర సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. కాల్పుల శబ్దం వినిపించగానే కృతికా కుటుంబ సభ్యులు మంథన్ సింగ్‌ను పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మంథన్ సింగ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నివారి జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. హుకుమేంద్ర, కృతికా విద్యార్థులు ఇద్దరూ ఝాన్సీ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. వీరు ముగ్గురు 2016 నుంచి మంచి స్నేహితులని కళాశాలలో గుమాస్తాగా పని చేస్తున్న హుకుమేంద్ర మామ సంజయ్ సింగ్ తెలిపారు. తన స్నేహితులు అతని గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని కోపం పెంచుకున్న మంథన్ కాల్పులకు పాల్పడిట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్‌లో టెన్త్ పరీక్ష పేపర్.. ముగ్గురు అరెస్ట్ -
క్యాంపస్‌లో దారుణం: లైంగిక దాడి ఆపై వీడియో తీసి..
లక్నో : యూపీలోని ఝాన్సీలో కూతవేటు దూరంలో పోలీసు భద్రత నడుమ సివిల్ సర్వీసు పరీక్షలు జరుగుతుండగానే కళాశాల క్యాంపస్‌లోనే విద్యార్థిని(17)పై పాలిటెక్నిక్ కాలేజ్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు, అభ్యంతరకర వీడియోలు తీసి హింసించడం కలకలం రేపింది. యువతి తన బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు వెళుతుండగా ఈ దారుణం జరిగిందని, బాధితురాలి స్నేహితుడిపైనా నిందితులు దాడికి తెగబడ్డారని పోలీసులు చెప్పారు. పాలిటెక్నిక్ కాలేజ్‌కు చెందిన దాదాపు పన్నెండు మంది విద్యార్ధులు ఆదివారం తనను అడ్డగించి క్యాంపస్‌లోకి బలవంతంగా తీసుకెళ్లారని, వారిలో ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. మిగిలిన వారు ఈ దారుణాన్ని వీడియో తీశారని చెప్పారు. నిందితులు ఆమె వద్ద నుంచి 2000 రూపాయలు లాక్కున్నారని పోలీసులు తెలిపారు. భారీ పోలీసు భద్రత నడుమ ప్రొవిన్షియల్ సివిల్ సర్వీసుల (పీసీఎస్) పరీక్షలు జరుగుతున్న సమయంలో క్యాంపస్‌లో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. బాధితురాలి అరుపులు విన్న పోలీసులు అక్కడికి చేరుకోవడంతో దారుణ ఘటన వెలుగుచూసింది. లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని భరత్‌గా గుర్తించామని పోలీసులు చెప్పారు. నిందితులంతా పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్ధులని కళాశాల ప్రిన్సిపల్ నవీన్ కుమార్ తెలిపారు. వీరు హాస్టల్లో ఉంటున్న వారా కాదా అనేది నిర్ధారించాల్సి ఉందని, తాను ఆ సమయంలో పీసీఎస్ పరీక్షలతో బిజీగా ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. ప్రధాన నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశామని ఎస్ఎస్పీ దినేష్ కుమార్ వెల్లడించారు. చదవండి : నేడు హైకోర్టుకు హాథ్రస్ బాధిత కుటుంబం -
స్టేషన్లో పాట పాడి.. హగ్ గెల్చుకున్న భర్త
-
స్టేషన్లో పాట పాడి.. హగ్ గెల్చుకున్న భర్త
ఝాన్సీ: ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు.. విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. ఇక ఈ మొగుడు నాకు వద్దే వద్దంటూ కేసు పెట్టిందా భార్య.. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బెడిసికొట్టింది. ఇక లాభంలేదు. నా భార్య గురించి నాకే తెలుసు. నేనే నా భార్య కోపాన్ని పోగొడతాను అంటూ రంగంలోకి దిగాడా భర్త. (పెళ్లికి ముందు ‘గ్రేట్ ట్రైనింగ్’) ఇంతకీ ఏం చేశాడో తెలుసా?? ఓ పాట పాడాడు. పాటా అంటూ నోరు తెరవకండి.. ఆ పాటకు బోనస్‌గా అతని భార్య ప్రేమతో తిరిగి హగ్ ఇచ్చింది కూడా. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ ప్రాంతానికి చెందిన ఇద్దరు భార్యభర్తలు కొన్ని నెలల క్రితం గొడపడ్డారు. దాంతో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది భార్య. పెద్దలతో రాయబారం నడిపాడు భర్త. వినలేదు. ఇక తనతో కలిసి బతికేది లేదంటూ తెగేసి చెప్పింది. పోలీస్ స్టేషన్ కి భర్తని పిలిచారు పోలీసులు. నాకు నా భార్య కావాలని భర్త.. ఈ భర్త నాకొద్దంటూ భార్య. దాంతో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎంత నచ్చచెప్పినా భార్య వినలేదు. దాంతో భర్త లేచి భార్య ముందు నిల్చుని బద్లాపూర్ సినిమాలోని పాట అందుకున్నాడు. భర్త పాటకి అక్కడున్న వాళ్లందరూ షాక్ అవ్వగా భార్య మాత్రం తన్మయత్వంతో తన భుజంపై వాలిపోయి కన్నీటిపర్యంతమైంది. వీరిద్దరి ప్రేమ విజయాన్ని వీడియోలో బంధించి ట్విటర్ లో షేర్ చేశాడు ఐపీఎస్ ఆఫీసర్ మధుర్ వర్మ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
పొలాలపై మిడతల దాడి..
-
రాకాసి మిడతల దండుపై కెమికల్ స్ప్రే
జైపూర్ : పంట పొలాలను, వృక్షాలను నాశనం చేస్తున్న మిడతల దండును చంపేందుకు రంగం సిద్ధం చేయాలని ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లా యంత్రాంగం అగ్నిమాపక దళానికి ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజులుగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మిడతలు వ్యాపించాయి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల పొడవైన సమూహంతో ఉన్న ఈ మిడతల దండు ఒక్కసారిగా ఎగురుతూ పంట పొలాలపై దాడి చేస్తున్నాయి. దీంతో మిడతలను అంతం చేసేందుకు రసాయనాలు నింపిన వాహనాలతో పిచికారీ చేయాలని జిల్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (భూకంపం వచ్చినా ఇంటర్వ్యూ ఆపని ప్రధాని ) దీనిపై జిల్లా కలెక్టర్ ఆండ్రా వంశీ మాట్లాడుతూ.. మిడతలను చంపే ప్రక్రియ గురించి గ్రామస్తులందరికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. సాధారణంగా మిడతలు, పచ్చగడ్డి, పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సంచరిస్తాయన్నారు. అందువల్ల అవి తాము నివసించే ప్రదేశాల్లో, పొలాల్లో కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. దాదాపు 2.5 నుంచి 3 కిలోమీటర్లు పొడవైన సమూహంతో పెద్ద సంఖ్యలో మిడుతలు దేశంలోకి ప్రవేశించినట్లు తమకు వార్తలు అందినట్లు డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ అధికారి తెలిపారు. మిడుతల సమస్యలను పరిష్కరించడానికి రాజస్థాన్ నుంచి ఓ బృందం వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ మిడుతల సహూహం ఝాన్సీలోని బాంద్రా మాగర్పూర్ వద్ద ఉందని, పురుగు మందుల పిచికారీ రాత్రి సమయంలో జరుగుతందని ఆయన పేర్కొన్నారు. (సొంత చెల్లెలిపై అఘాయిత్యం..) -
మల్లేశం చూశాను.. హృదయాన్ని హత్తుకుంది : సమంత
సాక్షి, హైదరాబాద్: ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాను ప్రముఖ నటి సమంత అక్కినేని చూశారు. వాస్తవికతతో హృదయాన్ని హత్తుకునే కథతో మల్లేశం సినిమా తనకు ఎంతగానో నచ్చినట్టు ట్విటర్లో ఆమె తెలిపారు. ‘మల్లేశం సినిమాను చూశాను. అత్యంత వాస్తవికతతో, హృదయాన్ని హత్తుకునే కథతో తెరకెక్కిన సినిమాల్లో మల్లేశం ఒకటి. తెలంగాణ సంస్కృతిని, తల్లి కోసం ఓ కొడుకు పడే తపనను, ప్రేమను ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు. ప్రియదర్శి, ఝాన్సీల అభినయం అద్భుతంగా ఉంది’ అంటూ సమంత ట్వీట్ చేశారు. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె చేనేతగా మద్దతుగా ‘హ్యాండ్లూమ్’ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. చేనేత రంగంలో తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి.. ఆమె కష్టాన్ని తొలగించేందుకు ఆసుయంత్రాన్ని రూపొందించిన తెలంగాణ చేనేత వృత్తిదారుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. -
నాటక వైభవం
-
ఝాన్సీ ఆత్మహత్య కేసులో ప్రియుడికి కస్టడీ
హైదరాబాద్: టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ఆమె ప్రియుడు సూర్యతేజను 4 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పంజగుట్ట పోలీసులు శనివారం అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. నాగ ఝాన్సీ, సూర్యతేజలకు ఎప్పటి నుంచి పరిచయం, ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేసినా స్పందించకపోవడం, రూ.10 లక్షల విలువైన బంగారాన్ని సూర్యకు ఇచ్చినట్లు ఝాన్సీ తల్లి చేస్తున్న ఆరోపణలపై లోతుగా విచారించనున్నారు. -
తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ...
-
ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్య తేజకు రిమాండ్
హైదరాబాద్: టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియుడు మద్దాల సూర్య తేజ (30)ని మంగళవారం పంజగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, వివాహం చేసుకుంటానని నమ్మక ద్రోహం చేయడం 306, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తన సర్వస్వం సూర్యనే అనుకున్న ఝాన్సీ తన ప్రాణమైన నటనకు కూడా దూరమైంది. సూర్య మాత్రం ఆమెపై అనుమానం వ్యక్తం చే స్తూ తరచూ గొడవలు పెట్టుకునేవాడని విచారణలో తెలిసింది. ఆమె ఫోన్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టడంతోపాటు సూర్య ఇంట్లో వేరే సంబంధాలు చూడటంతో నాగ ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురయినట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకునే ముందు కూడా ఝాన్సీ ఫోన్ చేస్తే అతను స్పందించనట్లు తెలిసింది. తీవ్ర మనోవేదనకు గురైన ఝాన్సీ... గత ఏప్రిల్‌లో ఇద్దరికీ పరిచయం కాగా, జూన్‌లో ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. త్వరలో వివాహం చేసుకుంటామని జూలైలో ఝాన్సీ ఇంట్లో కూడా చెప్పారని తెలిపారు. ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్లి ఝాన్సీ వారం రోజులు అక్కడే ఉందన్నారు. సూర్య పుట్టినరోజు సందర్భంగా నవంబర్‌లో ఝాన్సీ కొంత డబ్బు అతనికి ఇచ్చిందని, దాంతో బైక్ కొనుగోలు చేశారని తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉండగా అనంతరం ఇద్దరి మధ్యా చిన్న గొడవలు ప్రారంభమయ్యాయన్నారు. ఝాన్సీ నటించడం, వేరేవారితో మాట్లాడటం సూర్యకు నచ్చేది కాదని, దీంతో ఆమె నటన కూడా మానేసిందని తెలిపారు. ఈ క్రమంలో జనవరి నుంచి సూర్యకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని తెలియడంతో ఝాన్సీ తీవ్ర మనోవేదనకు గురైందన్నారు. ఆత్మహత్య చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సూర్యతో మాట్లాడలేదని, కాని ఆత్మహత్య చేసుకునే ముందు సూర్యకు ఫోన్ చేయగా అతను స్పందించలేదన్నారు. మెసేజ్‌లు పెట్టినా అప్పుడు సూర్య ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఉండటంతో అతను అవి చూసుకోలేదని, తర్వాత నెట్ ఆన్ చేసినా ఝాన్సీ ఆ మెసేజ్‌లను డెలీట్ చేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత సూర్య పలు మెసేజ్‌లు పెట్టినా ఆమె నుంచి స్పందన రాలేదని వివరించారు. -
సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య
-
సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యతేజనే కారణం అని పోలీసులు తేల్చారు. దీంతో అతనిపై ఐపీసీ సెక్షన్ 306, 417 ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సూర్య వేధింపుల కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలింది. ఆమె చనిపోవడానికి కొన్నిగంటల ముందు సూర్యకు ఫోన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఝాన్సీని సూర్య తీవ్రస్థాయిలో మందలించడంతో మనస్తాపం చెందిన ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. గతకొంత కాలంగా ఝాన్సీని ఆమె ప్రియుడు సూర్య మానసికంగా వేధిస్తున్నాడని, ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతంగా నటనను మాన్పించాడని పోలీసులు పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవాంటే నటన మానేయాలని ఆంక్షలు విధించాడని, ఆ తరువాత అతను మోసం చేయడంతో ఝాన్సీ ఆత్మహత్య చేసుందని పోలీసులు తెలిపారు. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిత్రం సూర్యని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారివద్దనున్న ఆధారలతో ఆయనను అరెస్ట్ చేశారు. -
ఝాన్సీని గిరి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు..
సాక్షి, హైదరాబాద్ : సంచలనం రేపిన టీవీ సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఝాన్సీ ప్రియుడు సూర్యను ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్య పలు కొత్త విషయాలు బయటపెట్టాడు. ఝాన్సీకి బాబి, గిరి అనే ఇద్దరు ఫోటో షూట్ చేసేవారని సూర్య తెలిపాడు. అయితే వారిద్దర్నీ నమ్మొద్దని ఝాన్సీని తాను పలుమార్లు హెచ్చరించానన్నాడు. సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తామని వారు ఆమెను మోసం చేశారని సూర్య తెలిపాడు. (అనుమానమే అవమానమనుకుంది) గిరి పలుమార్లు ఇబ్బంది పెట్టాడని ఝాన్సీకి తనకు చెప్పిందన్నాడు. దాంతో గిరికి ఒకసారి వార్నింగ్ కూడా ఇచ్చానన్నాడు. సినిమా ఆఫర్లు తగ్గడంతోనే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని సూర్య పోలీసుల విచారణలో వెల్లడించాడు. సూర్య చెప్పిన దాని ప్రకారం బాబి, గిరిని కూడా పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం. సూర్య ఝాన్సీని ట్రాప్ చేశాడు : దుర్గ మధుతో కలిసి సూర్య ఝాన్సీని ట్రాప్ చేశాడని ఆమె సోదరుడు దుర్గ ఆరోపించారు. సూర్య ముందు మధును ప్రేమించాడని తెలిపారు. ఈ క్రమంలో మధునే.. ఝాన్సీని సూర్యకు పరిచయం చేసిందన్నాడు. ఆ తరువాత సూర్య మధును వదిలేసి ఝాన్సీని ప్రేమించాడని వెల్లడించాడు. మధునే ఝాన్సీని మిస్‌గైడ్ చేసిందని దుర్గ ఆరోపించాడు. -
ఝాన్సీ, సూర్య మధ్యలో మధు..!
-
ఝాన్సీ ఆత్మహత్య కేసు: విచారణలో కొత్త విషయాలు
-
వాళ్లను నమ్మొద్దని చెప్పా: ఝాన్సీ ప్రియుడు సూర్య
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ ప్రియుడు సూర్య పోలీసుల విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ కేసుతో సంబంధం ఉందంటు ఇద్దరి పేర్లను బయటపెట్టాడు. బాబీ, గిరి అనే వ్యక్తులు ఝాన్సీకి ఫోటో షూట్ చేసేవారని తెలిపాడు. బాబీ, గిరిలను నమ్మొద్దని, ఫోటో షూట్లు ఆపేయాలని ఝాన్సీకి చెప్పినట్లు వెల్లడించాడు. గిరి ఇబ్బంది పెడుతున్నాడని ఝాన్సీ తన వద్ద ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నాడు. గిరికి వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. -
ఝాన్సీ, సూర్య మధ్యలో మధు!
సాక్షి, హైదరాబాద్: సీరియల్ నటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఆదివారం ఆమె ప్రియుడు సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఝాన్సీ ప్రియుడు సూర్య ఇదివరకే మధు అనే సీరియల్ నటితో ప్రేమ వ్యవహారం నడిపాడని, ఆ తర్వాత మధుకు బ్రేకప్ చెప్పిన సూర్య, ఝాన్సీని ప్రేమించినట్లు తెలుస్తోంది. మధు సహాయంతోనే అతడు ఝాన్సీని ట్రాప్ చేశాడని సమాచారం. సూర్య మాజీ ప్రియురాలు మధునే ఝన్సీని అతనికి పరిచయం చేసినట్లు తెలుస్తోంది. ఝాన్సీ.. సూర్య పుట్టిన రోజు కానుకగా రెండు లక్షలు విలువ చేసే బైక్‌ను, ఆ తర్వాత 10 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలను సైతం అతడికి ఇచ్చినట్లు సమాచారం. -
పోలీసులు అదుపులో సూర్య
-
పోలీసుల అదుపులో సూర్య..
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి సువ్వాడ నాగ ఝాన్సీ (21) సూసైడ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆమె ప్రియుడు సూర్యతేజను పంజాగుట్ట పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ప్రశ్నిస్తున్నారు. కాగా అమీర్‌పేటలోని తన నివాసంలో ఉరేసుకొని ఝాన్సీ గత మంగళవారం బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తన కూతురు ఆత్మహత్యకు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. (ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం) పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఝాన్సీ తల్లీ, సోదరుడు ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసుకున్న పోలీసులు నాని అలియాస్ సూర్యతేజను అదుపులోకి తీసుకున్నారు. ఝాన్సీ, సూర్య మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య విబేధాల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
‘వేధింపులవల్ల షూటింగ్ కూడా మానేసింది’
హైదరాబాద్: తన కూతురు ఆత్మహత్యకు ఆమె ప్రియుడు సూర్యతేజనే పూర్తి కారణమని, నమ్మించి మోసం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని టీవీ నటి ఝాన్సీ తల్లి సంపూర్ణ, సోదరుడు దుర్గాప్రసాద్ కోరారు. పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో శనివారం వారిద్దరూ వాంగ్మూలమిచ్చారు. ఝాన్సీని నమ్మించి మోసం చేసిన సూర్యతేజ వైనాన్ని, అందుకు వారి వద్దనున్న ఆధారాలను పోలీసులకు అందించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..తన కూతురు వివాహానికని రూ.10లక్షల బంగారం చేయించి ఆమెకు ఇచ్చానని, ఝాన్సీని నమ్మించి ఆ బంగారాన్ని సూర్యతేజ తీసుకున్నాడని తెలిపింది. అతడి పుట్టిన రోజున రూ.లక్షా 30 వేల విలువైన బైక్‌ను కానుకగా ఇచ్చిందని వారు వెల్లడించారు. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని సూర్యతేజ బంధువుల ఇంటికి కూడా ఝాన్సీని తీసుకు వెళ్లాడని..అప్పట్నుంచి నుంచి వేధిస్తున్నాడని సంపూర్ణ, దుర్గాప్రసాద్‌లు తెలిపారు. అతడి వేధింపులవల్లే షూటింగ్ కూడా వెళ్లడం మానేసిందన్నారు. ఇప్పుడు తప్పించుకునేందుకు వేరేవారితో సంబంధం అంటగడుతున్నాడని వాపోయారు. మానసికంగా కుంగి పోయి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. వెంటనే సూర్యతేజను అరెస్టు చేసి తమకు తగిన న్యాయం చేయాలని కోరారు. -
తన కూతురు ఆత్మహత్యకు సూర్య తేజనే కారణం
-
ఝాన్సీ ఆత్మహత్యకు అతడే కారణం
సాక్షి, హైదరాబాద్: తెలుగునాట సంచలనం రేపిన టీవీ నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసును పోలీసుల చేదించారు. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే ప్రధాన కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. శనివారం ఝాన్సీ ఇంటిని తనిఖీ చేసిన పంజాగుట్టు పోలీసులు కుటంబ సభ్యుల నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అనంతరం కుటుబంసభ్యులతో సహా పలువురిని విచారించారు. ఝాన్సీ కాల్ డేటా, వాట్సప్ చాటింగ్ సంభాషణలపై దృష్టి సారించిన పోలీసులు.. అమె ప్రియుడు సూర్య ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝన్సీ సెల్‌ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసుల ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడు సూర్యనే కారణమని తేల్చారు. దీంతో సూర్య కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి: మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు.. టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్య -
టీవీ నటి ఝాన్సీ ఆత్మహత్యకు ప్రియుడే కారణం
-
ఇంకా తెరుచుకోని ఐఫోన్ లాక్
హైదరాబాద్: టీవీనటి ఝాన్సీ ఆత్మహత్య కేసులో కీలకంగా మారిన మొబైల్(ఐఫోన్) లాక్ ఇంకా తెరుచుకోలేదు. లాక్ తెరుచుకుంటే కేసు పురోగతి సాధిం చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న ఆమె ప్రియుడు సూర్యతేజ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం అతన్ని పట్టుకునే అవకాశముందని తెలుస్తోంది. ఝాన్సీ వినియోగించిన రెండో మొబైల్ శామ్సంగ్ ఫోన్ లాక్ తెరుచుకున్నా అందులో కీలక ఆధారాలేవీ లభించలేదు. కొన్ని వాట్సాప్ మెసేజ్‌లు డిలీట్ చేసి ఉన్నాయి. వాటిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు సీసీఎస్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఝాన్సీ కుటుంబ సభ్యు లు శనివారం కృష్ణా జిల్లా నుండి బయలుదేరి హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. వారి నుంచి వివ రాలు సేకరించి సూర్యతేజను అదుపులోకి తీసు కోనున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఝాన్సీ ఆత్మహత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
-
మూడు నెలలుగా ఝాన్సీకి వేధింపులు..
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి నాగ ఝాన్సీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఝాన్సీ కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ సంభాషణలపై పోలీసులు దృష్టి సారించారు. ఆమె ప్రియుడు సూర్య తేజ ప్రమేయంపై దర్యాప్తు చేపట్టారు. ఝాన్సీ సెల్ ఫోన్ లాక్‌ను ఓపెన్ చేసిన పోలీసులు ప్రియుడితో ఆమె చేసిన చాటింగ్ డేటాను రికవరీ చేశారు. మృతురాలి సెల్ఫోన్లో ఉన్న మెసేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పలువురితో ఝాన్సీ చేసిన వాట్సప్ చాటింగ్, మెసేజ్‌లతో పాటు కొన్ని వీడియోలను గుర్తించినట్లు పంజాగుట్ట ఏసీపీ తెలిపారు. వాటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడే సమయంలో చివరిసారిగా ప్రియుడు సూర్య తేజకు మెసేజ్ పంపినట్లు రికార్డు అయింది. అయితే ఆమె పంపించిన మెసేజ్‌కు సూర్య స్పందించకపోవడంతో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గత కొంతకాలంలో ఝాన్సీని సూర్య వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందంటూ, ఎవరితో మాట్లాడవద్దంటూ ఆంక్షలు విధించినట్లు సమాచారం. ఆ వేధింపులు శ్రుతిమించడంతో నెల క్రితం కూడా ఝాన్సీ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక చనిపోయే ముందు రోజు కూడా సూర్య-ఝాన్సీ మధ్య వివాదం ఏర్పడింది. ఆ తర్వాత ఝాన్సీ అర్థరాత్రి వరకూ సూర్యకు 14 మెసేజ్‌లు పంపించింది. అంతేకాకుండా ఫోన్ చేసినా సూర్య కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. -
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య కేసు దర్యాప్తు వేగవంతం
-
ఫోన్ లాక్ ఓపెన్ అయితేనే గుట్టు వీడేది!
హైదరాబాద్: బుల్లితెర నటి నాగ ఝాన్సీ ఆత్మహత్య కేసులో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలుగా భావిస్తున్న ఝాన్సీ 2 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒక ఫోన్ లాక్ ఓపెన్ కాగా అందులో ఉన్న మెసేజ్‌ల్లో కొన్ని ఆమె ప్రియుడు సూర్య తేజకు పంపి తిరిగి డిలీట్ చేసినట్లు గుర్తించారు. డిలీట్ చేసిన మెసేజ్‌లను సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు పంజగుట్ట పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరో ఐ ఫోన్ లాక్ ఎంత ప్రయత్నించినా తెరుచుకోవడంలేదని పోలీసులు గురువారం తెలిపారు. కాగా లాక్ ఓపెన్ అయిన ఫోన్లో పెద్దగా సమాచారం లేదు. ఝాన్సీ అన్న దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో సూర్య వేధింపుల వల్లే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఉండగా పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. దీంతో ఇప్పటివరకు సూర్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐఫోన్ లాక్ తెరిస్తే ఎన్నో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. కాగా గత నెలలో కూడా ఝాన్సీ ఓ సారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించినట్లు తెలిసింది. -
ఆఫీసర్ ఝాన్సీ
ఆరేళ్ల తర్వాత కన్నడంలో రాయ్‌లక్ష్మీ నటిస్తున్న సినిమా ‘ఝాన్సీ’. 2013లో వచ్చిన ‘అట్టహాస’ రాయ్‌లక్ష్మీ తొలి కన్నడ చిత్రం. ‘ఝాన్సీ’ చిత్రానికి పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. సినిమాలో ఆమె లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో కాగడా పట్టుకుని కోపంగా రాయ్‌లక్ష్మీ చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు కదూ. ఈ చిత్రంలో ఆమె కొన్ని రియల్ స్టంట్స్ కూడా చేశారు. ‘‘కన్నడంలో నా తర్వాతి చిత్రం ‘ఝాన్సీ’ లుక్‌ను విడుదల చేసి నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం త్వరలో విడుదలవుతుంది’’ అన్నారు రాయ్‌లక్ష్మీ. -
ఈ చిన్నారి ఫొటో.. వ్యవస్థను మార్చేస్తుందా?!
లక్నో : తల్లిగా మారిన తర్వాత కొత్త బంధాలతో పాటు బాధ్యతలు కూడా పెరగడం సహజం. ముఖ్యంగా ఉద్యోగినులకు వృత్తిగత బాధ్యతలతో పాటు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కాస్త సవాలుతో కూడుకున్న విషయమే. అయితే ఈ రెండింటినీ సమంగా నిర్వర్తిస్తున్నారు ఝాన్సీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ అర్చనా జయంత్. ఉద్యోగ కారణాల దృష్ట్యా కుటుంబానికి దూరంగా ఉన్నందు వల్ల.. తన ఆరునెలల పాపాయిని ఆఫీసుకు తీసుకొచ్చారు. తన క్యాబిన్‌లోనే చిన్నారికి పాలుపట్టి నిద్రపుచ్చారు. ఆనక ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోయారు. అర్చన క్యాబిన్లో టేబుల్‌పై నిద్రపోతున్న చిన్నారి ఫొటోను యూపీ పోలీసు అధికారి రాహుల్ శ్రీవాస్తవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘ఝన్సీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ‘మదర్కాప్’ అర్చనను కలవండి. మాతృత్వాన్ని చాటుకుంటూనే ఉద్యోగ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్న అర్చనకు సెల్యూట్ చేయాల్సిందే’ కదా అంటూ క్యాప్షన్ జత చేశారు. కొన్ని గంటల్లోనే ఈ ఫొటో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. అర్చనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ పోస్టుకు స్పందించిన యూపీ డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్.. ‘అర్చనతో మాట్లాడాం. వాళ్ల సొంతూరుకు దగ్గరగా ఉండే ఆగ్రాకు ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించాం. పోలీసు వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణల గురించి ఈ చిన్నారి ఫొటో మరోసారి గుర్తు చేసింది. పని ప్రదేశాల్లో తల్లులకు వీలుగా ఉండేందుకు శిశుసంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెడుతాం’ అని పేర్కొన్నారు. కాగా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన అనంతరం 2016లో అర్చన పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. ఆమె భర్త హర్యానాలోని గురుగ్రాంలో గల ఓ కార్ల తయారీ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి కనక్(10), ఆనీక(6 నెలలు) సంతానం. -
నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో
కృష్ణాజిల్లా, కొణిజెర్ల (గంపలగూడెం) : కొణిజెర్లలో మంగళవారం రాత్రి మృతి చెందిన ఝాన్సీ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బంధువులు, అదే సామాజిక వర్గానికి చెందిన వారు బుధవారం ఆందోళనకు దిగారు. మృతురాలు ఝాన్సీని వేధింపులకు గురిచేసిన నంభూరి గోపి ఇంటి వద్ద మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. కాగా గ్రామ పెద్దలు, యాదవ సంఘం నాయకులు కలిసి రాజీ చేయడంతో బుధవారం సాయంత్రం ఆందోళనకారులు ఆందోళన విరమించారు. సంఘటనకు దారితీసిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘నేను నిన్ను ప్రేమించాను.. నన్ను పెళ్లి చేసుకో’ అంటూ గోపి కొంతకాలంగా వెంటబడి వేధిస్తూ బెదిరింపులకు సైతం పాల్పడిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఝాన్సీ మంగళవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. సంఘటనపై మృతురాలి తండ్రి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామానికి చెందిన జోనెబోయిన శ్రీనివాసరావు ద్వితీయ కుమార్తె జోనెబోయిన ఝాన్సీ (20) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తోటమూలలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఆమె డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతోంది. రెండేళ్లుగా కొణిజెర్లకు చెందిన నంభూరి గోపి యువతి వెంటపడుతున్నాడు. ప్రతి రోజులాగే ఝాన్సీ మంగళవారం కళాశాలకు వచ్చి క్లాసులు ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు బయలుదేరింది. మార్గంలో గోపి అడ్డగించి వేధించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. బస్ ఎక్కిన తర్వాత కూడా అందరూ చూస్తుండగానే మళ్లీ ఝాన్సీని కొట్టాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఝాన్సీ పొలానికి బండిమీద వెళుతుండగా బీసీ కాలనీ వద్ద కలిసి తనను పెళ్లి చేసుకోమని లేకుంటే తన కుటుంబ సభ్యులను కూడా చంపుతానంటూ బెదరించాడు. ఈ పరిస్థితిలో ఝన్నీ పొలం వద్ద పురుగుల మందు తాగి తిరిగి బైక్‌పై వస్తూ కిందపడిపోయింది. అటుగా వెళుతున్న వారు చూసి ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. తన కుమార్తె మరణానికి నంభూరి గోపి వేధింపులే కారణమంటూ మృతురాలి కుటుంబీకులు, బంధువులు ఆందోళనకు దిగారు. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తహసీల్దార్ షాకీరున్నీసాబేగం, సీఐ సత్యనారాయణ, ఎస్ఐ సోమేశ్వరరావు పంచనామా చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తిరువూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో సంచలనం రేపింది. యుక్తవయస్సుకు వచ్చిన కూతురు బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరై రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే!
...చాలే ఇది చాలే అంటూ ఫుల్‌గా ఆనందపడిపోతున్నారు హీరోయిన్ రాయ్‌లక్ష్మి. ఈ సాంగ్ ‘గీతగోవిందం’ లోనిదే కావచ్చు. కానీ ఆ మూమెంట్‌ను ఇప్పుడు రాయ్‌లక్ష్మి కూడా ఫీల్ అవుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే.. దాదాపు ఆరేళ్ల తర్వాత కన్నడలో ‘ఝాన్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మీ. పీవీఎస్ గురుప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ రీసెంట్గా మొదలైంది. ఇందులో ఐపీఎస్ ఆఫీసర్ ఝాన్సీ పాత్రలో నటిస్తున్నారు రాయ్‌లక్ష్మి. ఈ సినిమా సెట్స్‌కు రాయ్‌లక్ష్మి తల్లి వెళ్లారు. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా? విషయం ఉంది. ‘‘నా సినీ కెరీర్ (దాదాపు పదకొండేళ్ల కెరీర్) లో ఫస్ట్ టైమ్ మా అమ్మగారు సెట్స్‌కు వచ్చారు. ఇంతకన్నా నాకు ఇంకేం స్పెషల్ ఉంటుంది. ఇది నా లైఫ్‌లో వన్నాఫ్ ది బెస్ట్ మూమెంట్స్’’ అని పేర్కొన్నారు రాయ్‌లక్ష్మి. ఇంతకు ముందు 2012లో వచ్చిన ‘కల్పన’ చిత్రంతో శాండిల్‌వుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు రాయ్‌లక్ష్మి. తమిళంలో వచ్చిన ‘కాంచన’ చిత్రానికి ఇది రీమేక్. అలాగే ప్రస్తుతం సౌత్‌లో బిజీగా ఉన్న ఈ అమ్మడు తెలుగులో ‘వేర్ ఈజ్ వెంకట్‌లక్ష్మి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆమె టీచర్ పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కిశోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. -
‘ఝాన్సీ’ మూవీ రివ్యూ
టైటిల్ : ఝాన్సీ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : జ్యోతిక, జీవి ప్రకాష్ కుమార్, ఇవానా, రాక్‌లైన్ వెంకటేష్ సంగీతం : ఇళయరాజా దర్శకత్వం : బాలా నిర్మాత : కోనేరు కల్పన శివపుత్రుడు, నేను దేవుణ్ని, వాడు వీడు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బాలా. రియలిస్టిక్ టేకింగ్, డార్క్ ఎమోషన్స్‌తో సినిమాలను తెరకెక్కించే బాలా.. జ్యోతిక ప్రధాన పాత్రలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళ్లో ఫిబ్రవరిలోనే రిలీజ్ అయిన నాచియార్ సినిమాను తెలుగులో ఝాన్సీ పేరుతో ఈ రోజు(శుక్రవారం) విడుదల చేశారు. మరి బాలా మార్క్ టేకింగ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా..? రఫ్ అండ్ టఫ్ పోలీస్ పాత్రలో జ్యోతిక ఏ మేరకు ఆకట్టుకున్నారు..? కథ ; మైనర్లయిన గాలి రాజు (జీవి ప్రకాష్ కుమార్), రాశి (ఇవానా) ప్రేమించుకుంటారు. రాశి గర్భవతి అవుతుంది. దీంతో గాలి రాజు మీద రేప్ కేసు నమోదు చేస్తారు. ఈ కేసును సిన్సియర్ ఆఫీసర్ ఝాన్సీ ( జ్యోతిక) డీల్ చేస్తుంది. రాశిని తన సంరక్షణలోనే ఉంచుకొని కేసు ఎంక్వయిరీ చేస్తుంటుంది. గాలిరాజును అరెస్ట్ చేసిన పోలీసులకు ఓ షాకింగ్ విషయం తెలుస్తుంది. రాశికి పుట్టిన పిల్లాడి డీఎన్ఏ, రాజు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవటంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు రాశి ఎవరి వల్ల గర్భవతి అయ్యింది..? ఈ కేసులో గాలి రాజు ఎలా ఇరుక్కున్నాడు..? కేసును ఝాన్సీ ఎలా సాల్వ్ చేసింది..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; ఇప్పటి వరకు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో కాస్త లైటర్‌వేలో తెరకెక్కిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. బాలా గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఎమోషన్స్, రా నెస్ కాస్త తక్కువగానే కనిపిస్తాయి. పాత్రల ఎంపిక, నటీనటుల నుంచి తనకు కావాల్సినది రాబట్టంలో తనకు తిరుగులేదని బాలా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు తెరమీద కనిపించిన జ్యోతిక డిఫరెంట్ రోల్లో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ గర్ల్గానే తెలిసిన జ్యోతికను రఫ్ అండ్ టఫ్ రోల్లో ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి. యువ నటుడు జీవి ప్రకాష్ తన కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. రాశి పాత్రతో వెండితెరకు పరిచయం అయిన ఇవాన నటన సూపర్బ్. ఇది ఆమెకు తొలి సినిమా అంటే నమ్మలేం. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమా నిడివి. క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన సినిమాను ఎక్కువగా సాగతీయకుండా ఒకటి రెండు సన్నివేశాల్లోనే అసలు కథ మొదలు పెట్టాడు బాలా. తొలి భాగంలో వచ్చే ఒకటి రెండు కామెడీ సీన్స్ తప్ప కథకు అవసరం లేని సన్నివేశాలు పెద్దగా కనిపించవు. ఇళయరాజా సంగీతం పరవాలేదనిపిస్తుంది. పాటలు పెద్దగా అలరించకపోయినా.. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. తెలుగు రిలీజ్ కోసం ప్రత్యేకంగా జాగ్రత్తలేవి తీసుకున్నట్టుగా అనిపించదు. తమిళ బోర్డులు, నేమ్ ప్లేట్లు తమిళ్లోనే కనిపిస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణవిలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : లీడ్ యాక్టర్స్ నటన కథా కథనం మైనస్ పాయింట్స్ ; తమిళ నేటివిటి డబ్బింగ్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ప్రతి మహిళా చూడదగ్గ చిత్రం
జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘ఝాన్సీ’. తమిళంలో ‘నాచ్చియార్’గా విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ శుక్రవారం ‘ఝాన్సీ’ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన కోనేరు కల్పన బుధవారం మీడియాతో మాట్లాడుతూ – ‘‘నాకు వ్యక్తిగతంగా జ్యోతిక గారంటే చాలా ఇష్టం. ఆమె నటన చాలా బాగుంటుంది. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా తన విశ్వరూపం చూపించారామె. ‘ఝాన్సీ’ చూసిన వెంటనే మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన సినిమా లాగా అనిపించింది. అందుకే యస్వంత్ మూవీస్ బ్యానర్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా తెలుగులో విడుదల చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలో చాలా బాగా చూపించారు దర్శకుడు బాలా. బాలాగారికి మన తెలుగులో కూడా చాలా మంచి పేరుంది. ఆయన గత చిత్రాలు శేషు, శివపుత్రుడు, వాడు–వీడు లాగానే మా ‘ఝాన్సీ’ కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు. -
ఆగష్టు 17న వస్తున్న జ్యోతిక ‘ఝాన్సీ’
జ్యోతిక ప్రధాన పాత్రలో తెరకెక్కిన కోలీవుడ్ మూవీ నాచియార్ చిత్రం తెలుగు లో ఝాన్సీ పేరుతో విడుదల కానుంది. కోనేరు కల్పన, డి.అభిరాం అజయ్ కుమార్‌లు కల్పనా చిత్ర మరియు యశ్వంత్ మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా ఆగస్టు 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సంచలన దర్శకుడు బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళనాడు మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యోతిక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం మందించగా యువ నటుడు జి వి ప్రకాష్ మరో కీలక పాత్రలో కనిపిస్తారు. -
ఝాన్సీగా...
జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘నాచియార్’. బాలా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని యశ్వంత్ మూవీస్, కల్పనా చిత్ర బ్యానర్‌పై ‘ఝాన్సీ’ పేరుతో డి. అభిరాం అజయ్‌కుమార్, కోనేరు కల్పన తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. పోలీసాఫీసర్ పాత్రలో జ్యోతిక టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. జ్యోతిక యాక్షన్, డైలాగ్స్ చూస్తుంటే తనలో నన్ను నేను చూసుకున్నా అని హీరో సూర్య అన్నారు. ఏ పాత్రనైనా ఛాలెంజింగ్‌గా చేయగల జీవీ ప్రకాష్ నటన ప్రేక్షకులను మెప్పించింది. ఇళయరాజాగారి సంగీతం ఈ సినిమా సక్సెస్‌కి ప్రధాన కారణం. త్వరలోనే ‘ఝాన్సీ’ టీజర్ రిలీజ్ చేయనున్నాం. చాలా రోజుల తర్వాత తెలుగులో వస్తున్న జ్యోతిక చిత్రం మాదే’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: యశ్వంత్ మూవీస్. -
ఝాన్సీగా జ్యోతిక
కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బాల దర్శక నిర్మాతగా తెరకెక్కించిన సినిమా నాచియార్. తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి.సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేస్తున్నారు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి జోత్యిక పోలీసాఫీసర్ పాత్రలో నటించారు. రిలీజ్‌కు ముందు వివాదాస్పదమైన జ్యోతిక పాత్రకు సినిమా రిలీజ్ తరువాత మంచి ప్రశంసలు దక్కాయి. యువ నటుడు జీవీ ప్రకాష్ మరో కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందించటం విశేషం. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షన్‌ను ఝాన్సీ పేరుతో విడుదల చేస్తున్నారు. చాలా కాలం తరువాత జ్యోతిక తెలుగు తెర మీద కనిపించనుండటం సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
హరి నటుడిగా మంచి స్థాయికి వెళ్తాడు
హరికృష్ణ జొన్నలగడ్డ హీరోగా జెఎస్ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘ప్రేమెంత పని చేసె నారాయణ’. అక్షిత, ఝాన్సీ, చిలుకూరి గంగారావు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాటలు, ట్రైలర్‌తో పాటు కొన్ని సీన్స్ చూశాను. హీరో హరి డ్యాన్స్‌లు, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. భవిష్యత్‌లో అతను మంచి స్థాయిలో ఉంటాడు. దర్శకుడు శ్రీనివాస్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఈ సినిమా ఆయనకు మంచి విజయంతో పాటు డబ్బుల్ని కూడా తీసుకు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసి, మా హరిని రవితేజ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను రిలీజ్ చేయనున్నాం. ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘రవితేజగారు నేను హీరోగా చేసిన సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయడం నా జీవితంలో మరచిపోలేని అనుభూతి. ఈ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. నా ప్రయత్నాన్ని వారు దీవిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు హరి. ఈ సినిమాకు సంగీతం: యాజమాన్య. -
హయత్‌నగర్‌లో దారుణం
హైదరాబాద్: హయత్‌నగర్‌లో నిన్న రాత్రి(బుధవారం) దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ప్రియురాలు, ఆమె స్నేహితురాలిపై యాసిడ్ దాడి చేశాడు. యాసిడ్ గాఢత తక్కువగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. వివరాలు..హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన శంకర్, ఝాన్సీలు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఝాన్సీ నగరంలోని ఓ పెట్రోలు బంకులో పనిచేస్తోంది. కొద్ది రోజుల క్రితం ఝాన్సీకి అదే పెట్రోలు పంపులో పనిచేస్తున్న రమ్య పరిచయమైంది. అప్పటి నుంచి ఝాన్సీ తనను పట్టించుకోవడం లేదని, తన గురించి రమ్య చెడుగా చెప్పిందని భావించి ఇద్దరిపై కోపం పెంచుకున్నాడు. పథకం ప్రకారం నిన్న రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరిపై బాత్రూంలో వాడే యాసిడ్‌తో దాడి చేశాడు. ప్రస్తుతం ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధినిచ్చిన నృత్యం
మంచిర్యాలక్రైం: చిన్నతనంలో డ్యాన్స్ చేస్తున్నప్పుడు బంధువులు, స్నేహితులు చప్పట్లు కొట్టేవారు. ఆ చప్పట్లే ఆమెను నాట్యం వైపు నడిపించాయి. ఆ నాట్యమే ప్రస్తుతం జీవానోపాధిని కల్పిస్తోంది. మంచిర్యాలకు చెందిన శనిగారపు ఝాన్సీటోని నాట్య ప్రస్థానం ఆమె మాటల్లోనే.. హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్ నిర్వహించిన డ్యాన్స్ ఈవెంట్ షోలో గోదావరిఖనికి చెందిన శనిగారపు వినయ్‌కాంత్(టోని)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరం డ్యాన్సర్లం. మా ఇద్దరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ప్రేమ వివాహం చేసుకున్నాం. ప్రస్తుతం ఒక బాబు ఫిన్ని రుబేన్(లిరిక్స్)(4) ఉన్నాడు. ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లు కావడంతో... ఇద్దరం డ్యాన్స్ మాస్టర్లం కావడంతో డ్యాన్స్‌నే వృత్తిగా మలుచుకుని గోదావరిఖని, మంచిర్యాలలో డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించాం. ప్రైవేటు పాఠశాలలోనూ, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఈవెంట్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాం. వివాహ అనంతరం మా ఇద్దరి కుటుంబాలు కలిశాయి. భర్త ప్రోత్సాహంతోనే నేను డ్యాన్స్ రంగంలో నిలదొక్కుకోగలిగాను. పలు చానెళ్లలో పాల్గొని నాకంటూ ఓ ప్రత్యేకమైన ముద్రను ఏర్పర్చుకున్నాను. 2016లో హైదరాబాద్‌లోని శిల్ప కళావేదిక ప్రాంగణంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర డ్యాన్స్ ఈవెంట్స్ పోటీల్లో పొల్గొని ప్రథమ బహుమతి రూ. 50 వేలు నగదు అవార్డు అందుకున్నాను. ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా నిర్మిస్తున్న ‘తుపాకి రాముడు’ చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటిస్తున్నాను. నేనూ మా ఆయన కలిసి ఇప్పటివరకు ప్రైవేటు కార్యక్రమాల్లో సుమారు 500కు పైగా ఈవెంట్స్ చేశాం. ప్రస్తుతం 30 మందికి ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్, భరతనాట్యం, తదితర డ్యాన్స్‌లో శిక్షణ ఇస్తున్నాం. ఎంతో మంది కళాకారులను తయారు చేస్తున్నాం. పేద కళాకారులను గుర్తిం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నాం. మహిళలపై వివక్ష వీడాలి... సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయి. ఒకప్పటితో పోలిస్తే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. వారు పురుషులకంటే ఎందులో తక్కువ లేరు. మహిళలకు అన్నిరంగాల్లో సమానత్వ హక్కులు కల్పించాలి. -
అవ్వ మందలించిందని యువతి ఆత్మహత్య
మద్దికెర : అవ్వ మందలించిందని ఓ యువతి హంద్రీ–నీవా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్ఐ మారుతి వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుంతకల్లు చెందిన భీమలింగ కుమార్తె ఝాన్సీ (20) అవ్వతాతల వద్ద(మద్దికెర) ఉంటోంది. ఇటీవల ఆమె సెల్ఫోన్లో ఎక్కువగా మాట్లడుతుండడంతో అవ్వ ఈశ్వరమ్మ మందలించింది. ఈక్రమంలో ఈనెల 12న గుంతకల్లుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి గ్రామ సమీపంలో ఉన్న హంద్రీ–నీవా కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మనవరాలి ఆచూకీ లభించకపోవడంతో ఈశ్వరమ్మ ఈనెల 15న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా వజ్రకరూర్ వద్ద శుక్రవారం ఝాన్సీ మృతదేహం లభించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సంపూర్ణేశ్‌బాబు గుర్తొచ్చాడు
శోభన్ కృష్ణ, ఝాన్సీ జంటగా రూపొందిన చిత్రం ‘సోగ్గాడే.. శోభన్‌కృష్ణ’. జింకా హరిబాబు దర్శకత్వంలో శ్రీశ్రీ నాగలక్ష్మి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాగీర్ ఉమాపతి గౌడ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘మంచి కుటుంబ కథాచిత్రమిది. హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. శోభన్‌కృష్ణ చక్కని నటన కనబరిచాడు. తన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.’’ అన్నారు. ‘‘ఈ చిత్రం టైలర్ చూసిన తర్వాత నాకు సంపూర్ణేశ్ బాబు గుర్తొచ్చారు. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది. తప్పకుండా హిట్ అయి టీమ్‌కి మంచి పేరు తీసుకొస్తుంది’’ అన్నారు నటి కవిత. శోభన్ కృష్ణ, ఝాన్సీ, జింకా హరిబాబు, రాగీర్ ఉమాపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలను చూశా..
చిన్నప్పుడు గోరుముద్దలు పెడుతూ... అమ్మ చందమామను చూపించేది. చంద్రుడు కనపడేవాడు... అమ్మ ప్రేమ చల్లని వెన్నెలలా అనిపించేది. ఝాన్సీ తల్లి శారద... తన బిడ్డకు దైవమార్గాన్ని చూపించింది. ఈ నిరాడంబర మార్గంలో... దేవుడిని ఆర్తిగా తలుచుకుంటే చాలు కనపడతాడు... ప్రేమగా పిలిస్తే చాలు... పలుకుతాడు. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు ఝాన్సీ. యాంకర్‌గా మనకు సుపరిచితమే! ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న ఝాన్సీ ఇంటికి వెళ్లినప్పుడు ఇంటి ముందు కనిపించిన దేవతా విగ్రహాలు, వాటి అలంకరణ చూడగానే ఆహ్లాదంగా అనిపించింది. నటరాజ విగ్రహం, ఆ పక్కనే బుద్ధుడు, ఓ వైపు గణేశుని మూర్తులు.. అందంగా, పొందికగా ఉన్న ఆ అలంకరణ చూసి ఝాన్సీకి దైవభక్తి అధికమే అనుకున్నాం. ఇదే విషయాన్ని ఆమెను అడిగితే.. ఆధ్యాత్మిక కోణాన్ని ఊహించినదానికి భిన్నంగా ఆవిష్కరించారు. దేవుడిని బాగా కొలుస్తారనుకుంటాను. దైవశక్తి మీద అంతటి నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? మనకు అర్థం కాని శక్తి ఏదో మన చుట్టూ ఉంది. ఇది నాస్తికులైనా సరే ఒప్పుకోవాల్సిందే! ఇక భక్తి అంటారా.. ఇదంతా మన పెద్దల ఆచారాల నుంచి వస్తుంది. మా అమ్మమ్మ ఉదయాన్నే సూర్యనమస్కారం చేసుకోనిదే ఏ పనీ మొదలుపెట్టేది కాదు. మా నాన్న (రాజారావు)కు సాయిబాబా అంటే అచంచలమైన విశ్వాసం. ఇక అమ్మ (శారద) ధ్యానమార్గం నాకు దైవాన్ని ఇంకా దగ్గర చేసింది. ఆమె సాయిధామం, విపాసన, ప్రజ్ఞారణ్య స్వామి.. ధ్యాన మార్గాలను అనుసరిస్తుంది. మానసిక సంస్కారానికి ఇవన్నీ ఉపయోగపడ్డాయి. వీరందరి ప్రభావం నా జీవితంపై ఉంది. ఇవే దైవానికి చేరువ చేశాయి. మానసిక సంస్కారానికి ధ్యానం ఉపయోగపడుతుందని, దైవాన్ని పరిచయం చేసిందని అన్నారు అదెలా? దోసకాయ పండినప్పుడు తొడిమ నుంచి ఎలా వేరయిపోతుందో అలా మనం ఉండాలని పెద్దవాళ్లు చెబుతుంటారు. అంటే, జీవితాను భవాలను గ్రహించాలి. చివరకు అంతే సులువుగా ఆ బంధాలను నుంచి దూరమవ్వాలి. అటాచ్మెంట్, డిటాచ్మెంట్ విధానం ధ్యానం తెలియజేస్తుంది. నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే అంతే డిటాచ్డ్గా ఉండటం నేర్చుకున్నాను. ఇందుకు అమ్మ ఆధ్యాత్మిక పరంగా నాకు పెద్ద గైడ్. ఏదైనా స్పిరిచ్యువల్ బుక్స్ కనిపిస్తే చాలు అమ్మ చదవకుండా వదిలిపెట్టదు. వాటిలో మంచి వాక్యాలుంటే అండర్లైన్ చేసి, మరీ నాకు వినిపిస్తుంది. చిన్నప్పడు కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలకూ పంపించింది. ఈ విధానం ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉండేలా చేసింది. ఆ ఆనందం దైవం అని నమ్ముతాను. డిటాచ్మెంట్, అటాచ్మెంట్ అనే భావన బలమవ్వడానికి మీ అమ్మగారి ధ్యానమార్గంతో పాటు యోగుల పరిచయాలు ఏమైనా సాయపడ్డాయా? సత్యప్రదానంద, స్వామి ప్రజ్ఙారణ్య, యోగి తపోవన వంటి వారి ద్వారా కొంత తెలిసింది. అలాగే ఈషా మెడిటేషన్ ద్వారా కూడా ఆధ్యాత్మిక కోణంలో మార్పులు వచ్చాయి. మెహిదీపట్నం లక్ష్మీనగర్‌లో ఒక నిరాహారి యోగిని ఉంటారు. ఆమె పండు తప్ప మరే ఆహారమూ తీసుకోరు. మా పాప మూడునెలల వయసులో వారి ఆశీస్సులు ఇప్పిద్దామని వెళ్లాం. అక్కడకు వెళ్లి ఆ గదిలో కూర్చున్నాం. ఆ గదిలో పెద్ద పెద్ద గురువుల ఫొటోలు ఉన్నాయి. ఆమె ఆశీర్వచనం పూర్తయ్యాక ఆ ఫొటోల మీద నుంచి పూలు రాలి పాప మీదుగా పడ్డాయి. మేం కోరుకున్నది అమ్మ ఇప్పించిందని అర్థమయ్యింది. ధ్యానం నిరాడంబరాన్ని పరిచయం చేసింది. ఇలాంటప్పుడు పండుగల సందడి, పూజలకు అయ్యే ఖర్చు వీటి గురించి ఏమనుకుంటారు? పండుగలు, ఆచారాలు వేటికీ దూరంగా ఉండను. మన పూర్వీకులు పండుగలు పెట్టడంలో అర్థం.. ఇంటిని శుభ్రం చేసుకోవాలి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలని అని. ఇంటితో పాటు మన లోపల బూజులు కూడా దులుపుకోవాలని నేను అనుకుంటాను. అందుకు ధ్యానం సాయపడుతుంది. అలాగే, నాలుగు రకాల పిండివంటలు చేసుకొని, ఇంట్లో నలుగురం కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటాం. మొన్నటి దీపావళి పండుగే తీసుకుంటే టపాసులు కాల్చడం అనేది కొన్నాళ్ల క్రితమే మానేశాం సౌండ్ పొల్యూషన్ అని. దీపాలతో అలంకరణ మాత్రం చాలా ఇష్టపడతాను. ఏదైనా మూఢంగా పాటించకూడదు. ప్రకృతికి హాని కలిగించకుండా పండుగలు జరుపుకోవాలి. శివాలయాల్లో అభిషేకాల పేరుతో అన్ని పాలు వృథా చేయాలా పేదవాళ్లకు దానం ఇవ్వచ్చు కదా అని కొంతమంది అంటుంటారు. కానీ అది వృథా కాదు. మన పెద్దవాళ్లు ఎంతో ఆలోచించి ఆ ఆచారం పెట్టి ఉంటారు. కానీ, ప్రతి ఒక్కరూ లీటర్ల కొద్ది పాలు తీసుకెళ్లి పోయనక్కర్లేదు. స్పూన్ పాలతో కూడా స్వామికి అభిషేకం చేయవచ్చు. మనలో దైవం పట్ల ఆర్తి ఉండటమే ముఖ్యం. వినాయక నిమజ్జన సమయంలో ‘బకెట్ గణేశ్’ పేరుతో ఒక క్యాంపెయిన్ చేశాను. మట్టితో చేసినవైనా ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన విగ్రహాలతో చెరువులు నింపేయడం ఎందుకు? ఇంట్లోనే బకెట్ నీటిలో నిమజ్జనం చేసుకోవచ్చు కదా అని వివరించాను. ఆచారాల పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టవద్దు. దైవానికి సంబంధించి జీవితాంతం మరిచిపోలేని ఘటన? ఐదేళ్ల క్రితం తిరుపతి వెళ్లాం. కింద పద్మావతి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో నేనూ మా పాప ధన్య నిల్చున్నాం. అంతసేపూ లైన్లో నిల్చొని అమ్మవారి ముందుకు దర్శనం ప్లేస్‌కి వచ్చేసరికి మా పాపను అక్కడ సెక్యూరిటీగార్డ్ ‘నడువు నడువు’ అని రెక్కపట్టుకొని లాగేసింది. దాంతో అమ్మవారి దర్శనానికి వచ్చాననే విషయం మర్చిపోయి పాపకోసం పరిగెత్తాను. ఆ సెక్యూరిటీ ఆవిడతో ‘ఏంటమ్మా.. చిన్న పిల్ల. అలా లాVó స్తే జబ్బనొప్పి పెట్టదా..’ అంటూ గొడవపడ్డాను. పాపను కలుసుకున్నాక అది ‘ఏం ఫర్వాలేదమ్మా!’ అని చెప్పాక గానీ అమ్మవారు గుర్తురాలేదు. అక్కడ కొద్ది క్షణాలు భక్తురాలిగా కాకుండా నాలో అమ్మ బయటకు వచ్చేసింది. కళ్లమ్మట నీళ్లొచ్చేశాయి. ‘అయ్యో, అమ్మ దర్శనం చేసుకోలేకపోయానే.. అమ్మా.. నేనేం తప్పు చేశాను. గంటసేపనగా నీ దర్శనం కోసం లైన్లో నిల్చున్నాను. తీరా నీ ముందుకు వచ్చేసరికి క్షణమైనా నిన్ను చూడకుండానే బయటకు వచ్చేశాను. నిన్ను చూసే భాగ్యం ఎందుకు కలిగించలేదమ్మా! నాలో అహం ఏదైనా ఉండి ఇలా జరిగిందా?’ అనుకుని బాధగా ద్వారం నుంచి బయటకు వెళ్లబోయాను. అప్పుడే..మరో ఎగ్జిట్ గేట్ నుంచి వస్తూ ఒక పెద్దావిడ నా భుజం మీద చేయి వేసి.. ‘ఏంటమ్మా, నా కోసం ఇంత దూరం వచ్చావు. పిలుస్తున్నా పలక్కుండా వెళ్లిపోతావేంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా!’ అంది. నుదుటన రూపాయికాసింత బొట్టు, ఎర్రచీర కట్టుకుని.. ఉంది ఆవిడ. నేను ఆమెనే ఆశ్చర్యంగా చూస్తూ కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయాను. ఆ తర్వాత చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదు. అమ్మవాళ్లకు ఈ విషయం చెబుదాం అని బయటకు వస్తుండగా ఒక పెద్దాయన తెల్లపంచె కట్టుకొని ఎదురొచ్చారు. ‘శతమానం భవతీ శతాయుః.. ’ అంటూ వేదాశీర్వాదం ఇస్తూ.. ‘నువ్వు చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచివి. అంతా మంచే జరుగుతుంది’ అంటూ పండు ఇచ్చి దీవించారు. ఆ తర్వాత అతనూ కనిపించలేదు. ఆర్తి లోపల ఉంటే చాలు దేవతలే దిగివస్తారు అని ఆ సమయంలో అనిపించింది. వాళ్లు సాధారణ మనుషులే అయి ఉండవచ్చు. కానీ, నాకు మాత్రం స్వామి, అమ్మవారు అంతటా ఉన్నారు అని ఆ ఘటన ద్వారా తెలిసింది. ఇప్పటికీ తలచుకుంటే అదో గొప్ప అనుభూతి. అంతటా ఉన్న దేవుడే మీ జీవితంలో ఒడిదొడుకులనూ ఇచ్చాడుగా! మరి కోపం లేకుండా ఇంతటి భక్తి ఏంటి? ఒక్కో సమయంలో ప్రస్టేషన్ ఉంటుంది. అది సహజమైన లక్షణం కూడా! కానీ, దాన్నుంచి బయటపడటం అనేది ముఖ్యం. ఈ జీవితంలో కష్టసుఖాలు మన పూర్వ జన్మ కర్మలు. వాటిని ఫేస్ చేయగలిగే ధైర్యాన్ని మాత్రం నువ్వే ఇవ్వు అనుకుంటాను. నా జీవితంలో చాలా ఎత్తు పల్లాలను చూశాను. అలాంటి సమయంలో ఎమోషనల్‌గా రియాక్ట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. పరిస్థితులే ధైర్యాన్ని పెంచుతుంటాయి. వీటిని దాటడానికి ఆ దైవం నుంచే శక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. భగవంతునితో ఒక బాండ్ ఉందని ఎప్పుడూ నమ్ముతాను. కొన్ని సందర్భాలలో ‘నువ్వే చేశావు’ అని భగవంతున్ని నిందాస్తుతి చేయవచ్చు. కానీ, ఆ బాండేజ్ మాత్రం తొలగిపోదు. అది ఎలా ఉంటుందంటే తల్లికీ–బిడ్డకూ ఉన్న అనుబంధంలా ఉంటుంది. పిల్లవాడు ఏదో కావాలని అమ్మతో పేచీకి దిగుతాడు. అమ్మ ఇవ్వకపోతే వాడు ఆమెతో మాట్లాడడు. ఆ సమయంలో అమ్మ దగ్గరకు తీసుకున్నా ఆమె నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు, కానీ, ఎంతసేపు ఆ కోపం.. మళ్లీ అమ్మకోసం వస్తాడు. ఇదీ అంతే! మీ పాపకు దైవాన్ని ఏవిధంగా పరిచయం చేస్తుంటారు? పిల్లలు వినరు. అయినా విసుగులేకుండా మనమే వారికి ఇలాంటివి పరిచయం చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వారు జీవితాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఇవి ఉపయోగపడతాయి. పాప చిన్నప్పుడు నలుగురిలోకి వచ్చి మాట్లాడటానికే చాలా ఇబ్బంది పడేది. నలుగురు ఉన్నప్పుడు వారేం అనుకుంటారో అని కలవకపోయేది, మాట్లాడకపోయేది. దాన్నుంచి బయటపడటానికి చాలా ప్రయత్నాలు చేశాను. అదొక్క ఇన్సిడెంట్‌తో ముడిపడిలేదు. అది రోజువారీ ప్రయత్నం. మన ఆచార వ్యవహారాలన్నీ పరిచయం చేస్తుంటాను. పిల్లల్లో మన సంస్కృతి, ఆచార వ్యవహారాల పట్ల బీజం వేయడం వరకు మాత్రం మనం చేయాల్సిన పని. భవిష్యత్తులో వాళ్లు ఎలా ఉంటారో అది వారి ఇష్టం. మనం చెప్పినవి, పాటించిన ఆచారాలు ఎప్పుడో అప్పుడు వారి జీవితంలో తప్పక ఉపయోగపడతాయి. సేవే దైవం అనిచెబుతుంటారు. అన్నిటికన్నా మిన్న ఏ సేవ గొప్పదని మీరు భావిస్తారు? తోటి జీవుల పట్ల దయతో, ప్రేమగా ఉండటమే అన్నింటికన్నా మిన్న. ఆటిజం పిల్లలతో ఉన్నప్పుడు ఈ భావన కళ్లకు కట్టింది. శరీరం ఎదిగి, మెదడు వికాసం చెందని ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు దేవుడు ఎంత శక్తి ఇచ్చి ఉంటాడో కదా అనిపిస్తుంది. అలాంటి పిల్లల్లో లోపం పక్కన పెట్టేసి వాడికి ఇంకేదో ఎక్స్ట్రా శక్తిని ఇచ్చి ఉంటాడు దేవుడు అదేంటా అని వెతుకుతాను. దానిని వెలికి తీయడానికి ఆరాటపడతాను. ఈ ఇంట్లో అలంకరణ కోసం తగిలించిన ఈ షో పీసులు చూడండి. ఇవి వాళ్లు చేసినవి. ఆ పిల్లలతో ఉన్నంతసేపు దేవునితో ఉన్నట్టే ఉంటుంది. అందుకే అలాంటి సంస్థతో కలిసి పనిచేస్తున్నాను. అలాగే, మహిళలకు ఉపయోగపడే టీవీ ప్రోగ్రాములు చేస్తున్నాను. బాధితులతో ఇంటరాక్ట్ అవుతుంటాను. కష్టాల నుంచి వారు గట్టెక్కిన విధానాలు తెలుసుకుంటాను. కొందరికి ధైర్యం చెబుతుంటాను. దైవం దగ్గర చాలా ఎనర్జీ ఉంది. అది తోడుకున్నవారి తోడుకున్నంత. యాంకరింగ్‌లో అందం ప్రధాన భూమికగా ఉంటుంది. ఎలాంటి సౌందర్యం దైవత్వానికి చేరువచేస్తుందంటారు? నిస్సంకోచంగా అంతఃసౌందర్యమే! అందుకు మనల్ని మనం నిత్యం సంస్కరించుకోవాలి. లోపల ఎలాంటి మకిలీ లేకుండా జాగ్రత్తపడితే చాలు ఆ సౌందర్యం ముందు ఏ మేకప్ అయినా దిగదుడుపే. అలాగే, మన చుట్టూ రిలేషన్స్ బాగుండేలా చూసుకోవాలి. ఎదుటివారితో విభేదించవచ్చు కానీ, శత్రువులుగా చూడకూడదు. సాధ్యమైనంతవరకు ఉన్న జీవితంలోని తప్పులను సవరించుకుంటూ, సమాజం పట్ల బాధ్యతగా నడుచుకుంటే చాలు. ప్రత్యేకమైన పూజలు చేయనక్కర్లేదు. అలాగని అన్నింటినీ దూరం పెట్టేయకూడదు. ఇది కార్తీకమాసం. నేనూ ఉదయాన్నే ఓ దీపం వెలిగిస్తాను. ఏదైనా ఒకరోజు ఉపవాసం ఉంటాను. ఏదీ కష్టంగా భావించకూడదు. దైవశక్తిని కూడా మనం ఎంజాయ్ చేయాలి. అప్పుడు ఈ జగత్తు నుంచి కావల్సినంత ఆధ్యాత్మిక శక్తి మనకు అందుతుంది. ఇక్కడ చూస్తే దేవతా విగ్రహాలు చాలానే అమర్చారు. ధ్యానం ద్వారా అంతర్ముఖులు అవడం గురించి తెలిసిన మీరు ఈ విగ్రహాలను అమర్చడం ఎందుకు? విగ్రహాలూ దైవానికి చేరువచేసే సాధనాలే. ధ్యానముద్రలో ఉండే బుద్ధుడి రూపం, ప్రతి పూజలో అగ్రతాంబూలమిచ్చే గణనాథుడు ముచ్చటగా అనిపిస్తారు. ఈ నటరాజ విగ్రహాన్ని చిత్తూరు వాకర్ అసోసియేషన్ వాళ్లు కానుకగా ఇచ్చారు. మొన్న మా పై పోర్షన్వాళ్లు అయ్యప్పస్వామి పూజ చేస్తూ నన్నూ పిలిచారు. వెళ్లాలనుకున్నాను. కానీ, వందల సంఖ్యలో స్వాములు వస్తున్నారు. అక్కడ స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. వాళ్లందరిలోకి వెళ్లి ఆ వాతావరణాన్ని డిస్ట్రర్బ్ చేయడం ఇష్టం లేదు. ఆ సమయంలోనే ఈ శివుడికి రంగు వేయాలనిపించింది. ఇది పూర్తి ఇత్తడి విగ్రహం. సిల్వర్ కలర్‌తో పూర్తి పెయింట్ వేసేశాను. పైన వాళ్లు స్వామికి అభిషేకాలు చేస్తున్నారు. అంతసేపు నేను ఈ శివయ్యకు పెయింట్‌తో అభిషేకం చేశాను. ఈ భావన రాగానే కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. ధ్యానంలో దైవానికి రూపం ఉండదు. రూపంగా ఏ దైవాన్ని కొలుస్తారు? శివయ్య అంటే చాలా ఇష్టం. పదేళ్ల వయసు అనుకుంటా – గుళ్లో అభిషేక సమయంలో తెలియకుండానే కళ్లమ్మట నీళ్లు వచ్చేశాయి. కారణమేమీ లేదు. అమ్మకు చెబితే.. గత జన్మ సంస్కారాలు ఈ జన్మకూ వస్తాయమ్మా అంది. శివ క్షేత్రాలలో శ్రీకాళహస్తికి వెళ్లడం కూడా అనుకోకుండా జరిగింది. ఇంట్లో నిత్యం పూజలు చేసినా రాని శక్తి గుడికి వెళితే వస్తుంది. గుడి నిర్మాణానికి ఎందరి చేతులు తోడయ్యాయో వారి ఎనర్జీ అంతా అక్కడే ఉంటుంది. అందుకేనేమో ఎంత మంది వెళ్లినా అందరికీ శక్తి లభిస్తుంది. ఎస్విబీసీ ఛానెల్లో ‘యాత్రా’ ప్రోగ్రామ్ పాతిక ఎపిసోడ్స్ చేశాను. షూటింగ్ ఉన్నన్నాళ్లూ ఒక తీర్థయాత్రకు వెళుతున్నాను అనిపించేది. ధర్మపురి నరసింహస్వామి క్షేత్రానికి వెళ్లినప్పుడు.. లోపల స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. నేను కళ్లు మూసుకుని కూర్చున్నాను. నాకు తెలియకుండానే ధ్యానంలో అలా గంట సేపు ఉండిపోయాను. అభిషేకం పూర్తయ్యాక కళ్లు తెరిచాను. అప్పటి వరకు నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నాకో అద్భుతం. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
తన ప్రేమను కాదనడంతో..
ఝాన్సి: ఉత్తర ప్రదేశ్‌లో మహిళలపై వేధింపుల పర్వం కొనసాగుతోంది. తన ప్రేమను నిరాకరించిందని ఓ యువతిని తుపాకీతో కాల్చి చంపాడో ప్రబుద్ధుడు. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన ఝాన్సిలోని మేవాటిపుర కాలనీలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పంచవటి కాలనీకి చెందిన రోహిత్(24) మేవాటిపురకు చెందిన (21) యువతిని గత కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి యువతి ఇంటి సమీపంలో ఆమెను అడ్డుకున్న యువకుడు తనను ప్రేమించాల్సిందిగా బలవంత పెట్టాడు. దీనికి యువతి నిరాకరించడంతో.. కోపోద్రిక్తుడై తన వెంట తెచ్చుకున్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా.. అనంతరం తనని తాను కాల్చుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
పుట్టెడు దుఖంతో పది పరీక్షకు హాజరు
బుక్కరాయసముద్రం : తండ్రి గుండెపోటుతో చనిపోయినా ఆ దుఃఖాన్ని దిగమింగుకొని ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. వివరాల్లోకెళితే... నార్పల మండలం జంగంరెడ్డిపేటకు చెందిన ప్రభాకర్‌రెడ్డి (40) బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. అతని కుమార్తె జాన్సీ పదో తరగతి అన్నే ఫెర్రర్ పాఠశాలలో టెన్త్ పరీక్షలు రాస్తోంది. తండ్రి మరణించినా గురువారం ఉదయం జాన్సీ పరక్షకు హాజరైంది. -
ప్ప్రశ్నించడం ఆపొద్దు
1950, 1960 సంవత్సరాల మధ్య ఎంతోమంది స్త్రీవాదుల ఉద్యమ ఫలితమే ఈ రోజున స్త్రీలందరూ బయటకొచ్చి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మా అమ్మమ్మ 4వ తరగతి వరకు చదివింది. మా అమ్మ డిగ్రీ వరకు, నేను పీ.జీ వరకు చదువుకున్నాం. ఆ రోజున స్త్రీల హక్కుల కోసం వాళ్లు చేసిన ఉద్యమాల ఫలితమే ఈ మార్పు. ఎంతోమంది రచయితలు, కళాకారులు కదం తొక్కి ఉద్యమం చేస్తే ఈ రోజున స్త్రీవాదం బలపడింది. ఆ ఉద్యమకారులందర్నీ నేను మనస్ఫూర్తిగా స్మరించుకుంటున్నాను. స్త్రీలందరూ ఉద్యమాలను అవహేళన చేయొద్దు. ప్రశ్నించటం ఆపకండి. -
ఖమ్మం జేడీఏగా ఝాన్సీలక్ష్మీకుమారి
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం సంయుక్త వ్యవసాయ సంచాలకురాలి(జేడీఏ)గా అత్తోటి ఝాన్సీలక్ష్మీకుమారి రానున్నారు. ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో వ్యవసాయ ఉప సంచాలకురాలిగా పనిచేస్తున్నారు. 1991లో వ్యవసాయాధికారిగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మొదటి పోస్టింగ్ అందుకున్నారు. 2004లో వ్యవసాయ సహాయ సంచాలకురాలిగా ఉద్యోగోన్నతిపై హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పెస్టిసైడ్ టెస్టింగ్ ల్యాబ్‌లో నియమితులయ్యారు. వ్యవసాయ ఉప సంచాలకురాలిగా 2010లో ఉద్యోగోన్నతిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో చేరారు. మరోసారి ఉద్యోగోన్నతిపై జేడీఏగా ఖమ్మం రానున్నారు. ఏడు నెలల్లో నాలుగో జేడీఏ ఏడు నెలల కాలంలో ఖమ్మం జిల్లాలో నలుగురు జేడీఏలు పనిచేశారు. పిబి.భాస్కర్‌రావు ఉద్యోగ విరమణ తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆత్మ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వెల్లంకి ఆశాకుమారిని ఖమ్మం జేడీఏగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. భాస్కర్‌రావు పనిచేసని కాలంలో జిల్లా వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిధుల దుర్వినియోగంపై విచారణ నేపథ్యంలో ఆశాకుమారిని ఆత్మ డీపీడీగా వెనక్కు పంపించింది. ఆమె స్థానంలో, రైతు శిక్షణ కేంద్రంలో సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా పనిచేస్తున్న పి.మణిమాలను ఇ¯Œæచార్జ్ జేడీఏ నియమించింది. సహాయ వ్యవసాయ సంచాలకురాలిగా ఉన్న ఎం.విజయనిర్మల.. ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. తాజాగా, ఉద్యోగోన్నతిపై ఇక్కడికి జేడీఏగా ఝాన్సీలక్షీ్మకుమారి రానున్నారు.