Senior Actress Jhansi Emotional Story In An Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Jhansi : 'కొడుకులు వదిలేసి వెళ్లిపోయారు.. ఇప్పుడు అద్దె ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నా'

Published Wed, Dec 14 2022 3:15 PM | Last Updated on Wed, Dec 14 2022 4:15 PM

Senior Actress Jhansi Emotional Story In An Interview - Sakshi

సీనియర్‌ నటి ఝాన్సీ.. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఒకప్పుడు చెన్నైలో లగ్జరీ ఇంట్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆస్తులన్నీ అమ్మేసి హైదరాబాద్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. 78 ఏళ్ల వయసులో కష్టాలు పడుతూ ప్రతినెలా గడవడం కూడా ఇబ్బందిగా మారిందట. చాలా కాలం తర్వాత స్క్రీన్‌ ముందు కనిపించిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితి గురించి వివరించింది.

''ఇంతకు ముందు చెన్నైలో ఉండేవాళ్లం. కానీ ఇండస్ట్రీ హైదరాబాదుకు రావడంతో మేం కూడా వచ్చేశాం. అయితే ఇక్కడికి వచ్చాక నాకు అంతగా అవకాశాలు రాలేదు. అప్పుడే సొంత బ్యానర్‌ను ఏ‍ర్పాటు చేసి సినిమాలు నిర్మించాం. సుమన్‌తో  'ఖైదీ ఇన్ స్పెక్టర్' అనే సినిమాను తీశాం. ఆ మూవీ బాగానే ఆడినా డబ్బులు మా వరకు రాలేదు.  

ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నిర్మించి బాగా నష్టపోయాం. దీంతో చెన్నై, హైదరాబాద్‌లోని ఇళ్లన్నీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాం. ఇక నా ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేశాను. అయితే పెళ్లి అయ్యాక వాళ్ల భార్యలతో కలిసి నన్ను వదిలేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంట్లో నేను ఒక్కదాన్నే ఒంటరిగా జీవిస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement