
కండక్టర్ ఝాన్సీ అంటే గుర్తుపడతారో లేదో కానీ పల్సర్ బైక్ ఝాన్సీ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తను ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడుతున్నప్పటికీ బుల్లితెరపై ప్రసారమైన పల్సర్ బైక్ పాటతో ఒక్కసారిగా పాపులర్ అయింది. గాజువాక డిపోలో బస్ కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఎన్నో పాటలకు స్టేజ్ పర్ఫామెన్స్‌లు ఇచ్చింది. కానీ పల్సర్ బైక్ పాట మాత్రం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ పాటతో స్టేజీ దద్దరిల్లేలా డ్యాన్స్ చేసిన ఆమె తర్వాత పలు టీవీ షోలలో డ్యాన్సులు చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది.
తాజాగా ఓ షోకు హాజరైన ఝాన్సీ తన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనలైంది. 'జనాలు నేను ఓవర్‌నైట్ స్టార్ అయ్యానంటారు. కానీ దాని వెనక పద్దెనిమిదేళ్ల కష్టం ఉంది. టైలర్ షాపుకు వెళ్తే అతడు తప్పుగా ప్రవర్తిస్తూ కొలతలు తీసుకున్నాడు. ఈ విషయం మా నాన్నకు చెప్పి కొట్టిద్దామనుకున్నాను. కానీ ఆయన నేను నీ తండ్రిని కాదు అని చెప్పమన్నాడు' అంటూ కన్నీటిపర్యంతమైంది. కాగా ఝాన్సీ ప్రస్తుతం సినిమా అవకాశాలు కూడా అందుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment