పవర్‌ఫుల్‌ ఝాన్సీ | Jhansi IPS movie starring Lakshmi Roy in lead role | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ ఝాన్సీ

Published Fri, Oct 11 2024 12:20 AM | Last Updated on Fri, Oct 11 2024 12:20 AM

Jhansi IPS movie starring Lakshmi Roy in lead role

లక్ష్మీ రాయ్‌ లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘ఝాన్సీ ఐపీఎస్‌’. గురుప్రసాద్‌ దర్శకత్వం వహించారు. తమిళ, కన్నడ భాషల్లో ఆల్రెడీ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ దక్కిందని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రతాని రామకృష్ణ గౌడ్‌ సొంతం చేసుకున్నారు. ‘‘ప్రేమ, యాక్షన్‌ అంశాలతో రూపొందిన సినిమా ఇది.

మూడు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో లక్ష్మీ రాయ్‌ అద్భుతంగా నటించారు. డ్రగ్స్‌ సప్లై చేస్తూ కాలేజీ అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఓ ముఠా ఆటను అడ్డుకునే పవర్‌ఫుల్‌ ఝాన్సీ పాత్రలో లక్ష్మీ రాయ్‌ నటించారు. ఫైట్‌ మాస్టర్‌ థ్రిల్లర్‌ మంజు కంపోజ్‌ చేసిన 8 ఫైట్స్‌ లక్మీ రాయ్‌ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, సినిమాను నవంబరులో రిలీజ్‌ చేస్తాం’’ అని ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement