నెలాఖర్లో ఉక్కు సత్యాగ్రహం | Ukku Satyagraham Is Releasing in 200 plus Screens on November 29 | Sakshi
Sakshi News home page

నెలాఖర్లో ఉక్కు సత్యాగ్రహం

Nov 15 2024 3:54 AM | Updated on Nov 15 2024 3:54 AM

Ukku Satyagraham Is Releasing in 200 plus Screens on November 29

సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. గద్దర్, ‘పల్సర్‌ బైక్‌’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యా రెడ్డి మాట్లాడుతూ– ‘‘మద్రాస్‌ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? విశాఖ స్టీల్‌ ప్లాట్‌ను మద్రాస్‌లో పెట్టాలని ఇందిరా గాంధీగారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశాలతో గద్దర్‌గారు ఈ సినిమా కథను రాశారు. 

అలాగే నాలుగు పాటలు రాసి, కొన్ని కీలక సన్నివేశాల్లోనూ నటించారు. ఆయన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంగా సెన్సార్‌ ఇబ్బందులు రావడం, గద్దర్‌గారి మరణం వంటి కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్‌ పూర్తయింది. 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న సినిమాను రిలీజ్‌ చేయనున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీ కోటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement